గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 25 June 2014

ఇవీ శ్రీకృష్ణుని గీతా వచనాలే

జ: ’న బుద్ధిం జనయే అజ్ఞానాం కర్మ సంగిణాం’ - అనే మాట చాలా లోతైనది. ఏదో చేసుకోవడం కర్మ కాదు. విధింపబడ్డ విహిత కర్మనే ఆచరించాలి. నిషేధకర్మను ఆచరించరాదు.
పై శ్లోకానికి వివరణ:
జ్ఞానియైన వానికి కావలసినదేదీ ఉండదు. అందుకతడు కర్మతో ’సంగం’ పెట్టుకోడు. ఫలాన్ని ఆశించడు. కానీ ఆ స్థితికి చేరనివాడు ఫలాసక్తితో కర్మను ఆచరించవచ్చు. అతడిని ’కర్మలు బంధనకరాలు. విడిచిపెట్టు వంటి మాటలు చెప్పి అయోమయపరచి, కర్మభ్రష్టుని చేయవద్దు" - అని దీని అర్థం
శాస్త్ర సిద్ధమైన కర్మనే ఫలాసక్తితో చేసేవారు కర్మ సంగులు. బ్రహ్మజ్ఞానం లేనివారు ’అజ్ఞులు’. లోకంలో వాడబడే "మూర్ఖులు" అనే అర్థంలో ఈ పదాన్ని భావించరాదు. వేదాంతులు ఆడే మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోక కర్మల్ని విడిచిపెట్టడం తగదు - అని దీని సారం.
అంతేకానీ నిషేధకర్మలనాచరించేవారు ’కర్మసంగులూ’, అజ్ఞులు’ కారు. భ్రష్ఠులౌతారు. శాస్త్రం తెలిసినవారు నిషేధకర్మలను చేసేవారిని నిరోధించాలి. లేకపోతే సమాజానికే ప్రమాదం.
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే"
ఏది చేయాలి, ఏది చేయకూడదు? - అనే సందర్భంలో శాస్త్రమే ప్రమాణం.
యత్ శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః!
న చ సిద్ధి మవాప్నోతి న సుఖం నపరాగతిమ్!!
శాస్త్రవిధిని అతిక్రమించి, ఇష్టానుసారం ప్రవర్తించేవానికి సిద్ధి కలుగదు. వానికి ఇహంలో సుఖం ఉండదు. పరంలో సద్గతి ఉండదు.
- ఇవీ శ్రీకృష్ణుని గీతా వచనాలే.
ఏదీ చేయకుండా ఉండేకన్నా ఏదో ఒకటి చేస్తున్నారు కదా - అని తృప్తిపడడం గొప్ప కాదు. ఏదీ తినకుండా ఉండేకన్నా ఏదో ఒకటి తినాలి అని ప్రమాదకరమైన ఆహారాన్ని తినకూడదు కదా! అలాగని ఏదీ తినకుండా ఉండరాదు కదా! ఏది యోగ్యమో దానిని తినాలి. దానిని ఆసక్తిగా తినేవారి వద్దకు వెళ్ళి - ’దానిపై ఆసక్తి వద్దనీ, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి అంతమోహం పనికిరాద’నీ బోధించి వారిని తిండి తిననివ్వకుండా చేయవద్దు అనేది గ్రహించాలి.
నిషేధాన్ని చేయకుండా నిషేధించాలి. లేకపోతే అది ఆచరించే వానికి క్షేమం కాదు. వేద, ధర్మశాస్త్రాలు చెప్పేవాటికి వ్యతిరేకంగా నడవరాదు.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML