గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 25 June 2014

రాములవారు నడయాడిన స్థలాలు

రాములవారు నడయాడిన స్థలాలు
తెలంగాణలో రాములవారు సంచరించినట్లు స్థానిక జానపదులు చెప్పుకుంటున్న స్థలాలు అనేకం ఉన్నయి. వాటిలో కొన్నింటి ప్రస్తావన... 
Raamగోదావరికి ఉత్తరాన ఆదిలాబాద్ జిల్లాలో మాల్యవంత పర్వతం ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో (అరణ్యకాండ 49వ సర్గ 31వ శ్లోకం) ఉన్నట్లుగానే తదనంతరం కాళిదాసు నకీ.శ. 5వ శతాబ్దం) తన ‘మేఘసందేశం’లో (16వ శ్లోకం), ఓరుగల్లు రాజు మొదటి ప్రతాపరువూదుని నకీ.శ. 12వ శతాబ్దం) మంత్రి గంగాధరుడు వేయించిన హనుమకొండ శాసనంలో ఉన్నది. ఆ మాల్యవంత పర్వతాలనే ఇప్పుడు ‘నిర్మల కొండలు’ అని, ‘సత్మల కొండలు’ అని అంటున్నం. ఈ కొండల మీదుగా ప్రయాణించే రాములవారు గోదావరిని దాటి దక్షిణానికి వచ్చాడని చెప్పవచ్చు.

- రాముడు తన అవతారాన్ని సమాప్తి చేసుకుంటున్న సమయంలో హనుమంతునికి బ్రహ్మపదవిని ప్రసాదిస్తూ దాన్ని సాధించడానికై అతన్ని నిజామాబాద్ జిల్లాలోని లింబావూదిపై తపస్సు చేయుమన్నడట. హనుమంతుడు తపస్సు చేసిండు. అందుకు నిదర్శనంగా మనకు లింబాద్రి గుహాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కుడి పక్కనున్న గుండుకు హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. ఇదే జిల్లా మోర్తాడ్ మండలంలో గోదావరి తీరాన ఉన్న తడపాకల పరిసరాల్లో కూడా సీతారాములు పర్యటించారని స్థానికులు చెబుతరు. అక్కడున్న శిథిల శివాలయ పరిసరాల్లో సీత చేత పూజలందుకున్నవిగా చెప్పబడే శివలింగాలు కూడా ఉన్నయి.

- కరీంనగర్ జల్లాలోని రామగుండం దగ్గరున్న ‘రాముని గుండాల’ అనే ప్రదేశం చిన్న చిన్న జలపాతాలతో చాలా అందంగా ఉంటుంది. రాముడు ఇక్కడికి సమీపంలో ఉన్నప్పుడే (రామగిరిపై) తన బాణాలను ప్రయోగించి ఇక్కడ గుండాలను సృష్టించాడని అంటరు. గుట్టపై నుంచి ఒక గుండంలో నుంచి నీరు మరో గుండంలోకి దుముకుతూ చివరగా ఒక ఏరై పారుతది. ఈ గుండాల మధ్య క్రీ.శ. 6-7 శతాబ్దాలనాటి అతి ప్రాచీన దేవాలయాలున్నయి. వేములవాడలో కూడా రాముడు పర్యటించాడని స్థల పురాణం చెబుతున్నది. అందుకు నిదర్శనంగా అక్కడి శివాలయంలో శివరాత్రి జరిగినంత ఘనంగా శ్రీరామనవమి కూడా జరుగుతది. ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని మోసుకు పోతున్నప్పుడు ఒక కొండ చరియ విరిగి కింద పడిందట. అదే ‘కొండగట్టు’ అని అంటరు. ఇక్కడి ఆంజనేయున్ని పీడనలు తొలగించేవాడిగా భక్తులు పూజిస్తరు.

- ధర్మపురిలో శ్రీరాముడు ప్రతిష్టంచిన ఇసుకలింగంపై ఆయన చేతి వేలి ముద్రలు కన్పిస్తయని అంటరు. కోటి లింగాలలో రాముడు ప్రతిష్ఠించిన లింగం గుడిలోపల ఉండగా, హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన లింగం గుడి ముందరి ఆవరణలో ఉందని స్థానిక కథనం.

- మెదక్ జిల్లాలో సంగాడ్డి దగ్గరి కల్పగూరులోని కాశీవిశ్వేశ్వర లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించిండని అక్కడి స్థలపురాణం చెబుతున్నది. ఇదే గుడిలోని అనంత పద్మనాభుని విగ్రహంపై ఉదయం సూర్యకిరణాలు ప్రసరిస్తయి. శ్రీరాముడిది సూర్యవంశం కావడం గమనార్హం.

- వరంగల్ జిల్లాలోని రామప్ప, లక్నవరం చెరువుల నీటి వనరులైన వాగులను మొదట రాముడు, లక్ష్మణుడే సృష్టించిండట. కనుక 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఆ చెరువులకు వారి పేర్లనే పెట్టారని అంటరు.

- రంగాడ్డి జిల్లాలోని జంటుపల్లి దగ్గర గుట్టలో శ్రీరాముడు రెండు బాణాలను ప్రయోగించి రెండు నీటి వనరులను సృష్టించాడంటరు. ఈ కథనానికి నిదర్శనంగా అక్కడ 12 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో ఉన్న రెండు గాడి దొనల్లో ఎల్లకాలం నీరు కన్పిస్తది. ఇక్కడి శ్రీరాముడి విగ్రహంపైన ఆదిశేషుడు ఉండటం కూడా ఒక ప్రత్యేకత. శ్రీరాముడి పీఠం నుండి కూడా ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటది.

- శ్రీరాముడు ఆంజనేయునికి కానుకగా ఇచ్చిన హనుమత్‌పుర ప్రాంతంలో శ్రీరామునిచే లఘపాశబంధ శాపానికి గురైన ‘జాబాలి’ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిండని, ఆ విగ్రహాన్ని పూజించి శాపవిముక్తుడైండని కూడా అంటరు. కనుక ఆ ప్రాంతం పేరు ‘పాశబంధపురం’ అయిందని చెబుతరు. పాశం అంటే తెలుగులో తాడు కాబట్టి పాశబంధపురమే తెలుగులో ‘తాడుబంద్’ అయిందనీ అనుకోవచ్చు. ఇది హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి సిక్‌విలేజ్‌ల మధ్య ఉన్నది.

రామ లక్ష్మణులు సీత కోసం అన్వేషిస్తున్న సమయం అది. రాముడు ఒక రాతి మీద కూర్చుని లక్ష్మణునితో ‘‘ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల తరువాత చ్యవనక మహర్షి నా పేరున గుడి కడతాడు’’ అని చెప్పిండట. అదే విధంగా చ్యవనకుడు శివానుక్షిగహంతో కాశీ నుండి పాలరాతి లింగబాణాన్ని తెచ్చి ప్రతిష్ఠించి, దాని చుట్టూ రామలింగేశ్వరాలయాన్ని కట్టించిండట. తుంగభద్రా నదికి 15 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ రామలింగం కోసం ముసలితనంలో చ్యవనకుడు అభిషేక జలం తేలేకపోయిండట. అప్పుడు ఆ నదీ దేవతే ఆ ఆలయం వెనుక ఒక చెరువై వెలసిందట. ఆ చెరువునే ‘చ్యవనకదోన’ అంటరు. కాలక్షికమంలో అది ‘చాగదోన’ అయింది. అదిప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నది.

- ఇదే జిల్లా కోయిలకొండకు మొదటిపేరు రామగిరి (1516కు పూర్వం). రాముడు అరణ్యవాసంలో భాగంగా ఈ కొండపై కూడా సంచరించిండని చెప్తూ అందుకు నిదర్శనంగా ఒక రామపాదాన్ని చూపుతరు. అలాగే, నేడు ‘మన్యంకొండ’గా పిలుస్తున్న కొండ పేరు కూడా ముందు ‘రాములకొండే’నట. ఈ కొండపై రాముడు సంచరించిండట.

- రావణున్ని చంపిన పాపం నుండి విముక్తుడవడానికి రాముడు శ్రీశైల ఉత్తర ద్వారక్షేవూతమైన ఉమామహేశ్వరంలో ప్రదక్షిణ యాత్రను ప్రారంభించి, పంచాంగ నియమాలను పాటిస్తూ శ్రీశైలపు నాలుగు ప్రధాన ద్వార క్షేత్రాలలో ఐదేసి రోజులు ఉపవాస దీక్ష చేశాడట. నాలుగు ఉప ద్వారాలలో మూడేసి రోజుల ఉపవాస దీక్ష చేస్తూ శ్రీశైలాన్ని దర్శించాడనీ అంటారు. ఇదే ఆయన పేర ‘రామ ప్రదక్షిణ పద్ధతి’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరొక పద్ధతి ‘అష్టదళ పద్మ ప్రదక్షిణం’. శ్రీశైలానికి ఉన్న అష్టద్వారాలలో నాలుగు (ఉమామహేశ్వరం, ఏలేశ్వరం, అలంపురం, సంగమేశ్వరం) తెలంగాణలోనే ఉండటం గమనార్హం. శ్రీశైలంలో శ్రీరాముడు ప్రదక్షిణానంతరం ప్రతిష్ఠించిన ‘సహవూసలింగం’ వృద్ధ మల్లికార్జున ఆలయంలో ప్రధాన లింగం వెనుక ఉన్నది. ఇక సీతా ప్రతిష్ఠిత సహస్ర లింగం భ్రమరాంబ ఆలయ సింహద్వారానికి ఎడమ పక్కన ఉన్నది.

శ్రీరాముడు తెలంగాణలో సంచరించాడనడానికే ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నయి. ఏమైనా, జటిల పండితుల విచక్షణ కంటే జానపదుల విశ్వాసానికే బలం ఎక్కువ. కాబట్టి వారు విశ్వసిస్తున్న శ్రీరామ సంచార స్థలాలకు ప్రాధాన్యం తప్పక ఇవ్వవలసిందే!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML