గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 May 2014

స్వర్గానికీ, నరకానికీ కూడా అతీతమైన మరొక స్థితి ఉన్నదనే మాట ఇంతవరకు ప్రపంచంలో ఇంకే మతాలకీ తెలియలేదు.

స్వర్గానికీ, నరకానికీ కూడా అతీతమైన మరొక స్థితి ఉన్నదనే మాట ఇంతవరకు ప్రపంచంలో ఇంకే మతాలకీ తెలియలేదు. పరిశీలించి చూడండి. పుణ్యము చేసిన Heaven కు పోదువు, లేదా Hell కు పోదువు. వాళ్ళ భాషలోనే చెప్తున్నాను. వాళ్ళకి తెలిసిందొక్కటే - స్వర్గం, నరకం. మరొకటుందని తెలియదు. మరొకటుందయ్యా అన్నారు. అది స్వర్గంకంటే, నరకంకంటే ఇక్కడికంటె గొప్పదది. అక్కడ కేవలం ఆత్మజ్ఞానం వల్ల లభించే మోక్షము, దానిని పరమార్థము అంటారు. ఇహము, పరము, పరమార్థము. ఇక్కడ దుఃఖం గురించి మాట్లాడడం లేదు. కేవలం సుఖం గురించి మాట్లాడుతున్నాను. ఇహంలో సుఖపడడం, పరలోకాలలో సుఖపడడం, ఇవి ఎప్పుడో ఒకప్పుడు నశించేవి కనుక ఎప్పుడూ నశించని శాశ్వతమైన మోక్షసుఖాన్ని పొందడం - ఈ మూడూ లక్ష్యములుగానే తపించుతూంటాం. మనలో కొంచెం తెలివైన వాళ్ళు ఇక్కడ సుఖపడే ప్రయత్నాలు చేస్తూంటారు, మరికొంచెం తెలివైన వాళ్ళు పరంలో కూడా సుఖపడాలని ప్రయత్నిస్తారు. ఇంకా తెలివైన వాళ్ళు ఇహపరాలకు అతీతమైన పరమార్థ సుఖంకోసం శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళని మనం జ్ఞానులు, యోగులు అని అంటాం. కనుక ప్రతివారూ ఈ మూడురకాల సుఖాల కోసం తాపత్రయ పడతారని తేలిపోయింది. అయితే ఇహలోకంలో సుఖపడాలని ప్రయత్నిస్తున్నా సుఖపడలేక పోతున్నాం. కష్టం వద్దనుకుంటున్నా అనుభవించక తప్పడంలేదు. ఇది కదా మనకొచ్చిన సమస్య. అందుకోసం ఏం చేయాలి? అనారోగ్యం వచ్చింది. అది తొలగించుకోవడానికి మందు వాడతాం. మందు వాడుతున్న వాళ్ళందరూ అనారోగ్యం నుంచి బయటపడుతున్నారా? భౌతికమైన కొన్ని ప్రయత్నాలు చేయడం వల్ల సుఖపడగలము అంటే పడుతున్నారా? ఇద్దరికి ఒకేరకమైన జబ్బు వచ్చింది. ఇద్దరూ ఒకే వైద్యుడి దగ్గరకు వెళ్ళారు. ఆ వైద్యుడు కూడా నిష్పక్షపాతంగా ఇద్దరికీ ఒకే రకమైన చికిత్స చేశారు. కానీ అందులో ఒకడు బాగుపడ్డాడు, ఇంకొకడు బాగుపడలేదు. దేనివల్ల? దీనికోసం శాస్త్రాలు వెతకక్కరలేదు. అందరికున్న అనుభవమే. ఏ రోగమొస్తే తొందరగా మరణిస్తామని భయపడతామో అదే రోగంతో నూరేళ్ళు బ్రతికిన వాళ్ళున్నారు. ఏ రోగమొస్తే ఇంకేమీ చేయలేం పడుకోవలసిందే అనుకుంటామో అదే రోగంతో ఎన్నో సాధించిన వాళ్ళు ప్రపంచంలో కనపడుతూ ఉంటారు. అందుకే భౌతికమైన ప్రయత్నాలతో కూడా కానిదేదో ఒకటుంది అని ఒప్పుకోక తప్పడం లేదు. అప్పుడే కర్మయొక్క ఆలోచన వస్తున్నది. అంటే ఇదివరకు చేసుకున్న కర్మలబట్టి కూడా మన సుఖదుఃఖాలలో తేడా వుంది అని ఒప్పుకోక తప్పడం లేదు. ఇది లోకాన్ని పరిశీలిస్తే అర్థమౌతున్నది. సుఖం అనుభవించడానికి ముందు మనం ప్రయత్నించేది భౌతికమైన ఉపాయమే. కానీ దుఃఖం నుంచి బయటపడాలనీ, సుఖం పొందాలని మనం ప్రయత్నించేటప్పుడు ఎవరైనా ముందు చేసేది భౌతికమైన ఉపాయమే. రోగం వస్తే ముందు పరుగెత్తేది వైద్యుడి దగ్గరికే. అంతేకానీ నా రోగం పోగొట్టుకోవడానికి యే మంత్రం చేయాలి అని ఎవరూ ఆలోచించరు. ఆ వైద్యుడు కూడా చేతులెత్తేశాక అప్పుడు వెళతాం. మంత్రమా? జాతకమా? మణులా? అని. జాతకం తీసుకొని యే గ్రహ శాంతి చేయాలి? యే రత్నాలు ధరించాలి? అని. కానీ ముందు వెళ్ళేది డాక్టర్ దగ్గరికే. కనుక మనమందరం కూడా ఈ భౌతిక ఉపాయాలే చేస్తాం. భౌతిక ఉపాయాలు కూడా అందనప్పుడు మనం దైవిక ఉపాయాలలోకి వెళ్తుంటాం. కానీ భౌతిక ఉపాయాలలో ఎలాగైతే సాఫల్యము, వైఫల్యము ఉంటాయో దైవిక ఉపాయాలలో కూడా సాఫల్యము, వైఫల్యము కనపడుతూ వుంటుంది. ఎందుకంటే అది కూడా మనం చేసేది భూమిమీదే. స్వర్గంలోనో, ఆకాశంలోనో కూర్చుని చేయడంలేదు. ఇక్కడ చేసే దేనికైనా సాఫల్యము, వైఫల్యము రెండింటిలో యేదో ఒకటి తప్పదు. ఇప్పుడు మీరొక ప్రశ్న వేయచ్చు. మేము కూడా జపాలు చేశాం కానీ లాభం లేకపోయింది అని కొందరంటూంటారు. తరువాత ఆలోచన యేంటంటే జపాలు, తపాలు, పూజలు చేసినా జరుగలేదు కనుక మేం నమ్మడం మానివేశాం అంటారు. ఆరోగ్యం బాగోలేదని వైద్యుడి దగ్గరికి వెళ్ళినవాడికి మందు పనిచేయలేదు. మందు పనిచేయలేదు కదా అని వైద్యశాస్త్రాన్ని నమ్మడం మానివేశామని అంటున్నామా? భౌతిక శాస్త్రమైన వైద్యశాస్త్రంలో కూడా సాఫల్య వైఫల్యాలు కనపడుతున్నాయి. దైవిక శాస్త్రములలో కూడా సాఫల్య వైఫల్యాలు కనపడుతున్నాయి. నువ్వు నమ్మను అన్నప్పుడు అదికూడా నమ్మకూడదు. కానీ నమ్ముతూనే వున్నావు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ క్లినిక్ నుంచీ శవం బయటికి వస్తూ ఉంటుంది, పేషెంట్ లోపలికి వెళ్తూ ఉంటాడు. రెండు దృశ్యాలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. శవం బయటికి వచ్చింది కదా అని డాక్టర్ దగ్గర చూపించుకోను అనడు. వాడి దౌర్భాగ్యం కొద్దీ బయటికి వచ్చాడు, నా సౌభాగ్యం కొద్దీ నేను బాగుపడతానేమో అని అనుకుంటున్నాం. మరి అక్కడ మాత్రం వెళ్తున్నావే? ఇక్కడికొచ్చేసరికి ఎందుకు దెబ్బతింటున్నావు?

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML