గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 22 June 2014

సీత సహనం శిరోధార్యం -- సంస్కృతంలో రెండు గొప్ప ఇతిహాసాలున్నాయి. అవి రామాయణం, మహాభారతం

సీత సహనం శిరోధార్యం
సంస్కృతంలో రెండు గొప్ప ఇతిహాసాలున్నాయి. అవి రామాయణం, మహాభారతం, ప్రాచీన భారతీయులఆచార వ్యవహారాలు, నాటి సమాజస్థితి, నాగరికత మొదలైనవి ఆ గ్రంథాల్లో ఇమిడి ఉన్నాయి. అన్నిటికంటే అతిప్రాచీనమైన ఇతిహాసం రామాయణం.
రామాయణ కర్త వాల్మీకి ముని. రామాయణం అతిచక్కని రచన. విశ్వసారస్వతంలో రామాయణానికి దీటైంది లేదు.
ఆదర్శనారి ఆమె.....
సీతారాములు భారతీయులకు ఆదర్శప్రాయులు. పిల్లలందరూ, ముఖ్యంగా బాలికలు సీతను ఆరాధిస్తారు. పవిత్ర్రురాలు, భక్తురాలు, సహనశీలి అయిన సీతను పోలివుండడంకంటే భారతీయ మహిళ కోరదగ్గ ఉన్నతి మరొకటి లేదు. ఈ పాత్రను పరిశీలించినప్పుడు, పాశ్చాత్యుల ఆదర్శంకంటే భారతీయుల ఆదర్శం ఎలా వేరైనదో మీకు స్పష్టమౌతుంది.
జాతికంతకూ సహనానికి సీత ప్రతీక. ’చేతల్లో శక్తి చూపించండి’ అంటారు పాశ్చాత్యులు. ’సహనంలో మీ శక్తిని చూపించండి’ అంటారు భారతీయులు. పాశ్చాత్యుల్లో వ్యక్తి సంపాదన సామర్థ్యాన్ని బట్టే గెలుపును నిర్వచిస్తారు. మరి మనదేశంలో త్యాగాన్ని బట్టి మనిషి గొప్పతనాన్ని లెక్కకడతారు. చూశారా! ఎంత వ్యత్యాసం! అందుకే అదర్శ భారతీయతకు సీత ఉత్తమోదాహరణ. సీత అనే స్త్రీ నిజంగా ఒకప్పుడుండేదా?, ఆమెకథ నిజమా?, కాదా? అనే ప్రశ్నలు మనకొద్దు. సీత అనే ఆదర్శం ఉందని మనం గుర్తుచేసుకుందాం. సీతాదర్శం యావద్దేశవ్యాప్తమై జాతీయ జీవనంలోకి అంత గాఢంగా చొచుకొనిపోయింది. భారతీయుల ప్రతి రక్తకణంలోనూ కలిసిపోయిన పౌరాణిక గాథ అది. మంచికి గాని, పవిత్రతకు గాని, పాతివ్రత్యానికి గాని, భారతీయ మహిళా ధర్మానికి గాని సీత పెట్టింది పేరు. పురోహితుడు ఒక స్త్రీని ఆశీర్వదించేటప్పుడు సీతవలె ఉండమనే ఆశీర్వదిస్తాడు. ఒక శిశువును దీవించేటప్పుడు సైతం అతడు సీతా ఉండమనే అంటాడు. వారంతా సీత పిల్లలు. సీతలా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. సీత ఎలాంటిదంటే క్షమాశీలి, సహనశీలి, పరమసాధ్వి, దుర్భర కష్టాలు అనుభవించే సమయంలో కూడా ఆమె నోటి వెంట రాముణ్ణి గురించి ఒక్క కటువైన మాటకూడా వెలువడలేదు. అంతా తన విధిగా భావించి, తన కర్తవ్యం నిర్వర్తించింది. అడవుల పాలైన సమయంలో కూడా ఆమెలో ఏమాత్రం పరుషత లేదు. అపకారానికి ప్రత్యపకారం ఎన్నటికీ తలపెట్టదు. అది భారతీయ ఆదర్శం.
గమనాలు వేరైనా గమ్యం ఒక్కటే...
చెడును జయించి దానిపై గెలుపు సాధించామనే పాశ్చాత్యుల ధోరణికి, సహనంతో శత్రువ్నైనా జయించవచ్చనే భారతీయ ఆదర్శానికీ గమ్యం మాత్రం ఒక్కటే. ఆ ఇద్దరి లక్ష్యం చెడును రూపుమాపటం. కాని గమనాలు వేరు వేరు అన్న భ్రాంతితో కలహించుకోవద్దు. అదే నా ఆకాంక్ష
(స్వామి వివేకానంద సాహిత్య సర్వస్వం నుంచి)
నిత్య సత్యవ్రతయై, పతివ్రతా తిలకమై మానవులకు, దేవతలకు పరమాదర్శమైన సీత చరిత్ర నిత్య ప్రకాశవంతమే. ఆ మహాసాధ్వి సీత మన జాతికి అధిష్ఠాన దేవతై ఎప్పుడూ సుస్థిరంగా నిలిచి ఉంటుంది. నిత్యపావని, అగాధ సహనశీలి, పరమశాంతమూర్తి అయిన ఆ తల్లి ఆధునిక నారీమణులకు కూడా ఆరాధ్యనీయురాలే. ఆమెను గురించి వర్ణించడం ముంజేతి కంకణానికి అద్దం చూపడమే.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML