గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 18 May 2014

కాల తత్వం, పరమాత్మ స్వరూపం


కాల తత్వం, పరమాత్మ స్వరూపం

సృష్టిలో మానవుడు పుట్టినప్పుడు పాకుతాడు, క్రమంగా బుడిబుడి అడుగులు వేస్తూ తరువాత నడుస్తూ పరుగులు తీస్తాడు. ఇది చిన్ననాటి వయస్సు. తరువాత విద్యలు అభ్యసించి, తరువాత విషయలోలుడై (పెళ్లి, పిల్లలు, సంపద), వృద్దాప్యంలో పిల్లల సాయంతో గడిపి చనిపోతాడు. సృష్టిలో ఏ జీవి అయిన దాదాపుగా ఇంతే. ఇదే కాలస్వరూపం. దీనిని తప్పి ప్రవర్తించడానికి లేదు కాలం చెప్పినట్లు ఎవరైనా నడవాల్సిందే గాని హుం
కరిస్తే వినాశనమే మిగిలేది.

కాలం చెప్పేది ఒక్కటే. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నాలాగా ప్రశాంత చిత్తంతో ఉండు. ప్రశాంతంగా నీపని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎన్నో ప్రళయాలను చవిచూచింది కాలం. ఎందఱో మహానుభావులైన ఋషులు, మునులు, పెద్దలు, వారికి వెయ్యిరెట్లు పనికిమాలిన నీచ్యాతి నీచ్యులు కాలగర్భంలో కలిసిపోయారు. కాని, కాలం మాత్రం అన్నిటిని స్థిరంగా తీసుకుంది. మంచీ లేదు. చెడు లేదు, రాగం లేదు, ద్వేషం లేదు. ఎవ్వరైనా ఒక్కటే తనలో కలిపేయడం.

కాలం అందరిని సృష్టిస్తుంది. కాని తను సృష్టించిన వస్తువు వెనక పడదు. కాని మానవుడు తను సృష్టి చేసిన వస్తువు వెనకనే తిరుగుతున్నాడు. అదే లోకం అదే సర్వస్వం అనుకుంటున్నాడు. సృష్టి చేసిన వస్తువుకి బానిసై దాసోహమై తనకి ఉన్నశక్తిని కోల్పోతున్నాడు. 

ఉదాహరణకి మన ముందు ఉన్న తరాలవారు జూదానికి బానిసలై ఆస్తులు పోగొట్టారు. తాగుడుకి బానిసలయ్యారు. ఇప్పుడు వారిని 1000 ఇంతలు మించిపోయి అంతర్జాలానికి, మొబైల్ పోన్ లకి బానిసలయ్యారు. బానిసలవ్వడంతో పాటు మెదడుకి పనిచెప్పడం మానేసారు. దీనివలన సమస్యలు ఏవైనా పుట్టుకొస్తే ఆత్మహత్యలు లేదా పారిపోవడం తప్ప ధైర్యంగా నిలబడేవారు కరువయ్యారు. మీరే ఇలా పోటి ప్రపంచం అనేపేరుతో మీ బుర్రలే పడుచేసుకుంటే మీ తరువాతి తరాలకి ఏమిస్తారు? కొద్దిగా బంకమట్టి తప్ప. 

ఎప్పుడయినా కలతత్వాన్ని అనుసరించి వెళ్ళాలి మానవుడు. దీనికి ఎదురువెళ్ళి నేనే గొప్ప అనుకున్నవంటే ఎందుకు పనికిరాకుండా పోవడంతో పాటుగా మీ ముందు, తరువాతి తరాలను కూడా నాశనం చేయడమే.

మనలోచాలమందికి సందేహం. కాలానికి మనస్సులేదు అందుకే అలా మౌనంగా ఉంటుంది అని. 
కాలం నువ్వు కోరుకున్నప్పుడు కోరుకున్న రూపంలో వరాలు ఇస్తుంది. కాలం మనం ఉన్న లోకంతో కలిపి పద్నాలుగు లోకాలను అనుక్షణం కాపాడుతుంది. విష్ణుమూర్తి రూపంలో అనేక అంశలు ధరించింది. వామన, కూర్మ, మత్స్య, నృసింహ, రామ, వ్యాస, శ్రీకృష్ణ ఇలా అనేక అంశలు ధరించి ఎప్పటికప్పుడు రక్షిస్తూనే ఉంది. మనకి తెలిసినవి దశావతారాలే అయిన ముఖ్యమైనవి 24, లేక్కించలేనివి అనంతం. ఊరి పొలిమేర్లలో అమ్మవార్ల రూపంలో ప్రతి గ్రామంలో కొలువై ఉంది. ఎన్నో శక్తి పీటలు, ఎన్నో స్వయంభూ క్షేత్రాలు, ఇంకెన్నో గొప్ప గొప్ప ఋషులు తమ శక్తితో స్థాపించిన క్షేత్రాలు. రాములవారు స్థాపించినవి కొన్ని, పాండవులు స్థాపించినవి కొన్ని, రావణుడు లాంటి అసురులు స్థాపించినవి కొన్ని, నేటికీ ఎందరెందరో స్థాపిస్తున్నారు. ఇవన్ని మనం అనుకోగానే జరిగేవి అనుకుంటే పొరబాటే. దైవం తనకు తానుగా ముందుకు వచ్చి ఇలాంటి చేయిస్తుంది. ఇదే కాల తత్వం, పరమాత్మ స్వరూపం


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML