గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

సనాతన ధర్మ మూలాలు :

సనాతన ధర్మ మూలాలు :
ధర్మం అంటే అర్ధం భగవంతుడు సంతోషించే
విధంగా జీవించే విధానం :
ఆ ధర్మం మన మునులు ఎంతో కృషి చేసి
త్యాగాలు చేసి ఆ ధర్మాలను మరియు ధర్మ
నియమాలు మనకు వేదాలు రూపంలో
మనకు అందించారు.
ధర్మ ఆచరణ పాటించే విధానాన్ని బట్టి మన
ధర్మ శాస్త్రాలను నాలుగు విభాగాలుగా
విభజించారు. అవి
౧.శృతి
౨.స్మృతి
౩.పురాణములు
౪.ఇతిహాసములు
< శృతి>
>శృతి అనగా దైవం ద్వారా వినిపించిన వాక్యాలు ,
ఇవి మహా మునులు ఎన్నోనాళ్ళు తమ
తపఃశక్తితో దైవం నుండి పొందారు.
>ఈ శృతి అనేది శాశ్వతం.ఒక్క పొల్లు పోకుండా
ఎన్ని కాలాలైనా శృతి శృతిలాగానే చెప్పబడాలి
(మనకు మొట్టమొదటి మునులు ఎలా చెప్పారో
అలా ).
> శృతి మనల్ని ఏ కార్యం చేయమని
ఆదేశించదు. ఏది ఎలా ఉంటుంది , ఎలా
జరుగుతుంది అని దిశానిర్దేశం మాత్రమే
చేస్తుంది.
>ధర్మం విషయంలో శృతిని అత్యుత్తమ
స్తాయిలో పరమంగా పరిగణలోకి తీసుకొంటారు.
>సనాతన ధర్మంలో ఉన్న శృతి అనగా
వేదములు. ఈ వేదములను నాలుగు బాగాలుగా
చేసిరి. అవి ఋగ్వేదము ,సామవేదము,యజుర్
వేదము మరియు అధర్వణవేదము.
< స్మృతి>
> స్మృతి అనగా శృతిని ప్రమాణంగా చేసికొని
మానవాళి
జీవనవిదానము కొరకు మేధావులు మరియు పండితులు ఆ
కాలానికి అనుగుణంగా రోపొందించబడిన ఒక
శాసనం మరియు దైవ విషయాలైన వేదసారాన్ని
జనులకు కొంచెం సులభతరంగా
అందించుటకొరకు చేసిన గ్రంధములు.
>ఇంకా చెప్పాలి అంటే వేదార్థాన్ని స్మృతి
అనవచ్చు.ఇలా ఎందరో గొప్ప పండితులు వారివారి
సామర్థ్యం మేరకు వేదాన్ని అర్ధం చేసికొని
దానిని ఒక గ్రంధరూపంలో , శాసన రూపంలో
మనకు అందించారు ,అవే స్మృతులు .అందుకే
వేదం ఒక్కటైనా దానికి అర్థ్హం నుండి
వెలువడిన స్మృతులు అనేకం.
> స్మృతి కొన్నిసార్లు పూర్తిగా శృతిని పోలి
ఉండకపోవచ్చు కాని గరిష్టంగా మాత్రం శృతి
ప్రభావమే ఉండును.
> స్మృతి విషయంలో ఆయా కాలాన్ని ,
పరిస్థితులని బట్టి కొన్ని
విషయాలను పరిగణలోకి తీసికొని వేదంతో
క్రోడీకరించి రూపొందించినవి.
> స్మృతి ఒక మనిషి ఈవిదంగానే ఉండాలి ,
ఇలానే చేయాలి అని శాసిస్తుంది . అలా
చేయకున్నచో శిక్ష ఏమిటో కూడా తెలుపుతుంది.
>వీటి మనుగడ మరియు అనుసరణ
శాశ్వతం కాకపోవచ్చు.ఎందుకంటే ఆయా కాలాన్ని ,
పరిస్థితులని బట్టి రూపొందించినవి.
కాలానుగుణంగా పరిస్థితులను వీటిలోని కొన్ని
విషయాలని తొలగిస్తారు అదేవిధంగా
కొత్తవిషయాలను జతచేయటం జరిగింది. ఏది
జరిగినా అది వేదం ప్రమాణంగా మాత్రమే.
>కొన్నిసార్లు ధర్మం విషయంలో శృతి
మరియు స్మృతి మధ్య
వివాదం అనిపించినపుడు , ముక్కుసూటిగా
ఎవరైనా ఎపుడైనా శృతిని మాత్రమే అంగీకరించాలి.
>సనాతన ధర్మంలోని కొన్ని స్మృతులు :
ఉపనిషత్తులు ,మనుస్మృతి,పరాశర స్మృతి,
గౌతమ స్మృతి,లికిత స్మృతి,దక్ష
స్మృతి,..ఇలా చాలా ఉన్నాయి .

హిందూ హిందుత్వం


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML