గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

దశావతారాలలో బుద్ధావతారం అంటే గౌతమ బుద్ధుడా?

దశావతారాలలో బుద్ధావతారం అంటే గౌతమ బుద్ధుడా? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. దాని గురించి పూజ్య గురుదేవులు శ్రీ సామవేదం గారు "ఋషిపీఠం " పత్రిక 2002 జులై లో ప్రచురింబడ్డ "జిజ్ఞాస అనే
శీర్షికలో ఇచ్చిన సమాధానము మరోసారి గుర్తుచేసుకుందాము...
నమో బౌద్ధ అవతారాయ
దైత్యస్త్రీ మానభంజినే
అచింత్యాశ్వత్థ రూపాయ
రామాయాపన్నివారిణే
అని " శ్రీ మదాపన్నివారకరామస్తొత్రం" లో ఉంది. దీని గురించి తెలుప ప్రార్ధన" అని 
ఒక పాఠకులు అడిగిన ప్రశ్న కి గురుదేవులు ఇలా వర్ణించారు..
దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు " గౌతమ బుద్ధుడు కాదు అని చెప్పుకోవాలి
దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదనే చెప్పుకోవాలి.
ప్రాచీన పురాణ వాఙ్మయాన్ని పరిశీలిస్తే ఈ విషియం స్పష్టమవుతుంది.
త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేకపోతారు.
అప్పుడు ఆ శక్తిని ఉపసమ్హరింపచేయ్యడానికి లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు.
కాని ఆ బుద్ధుడు ,గౌతమ బుద్ధుడు అవతారాలు, రూపాలు వేరు !
సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి ,మోహితులై ,ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు.
దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు.
ఇదే విషియం "ఆపన్నివారక స్తోత్రము " లో ఉంది. "ద్వైత్యస్త్రీమనభంజినే" అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని
భంగం చేసినవాడు అని అర్ధం.
ఇలాగ మన పురాణ్ణాలలో బుద్ధుడు గురించి చెప్పిన విషియము!
పైన వృత్తాంతాన్ని అన్నమయ్య "దశావతార వర్ణనలో" పేర్కొన్నాడు.
'పురసతుల మానములు పొల్లజేసినచేయి.
ఆకాసాన బారేపూరి
అతివలమానముల కాకుసేయువాడు"
ఆకాసాన విహరించే ఊరులు - త్రిపురాలు.
వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు. అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది.
ఆ బుద్ధునికీ గౌతమ బుద్ధునికి సంబంధం లేదు !


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML