గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 22 June 2014

శ్రీ వేంకటేశ్వరుడు శ్రీనివాసుడు. ఆయన పటం ఇంట్లో ఉంటే ఐశ్వర్యాలు చక్కగా వర్ధిల్లుతాయి.

శ్రీ వేంకటేశ్వరుడు శ్రీనివాసుడు. ఆయన పటం ఇంట్లో ఉంటే ఐశ్వర్యాలు చక్కగా వర్ధిల్లుతాయి. అంతే కానీ ఆయన పటం, విగ్రహం ఉంటే డబ్బుఖర్చయిపోతుందనీ, అప్పులపాలైపోతారనీ అనడం అజ్ఞానజనితమైన మాట. ఎవరో తోచింది చెప్పగానే, దాన్నే మోసుకుపోయేవాళ్ళు కొందరు తయారవుతున్నారు.
ఏ దేవతా విగ్రహమైనా మేలు కలిగించడమే వాటి స్వభావం. ఆ పటాలుండకూడదని చెప్పడానికి ఏ శాస్త్ర ప్రమాణమూ లేదు. ఇలాగే కొందరు - పార్థసారథి పటం ఉండకూడదనీ, వేణువూదే కృష్ణుడి పటం కానీ, బొమ్మ కానీ వుండరాదనీ, అంటుంటారు. ఇవన్నీ నోటికి వచ్చిన మాటలే తప్ప శాస్త్ర వాక్యాలు కావు . నిరభ్యంతరంగా శ్రీనివాసుని పటాన్ని ఉంచవచ్చు.
ఐతే ధర్మశాస్త్ర ప్రకారంగా లోహవిగ్రహాలు (వెండి, బంగారు, ఇత్తడి. పంచలోహాలు) శిలావిగ్రహాలు ఇంట్లో ఉంచి పూజించేటట్లయితే ఎక్కువ పరిమాణంలో ఉండరాదు. అరచేతి నిడివిని(వితస్తి) మించరాదు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, పేపర్ పల్ప్ వంటి వాటితో చేసిన విగ్రహాలు పెద్ద పరిమాణంలో ఉన్నా పరవాలేదు. అయితే వాటిని పూజా విగ్రహాలుగా కాక, అలంకారాకృతులుగా ఉంచి నమస్కరించుకోవచ్చు.
అదేవిధంగా - ధ్యానభంగిమలో ఉన్న శివుని పటాన్ని నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచవచ్చు. ధ్యానసాధనకు, జ్ఞానానికీ, శివత్వానికీ (మంగళానికి) హేతువు శివుని తపోమూర్తి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML