గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 25 June 2014

జెండాపై కపిరాజు

జెండాపై కపిరాజు
జెండాపై కపిరాజు ముందు సిత వాజి శ్రేణియున్ గూర్చి, నే
దండంబుంగొని తోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు, మూకన్ చెండు చున్నప్పుడొ-
క్కండున్ నీ మొర లాలకింపడు, కురుక్ష్మానాథ! సంధింపగన్.
శ్రీకృష్ణ రాయబార సన్నివేశంలో తన ఆఖరిమాటగా జరుగబోయే యుద్ధాన్ని చిన్న-చిన్న మాటలతోనే ఎంతో శక్తివంతంగా దూతగా వచ్చిన కృష్ణుడు ధ్రుతరాష్ట్రున్ని సంధి కావాలా లేక సమరం కావాలా అని అడుగుతున్నాడు.
అర్జునుడు ద్రుఢమైన రథమెక్కి రంగంలోకి దిగుతాడు. దానికో ధ్వజం. ఆ జండామీద హనుమంతుడు. రథానికి ముందు తెల్లటి గుర్రాల సమూహం (సిత-వజీ-శ్రేణి). చేతిలో చెర్నకోలతో నేనే స్వయంగా తోలే రథం (తోలు - స్యందనము) అది. దానిమీద అరివీర భయంకరుడైన అర్జునుడు. గాండీవం చేతిలో సిద్ధంగా పట్టుకొని, వింటి నారి సారిస్తూ, కురు సైనికుల మూకను చీల్చి చెండాడే దృశ్యం ఒక్కసారి ఊహించుకో. ఆ సమయంలో సంధి చేసుకొందామని (సంధింపగన్) నువ్వు ఎంత మొరపెట్టిన, ఎవ్వరూ వినిపించుకోరు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML