గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 18 May 2014

భాషలెన్నిటిలో నైన భావమోకటె వేషములలోన జిక్కని విధమేఱంగు పోషకుండని తలంచుట పొందుగాదు దోషమున్న నేఱంగుము తొలుత వేమ

భాషలెన్నిటిలో నైన భావమోకటె 
వేషములలోన జిక్కని విధమేఱంగు
పోషకుండని తలంచుట పొందుగాదు
దోషమున్న నేఱంగుము తొలుత వేమ

మనలోని భావాన్ని ఎదుటవారికి వ్యక్తపరిచేందుకే భాషలున్నాయి. అలాగే ఆ భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన అందరివాడే ! తను అందరివాడిని అని చెప్పెందుకే ఆ స్వామి అనేక అవతారాలతో మన ముందుకోస్తున్నాడు. అందరినే పోషించే దేవుడు నన్ను కూడా రక్షించడా? అని అనుకోకుడదు. ఎందుకంటే తన తప్పును తెలుసుకోనివాడిని ఆ సర్వేశ్వరుడు. అతడు తన తప్పును గ్రహించే అంతవరకు పట్టించుకోడు. తమ తప్పులను తెల్సుకొని ,ఆ స్వామిని..ఆ పరమాత్మని శరణు వేడుకున్నప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఉన్నచోటుకేవచ్చి మనకు ఆయా సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాడన్నది పలు ఉదాహరణల ద్వారా తెలుస్తోంది. అందుకే ఆ సర్వేశరుని మనసారా ప్రార్థించి , ఆయన కరుణకు పాత్రులము అవుదాము. మన పెద్దలు చెప్పినట్లుగా గాల్లో దీపం పెట్టి ,చేతులు అడ్డం పెట్టకుండా, దేవుడా కాపాడమంటే ఆయన మాత్రం ఏం చెయ్యగలడు. మన ప్రయత్నం అంటూ ఒకటి ఉండాలి కదా. మనలోని ప్రయత్నలోపమనే తప్పును గ్రహించి ఆయన సహాయాన్ని అర్ధించాలి. ఆ స్వామి మనలను తప్పకుండా కరుణిస్తాడు.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML