గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 June 2014

శంకరులు ఇచ్చిన ఒక్కొక్క స్తోత్రము, ఒక్కొక్క గ్రంథము, ఆయన ఇచ్చిన ఒక్కొక్క అనుగ్రహభాషణము ఒక్కొక్క స్థాయిలోని వారికొరకు ప్రత్యేకంగా నిర్దేశించారు.

శంకరులు ఇచ్చిన ఒక్కొక్క స్తోత్రము, ఒక్కొక్క గ్రంథము, ఆయన ఇచ్చిన ఒక్కొక్క అనుగ్రహభాషణము ఒక్కొక్క స్థాయిలోని వారికొరకు ప్రత్యేకంగా నిర్దేశించారు. మోహాన్ని పోగొట్టడానికి మోహముద్గరం అని "భజగోవిందం భజగోవిందం గోవింధం భజ మూఢమతే" అంటూ ఇచ్చారు. అర్థనారీశ్వర స్తోత్రము అని ప్రత్యేకంగా శంకర భగవత్పాదులు ఒక స్తోత్రాన్ని చేశారు. యథార్థమునకు ఈ స్తోత్రం ఎవరికొరకు అంటే ఆశ్రమములను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినప్పుడు గృహస్థాశ్రమమునందు ఉన్నవారికొరకు అర్థనారీశ్వర స్తోత్రాన్ని ఇచ్చారు. బ్రహ్మచారిగా ఉన్నవారికి ఈ స్తోత్రం అంత గొప్ప ప్రయోజనకారి అని చెప్పడం కష్టం. అలాగే వానప్రస్థుకి, సన్యాసికి ఆ వైభవాన్ని కీర్తించడానికి, మనసులో పెట్టుకోవడానికి పనికి వస్తుందేమో కానీ ఒక ప్రయోజనాన్ని ఒనగూర్చడంలో కేవలం గృహస్థాశ్రమంలో వున్న వాళ్ళకి మాత్రం కరదీపికగా గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి ఒక మణిగా శంకర భగవత్పాదులు బహూకరించినటువంటి అపూర్వమైన స్తోత్రం అర్థనారీశ్వర స్తోత్రం. అసలు ఈ స్వరూపాన్ని ఉపాసన చెయ్యాలి? ప్రధానంగా ఉపాసనలో ఎక్కడ కనపడుతుంది అంటే అట్లతద్ది అని చేస్తూంటారు ఆడపిల్లలు. అట్లతద్ది చేసినప్పుడు ఈ అర్థనారీశ్వర స్వరూపాన్ని ఉపాసన చేసి పూజ చేయాలి అని నియమం. వివాహమునకు పూర్వము అట్లతద్ది చేస్తారు కన్యకామణులు. దాని ప్రయోజనం మంచిభర్త రావడం. యథార్థం మాట్లాడాలంటే శ్రీకాళహస్తి వంటి పరమపావన క్షేత్రంలో, శ్రీశైల క్షేత్రంలో ఉన్న స్వరూపం అర్థనారీశ్వర స్వరూపమే. అందుకే నడిచేదేవుడని పేరుగాంచిన మహాపురుషులు కంచి మహాస్వామి శ్రీకాళహస్తీ క్షేత్ర దర్శనానికి వెళ్ళారు ఒకప్పుడు. వారన్నారు ఈ క్షేత్రం అప్రదక్షిణతో కూడుకున్న క్షేత్రం. అందుకే రాజగోపురంలో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణంగా వెళ్ళరు. అప్రదక్షిణంగా వెళుతున్నాం అంటే రాహుకేతు పూజలు ఫలించేటటువంటి క్షేత్రము ఈ క్షేత్రమే. ఇక్కడ స్థల వృక్షం మహాబిల్వం. ఇక్కడ అర్థనారీశ్వర స్వరూపము అధిష్ఠానమైయున్నది. ఆ స్వరూపం సువర్ణముఖీనదియందు ప్రకాశించింది. ఇప్పటికీ అక్కడ దేవాలయం వుంది. శ్రీశైల క్షేత్రమునందు కూడా జ్యోతిర్లింగం ఒకచోట, భ్రమరాంబాదేవి ఒకచోట ఉన్నప్పటికీ అర్థనారీశ్వర స్వరూపమే. అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో సుప్రభాత సేవ చేసి ప్రపత్తి చేసేటప్పుడు భ్రమరాంబాసహిత మల్లికార్జునుడిని అర్థనారీశ్వర స్వరూపంగానే స్తవం చేస్తారు.
శ్రీశైలాగ్రే కలితవసతిర్విశ్వరక్షాధురీణః II
ఏణం పాణౌ, శిరసి తరుణోల్లాసమేణాంకఖండం
పార్శ్వే వామే వపుషి తరుణీం, దృక్షు కారుణ్యలీలామ్ I
భూతిం ఫాలే, స్మితమపి ముఖే, గంగమంభః కపర్దే,
బిభ్రత్ప్రేమ్ణా, భువనమఖిలం శ్రీగిరీశస్స పాయాత్ II
శ్రీగిరీశస్సపాయాత్ - ఓ శ్రీగిరి ఈ శ్రీశైల క్షేత్రమునందుండే మల్లికార్జునుడా నీ స్వరూపమేమిటో తెలుసా? ఏణం పాణౌ - జింకపిల్లను చేత్తోపట్టుకుంటాడు. శిరసి తరుణోల్లాసమేణాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణీం - శరీరముయొక్క వామార్థభాగమునందు (ఎడమభాగమునందు) పార్వతీదేవిని ఉంచుకున్నటువంటి ఓ పరమేశ్వరుడా! నీకు నమస్కారము. ఓ విశ్వరక్షాధురీణుడైన పరమేశ్వరుడా! నీ వామభాగమునందు పార్వతీదేవి శోభిస్తోంది. ఈ రెండు క్షేత్రములు అర్థనారీశ్వర స్వరూపమునకు సంబంధించిన క్షేత్రములే. అటువంటి అర్థనారీశ్వర స్తవాన్ని శంకరులు ప్రత్యేకంగా గృహస్థాశ్రమంలో వున్న వారికొరకే ఇచ్చారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML