గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 June 2014

యమునా నది పుష్కరాలు

దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం!
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిః!!
బృహస్పతి కర్కాటక రాశిలో 19-06-2014 ప్రవేశం. శ్రీ జయనామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ సప్తమ గురువాతం ఉదయం గం.06-07ని-44సె!!లకు యమునానది- "కార్కటే యమునాపోక్తి" - పుష్కరాలు ప్రారంభం అవుతాయి.
యమునానది మహాగమ్గే సర్వపాప విమోచని!
భక్త్యాదత్తం గృహాణార్ఘ్యం యమునాదేవి నమోస్తుతే!!
పన్నెండు రాశులు పన్నెండు జీవనదులకు 12రోజులు పుష్కరాలు వస్తున్నాయి.
మేషే గంగా వృషేరేవ (నర్మద) మిథునే సరస్వతీ!
కార్కటే యమునాప్రోక్తా సింహే గోదావరి స్మృతా!!
కన్యాయాం కృష్ణవేణీచ కావేరీ ఘటికీస్మృతా!
వృశ్చికే తామ్రపర్ణీచ (భీమ) చాసే పుష్కరవామినీ (బ్రహ్మపుత్ర)!!
మకరే తుంగభద్రాచ కుంభే సింధూనది స్మృతా!
మీనే ప్రణితాచ నదీ గురోః సంక్రమణే స్మృతాం!!
పుష్కరోభ్యామని నామి ప్రదీశోత బుధై స్మృతాః!!
ప్రస్తుతం యమునా పుష్కరాలు.
భాగవత, రామాయణ భారతాలలో యమునానది పుష్కరాల ప్రాశస్త్యం వుంది. శ్రీకృష్ణుని స్పర్శ వల్ల యమునానది పునీతమైనది.
యమునోత్రి కళింద పర్వత శిఖరాలు, హిమాలయాల్లో చార్ ధామ్, హరిద్వార్, ప్రయాగ, ఢిల్లీ, ఆగ్రా, మధుర, బృందావనం, హర్యానా, ఉత్తరరాష్ట్రాల గుండా యమున ప్రవహించి అలహాబాద్ దగ్గర ప్రయాగలో గంగ-యమున-సరస్వతి నదులు సంగమించే పుణ్యనదీ జలాల మధ్య భక్తులు స్నానాలు చేసి ఎన్నోతరాల పితృదేవతలకు, స్నేహితులకు పిండప్రదానాలు చేసుకోవడం విశేషం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML