గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 18 May 2014

భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు

సుప్రీం కోర్టు

భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది హైకోర్టులపై నియంత్రణాధికారం కల్గిఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 26 మం
ది జడ్జీలు ఉంటారు ప్రధాన న్యాయ మూర్తితో కలిపి. ఈ కోర్టులలో
భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను,
లేక
భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను
లేక
రెండు అంత కంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను పరిష్కరిస్తుంటాయి.
ఇందులో సివిల్ కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా, ఇతర ఏ కేసు అయినా హైకోర్టు‌లో జరుగుతూ ఉన్నా, ఆఖరి తీర్పు అయిపోయినా మనము ఈ కోర్టు‌లో (న్యాయస్థానంలో) ఫిర్యాదు చేసుకోవచ్చు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవీ అర్హతలు:

భారతదేశ పౌరుడై ఉండాలి.
కనీసం 5 సంవత్సరాల కాలం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.లేదా 10 సంవత్సరాలు హైకోర్టులో అడ్వకేట్ వృత్తి నిర్వహించి ఉండాలి లేదా ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త అయి ఉండాలి.
హైకోర్టు

రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నది హైకోర్టు. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేటట్లు పార్లమెంటు చట్టం చేయవచ్చు. మొత్తం భారతదేశంలో 21 హైకోర్టు‌లు ఉన్నాయి. ఒక్కొక్క హైకోర్టు‌లో ఒక్కొక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. ఈ న్యాయమూర్తిని ప్రెసిడెంట్ నియమిస్తాడు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి. రాష్ట్రంలో ఏ ఇతర కోర్టులలో జరిగిన కేసుల పై న్యాయ విచారణ కోసం హైకోర్ట్‌ను సంప్రదించవచ్చు.

హైకోర్టు న్యాయ మూర్తి పదవీ అర్హతలు:

భారత దేశ పౌరుడై ఉండాలి.
కనీసం 10 సంవత్సరాలు పాటు దిగువ కోర్ట్‌లో న్యాయమూర్తిగా లేదా హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగా, లేదా న్యాయ శాస్త్రవేత్తగా ఉండాలి.

సబార్డినేట్ కోర్ట్

దేశం మొత్తంలో సబార్డినేట్ కోర్టులనేవి ఒకేలా ఉంటాయి. వాటికి ఉన్న అధికారంలో ఏ సివిల్ కేసునైన, క్రిమినల్ కేసునైన తీర్చగలదు.

మేజిస్ట్రేట్ కోర్ట్

ఈ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులలో ఫ్యాక్టరీల వివాదాలు, కార్మిక చట్టాలకు సంబంధించిన వివాదాలపై కేసులు పరిష్కారం జరుగుతుంది.

ఫ్యామిలీ కోర్ట్

ఫ్యామిలి కోర్టులలో వివాహ సంబంధ సమస్యలు, కుటుంబాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తాయి. ఈ కోర్టులను ఏ పట్టణంలోనైన ఉండవచ్చు, ఎక్కడైన ఉండవచ్చు. ప్రస్తుతానికి మన భారతదేశంలో 153 ఫ్యామిలి కోర్టులు ఉన్నాయి.

ఫాస్ట్ ట్రాక్ కోర్ట్

వివిధ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసింది.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML