గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన జగదంబికను ఆశ్రయిస్తే ఐహిక సంపదలు, కైవల్యజ్ఞానం కూడా అమ్మ ఇస్తుంది.

బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన జగదంబికను ఆశ్రయిస్తే ఐహిక సంపదలు, కైవల్యజ్ఞానం కూడా అమ్మ ఇస్తుంది. కనుక ఇహం, పరం, పరమార్థం ఇవ్వగలిగే తల్లి జగదంబిక అని వ్యాసదేవుడు మార్కండేయ పురాణంలో చెప్పారు.
"లోకాలన్నిటికీ ఏకైక దిక్కు అమ్మ. పిపీలికాది బ్రహ్మలోక పర్యంతం అమ్మ చరణాలే దిక్కు" అని శంకర భగవత్పాదులు అన్నారు. అమ్మ కావాలని ఆ చరణాలను ఆశ్రయిస్తే ఇహం, పరం, సర్వం - ఆతల్లి అందచేస్తుంది. అందుకు సదా అమ్మను శరణు వేడాలి.
సర్వజగత్తులో మోహాన్ని వ్యాపింపజేసి, ఆ మోహాన్ని ఉపసంహరింపజేసి మోక్షాన్నిస్తుంది. భీష్మపితామహుడు అంపశయ్యమీద ఉండి, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి "సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః" అని స్తోత్రం చేసిన భీష్మ స్తవరాజం మహాభారతం శాంతి పర్వంలో వస్తుంది. ఇందులో 'సర్గస్య' అంటే ప్రపంచం. ఈ విశ్వంయొక్క రక్షణ కోసం మోహ స్వరూపుడై ఉన్న నారాయణునికి నమస్కారం అన్నాడు. అక్కడ "నారాయణః" అని పుంలింగంలో ఏ తత్త్వం చెప్పబడుతోందో అదే ఇక్కడ "నారాయణి" అని స్త్రీలింగంలో చెప్పబడుతోంది. అమ్మవారికి నారాయణి, వైష్ణవి అనే రెండు పేర్లున్నాయి.
సప్తశతి, భగవద్గీత ఈ రెండూ ఒకే తత్త్వాన్ని చెయుతాయి. 'దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా' తన మాయను దాటడం కష్టసాధ్యం అని గీతలో పరమాత్మ చెప్పారు.
జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా!
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి!!
జ్ఞానులైన వారి మనస్సును కూడా లాగి, మోహంతో జగత్తు వైపు తిప్పుతుంది అమ్మ అన్నారు. లేకుంటేె జగన్నిర్వహణ సాధ్యం కాదు. మళ్ళీ సమయమెరిగి ఆ మోహాన్ని తొలగించగలిగేదీ ఆ తల్లే.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML