గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

ప్ర: తిరుమలలో నెలవైన దేవుడు శ్రీనివాసుడుగా పురాణ ప్రశస్తి. దేవునికి వేంకటేశ్వరనామం ఎప్పుడు ఏర్పడింది? ప్రచారంలో ఉన్న ఈ రెండు నామాలను వదలి ’గోవింద’ స్మరణ జరపడానికి మూలమేమిటి?

ప్ర: తిరుమలలో నెలవైన దేవుడు శ్రీనివాసుడుగా పురాణ ప్రశస్తి. దేవునికి వేంకటేశ్వరనామం ఎప్పుడు ఏర్పడింది? ప్రచారంలో ఉన్న ఈ రెండు నామాలను వదలి 'గోవింద' స్మరణ జరపడానికి మూలమేమిటి?

జ: 'శ్రీనివాస', 'గోవింద' నామాలు విష్ణువునకు సహజనామాలు.
'వేంకటేశ' నామ క్షేత్రదైవంగా వచ్చిన నామం.
లక్ష్మీ దేవి (శ్రీ) ఎల్లప్పుడు నారాయణుని ఆశ్రయించుకొని ఉండడం చేత ఆయనను 'శ్రీనివాస' అన్నారు. 'గో' అంటే వేదవాక్యాలు. 'భూమి' అని రెండర్థాలు. 'గోవిందుడు' అంటే 'వేదములచే నుతింపబడే పరతత్త్వం', 'వేదాల ద్వారా తెలియబడే పరబ్రహ్మ' అని అర్థంతో పాటు 'భూమిని గ్రహించి, ప్రళయ జలాలనుండి ఉద్ధరించిన ఆదివరాహస్వామి' అని కూడా అర్థం ఉంది. ఇంక కృష్ణుడు గోపాలకుడు కనుక 'గోవిందుడు' – ఇలా మూడు అర్థాలలోనూ నారాయణుడు తెలియబడుతున్నాడు. 
కృతయుగంలోనే భూదేవి ప్రార్థన మేరకు, బ్రహ్మాదుల కోరిక మేరకు నారాయణుడు పృథ్విపై తన విభూతులతో విహరించదలచుకున్నాడు. ఆయన విహారం కోసం ఆదిశేషుడే పర్వతంగా వెలశాడు. అందుకే అది శేషాద్రి. ఆదివరాహస్వామి (భూమిని ఉద్ధరించిన గోవిందుడు) రూపంలో అక్కడ మొదటిసారిగా విహరించాడు శ్రీహరి. శ్రీహరి విహారం చేత ఆ పర్వతం పరమపావనమై దర్శించిన వారి పాపాలను నశింపజేసే శక్తిమంత క్షేత్రమయింది. 'వేం' అంటే 'పాపములను', 'కట' అంటే సంహరించునదు' అని అర్థం. "వేంకట – పాపసంహారకం". ఆ పర్వతంపై వెలసి భక్తులను పావనులను చేసే స్వామి కనుక శ్రీవేంకటేశ్వరుడు. మరొక అర్థంలో "వేం" అమృతబీజం. "కట" ఐశ్వర్య వాచకం. అమృతం (ఆనందం), ఐశ్వర్యం అందించే విష్ణు పర్వతం వేంకటాచలం.
కలియుగారంభంలో మరియొక రూపంలో స్వామి ఈ పర్వతానికి వచ్చి శ్రీలక్ష్మి అవతారమైన పద్మావతిని వివాహమాడి, తన ఆదిరూపమైన వరాహస్వామి అనుమతితో ఇక్కడ వెలశాడని పురాణ కథ


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML