గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

సూర్యారాధన చేయడం వల్ల భుక్తి ముక్తి లభిస్తాయనడంలో సందేహం లేదు.

సూర్యారాధన చేయడం వల్ల భుక్తి ముక్తి లభిస్తాయనడంలో సందేహం లేదు. అది ఎందరికో స్వానుభవం. భుక్తిముక్తులు రెండూ ఇవ్వగలిగిన శక్తి సూర్యారాధనలో ఉంది. అయితే సూర్యారాధన చేయకపోతే పాపం వస్తుంది. అందులో సందేహమేమీ లేదు. ఇది శాస్త్రం చెప్తున్న విషయం. సూర్యునికి సంబంధించి మనం చేసే కొన్ని అపచారాలు ఎలాంటి దుర్దశలు మనకి ఇస్తాయో శాస్త్రం చెప్తున్నది. సంధ్యలలో నిద్రపోవడం, అనాచారములు పాటించడం, ఇటువంటివన్నీ సూర్య సంబంధమైన అపచారాలు. ఉపాసన చేయకపోతే పోయావు. ఇంకా అపచారాలు చేసి పాపానికి పోతావా అని కూడా మందలిస్తోంది శాస్త్రం మనల్ని. సూర్యుని ఉపాసించిన వాడికి, ఉపాసించని వాడికి ఆయననుంచి వచ్చేశక్తిలో భేదం ఎలా ఉంటుంది? అనేది అర్థమైంది ఒక పాశ్చాత్యుడు చేసిన పరిశోధనవల్ల. ఎందుకంటే పాశ్చాత్యుడు పరిశోధిస్తేనే కానీ తెలుసుకోరు (నమ్మం). శ్రద్ధ ప్రమాణం కాదు అనుభవం కావాలి.

ప్రత్యక్షంగా మనిషికి భక్తి భావం లేకపోయినా కాసిని పువ్వులు ఒక రాగిపాత్రలో వేసి సూర్యుడికి చూపించి దణ్ణంపెట్టి అదే తీక్ష్ణమైన ఉష్ణోగ్రతలో నిలబడి పరీక్షచేసుకుంటే శరీరంలో నార్మల్ గా ఉంది. మనం కాసింత నమస్కరిస్తే మన భక్తికి వందరెట్లు స్పందించే చైతన్యమూర్తి మహానుభావుడు సూర్యభగవానుడు. 

సూర్యభగవానుడు పూర్తిగా కాంతి స్వరూపము. ఆ కాంతి పూర్తిగా ప్రేమ స్వరూపము. కనుక సూర్యుడు అంటే ప్రేమ స్వరూపము. ఆయననుంచి వచ్చే ప్రతి కిరణమూ ప్రేమే. అయితే భగవంతుని విషయంలో ప్రేమ అంటే కారుణ్యం. ప్రేమ స్వరూపుడు అంటే కారుణ్యస్వరూపుడు. "రక్తః సర్వ భవోద్భవః" - రక్తః అనేమాటకి అర్థం చెప్తూ ఎర్రగా ఉన్నవాడు అనే మాత్రమే కాకుండా అనురక్తి(ప్రేమ) కలవాడు అని చెప్పారు. పరమేశ్వరుడే తన తేజస్సు సూర్యునిద్వారా అందిస్తున్నాను అని ప్రకటించుకున్నాడు. "యదాదిత్య గతం తేజః జగత్ భాసయతేఖిలం, యద్ చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజోవిద్దిమామకం " - నా తేజస్సే సూర్యునిద్వారా వస్తుంది అని తెలుసుకో. చంద్రుడు, అగ్ని అని కూడా చెప్పాడు కదా! అంటే ఆ చంద్రుడికి, అగ్నికి తేజస్సు సూర్యుడిద్వారానే వస్తుంది కదా! అందుకు సూర్యునిలో ఉన్న మహాతేజస్సు సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు, నారాయణుడన్న, శివుడన్నా, అమ్మన్నా ఎవరైనా అనండి. అమ్మ అంటే "భానుమండల మధ్యస్థా" అయిపోతుంది. మొత్తానికి సూర్యభగవానుడు సర్వదేవతాత్మకుడు.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML