గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 18 May 2014

మాట్లాడడానికి ధైర్యం కావాలి..!!

మాట్లాడడానికి ధైర్యం కావాలి..!!

అబద్ధాలతో ముసుగు వేయబడిన సమాజంలో నిజం మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి.. ఒక్క నిజాలే కాదు.. మంచీచెడులు చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి.

ప్రతీ ఒక్కళ్లూ "ఈ సమాజం మారదు.. మార్చలేము.. మన కంఠశోష తప్పించి ఎవరూ ఆలోచించరు.. అయినా మనకెందుకు.. మన పనేదో మనం చూసుకోక" అనే ఓ లౌక్యపు ధోరణికి బాగా అలవాటు పడిపోయారు. ఈ ఆలోచనావిధానం కలిగిన కొంతమంది మిత్రులు చాలాసార్లు నాతో చెప్తూనే ఉంటారు.. "సర్ మీరు ఓ పత్రిక ఎడిటర్‌గా ఓ గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు.. మీరు చెప్పేవి వాస్తవాలే అయినా అవి కొంతమందికి రుచించకపోవచ్చు.. వదిలేయండి సర్" అని!

కరెక్టే.. నేను నోరు తెరిచి మాట్లాడే ప్రతీసారీ రకరకాల మనస్థత్వాల వ్యక్తులు తారసపడుతూనే ఉంటారు... చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోక ఏ పాయింట్ దగ్గరో లాజిక్‌లూ, ఆర్గ్యుమెంట్లు తీసి నన్నూ దిగజార్చాలని ప్రయత్నిస్తుంటారు. కానీ నేను మాట్లాడే ప్రతీ విషయంపై నాకు స్పష్టత ఉంటుంది.. కొన్నిసార్లు నా అభిప్రాయాలు తప్పు కూడా కావచ్చు. నేను ఏది మాట్లాడినా నా అభిప్రాయాలుగా వెల్లడించడానికి ఇష్టపడతాను తప్పించి డిబేట్లు పెట్టి "నేను చెప్పిందే కరెక్ట్" అని నెగ్గించుకోవడానికి ప్రయత్నించను. సో ఈ కారణంగానే నా అభిప్రాయానికి దూరంగా రాయబడే కామెంట్లని నిర్థాక్షిణ్యంగా తొలగించిన సందర్భాలూ అనేకం ఉన్నాయి.

సరే అసలు విషయానికి వస్తే... సొసైటీలో కొన్ని సెన్సిటివ్ విషయాలుంటాయి.. కులం, మతం, ప్రాంతం, సినిమాలూ, రాజకీయాలూ, జెండర్, ఇతర సోషల్ ఇష్యూస్‌పై ప్రతీ ఒక్కరికీ ఏవో కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉంటుంటాయి. ఈ నేపధ్యంలో నన్ను వ్యక్తిగా అభిమానించే వాళ్లెంతో మంది.. నేను ఆయా విషయాలపై వారి మనోభావాలకు వ్యతిరేకంగా స్పందించినప్పుడు నాపై లోపల్లోపల ద్వేషం పెంచుకోవడమూ చాలాసార్లు గమనించాను.. అలాగే వారికి అనుకూలంగా మాట్లాడినప్పుడు విపరీతమైన ప్రేమ కనబరచడమూ గమనించాను. ఇక్కడ మనుషులు దూరమవుతున్నారని భయపడి నేను ఏరోజూ వాస్తవం మాట్లాడకుండా ఆగిపోలా. అలాగే మనుషుల్ని మచ్చిక చేసుకోవడం కోసం చెడుని వెదజల్లడానికి ప్రయత్నించలా.

ఖచ్చితంగా నేను రాసే ప్రతీ దానిలోనూ సమాజహితం ఉంటుంది.. ఆఫ్టరాల్ బ్రతికున్నప్పుడు కూడా మనమందరం సంతోషంగా కలిసి బ్రతక్కపోతే ఎలాగన్నది నా ఆలోచన. అందుకే మనుషుల్నీ, స్నేహాల్నీ, వైవాహిక బంధాల్నీ, కుటుంబ సంబంధాలనూ విడదీసే ప్రతీ అంశంపై రాస్తూనే ఉన్నా. ఇటీవల ఫెమినిస్టుల విపరీత ధోరణుల గురించి రాసినా మగా ఆడా మధ్య స్పర్థలు పెంచేవాళ్లని ఉపేక్షించలేకే రాశాను.. ప్రాంతాల మధ్య. తద్వారా జనాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ల గురించి రాసినా మనమంతా కనీసం మనస్సులోనైనా సంతోషంగా కలిసి ఉండలేకపోతున్నామే అన్న ఆవేదన కొద్దీనే రాశాను.. అంతకుముందు చాలానే ఇలాంటి సున్నితమైన అంశాల గురించి రాయడం జరిగింది.

ఓ వివాదం జరుగుతున్నప్పుడు.. మధ్యలో మంచి చెప్పే వాడిని ప్రతీ ఒక్కడూ పూచికపుల్లలానే భావిస్తాడు... మంచి చెప్పే వాడంటే, కొట్టుకుంటుంటే సర్ధి చెప్పేవాడంటే కొట్టుకునే వాళ్లిద్దరికీ కోపమే. లేదా మంచి చెప్పే వాడిని ఏదో ఒక పక్షపాతిగా ముద్ర వేసి పక్కన పెట్టేస్తారు.. మన దౌర్భాగ్యం ఏమిటంటే చాలామంది సరిగ్గా చదవరు, సరిగ్గా బుర్రకు ఎక్కించుకోరు, అవతలి మనిషి ఎలాంటి వాడో తెలుసుకోకుండానే ఏవో రెడీమేడ్ ఉద్దేశాలు ఆపాదించేస్తారు.. సో దీంతో చాలామంది ఏవైనా నాలుగు మంచి మాటలు చెప్పాలన్నా "ఆ మనకెందుకులే, జనాలు మూర్ఖులు, సరిగ్గా అర్థం కాదు" అని కామ్‌గా ఉండిపోతుంటారు. వివిధ రంగాల్లో ఉన్న చాలామంది మేధావులు కూడా సొసైటీకి ఏమీ చెప్పలేక తమ పనేదో తాము చేసుకుంటూ పోవడానికీ కారణం ఇదే.

------------------

నా విషయంలో ఏరోజూ నా స్థాయి తగ్గిపోతుందనో, నాకు జనాలు ఏదేదో ఊహించుకుని దూరం అయిపోతారనో భయపడి మాట్లాడకుండా ఉండిపోలా. సమాజానికి మంచి అనుకున్నది.. వినేవాళ్లకు జీర్ణించుకోవడానికి కష్టమైనదైనా నిర్మొహమాటంగా, ధైర్యంగా రాస్తూ ఉన్నాను. ఈ క్రమంలో నాకు దూరమైన జనాలెందరో..

తాగొద్దంటే తాగేవాడికి కోపం.. తిరగొద్దంటే తిరిగే వాడికి కోపం.. పద్ధతిగా ఉండమంటే విచ్చలవిడిగా ఉండే వాళ్లకు కోపం... బాధ్యతగా ఉండమంటే బాధ్యతారాహిత్యంగా ఉండే వాడికి ఒళ్లు మండుతుంది.. కష్టపడదాం.. అంటే "ఆ చెప్పొచ్చారులే.. మీ పని మీరు చూసుకోండి.." అంటూ జల్సాలు చేసే వాళ్లు పెదవి విరుస్తారు... అన్నీ నాకు తెలుసు.. అయినా నేను "ఇవ్వాళ రేపు సమాజం ఇలాగే ఉంది" అని సరిపెట్టుకునే రకం కాదు. మంచిని కూడా ధైర్యంగా చెప్పలేని మన గొంతుకలెందుకు?

అలాగే నాకు జనాల బలప్రదర్శన చేసుకునే సీనూ, ఆసక్తీ లేదు.. నా చుట్టూ ఎవరూ లేకపోయినా.. వందల మందీ, వేలమందీ ఉన్నా నా మానసికస్థితి ఒకేలా ఉంటుంది. సో తప్పునీ, చెడునీ ఉన్నదున్నట్లు ఒప్పుకుందాం, మాట్లాడుకుందాం, సరిచేసుకుందాం తప్పించి చెప్పేవాడికి దూరం అయితే నష్టపోయేదెవరో గ్రహించండి. అలాగే నా ప్రతీ అభిప్రాయానికీ ఏదో ఒక బ్రాండింగ్ వేసేస్తే కష్టం.

గమనిక: ఇది జనరలైజ్డ్‌గా రాసింది తప్పించి ఈ పోస్టుకి ఎలాంటి నేపధ్యమూ లేదు.. ఎన్నాళ్లగానో నేను గమనించిన విషయాలు ప్రస్తావించానంతే.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML