గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 18 May 2014

వడ దెబ్బ

వడ దెబ్బ 
హీట్ స్ట్రొక్ అనగా, శరీరము అధిక ఉష్ణోగ్రత కి గురి అయినప్పుడు, ఆ అధిక ఉష్ణోగ్రత వలన మన శరీరము లో శారీరక పరమైన, నాడీ వ్యవస్త పరమైన వ్యాధి లక్షనాలు కనపడటం..
సాధారణం గా మన శరీరం లో జరుగు రసాయన చర్యల వలన (మెటబాలిజం) హీట్ జెనెరెట్ అవుతుంది.. అలా వుత్పత్తి అయిన "వేడి" మన శరీరం లో ని ఉష్ణ సమతుల్యత ని కాపాడె అవయవాలు అయిన చర్మము ద్వారా చెమట(స్వెట్) వలన గాని బయటకు పంపబడుతుంది..కాని మన శరీరము అధిక ఉష్ణొగ్రత ల కి కాని, డీహైడ్రేషన్ కి కాని గురి ఐనప్పుదు, పైన చెప్పబడిన రక్షణ మార్గాలు(చర్మము , ఊపిరి తిత్తులు) సరిగా పని చెయవు..అందువలన మన శరీరపు ఉష్ణోగ్రత ఒక్కసారి గా 43″ డిగ్రీ సెంటి కి చేరుకుంటుంది.. ఇదే హీట్ స్ట్రోక్ .

సాధారణం గా హీట్ స్ట్రోక్ కి గురి అయ్యె అవకాశం యెక్కువ గా వుండే వాళ్ళు- చిన్న పిల్లలు (2 సం"ల లోపు), బాగా పెద్ద వాళ్ళు, క్రీడాకారులు, ఎక్కువగా ఒపెన్ స్తలాల లో పని చేస్తు ప్రత్యక్షం గా సూర్యరస్మి కి గురి అయ్యె వారు..

వ్యాది లక్షణాలు

1. అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడి బారటం, దప్పిక ఎక్కువ అవ్వడం,
2. వాంతులు అవ్వడము,
3. నీరసం,
4. దడ, ఆయాసము, గుండె వేగంగా కొట్టుకోవడము,
5. కనఫ్యూజన్, చిరాకు, స్థలము-సమయం తెలియక పోవడం,
6. బ్రమల తో కూడుకున్న అలోచనలు కలగడము,
7. చివరి గా స్పృహ కోల్పోవడము. (తెలివి తప్పిపోవడం)…

చికిథ్స

వడ దెబ్బ అనేది ఒక మెడికల్ ఎమెర్జెన్సి..అత్యవసరం గా చికిథ్స చేయవలసి వుంటుంది, లేకపోతె ఒక్కొసారి ప్రాణాల కే ప్రమదాం..కాని కొద్ది పాటి జాగ్రత్త లతో కూడుకున్న ప్రధమ -చికిత్సకే చాలా త్వరగా కోలుకుంటారు..
1. మొదటిగా పేషంట్ని చల్లపరచాలి.. బట్టలు తీసి, చల్లని నీటి ఆవిరిని కాని, నీరు కాని మొత్తం శరీరం అంతా సమం గా అప్లై చేయాలి..చల్లని నీరు ఆవిరి రూపం లో ఐతె శరీరం అంతా సమం గా వుంటుంది..
2. చల్లని ఐస్ వాటర్ లో తడిపిన వస్తరాలు కప్పాలి..
3. భుజాలు కింద (ఆక్జిల్ల), గజ్జల్లో ను చల్లని ఐస్ ముక్కలు వుంచాలి..
4. యివి చేస్తూ 108 సర్వీస్ కి కాని, దగ్గర లో వున్న హాస్పిటల్ కి కాని తీసుకు వెల్లాలి..
5. అక్కడ యేమన్న కాంప్లికేషన్స్ వుంటె వారు తగురీతి లో స్పందిస్తారు అవసరాన్ని బట్టి ..
నివారణ మార్గాలు

వడ దెబ్బకి గురి కాకుండా తగు నివారణోపయాలు తీసుకుంటె చాలా మంచిది.. అవి ఏమిటి అంటే...
1. తరచుగా చల్లని నీరు త్రాగడం,
2. బయట పని చేసే వళ్ళు అప్పుడప్పుడు విరామం తీసుకోవడం…
3. సాధ్యమైన వరకు మిట్ట మద్యాహ్నం ఎండలో తిరగ కూడదు .
4. వేసవిలో తెల్లని వదులైన కాటన్క్ష్ దుస్తులు ధరించాలి .
5. మధ్యం సేవించకూడదు .
6. గదుల ఉష్ణోగ్రత తగ్గించే చర్యలు తీసుకోవాలి .


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML