గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 25 June 2014

ముద్రలు అంటే ఏమిటి.. వాటి వలన మనకు కలిగే ప్రయోజనాలు:

ముద్రలు అంటే ఏమిటి.. వాటి వలన మనకు కలిగే ప్రయోజనాలు:
ధ్యానం చేసే టపుడు మనం ఉండే భంగిమ:: ముద్ర:: 
మన చేతులకు ఉండే ఐదు వ్రేళ్ళు ఐదు రకాల మూల పదార్థాలను సూచిస్తాయి... అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. వీటినే పంచభూతాలు అంటారు. మానవశరీరం కూడా ఈ పంచ భూతాలతోనే తయారైనది. అందుకే శబ్ద, స్పర్శ, రూప, రస, గంథములనే ఐదు తత్త్వాలు మన శరీరంలో ఉన్నాయి. మన చేతిలోని ఒక్కొక్క వ్రేలు ఒక్కొక్క మూలకాన్ని సూచిస్తుంది.

భూతత్త్వం-ఉంగరపు వ్రేలు

జలతత్త్వం- చిటికెనవ్రేలు

అగ్నితత్త్వం- బొటనవ్రేలు

వాయుతత్త్వం-చూపుడు వ్రేలు

ఆకాశ తత్త్వం-మధ్య వ్రేలు

వేరు వేరు వ్రేళ్ళను ప్రత్యేకంగా కలపటం ద్వారా వేరు వేరు ముద్రలు ఏర్పడతాయి. ఆయా ముద్రల ద్వారా ఆయా వ్రేళ్ళకు చెందిన మూల పదార్థాలు శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.
ముద్ర అంటే మన చేతి వేళ్ళ తో చేసే ఒక భంగిమ. మన ఐదు వ్రేళ్ళలో ఏ రెండు వ్రేళ్ళను ఉపయోగించి చేసే ప్రతి భంగిమకూ ఒక ప్రత్యేక ఉపయోగం ఉంటుంది. యోగ సాధనలో ఆసనాలతో పాటు ముద్రలకు కూడాఎంతో ప్రాధాన్యత ఉంది. ముద్ర అంటే హస్తంతో చూపే ప్రత్యేకమైన భంగిమ అని నాట్య శాస్త్రం చెపుతుంది. ధ్యాన స్థితిలో ప్రశాంతంగా కూర్చోవడానికి, ఇంద్రియనిగ్రహాన్ని ఏకాగ్రతను సాధించడానికి, ముద్రలు ఎంతో ఉపయోగపడతాయి అనటంలో సందేహం లేదు. ఒక రకంగా ముద్రలు శక్తి సముద్రాల వంటివి.
ఘేరండ సంహిత అనే గ్రంథం ముద్రలు ఇరవైఐదు రకాలకు పైగా ఉన్నట్లు పేర్కొంది.
వివిధ రకాల ముద్రలను, వాటిని చేసే విధానాన్ని, ప్రయోజనాలను తెలుసుకుందాం.
జ్ఞానముద్ర:

పద్మాసనం లో కూర్చుని చూపుడు వ్రేలు కొనను, బొటన వ్రేలు కొనను కలిపితే జ్ఞానముద్ర ఏర్పడుతుంది. చూపుడు వ్రేలు కొనను బొటన వ్రేలు మొదటి కణుపు దగ్గర ఆనిస్తే దానిని చిన్ముద్ర అంటారు. మిగిలిన మూడు వ్రేళ్ళను నిటారుగా ఉంచాలి. మణికట్టులను మోకాళ్ళపై ఆనించి వెన్ను నిటారుగా ఉంచి నిర్మలంగా కనులు మూసుకుని కూర్చోవాలి. శ్వాసను నెమ్మదిగా తీసుకోవాలి. పద్మాసనం రాని వారు సుఖాసనంలో గాని, సిద్ధాసనంలో గాని కూర్చొనవచ్చు. యోగాభ్యాసులు పాటించే ఆహార నియమాలన్నీ వీటికి వర్తిస్తాయి. కొందరు చిన్ముద్రను జ్ఞానముద్రను చిన్ముద్ర అని కూడా అంటారు.
ప్రయోజనాలు:
జ్ఞానముద్రను అభ్యాసం చేయటం ద్వారా మానసిక ఒత్తిడి ని నివారించుకోవచ్చు. బొటనవ్రేలు శరీరంలోని అగ్ని తత్త్వాన్ని ప్రభావితం చేస్తుంది కనుక ఈ ముద్ర ముఖంలో తేజస్సును పెంచుతుంది. చూపుడు వ్రేలు వాయు తత్త్వాన్ని కలిగి ఉండడం చేత మనస్సులోని చంచలత్వాన్ని నిరోధించి, మనస్సును ఏకాగ్ర పరుస్తుంది. మంచి ఏకాగ్రతను మెదడు చురుకు దనాన్ని కలిగి ఉండి జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఈ ముద్ర ఉపయోగపడుతుంది. మానసిక వికలాంగులు ఈ ముద్రను అభ్యాసం చేస్తే మానసిక సామర్థ్యం పెరుగుతుంది.
మూర్చలు, పిచ్చితనము, అనవసర కోపం, న్యూనతాభావములతో బాధ పడుతున్నవారు ఈ ముద్రను అభ్యాసం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధ్యానముద్ర:

ఈ ముద్రను పద్మాసనంలో గాని సిద్ధాసనం లోగానీ, సుఖాసనంలోగానీ కూర్చుని చేయాలి. పద్మాసనంలో కూర్చుని చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. తల నిటారుగా ఉంచాలి. ఎడమ అరచేతిపై కుడి అరచేయి ఉంచి, రెండు చేతులను నాభి క్రిందుగా ఒడిలో ఉంచుకోవాలి.చేతులను బిగ దీయకూడదు. శరీరాన్ని తేలికగా ఉంచి హాయిగా కనులు మూసుకుని ద్యాస శ్వాస మీద ఉంచాలి. దీనిని సహజ ధ్యానముద్ర అని కూడా అంటారు. ఎడమ అరచేతిలో కుడి అరచేయి వేసి బొటన వ్రేలి కొసలు ఒక దానికొకటి కలిసే విధంగా ఉంచే ముద్రను ధ్యానయోగ ముద్ర అంటారు. దీనిని ఎక్కువ కాలం సాధన చేస్తే ఆ వ్యక్తి చుట్టూ దివ్యశక్తి (ఆరా) పెరుగుతుంది. దగ్గరకు వచ్చిన వారు ప్రభావితులవుతారు.
ప్రయోజనాలు:
త్వరగా ధ్యానస్థితిలో మనస్సు నిలవటానికి ఈ ముద్ర ఎంతో దోహదపడుతుంది. మనస్సు వినిర్మలంగా ఉండి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందడమో ధ్యానం. ఇటువంటి అనుభవం త్వరగా రావడానికి ఈ ముద్ర ఉపయోగపడుతుంది. చిత్త చాంచల్యం నివారింపబడి, మనస్సు సంపూర్ణ శాంతిని పొంది, ఆత్మానుభవం కలిగి సచ్ఛిదానందాన్ని పొందడంలో సాధకునికి ధ్యానముద్ర మంచి సాధన.
ఇతరముద్రలు:
బొటనవ్రేలితో మిగిలిన వ్రేళ్ళను కలపడం ద్వారా రకరకాల ముద్రలు ఏర్పడతాయి. ఆయా వ్రేళ్ళకు ఉండే మూలపదార్థాల శక్తి శరీరంపై పనిచేసి అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి. ఈ ముద్ర ఐనా చేసే వారి అనుకూలతను బట్టి పది నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు చేయవచ్చును.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML