గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 May 2014

శని గ్రహ దోష సమయములో ఆచరించ వలసిన నియమాలు : వీటి లో ఏవైనా వీలును బట్టీ కొన్ని పాటించ వచ్చును

శని గ్రహ దోష సమయములో ఆచరించ వలసిన నియమాలు :

* శనివారం రోజున  శివునికి అభిషేకం 
* మంద పల్లె లో శనీస్వరుని కి శని త్రయోదశి నాడు అభిషేకం 
* ప్రతి రోజు శివాలయమును దర్శించి, నవగ్రహాలకు 19 ప్రదక్షణములు చేయటం 
* శనివారం నాడు బ్రాహ్మణునికి, 1 1/4  కేజి నువ్వులు దానం ఇవ్వటం 
* ప్రతి శనివారం ఆవపిండి కలిపినా పెరుగు  అన్నాన్ని  గోవుకు పెట్టవలెను 
* శనివారం నాడు  శివాలయం లో నవగ్రహాలకు, శని గ్రహానికి నల్ల ఉమ్మెత్త్త,విష్ణు క్రాంత పూలతో అస్టొత్తర పూజ చేయించవలెను 
* ఇంద్ర నీలము , నీల మణి రత్నమును కుడి  చేతికి ధరించ్చ వలెను 
* ప్రతి రోజు శని స్తోత్ర పారాయణము చేయవలెను 
* నల్లని ద్రాక్షపళ్ళు, నల్లని వస్త్రం , నీలి వస్త్రం, దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి దానం ఇవ్వండి ( పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర, నక్షత్రములు ఉన్నరోజున మరి మంచిది  ) 
* శని గాయత్రి  మంత్రం  తో   19 సార్లు ప్రార్దించండి 
" రవిపుత్రాయ విద్మహే యమాగ్రజాయ ధీమహి తన్నోహ్ శనిహ్ ప్రచోదయాత్ "
* ఆలయ  నవగ్రహాలలో శని గ్రాహం వద్ద 19 వత్తులతో నువ్వుల నూనెతో దేపారాధన చేయవలెను 
* శనివారం, శని హోమం చేయించిన 
* 7- శని వారాల వ్రతం చేసిన 
* వేంకటేశ్వరుని స్తోత్రాలతొ ప్రార్దించిన 
* ప్రతి రోజు వేంకటేశ్వరుని ఆలయమును దర్సిన్చ్చిన 
* శనివారం రోజు  నువ్వుల ఉండను కాకులకు పెట్టిన 
* వెంకటేశ్వరునికి తల నీలాలు సమర్పించిన 
* ప్రతి నిత్యం మృత్యుంజయ మంత్రం చదవ వలెను 
* నల మహా రాజు చరిత్ర, సుందరా కాండ, వెంకటేశ్వర మహత్యం పారాయణం చేయవలెను Read More

గరుడ పురాణమ్ ఎవరైనా చనిపోయిన రోజులో మాత్రమే చదవాలంటారు నిజమేనా


Read More

వైద్యో నారాయణొ హరి అను మాటకి అర్ధం ఏమిటో తెలుసా

వైద్యో నారాయణొ హరి అను మాటకి అర్ధం ఏమిటో తెలుసా Read More

అహింస


Read More

నీతి వాక్యం

నీతి  వాక్యం


Read More

అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?’’ అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ‘‘పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?’’ అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ‘‘అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను’’ అని.నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో’’ అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తేఅద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికితోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి, తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి. బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు. భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.
Read More

సూర్యారాధన చేయడం వల్ల భుక్తి ముక్తి లభిస్తాయనడంలో సందేహం లేదు

సూర్యారాధన చేయడం వల్ల భుక్తి ముక్తి లభిస్తాయనడంలో సందేహం లేదు. అది ఎందరికో స్వానుభవం. భుక్తిముక్తులు రెండూ ఇవ్వగలిగిన శక్తి సూర్యారాధనలో ఉంది. అయితే సూర్యారాధన చేయకపోతే పాపం వస్తుంది. అందులో సందేహమేమీ లేదు. ఇది శాస్త్రం చెప్తున్న విషయం. సూర్యునికి సంబంధించి మనం చేసే కొన్ని అపచారాలు ఎలాంటి దుర్దశలు మనకి ఇస్తాయో శాస్త్రం చెప్తున్నది. సంధ్యలలో నిద్రపోవడం, అనాచారములు పాటించడం, ఇటువంటివన్నీ సూర్య సంబంధమైన అపచారాలు. ఉపాసన చేయకపోతే పోయావు. ఇంకా అపచారాలు చేసి పాపానికి పోతావా అని కూడా మందలిస్తోంది శాస్త్రం మనల్ని. సూర్యుని ఉపాసించిన వాడికి, ఉపాసించని వాడికి ఆయననుంచి వచ్చేశక్తిలో భేదం ఎలా ఉంటుంది? అనేది అర్థమైంది ఒక పాశ్చాత్యుడు చేసిన పరిశోధనవల్ల. ఎందుకంటే పాశ్చాత్యుడు పరిశోధిస్తేనే కానీ తెలుసుకోరు (నమ్మం). శ్రద్ధ ప్రమాణం కాదు అనుభవం కావాలి.

ప్రత్యక్షంగా మనిషికి భక్తి భావం లేకపోయినా కాసిని పువ్వులు ఒక రాగిపాత్రలో వేసి సూర్యుడికి చూపించి దణ్ణంపెట్టి అదే తీక్ష్ణమైన ఉష్ణోగ్రతలో నిలబడి పరీక్షచేసుకుంటే శరీరంలో నార్మల్ గా ఉంది. మనం కాసింత నమస్కరిస్తే మన భక్తికి వందరెట్లు స్పందించే చైతన్యమూర్తి మహానుభావుడు సూర్యభగవానుడు.

సూర్యభగవానుడు పూర్తిగా కాంతి స్వరూపము. ఆ కాంతి పూర్తిగా ప్రేమ స్వరూపము. కనుక సూర్యుడు అంటే ప్రేమ స్వరూపము. ఆయననుంచి వచ్చే ప్రతి కిరణమూ ప్రేమే. అయితే భగవంతుని విషయంలో ప్రేమ అంటే కారుణ్యం. ప్రేమ స్వరూపుడు అంటే కారుణ్యస్వరూపుడు. "రక్తః సర్వ భవోద్భవః" - రక్తః అనేమాటకి అర్థం చెప్తూ ఎర్రగా ఉన్నవాడు అనే మాత్రమే కాకుండా అనురక్తి(ప్రేమ) కలవాడు అని చెప్పారు. పరమేశ్వరుడే తన తేజస్సు సూర్యునిద్వారా అందిస్తున్నాను అని ప్రకటించుకున్నాడు. "యదాదిత్య గతం తేజః జగత్ భాసయతేఖిలం, యద్ చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజోవిద్దిమామకం " - నా తేజస్సే సూర్యునిద్వారా వస్తుంది అని తెలుసుకో. చంద్రుడు, అగ్ని అని కూడా చెప్పాడు కదా! అంటే ఆ చంద్రుడికి, అగ్నికి తేజస్సు సూర్యుడిద్వారానే వస్తుంది కదా! అందుకు సూర్యునిలో ఉన్న మహాతేజస్సు సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు, నారాయణుడన్న, శివుడన్నా, అమ్మన్నా ఎవరైనా అనండి. అమ్మ అంటే "భానుమండల మధ్యస్థా" అయిపోతుంది. మొత్తానికి సూర్యభగవానుడు సర్వదేవతాత్మకుడు.
Read More

నృసింహ ద్వాదశనామ స్తోత్రం

నృసింహ ద్వాదశనామ స్తోత్రం
ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః
నవమం ప్రహ్లాద వరదో దశమోzనంత హస్తకః
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్థా
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః
మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్!!
క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే
గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్!!
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్
ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్!!


Read More

గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత - గ్రామదేవత

గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత - గ్రామదేవత. గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో యెన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం యెన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతాంత్రికతలు, పవిత్రీకరణ, ఆత్మహింస , బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి
గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపలను గ్రామదేవతలని అందురు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సంధర్బాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.
ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.


Read More

విఘ్నాలను తొలగించి శుభాలనిచ్చే శుభదాయకుడు గణపతి. అన్ని శుభకార్యాలలో ఆయనకే అగ్రపూజ. ఈ జగమంతా గణమయం.

విఘ్నాలను తొలగించి శుభాలనిచ్చే శుభదాయకుడు గణపతి. అన్ని శుభకార్యాలలో ఆయనకే అగ్రపూజ. ఈ జగమంతా గణమయం.
జగత్పతి అయిన పరమేశ్వరుడే గణేశుడు. గణపతి "గ" వర్ణప్రియుడు. అందుకే గణపతి,గణేశ నామాలు అంత శక్తివంతమైనవి. "గ" అనే శబ్దం ఙ్ఞానవాచకం. "ణ" అంటే నిర్వాణం. ఙ్ఞాన నిర్వాణలకు శాసకుడైన అధిపతి కనుక గణేశుడు అని అన్నారు. ఆయన విఘ్న గణపతి మాత్రమే కాదు. వరద గణపతి కూడా..గణపతిని శ్రద్ధా భక్తులతో పూజిస్తే,తల పెట్టిన కార్యానికి సంబందించిన దేవత కూడా తుష్టి పొంది ఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది. గణపతి ఉపాసన వల్ల శత్రు క్షయం కూడా జరుగుతుంది. గ్రహబాధలు తొలగి,కన్యలకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. శ్రీ గణపతిని పూజించిన వారు జీవన్ముక్తులవుతారు. జీవితం ధన్యమవుతుంది.
ఓం గం గం గణపతయే నమః
Read More

నారాయణ తీర్థులకు బోధేంద్రసరస్వతీస్వామి వారి దివ్య ప్రేరణ లభించింది

నారాయణ తీర్థులకు బోధేంద్రసరస్వతీస్వామి వారి దివ్య ప్రేరణ లభించింది. మహాత్ములు శరీరంతో కనపడి ప్రేరేపించాలనే లేదు. శరీరం త్యజించినా బ్రహ్మైక్యం చెందినవారు గనుక దివ్యమైన తేజస్సుతో ప్రేరణ కలిగిస్తూ ఉంటారు. ఆ భక్తే ధర్మాన్ని నిలబెడుతుంది. అదే జ్ఞానాన్ని కలిగిస్తుంది గనుక కృష్ణభక్తిని ప్రచారం చెయ్యి అని ఒకానొక స్ఫురణ ఈయనకి కలిగి అక్కడినుంచి బయలుదేరి వస్తూండగా ఆయనకు ఒకచోట అద్భుతమైన అనుభూతి కలిగింది. అక్కడినుంచి నడికావేరి అనే ప్రాంతానికి చేరుకున్నారు. అది ఒక క్షేత్రము. మధ్య కావేరి అని సంస్కృతంలో దీనిని చెప్పవచ్చు. అక్కడ విశ్రాంతిగా ఒక ఆలయంలో కూర్చున్నారు. మహాగణపతి మందిరం అది. ఆ సమయంలో కడుపునొప్పి మరింత ఎక్కువైంది. దానిని పరిణామ శూలవ్యాధి అంటారు వైద్యశాస్త్ర ప్రకారంగా. అది పెరిగినప్పుడు మరొక్కమారు వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ వేదన భరించలేకున్నాను అని బాధకలిగి ఆయన శ్రీనివాసుని స్మరించి మరుసటిరోజు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకొని పడుకున్నారు. కలలో శ్రీనివాసుడు ఆయనకు దర్శనమిచ్చి "నువ్వు తిరుమలకు రానవసరం లేదు. నిద్రలేచిన వెంటనే ఏది కనపడి ఎటు దారిచూపిస్తుందో అటువెళ్ళు; అక్కడ నీకు దివ్యదర్శనం లభిస్తుంది; అది నాయొక్క ఆజ్ఞగా భావించు" అని ఆదేశించారు. నిద్రలేచిన వెంటనే ఆయనకు ఎదురుగా ఆయనకొక వరాహం కనపడింది. దానిని అనుసరించి వెళ్ళారు. అది క్రమంగా పడమటి దిశవైపు వెళుతూ ఒక మూడుమైళ్ళు దాటిన తర్వాత దక్షిణం పోయే మార్గంలో రాతికాల్వను ఈదుకొని వెళ్ళి ఒకఊరిలో ప్రవేశించింది. అక్కడ అదృశ్యమైంది వరాహం. ఆ ఊరిపేరు భూపతిరాజ పురము. అక్కడ కావేరీనది ఉపనదియైన కుడమృత్తి అనే నది కూడా ఉన్నది. ఆ ప్రాంతంలో ఆయన ఒక వారంరోజుల పాటు నిద్రాహారాలు కూడా లేకుండా ధ్యానసమాధిలో ఉండిపోయారు. అక్కడ ఆయనకి శ్రీవేంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చారు. ఈచోటును వేంకటేశ్వర స్థలము అని భావించి ఊరువారిని పిలిచి ఆ చోటులో త్రవ్వించారు. అక్కడ ఒక అద్భుతమైన విగ్రహం బయటపడింది. అది లక్ష్మీదేవిని అంకమునందు ఉంచుకున్నటువంటి నారాయణుని విగ్రహం ఒకటి, శ్రీదేవి, భూదేవిలతో కూడిన వేంకటేశ్వర స్వామియొక్క పంచలోహ మూర్తి ఒకటి. ఇవి స్వయంభూమూర్తులుగా భావించి అక్కడ ప్రతిష్ఠ చేసి ఆలయ నిర్మాణం చేశారు. నారాయణ తీర్థుల, ఆలయ ప్రభావం ఊరివారందరిచేత గౌరవింపబడేటట్లు చేసి నారాయణ తీర్థుల వారు దైవసమానంగానూ, ఆచార్యరూపంగానూ భావించి అర్చించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆయనకు నారాయణునిపై కీర్తనలు రచించాలని సంకల్పం కలిగింది. గానరూపమైన ప్రబంధాన్ని రచించాలనే కోరికను కలిగించింది. అదే శ్రీకృష్ణలీలాతరంగిణి రూపంలో శ్రీకారం చుట్టుకున్నది.
Read More

అయ్యప్ప స్వామిని ను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు.

అయ్యప్ప స్వామిని ను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య ( విష్ణువు), అప్ప ( శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు.
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా వుంది.

అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.

అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.

రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.
స్వామియే శరణం అయ్యప్ప !Read More

ఏ కార్యాన్నైనా సాధించాలంటే మనిషికి ముఖ్యంగా కావలసింది సంకల్పబలం.

ఏ కార్యాన్నైనా సాధించాలంటే మనిషికి ముఖ్యంగా కావలసింది సంకల్పబలం. ఈ సంకల్పబలం ఎవరిలో ఉంటుందో వారు తలపెట్టిన కార్యాన్ని సాధించేవరకూ విశ్రమించరు; ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఉత్సాహంతో ఎదుర్కొని ముందుకు పయనిస్తారు, విజయాన్ని సాధిస్తారు. విజయ సౌధానికి పట్టుదలే పునాది.

కార్య సాధనలో ఉత్సాహంగా పయనిస్తున్న ఆంజనేయుణ్ణి సింహిక అనే రాక్షసి బయటకు కనపడకుండా సముద్రంలోనుంచి తనవైపు లాింది. అందువల్ల త్వరితగతిన వెళుతున్న ఆంజనేయుని వేగం మందగించింది. అప్రమత్తంగా ఉన్న ఆంజనేయుడు వెంటనే తనకు కలిగే ఆపదను గ్రహించి సింహికను సంహరించాడు.

కర్తవ్యపాలనలో దృఢచిత్తంలో వెళుతున్న మన వేగాన్ని మందగింపజేసేది మనలో అదృశ్యంగా ఉన్న ’అసూయ’యే సింహిక. ఎవరైనా మనకన్నా అభివృద్ధి సాధించి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదిస్తే మనలో తెలియకుండానే వారిపట్ల అసూయ కలుగుతుంది. అసూయాగ్నితో దహించుకుపోతున్న మనసు ఆలోచనా శక్తి కోల్పోయి మన అభివృద్ధిని మందగింప జేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండి అసూయ అనే సింహికను ఎదుర్కోవాలి.
Read More

హనుమాన్ చాలిసాను హింది అవధిబాషలో రచించినది శ్రీ గోస్వామి తులసీదాసు.


హనుమాన్ చాలిసాను హింది అవధిబాషలో రచించినది శ్రీ గోస్వామి తులసీదాసు.
వీరు యమునా తీరంలో రాజపుర గ్రమాన క్రీ II శ్ II 15 వ శతాబ్దిలో (1497) విప్ర కుటుంబాన జన్మించారు తండ్రి ఆత్మారాం . తల్లి తండ్రులు రామభక్తులు కావడం చేత,కుమారుడు చిన్నతనంలోనే రామభక్తుడై నిరంతరం రామ నామ జపం చేస్తూ ఉండేవారు.అందుకే అతనికి "రాంబోలా" అనే నామం వచ్చింది.
తులసీదాసు వివాహితుడై ధర్మపత్ని రత్నావళీదేవి యెడ అమితమైన ప్రేమతో ఉండేవాడు. క్షణమైనా భార్యను విడిచి ఉండలేని తులసీదాసుకు ఒకసారి రత్నావళి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళడంతో దిగులు కలిగింది. అతడు వర్షాన్ని సైతం లెక్కించక,పొంగిన యమునా నదిని దాటి ,పామును తాడుగా బ్రహ్మించి , దాని సహాయంతో అత్తవారింటికి గోడను దుమికి,అర్ధరాత్రి భార్యను సమీపించాడు. ఆమే ఆశ్చర్యపడి " శల్యమాంసమయమైన ఈ దేహం పై మీకెంత మమత ఉందో,అందులో సగమైనా శ్రీ రామునిపై ఉంటే భవభీతి నశించేది" అన్నది.
దానితో ఆయన మనస్సు చివుక్కుమని, భక్తి ప్రపూరితమైన అతని మనస్సు పరిపాకం చెంది ఉండదంతో,వెంటనే ఆయనకు గాఢవిరక్తి కలిగి ఆయన జీవితంలో గొప్ప మార్పుకు నాంది ఏర్పడింది.
పధ్నాలుగు ఏళ్ళ తీర్థ యాత్ర చేసి నరహార్యానందులవారిని గురువుగా స్వీకరించి "తులసీదాసు" అయ్యాడు. శ్రీ హనుమంతుని అనుగ్రహంతో 1550 IIసంII లో శ్రీ రామ దర్శనం చేసుకున్నాడు, 1575 IIసంII శ్రీ రామ నవమి మంగళవారం "రామ చరిత మానసం " అనే రామాయణాన్ని ప్రారంభించి 2 IIసం II 7 మాసాల 26 రోజులలో పూర్తి చేసారు.
ఈ గ్రంధం భక్తి రసంతో కూడినది. రాముడు భగవంతుడనే అవతార తత్త్వముగా తెలిపే ఆధ్యాత్మ రామాయణాన్ని ఈయన అనుకరించడు. ప్రాంతీయమైన " అవధి" లో సామాన్యునికి కూడా అర్ధమయ్యేటట్లు రచించాడు. రామచరిత మానసాన్ని తెలియనివాడు,ముఖ్యంగా ఉత్తర హిందు దేశంలో ఉండరు . అదోక ధర్మ శాస్త్రం. దీనిని చదివి తరించారు. అవధి భాష అయోధ్యా పరిసరాలలో వాడే భాష. దీనిని అవధూతభాష అని కూడా అంటారు. శ్రీ తులసిదాసు గారిది "తుక్బంధీ" కవిత్వం. అనగ పాదములకు అంత్యనియమముంచాడు . అది శ్రవణ యోగ్యం.
శ్రీ తులసి దాసుగారు రచించిన గ్రంధాలు అనేకాలు. వాటిలో రామచరిత మానసం,వినయ పత్రిక , గీతావళి, హనుమాన్ బహుక్, హనుమాన్ చాలిసా మొదలైనవి ముఖ్యమైనవి. అనేక సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపస్సును ధారబోసి, మంత్రశక్తితో నిండి ఉన్నవి, ఆయన రచనలు. IIక్రిII శ్II 1623 II సం IIశ్రావణ శుద్ధ సప్తమి శనివారం రోజు శ్రీ తులసి దాసు గారు దాదాపు 120 సం బ్రతికి పరమపదించారు.
Read More

పంచ ముఖ ఆంజనేయ రూపం

ఒక్కొక్క ముఖానికి మూడేసి కళ్ళున్నాయిట. అందులో వానరం ముఖం ఏవం - మొదటి ముఖం వానరముఖం; రెండవది సింహవదనం; మూడవది గరుడ వదనం; నాల్గవది వరాహవదనం; ఐదవది హయగ్రీవ వదనం అంటే అశ్వవదనం. వీటితో గోచరిస్తున్నాడు. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కటున్నాయి. భావన చేసేటప్పుడు నాలుగు దిక్కులలో నాలుగు చూస్తూ ఊర్ధ్వ దిక్కున ఒక వదనం ఉన్నది. ఏ దిక్కులో యే వదనాన్ని ధ్యానించాలి చెప్పుకుంటూ వెళ్ళాలి. ఈ క్రమం అచ్చంగా యే క్రమమయ్యా అంటే సద్యోజాతం ప్రపద్యామి క్రమమే. సద్యోజాతవామదేవఅఘోరతత్పురుషఈశాన ముఖములే ఈ వానర నారసింహ గరుడ వరాయ హయాస్య. పంచముఖ పరమేశ్వర స్వరూపమే పంచముఖ ఆంజనేయ రూపం. అక్కడా ఇక్కడా ఒకటే తత్త్వం. పైగా పంచభూతతత్త్వములు ఈ వదనములలో గోచరిస్తున్నాయి. పంచభూతాలను శాసించే పరమేశ్వర తత్త్వమే పంచముఖాంజనేయం. పంచముఖాంజనేయమ్ సాక్షాత్ సదాశివ స్వరూపంగా తెలుసుకోవాలి. అందుకు రుద్రతేజం సంపూర్ణంగా హనుమంతుడిలో ప్రకటింపబడింది పంచవదన స్వరూపంలోనే. అందుకు పంచముఖాంజనేయ రూపం సంపూర్ణ రుద్రతేజంగా భావన చేయాలి మనం. ఒక్కొక్క వదనములో సద్యోజాతాది లక్షణములు, పంచభూత లక్షణము, పంచప్రాణ లక్షణము, పంచేంద్రియ లక్షణము, పంచతన్మాత్ర లక్షణములు కూడ తెలుసుకోవాలి. పంచతన్మాత్రలతో పంచేంద్రియములతో కూడిన సమస్త విశ్వాన్ని నియమించే ప్రపంచ నాయకుడేవరో ఆయన ఆంజనేయ స్వామి వారు. హనుమంతుడిక్కడ ఒక దూతగా కనపడడం లేదు. సాక్షాత్తు పరమేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు. ఏ ముఖధ్యానం వల్ల యే ఫలితం వస్తుందో వివరిస్తుంది మంత్రశాస్త్రం.


Read More

హనుమాన్ చలిస మహత్యం

ఉత్తరభారత దేశంలో క్రీ శ 16 వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసి దాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ,ఓ ప్రాంతీయబాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెప్తాడు. తులసీదాస్ రచించిన "రామచరిత మానస్" సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకధ ను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండే వాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతూండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీ దాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాదుషా కు తరచుగా ఫిర్యాదులు వచ్చేవి. కాని అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇది ఇలాగ ఉండగా వారణాసి లో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు,తన ఏకైక కుమారునికి చక్కని అమ్మాయితో వివాహం జరిపించారు. వారిద్దరు ఆనందంగా జీవితం సాగిస్తూ ఉండగా ,విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపొయిన అతని భార్య హృదయవిదారముగా విలపించసాగింది. చనిపోయిన యువకుడికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతున్న ఆమెను బంధువులంతా ఆపుతూ ఉండగా ,ఆమె అక్కడ పక్కన తులసిదాస్ ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదాల వద్ద పడి రోదించసాగింది. అప్పుడు ఆయన రామ నామ ధ్యానం లో ఉన్నారు. హఠాత్తుగా కన్నులు విప్పి ఆమెను చూసి " దీర్ఘసుమంగళీ భవ" అని దీవించారు. అప్పుడు ఆమె జరిగినది అంతా తులసీ దాస్ కు విన్నవించుకుంది. అప్పుడు తులసీ దాస్ గారు....నా నోట అసత్యం పలికించడు రాముడు....అని అంటూ..... అప్పుడు ఆయన వారి కమండలం లో జలమును తీసి ఆ యువకుని దేహం మీద చల్లగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. ఆ మరు క్షణం అతను పునర్జీవితుడయ్యాడు. ఈ సంఘటన ప్రత్యేకించి తులసీ దాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామ భక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ అయిపో సాగింది. ఇంక ఉపేక్షించితే కుదరదు అని గ్రహించిన ఇతర మత పెద్దలంతా పాదుషా వద్దకు వెళ్ళి జరుగుతున్నవి వివరించి తగిన చర్య తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ పాదుషా వారు తులసీ దాస్ ను తన దర్బార్లోకి రప్పించారు. అప్పుడు ఆయనతో విచారణ ఇలా సాగింది. పాదుషా : తులసీ దాస్...మీరు రామనామం అన్నిటి కన్నా గొప్పది అని ప్రచారం చేస్తున్నారట? తులసీ దాస్ : అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీ రాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరం కాదు.! పాదుషా : సరే...మేము ఇక్కడ ఒక శవాన్ని చూపిస్తాము...దానికి ప్రాణం పోయండి ...రామ నామం తో బ్రతికించండి..అప్పుడు మీరు చెప్పినది నిజమని మేము నమ్ముతాము... తులసీ దాస్ : క్షమించండి ప్రభూ! ఫ్రతి జీవికి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి....మానవమాత్రులు మార్చలేరు.. ఫాదుషా : అయితే తులసీ దాస్ జి! ఈ మాట ను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవి అన్నీ అబధ్ధాలు అని సభాముఖముగా అందరిముందు ఒప్పుకోండి! తులసీ దాస్ : క్షమించండి ...నేను చెప్పేది నిజం! పాదుషాకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. "తులసి...మీకు ఆఖరి సారి అవకాశం ఇస్తున్నాను...నీవు చెప్పేవన్ని అబద్ధాలు అని ఒప్పుకో.....నీవు చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి నీ ప్రాణాలు దక్కించుకో.." అని పాదుషా వారు తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీ దాస్ కనులు మూసుకొని, ధ్యాన నిమగ్నుడై శ్రీ రామ చంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారముగా భావించిన పాదుషా తులసిని బంధించమని ఆదేశించాడు. అంటే.....ఎక్కడ నుండి వచ్చాయో ....కొన్ని వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసి దాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని ,వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్తు సంఘటనతో అందరు హడలిపోయి ఎక్కడివారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీ దాస్ కు సింహద్వారంపై హనుమ దర్శనము ఇచ్చారు. ఒడలు పులకించిన తులసీ దాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమ " తులసీ ! నీ స్తోత్రముతో మాకు చాలా ఆనందమైనది..ఏమి కావాలో కోరుకో...." అన్నారు..అందుకు తులసీదాస్ "తండ్రీ! నాకేమి కావాలి....! నేను చేసిన ఈ స్తోత్రము లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు,నా జన్మ చరితార్ధమవుతుంది. నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా,వారికి అభయం ప్రసాదించు తండ్రీ!" అని తులసి కోరుకున్నాడు. ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమ "తులసి ! ఈ స్తోత్రం తో మమ్మల్ని ఎవరు స్తుతించిన,వారి రక్షణ భారం మేమే వహిస్తాము" అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు "హనుమాన్ చాలీసా" కామధేనువు అయి భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక "హనుమాన్ చాలీసా" దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామ జ్యోతి ఎప్పటికి వెలుగుతూనే ఉన్నది... శ్రీ రామ జయ రామ జయ జయ రామ !!!!!!!!!Read More

స్వర్గానికీ, నరకానికీ కూడా అతీతమైన మరొక స్థితి ఉన్నదనే మాట ఇంతవరకు ప్రపంచంలో ఇంకే మతాలకీ తెలియలేదు.

స్వర్గానికీ, నరకానికీ కూడా అతీతమైన మరొక స్థితి ఉన్నదనే మాట ఇంతవరకు ప్రపంచంలో ఇంకే మతాలకీ తెలియలేదు. పరిశీలించి చూడండి. పుణ్యము చేసిన Heaven కు పోదువు, లేదా Hell కు పోదువు. వాళ్ళ భాషలోనే చెప్తున్నాను. వాళ్ళకి తెలిసిందొక్కటే - స్వర్గం, నరకం. మరొకటుందని తెలియదు. మరొకటుందయ్యా అన్నారు. అది స్వర్గంకంటే, నరకంకంటే ఇక్కడికంటె గొప్పదది. అక్కడ కేవలం ఆత్మజ్ఞానం వల్ల లభించే మోక్షము, దానిని పరమార్థము అంటారు. ఇహము, పరము, పరమార్థము. ఇక్కడ దుఃఖం గురించి మాట్లాడడం లేదు. కేవలం సుఖం గురించి మాట్లాడుతున్నాను. ఇహంలో సుఖపడడం, పరలోకాలలో సుఖపడడం, ఇవి ఎప్పుడో ఒకప్పుడు నశించేవి కనుక ఎప్పుడూ నశించని శాశ్వతమైన మోక్షసుఖాన్ని పొందడం - ఈ మూడూ లక్ష్యములుగానే తపించుతూంటాం. మనలో కొంచెం తెలివైన వాళ్ళు ఇక్కడ సుఖపడే ప్రయత్నాలు చేస్తూంటారు, మరికొంచెం తెలివైన వాళ్ళు పరంలో కూడా సుఖపడాలని ప్రయత్నిస్తారు. ఇంకా తెలివైన వాళ్ళు ఇహపరాలకు అతీతమైన పరమార్థ సుఖంకోసం శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళని మనం జ్ఞానులు, యోగులు అని అంటాం. కనుక ప్రతివారూ ఈ మూడురకాల సుఖాల కోసం తాపత్రయ పడతారని తేలిపోయింది. అయితే ఇహలోకంలో సుఖపడాలని ప్రయత్నిస్తున్నా సుఖపడలేక పోతున్నాం. కష్టం వద్దనుకుంటున్నా అనుభవించక తప్పడంలేదు. ఇది కదా మనకొచ్చిన సమస్య. అందుకోసం ఏం చేయాలి? అనారోగ్యం వచ్చింది. అది తొలగించుకోవడానికి మందు వాడతాం. మందు వాడుతున్న వాళ్ళందరూ అనారోగ్యం నుంచి బయటపడుతున్నారా? భౌతికమైన కొన్ని ప్రయత్నాలు చేయడం వల్ల సుఖపడగలము అంటే పడుతున్నారా? ఇద్దరికి ఒకేరకమైన జబ్బు వచ్చింది. ఇద్దరూ ఒకే వైద్యుడి దగ్గరకు వెళ్ళారు. ఆ వైద్యుడు కూడా నిష్పక్షపాతంగా ఇద్దరికీ ఒకే రకమైన చికిత్స చేశారు. కానీ అందులో ఒకడు బాగుపడ్డాడు, ఇంకొకడు బాగుపడలేదు. దేనివల్ల? దీనికోసం శాస్త్రాలు వెతకక్కరలేదు. అందరికున్న అనుభవమే. ఏ రోగమొస్తే తొందరగా మరణిస్తామని భయపడతామో అదే రోగంతో నూరేళ్ళు బ్రతికిన వాళ్ళున్నారు. ఏ రోగమొస్తే ఇంకేమీ చేయలేం పడుకోవలసిందే అనుకుంటామో అదే రోగంతో ఎన్నో సాధించిన వాళ్ళు ప్రపంచంలో కనపడుతూ ఉంటారు. అందుకే భౌతికమైన ప్రయత్నాలతో కూడా కానిదేదో ఒకటుంది అని ఒప్పుకోక తప్పడం లేదు. అప్పుడే కర్మయొక్క ఆలోచన వస్తున్నది. అంటే ఇదివరకు చేసుకున్న కర్మలబట్టి కూడా మన సుఖదుఃఖాలలో తేడా వుంది అని ఒప్పుకోక తప్పడం లేదు. ఇది లోకాన్ని పరిశీలిస్తే అర్థమౌతున్నది. సుఖం అనుభవించడానికి ముందు మనం ప్రయత్నించేది భౌతికమైన ఉపాయమే. కానీ దుఃఖం నుంచి బయటపడాలనీ, సుఖం పొందాలని మనం ప్రయత్నించేటప్పుడు ఎవరైనా ముందు చేసేది భౌతికమైన ఉపాయమే. రోగం వస్తే ముందు పరుగెత్తేది వైద్యుడి దగ్గరికే. అంతేకానీ నా రోగం పోగొట్టుకోవడానికి యే మంత్రం చేయాలి అని ఎవరూ ఆలోచించరు. ఆ వైద్యుడు కూడా చేతులెత్తేశాక అప్పుడు వెళతాం. మంత్రమా? జాతకమా? మణులా? అని. జాతకం తీసుకొని యే గ్రహ శాంతి చేయాలి? యే రత్నాలు ధరించాలి? అని. కానీ ముందు వెళ్ళేది డాక్టర్ దగ్గరికే. కనుక మనమందరం కూడా ఈ భౌతిక ఉపాయాలే చేస్తాం. భౌతిక ఉపాయాలు కూడా అందనప్పుడు మనం దైవిక ఉపాయాలలోకి వెళ్తుంటాం. కానీ భౌతిక ఉపాయాలలో ఎలాగైతే సాఫల్యము, వైఫల్యము ఉంటాయో దైవిక ఉపాయాలలో కూడా సాఫల్యము, వైఫల్యము కనపడుతూ వుంటుంది. ఎందుకంటే అది కూడా మనం చేసేది భూమిమీదే. స్వర్గంలోనో, ఆకాశంలోనో కూర్చుని చేయడంలేదు. ఇక్కడ చేసే దేనికైనా సాఫల్యము, వైఫల్యము రెండింటిలో యేదో ఒకటి తప్పదు. ఇప్పుడు మీరొక ప్రశ్న వేయచ్చు. మేము కూడా జపాలు చేశాం కానీ లాభం లేకపోయింది అని కొందరంటూంటారు. తరువాత ఆలోచన యేంటంటే జపాలు, తపాలు, పూజలు చేసినా జరుగలేదు కనుక మేం నమ్మడం మానివేశాం అంటారు. ఆరోగ్యం బాగోలేదని వైద్యుడి దగ్గరికి వెళ్ళినవాడికి మందు పనిచేయలేదు. మందు పనిచేయలేదు కదా అని వైద్యశాస్త్రాన్ని నమ్మడం మానివేశామని అంటున్నామా? భౌతిక శాస్త్రమైన వైద్యశాస్త్రంలో కూడా సాఫల్య వైఫల్యాలు కనపడుతున్నాయి. దైవిక శాస్త్రములలో కూడా సాఫల్య వైఫల్యాలు కనపడుతున్నాయి. నువ్వు నమ్మను అన్నప్పుడు అదికూడా నమ్మకూడదు. కానీ నమ్ముతూనే వున్నావు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ క్లినిక్ నుంచీ శవం బయటికి వస్తూ ఉంటుంది, పేషెంట్ లోపలికి వెళ్తూ ఉంటాడు. రెండు దృశ్యాలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. శవం బయటికి వచ్చింది కదా అని డాక్టర్ దగ్గర చూపించుకోను అనడు. వాడి దౌర్భాగ్యం కొద్దీ బయటికి వచ్చాడు, నా సౌభాగ్యం కొద్దీ నేను బాగుపడతానేమో అని అనుకుంటున్నాం. మరి అక్కడ మాత్రం వెళ్తున్నావే? ఇక్కడికొచ్చేసరికి ఎందుకు దెబ్బతింటున్నావు?
Read More

అమ్మవారు చేసిన పరమేశ్వరుని కళ్ళుమూయడమనే లీల లోకానికి ఎంతో ఉపకారం చేసిందో తెలుసుకుందాం.

అమ్మవారు చేసిన పరమేశ్వరుని కళ్ళుమూయడమనే లీల లోకానికి ఎంతో ఉపకారం చేసిందో తెలుసుకుందాం. ఆవిడ మందహాసంతో ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి చేసుకుంటాను అన్నదిట. ఏం ఆవిడకి తెలియదా? మహా పతివ్రత. భర్త యేది చెప్తే అది చేయాలి గనుక ఆయననే అడిగిందిట. అప్పుడాయన "భూమి అంతా స్థిరపడి బాగుంది. నువ్వు తిన్నగా హిమాలయాలకి వెళ్ళు. అక్కడ నీకోసం నిన్ను కుమార్తిగా పొందాలని ఒక మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు. ఆయన పేరు కటముడు అని మహర్షి. ఆయనకి భార్యలేదు. ఆయనకు నువ్వు సంతానంగా కలగాలి. ఆయన ఆశ్రమం ముందు పసికూనలా సాక్షాత్కరించు. వెంటనే నువ్వు అమ్మవారివి అని తెలుసుకొని తన కుమార్తెగా స్వీకరించి నిన్ను పెంచుకుంటాడు. ఎందుకంటే ఆ కోరిక తీరితే గానీ ఆయనకి మోక్షం రాదు. ఎనిమిదేళ్ళు పూర్తి అయిన తర్వాత ఆయనకి నిన్నుకుమార్తెగా పెంచినటువంటి పుణ్యము, పెంచాలని ఉబలాటము నెరవేరి అప్పుడు నువ్వు ఆయనకి మోక్షం ఇచ్చి అక్కడినుంచి బయలుదేరు. అంతవరకు ఆయన వాడిన వ్యాఘ్రాశం (పెద్దపులి చర్మం), తపోదండం, కమండలం, దీపాలు పెట్టుకునే రెండుకుండలు(ఘటద్వయం), అక్షమాల, వేయించిన పెసరగింజ(తప్తముద్దాంకురం), ఉంటాయి. పైగా గంగా నదీ తీరం కనుక కొంత గంగాజలం, ఇసుక, ( గంగమట్టి చాలాగొప్పది. గంగమట్టి ధారణ చేస్తే శరీరానికి శక్తి పెరుగుతుంది. దేవతాశక్తి ప్రవేశిస్తుంది. గంగమట్టి ధరించి యే సత్కర్మ చేసినా ఆ కర్మ కోటిరెట్లు ఫలితం ఇస్తుంది. గంగాజలం ఆచమనం చేసి జపం చేస్తే వచ్చే సిద్ధి వేరు. ) ఇవన్నీ తీసుకొని బయలుదేరి కాశీపురానికి రా. ఆ సమయంలో కాశీ క్షేత్రంలో కరువుంటుంది. అక్కడికి వెళ్ళి కాశీలో కరువు తీరిపోయేటట్లు అన్నపూర్ణగా ఉండు. కరువు తీర్చి అన్నపూర్ణ అన్న శక్తిరూపంతో అక్కడ ఉంటూ అక్కడ నుంచి బయలుదేరు. ఇది ఎలాంటిది అంటే ఒక దీపం ఒకచోటికి రాగానే ఆ దీపంతో మరొక దీపం వెలిగించి పెట్టాక మొదటి దీపం కదిలినట్లు. అమ్మవారు కాశీ విడిచిపెట్టారు అనుకోకూడదు మనం. కాశీలో అన్నపూర్ణగా ఒక రూపంతో ఉంటారు. అక్కడినుంచి దక్షిణాపథానికి రా. అక్కడ సముద్రతీరంలో ఒక మహాక్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రం ఎలా పోల్చుకుంటావంటే అక్కడ పాలేరు అని ఒక నది ఉంటుంది. దానిని క్షీరనది(పాలార్నది) అంటారు. సరస్వతీ నదియొక్క రూపం అది. ఆ పాలేరు ప్రాంతంలో ఒక మామిడిచెట్టు నీడలో ఒక ఇసుక లింగం ఉంటుంది. ఆ ఇసుక లింగం దగ్గర చిత్రంగా అక్కడ ఒక వేయించిన పెసరగింజ ఉంటుంది. రెండు చామరములు, ఒక విసనకర్ర ఉంటుంది. పూజాసామగ్రి, ఇద్దరు స్త్రీమూర్తులు ఉంటారు నీకు పరిచర్యలు చేసి సహకరించడానికి. అక్కడ ఒక సూచిక ఉంటుంది. దానిమీద నీ దృష్టి నిలుపుతూ ధ్యానం చేస్తూ తపస్సు చేసి అక్కడ ఉన్న నా సైకత లింగాన్ని ఆరాధన చెయ్యి. అప్పుడు నీపాపం పోతుంది" అని చెప్పాడు పరమశివుడు. ఈ కథ ద్వారా అమ్మవారు తన పాపాన్ని కడుక్కోవడమనే నెపంతో ఆవిడ చేసిన పని అటు హిమవత్పర్వతాన్ని పవిత్రం చేస్తోంది, మహర్షిని ఉద్ధరించింది, కాశీక్షేత్రాన్ని ఉద్ధరించింది. తరువాత మనల్ని ఉద్ధరించడానికి ఈ క్షేత్రానికి రాబోతోంది. వారి లీలలు లోకకళ్యాణాలు.
Read More

నవాంజనేయ రూపములు ప్రస్తావన చేసినట్లైతే

నవాంజనేయ రూపములు ప్రస్తావన చేసినట్లైతే

ఆద్యః ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః
తృతీయో వింశతి భుజః చతుర్థః పంచవక్త్రకః
పంచమో అష్టాదశ భుజః శరణ్యః సర్వదేహినాం
సువర్చలా పతిఃషష్ఠః సప్తమస్తు చతుర్భుజః
అష్టమః కథితశ్శ్రీమాన్ ద్వాత్రింశత్ భుజమండలః
నవమో వానరాకారః ఇత్యేవ నవరూప ధృత్
నవావతార హనూమాన్ పాతుమాం సర్వదస్సదా!!

ఈ తొమ్మిది రూపములు యేమిటంటే వివిధ ఉపాసకులకి దర్శనమిచ్చిన రూపములు. అలా దర్శనమిచ్చిన తొమ్మిది నామములు ఒక దగ్గర పెట్టుకొని ఎవరైతే మననం చేసుకుంటారో "నవావతార హనుమాన్ పాతుమాం సర్వదస్సదా! ఇక్కడ విశేషం యేమిటంటే నవావతార స్మరణ యెల్లవేళలా రక్షిస్తుంది. అవతారం అంటే భగవంతుడు తనను తాను ప్రకటించుకుంటే దానిని అవతారం అంటారు. వివిధ ఉపాసకులు ధ్యానం చేసినప్పుడు ఉపాసనా ఫలంగా ప్రకటింపబడిన రూపమే ఈ నవావతార హనుమద్రూపము అని చెప్తున్నారు.
Read More

ఆంజనేయస్వామి వారు

ఆంజనేయస్వామి వారు సముద్ర లంఘనం చేయడానికి ఒక్కసారి ఎదుగుతారాయన.”ఆకాశపర్యంత సంవర్థి’ - ఆకాశం అంటుకునేటట్లు తన స్వరూపాన్ని పెంచినప్పుడు క్రింద ఉన్న వానరులందరికీ కూడా ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. అంతపైకి ప్రకాశిస్తున్నాడు. ఆ ముఖమే సూర్య తేజస్సులాగా దేదీప్యమానంగా ఉన్నది. చుట్టూ యేయే ముఖాలున్నాయో వీళ్లకి కనపడలేదు.దేవతలకు మాత్రం గోచరించింది. పైన ఉన్న దేవతలు, ఋషులు దర్శిస్తున్నారట. వాళ్ళకెలా కనిపించింది అంటే "మంగళ రూప అయ్య హరి మర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుదరామృత కుంభ శృణిప్రదీపితోత్తుంగ తరాంబుజాత నవతోయద మూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధీ నన్ కృపజూడు మారుతీ!!" అంటారిక్కడ విశ్వనాథ వారు కల్పవృక్షంలో. ఇందులో మంత్రం అక్షరములన్నీ నిక్షిప్తం చేశాడాయన. ఇది రచించింది దేనివల్ల రచించగలిగాడు అంటే ఆయన రామమంత్రం కొన్ని కోట్లు చేశాడు. అంతే సంఖ్యలో ఆపదుద్ధారక హనుమన్మంత్ర మూర్తిని ఉపాసన చేసి సిద్ధి పొందాడాయన. అందుకే ఈ రహస్యాన్ని చెప్పగలిగాడు. ఈ శ్లోకాన్ని మంగళ రూప అని ప్రారంభించడంలో హరి మర్కట మర్కట అని చెప్పడంలో మంత్రాక్షరములన్నీ ఉన్నాయి. మంత్రోపదేశం లేకున్నా ఈ శ్లోకం చదువుకున్నా మంత్రం క్రింద లెక్క. అక్కడ ఆయన పంచాస్యుడిగా - అయిదు వదనములు కలవాడిగా దేవతలకు దర్శనమిచ్చాడుట. అందుకు మంత్రమూర్తి దేవతలకీ ఋషులకీ కనపడుతుంది. సామాన్యులకి మాత్రం వానరుడిలాగే తిరుగుతున్నాడు. మళ్ళీ సీతమ్మ దగ్గర ఆయన తన ఉజ్జ్వల రూపాన్ని ప్రకాశింపజేస్తాడు. అప్పుడు అయిదు ముఖాల వాడా అంటే స్పష్టంగా వాల్మీకి వ్రాయలేదు కాదనీ వ్రాయలేదు. కానీ పరశార సంహితలో మాత్రమ్ సీతమ్మ దర్శనం చేసినది పంచముఖాంజనేయ మూర్తిని అని స్పష్టంగా రచించారు.
Read More

శ్రీగణపతిని గురించి - రెండు పురాణాలు లక్ష్యభూతమై ఉన్నాయి. ౧. గణేశపురాణం ౨. మౌద్గల్య పురాణం

శ్రీగణపతిని గురించి - రెండు పురాణాలు లక్ష్యభూతమై ఉన్నాయి. ౧. గణేశపురాణం ౨. మౌద్గల్య పురాణం
ముద్గల పురాణం: దక్షప్రజాపతి ముద్గల మహర్షుల సంభాషణాత్మకము. తొమ్మిది ఖండములు. 427 అధ్యాయములు. వీరభద్రునిచే పరాభూతుడైన దక్షునకు ముద్గలమహర్షి గణపతితత్త్వమునుద్బోధించి తత్సేవనమున విఘ్నశాంతిని ఫలముగా బొందినట్లీ పురాణమునందు చెప్పబడినది. వక్రతుండ గణపతి మత్సరాసురుని, ఏకదంత గణపతి మదాసురుని, మహోదర గణపతి మోహాసురుని, గజానన గణపతి లోభాసురుని, లంబోదర గణపతి క్రోధాసురుని, వికట గణపతి కామాసురుని, విఘ్నరాజ గణపతి మమతాసురుని, ధూమవర్ణ గణపతి అభిమానాసురుని, సంహరించి ఆత్మతత్త్వప్రకాశమును సంరక్షించినారు. అష్టవినాయక చరిత్రయు యోగష్టాంగములుగా వీరి ప్రసిద్ధియు తొమ్మిదవ ఖండమున వర్ణింపబడినది.
"న ముద్గల సమో భక్తో గణేశస్య ప్రదృశ్యతే!!" అని ప్రసిద్ధినందిన ముద్గలమహర్షి మౌద్గల్య గోత్ర ప్రవర్తకుడు. గాణాపత్య తత్వరహస్యముల నెరిగిన ప్రోఢ. సిద్ధపురుషుల ఆవిర్భావమునకు కాణాచి అయిన వంశములకు మూలపురుషుడు. ఏకాక్షర గణేశవిద్యను సాధిమ్చి బ్రహ్మతత్త్వమును సమాధి కౌశలమున గీటురాయి చేసుకొనిన వాడీ మహర్షి. తత్ప్రోక్తమైన పురాణమునూ పురాణములలో రాణకెక్కినది.
Read More

సాక్షాత్తు కైలాస శంకరులే కాలడి శంకరులుగా అవతరించారు

సాక్షాత్తు కైలాస శంకరులే కాలడి శంకరులుగా అవతరించారు. కైలాసమునందుండే శంకరుడెవరున్నారో ఆయనే భూలోకంలో కలియుగంలో శంకరభగవత్పాదుల రూపంలో అవతరించారు.
"నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ. జటాజూటంతో ఉండే పరమేశ్వరుడు వ్యుప్తకేశుడై - ముండిత శిరస్కుడై ఈ భూమిమీద నడయాడాడు. చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకొని ధర్యవ్యతిరేకమైనటువంటి వాళ్ళని చంపడానికి అవకాశమైనటువంటి స్థితి కాదు కలియుగప్రారంభం. మహాభారత యుద్ధం జరిగిన రోజులలో కృష్ణపరమాత్మ ప్రతిజ్ఞచేశాడు. 
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం!
ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే!!
నేను ధర్మాన్ని పాడుచేసేటటువంటి వాళ్ళని మట్టుపెట్టడానికి, ధర్మాన్ని మళ్ళీ సువ్యస్థితం చేయడానికి, అవతార స్వీకారం చేస్తూంటాను. కానీ ధర్మ వ్యతిరేకులైన వారందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే కలియుగంలో అసలు మనుష్యుడన్నవాడు మిగలడు. కలియొక్క ఉద్ధతి అటువంటిది. కాబట్టి ఇప్పుడు చేతిలోఒక అస్త్రాన్ని/శస్త్రాన్ని పట్టుకొని ఎవరు ధర్మవ్యతిరేకులుగా ఉన్నారో వారందరినీ చంపేయడం తేలిక మార్గం కాదు. అనుసరణీయం కాదు. మనసులను ఆవహించి ఉన్నటువంటి కలిని తొలగగొట్టాలి. అందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి. కృష్ణపరమాత్మ చేసిన ప్రతిజ్ఞకు కొనసాగింపుగా పరమశివుడు ఈ భూమండలం మీద అవతరించాడు. భారతదేశం నలుచెలగులా పాదచారియై మూడు పర్యాయములు పర్యటించారు. కేవలం 32 సంవత్సరములు మాత్రమే వారు శరీరంతో ఉన్నప్పటికీ అవైదికమైన వాదనలన్నింటినీ ఖండించారు. వేదంయొక్క ప్రమాణాన్ని సువ్యస్థితం చేశారు. అద్వైత మార్గము శంకరాచార్యుల వారు క్రొత్తగా కనిపెట్టినది కాదు. అద్వైత మార్గము వేదాంతర్గతమైన పరమసత్యము. వారి జీవితంలో వారు చేసిన ప్రబోధమంతా అదే. అద్వైతము వేదాంతర్గతమై యున్నది. దానిని ప్రచారం చేశారు. కేవలం సిద్ధాంత ప్రచారం చేయడం వారి లక్ష్యం కాదు. అవైదికమైన వాదనలను ఖండించారు. వేదముయొక్క ప్రమాణమును నిలబెట్టి షణ్మత స్థాపనాచార్యులై మనుష్యులు భక్తి మార్గంతో నడవడానికి కావలసిన వ్యవస్థనంతటినీ యేర్పాటు చేశారు. ఎవరు యే స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో భగవంతుణ్ణి పట్టుకోవడానికి వీలైనటువంటి మార్గాలను చూపించారు. అందుకే యదార్థమునకు ఆదిశంకరాచార్యుల వారు లేకపోతే సనాతన ధర్మానికి మనుగడయే ప్రశ్నార్థకమైయుండేది. అంతటి క్లిష్ట పరిస్థితులలో వచ్చినటువంటి అవతారం శంకరావతారం. అవైదిక వాదనలు ఈ దేశంలోకి ప్రవేశించి వేద ప్రామాణ్యమును పాడుచేయకూడదని నాలుగు దిక్కులా నాలుగు పీఠములను పెట్టి కాపుదలగా ఉంచారు. తూర్పున జగన్నాథ్ లో గోవర్థన పీఠం, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము - ఉంచి నాలుగు వేదములయొక్క ఆమ్నాయములను యేర్పాటు చేసి అక్కడ పీఠాధిపతుల పరంపర కొనసాగేటట్లుగా, ఆ పీఠాధిపతుల ధర్మ ప్రచారము చేత వేదము ప్రమాణముగా ఉన్నటువంటి సనాతన ధర్మమునకు యేవిధమైనటువంటి వైక్లబ్యము కలగకుండా కొనసాగింపు పొందేటట్లుగా చక్కటి వ్యవస్థను యేర్పాటు చేసినటువంటి మహాపురుషులు జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు. అటువంటి శంకరులు ప్రస్థాన త్రయానికి (భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు) భాష్యం ఇచ్చారు. అవి చదువుకోలేరేమో అన్నవారి కోసం తరువాతి స్థాయిలో అందుకోవడానికి వీలుగా భగవత్సంబధమైన భక్తి జ్ఞానములను యేర్పాటుచేసుకొని వైరాగ్యమును పొందడానికి వీలుగా శివానంలహరి, సౌందర్యలహరి వంటి గ్రంథాలను రచించి లోకానికి అందించారు. శంకరాచార్యులవారు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం యేమిటంటే అందరు దేవతలమీద వివిధ వృత్తాలలో స్తోత్రములను రచన చేశారు. వారు స్పృశించని దేవతా స్వరూపం లేదు. స్తోత్రాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే యే స్తోత్రంలో కూడా నేను చేస్తున్నాను అన్న భావన వచ్చేటట్లుగా చేయలేదు. ఎక్కడెక్కడ లోకానికి ప్రయోజనం కలగాలని స్తోత్రాన్ని అందించారో అక్కడక్కడ వారు రెండు మాటలను ప్రయోగించారు. "మః, మాం" - సంస్కృతంలోఈ రెండు మాటలకి ఒక ప్రత్యేకతమైన స్థాయి. మాం - నన్ను, మః - మమ్ములను అని. ఎందుకలా చేశారంటే ఆ స్తోత్రముల వల్ల శంకరుల వారు లబ్ధిపొందడం ఆయనయొక్క ఉద్దేశ్యం కాదు. రేపటిరోజున ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుకుంటాడో వాడు భగవంతుడి ముందు కూర్చొని ఆ స్తోత్రం చదివితే ’మాం, మః’ అన్నప్పుడు ఆ రక్షణ వాడికి కలగాలి. అందుకే వారు స్తోత్ర రచన చేసి ఫలితాన్ని మనకి కట్టబెట్టారు. ఇది ఒక తండ్రి కొడుకు కొరకు ఎలా యేర్పాటు చేస్తాడో అలా మనకొరకు కాలంలో ఎన్ని దశాబ్దాలు, శతాబ్దములు గడిచిపోయినా మళ్ళీ దేవతారాధనలో స్తోత్రాన్ని చెప్పగలమో లేదోనని శంకరభగవత్పాదుల వారు మనకొరకు అత్యద్భుతమైన స్తోత్రములనందించారు.
Read More

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా? లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అనేది ఒక మూఢనమ్మకంగా ఏర్పడిందే

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?
లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అనేది ఒక మూఢనమ్మకంగా ఏర్పడిందే కానీ ప్రామాణిక గ్రంథాలలో యే దేవతామూర్తిని యేవిధంగా అర్చించాలి అనే విశేషాంశాన్ని పరిశీలిస్తే మటుకు పాదాలనే పూజించాలి అంటాయి ఆ గ్రంథాలన్నీ కూడా. విశేషించి పాదాలే పూజచేయడం శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించే సమయంలో మనం గమనిస్తూంటాం. అన్నమాచార్యులవారు బ్రహ్మకడిగిన పాదము అని చెప్పారు కదా! అలాగే బలిచక్రవర్తి కూడా వామనుని పాదాలను జలముతో తన భార్యయైన వింధ్యావళి నీళ్ళు పోస్తుండగా కడిగి ఆ స్వామి అడిగిన మూడు అడుగుల నేలను దానం ఇవ్వగా ఆస్వామి పాదాలతో పృథివ్యాపస్తేజోవాయురాకాశములు అయిన పంచభూతాత్మకమైన ప్రపంచాన్నంతటినీ కూడా ఈపాదంతో ఆక్రమించాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా తానుగా దర్శింపజేసి ఆ మూడవపాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచాడు. కాబట్టి మనము భగవంతుని పాదములను ఆశ్రయించాలి. "భగవంతు వలగొను పదములు పదములు" అంటారు పోతనామాత్యులు. కనుక శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో పాదములను ఆశ్రయించాలి. అమ్మవారికి మాత్రం పాదములకు పూజించరాదు అనే ఒక కొత్తగా కనుక్కున్నారు. నిజానికి పరమేశ్వరి - పరమేశ్వరుడు, లక్ష్మీదేవి - శ్రీమన్నారాయణుడు, అంతా ఒక్కటే. కాబట్టి ఎటువంటి అనుమానమూ లేకుండా అమ్మవారి పాదములు అర్చించవచ్చును. కొల్హాపురంలో అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్ళినా మరింకే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు శఠారిని మన శిరస్సుపైన ఉంచుతాడు. మనం తలవంచి నమస్కారం చేస్తాం. ఆ శఠారి (శఠం అంటే మనలో ఉండే మొండితనం - దానిని తొలగించేవి పరమాత్ముని యొక్క పాదములు. దానిమీద పరమాత్మ పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్ళి ఆ అమ్మవారికి నమస్కరించిన తరువాత అర్చకులు మనశిరస్సుపై ఉంచే శఠారి పైన అమ్మవారి పాదాలే ఉంటాయి. ఇది గమనించాలి. పాదపూజ అని చెప్తాం. పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఆయనను మనం దర్శించగలిగే స్థితి ఎక్కడ? అంటే పాదములను దర్శిస్తే చాలు పరమాత్మను దర్శించినట్లే. ఇటువంటి భావంతో అయ్యవారికైనా, అమ్మవారికైనా సర్వాంములు నమస్కరించవలసిందే. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఒక్కసారి పరిశీలించినా చంచలాయై నమః - పాదౌపూజయామి, ఇలా సర్వాంగాలనూ పూజ చేస్తాం కదా! మరి పాదాలు పూజ చేయకుండా ఎలా? మొట్టమొదటి నామమే చంచలాయై నమః - పాదౌపూజయామి. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పాదములను తప్పకుండా పూజించవచ్చు.
Read More

Tuesday, 27 May 2014

అయ్యా మాది అర్చక కుటుంబము, మేము తెల్ల కార్డుదారులము, ఆర్దికముగా వెనుక పడిన వాళ్లము, ప్రభుత్వ పదకములు ఏమయినా ఉంటే, అర్చకుల కోసము, మాకు తెలియ చేయకలరు. మాకు శాస్త్రములు, అర్చకత్వము తప్ప మరి యేమి తెలియదు. దయ వుంచి తెలుపకలరు . = ఉమేష్ శర్మ : అమర్తలూరు

అర్చకత్వము చేయువారిని ప్రభుత్వము EBC ( Economically Backward cast )  లలో చేర్చినది ప్రభుత్వము. ప్రస్తుతం ఉన్న" తెల్ల కార్డు దారులలో 47% మంది కేవలం బ్రాహ్మణులే"  అని 2009 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, చేసిన సర్వే లో తెలిపింది.

" ఈ  సౌకర్యాలు  అన్ని  దేవాదాయ  శాఖలో పని చేసే,  ప్రతి  ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ( కేవలం అర్చక వ్రుత్తి వారికే  కాకుండా) వర్తించును.  "

ప్రభుత్వ  లెక్కల ప్రకారం, ఒక అర్చకుని జీతం సగటున రోజుకు  30 రూపాయలు గా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  గుర్తించినది 2006 లో  . 

1. గృహ నిర్మాణ ఋణము : నూతన గృహ నిర్మాణమునకు "1,50,000" లక్షలు ఇస్తారు,
దరకాస్తు విధానము : సంబంధిత పత్రములతో జిల్లా సహాయక   కమీష్నర్  కార్యా లయం లో అందచేయాలి
రాయితీ : మీరు తీసుకున్న రుణములొ 1,50,000 లక్షలలో 50,000 రాయితీ వస్తుంది .

2.ఇళ్ళ మరమ్మత్తులకు :  ఇళ్ళ మరమ్మత్తులకు 75,000 రుణముగా ఇస్తారు
దరకాస్తు విధానము : సంబంధిత పత్రములతో జిల్లా సహాయక   కమీష్నర్  కార్యా లయం లో అందచేయాలి. రాయితీ : 30,000  రాయితీ కింద తీసి వేస్తారు .

3. విద్యార్ది ఋణములు :  అర్చకుల పిల్లల చదువుల కొరకు రుణాలు ఇస్తారు, ఇంజనీరింగ్ తో పాటు వ్రుత్తి పరమయిన విద్యా చదువులకు ఇస్తారు, ఋణములు.
దరకాస్తు విధానము : విద్యార్ది మార్కుల లిస్టు,  కళాశాల జారీ చేసిన గుర్తింపు కార్డు, రాంక్ కార్డు,  కళాశాల కొటేషన్  తో పాటు  అర్చకులు పని చేస్తున్న పరిది లోని  దేవాదాయ  శాఖ అధికారి  ధ్రువ పత్రం,  జత చేసి,  అచ కార్యాలయం లో అందచేయాలి. తీఎసుకున్న డబ్బుకి  4% వడ్డీతో  కలిపి  "5 సం" కాల పరిమితి లో చెల్లించాలి .
రాయితీ : రాయితీ  ఏమి లేదు.

4. ఉచిత ఉపనయనమునకు :  10,000  ఇస్తారు
దరకాస్తు విధానము : ఉపనయన ఆహ్వాన పత్రిక, చిన్నారి ఫోటో , దేవాదాయ  శాఖ  అధికారికి ధ్రువ పత్రాలు అందించాలి .

5. వివాహ ఋణములు :  పెళ్లి కుమారునికి : 60,000.  కుమార్తెకు : 40,000 ఇస్తారు.

6. వైద్య  ఋణము  :  చికిత్చ ను బట్టి 2,00,000  దాకా ఇస్తారు .

7.  ఉద్యోగ విరమణ క్రింద : 1-5-2010 తరువాత ఉద్యోగ విరమణ చేసిన వారికీ 2,00,000  గ్రాడ్యుటి గా,  1-9-2013 తరువాత ఉద్యోగ విరమణ చేసిన వారికి 1,00,000  రూపాయలు ఇస్తున్నారు .

8. మరణ భ్రుతి:  అర్చకుడు చనిపోతే అతని దహన సంస్కారాలకు  25,000.
ప్రమాద వశాత్తు చనిపోతే అదనముగా 75,000.
మృతి చెందినా వ్యక్తీ 10 సం॥   సేవ చేసి ఉంటే, గ్రాడ్యుటి  గా  1,00,000
మృతి చెందినా వ్యక్తీ 15 సం॥   సేవ చేసి ఉంటే, 1,50,000
మృతి చెందినా వ్యక్తీ 20 సం॥   సేవ చేసి ఉంటే, 2,00,000
దరకాస్తు విధానము : మరణించిన వ్యక్తీ  లీగల్ హెయిర్, మరణానికి సంబంధించిన ధ్రువ పత్రం, బ్యాంకు ఎకౌంటు  వివరాలు అందచేయాలి .బ్రాహ్మణులు ( అర్చక వ్రుత్తి చేయువారు ) వెనుక బడిన వర్గం గా ప్రభుత్వం గుర్తించినది. అందుకు ఉదాహరనే  2014 లో జరిగిన ఎన్నికల ఫలితాలు . 
2014-  Election Results. Read More

శ్రమ నీ ఆయుధం అయితే, విజయం నీ బానిస అవుతుంది !! మిత్రమా

శ్రమ  నీ ఆయుధం  అయితే,  విజయం నీ బానిస అవుతుంది !!  మిత్రమా  
Read More

Tuesday, 20 May 2014

పర్ణ ప్రసాదం

పర్ణ ప్రసాదం .
పర్ణ అంటే ఆకులు అని అర్థం. తిరుమల
దేవాలయం నుంచి పాపనాశిని ఆకాశగంగకు వెళ్లే
మార్గంలో పరమ భక్త హాథిరాం బావాజీ సమాధి
వుంది. దీన్ని హథీరాం మఠం అని అంటారు. ఈ
దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాదాన్ని
అందిస్తారు. ప్రసాదాన్ని ఆకు రూపంలో ఇస్తారు.
ఆకు అంటే సామాన్యమైన ఆకు అని
అనుకోవద్దు. ఆ ఆకు సామాన్యమైంది కాదు. ఆ
ఆకు సంజీవని చెట్టుది (సంజీవని ఆకు)
ఈ సంజీవిని ఆకును తింటే దేహంలోని అన్ని
రోగాలు నయమవుతాయి. వీటిలో రెండు రకాల
ఆకులు ఉన్నాయి.
1. సంజీవిని
2. అమృత సంజీవని
సంజీవిని చెట్టు పేరు విన్నంతలోనే
మీకు రామాయణంలోని యుద్ధకాండ ప్రకరణంలో
హనుమంతుడు సంజీవని అనే పర్వతాన్ని
తీసుకువచ్చి లక్ష్మణుడిని బతికించిన
వైనం గుర్తుకు వైనం వచ్చి తీరుతుంది.
ఈ సంజీవని చెట్టు ఆకులను తిని
హాథీరాం మహరాజు (బావాజీ) జీవితం పూర్తిగా
ఆరోగ్యంగా ఉన్నందున ఈ క్షేత్రానికి వచ్చే
భక్తులు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో
ప్రతి ఒక్కరికి సంజీవని ఆకును ఇస్తారు.
అందుకే ఈ ప్రసాదానికి పర్ణ ప్రసాదమని పేరు.
ఈ సంజీవని ఆకును ఎవరు తింటారో వారి
రోగాలన్నీ తొలగిపోతాయి.
సంజీవని ఆకుకు, అమృత సంజీవని
ఆకుకు ఉన్న తేడా ఏమిటి?
సంజీవని ఆకులానే అమృత సంజీవని ఆకు కూడా
ఉంటుంది. అమృత సంజీవని ఆకును నోటిలో
ఉంచుకుని పీల్చుకుంటే నోట్లో నీటి
అంశం ఎక్కువ ఉంటుంది. ఈ నీరు అమృత
సమానమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
అమృత సంజీవని ఆకును ఒక గుప్పిట అంత
నీటితో శుభ్రపరిచి
ప్రతిరోజు ఉదయం ఆరు గంటల్లోపు తింటే
అసాధ్యమనుకున్న రోగాలైన క్యాన్సర్,
గుండెనొప్పులు, ఆస్తమా, మధుమేహం తదితర
వ్యాధులు నయం అయిన ఘటనలు చాలా
ఉన్నాయి.
ఈ చెట్టు బెంగళూరులోని లాల్బాగ్, కబ్బన్ పార్క్
మల్లేశ్వరంలోని అటవీ విభాగం నర్సరీలో
లభిస్తుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ
స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో
మాలను చేసి ఆంజనేయస్వామికి వేస్తారు.
అనంతరం తమలపాకు భక్తులకు ప్రసాదం ఇస్తారు.
దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు..........
ధన్యవాదములు
Read More

వైకుంఠ ఏకాదశి

వైకుంఠ ఏకాదశి 


ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. (నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
పండుగ ఆచరించు విధానం
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతం నియమాలు : 1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.
పండుగ ప్రాశస్త్యం
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి
వైఖానసుడి కథ
పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!
మురాసురుడి కథ
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానిమురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే!వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.తాత్త్విక సందేశం
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు(కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

ముక్కోటి ఏకాదశి వ్రతమాచరిస్తే మరు జన్మంటూ ఉండదట! :-

అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు.

ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.

అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.
Read More

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే (స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి.)

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి

Read More

మహా మృత్యుంజయ మంత్రం:

మహా మృత్యుంజయ మంత్రం:
"""""""""""""""""""""""""""""""
త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.

ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.
ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో "మూడు" కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.
ఓం: భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ' అ ' కారం. యజుర్వేదం నుండి ' ఉ ' కారం, సామవేదం నుండి ' మ ' కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ' ఓంకారం ' ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

త్ర్యంబకం: భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.

యజామహే: అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.

సుగంధిం: సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.

పుష్టివర్థనం : మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
ఉర్వారుకం – ఇవ – బంధనం : దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.

మృతోర్ముక్షీయ: అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.

అమృతాత్ : స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.

మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం,
రావణ వథానంతరం అయోధ్యకు చేరుకున్న రామ చంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించ సాగారు. అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాల హనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం. ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.

ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.
మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం
 

Read More

జీవాత్మ – పరమాత్మ

జీవాత్మ – పరమాత్మ 

ఓంకార రహితమైన 'నమఃశివాయ' అనేది 'పంచాక్షరీ' మంత్రమనీ, ఓంకార సహితమైన 'ఓంనమఃశివాయ' అనేది "షడక్షరీ" మంత్రమని చెప్పబడింది.

"ఓం నమః శివాయ" షడక్షరీమహామంత్రంలోని 'ఓం' – పరబ్రహ్మస్వరూపాన్ని, 'న' ౦ పృథ్విని, బ్రహ్మను, 'మ' – జలాన్ని, విష్ణువును, 'శి' – తేజస్సును, మహేశ్వరుని, 'వా' – వాయువును, జీవుని (ఆత్మ) , 'య' – ఆకాశాన్ని, పరమాత్మను….ఈవిధంగా షడక్షరీమంత్రంలోని మంత్రాక్షరాలు పంచభూతాలను, బ్రహ్మాదిదేవతలను సూచిస్తున్నాయి.

ఇక, 'నమఃశివాయ' అనే పంచాక్షరీమంత్రంలో, 'నమః' అను పదానికి జీవాత్మ అనీ, 'శివా' అనే పదానికి పరమాత్మ అనీ, 'ఆయ' అను పదానికి ఐక్యం అని అర్ధమవడం వలన జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందటం అని అర్ధం. ఈ విధంగా పంచాక్షరీమహామంత్రం బ్రహ్మస్వరూపాన్ని తెలుపుతోంది.

సంసారబద్ధులైన జీవులకు, వారి క్షేమాన్ని కోరిన సాక్షాత్తూ శంకరుడే స్వయంగా ఈ మంత్రాలను అనుగ్రహించారు

Read More

ఉపవాసం చేయడం వలన కలిగే ఫలితమేమిటి?

ఉపవాసం చేయడం వలన కలిగే ఫలితమేమిటి?

భగవంతుని అనుగ్రహం పొందడానికే ఉపవాసం. ఇంకా చెప్పాలంటే శారీరక, మానసిక మాలిన్యాలను వదిలించుకోవడానికే ఉపవాస దీక్ష చేస్తారు. నిష్కామంగా ఈ దీక్షను చేయగలిగితే భగవంతుడు మన కోరికలను అడగకుండానే నేరవేరుస్తాడని ప్రతీతి. 

శరీరానికి అలసట కలిగితేనే మనసు స్థిరపడుతుంది. మనస్సు స్థిరపడి నిగ్రహాన్ని పొందితేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొందినప్పుడే ఓ మనిషి తనని తాను తెలుసుకుంటాడు. తనని తాను తెలుసుకోవడమంటేనే దైవం గురించి తెలుసుకోవడమన్నమాట. 

ఉపవాస దీక్ష రోజున పండ్లను పాలను స్వీకరిస్తూ పూర్తిగా దైవ చింతనలోనే దీక్షా సమయాన్ని గడపాలి.

Read More

తిరుమల 7 కొండలు..పరమార్ధం

తిరుమల 7 కొండలు..

1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.

ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది.

అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.

1. వృషభాద్రి - అంటే ఎద్దు. వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములున్టాయ్. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)

వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము

నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయ్. సుర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజం గా దాని కన్నా అభద్దం ఉంకోటి లేదు. సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైట్ట లేదా. కాబట్టి వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి - అంటే ధర్మం

ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు.

అవి చెయ్యడమే వృషాద్రి ని ఎక్కడం.

3. గరుడాద్రి - అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞా నాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.

పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. 

ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేని వాడు భగవానుడు.

భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.

అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక.
కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలవకి.

కంటికి అందం ఎప్పుడు? - ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే.

అప్పుడు అంజనాద్రి దాటతాడు.

5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీత లో గీత చార్యుడు చెప్పాడు,

తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు) 

తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. (ఇక్కడ రమణ మహర్షి కొన్ని ఉదాహరణలు గురుంచి చెప్పారు ) ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

6. వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు అది మన కర్మ. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు.

ఆయనకే అర్పణం అనడం & అటువంటి స్థితి ని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థ ని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారయానాద్రి.

వేంకటాచలం లో 7 కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం 7 కొండలు ఎక్కడం

Read More

Powered By Blogger | Template Created By Lord HTML