గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 May 2014

పంచ ముఖ ఆంజనేయ రూపం

ఒక్కొక్క ముఖానికి మూడేసి కళ్ళున్నాయిట. అందులో వానరం ముఖం ఏవం - మొదటి ముఖం వానరముఖం; రెండవది సింహవదనం; మూడవది గరుడ వదనం; నాల్గవది వరాహవదనం; ఐదవది హయగ్రీవ వదనం అంటే అశ్వవదనం. వీటితో గోచరిస్తున్నాడు. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కటున్నాయి. భావన చేసేటప్పుడు నాలుగు దిక్కులలో నాలుగు చూస్తూ ఊర్ధ్వ దిక్కున ఒక వదనం ఉన్నది. ఏ దిక్కులో యే వదనాన్ని ధ్యానించాలి చెప్పుకుంటూ వెళ్ళాలి. ఈ క్రమం అచ్చంగా యే క్రమమయ్యా అంటే సద్యోజాతం ప్రపద్యామి క్రమమే. సద్యోజాతవామదేవఅఘోరతత్పురుషఈశాన ముఖములే ఈ వానర నారసింహ గరుడ వరాయ హయాస్య. పంచముఖ పరమేశ్వర స్వరూపమే పంచముఖ ఆంజనేయ రూపం. అక్కడా ఇక్కడా ఒకటే తత్త్వం. పైగా పంచభూతతత్త్వములు ఈ వదనములలో గోచరిస్తున్నాయి. పంచభూతాలను శాసించే పరమేశ్వర తత్త్వమే పంచముఖాంజనేయం. పంచముఖాంజనేయమ్ సాక్షాత్ సదాశివ స్వరూపంగా తెలుసుకోవాలి. అందుకు రుద్రతేజం సంపూర్ణంగా హనుమంతుడిలో ప్రకటింపబడింది పంచవదన స్వరూపంలోనే. అందుకు పంచముఖాంజనేయ రూపం సంపూర్ణ రుద్రతేజంగా భావన చేయాలి మనం. ఒక్కొక్క వదనములో సద్యోజాతాది లక్షణములు, పంచభూత లక్షణము, పంచప్రాణ లక్షణము, పంచేంద్రియ లక్షణము, పంచతన్మాత్ర లక్షణములు కూడ తెలుసుకోవాలి. పంచతన్మాత్రలతో పంచేంద్రియములతో కూడిన సమస్త విశ్వాన్ని నియమించే ప్రపంచ నాయకుడేవరో ఆయన ఆంజనేయ స్వామి వారు. హనుమంతుడిక్కడ ఒక దూతగా కనపడడం లేదు. సాక్షాత్తు పరమేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు. ఏ ముఖధ్యానం వల్ల యే ఫలితం వస్తుందో వివరిస్తుంది మంత్రశాస్త్రం.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML