గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

నరేంద్రుడి శిష్యరికం:

నరేంద్రుడి శిష్యరికం:

సమస్త వేదాంతసారమూర్తి అయిన శ్రీరామకష్ణుల సాన్నిధ్యంలో వుండడమే మహోత్తమ తపశ్చర్య, అద్వితీయ సాధన సంపత్తి. అలాంటి సాన్నిధ్యం లభించిన వ్యక్తికి దేహాభిమానం దానంతట అదే సమసిపోతుమ్ది. జితేంద్రియత్వం కరతలామలకమవుతుంది. శ్రీరామకృష్ణుల దివ్యభావాలను గ్రహించడం సామాన్యులకు అలవికాదు. సూక్ష్మగ్రాహులైన విశుద్ధవర్తనులకు మాత్రమే అది సుసాధ్యం. అలాంటి సద్గురుచరణ సాన్నిధ్యమే సాక్షాత్కారాన్ని పొందటానికి సులభోపాయం.
శ్రీరామకృష్ణుల శిక్షణ విధానం అత్యద్భుతం. ఆటలతో, పాటలతో, వింతలతో,
 వినోదాలతో అతడు మహోన్నతాధ్యాత్మిక విషయాలను శిష్యులకు బోధించేవాడు. వారి భావి జీవితౌన్నత్యాన్ని ప్రత్యక్షంగా గామ్చి, తద్విషయాలను తెలిపి, వారిని ఉత్సాహపూరితులను చేసేవాడు. దైనందిన జీవితచర్యలను పరిశీలిమ్చి క్రమవిరహితమైన ఎలాంటి స్వల్ప విషయాన్ని గురించి అయినా సదుపదేశాలు ఒసగేవాడు.
నిశ్శబ్దంగా పువ్వులు వికసించి తమ సుగంధాన్ని వెదజల్లే రీతిలో, ప్రశాంతంగా చంద్రుడు వృద్ధి చెంది భూమండలాన్ని ప్రకాశింపజేసే తీరులో శ్రీరామకృష్ణుడు తన మహోపదేశాలచేత శిష్యుల మనస్సులను వికసింపజేసి, దివ్యానుభవాలను ఒసగి ప్రకాశింపజేయసాగాడు. అలాంటి సద్గురువరేణ్యుడి సాన్నిధ్యం లభించిన శిష్యులు ఎంతటి ధన్యాత్ములో కదా!


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML