గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 June 2014

జయానికి రహస్యాలు ఏమి ఉండవు. నిరంతర కృషే గెలుపు. గెలుపు శాశ్వతం కాదు. ఓటమితో జీవితం ఆగిపోదు. గెలుపుకోసం గురువులు అవసరంలేదు. నీ ఓటమే నీకు గురువు. ఏది చేసి నువ్వు ఓడిపోయవో అది చెయ్యకు అనే చెప్తుంది.

జయానికి రహస్యాలు ఏమి ఉండవు. నిరంతర కృషే గెలుపు. గెలుపు శాశ్వతం కాదు. ఓటమితో జీవితం ఆగిపోదు. గెలుపుకోసం గురువులు అవసరంలేదు. నీ ఓటమే నీకు గురువు. ఏది చేసి నువ్వు ఓడిపోయవో అది చెయ్యకు అనే చెప్తుంది. కష్టపడకుండా వచ్చిన సుఖం ఎప్పటికైనా వెళ్ళిపోతుంది. మళ్ళి రోడ్డుమీదకి వచ్చి వెతుక్కోవలసిందే.
శ్రీకృష్ణుడు జీవితం గురించి చూద్దాం.
కారాగారంలో జన్మించాడు. తల్లి ఉండి కూడా తల్లి కాని తల్లి వద్ద పెరిగాడు. సాక్షాత్తు విష్ణువే దిగి వచ్చి శ్రీ కృష్ణుడిగా జన్మించినా, మానవుడిగా జన్మించడం వలన కష్టాలు తప్పించుకోలేకపోయాడు. జన్మించాడంతోనే కంసుడికి భయపడి యశోద వద్దకు చేరాడు. అక్కడ నెలల బాలుడిగా ఉన్నప్పుడే పూతన అనే రాక్షసిని సహరించాడు. నిరంతరం రాక్షస సంహరంతోనే బాల్యం గడిచిపోయింది. 9ఏళ్ళ వయస్సులో కంసుడితో యుద్ధం చేసి సంహరించాడు. కాని యాదవులకి రాజ్యార్హత లేదుకనుక కంసుడి తండ్రికే ఆ రాజ్యాన్ని కట్టబెట్టాడు. ఇక ఇక్కడి నుండి జరాసంధుడితో 17 సార్లు యుద్ధం చేసాడు. చివరికి భీమార్జునుల సాయంతో జరాసంధుడిని అంతం చేసారు. ధర్మరాజు చేసే రాజసూయ యాగంలో వేలమంది ధరణీ పతుల మధ్య నిండుకోలువులో శిశుపాలుడి చేత అవమానం పొందాడు. తరువాత ఒక మ్లేచ్చ రాజుకి భయపడి మధుర నుండి ప్రజలను రక్షించడం కోసం సముద్రం మధ్యలో ద్వారకానగరం నిర్మించి నివాసం ఏర్పరచుకున్నాడు. తరువాత సాల్వుడు మయా విమానంలో వచ్చి ద్వారవతి ని ద్వంసం చేసాడు. ఇతడితో చాలా భయంకరమైన యుద్ధం చేసి సంహరించాల్సి వచ్చింది. ఇది అయ్యాక కురుక్షేత్రం సంగ్రామం. ఇది అయ్యాక యాదవ వినాశనం.  ఇంట్లో సుఖంలేదు. బయట తీరికలేదు. చివరికి కన్నకొడుకు కళ్ళముందే బోయచేతిలో ఘోరంగా చనిపోయాడు. ఇంకొక బోయ చేతిలో శ్రీకృష్ణుడు ఒంటరిగా అవతారం చాలించాడు. మధ్యమధ్యలో భక్తుల కోర్కెలు తీర్చడం. ఇంకా అనేకానేక కార్యక్రమాలు. 125ఏళ్ళ శ్రీకృష్ణుడి జీవితం మొదలు నుండి తుదివరకు జరిగిన ఘట్టాలలో ఇవి కొన్ని మాత్రమే. తరచి చుస్తే ఇంకా అనేక కనబడతాయి.
కనుక కష్టపడకుండా ఏది రాదు. శ్రీకృష్ణుడు అంతటివాడే గురువు దగ్గర భక్తి శ్రద్ధలతో విద్యలు నేర్చుకున్నాడు. స్నేహితులని గౌరవించాడు. తల్లిదండ్రుల సంగతి వేరే చెప్పే పనిలేదు. ఎంతో ఎదిగి అణుకువగా మెలిగాడు. దేవుడై ఉండి కూడా సామాన్యుడిలా పోరాడాడు.
అందుకే తల్లిదండ్రులు పిల్లల్లో శాస్త్రపరంగా పోరాట స్పూర్తిని పెంచండి. అనేక దేశాలలో మన భగవద్గీతని వాళ్ళ చదువులో భాగంగా చేర్చారు. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ లలో కూడా చేర్చారు. కనుక భగవద్గీత అంటే ఆద్యాత్మిక గ్రంధం అనుకోకుండా పిల్లల మానసిక వ్యక్తిత్వం పెంపొందించుకోవడానికి సహాయ పడండి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML