గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

’వైశాఖే మాధవో, రాధో’

'వైశాఖే మాధవో, రాధో'
వైశాఖమాసాన్ని 'మాధవామాసం' అని అంటారు. ఈ మాసంలో విష్ణుస్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం.
ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః!
అదే విధంలో
"మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన
ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్!! - అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది.
తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్!
విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్!!
మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః!
త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః!!
వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం.
ప్రాతః స్నానానంతరం అధికజలంతో అశ్వత్థ (రావి) వృక్షపు మూలాన్ని తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు.
ఈ మాసంలో ఒంటిపూట భోజనం లేదా నక్తం (పగలంతా ఉపవసించి రాత్రి ప్రారంభంలో భుజించడం) ఆచరించడం మంచిది.
ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం పుణ్యఫలాన్నిస్తుంది.
ఈ నెల శివుని అభిషేకించడం సంతతధారగా నీరు పడేలా శివలింగానికి పైన 'గలంతిక'ను (ధారాపాత్ర) ఏర్పాటు చేయడం శుభఫలాన్నిస్తుంది.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML