గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 June 2014

తల్లిదండ్రులు అపరాధం చేస్తే ఏం చేయాలి?

తల్లిదండ్రులు అపరాధం చేస్తే ఏం చేయాలి?

ఈమధ్య చాలామంది తరచుగా ఈ విషయం గురించి ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ త్యజించరాదు. తల్లిదండ్రులంటే సామాన్యులనుకొన్నావా? వారు ప్రసన్నులు కాకపోతే జీవితంలో ఏదీ ఫలవంతం కాదు. నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేశారు. ఇప్పుడు నీకూ పిల్లలున్నారు. ఈ స్థితిలో భార్యను తోడ్కొని బయటకు వచ్చేశావు! తల్లిదండ్రులను మోసం చేసి, భార్యాపిల్లలను పిలుచుకొని వచ్చి, ఏదో గొప్ప మహాత్ముడిలా భావిస్తున్నావు.
మనకు ఎన్నో ఋణాలున్నాయి. - దేవ, ఋషి, మాతృ, పితృ, దారాఋణం. తల్లిదండ్రుల ఋణం తీర్చకుంటే ఏ పనీ నెరవేరదు. ’యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా’ అని చండీ స్తోత్రంలో వుంది. కాబట్టి తల్లితో జగన్మాతను దర్శించాలి.
స్త్రీలందరూ దేవీ స్వరూపిణులే. కొందరు శ్లోకాలను వల్లిస్తారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ ప్రవర్తన తద్విరుద్ధం. రామ ప్రసన్నుడు ఆ హఠయోగికి నల్లమందు, పాలు ఏర్పాటు చేయడానికి చెడ తిరుగుతున్నాడు. సాధు సేవ చేయాలని మనుధర్మశాస్త్రం చెబుతోంది అంటాడు. ఇటు చూస్తే వృద్ధురాలైన అతడి తల్లికి తినడానికి తిండిలేదు. తల్లి సేవను విస్మరించి, సాధుసేవ చేస్తున్న అతణ్ణి చూసినప్పుడు ఎంతోకోపం వచ్చేది రామకృష్ణుల వారికి.
కానీ మరో విషయం గమనించాలి. "భగవత్ ప్రేమోన్మాదం కలిగితే, ఇక తల్లి ఎవరు? తండ్రి ఎవరు? భార్య ఎవరు? అది ఎంతటి ప్రేమ అంటే ఆ ప్రేమలో అతడు పిచ్చివాడే అయిపోతాడు అతడికి ఏ కర్తవ్యమూ వుండదు. అతడు ఋణాలన్నిటి నుండి విముక్తుడవుతాడు. ప్రేమోన్మాదం ఎలాంటిదో తెలుసా? ఆ స్థితి ఏర్పడితే ప్రపంచాన్నే మరచిపోతాడు. అతి ప్రియమైన ఈ దేహాన్ని మరచిపోతాడు. చైతన్యులకు ఈ స్థితి కలిగింది. సముద్రమనే ఎరుక లేకుండా దానిలో దూకేశాడు, ఇసుకలో పదే పదే పొర్లాడాడు. ఆకలి లేదు, దప్పికలేదు, నిద్రలేదు, శరీర స్పృహే లేదు".

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML