గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 June 2014

భగవద్గీత అష్టమాధ్యాయ ఫలం

భగవద్గీత అష్టమాధ్యాయ ఫలం
దక్షిణదేశంలో పూర్వం అమర్దకం అనే ప్రసిద్ధ నగరం ఒకటి ఉండేది. ఆ నగరంలో భావశర్మ అనే ఒక విప్రుడు నివసించేవాడు. అతడు చేయని అనుచిత కార్యాలంటూ లేవ్. మద్య మాంసాలకు అలవాటు పడ్, వేశ్యాలోలుడై జీవితాన్ని భ్రష్టుపట్టించుకున్నాడు. అతనికి తాటికల్లు పానం చాలా ప్రీతికరం. అతడు కొంత కాలానికి అజీర్ణవ్యాధి పీడితుడై ప్రాణాలు విడిచాడు. తాటికల్లు మీది ప్రీతి వల్ల తాటిచెట్టుగా పుట్టాడు.
ఇది ఇలా ఉండగా మరొక చోట కుశీవలుడు అనే ఒక విద్వాంసుడు దానాలను అత్యధికంగా గ్రహిస్తూ, తాను మాత్రం ఒక్క దానం కానీ, ధర్మం కానీ చేయకుండా జీవితం గడిపి కాలవశాన మరణించి, ఓ బ్రహ్మరాక్షసుడుగా పుట్టాడు. అతని భార్య కుమతి కూడా మరణించి, రాక్షసిగా పుట్టింది. వారిరువురూ భావశర్మ తాటిచెట్టుగా మారిన చెట్టు క్రిందే నివసిస్తున్నారు.
ఒకనాడు భార్య అయిన రాక్షసి, భర్తతో "నాథా! మన కర్మవశాత్తూ ప్రాప్తమైన ఈ రాక్షస జన్మ ఎలా పోతుంది?" అని ప్రశ్నించింది. అందుకా భర్త "బ్రహ్మవిద్యోపదేశం వల్ల, ఆధ్యాత్మిక కర్మ రహస్యం తెలియడం వల్ల మాత్రమే ఈ గతి తొలగిపోగలదు" అని చెప్పాడు. అప్పుడామె "కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ.." అని తనకు తెలియకనే భగవద్గీతలోని అష్టమాధ్యాయ ప్రథమ శ్లోక పూర్వార్థాన్ని ’బ్రహ్మమనగా ఏమిటి? అధ్యాత్మమనగా ఏమిటి? కర్మ తత్త్వరహస్యమేమిటి’? అని స్మరించి, ఉచ్చరించింది.
ఆ గీతావాక్య శ్రవ మాత్రం చేతనే తాటి చెట్టుగా ఉన్న భావశర్మ, బ్రహ్మరాక్షస రూపంలో వున్న కుశీవలుడు, స్మరణ మాత్రం చేత కుశీవలుని భార్య కుమతి విముక్తులై వారి వారి నిజ స్వరూపాలు పొందారు. భార్యాభర్తలిరువురూ దివ్యలోకాలకు వెళ్ళగా భావశర్మ అష్టమాధ్యాయ శ్లోకాన్ని జాగ్రత్తగా వ్రాసి పెట్టుకొని కాశీ పట్టణానికి వెళ్ళిఆ శ్లోకాన్ని జపిస్తూ, అర్థాన్ని పదే పదే మననం చేస్తూ, నిరంతరం శ్రీహరినే ధ్యానం చేయసాగాడు. అందుకు విష్ణుమూర్తి సంప్రీతుడై అతడికి మోక్షం ప్రసాదించాడు.
జపన్ గీతాష్టమాధ్యాయశ్లోకార్థం నియతేంద్రియః!
సంతుష్టవా నహం దేవీ తదీయ తపసాభృశమ్!!
భగవద్గీత అష్టమాధ్యాయ పారాయణ వల్ల బ్రహ్మరాక్షస, వృక్ష, మొదలైన జన్మల దోషాలు తొలగి జీవన్ముక్తి లభిస్తుంది. దుర్గతులు నశిస్తాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML