గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 27 June 2014

ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు, అత్త అల్లుళ్ళు, ఒకే గడప దాట కూడదంటారు ఎందుకు???

ఇది వరకటి రోజుల్లో చాలా భాగం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.

 అందుకే... అమ్మాయి ఉంటే అత్త వారి ఇంట్లో లేకపోతే అమ్మవారి ఇంట్లో ఉండేది..
బయట ఇప్పటిలా వేరే అద్దె కాపురాలు... ఉండేవి కావు...
 క్రొత్తగా పెళ్ళైన వారికి మొదట వచ్చే ఆషాఢ మాసంలో ఒక వేళ నెల తప్పితే ప్రసవం అయ్యే సమయం ఖచ్చితంగా రోహిణీ కార్తె మండు వేసవిలో వచ్చే అవకాశంఉంది...
అప్పటిరోజుల్లో ఎక్కువగా గుర్రపు వాతం(హై బి పి) తో మరణాలు ఎక్కువగా సంభవించేవి..
ఇప్పటిలా ఆపరేషన్ లు చేసే అవకాశం ఉండేది కాదు..
దానిని నివారించాలంటే ఒకటే మార్గం... దంపతులను కలువనీయకుండా చేయడమే....
దీనిని ఊహించిన మన పెద్దలు అందుకే ఈ ఖచ్చితమైన నిర్ణయాన్ని ఉంచారు...
మీరు చూడండి వేరే ఏ మాసంలోనూ ఈ విధమైన కట్టు బాట్లు లేవు..
ఒకసారి మీరే లెక్కవేసుకుని చూడండి ఏది నిజమో అర్థమవుతుంది..
ఆచారాలు.. సాంప్రదాయాలను అర్థంచేసుకుంటే వ్యర్థమనిపించవు.. ఏమంటారు మిత్రులారా!!!
Read More

హనుమాన్ చాలీసా రచించిన భక్త తులసీరాముని చరితము:

హనుమాన్ చాలీసా రచించిన భక్త తులసీరాముని చరితము:
ఉత్తరభారత దేశంలో క్రీ శ 16 వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసి దాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ,ఓ ప్రాంతీయబాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెప్తాడు. తులసీదాస్ రచించిన "రామచరిత మానస్" సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకధ ను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండే వాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతూండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీ దాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాదుషా కు తరచుగా ఫిర్యాదులు వచ్చేవి. కాని అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇది ఇలాగ ఉండగా వారణాసి లో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు,తన ఏకైక కుమారునికి చక్కని అమ్మాయితో వివాహం జరిపించారు. వారిద్దరు ఆనందంగా జీవితం సాగిస్తూ ఉండగా ,విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపొయిన అతని భార్య హృదయవిదారముగా విలపించసాగింది. చనిపోయిన యువకుడికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతున్న ఆమెను బంధువులంతా ఆపుతూ ఉండగా ,ఆమె అక్కడ పక్కన తులసిదాస్ ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదాల వద్ద పడి రోదించసాగింది. అప్పుడు ఆయన రామ నామ ధ్యానం లో ఉన్నారు. హఠాత్తుగా కన్నులు విప్పి ఆమెను చూసి " దీర్ఘసుమంగళీ భవ" అని దీవించారు. అప్పుడు ఆమె జరిగినది అంతా తులసీ దాస్ కు విన్నవించుకుంది. అప్పుడు తులసీ దాస్ గారు....నా నోట అసత్యం పలికించడు రాముడు....అని అంటూ..... అప్పుడు ఆయన వారి కమండలం లో జలమును తీసి ఆ యువకుని దేహం మీద చల్లగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. ఆ మరు క్షణం అతను పునర్జీవితుడయ్యాడు. ఈ సంఘటన ప్రత్యేకించి తులసీ దాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామ భక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ అయిపో సాగింది. ఇంక ఉపేక్షించితే కుదరదు అని గ్రహించిన ఇతర మత పెద్దలంతా పాదుషా వద్దకు వెళ్ళి జరుగుతున్నవి వివరించి తగిన చర్య తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ పాదుషా వారు తులసీ దాస్ ను తన దర్బార్లోకి రప్పించారు. అప్పుడు ఆయనతో విచారణ ఇలా సాగింది. పాదుషా : తులసీ దాస్...మీరు రామనామం అన్నిటి కన్నా గొప్పది అని ప్రచారం చేస్తున్నారట? తులసీ దాస్ : అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీ రాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరం కాదు.! పాదుషా : సరే...మేము ఇక్కడ ఒక శవాన్ని చూపిస్తాము...దానికి ప్రాణం పోయండి ...రామ నామం తో బ్రతికించండి..అప్పుడు మీరు చెప్పినది నిజమని మేము నమ్ముతాము... తులసీ దాస్ : క్షమించండి ప్రభూ! ఫ్రతి జీవికి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి....మానవమాత్రులు మార్చలేరు.. ఫాదుషా : అయితే తులసీ దాస్ జి! ఈ మాట ను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవి అన్నీ అబధ్ధాలు అని సభాముఖముగా అందరిముందు ఒప్పుకోండి! తులసీ దాస్ : క్షమించండి ...నేను చెప్పేది నిజం! పాదుషాకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. "తులసి...మీకు ఆఖరి సారి అవకాశం ఇస్తున్నాను...నీవు చెప్పేవన్ని అబద్ధాలు అని ఒప్పుకో.....నీవు చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి నీ ప్రాణాలు దక్కించుకో.." అని పాదుషా వారు తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీ దాస్ కనులు మూసుకొని, ధ్యాన నిమగ్నుడై శ్రీ రామ చంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారముగా భావించిన పాదుషా తులసిని బంధించమని ఆదేశించాడు. అంటే.....ఎక్కడ నుండి వచ్చాయో ....కొన్ని వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసి దాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని ,వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్తు సంఘటనతో అందరు హడలిపోయి ఎక్కడివారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీ దాస్ కు సింహద్వారంపై హనుమ దర్శనము ఇచ్చారు. ఒడలు పులకించిన తులసీ దాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమ " తులసీ ! నీ స్తోత్రముతో మాకు చాలా ఆనందమైనది..ఏమి కావాలో కోరుకో...." అన్నారు..అందుకు తులసీదాస్ "తండ్రీ! నాకేమి కావాలి....! నేను చేసిన ఈ స్తోత్రము లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు,నా జన్మ చరితార్ధమవుతుంది. నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా,వారికి అభయం ప్రసాదించు తండ్రీ!" అని తులసి కోరుకున్నాడు. ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమ "తులసి ! ఈ స్తోత్రం తో మమ్మల్ని ఎవరు స్తుతించిన,వారి రక్షణ భారం మేమే వహిస్తాము" అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు "హనుమాన్ చాలీసా" కామధేనువు అయి భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక "హనుమాన్ చాలీసా" దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామ జ్యోతి ఎప్పటికి వెలుగుతూనే ఉన్నది... శ్రీ రామ జయ రామ జయ జయ రామ !!!!!!!!!
(గురువు గారు సామవేదం శణ్ముఖ శర్మ గారి పేజీ నుండి గ్రహించబడినది)
Read More

తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనం

తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనం

ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, ఆతడు భక్త కన్నప్పగా మారిన వైనము తెలుసుకుందాం.

అర్జునునుడు ఆ జన్మలో శివసాయుజ్యం పొందలేక పోవడాన మరో జన్మ ఎత్తాడు. తండై, నాథనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టుకింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది.

తిన్నడు నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయి ''అయ్యా, శివయ్యా! నీకు నామీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా'' అని పిలిచాడు.

మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లూవాకిలీ మరచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు.

అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరుతెన్ను నచ్చలేదు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగంమీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది. ''మహాశివా, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాపపంకిలమైన పనులు చేయడమే కాదు, చూడటమూ ఘోరమే.. ఇంతకంటే చనిపోవడం మేలు...'' అని దుఃఖిస్తూ, తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు.

మహాశివుడు చిరునవ్వు నవ్వి ''ఆగు.. తొందరపడకు.. ఇక్కడే దాక్కుని, ఏం జరగబోతోందో చూడు..'' అన్నాడు.

శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు.

అప్పుడే నోటితో నీళ్ళు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి, మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే, శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది, శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే, శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది.

రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి, రాతిమీద నూరి, దానితో కంటికి కట్టు కట్టాడు. తీరా చూస్తే, రెండో కంటి నుండి రక్తం కారుతోంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ, అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది.

తిన్నడు మరింత దుఃఖిస్తూ, ''శివా, విచారించకు.. నా రెండో కన్ను కూడా తీసి పెడతాను..'' అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని, ఆ కన్ను దగ్గర పెట్టి, రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు.

అదంతా వెనకనుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతు లేకపోయింది.

తిన్నడి అపరిమిత భక్తిప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించి, ''భక్తా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను.. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమౌతావు... సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు..'' అంటూ శివసాయుజ్యాన్నీ ప్రసాదించాడు.Read More

స్కంధగిరి దేవాలయం లో ఆదీ శంకరాచార్యుల పాదుకలు


Read More

శ్రీకృష్ణుడు అంటేనే యోగం గుర్తుకు వస్తుంది. ఆయన మహాయోగి, యోగీశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు. భగవద్గీతలో ప్రతి అధ్యాయం ఒక యోగమే

శ్రీకృష్ణుడు అంటేనే యోగం గుర్తుకు వస్తుంది. ఆయన మహాయోగి, యోగీశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు. భగవద్గీతలో ప్రతి అధ్యాయం ఒక యోగమే. యోగ అన్నపదానికి అర్థం రెంటిని కలుపుట. సంయోగం కలయిక, ఐతే వియోగం విడిపోవడం. "యోగక్షేమం వహామ్యహం" అంటాడు పరమాత్మ. యోగమంటే లేనిది లభించడం, క్షేమమంటే ఉన్నది నిలబడడం. గీతలో యోగం అంటే జీవాత్మను పరమాత్మతో ఐక్యం చేయడం. దీనికి అనేక దర్శనాలు అనేక మార్గాలు. వాటన్నిటినీ సమన్వయంచేసి గీతలోచెప్పినవాడు భగవంతుడు. గీత వృద్ధులకు పనికి వచ్చే పుస్తకమా? కానేకాదు. నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘర్షణకు మార్గం చూపిస్తుంది. దానిని మించిన Management Textbook లేదు.
6
వసుదేవసుతందేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
మనము కృష్ణుడు మహాయోగి అనిచెప్పుకున్నాము. అసలు ఆయన ముఖ్యతత్త్వం జగద్గురు తత్త్వం. ఇది విష్ణుతత్త్వం కాదు. విష్ణువు ఏ అవతారంలోనూ ఎవరికీ బోధ చేయలేదు. ఇది కృష్ణునిలోని శివ తత్త్వం, సుబ్రహ్మణ్య తత్త్వం. కృష్ణునికి శివునికీ ఉన్న సంబంధం మామూలుగా గుర్తించనిది. భీష్ముడు ధర్మరాజు కు విష్ణు సహస్రం బోధించాడు. కృష్ణుడు ధర్మరాజుకు శివసహస్రనామావళి, శివ పూజా ప్రాశస్త్యం బోధించాడు. ప్రభాస తీర్థంలో (సోమనాథ క్షేత్రం)శివ దీక్ష, శివ పూజా నిర్వహించాడు. అర్జునుని శివునికై తపస్సుచేసి పాశుపతం పొందమని చెప్పాడు. శివుని బోధరూపం దక్షిణామూర్తి. సుబ్రహ్మణ్యుని శివగురువు అంటారు. ఆయన వాహనం నెమలి. అందుకే కృష్ణుడు శిఖిపింఛమౌళి. కృష్ణునిబోధలు భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవ గీతలు. భ్రమర గీత కూడా. కృష్ణుని భంగిమ నటరాజ స్వామి కుంచితపాదాన్ని పోలి ఉంటుంది. ఆయన వేణువు శివుడే. కృష్ణుడు వంశీ మోహనుడైతే, శివుడు వంశ మోహనుడు (శివసహస్రంలో ఒకపేరు).
7
ఇప్పుడు సృష్టి గురించి తెలుసుకోవాలి. పురాణాలు ఐదు లక్షణాలు కలిగి ఉంటాయి .సర్గ, ప్రతిసర్గ, మన్వంతరం, వంశం, వంశానుచరితం. - అనంత కాల చక్రం ఆద్యంతాలులేనిది. మానవజీవితమునకు సుమారు 100 సంవత్సరాలు పరిమితి అయితే, కలియుగ పరిమితి 4,32,000 సం. 4:3:2:1 లొ ఉన్న నాలుగు యుగాలు ఒక మహాయుగం. ఎన్నో మహాయుగాలు గడిస్తే కల్పం, మన్వంతరం వంటివి వస్తాయి. యుగాంతం లో ప్రళయాలు వస్తాయి. విష్ణువు పాలసముద్రంలో ఆది శేషునిపై యోగనిద్రలో ఉంటాడు. ఆతడే సృష్టి కర్త. ఆధునికులం పాలసముద్రాన్ని Milky Way Galaxy గా భావించుకోవచ్చు. ఆయన సృష్టికోసం ఒక పరిమిత విశ్వాన్ని సృష్టించాడు. ఆది బ్రహ్మాండము. దీనిలో భూమితొ సహా భూ, భువ, సువ, మహ, జన, తప, సత్య - అనే 7 ఊర్ధ్వలోకాలు , అతల, వితల, .... పాతాళ అనే 7 క్రిందిలోకాలు సృష్టించాడు. సత్యలోకములో ప్రతిసృష్టిచేసే బ్రహ్మదేవుణ్ణి సృష్టింఛాడు. ఈ బ్రహ్మలోకంపైన పరమేశ్వర లోకాలనే వైకుంఠం, కైలాసం, గోలోకం, మణిద్వీపం ఉంటాయి. అక్కడ లక్ష్మీనారాయణులు, శివపార్వతులూ, రాధాకృష్ణులూ, లలితా పరమేశ్వరి వారి లోకాలలో ఉంటారు
Read More

భార్య భర్తలిద్దరూ కలిసి ఏకాదశి వ్రతం ఆచరిస్తే అధిక ఫలము

అన్నీ మనకి తెలిసినవే కేవలం పునశ్చరణ
ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు.నెలకు రెండు ఎకాదశులు. మొత్తము ఇరవై నాలుగు .అధిక మాసాలు వస్తే ఇరవై ఆరు.ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పరమాత్మని ధ్యానం చేసి ద్వాదశి నాడు పారణ చేస్తే మంచిది. అన్నీ ఏకాదశి లందు వైకుంట ఏకాదశి ఉత్తమమైనది. వైకుంట ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి లతో సమానము.
ఆషాడ శుద్ధ ఏకాదశి యోగ నిద్ర
కార్తిక శుద్ధ ఏకాదశి యోగ నిద్ర విరమణ.
ఆషాడ శుద్ధ ఏకాదశి "శయన ఏకాదశి "
మార్గశిర ఏకాదశి పరమాత్మ దివ్య దర్శనము.
ఒక్కరికన్నా భార్య భర్తలిద్దరూ కలిసి ఏకాదశి వ్రతం ఆచరిస్తే అధిక ఫలము.
Read More

తెల్లని అన్నంతో శివలింగం నిర్మించి పూజలు చేస్తే..?

తెల్లని అన్నంతో శివలింగం నిర్మించి పూజలు చేస్తే..?
1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు.
2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.
3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.
- ఉష్ణ సంబంధిత వ్యాధులు ఉంటే ఆదివారం చేయండి
- శీత సంబంధిత వ్యాధులు ఉంటే సోమవారం చేయండి
- రక్తానికి, రక్తపోటుకు సంబంధించిన వ్యాధులు ఉంటే మంగళవారం చేయండి.
- బుద్ధికి, నరాలకు సంబంధించిన వ్యాధులు ఉంటే బుధవారం చేయండి.
- అన్ని రకాల ఉదర సంబంధ వ్యాధులు ఉంటే గురువారం చేయండి.
- మూత్రకోశ రోగాలు, మూత్రపిండాల సమస్య, డయాలసిస్, మూత్రపిండాల్లో రాళ్లు తదితరాలు ఉంటే శనివారం రోజు సాయంత్రం చేయండి.
- ఎముకల సమస్యలు, వెన్ను నొప్పి, నడుంనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు తదితరాలు ఉంటే శనివారం రోజు సాయంత్రం చేయండి.
- మనసుకు, చిత్తానికి శాంతి కలిగేందుకు, శాంతి లభించేందుకు బుధవారం రోజు చేయండి.
- మంచి జ్ఞాపకశక్తి పొందేందుకు పుణ్యక్షేత్రాల్లో దర్శనం ముక్తి పొందేందుకు శనివారం రోజు చేయండి. చాలా మంచి జరుగుతుంది.
4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.
5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.
6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.
7. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది.
Read More

పద్మ పురాణం. -

నామ చింతామణిః కృష్ణ శ్చైతన్యరస విగ్రహః 

పూర్ణః శుద్ధోః నిత్యముక్తో భిన్నత్వా న్నామనామినోః 

భగవన్నామానికి , భగవంతునికి బేధం లేదు. భగవంతుడు ఎలా పరిపూర్ణతతోను , స్వఛ్ఛతతోను , నిత్యత్వంతోను కూడి వుంటాడో, అలా ఆయన నామం కూడా సర్వ సంపూర్ణమైనది. అది కేవలం భౌతిక ధ్వని కాదు. భౌతిక కాలుష్యం దానికి అంటదు.

-పద్మ పురాణం.
Read More

లక్ష్మీ స్థానాలు

లక్ష్మీ స్థానాలు 

* గురు భక్తి, దేవభక్తి, మాతాపితృభక్తి కలవారిలో లక్ష్మీకటాక్షం ఉంటుంది.

* అతినిద్రలేని వారిలో, ఉత్సాహం, చురుకుదనం ఉన్నవారిలో లక్ష్మీ కళ ఉంటుంది.

*శుచి, అతిధి పూజ , ఉల్లాసం ఉన్న ఇంట లక్ష్మీదేవి నివాసం.

* ముగ్గు, పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు, పాలు లక్ష్మీ స్థానాలు.

* దీపం, ధూపం, మంగళద్రవ్యాలు ఆ తల్లికి నివాసాలు.

* పాత్రశుద్ధి, శుభ్రవస్త్రధారణ కలిగిన ఇల్లు అమ్మవారి చోటు.

* బుద్ధి, ధైర్యం, నీతి, శ్రద్ధ, గౌరవించే స్వభావం, క్షమ, శాంతి - లక్ష్మిని పెంచే శక్తులు

* సంతృప్తి లక్ష్మికి ప్రధాన నివాసం.

( - మహాభారత ఆధారం)Read More

జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు


జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాల... 
జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు


జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. మరికొందరు చెట్లని పెంచడం లో వాటిని కాపాడడం లో ఎంతో ఆసక్తి ని చూపుతుంటారు, తెలిసో తెలియకో వారు, వారి నక్షత్రాలకి సంబందించిన చెట్లని పెంచడం వలన, ఆరోగ్య, ఆర్దిక మరియు ఎన్నో అంశాలను చక్కగా ఆనందిస్తుంటారు. దీన్ని తెలుసుకొని వారికి సంబందించిన వృక్షాల/చెట్లు ను పెంచడం ద్వారా, వృక్షాలు/చెట్లలో దాగిన గొప్ప శక్తుల వలన , ఆరోగ్య, ఆర్దిక పరిస్థితులను మెరుగు పరుచుకోవడమే కాకుండా ,అనుకోని సమస్యల నుండి బయటపడడానికి ఎంతో ఉపకరిస్తాయి . మరియు ఇతరులకు వారికి సంబందించిన వృక్షాలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా, వారు అబివృద్ది చెందడమే గాక పర్యావరణాన్ని కూడా ఎంతో మేలుచేసిన వారవుతారు.

భారతీయ సంస్కృతి లో పూజించడానికి అర్హతగలిగినవేన్నో ఉన్నాయి. ప్రతి సంస్కృతీ లోను వారి నమ్మకాలని బట్టి వాటిని ఆచరిస్తుంటారు . వాటిలో ముఖ్యమైనవి చెట్లు. చెట్ల వలన ఉపయోగాలని ప్రత్యేకం గా వివరించాల్సిన అవసరం లేదు. పర్యావరణ రక్షణ లో ఇవి ఎంతో కీలకమైనవి, ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు, పర్యావరణపరిరక్షణవేత్తలు స్పష్టం గా ధృవీకరించారు. మనం పుట్టినప్పుడు , గ్రహాలూ, నక్షత్రాలు, రాశులు వాటి మహార్దశల, దశల ప్రభావం వలన ఆయా కర్మలను మనం మంచి చెడ్డల రూపం లో అనుభవిస్తుంటాం. మనకి కేవలం మంచి మటుకే జరిగితే ఇవన్ని పెద్దగా పట్టించుకోమేమో , అదే మనకి ఏదైనా తట్టుకోలేని, పరిష్కరించుకోలేని, భరించలేని సమస్యలు వస్తే వాటి నుండి బయటపడడానికి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఎన్నో విధానాలను, మార్గాలను వెతుక్కొంటాం. వాటిని అనుసరించే విధానం లో ఆర్దిక విషయాలతో ముడిపడినదైతే అందరికి అనుసరించడానికి కొంచం కష్టతరమనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో మన పరిధి లో ఉన్నది మనకే కాక, భూమి కి పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేయగలిగినటువంటి పరిష్కార మార్గమే, జ్యోతిష్యశాస్త్రాన్ని అనుసరించి నక్షత్ర చెట్లని పెంచడం.

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు తెలుసుకుందాం :

అశ్వని నక్షత్రం - వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటి గా వ్యవహరించడం, సమయాన్ని వృదా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.

భరణి నక్షత్రం - వారు ఉసిరి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యము , పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువ గా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది

కృత్తిక నక్షత్రం - వారు అత్తి/మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు, అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

రోహిణి నక్షత్రం - వారు నేరేడు చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం , సత్ప్రవర్తన ఎక్కువ గా కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది

మృగశిర నక్షత్రం - వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

ఆరుద్ర నక్షత్రం - వారు చింత చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు, అంతే కాకుండా విషజంతువుల బాధ కుడా వీరికి కలగదు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది

పునర్వసు నక్షత్రం - వారు వెదురు లేదా గన్నేరు చెట్టు ను పెంచడం , మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తుల కి సంబందించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుండి, మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యం గా పాల కి లోటు ఉండదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా , చక్కటి చాకచక్యం తో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

పుష్యమి నక్షత్రం - వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం, పూజించడం వలన నరాల సంబంధిత బాధలు నుండి విముక్తి పొందుతారు. అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది. రోగ, రుణ భాధల నుండి విముక్తి లభిస్తుంది . స్త్రీలు సంతానవతులవుతారు.

ఆశ్లేష నక్షత్రం - వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం , పూజించడం వల్ల శ్వేతకుష్ఠు మరియు చర్మ సంబంధిత వ్యాదుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందు చూపు తో వ్యవహరించి జీవితం లో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైన తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

మఖ నక్షత్రం - వారు మర్రి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాదుల నుండి రక్షింపబడతారు. అలాగే భార్య భర్తలు ఎంతో అన్యోన్యం గా ఉండడానికి, తల్లితండ్రులకు, సంతానానికి కూడా మేలు జరుగుతుంది. జీవితం లో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి

పుబ్బ నక్షత్రం - వారు మోదుగ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు .ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తర నక్షత్రం – వారు జువ్వి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

హస్త నక్షత్రం - వారు సన్నజాజి , కుంకుడు చెట్లను పెంచడం, పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి . దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

చిత్త నక్షత్రం - వారు మారేడు లేదా తాళ చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా పేగులు, అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు. ఎవరిని నొప్పించకుండా వారి తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

స్వాతి నక్షత్రం - వారు మద్ది చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయట పడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. అన్ని రకములైన విద్యలలోను రాణిస్తారు, ఆత్మవిశ్వాసం అధికం గా ఉంటుంది. భావోద్వేగాలు అధికం గా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

విశాఖ నక్షత్రం - వారు వెలగ , మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణసంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

అనురాధ నక్షత్రం - వారు పొగడ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. పదిమంది లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

జ్యేష్ఠ నక్షత్రం - వారు విష్టి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు భాద్యతలు సమర్దవంతం గా మొయగలగడానికి. ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.

మూల నక్షత్రం - వారు వేగి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా పళ్ళ కి సంబంధించిన , మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణ లో ఉంటుంది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము, ఔన్నత్యం కలగడానికి, సంతానం వల్ల జీవితం లో ఆనందాన్ని ఆనందం పొందడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాషాడ నక్షత్రం - వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం, పూజించడం ద్వారా కీళ్ళు, సెగగడ్డలు , వాతపు నొప్పులు మరియు జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ది . వినయవిదేతలు కలగడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాషాడ నక్షత్రం - వారు పనస చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరి చేరవు. అలాగే ఆర్దికం గా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. భూముల కి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అబివృద్ది లోకి రావడానికి ఉపయోగపడుతుంది.

శ్రవణం నక్షత్రం - వారు జిల్లేడు చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ధనపరమైన సమస్యలు తొలగుతాయి న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్రం - వారు జమ్మి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మెదడు కి సంబంధించిన సమస్యలు రావు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాబివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

శతభిషం నక్షత్రం - వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టు ను పెంచడం ద్వారా శరీర పెరుగుదల కి సంబంధిచిన , మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం , చక్కటి ఉద్యోగం కొరకు, జీవితం లో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాభాద్ర నక్షత్రం - వారు మామిడి చెట్టు ని పెంచడం ద్వారా కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితి ని పొందడానికి . కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాల లో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాల లో రాణించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రం - వారు వేప చెట్టు ని పెంచడం ద్వారా శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యల ను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందం గా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

రేవతి నక్షత్రం - వారు విప్ప చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితం లో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.
Read More

లలితా సహస్రం ఒకవైపు అమ్మవారి రూపాన్ని వర్ణిస్తున్నది. ఎన్నో మహిమల్ని, మంత్రాల్ని చెప్తూన్నది.

లలితా సహస్రం ఒకవైపు అమ్మవారి రూపాన్ని వర్ణిస్తున్నది. ఎన్నో మహిమల్ని, మంత్రాల్ని చెప్తూన్నది. ఇంకోవైపు ఆలోచించడానికి కావలసిన Material అంతా లలితాసహస్రంలో వున్నది. ఎలా అంటే లలితా సహస్రం దగ్గరపెట్టుకొని కొన్ని పుస్తకాలు తయారుచేయచ్చు. ఎలా అంటే లలితా సహస్రంలో ఉపనిషత్తత్త్వము, అని పట్టుకుంటే బోలెడంత వేదాంతం అందులోనుంచి మనకు వస్తున్నది. ఎక్కడెక్కడ అంటే "సర్వాంతర్యామినీ సతీ; సర్వోపనిషదుద్ఘుష్ఠా శాంత్యతీత కళాత్మికా;" అన్ని ఉపనిషత్తులు నీ గురించే చాటాయమ్మా అన్నారిక్కడ. "స్వాత్మానందల వీభూత బ్రహ్మాద్యానంద సంతతిః - తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పిన ఆనంద మీమాంస అంతా ఒక్క నామంలో పెట్టారు. అఖండమైన ఆత్మానందం ముందు బ్రహ్మలోకాది ఆనందాలు కూడా అల్పములే అని చెప్పారు అంటే అఖండమైన సచ్చిదానంద స్వరూపమే అమ్మ.
అమ్మ అంటే ఒక దేవత, రాక్షసుడిని సంహరించినటువంటి రూపము, మ్రొక్కితే కాపాడుతుంది అనేటటువంటి సామాన్య భావం నుంచి ఎటువంటి భావనలోకి వెళ్తున్నాము అంటే ఉపనిషత్ప్రతిపాద్యమైన పరతత్త్వమే. అందుకే ఒక్క లలితమ్మ ఆరాధన మనల్ని ఆరాధన స్థాయినుంచి జ్ఞాన స్థాయికి తీసుకువెళుతుంది. ఆ కారణం చేతనే ఉపనిషత్తత్త్వ ప్రతిష్ఠాత అయిన శంకర భగవత్పాదుల వారు ఈ విద్యను అంగీకరించారు. అన్ని తంత్ర శాస్త్రములలోను ఈ విద్యనే శంకరులు ఎందుకు తీసుకున్నారు? అంటే ఇది ఒక్కటే నిన్ను బ్రహ్మవిద్యకు తీసుకువెళుతుంది అని. అందుకు "ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా" అసలు తత్త్వం వచ్చాక ఏముంటుంది? అసలు ఆవిడ అదే. "నిర్మలా నిర్లేపా నిత్యా నిరాకారా నిరాకులా" - ఆ చెప్పేటప్పుడు భావాలు ఆలోచిస్తుంటే మనస్సు ఒక తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతుంది. అందుకే ఉపనిషత్తత్త్వ ప్రతిపాద్యమైన తత్త్వం అది. "శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికా; సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా; నిజాజ్ఞా రూపనిగమా " - మూడు చెప్పారిక్కడ. మొత్తం మన శాస్త్రములన్నీ మూడే మూడు. నిగమము (వేదం); ఆగమము (మంత్రశాస్త్రం); ఈ రెండిటినీ కలబోసి మన జీవితంలో మలచి చూపించినవి మరో రెండున్నాయి. పురాణములు, స్మృతులు. ఎందుకంటే మన హిందువుల ధర్మ గ్రంథాలేమిటో మనకు తెలియవు. చాలామంది అనుకుంటూంటారు అందరికీ ఒక పుస్తకం ఉంది కదా! మనకీ ఒక పుస్తకం వుంటుందేమో అని. పుస్తకాల మీద ఆధారపడ్డ మతం కాదు మనది. ఋషుల పరంపరమీద ఆవిర్భవించిన మతం మనది. ఎన్ని పుస్తకాలు Ban చేసినా హిందూధర్మం Ban కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.Read More

ఫలించిన వరుణయాగాలు. రాష్ట్రవ్యాప్తంగా నేటి తెల్లవారు జాము నుండి కురుస్తున్న వర్షాలు..

ఫలించిన వరుణయాగాలు. రాష్ట్రవ్యాప్తంగా నేటి తెల్లవారు జాము నుండి కురుస్తున్న వర్షాలు..Read More

యజ్ఞోపవీతం గురించి ప్రస్తావన వేదాలలో లేదని, తరువాతి కాలాలలో వచ్చిందని ఒకచోట చదివాను. అది నిజమేనా?

యజ్ఞోపవీతం గురించి ప్రస్తావన వేదాలలో లేదని, తరువాతి కాలాలలో వచ్చిందని ఒకచోట చదివాను. అది నిజమేనా?
వేద సూక్తాలలో చెప్పిన వాటిని ఆధారం చేసుకొని శిక్ష, వ్యాకరణ, ఛంద, నిర్క్త, జ్యోతిష, కల్పాలు అనే షడంగాలు ఆవిర్భవించాయి. అందులో "కల్పం"లో చాలా విషయాలు చెప్పబడ్డాయి. వాటిని ఆధారం చేసుకొని భారతీయ ధర్మాలు ఆవిర్భవించాయి.
అయినా వేదాలలో కూడా - "పుష్టాయ ఉపవీతినే నమః" అని ఒకచోట, "యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్" అని మరొకచోట ఇలా మంత్రాలు కనిపిస్తాయి. సమగ్ర పరిశీలన లేకుండా వ్రాసిన వ్రాతల వల్ల మన ఆచారవ్యవహారాల పట్ల అవగాహన కోల్పోతున్నాం.
వేదాలు మూలంగా విస్తరించిన సంస్కృతిలో ఎన్నో ఉత్తమాంశాలను మహాత్ములు ఆవిష్కరించి నిబద్ధం చేస్తారు. అవి ’వేదాల్లో లేవు’ అని అరకొర అవగాహనతో అంటూ ఉంటే చివరికి ఏమీ మిగలని స్థితి వస్తుంది.Read More

శ్రీమచ్ఛంకరాచార్య కృత గుర్వష్టకమ్

౧. శరీరం సురూపం తథా వా కళత్రం
యశశ్చారు చిత్రం చనం మేరు తుల్యమ్
మనశ్చేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే
తతః కిం? తతః కిం? తతః కిం? తతః కిమ్?

౨. కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం బాంధవాః సర్వమేతద్ధి జాతమ్
మనశేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే
తతః కిం? తతః కిం? తతః కిం? తతః కిమ్?

౩. షడంగాది వేదో ముఖే శాస్త్రవిద్యా
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి
మనశేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే
తతః కిం? తతః కిం? తతః కిం? తతః కిమ్?

౪. విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచారవృత్తేషు మత్తో న చాన్యః
మనశేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే
తతః కిం? తతః కిం? తతః కిం? తతః కిమ్?

౫. క్షమామండలే భూపభూపాల వృందైః
సదా సేవితం యస్య పాదారవిందమ్
మనశేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే
తతః కిం? తతః కిం? తతః కిం? తతః కిమ్?

౬. యశో మే గతిం దిక్షు దాన ప్రతాపా
జ్జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్
మనశేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే
తతః కిం? తతః కిం? తతః కిం? తతః కిమ్?

౭. న భోగే న యోగే న వా వాజిరాజౌ
న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్
మనశేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే
తతః కిం? తతః కిం? తతః కిం? తతః కిమ్?

౮. అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం? తతః కిం? తతః కిం? తతః కిం?

౯. గురోరష్టకం యః పఠేత్పుణ్య దేహీ
యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ
లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మసంజ్ఞం
గురోరుక్త వాక్యే మనో యస్య లగ్నమ్!!

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత గుర్వష్టకమ్ సంపూర్ణమ్
Read More

శాస్త్రములేవి అంటే అవి పధ్నాలుగు ఉన్నాయి అని చెప్పబడింది

శాస్త్రములేవి అంటే అవి పధ్నాలుగు ఉన్నాయి అని చెప్పబడింది. ఈ పధ్నాలుగింటినీ ధర్మస్థానములు అంటారు
వేదములు - 4
1)ఋగ్వేదము 2) యజుర్వేదము 3)సామవేదము 4)అథర్వవేదము
వేదాంగములు 6
1)శిక్ష 2)కల్పము 3)జ్యోతిషము 4)వ్యాకరణము 5)నిరుక్తము 6)ఛందస్సు
ఇతరశాస్త్రములు
1)పురాణాములు 2) న్యాయము 3) మీమాంస 4) ధర్మ శాస్త్రములు
మొత్తం 14

సనాతన ధర్మంలో చరించే వారెవరైనా వీనిని తెలుసుకొని వాటికణుగుణంగా చరించవలసి ఉంటుంది. ఇవే ప్రమాణములు.
Read More

భోజనం విషయంలో ఆయుర్వేదం ఏం చెపుతోంది?

భోజనం విషయంలో ఆయుర్వేదం ఏం చెపుతోంది?

ఆయుర్వేదం ప్రకారం భోజనం మూడువిధాలుగా తీసుకోవాలని నిర్దేశిస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణ సంబంధ బాధలు లేకుండా ఉండాలంటే మూడు ముఖ్యమయిన నియమాలను పాటించాలని ఆయుర్వేదం చెపుతుంది. 

వాటిలో మొదటిది హితభుక్త.... శరీరానికి మేలు చేసే ఆహారం సుళువుగా జీర్ణమయ్యేదానిని హితభుక్తగా నిర్దేశించింది.

మితభుక్త... అవసరం మేరకు తినడం, అధికంగా తినకపోవడం, ఎక్కువసార్లు తినకపోవడం, సమయపాలన, ఎక్కువ పదార్థాలు తినకపోవడాన్ని మితభుక్త.

ఋతుభుక్త... ఆయా ఋతువుల్లో లభ్యమయ్యే ఆహారం తప్పనిసరిగా తినడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి ప్రసాదించే ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం - ఋతుభుక్తగా నిర్దేశించారు. ఈ ప్రకారంగా భోజనం చేస్తుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు
Read More

ఆషాడమాసం

ఆషాడమాసం 

శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్నా ... ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్యఫలాలను ప్రసరించే మాసం "ఆషాడమాసం" చాంద్రమానం ప్రకారం "ఆషాడమాసం" నాలుగవ నెల. ఈ మసంలోని పూర్ణిమనాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలోగానీ,ఉత్తరాషాఢ నక్షత్రం సమీపంలోగానీ సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి "ఆషాఢ మాసం" అనే పేరు ఏర్పడింది.

రోజూ కాకపోయినా ఆషాఢ మాసంలో శుక్లపక్ష షష్టినాడు శ్రీసుబ్రహ్మణ్యసామి వారిని పూజించి కేవలం నీటిని మాత్రమే స్వీకరించి కఠిన ఉపవాసం ఉండి మరునాడు స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయని చెప్పబడుతుంది.

ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢ మాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి.ఆషాఢంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలువుతుంది.

కాగా ఆషాఢమాసం అనగానే గుర్తుకువచ్చే విషయం వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే విషయం. అంటే పెళ్ళయిన తొలి ఆషాఢ మాసంలో అతాకోడళ్ళూ ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్ధం. కాని సామాజికంగ ,చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయనిపిస్తుంది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసుంటే గర్భం ధరించి బిడ్డ పుట్టేవరకు చైత్ర,వైశాఖ మాసం వస్తుంది. ఎండాకాలం ప్రారంభం. ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు.

ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్పబడుతూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు, పుణ్యదినాలు ఉన్నాయి.

శుక్లపక్ష ఏకాదశి : తొలి ఏకాదశి

దీనికే ప్రథమ ఏకాదశి అని శయన ఏకాదశి అని కూ పేరు. శ్రీ మహావిష్ణువు ఇ దినం ఒదలుకుని నాలుగునెలలపాటు పాల కడలిలో శేష శయ్యపై శయనించి యోగనిద్రలో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణూవు పూజించాలి.మరునాడు ద్వాదశినాడు తిరిగి శ్రీమహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదములు స్వీకరించి అటుపిమ్మట భోజనం చేయవలెను. ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది.

శుక్లపక్ష పూర్ణిమ : వ్యాసపూర్ణిమ/గురుపూర్ణిమ

శ్రీ వేదవ్యాసుల వారి జన్మదినంగా చెపబడుతూ ఉన్న ఈ రోజును వ్యాసుడిని, కృష్ణుడిని ,గురుపరంపరను పూజించాలని శాస్త్ర వచనం.

కృష్ణ పక్ష అమావాస్య : దీప పూజ

ఆషాఢమాసం చివరి రోజు అయిన అమావాస్యనాడు చెక్క మీద అలికి ముగ్గులు పెట్టి దీపపు స్తంభాలను వుంచి వెలిగించి పూలు, లడ్డులు సమర్పించవలెను. సాయంత్రం కూడా దీపం వెలిగించాలి..
Read More

ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశం సుసంపన్నమై ఉంది

ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశం సుసంపన్నమై ఉంది. అందుకు మూలకారణం భగవంతుడు ఈ భూమి పైనే అవతరించి, విశ్వానికి కావలసిన దివ్య సందేశాన్నందించి, మార్గదర్శనం చేయడం. అలా భగవద్దత్తమయినదే ఈ ధర్మం. 

కోట్ల సంవత్సరాలకు పూర్వమే ధర్మం ఇక్కడ పరివ్యాప్తమై ఉంది. ఇది ఏనాడు పుట్టిందో ఎవ్వరం తెలుపలేం. అందుకే, దీనిని సనాతన ధర్మమని అన్నారు. ఇదే ఆర్య ధర్మమని, ఆర్ష ధర్మమని, వేద ధర్మమని అనేక పేర్లతో వ్యవహారంలో నిలచింది. ఋషుల కాలంలోనే దీనికి హిందూ ధర్మమనే పేరు నిర్ణయమయింది.

ఇటీవలి కాలంలో పుట్టిన మతాలు ప్రపంచమంతటినీ తమ పరం చేసుకోవాలనే దురాలోచనతో, పవిత్రము, సనాతనము అయిన మన హిందూ ధర్మం మీద బురద చల్ల జూస్తున్నాయి. మహర్షులు, శంకర, వివేకానందుల వారసులమైన మనం విధర్మీయుల కుయుక్తులను అర్థం చేసుకోవాలి. వారు మన హిందూ శబ్దం మీద ఎన్నో, ఎన్నెన్నో అపవాదులు అల్లుతున్నారు.

హిందూ అనే పేరు పరాయి వాళ్ళు పెట్టిందని కొందరు, సింధు శబ్దాన్ని పలకడం చేతకాని పరదేశీయులు 'హిందూ' అని పలకడంతో, అదే మనకు స్థిరపడిపొయిందని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు.

ఇలా ఒకటా ..... రెండా! చాపకింద నీరులా తప్పుడు ప్రచారాలు ముమ్మరంగా సాగిపోతున్నాయి.

ఈ తప్పుడు ప్రచారాలను విజ్ఞులు కూడా తిప్పికొట్టలేక సతమతముతున్నారు. మరో పక్క నుండి మన సనాతన సంస్కృతినీ, అది బోధించే ఆచారాలనూ హేళన చేస్తున్నారు. పదే పదే నోటికొచ్చినట్లు విమర్శిస్తూ, నిజాన్ని అబద్ధంగా, అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు. మన చరిత్రలను వక్రీకరించి, మన చారిత్రిక అంశాలపై మనకే అనుమానాలను రేకెత్తిస్తున్నారు.

ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా ....... ?

మన మీద మనకే అనుమానాలు పుట్టాలని! హిందువుకు తన చరిత్ర మీద తనకే అసహ్యం కలగాలని! హిందువు అనుకునేందుకు ప్రతి హిందువు సిగ్గుతో తలదించుకోవాలని!

ఇలా జరిగిననాడు ఈ దేశం నుంచి హిందూ ధర్మాన్ని సమూలంగా పీకి పారేయవచ్చుననే దురాలోచనతో కుట్ర పన్నుతున్నారు.

వంద రాళ్ళు విసిరితే, ఏదో ఒకటైనా లక్ష్యానికి తగిలి, అది రాలి పడుతుందనే వ్యూహంతో, హిందూ వ్యతిరేకులు ముందుకు సాగిపోతున్నారు. పదే.. పదే.. ఈ హిందూ ధర్మం పై దుమ్మెత్తి పోస్తూ, విమర్శిస్తూంటే ఏదో ఓ రోజు హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయవచ్చుననే ఆశతో ముప్పేట దాడులను ప్రారంభించేశారు.

ఈ దాడిలో హిందూ సమాజం ఇప్పటికే చాలా దెబ్బతిని తీవ్రంగా నష్ట పోయింది. దీనిని ఇలాగే కొనసాగిస్తామా! లేక, వాటిని తిప్పి కొట్టి మన ధర్మాన్ని నిలబెట్టుకుంటామా? ఇదే పెద్ద ప్రశ్న!

అసలింతకీ మనపై ఇన్ని దాడులు జరగడానికి మూలకారణం తెలుసా ......? హిందుత్వం అంటే తెలుసా......? నువ్వెలా హిందువయ్యావు ....? 'హిందూ' శబ్దానికి అర్థమేమిటి? హిందూ ఆచారాల అంతరార్థమేమిటి? - అని ప్రశ్నిస్తే, సూటిగా సమాధానం చెప్పలేక పోవడం.

ఏదో ....... పెద్దలు చెప్పారు, మేం పాటిస్తున్నాం అనడమే వినబడుతోంది. పరమ పావనమైన హిందూ ధర్మంలో పుట్టి, దీనిని ఆచరిస్తున్న వారిలో చాలా మందికి దీనిపట్ల ప్రాథమిక అవగాహన లేకుండా ఏదో హిందువుగా బతికేస్తున్న వారి సంఖ్యే చా......లా ఎక్కువ. అందుకే, ఈ ధర్మానికి తూట్లు పొడవడానికి సిద్ధంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి....... దీనికి పరిష్కారం ఏమిటి?
Read More

మహిమాన్వితమైన లక్ష్మీస్తుతి

శ్రీర్లక్ష్మీః కల్యాణీ కమలా కమలాలయా పద్మా 
మామకచేతస్సద్మని హృత్పద్మే వసతు విష్ణునా సాకం 
సచ్చిత్సుఖత్రయీమూర్తిః సర్వ పుణ్య ఫలాత్మికా
సర్వేశ మహిషీ మహ్యం ఇందిరేష్టం ప్రయచ్ఛతు 
విద్యావేదాంత సిద్ధాంత వివేచనవిచారజా
విష్ణుస్వరూపిణీ మహ్యం ఇందిరేష్టం ప్రయచ్ఛతు

కాంతి ,శోభ, ఐశ్వర్యాల స్వరూపిణీ, కల్యాణి, కమలాదేవి, పద్మాలను నివాసంగా చేసుకున్న పద్మాదేవి నా హృదయ భవనంలో (పద్మంలో) విష్ణు సహితంగా నివసించుగాక!

సత్యఙ్ఞాన ఆనందాలు కలిసిన వేదమూర్తి, సర్వపుణ్యఫల స్వరూపురాలు, సర్వేశ్వరుడైన నారయణుని పట్టపురాణి ఇందిరాదేవి నా ఇష్టమును నెరవేర్చుగాక!

విద్య, వేదాంతము, సిద్ధాంతము మొదలైన వాటి విచారము వలన కలిగే ఙ్ఞాన స్వరూపిణి విష్ణు స్వరూపిణి ఇందిరాదేవి నా ఇష్టమును నెరవేర్చుగాక!

- మహిమాన్వితమైన లక్ష్మీస్తుతి ఇది!
Read More

శ్రీశైల భ్రమరాంబ:

శ్రీశైల భ్రమరాంబ:

ఒకానొకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. బుద్ధి ఎలా ఉంటుందంటే సృష్టికర్తయైన బ్రహ్మగారిని మేము మోహపెట్టగలము అనుకుంటారు. ఆయనచే తప్పటడుగు వేయించాము అని సంతోషపడిపోతూ వుంటారు. ఆయన బ్రహ్మగారి గురించి ఉగ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి? అని అడిగాడు. అస్త్రశస్త్రములచేత నేను మరణించకూడదు అని కోరుకున్నాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. వెంటనే స్వర్గలోకానికి వెళ్ళి దేవతలందరినీ తరిమేశాడు. గోవులను సంహారం చేసేశాడు. బ్రాహ్మణులెవ్వరూ వేదం చదవకూడదని, తనకే హవిస్సులివ్వాలని అన్నాడు. దేవాలయాలన్నింటా నావే మూర్తులు అన్నాడు. ధర్మచక్రం తిరగడంలో అవ్యవస్థ ఏర్పడకూడదు. దేవతలు మర్త్య లోకాన్ని అనుగ్రహించాలి. అలా జరగాలంటే మనము ఒక యజ్ఞమో యాగమో చేసి దేవతలకు హవిస్సు ఇవ్వాలి. అది తీసుకొని వారు అనుగ్రహించి ప్రత్యుపకారంగా వర్షం కురిపిస్తారు. దానివల్ల మనకు పాడి, పంట అన్నీ బాగుంటాయి. ధర్మ చక్రం తిరగడంలో వైక్లబ్యం రాక్షసుల వల్ల వస్తుంది. రాక్షసుడు దేవతలకు హవిస్సు లేకుండా చేసి ఈ ధర్మచక్రం తిరగడాన్నిఆపాడు. దేవతలందరూ బ్రహ్మగారి వద్దకు వెళ్ళారు. బ్రహ్మగారు అన్నారు - "ఇది నావల్ల అయ్యే పని కాదు. అస్త్రశస్త్ర ప్రయోగము లేకుండా చంపాలంటే, మిమ్మల్ని అనుగ్రహించాలంటే హిమాలయాలకు వెళ్ళి కన్నతల్లి, కరుణామయి జగదంబను ప్రార్థన చేయండి" అని చెప్పారు. అది తపోభూమి. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే ఉత్తరక్షణం ఫలిస్తుంది. వాళ్ళందరూ అక్కడ చేరి ప్రార్థన చేశారు. జగదంబ వాణి వినపడింది - "మీ ఆర్తి నాకు తెలుసు. వాడిని ఎలా చంపాలో నాకు తెలుసు" అని. ఇద్దరిమధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. దేవతలందరూ అమ్మవారి వైపు నిలబడ్డారు. ఎన్ని అస్త్రాలు, శస్త్రాలు వేసినా వాడు మరణించలేదు. అప్పుడు అమ్మవారు భ్రమర రూపాన్ని పొందింది. దేవతలందరూ కూడా భ్రమరాలుగా మారారు. భ్రమరీ రూపంతో వెళ్ళి కాళ్ళతో, తొండంతో, హృదయాన్ని ఛేదించి ఆయువుపట్లని త్రుంచేసింది. దానితో అరుణాసురుడు మరణించాడు. దానితో దేవతలు పరవశించి స్తోత్రం చేశారు. అమ్మవారు అరుణాసుర సంహారం చేసేశాను. మీరు ఇక వెళ్ళి క్షేమంగా ఉండండి అన్నది. దేవతలు అమ్మా! నువ్వు ఒక ఉపకారం చేయాలి. నువ్వు వెళ్ళిపోకూడదు భూమిమీదనుంచి. అవతారానికి ప్రయోజనం అయిపోయిందని వెళ్ళిపోతే మేము మళ్ళీ మిమ్మల్ని కావాలనుకున్నప్పుడు చూసి ప్రార్థన చేయడానికి, పూజ చేసుకోవడానికి సామాన్యుడికి అందవు. అందుకని ఈ భూమండలంమీద ఎక్కడ ఉందామని నువ్వు అనుకుంటున్నావో అక్కడికి వచ్చి వెలసి ఉండవలసినది. అని కోరారు. భ్రమరాంబా దేవికి ఒక లక్షణం ఉంది. అజ్ఞానం అనే తెర ఎత్తడం దగ్గరనుంచి యే పనైనా జటిలమైపోయి జరగనప్పుడు జరిపించగలిగిన శక్తిగా మారి అనుగ్రహిస్తుంది. పరమశివుడు మల్లికార్జున అన్న పేరుతో జ్యోతిర్లింగంగా ఎక్కడ వెలిశాడో అక్కడికి వచ్చి ఈ భ్రామరీ రూప అలంకారాన్ని పొందుతాను. రాక్షససంహారం చేసి ఉపకారం చేశానన్నది నిజమూర్తిగా ఉంటుంది. కానీ పరమశివుని విడిచి ఉండలేని దాన్ని కాబట్టి అర్థనారీశ్వర మూర్తిగా వెలిసి ఉంటానని చెప్పింది. అందుకు మూడు రూపాలతో ఉన్నది. ఇప్పటికీ మల్లికార్జున దేవాలయం ప్రక్కకి వెళితే ఉత్తరం వైపుకు వెళితే తూర్పుగా చూస్తూ అర్థనారీశ్వర దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో శివుియొక్క వామార్థ భాగంలో చేరింది భ్రమరాంబా దేవి. నిజమూర్తిని చూడలేము. ఒక్క అర్చకుడు మాత్రమే చూస్తాడు. శక్తి క్షేత్రాలలో 365 రోజులు అభిషేకం చేస్తారు. అలంకారం చేసి తలుపు తీస్తారు. అలంకారం చేస్తే భ్రమర రూపాన్ని పొందుతుంది. భ్రమరాంబా రూపంలో ఉన్న గొప్పతనం యేమిటంటే బొట్టు స్ఫుటంగా కనపడుతుంది. అసల మూర్తిని ఒకే ఒక్కచోట చూడవచ్చు - అది భ్రమరాంబ దేవాలయానికి ఉన్న గడప మీద ఒక చిన్న గాజుపేటిక ఉంటుంది. అందులో ఉంటుంది. అన్నింటికన్నా ఆశ్చర్యం యేమిటంటే దేవాలయానికి తాళం వేసినా అమ్మవారి వెనక గండుతుమ్మెదల బృందాలు ఎన్నో ఉంటాయిట. అందుకే భ్రామరీనాదం వినపడుతుంది. భ్రమరాంబ దేవాలయం వెనక్కి వెళితే గాడి ఉంటుంది. ఆ గాడి దగ్గర చెవి పెట్టి వింటే భ్రామరీనాదం వస్తుంది. దానిని ఆకాశవణి విజయవాడ, కడప కేంద్రాలు రికార్డు చేసి ప్రసారంచేశాయి. భ్రమరాంబ దేవాలయం మీద ఉన్న శిల్పకళ చూడడానికి ఒకరోజు సరిపోదు. లోపల చూస్తే సంగ్రామ సన్నివేశాల దగ్గరినుంచి నర్తకీమణుల వరకు ఉంటాయి. అక్కడ గోడలమీద సింహాలుంటాయి. వాటి నోటిలో బంతులు లాంటివి ఉంటాయి .అవి త్రిప్పితే తిరుగుతాయి. అవి మళ్ళీ మనకి కంచి మణిమంటపంలో కనపడతాయి.
Read More

నిద్రలో పీడకలలు వస్తే అవి దేనికి సంకేతం?

నిద్రలో పీడకలలు వస్తే అవి దేనికి సంకేతం?
పీడకలలు వస్తే మనసు భయపడింది అని అర్థం. శివాభిషేకం, భస్మధారణ సులభమైన మార్గాలు అంటుంది శాస్త్రం, ధర్మం. నిద్రపోయే సమయంలో 
రామస్కందం హనూమంతం వైనతేయం వృకోదరం!
శయనేయః స్మరేన్నిత్యం దుస్స్వప్నః తస్య నశ్యతి!!
అని స్మరించుకొని నిద్రపోతే ఎటువంటి పీడకలలు రావు. సాయంత్రం 6-9 మొదటియామము - గృహకార్యములు చక్కబెట్టుకునే సమయం, భోజన సమయం. 9-3 వరకు నిద్రించే కాలం. రెండవ యామము 9-12; మూడవయామము 12-తెల్లవారుఝాము 3 వరకు; నాల్గవ యామము 3-6. రెండవయామములో ఏమైనా పీడ కలలు వస్తే అవి వెంటనే సద్యోఫలాన్ని చూపిస్తాయి. అందువల్ల మానసికంగా కలిగే క్లేశము తప్పించుకోవడం కోసం పై శ్లోకం చదువుకోవాలి. పీడకలలు ఎవరికీ చెప్పకూడదు. తెల్లవారు ఝామున లేచి స్నానం చేసుకొని దేవతరాధన చేసుకొని భస్మం ధరించాలి. దానివల్ల అశుభ ఫలాలు రాబోతున్నవి అనుకుంటే వాటియొక్క పరిణామ తీవ్రతలు తగ్గుతాయి.
Read More

జంతూనాం నరజన్మ దుర్లభం అంటే ??

ఓం శ్రీరామ
జయ హనుమాన్

జంతూనాం నరజన్మ దుర్లభం అంటే ప్రాణ కోటిలో మనుష్య జన్మ లభించటం గొప్ప అదృష్టం అని మహనీయులు చెప్తుండగా లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతకాలో తెలియని వారే అనేకులు కనబడుతున్నారు. విజ్ఞుడైన మనుష్యుడు ఇహమున ధర్మ, భోగాలని; పరంలో ముక్తిని సాధించటం కోసం బ్రతుకుతాడు. జన్మ సార్థకం అవడానికి ఏది సాధించాలన్నా ఉత్తమ మార్గం ధర్మాచరణ. అట్టి ధర్మాన్ని ఆచరించటానికి ప్రధాన సాధనం ఈ శరీరమే. అందుకే "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" అని ఋషులచే పేర్కొనబడింది. కాబట్టి ధార్మికుని ప్రథమ కర్తవ్యం అటువంటి ధర్మ సాధనమైన శరీరాన్ని రక్షించుకొనటమే. ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పు కట్టిన కత్తితో యుద్ధం చేయలేడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేవాడు సాధనమైన కత్తికి పదును పెట్టుకోవాలి. ప్రయాణానికి సాధనం వాహనం. ప్రయాణం చేయదల్చుకొన్నవాడు వాహనాన్ని బాగుచేసుకొనాలి. అలాగే ధర్మకార్యం చేయాలన్నా ముక్తిని పొందాలన్నా సాధనమైన శరీరాన్ని అనుకూలంగా సిద్ధం చేసికొనాలి. ఆ లక్ష్యంతో మనకు మహర్షులు అందించిన మార్గమే సదాచారం. సదాచారం వలననే మంచి బుద్ధిని, బుద్ధిననుసరించి నడువగల్గినట్లు శరీరాన్ని దిద్ది తీర్చుకోగల్గుతాము.

ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు తమ అంతిమ దశలో భగవంతుని ప్రార్థిస్తూ తాను మరల పుడితే భారతదేశంలో పుట్టాలని కోరుకున్నాడట. ఇక్కడ పుట్టిన వారికా విలువ తెలియక ఈ పుణ్యభూమిని నిందిస్తున్నారు. ఆ పండితుడు అలా అనుకోవడానికి ప్రధానకారణం ఇక్కడి ఉత్తమ జీవన విధానం. సదాచార పూర్ణమైన జీవన విధానం. ఈ భారతీయుల జీవితంలోని ప్రధాన జీవం సదాచారమే అనే సత్యాన్ని గ్రహించిన నాడు వ్యక్తికి గాని, ఈ సమాజానికి గాని ధన్యత చేకూరి తీరుతుంది
Read More

"నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో... తిరుమల శిఖరాలు దిగివచ్చునో... మముగన్న మాయమ్మ అలివేలు మంగ..

"నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో... తిరుమల శిఖరాలు దిగివచ్చునో... మముగన్న మాయమ్మ అలివేలు మంగ.. 

పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ.. స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ..." అంటూ భక్త జనావళి స్వామివారి కరుణ తమమీద ఉండేలా చూడాలని అమ్మవారికి విన్నవించుకోవటం మామూలే..! అయితే ఈ అయ్యవారిని ఏడుకొండలూ ఎక్కి చూడలేకపోతేనేం.. స్వయంభువుగా ప్రత్యక్షమైన చిన్న తిరుపతి అయ్యవారి కరుణ తమమీద ఉంటే చాలదా అన్నట్లుగా పరమ పవిత్రమైన "ద్వారకా తిరుమల"ను పశ్చిమగోదావరి వాసులు దర్శించుకుంటుంటారు.

ఏలూరు పట్టణం నుంచి 42 కిలోమీటర్ల దూరంలోనున్న శేషాద్రి కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు "ద్వారకా తిరుమల"లో కొలువుదీరి ఉన్నారు. స్వయంభువుగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమలపుట్ట నుంచి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చనట్లు పూర్వీకుల కథనం. సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది.. అశేష భక్త జనావళి నీరాజనాలు అందుకుంటోంది.

"తిరుమల" స్వామివారికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్న తిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే చిన్నతిరుపతిలో తీర్చుకునేందుకు మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు, స్థానికులు ప్రగాడంగా నమ్ముతుంటారు. ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసునిగా భావించి సేవిస్తారు. తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను, తలనీలాలను, మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు.
ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు దక్షిణాభిముఖుడై ఉన్నాడట. అందుకనే.. ఈ ఆలయంలో మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి మరో విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామివారి పై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థవిగ్రహంగా ఉంటుంది.

స్థల పురాణం ప్రకారం చూస్తే... ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా భావిస్తున్నారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాద సేవను కోరారట. దాంతో స్వామివారి పాదములను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పై భాగం మాత్రమే దర్శనమిస్తుంది.

అయితే.. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారనీ... అప్పుడు భక్తులందరి విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై.. వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని చెబుతుంటారు.

అందుకే.. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వేంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ.. ఆ తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామపురుషార్ధములు సమకూరుతాయనీ భక్తులు నమ్ముతుంటారు.

పురాణ గాథల ప్రకారం ఆలయ చరిత్రను చూసినట్లయితే... బ్రహ్మపురాణం ఆధారంగా, శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ.. మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారట. ఇందుమతి అజమహారాజును పెళ్లి చేసుకున్నప్పటికీ.. స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు.

తాను మార్గమధ్యలో స్వామివారిని దర్శించుకోకుండా వెళ్లినందుకే ఇలా జరిగిందని భావించిన అజమహారాజు శ్రీవేంకటేశ్వరుని క్షమించమని ప్రార్థిస్తాడు. అంతటితో ఆ అలజడి ఆగిపోయిందట. అత్యంత ప్రాచీన చరిత్రగల ఈ ఆలయం కృతయుగం నుంచి ఉందనేందుకు ఇదో చక్కని నిదర్శనంగా చెప్పవచ్చు.

ఇక.. ద్వారకా తిరుమలలోని స్వామి వారికి అభిషేకం చేయకపోవటం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టుపడినా.. అది స్వామివారి విగ్రహం క్రిందనుండే ఎర్రచీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే.. స్వామివారు స్వయంభువుగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్టించిన కారణంగా అలా చేస్తుంటారు.
ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమల ఆలయాన్ని మైలవరం జమీందారులు కట్టించారట. విమాన మంటపము, గోపురము, ప్రాకారాలను అప్పారావు అనే వ్యక్తి... బంగారు ఆభరణాలు, వెండి వాహనాలను రాణీ చిన్నమ్మరావు స్వామివారికి సమర్పించినట్లు పూర్వీకుల కథనం.

ఈ ఆలయంలో ఐదు అంతస్తులు కలిగిన ప్రధాన రాజగోపురం దక్షిణంవైపుకు వుంటుంది. మిగిలిన మూడు గోపురాలు మూడు దిక్కులా వుంటాయి. నాగర శిల్పి రీతిలో విమానగోపురం తయారైంది. పాతముఖ మండపాన్ని నవీకరించి విస్తరించి, పాలరాతితో సువిశాలంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల చెట్ల పచ్చదనంతో, చల్లని ప్రశాంత వాతావరణంగల ఈ ఆలయ పరిసరాలు సందర్శకులకు పవిత్రానుభూతిని కలిగిస్తాయి.

ఆలయంలోకి ప్రవేశించగానే కళ్యాణ మండపం వస్తుంది. ఈ మండపం దాటి మెట్లు ఎక్క్ ప్రారంభంలోని పాదుకా మండపంలో స్వామివారి పాదాలుంటాయి. శ్రీవారి పాదాలకు నమస్కరించిన తరువాతే భక్తులు పైకి ఎక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు వైపులా దశావతార విగ్రహాలు భక్తుల్ని పరవశింపజేస్తాయి. మెట్లకు తూర్పున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం.. పడమటివైపు పద్మావతీ సదనం, దేవాలయ కార్యాలయం, నిత్య కళ్యాణ మండపాలుంటాయి.

ప్రధాన ద్వారం లోపలి రెండువైపులా.. గర్భగుడికి అభిముఖంగా.. ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం లోపలి పైభాగాన సప్తర్షుల విగ్రహాలు... గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకుని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మండపం, ప్రధాన మందిరంలో ధ్వజస్తంభం వెనుకవైపున ఆంజనేయస్వామి, గరుడస్వామిల చిన్న మందిరాలున్నాయి.

గర్భగుడిలో స్వయంభువు శ్రీ వేంకటేశ్వర స్వామి అర్ధ విగ్రహం, రామానుజులుచే పూర్తిగా ప్రతిష్టింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజను నిర్వహిస్తుంటారు.

ప్రధానాలయానికి తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాలలు.. పడమటివైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం ఐదు అంతస్థులది. గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. పడమరవైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ కట్ట ఉన్నది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి.

ఆలయం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ భక్తులు పిలుస్తుంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు తెప్పోత్సవం జరుపుతారు.

ఆలయ నిర్వాహకులు ఈ దేవస్థానంలో నిత్యాన్నదానం, గోసంరక్షణ పథకాలు ఏర్పాటుచేశారు. వీటికై ఎందరో భక్తులు విరాళాలను సమర్పిస్తూ వుంటారు. శాస్త్ర ప్రకారం గంగ, యమున లాంటి నదులు ఉత్తరదిశవైపు నదీ జన్మస్థానానికి దగ్గరైనకొద్దీ వాటి పవిత్రత పెరుగుతుంది. అలాగే దక్షిణానగల కృష్ణ, గోదావరి నదులు సముద్ర ముఖద్వారానికి దగ్గరైన కొద్దీ వాటి పవిత్రత పెరుగుతుంది. బ్రహ్మపురాణం ప్రకారం కృష్ణ, గోదావరి నదులతో పూదండలా ఆవరించబడిన ఈ పవిత్ర ప్రదేశం చాలా ప్రభావవంతమైనది. అందుకే స్వామివారి కటాక్ష వీక్షణాలకై ఎన్నో ప్రాంతాలనుండి భక్తులు ద్వారకా తిరుమలకు తరలివస్తుంటారు.

ద్వారకా తిరుమలకు చేరుకోవడం ఎలాగంటే...? విజయవాడ-రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, మరియు చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిరోజూ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.

ఇక వసతి విషయానికి వస్తే... పద్మావతి అతిధి గృహం, అండాళ్ అతిధి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టీటీడీ అతిధి గృహంలాంటివి ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే విర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏడుకొండలూ ఎక్కి స్వామివారిని దర్శించుకుని, మొక్కులను తీర్చుకోలేని భక్తులకు ద్వారకా తిరుమల దర్శనం సంతృప్తిని.. తిరుమల వెళ్ళిన అనుభూతిని, ఫలితాన్ని కలుగజేస్తూ భక్తుల నీరాజనాలను అందుకుంటోంది.
Read More

పృథ్వీరాజ్ చౌహాన్(1168-1192 క్రీ.శ )

పృథ్వీరాజ్ చౌహాన్(1168-1192 క్రీ.శ ) రాజపుత్ర
వంశమైన చౌహాన్ వంశానికి చెందిన ప్రముఖ
చక్రవర్తి. ఈయన 12వ శతాబ్దపు రెండవ
అర్ధభాగంలో ఉత్తర భారతదేశాన్ని పాలించాడు.
పృథ్వీరాజు ఢిల్లీని పాలించిన రెండవ చివరి
హిందూ చక్రవర్తి. 11 ఏళ్ల వయసులో 1179లో
సింహాసనాన్ని అధిష్టించిన
పృథ్వీరాజు అజ్మీరు మరియు ఢిల్లీలు జంట
రాజధానులుగా పరిపాలించాడు. ప్రస్తుత రాజస్థాన్
మరియు హర్యానా రాష్ట్రాలలోని
చాలామటుకు ప్రాంతం పృధ్వీరాజు పాలనలో
ఉన్నది.
ఈయన విదేశీయుల దండయాత్రలకు వ్యతిరేకంగా
రాజపుత్రులను సంఘటితం చేశాడు.
Read More

Wednesday, 25 June 2014

జగద్గురువు అంటే...

జగద్గురువు అంటే... 

ఒకసారి శ్రీ జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసిమ్హ భారతీ మహాస్వాములవారు వద్దకు ఒక విదేశస్థుడు వచ్చి ఇలా ప్రశ్నించాడు
" మీరు జగద్గురువునని ఎలా చెప్పగలరు? ప్రపంచంలో హైందవేతురులు ఎందరో ఉన్నారు కదా?"

శ్రీ జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు " ప్రపంచంలోని ప్రతి యొక్కరికి మేము ఆధ్యాత్మిక గురువులమని చెప్పుకోవటానికి కాదు జగద్గురువులనటం. ప్రపంచంలో ఏ మారు మూల ప్రాంతంలో నివసిస్తున్న ఎవరైనా సరే చిత్తశుద్ధితో మా ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని కోరుకుంటే మాకు తెలిసినంత వరకు ఆ మార్గ దర్శనాన్ని అందివ్వల్సిన బాధ్యత మాపై ఉన్నది.

మాకెంతో దూర ప్రదేశంలో నివసిస్తూ కూడా మా యొక్క మార్గదర్శనాన్ని కోరుకునే వ్యక్తి ఉండవచ్చు. మరో వ్యక్తి మఠ ప్రాంగణంలో నివసిస్తున్నా మా సలహాను కోరుకోకపోవచ్చు. మొదటి వ్యక్తికి సహాయమందించటం మా బాధ్యత. రెండవ వ్యక్తికి కాదు. మొదటి వ్యక్తికి గురువు అయితే రెండవ వ్యక్తికి కాదు.

అందువలన ఆ పదం మా బాధ్యతని తెలియచేస్తుంది తప్ప, మార్గదర్శనం కోరని వారిపై అధికారాన్ని కాని, హక్కుని కాని సూచించదు"

పైన రాసిన అపురూప వాక్యములు శ్రీ నోరి రమకృష్ణయ్య గారు రాసిన " శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి అనుగ్రహభాషణ సంగ్రహం అనే అద్భుతమైన పుస్తకంలోని నుండి తీస్కోబడినది.

అయితే...మన గురువుగారు చాలా సార్లు ఈ అంశం గురించి చెప్పి ఉన్నారు.

ఏ మనిషికి అయినా సరే... జీవితంలో ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని కోరుకుంటునప్పుడు ఒక గురువుగారి ఆవశ్యక్త ఎంతో ఉంటుంది...అసలు ఒక గురువు మాత్రమే ఆ దారి లో నడింపించి మనల్ని మొక్షానికి అర్హతని కలిపించగలరు...అయితే...ఎవ్వరైనాసరే...మన జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని గురువు గా భావించుకుంటే....మిగతా మార్గాన్ని అంతా ఆ శంకరులు..అంటే సాక్షాత్తు..ఆ శివుడే మనకి దక్షిణామూర్తి రూపంలో మనల్ని నడిపిస్తాడు......మన అందరికి శంకరులే కదా తొలి గురువు!
Read More

ఒక్క రామనామం నాలుక మీద నర్తిస్తే

ఒక్క రామనామం నాలుక మీద నర్తిస్తే ఆ నామం నర్తించిన కారణం చేత సమస్తపాపములనుండి వినిర్ముక్తుడు కావచ్చు.
పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!!
భగవంతునియొక్క నామము సర్వకాల సర్వావస్థలయందు అవసరమే. ఒకమంత్రం చేయడానికి, అంగన్యాస కరన్యాసాలు, కాళ్ళూ చేతులు కదపకుండా కూర్చొని చేయాలి. అదే ఒక భగవన్నామం చెప్పడానికి యే అవస్థలోనైనా చెప్పవచ్చు.
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ!!
అంటాడు గోపన్న. రామా! నీదివ్యమైన నామాన్ని నా నాలుకమీద నర్తింపచెయ్యి అంటాడు. ఆ ఒక్క నామాన్ని పట్టుకొని భగవన్నామాన్ని సతతం జపించిన కారణం చేత సమస్త పాపములనుండి విడుదలై పరమేశ్వరుణ్ణి చేరగలడు. భగవన్నామము అంతగొప్పది. భగవన్నామాన్ని ఉచ్ఛరించగలిగిన స్థితి ఒక్క మనుష్య ప్రాణికే వుంది
Read More

ద్వాదశజ్యోతిర్లింగములలో సోమనాథ్ ఒకటి

ద్వాదశజ్యోతిర్లింగములలో సోమనాథ్ ఒకటి. దక్ష ప్రజాపతి అశ్వనీ మొదలుగా గల తన 27గురు కన్యల వివాహమును చంద్రునితో జరిపించెను. పత్నులందరిలో కూడ రోహిణి చంద్రునకు మిగుల ప్రియమైనది. మిగిలిన వారందరును అంతటి ప్రేమను పొందలేకపోయిరి. దీనివలన ఇతర స్త్రీలకు మిగుల దుఃఖము కలిగెను. వారందరు తమ తండ్రి శరణుజొచ్చిరి. ఆయనకు తమ దుఃఖమును నివేదించిరి. అదంతయు విని దక్షుడు కూడ దుఃఖభాజనుడయ్యెను. చంద్రుని దగ్గరకు వెళ్ళి భార్యలందరినీ సమానంగా ఏలుకోమని హితవొసగుతాడు. అయినా చంద్రుడు దక్ష వాక్యాన్ని తృణీకరించి రోహిణియందు ఆసక్తి కలవాడవటం వల్ల దక్షుడు చంద్రుని క్షయరోగ పీడితుడై క్షీణింపగలడని శపిస్తాడు. దానితో అన్ని దిశలయందు గొప్ప హాహాకారములు వ్యాపించెను.ఓషధులు ఫలించలేదు. యజ్ఞయాగాదులు నెరవేరనందున దేవతలకు ఆహుతులు లేకుండా పోయాయి. అమరులక్ అమృతం కొరవడింది. వర్షములు కురియక పంటలు నశించి దుర్భిక్షంతో ప్రజలు అకాల మరణం చెందారు. చంద్రకాంతి హీనత వల్ల నష్టపోయిన వశిష్ఠాది మహర్షులు, ఇంద్రాది దేవతలు బ్రహ్మను ప్రార్థించగా ఆయన ఒక ఉపాయము చెప్పాడు.
చంద్రుడు దేవతలతో కూడి ప్రభాసతీర్థమునకు వెళ్ళి అచట మృత్యుంజయ మంత్రము విధిపూర్వకముగ అనుష్ఠానము చేయుచు భగవంతుడగు శివుని ఆరాధించవలెను. తన ఎదుట శివలింగమును స్థాపించుకొని చంద్ర్రుడు నిత్యము తపమాచరించవలెను. అందులకు సంతసించి శివుడు అతనిని క్షయరహితుని చేయును. ఈ విషయమును దేవతలు చంద్రునకు తెలుపగా బ్రహ్మ ఆజ్ఞానుసారము చంద్రుడు అచటకు వెళ్ళి ఆరునెలలు నిరంతరము తపస్సు చేసెను. ఆయన తపస్సు చూసి శంకరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై చంద్రునికి శాపవిమోచనం గావించి ఒక పక్షము కాలము ప్రతిదినము కళ క్షీణించుచుండునని, రెండవ పక్షమున అది మరల నిరంతరము వృద్ధియగునట్లుగా వరమునిచ్చెను. చంద్రుడు భక్తిభావముతో శంకరుని స్తుతించెను. శంకరుడు ప్రసన్నుడై ఆ క్షేత్రమహాత్మ్యమును పెంపొందించుటకు, చంద్రుని యశస్సును విస్తరింపచేయుటకును భగవంతుడగు శంకరుడు అతని పేరుతో సోమేశ్వరుడని పిలువబడెను.
సోమనాథుని పూజించుటవల్ల ఉపాసకులకు క్షయ, కుష్ఠు మొదలగు రోగములు నశించును. ఈ క్షేత్రమున సకల దేవతలు సోమకుండమును స్థాపించిరి. చంద్రకుండము పాపనాశన తీర్థముగ ప్రసిద్ధి చెందెను. ఈ తీర్థమున స్నానమొనరించిన మానవులు సకలపాపములనుండి విముక్తులగుదురు. క్షయ మొదలగు అసాధ్యమైన రోగములతో బాధపడువారు ఈ కుండమున ఆరునెలలు స్నానమాచరించిన రోగములు నశించును. ఈ ఉత్తమ తీర్థమ్ను సేవించువారి కోరికలు సఫలమగును. ఇందులో సంశయములేదు.
చంద్రుడు స్వస్థుడై తన మునుపటి కార్యములను నిర్వహించసాగెను. ఈ గాథను విన్నవాడు, ఇతరులకు వినిపించువాడు తన సంపూర్ణమైన కోరికలను సఫలము చేసుకొనును. సకల పాపములనుండి ముక్తుడగును. సోమనాథుని దర్శించుటకు కఠియవాడ ప్రదేశమున గల ప్రభాస క్షేత్రమునకు వెళ్ళవలెను. ఈ దేవాలయం ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ మునిసిపల్ పరిధిలోని ప్రభాస పట్టణ ప్రాంతంలో వున్నది.
Read More

విశ్వనాధాష్టకం

విశ్వనాధాష్టకం

గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాదిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్ కమల మధ్య గతం పరేశం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం

వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షం

విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే
Read More

Powered By Blogger | Template Created By Lord HTML