గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

ఏకామ్రేశ్వరుడున్నది శివకంచి.

ఏకామ్రేశ్వరుడున్నది శివకంచి. రుద్రుడు అక్కడున్నాడు.శివుడున్నటువంటి ఈ ప్రాంతమంతా ప్రధాన ప్రాకారంనుంచి శివాలయం ఆ చుట్టూ ఉన్న ఆవరణ అంతా కలిపితే ఒక క్షేత్రం. కాంచీపురానికి వాయవ్యం వైపు ఉంటుంది శివకంచి. అగ్నేయంవైపు ఉంటుంది విష్ణుకంచి. ఆగ్నేయ వాయవ్యములకు నడుమ అమ్మవారు ఉంది. వాయవ్యంవైపు ఉన్న శివాలయ ప్రాంగణం అంతా కలిపితే శివకంచి. ఇక్కడ ఉన్న లింగాలలో ఒక్క లింగాన్ని అర్చించినా లేదా ఆ ప్రాంగణంలో ఏ లింగాన్ని అర్చించినా కోటిలింగార్చన ఫలం లభిస్తుంది. అందువల్ల దీనిని రుద్రకోటి అంటారు. కనుక శివుడు పృథ్వీలింగమై వెలసిన చోటు రుద్రకోటి/శివకోటి. దీనికే రుద్రశాల అని పేరు కూడా ఉంది. మహాకైలాసం అని మరొక పేరు. ఇంకొక పేరు ఏకామ్ర క్షేత్రం. ఐదవ పేరు మహాశ్మశానం. అక్కడ ఉన్నది పృథ్వీలింగం. అక్కడ ఒక అద్భుతమైన మామిడివృక్షం మనకి ఇప్పటికీ అక్కడ కనపడుతూ ఉంటుంది. అది శివస్వరూపం. సంస్కృతంలోఆమ్రము అనగా మామిడి. ఒక్క మామిడి చెట్టు (ఏక+ఆమ్ర)రూపంలో ఉన్నాడు కాబట్టి ఏకామ్రేశ్వరుడు అయ్యాడు. అక్కడ శివుడు రెండు రూపాలలో ప్రధానంగా ఉంటాదు. ఒకటి వృక్ష రూపంలోనూ, మూలంలో లింగరూపంలోనూ ఉంటాడు. లింగం సైకతలింగం. "కదళీకుసుమాకారం"గా(అరటిపువ్వు ఆకారంలో) ఉంటుంది. అరటిపువ్వు క్రింద విస్తారంగా ఉంటూ పోను పోను సన్నగా ఉంటుంది. వృక్షము క్రింద మాత్రమే శివలింగం కాదు అక్కడ వృక్షము కూడా శివలింగమే. ప్రధానంగా పృథ్వీలింగ స్వరూపంగా ఉంటున్నాడు. భారతదేశంలో భగవంతుణ్ణి అనేకరూపాలలో పూజలు చేస్తాం. పరమేశ్వరుడు కొన్ని ఆలయాలలో రాతి రూపంలో, కొన్ని ఆలయాలలో స్ఫటిక రూపంలో, కొన్ని ఆలయాలలో వృక్షరూపంలో ఉంటాడు. శివుడికీ వృక్షాలకీ ఉన్న అనుబంధం మనం ఆలోచిస్తే జలలింగం కూడా ఒక వృక్ష క్షేత్రమే. యుగాలక్రితం పురాణాలు అక్కడ వృక్షరూపంలో ఉంటాడు అని చెప్పాయి. యుగాలు గడిచినా అవి అలాగే ఉన్నాయి. ఇది ఆశ్చర్యకరమైన అంశం.ఆ చెట్టే ఇప్పటిదాకా అక్కడే ఉంటుంది అంటారండీ అని సందేహం అక్కరలేదు. కొద్ది దశాబ్దాల క్రితం అక్కడ ఉండే పురాతన మామిడి చెట్టు దెబ్బతిన్నది. ఏకామ్ర రూపంలో శివుడు వెళ్ళిపోయాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో చిత్రంగా మూలం నుంచి కొత్త మొలక వచ్చి మామిడి చెట్టు తయారయింది. భారతదేశం ఎలాంటిదంటే ఎంత మనం వాడగొట్టాలి, తీసిపారెయ్యాలి అన్నా మళ్ళీ మళ్ళీ చిగురించే మహావృక్షం లాంటిది భారతీయ సంస్కృతి. వృక్షరూపంలో శివుడున్నాడని వేదంలో ఉందా? అంటే ఉంది "వృక్షేభ్యో హరికేశేభ్యః". కనిపించే ప్రతి చెట్టుకీ శివుడు అని దణ్ణం పెట్టగలిగే సంస్కారం మనకి రావాలి. భారతీయ సంస్కృతిలో చెట్లని నరకకుండా కాపాడుడు అని చెప్పక్కర లేదు. చెట్లని శివుడిగా చూడడం నేర్చుకోండి అని వేదం చెప్తోంది. హరికేశేభ్యః - హరికేశములు అంటే ఆకుపచ్చని జుట్టు కలవాడు అని అర్థం. విస్తరించిన కొమ్మలతో ఉన్న జుట్టు ఆకుపచ్చని జడలతో ఉన్న శివుడిలా కనపడుతోంది. ప్రతి చెట్టునీ శివుడని దర్శించాలి. కానీ శివుడే చెట్టుగా వచ్చిన క్షేత్రములు కొన్ని ఉన్నాయి. అటువంటి క్షేత్రములలో ఏకామ్రేశ్వ క్షేత్రం ఒకటి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML