గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 May 2014

నారాయణ తీర్థులకు బోధేంద్రసరస్వతీస్వామి వారి దివ్య ప్రేరణ లభించింది

నారాయణ తీర్థులకు బోధేంద్రసరస్వతీస్వామి వారి దివ్య ప్రేరణ లభించింది. మహాత్ములు శరీరంతో కనపడి ప్రేరేపించాలనే లేదు. శరీరం త్యజించినా బ్రహ్మైక్యం చెందినవారు గనుక దివ్యమైన తేజస్సుతో ప్రేరణ కలిగిస్తూ ఉంటారు. ఆ భక్తే ధర్మాన్ని నిలబెడుతుంది. అదే జ్ఞానాన్ని కలిగిస్తుంది గనుక కృష్ణభక్తిని ప్రచారం చెయ్యి అని ఒకానొక స్ఫురణ ఈయనకి కలిగి అక్కడినుంచి బయలుదేరి వస్తూండగా ఆయనకు ఒకచోట అద్భుతమైన అనుభూతి కలిగింది. అక్కడినుంచి నడికావేరి అనే ప్రాంతానికి చేరుకున్నారు. అది ఒక క్షేత్రము. మధ్య కావేరి అని సంస్కృతంలో దీనిని చెప్పవచ్చు. అక్కడ విశ్రాంతిగా ఒక ఆలయంలో కూర్చున్నారు. మహాగణపతి మందిరం అది. ఆ సమయంలో కడుపునొప్పి మరింత ఎక్కువైంది. దానిని పరిణామ శూలవ్యాధి అంటారు వైద్యశాస్త్ర ప్రకారంగా. అది పెరిగినప్పుడు మరొక్కమారు వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ వేదన భరించలేకున్నాను అని బాధకలిగి ఆయన శ్రీనివాసుని స్మరించి మరుసటిరోజు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకొని పడుకున్నారు. కలలో శ్రీనివాసుడు ఆయనకు దర్శనమిచ్చి "నువ్వు తిరుమలకు రానవసరం లేదు. నిద్రలేచిన వెంటనే ఏది కనపడి ఎటు దారిచూపిస్తుందో అటువెళ్ళు; అక్కడ నీకు దివ్యదర్శనం లభిస్తుంది; అది నాయొక్క ఆజ్ఞగా భావించు" అని ఆదేశించారు. నిద్రలేచిన వెంటనే ఆయనకు ఎదురుగా ఆయనకొక వరాహం కనపడింది. దానిని అనుసరించి వెళ్ళారు. అది క్రమంగా పడమటి దిశవైపు వెళుతూ ఒక మూడుమైళ్ళు దాటిన తర్వాత దక్షిణం పోయే మార్గంలో రాతికాల్వను ఈదుకొని వెళ్ళి ఒకఊరిలో ప్రవేశించింది. అక్కడ అదృశ్యమైంది వరాహం. ఆ ఊరిపేరు భూపతిరాజ పురము. అక్కడ కావేరీనది ఉపనదియైన కుడమృత్తి అనే నది కూడా ఉన్నది. ఆ ప్రాంతంలో ఆయన ఒక వారంరోజుల పాటు నిద్రాహారాలు కూడా లేకుండా ధ్యానసమాధిలో ఉండిపోయారు. అక్కడ ఆయనకి శ్రీవేంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చారు. ఈచోటును వేంకటేశ్వర స్థలము అని భావించి ఊరువారిని పిలిచి ఆ చోటులో త్రవ్వించారు. అక్కడ ఒక అద్భుతమైన విగ్రహం బయటపడింది. అది లక్ష్మీదేవిని అంకమునందు ఉంచుకున్నటువంటి నారాయణుని విగ్రహం ఒకటి, శ్రీదేవి, భూదేవిలతో కూడిన వేంకటేశ్వర స్వామియొక్క పంచలోహ మూర్తి ఒకటి. ఇవి స్వయంభూమూర్తులుగా భావించి అక్కడ ప్రతిష్ఠ చేసి ఆలయ నిర్మాణం చేశారు. నారాయణ తీర్థుల, ఆలయ ప్రభావం ఊరివారందరిచేత గౌరవింపబడేటట్లు చేసి నారాయణ తీర్థుల వారు దైవసమానంగానూ, ఆచార్యరూపంగానూ భావించి అర్చించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆయనకు నారాయణునిపై కీర్తనలు రచించాలని సంకల్పం కలిగింది. గానరూపమైన ప్రబంధాన్ని రచించాలనే కోరికను కలిగించింది. అదే శ్రీకృష్ణలీలాతరంగిణి రూపంలో శ్రీకారం చుట్టుకున్నది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML