గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 20 May 2014

కోనసీమ తిరుమలేశుడు... అప్పనపల్లి బాలాజీ

కోనసీమ తిరుమలేశుడు... అప్పనపల్లి బాలాజీ

తూర్పు, ఉత్తర భారతదేశంలో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని 'బాలాజీ' పిలుస్తారు. అయితే మనదగ్గర మాత్రం ఈ పేరుతో పిలవడం చాలా అరుదు. చిలుకూరు 'బాలాజీ' తరువాత వేంకటేశ్వరస్వామి ఆ పేరుతో పిలువబడుతున్న పుణ్యక్షేత్రం 'అప్పనపల్లి బాలాజీ' దేవస్థానం... తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో కోనసీమ తిరుపతిగా వెలుగొందుతోన్న శ్రీ అప్పనపల్లి బాలాజీ దర్శనం

రాజమండ్రికి 85 కిలోమీటర్లు, అమలాపురానికి 35 కిలోమీటర్ల దూరంలో అప్పనపల్లిలో కొలువైన శ్రీనివాసుడి చరిత్ర ఈనాటిది కాదు. ఈ దేవాలయానికి వందల ఏళ్ళ చరిత్ర ఉన్నది. అప్పనపల్లి గ్రామం పవిత్రమైన వైనతేయ నది ఒడ్డున ఉన్నది. ఈ ఊరికి మూడు ప్రక్కల గోదావరి నది నాలుగవ ప్రక్క బంగాళాఖాతం ఉన్నాయి. పచ్చటి వరిచేలు, విస్తారంగా కొబ్బరి తోటలు, పనస చెట్లు, కూరగాయల మడులతో కోనసీమలో విశేషంగా ఆకట్టుకుంటున్న దేవాలయం అప్పనపల్లి. ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు 'అప్పన' అనే ఋషి ద్వారా వచ్చింది. ఆ ఋషి ఇక్కడ లోక కళ్యాణార్ధం తపస్సు చేశాడు. పూర్వకాలంలో ఈ ప్రదేశంలో బ్రాహ్మణులు వేదాలని వల్లె వేస్తూ ఉండేవారని ప్రతీతి.

దేవాలయ చరిత్ర...
ఇక్కడ రెండు వెంకటేశ్వర దేవస్థానాలు న్నాయి. పూర్వం ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు. ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి ఒక కొబ్బరి వర్తకుడు. ఈయన ఒక ప్రాంతంలో కొబ్బరి రాశి కొని తెచ్చినపుడు శ్రీ వెంకటేశ్వ రుని మూర్తిని కనుగొన్నాడట. ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజ స్తంభం గురించి ఒక విశేషమైన కథ ప్రచా రంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లే టి రామస్వామి, కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన చెట్టును కొన డానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి రావటం జరిగింది. తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చి విచిత్రంగా ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదే చెట్టు అప్పనపల్లి తీరానికి చేరి ఉన్నదని, దానినే ధ్వజస్తంభ నిర్మాణానికి వాడారనీ చెపుతారు.

ఆలయ విశేషాలు...
ఈ దేవాలయంలో పూజాదులు, సేవలు, సాంస్కృతిక సేవా కార్యక్రమాల వలన విపరీ తమైన ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా సాగుతుండేవి. ఆ రోజులలో రామస్వామి యొక్క నిస్వార్థం వలన ఆదా యం బాగా సమకూరి తిరుమల దేవస్థానం తీరుగా వచ్చిన భక్తులందరికీ ఉచిత భోజ నం, లోపంలేని వసతులు కల్పించుటతో భక్తుల రాకపోకలు విపరీతంగా పెరిగి అ త్యంత పెద్ద దేవస్థానంగా రూపుదిద్దుకొన్నది. తరువాత కొంతకాలానికి దేవస్థాన ఆదాయం అధికంగా ఉండటం వలన ప్రభుత్వ దేవాదాయశాఖ వారు దేవస్థానాన్ని వారి ఆధీనంలోకి తీసుకొన్నారు. అప్పటి నుండి పాత కార్యవర్గాన్ని రద్దుచేసి కొన్ని పూర్వ కార్యక్రమాలను నిలిపివేయడంతోతో భక్తుల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందముగా భక్తుల ఒరవడి తగ్గుట ఆదాయం మందగించడంతో ఈ మధ్యనే తిరిగి యథాపూర్వకంగా పాత పద్ధతులను పునరుద్ధరించారు.

పాత దేవాలయము...
ప్రధాన దేవస్థానానికి కొంచెం దూరంలో పురాతన దేవాలయం ఉన్నది. అప్పన ముని తపస్సు చేసిందిక్కడేనని అంటారు. ఇక్కడ ఓ కళ్యాణ కట్ట కూడా ఉన్నది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానంలో దేవుని దర్శించిన పిదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనం చేసుకోవడం పరిపాటి. ప్రధాన దేవాలయం నుండి పూర్వదేవాలయం వరకు తిరునాళ్ళు ఉంటుంది. అప్పనపల్లెలో బహుసుందరంగా కొత్తగా కట్టిన శివాలయం కూడా ఉన్నది. దేవాలయం మొత్తం తెల్లగా ఉండటం దీని ప్రత్యేకత. అప్పనపల్లి గోదావరి పాయ అయిన వైన తేయనదిలో అప్పనపల్లి లంక చిన్నద్వీపంలో పచ్చగా నిండుగా పెరిగిన వృక్షాలతో అందంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ పశుగ్రాసం సమృద్ధిగా దొరకడం వలన గ్రామస్తులు పశువులను ఇక్కడే ఉంచి ప్రతిరోజూ వెళ్ళి వస్తుంటారు. యాత్రికులకు కూడా స్నానఘట్టం నుండి తక్కువ రుసుంతో లంకకు వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చేందుకు దేవస్థానంవారు పడవలను కూడా నడుపుతారు


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML