గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 May 2014

అమ్మవారు చేసిన పరమేశ్వరుని కళ్ళుమూయడమనే లీల లోకానికి ఎంతో ఉపకారం చేసిందో తెలుసుకుందాం.

అమ్మవారు చేసిన పరమేశ్వరుని కళ్ళుమూయడమనే లీల లోకానికి ఎంతో ఉపకారం చేసిందో తెలుసుకుందాం. ఆవిడ మందహాసంతో ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి చేసుకుంటాను అన్నదిట. ఏం ఆవిడకి తెలియదా? మహా పతివ్రత. భర్త యేది చెప్తే అది చేయాలి గనుక ఆయననే అడిగిందిట. అప్పుడాయన "భూమి అంతా స్థిరపడి బాగుంది. నువ్వు తిన్నగా హిమాలయాలకి వెళ్ళు. అక్కడ నీకోసం నిన్ను కుమార్తిగా పొందాలని ఒక మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు. ఆయన పేరు కటముడు అని మహర్షి. ఆయనకి భార్యలేదు. ఆయనకు నువ్వు సంతానంగా కలగాలి. ఆయన ఆశ్రమం ముందు పసికూనలా సాక్షాత్కరించు. వెంటనే నువ్వు అమ్మవారివి అని తెలుసుకొని తన కుమార్తెగా స్వీకరించి నిన్ను పెంచుకుంటాడు. ఎందుకంటే ఆ కోరిక తీరితే గానీ ఆయనకి మోక్షం రాదు. ఎనిమిదేళ్ళు పూర్తి అయిన తర్వాత ఆయనకి నిన్నుకుమార్తెగా పెంచినటువంటి పుణ్యము, పెంచాలని ఉబలాటము నెరవేరి అప్పుడు నువ్వు ఆయనకి మోక్షం ఇచ్చి అక్కడినుంచి బయలుదేరు. అంతవరకు ఆయన వాడిన వ్యాఘ్రాశం (పెద్దపులి చర్మం), తపోదండం, కమండలం, దీపాలు పెట్టుకునే రెండుకుండలు(ఘటద్వయం), అక్షమాల, వేయించిన పెసరగింజ(తప్తముద్దాంకురం), ఉంటాయి. పైగా గంగా నదీ తీరం కనుక కొంత గంగాజలం, ఇసుక, ( గంగమట్టి చాలాగొప్పది. గంగమట్టి ధారణ చేస్తే శరీరానికి శక్తి పెరుగుతుంది. దేవతాశక్తి ప్రవేశిస్తుంది. గంగమట్టి ధరించి యే సత్కర్మ చేసినా ఆ కర్మ కోటిరెట్లు ఫలితం ఇస్తుంది. గంగాజలం ఆచమనం చేసి జపం చేస్తే వచ్చే సిద్ధి వేరు. ) ఇవన్నీ తీసుకొని బయలుదేరి కాశీపురానికి రా. ఆ సమయంలో కాశీ క్షేత్రంలో కరువుంటుంది. అక్కడికి వెళ్ళి కాశీలో కరువు తీరిపోయేటట్లు అన్నపూర్ణగా ఉండు. కరువు తీర్చి అన్నపూర్ణ అన్న శక్తిరూపంతో అక్కడ ఉంటూ అక్కడ నుంచి బయలుదేరు. ఇది ఎలాంటిది అంటే ఒక దీపం ఒకచోటికి రాగానే ఆ దీపంతో మరొక దీపం వెలిగించి పెట్టాక మొదటి దీపం కదిలినట్లు. అమ్మవారు కాశీ విడిచిపెట్టారు అనుకోకూడదు మనం. కాశీలో అన్నపూర్ణగా ఒక రూపంతో ఉంటారు. అక్కడినుంచి దక్షిణాపథానికి రా. అక్కడ సముద్రతీరంలో ఒక మహాక్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రం ఎలా పోల్చుకుంటావంటే అక్కడ పాలేరు అని ఒక నది ఉంటుంది. దానిని క్షీరనది(పాలార్నది) అంటారు. సరస్వతీ నదియొక్క రూపం అది. ఆ పాలేరు ప్రాంతంలో ఒక మామిడిచెట్టు నీడలో ఒక ఇసుక లింగం ఉంటుంది. ఆ ఇసుక లింగం దగ్గర చిత్రంగా అక్కడ ఒక వేయించిన పెసరగింజ ఉంటుంది. రెండు చామరములు, ఒక విసనకర్ర ఉంటుంది. పూజాసామగ్రి, ఇద్దరు స్త్రీమూర్తులు ఉంటారు నీకు పరిచర్యలు చేసి సహకరించడానికి. అక్కడ ఒక సూచిక ఉంటుంది. దానిమీద నీ దృష్టి నిలుపుతూ ధ్యానం చేస్తూ తపస్సు చేసి అక్కడ ఉన్న నా సైకత లింగాన్ని ఆరాధన చెయ్యి. అప్పుడు నీపాపం పోతుంది" అని చెప్పాడు పరమశివుడు. ఈ కథ ద్వారా అమ్మవారు తన పాపాన్ని కడుక్కోవడమనే నెపంతో ఆవిడ చేసిన పని అటు హిమవత్పర్వతాన్ని పవిత్రం చేస్తోంది, మహర్షిని ఉద్ధరించింది, కాశీక్షేత్రాన్ని ఉద్ధరించింది. తరువాత మనల్ని ఉద్ధరించడానికి ఈ క్షేత్రానికి రాబోతోంది. వారి లీలలు లోకకళ్యాణాలు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML