గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

మానవ సేవే మాధవ సేవ

మానవ సేవే మాధవ సేవ

ఒకసారి నూరుస్తంభాల శివాలయ మండపం లో పండితులందరూ సమావేశమై వార్షిక పండిత సదస్సు నిర్వహిస్తున్నారు, ఇంతలో ఉన్నట్టు ఉండి పరమేశ్వరుని ఎదురుగానున్న నంది విగ్రహం ముందర పెద్ద పళ్ళెం పడిన శబ్దం వినబడగా, సదస్సునందలి పండితులందరూ ఆశ్చర్యంతో వెలుగొందుతూ అక్కడవారికి ప్రత్యకష్మైనది. దాని పై ఇది నిజమైన భక్తునికే చెందుతుంది అని రాయబడి ఉంది. అంత పండిత సదస్సు అధ్యక్షుడు ముందుగా ఆ పళ్ళెము అందూకొనబోతూండగా ,అది తాకినంతనే మట్టి పళ్ళెముగా మారెనట. అతను చెయి తీయగానే తిరిగి పూర్వప్రకాశం సంతరించుకున్నది. ఆ సదస్సులో పండితులు అందరు ఇలాగే ప్రయత్నించి విఫలమయితిరి.

ఈ విషియం ఆ గ్రామం అంత తెలిసి వారి భక్తిని పరీక్షించదలచి వచ్చి వారందరూ అందే విధముగా విఫలం చెందారు. ఇలాగ ఒక వత్సర కాలం గడిచిన తరువాత కూడా నిజమైన భక్తుడు ఎవరు తారసపడలేదు. 

ఒక రోజు దైవ దర్శనార్ధమై, ఒక వ్యవసాయదారుడు దేవాలయం వద్దకు చేరుకున్నాడు. దేవాలయ ప్రాంగణంలో ఒక భిక్షకుడు శరీరము అంతా వ్రణాలతో పరమ జుగుప్సాకరంగా ఈగల బారి నుండి వానిని కాపాడుకొను ప్రయత్నం చేయుచున్నను ఫలితం లేకుండెనను. ఆ భిక్షకుని బాధను చూసిన వ్యవసాయదారుని హృదయం ద్రవించి ఆ బిచ్చగానిని అసహ్యించుకొనక, తన భుజం పై వేసుకుని చర్మవ్యాధులు వైద్యాలయముకు తీస్కునివెళ్ళి వైద్యం చేయించాడు. తన వద్ద కూడ బెట్టిన దబ్బు అంతా ఆ వైద్యునికి సమప్ర్పించుకుని, ఆ భిక్షకుడిని కూడా వెంటబెట్టుకుని శివదర్శనార్ధమై దేవాలయమునకు వెళ్ళెను. భక్తులు బంగారు పళ్ళెమును పరీక్షించుట చూసి, ఆ వ్యవసాయదారుడు తాను కూడా పరీక్షించుకొవటానికి వెళ్ళాడు. అప్పుడు అతను ఆ పళ్ళెము తాకగానే అది గతంలో కంటే కూడా ఇంకా ధగ ధగ మెరుస్తూ అతని చేతికి వచ్చింది. అక్కడి ప్రజలు ఇది చూసి, అతనిని నిజమైన భక్తునిగా గుర్తించారు. అతని చేత చికిత్స పొందబడిన వ్యక్తి బయటకు వెళ్ళి అంతర్ధానం అయ్యాడు. దీనిని బట్టి ఆ పరమశివుడే ఆ రూపంలో వచ్చినట్లు,ఇది శివలీలగా నిగూఢార్ధంతో భక్తులకు అర్ధం అయ్యింది.

"మానవ సేవే మాధవ సేవ"......మనం అవతలవారికి చేసే సహాయం శుద్ధమైన మనసుతో, నిష్కల్మషంగా చేస్తే దాని ఫలితం ఉంటుంది...అంతేకాని...ఇప్పుడు మనం వాళ్ళకి సహాయం చేసి, ఎదో ఆశిస్తు చేసె సేవకాని, సహాయం కాని వ్యర్ధమే!


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML