గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 25 June 2014

మహాభారతం జరిగే సమయంలో ఉన్న మన భరతఖండంలోని వివిధ దేశాలు.. చాలామంది ఇన్నాళ్ళు ఇదొక కల్పిత గాధగా అనుకున్నవారికి శాస్త్రజ్ఞులు జరిపిన పరిశోధనలో 35నగరాలు బయటపడ్డాయి. వాటిలో అందరికి తెలిసిన శ్రీకృష్ణుడి ద్వారకానగరం. తరువాత హస్తిన. మయసభ నిర్మిత ప్రాంతం.


ఉత్తర దిక్కు:
గిరివ్రజము (జరాసంధుని నగరం) మగధ అనికూడా అంటారు. పుళింద(ప్రతివింధ్యుడు పాలించాడు), ప్రాగ్జ్జ్యోతిష్య పురము (భగదత్తుడు పరిపాలించాడు), అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి, ఉలూక (బృహంతుడు పాలించాడు), ఉత్తర ఉలూక, వామదేవ, మోదాపుర, సుదామ, సుసంకుల, దేవప్రస్థము(సేనాబిందు నాయకుడు), బర్బర, శబర, తురష్క, మాళవ, పౌండ్ర, కాశ్మీర, త్రిగర్త, లోహిత, సుధన్వ, గాంధార, కాంభోజ, కోసల, సింహపురము (చిత్రయుదుడు పాలించాడు), కాంభోజ, కటకుండ, హాటక, దిత్తిరి, కల్మాష, మండూక, హేమకూట, నిషాద పర్వతములు దాటి వెళితే గంధర్వ నగరం వస్తుంది. (ఇది ఇప్పటికి ఉంది కాని మానవనేత్రాలకు అగమ్యగోచరం), హరివాసం, జంబూ మహానదిని తీరంలో కొన్ని దేశాలు ఉన్నాయి కానీ వాటి పేర్లు ప్రస్తావించలేదు.
తూర్పు దిక్కు:
పంచాల దేశం, విదేహ దేశము( జనకుడు పరిపాలించాడు), దశార్ణ(సుధస్సుపాలించాడు), చేది (శిశుపాలుడు పాలించాడు), పుళింద, కుమారదేశం, కోసలదేశము, అయోధ్యాపురము, కాశీ, మత్స్య మలద, కర్ణాట-దక్షిణ(మల్లవీరులు ఎక్కువగా ఉండేవారు), మగధ(జరాసంధుడు రాజు), హిమవత్పర్వత పార్శ్యమున జలోద్భవ దేశం. భల్లాట దేశము, ఇంద్రపర్వతము (ఇక్కడ కిరాతులు ఎక్కువగా ఉండేవారు), కర్ణవత్స, పుండ్ర, పౌండ్రక, తూర్పుదిక్కున మరికొన్ని దేశాలు పేర్లు తెలియబడలేదు.
దక్షిణంలో:
సుమిత్ర, శూరసేన, దంతవక్త్ర, యవన, గోశృంగగిరి, కంభోజదేశం(ఇది ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్), నర్మదానది సమీపములో అవంతీనగరం(విందానువిందులు పాలించారు), మహిష్మతీపురము, నిషధ, సౌరాష్ట్ర, రుక్మి, భీష్మిక, శూర్పారక, దండక, (ఇటువైపు నిషాదులు ఋషాదులను, ఏకపాదుల, గాలముఖుల, కర్ణప్రావరుణులనే రాక్షస జాతుల ఉండేవారు), రామశైల, కోలశైల, తామ్రద్వీప, సంజయంతీ, తాళవన, పౌండ్య, కెరల(ఇప్పుడు ప్రస్తుతం(కేరళ). కాళింగ, ద్రవిడ, యవన, కరహాటక(కర్ణాటక), విభీషణుడు పాలిస్తున్న లంకానగరం కూడా ఒకప్పుడు మన అదీనంలోకి తీసుకొచ్చారు పాండవులు వీరిలో సహదేవుడికి సహాయకుడిగా ఘటోత్కచుడు విభీషణుడి వద్దకు దూతగా వెళ్ళాడు ఐతే యుద్ధం మాత్రం జరగలేదు. కాని లంకాధిపతి విభీషణుడు కప్పం కట్టేవాడు.),
పశ్చిమ దిక్కు:
మహితిక, మరు, మాళవ, మార్బర, కర్బర, శైరీషక, దశార్ణ, పుష్కరారణ్య, పంచనద, అమర పర్వతం. మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనాదీనంలోకి తీసుకొచ్చిన ఘనత శ్రీకృష్ణుడి రక్షణలో ఉన్న అమితబలులైన పాండవులు,

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML