గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 18 May 2014

విష్ణురువాచ (గణేశపురాణం - లీలా ఖండము : ప్రథమోధ్యాయః )

విష్ణురువాచ (గణేశపురాణం - లీలా ఖండము : ప్రథమోధ్యాయః )
యుగే యుగే భిన్ననామా గణేశో భిన్నవాహనః 
భిన్నకర్మా భిన్నగుణః భిన్నదైత్యపహారకః 
సిమ్హారూఢో దశభుజో కృతే నామ్నా వినాయకః 
తెజోరూపీ మహాకాయః సర్వేషాం వరదో వశీ
త్రేతాయుగే బర్హిరూడః షడ్భుజోర్జునచ్చవిః
మయూరేశ్వరనామ్నా చ విఖ్యాతో భువనత్రయే
ద్వాపరే రక్తవర్ణోసా వాఖురూఢ శ్చతుర్భుజః
గజానన ఇతి ఖ్యాతః పూజితః సురమానవైః
కలౌధూమ్రవర్ణో సావశ్వారూఢో ద్విహస్తవాన్
ధూమ్రకేతు రితి ఖ్యాతో మ్లేచ్చానీక వినాశకృత్ 
గణేశుడు ప్రతియుగ మందు వ్భిన్ననామములు కలవాడు. వివిధ వాహనంబులు కలవాడు .విభిన్న కర్మలు, వివిధ గుణంబులు కలవాడై వివిధ రకంబులగు దైత్యుల సమ్హరించేను.
కృతయుగగంబున వినాయకుడను నామము,పదిబాహువులు సిమ్హ వాహనము,పెద శరీరం కలిగియుండెను. వరదుడు,తేజోరూపుడు.
త్రేతాయుగంబున,తెల్లని శరీరం,ఆరుభుజంబులతో నెమలివాహనుడై మయూరేశ్వరుండను నామముతో ముల్లోకముల ప్రసిద్ధుడాయెను .
ఇక ద్వాపరయుగంబున రక్తవర్ణుడై ముషకవాహనము,నలుగు భుజములు కలిగి గజాననుడను నామధేయ్యుముచే పూజింపబడెను.
ఇక కలియుగంబున ధూమ్రకేతుండును నామము కలిగి,ధూమ్రవర్ణుడై అశ్వవాహనము కలిగి రెండు భుజములతో,మ్లేచ్చలను,సైనికుల నశింపజేయును. 
శ్రీ గణేశాయ నమః


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML