గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 April 2014

భద్రాచలం సీతారామస్వామి ఆలయానికి ఉన్న చరిత్ర:-

భద్రాచలం సీతారామస్వామి ఆలయానికి ఉన్న చరిత్ర:-

పరమ పవిత్రమైన గౌతమి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమెతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం.ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలై స్వామి వారి కృపకు పాత్రులవుతారు.రామ నామం జపించిన చాలు ముక్తిమార్గం కలుగుతుంది.అంతటి పరమ పావన క్షేత్రం గురించి ఒక సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా...

ఇక్కడ స్వామివారు సీతా లక్ష్మణ సమేతుదై చతుర్భుజుడుగా వెలిసారు.ఇంకొ ప్రత్యేకత ఎమిటంటె స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తుండటం.ఈ క్షేత్రం ఎంతో ప్రాచినమైనది.దీని గురించి బ్రహ్మండపురాణంలోనూ,గౌతమీ మహత్స్యంలోనూ ప్రస్తావన ఉంది.ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుదై వనవాసం చేసాడని ప్రతిది.ఒకసారి స్ధల పురాణం పరిశిలిస్తే.

స్ధల పురాణం -
శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట.సేద తీరిన తర్వాత ఆబండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని అపుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట.దీనితో భద్రునిగా జన్మించి శ్రీరామునికై తపస్సు చేయసాగాడు.దీనితో బద్రున్ని అనుగ్రహించి భద్రగిరిపై వెలసి ఒక పుట్టలో ఉన్నాడట.కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో రామునికి పరమ భక్తురాలుగా ఉంటూ ఎపుడూ రామనామ స్మరణ చేస్తుందేది.ఒకరోజు కలలో రాముడు నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను నాకు ఎదైనా నీడ నిర్మించమని ఆదేశించాడట.దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలోవెళ్ళి చూడగా పుట్టలో వెంచెసి ఉన్నాడట.పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకుచేతనయినట్టు ఒక పందిరి వేసి విగ్రహలను ఉంచి పూజలు చేస్తుండెదట.

భద్రారెడ్డి పాలెంకు కూతవేటుదూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న,చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడు.యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బందువు అయిన అక్కన్న తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండటంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీర్దారుగా నియమించాడు.ఆ పరగణాలోనే ఉన్న భద్రగిరి ప్రాంతం ను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి,పన్నులుగా వసూలయిన ధనంతో రామాలయం ను సర్వాంగసుందరంగా నిర్మించాడట.దీనితో కొపోద్రిక్తుడైన తానిషా గోపన్నను చరసాలలో భందించి చిత్రహింసలకు గురి చేస్తాడు.తానిషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామమాడలను చెల్లించాడట. తానిషా ఒక్కసారిగా మేలుకుని చూడగా ఆలయానికి గోపన్న ఎంతయితే వాడాడో అంత సొమ్ము రాశిగా పోసి ఉందట.దినితో గోపన్న భక్తికి తన తప్పును తెలుసుకుని ఖైదునుండి విడుదల చేసాడట. గోపన్న ఎపుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్దికెక్కాడు.అదీ ఆలయానికి ఉన్న చరిత్ర.

పరమ పవిత్రమైన గౌతమి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమెతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం.ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలై స్వామి వారి కృపకు పాత్రులవుతారు.రామ నామం జపించిన చాలు ముక్తిమార్గం కలుగుతుంది.అంతటి పరమ పావన క్షేత్రం గురించి ఒక సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా...

ఇక్కడ స్వామివారు సీతా లక్ష్మణ సమేతుదై చతుర్భుజుడుగా వెలిసారు.ఇంకొ ప్రత్యేకత ఎమిటంటె స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తుండటం.ఈ క్షేత్రం ఎంతో ప్రాచినమైనది.దీని గురించి బ్రహ్మండపురాణంలోనూ,గౌతమీ మహత్స్యంలోనూ ప్రస్తావన ఉంది.ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుదై వనవాసం చేసాడని ప్రతిది.ఒకసారి స్ధల పురాణం పరిశిలిస్తే.

స్ధల పురాణం:-
శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట.సేద తీరిన తర్వాత ఆబండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని అపుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట.దీనితో భద్రునిగా జన్మించి శ్రీరామునికై తపస్సు చేయసాగాడు.దీనితో బద్రున్ని అనుగ్రహించి భద్రగిరిపై వెలసి ఒక పుట్టలో ఉన్నాడట.కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో రామునికి పరమ భక్తురాలుగా ఉంటూ ఎపుడూ రామనామ స్మరణ చేస్తుందేది.ఒకరోజు కలలో రాముడు నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను నాకు ఎదైనా నీడ నిర్మించమని ఆదేశించాడట.దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలోవెళ్ళి చూడగా పుట్టలో వెంచెసి ఉన్నాడట.పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకుచేతనయినట్టు ఒక పందిరి వేసి విగ్రహలను ఉంచి పూజలు చేస్తుండెదట.

భద్రారెడ్డి పాలెంకు కూతవేటుదూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న,చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడు.యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బందువు అయిన అక్కన్న తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండటంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీర్దారుగా నియమించాడు.ఆ పరగణాలోనే ఉన్న భద్రగిరి ప్రాంతం ను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి,పన్నులుగా వసూలయిన ధనంతో రామాలయం ను సర్వాంగసుందరంగా నిర్మించాడట.దీనితో కొపోద్రిక్తుడైన తానిషా గోపన్నను చరసాలలో భందించి చిత్రహింసలకు గురి చేస్తాడు.తానిషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామమాడలను చెల్లించాడట. తానిషా ఒక్కసారిగా మేలుకుని చూడగా ఆలయానికి గోపన్న ఎంతయితే వాడాడో అంత సొమ్ము రాశిగా పోసి ఉందట.దినితో గోపన్న భక్తికి తన తప్పును తెలుసుకుని ఖైదునుండి విడుదల చేసాడట. గోపన్న ఎపుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్దికెక్కాడు.అదీ ఆలయానికి ఉన్న చరిత్ర.

Read More

గమ్యంపట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో, ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్లే మార్గంపట్ల కూడా అంత శ్రద్ధ వహించాలి. - స్వామీ వివేకానంద

గమ్యంపట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో, ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్లే మార్గంపట్ల కూడా అంత శ్రద్ధ వహించాలి.
- స్వామీ వివేకానంద

Read More

ఈ మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తే శ్రీ మహావిష్ణు సహస్రనామాలను జపించినంత ఫలితం కలుగుతుంది.

"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే"

ఈ మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తే శ్రీ మహావిష్ణు సహస్రనామాలను జపించినంత ఫలితం కలుగుతుంది. ఇది తారకమంత్రం. సదాశివుడు ధ్యాన మగ్నుడై జపించే మంత్రం. ఈ తారకమంత్రాన్ని జపిస్తే సర్వదా శుభం కలుగుతుంది అని పరమేశ్వరుడు రామ నామం గురించి ఇలా సెలవిచ్చాడు.
కాగామ కటపయాది వర్గసూత్రం ప్రకారం 'య' వర్గంలో 'రా' రెండవ అక్షరం కాగా 'ప' వర్గంలో 'మ' అయిదో అక్షరం, అంటే 2x5=10. దీనిని బట్టి "రామ" అనేది 10 సంఖ్య కు సంకేతం. ఇక మూడు సార్లు అంటే (10x10x10 ) వేయికి సమానం. అందుకే రామ నామాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తే విష్ణు సహ్రనామాన్ని జపించిన ఫలితం వస్తుంది అంటారు...

Read More

శ్రీరామనవమి కి వడపప్పు - పానకం ఎందుకు తీసుకోవాలి ?

శ్రీరామనవమి కి వడపప్పు - పానకం ఎందుకు తీసుకోవాలి ?

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా
ఋతువులను ,దేహారోగ్యాన్ని బట్టి మన
పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు - పానకం కూడా అంతే.
శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని
దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే
గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు,
ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా
పనిచేస్తాయని చెబుతారు. పానకం విష్ణువుకి
ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు.
పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది.
జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక.
పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న
ఎండల్లో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని
అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది.
పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.అందుకని
ఒక్క శ్రీరామనవమి రోజు నే కాకుండా ఈ వేసవి లో
వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .

Read More

సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?

సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?

1.సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగాఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది. 

2.అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.

3.మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.

4.బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. 
శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

5.ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి. 

6.ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

7.సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది.గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

Read More

అధిక పొట్ట తగ్గే చిట్కాలు:-

అధిక పొట్ట తగ్గే చిట్కాలు:-

1.కొర్రలు, ఓట్స్, జొన్నలు, పెసలు, ఉలవలు, కందులు, నీటి శాతం ఎక్కువగా ఉండే బీర, అనప,పొట్లకాయ వంటి కూరలు తీసుకోవాలి.

2.పగటి నిద్రకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్ట తగ్గించుకునేందుకు కాలేయం పన
ితీరును పెంచే ఆసనాలుంటాయి. వాటిని చేయడం వల్ల కాలేయం పనితీరు పెరిగి కొవ్వు తగ్గుతుంది.

3.అరటీస్పూన్ మెంతి పొడినీళ్లలో కలిపి రాత్రిపూట మూలం, వందగ్రాముల వరిపేలాలతో కలిపి తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆహారంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండేట్లు చూసుకోవడం రకరకాల పిండి పదార్థాలతో బయట చేసే పిండి వంటలు తినకుండా జాగ్రత్త పడాలి. మితంగా భోజనం తినాలి.

4.భోజనానికి 30 నిముషాల ముందు నీళ్ళు బాగా త్రాగండి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి రెండు గంటల తర్వాత కనీసం 30ని ఒక్కసారి నీళ్ళు త్రాగండి.

5.రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువ సార్లు తినండి. కప్పుడు అన్నంతో పాటూ ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోండి. రాత్రి మాత్రం ఒక్క చపాతి చాలు. ఆకలేస్తే ఏ పచ్చి క్యారెట్టో, ఆపిలు పండో తినండి.

6.కప్పు గోరు వెచ్చని నీటిలో స్పూన్‌ తేనె కలుపుకొని పరగడుపున తాగాలి. రోజులో కూడా ఎక్కువగా నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు విసర్జితమవుతాయి.

7.సహజంగా లభించే గ్రీన్‌ టీని ఉదయం పూట సేవించాలి. దానిమ్మ జ్యూస్‌ తప్ప మిగితా అన్ని రకాల జ్యూసులను తీసుకోవచ్చు, కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి

8.బార్లీ గింజలు: అధిక బరువును అరికట్లే ఆహార పదార్థం బార్లీ. ఈ బార్లీ గింజలను గంజి చేసుకొనే తాగడం ద్వారా అధిక బరువును గణనీయంగా తగ్గించేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని బాగా తగ్గించేస్తుంది.

Read More

వివాహం మాంగల్య ధారణ !!

 మాంగల్య ధారణ !!

వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది
. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం.

సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు. "శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది.

పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం.

Read More

మంచి నీరు మంచి ఔషదం !!

మంచి నీరు మంచి ఔషదం !!
1.ప్రతీ మనిషి రోజుకు సగటున 8-10 గ్లాసుల
మంచినీరు త్రాగాలి.
ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు కూడా కనీసం రోజుకు 2- 3
లీటర్లు నీటిని త్రాగించాలి
2.లావుగా ఉన్నామని బాధపడేవారు ఎక్కు వగా నీటిని
తీసుకోవడం వల్ల నీరు క్రొవ్వును కరిగి స్తుంది.
3.మన కిడ్నీలు వాటి పని అవి సక్రమంగా పని చేయా న్నా
నీరు ఎక్కువగా త్రాగడం అవసరం. కిడ్నీలు వాటి
శక్త్యానుసారంగా పనిచేయకపోయినట్ల ైతే మన శరీరంలో వ్యర్థ
పదార్థాల నిల్వలు పెరిగి అవి క్రమంగా లివర్పై పేరుకుపోతాయి. దాంతో
మన శరీరంలో క్రొవ్వు పేరుకుపోవడం,లావ వడం జరుగాతాయి.
4.కొంతమంది కాళ్లు, చేతులకు, పాదాలకు నీరు వచ్చి
ఉబ్బడం జరుగుతుంది. ఈ సమస్య కూడా ముఖ్యంగా నీటిని
తక్కువ త్రాగడం వల్ల, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల
జరుగుతుంది.దీన్ ని అదిగమించడానికి కూడా ఎక్కువ మొత్తంలో
నీరు త్రాగడం ఒక మార్గం.
5.శరీరానికి అవసరం లేని ఉప్పును కరిగించి దాన్ని కిడ్నీల ద్వాదా
నీరు రూపంలో బయటికి పంపాలన్నా ఎక్కువ నీరు త్రాగడమే
ఉత్తమం, అవసరం కూడా.
6.భోజనానికి కూర్చునేముందు కనీసం అరలీటరు నీటిని
తాగడం వల్ల శరీరంలోని కేలరీలు తగ్గుతాయి. తద్వారా
మీరు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
7.ఎక్కువ మోతాదులో నీటిని తాగడం వల్ల చక్కగా
ఆటలను ఆడగలరు. ఆటల వల్ల శరీరం అలసిపోవడం అనేది కూడా
తక్కువగా ఉంటుందట. కాబట్టి చక్కగా నీరు తాగండి, ఆరోగ్యంగా
బరువును తగ్గించుకోండి.

Read More

అరుంధతీ నక్షత్రం:-

అరుంధతీ నక్షత్రం:-

అనగా అరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది. ఈ అయిదుగురు స్త్రీ మూర్తులు సదా వందనీయులని తెలుస్తున్నది. అరుంధతిదేవి పతివ్రతలో అగ్రగామి. ఈమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుందని 'నైమిసమ్హితా పేర్కొంటోంది. అసక్తికరమైన 
అరుంధతి జన్మవౄత్తాంతాన్ని ఇపుడు మీకు చెప్పబోతున్నాను అన్నాడు సూత మహాముని.

ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవితయైన ఒక కన్యను, వర్ణింపనలవికాని ఓక సుందరుని సౄష్టించాడు. ఆ కన్య పేరు 'సంధ్యా. యువకుని పేరు మన్మథుడు. సౄష్టికార్యంలో తనకు సాయపదమని చెబూతూ బ్రహ్మ ఆ యువకునికి -

అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా
నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా!! అంటూ

అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు సమ్మోహన బాణాలను అందించాడు. బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా, బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న 'సంధ్యా ను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సౄష్టికర్త కోపించి మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు.

తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో 'సంధ్యా చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలచి పయనమై పోయింది. అపుడు బ్రహ్మ వశిష్టమహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు 'శివా మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెడలిపోయాడు. సంధ్య తదేకనిష్టలో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మని కోరగా, ఆమె "ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే' వరాన్ని అనుగ్రహించమంది. శివుడు ఆమె లోకోపకార దౄష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య 'నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదౄష్టిలో చూచినట్లయితే, వారు నపుంసకులుగా మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేకమంకి కామవికారాని కల్గించాను. కాబట్టి ఈ దేహం నశించిపోవాలీ అని కోరింది. శివుడు 'తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదౄశ్యురాలివై శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో! అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.

శివాజ్ణ్జగా సంధ్యా శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుండి తిరిగి జన్మించింది. సంస్కౄత భాషలో 'అరుం' అంటె అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. 'ధతీ అంటె ధరించినది అనే అర్థం వున్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె 'అరుంధతీ అనబడింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి – వశిష్టునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది. ఈ దంపతులకు పుట్టినవాడే 'శక్తీ. శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. అరుంధతిని మనవారు 'ఆరని జ్యోతీ అని 'అరంజ్యోతీ అని పిలుస్తూంటారు. విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనమలు, మునిమనమలు గురించి ప్రస్తావించబడివుంది.

అరుంధతీ నూతన దంపతులకు ఇచ్చే దీవెనలు ఏమిటి? అంటే, కొత్త పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్థి మండలంలో వున్న వశిష్టుని తారకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. దీనివెనుక ఒక ప్రధాన కారణమున్నది. వశిష్ట, అరుంధతీ ద్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారారూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది

Read More

ఏడు వారాల నగలు

ఏడు వారాల నగలు

పూర్వము ఏడు వారాల నగలలు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది. ఏడువారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈనాడు కూడా వాటి గురించి తెలుసుకోవడం అశక్తికరమే! మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య స్త్రీ పురుషులు బంగా
రు నగలను ధరించెడివారు. వారము రోజులు అనగ ఆదివారము మోదలు శనివారము వరక్ రోజుకొక విధమైన బంగారు ఆభరణముల్ను ధరించెడివారు. వీటినే ఏడు వారాల నగలు అందురు. గ్రహాలకు అనుకూలముగా కంఠహారములు, గాజులు, కమ్ములు, ముక్కుపుడకలు, పాపిటబిల్ల, దండెకడేము (ఈనాటి వంకీ), ఉంగరాలు మొదలగు ఆభరణాలౌ ధరించెడివారు.

ఏ రోజున ఏయే నగలు ధరించవలెనో ఈ విధముగా తెలియజేయబడినది:

ఆదివారము: సూర్యుని కోసము కెంపుల కమ్మలు, హారాలు మొదలగునవి.

సోమవారము: చంద్రునికోసము ముత్యాలహారాలు, గాజులు మొదలగునవి.

మంగళవారము: కుజునికోసము పగడాల దండలు, ఉంగరాలు మొదలగునవి.

బుధవారము: బుధునికోసము పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.

గురువారము: బౄహస్పతికోసము పుష్యరాగము కమ్ములు ఉంగరాలు మొదలగునవి

శుక్రవారము: శుక్రుని కోసము వజ్రాల హారాలు ముక్కుపుడక మొదలగునవి.

శనివారము: శనికోసము నీలమణి మణిహారాలు మొదలగునవి.

Read More

వసంత పంచమి... సరస్వతీ దేవి

వసంత పంచమి... సరస్వతీ దేవి "
"నేడు విద్యాభ్యాసం మొదలెడితే జ్ఞానులవుతారు "
________________________________
సరస్వతీ దేవిని ఆరాధించే దినమే వసంత పంచమి.
సరస్వతీదేవి నాలుగు చేతులతో అలరారుతుంటుంది.
కుడి చేతిలో పుస్తకం, ఎడమ చేతిలో స్ఫటికమాలనీ,
మిగతా రెండు చేతుల్తో వీణను వాయిస్తుంటుంది.

సరస్వతీ దేవి ధవళకాంతులతో మెరిసిపోతుంటుంది.

--అందమైన పద్మం సరస్వతికి సింహాసనం.
మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె.

వాక్కులకు సంకేతములైన వేదములు:-
-- రుగ్వేదం.........మంత్రాలు (పద్యం, పాట, కవితలకు మూలం),
-- యజుర్వేదం.... వచనం (వచనం, గద్యం, భావ కవిత్వం, వ్యాసం),
-- సామవేదం..... సంగీతం ||

సరస్వతీ దేవి నాలుగు చేతులు ఈ విధంగా దర్శనమిస్తాయి:-
--- ఒక చేతిలో పుస్తకం............ వచనాన్ని
--- ఇంకో చేతిలో స్ఫటికమాల.... మంత్రాన్ని,
--- రెండు చేతులలో వీణ ......... సంగీతాన్ని||

-- బ్రహ్మదేవుని ముఖాలు నాలుగు వేదాలకు ప్రతీకలు.
కాబట్టి బ్రహ్మ ముఖంలో సరస్వతి ఉంటుందని శాస్త్రోక్తి.

--సరస్వతి అంటే జ్ఞానాన్ని కల్గించే కిరణమనే అర్థం కూడా ఉంది.
సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగీశ్వరిగా, శారదగా అభివర్ణించారు

Read More

హిందూ ధర్మం ... ప్రత్యేకతలు "

హిందూ ధర్మం ... ప్రత్యేకతలు "
-------------------------------
"....ప్రాచీన హైందవ దేశంలో నువ్వు సేవా చెద్దామన్నా నీకు మనిషి కనపడదు.
నీకే అందరు అతిది సత్కారం చేస్తారు అలాంటి వ్యవస్థను
నాశనం చేసి ఏదో సేవ చేస్తున్నాము అని మీరు చెప్పడం 
ఒక మనిషిని చావబాదుతూ మళ్ళి మందు రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంది..."
ఈ మద్య కాలంలో స్వామి పరిపూర్ణానంద స్వామి వారితో TV 9 వారు ఎన్ కౌంటర్ కార్యక్రమం చేసారు దానిలో చర్చ రథయాత్ర , అమ్మ ఒడి కార్యక్రమాల గురుంచి . ఆ సమయంలో ఒక క్రైస్తవ పాస్టర్ స్వామి వారితో పోన్ లో ఇలా ప్రశ్నించాడు. క్రైస్తవ మిషనరీలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయు మీ హైందవ సంస్థలు ఇలాంటివి చేయరు . మంచి పనులు చేస్తున్న మాపై బురద ఎందుకు చల్లుతున్నారు అని ఇంకా చాలా అన్నారు దానికి స్వామి వారు ఇలా సమాదానం చెప్పారు , "అసలు భారతదేశంలో ఇతర మతస్తులు అడుగు పెట్టనంత వరకు ఈ దేశంలో పిల్లలకు "తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా, గిట్టదా! విశ్వదాభిరామ వినురవేమ!" లేదా "తల్లిదండ్రులను కావడి లో మోసి సాకిన శ్రావణకుమారుని కథలు" ఇలాంటివి నేర్పేవారము ఇంకా ఉమ్మడి కుటుంబాలు, అచార వ్యవహారాలు ,అతిది మర్యాదలు, అన్ని జంతువులను భగవత్ భావనతో చూడటం చేసేవారము. ఎప్పుడైతే ఈ దేశంలోకి విదేశి పైశాచిక మతాల ప్రవేశం జరిగిందో వారు అప్పటి నుంచి హైందవ ధర్మాన్ని నాశనం చేస్తూ వచ్చారు . మాలో మాకు గొడవలు పెట్టారు మతాల వారీగా మమ్మల్ని విడగొట్టారు. కుటుంబ వ్యవస్థను విలువలను పాడు చేసారు. అలా జరగడం వల్ల పిల్లలు తల్లి తండ్రులను గెంటేయడం , సమాజంలో ఎవరి స్వార్దం వారు చూసుకోవడం లాంటివి ప్రవేశించి మీరు సేవ చేయడానికి మనుషులు దొరుకుతున్నారు, కాని ప్రాచీన హైందవ దేశంలో నువ్వు సేవా చెద్దామన్నా నీకు మనిషి కనపడదు నీకే అందరు అతిది సత్కారం చేస్తారు అలాంటి వ్యవస్థను నాశనం చేసి ఏదో సేవ చేస్తున్నాము అని మీరు చెప్పడం ఒక మనిషిని చావబాదుతూ మళ్ళి మందు రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పారు. విలువలు లేని జీవితాలు జీవిస్తూ రోగం వచ్చాక మందు రాసుకునే వారు మీరు, రోగాలు లేకుండా జీవించే వాళ్లం మేము అని చాలా అద్బుతంగా అతనికి సమాదానం చెప్పారు మన స్వామి వారు.
Read More

!! గాయత్రీ మంత్రము !!

!! గాయత్రీ మంత్రము !!

" ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణియం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ "
ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు. ఇంతటి మహోన్నతమైన మంత్రములో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి దాగి ఉంటుందని పురాణ వచనం. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ 24మంది దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు సిద్ధిస్తాయి. ఈ 24 అక్షరాలలో ఉన్న దేవతామూర్తుల పేర్లను తెలుసుకుందామా...

1. తత్ – గణేశ్వరుడు 2. స - నృసింహ భగవానుడు 3. వి – విష్ణుదేవుడు
4. తుః – శివదేవుడు 5. వ - కృష్ణ భగవానుడు 6. దే - రాథా దేవి
7. ణ్యం – లక్ష్మీదేవి 8. భ – అగ్నిదేవుడు 9. ర్గః – ఇంద్రదేవుడు
10. దే – సరస్వతి 11. వ – దుర్గాదేవి 12. స్య – హనుమంతుడు
13. ధీ – పృధ్వీదేవి 14. మ – సూర్యదేవుడు 15. హి - శ్రీరాముడు
16. ధి – సీతామాత 17. యో – చంద్రదేవుడు 18. యో – యమదేవుడు
19. నః – బ్రహ్మదేవుడు 20. ప్ర – వరుణదేవుడు 21. చో - నారాయణుడు
22. ద - హయగ్రీవ భగవానుడు 23. యా – హంసదేవత 24. త్ - తులసీదేవి

మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, సుఖసంతోషాలు వనగూరుతాయి. ప్రపంచ మానవాళి గాయత్రీ మంత్రాన్ని జపించి తరిస్తోంది

Read More

చెరకు రసం చక్కని పరిష్కారం:-


చెరకు రసం చక్కని పరిష్కారం:-

చెరకు రసం పిల్లాపెద్దల నోరూరించే చెరకు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇందులో పొటాషియం అధికం. ఇది లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్‌) పుష్కలంగా అందుతుంది
. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ. రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు అపారం. తక్షణ శక్తినందించడం దీని ప్రత్యేకత. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి చేసే చెరకు రసంలో పోషకాలు కూడా అధికంగానే ఉన్నాయి. శీతల పానీయాలు, కోలాలతో పోలిస్తే ఇది నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. శరీరంలో నీటిస్థాయి పడిపోకుండా జాగ్రత్తపడుతుంది. మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి చెరకు రసం చక్కని పరిష్కారం.

1.1. కామెర్లకు విరుగుడు:- 
చెరకు రసం కామెర్లును సహజంగా నయం చేసే ఒక ఔషధం. రక్తంలోని బిల్లిరుబిన్ కారణంగా కామెర్లు ఏర్పడి చర్మం పొరలుగా పసుపు రంగులోకి మారుతాయి. ఇది కాలేయ పనితీరు సరిగా లేకపోవడం మరియు పిత్తాశయ వాహికలు మూసుకుపోవడం వల్ల కామెర్లకు కారణం అవుతుంది. కాబట్టి దీని నుండి బయట పడటానికి ఒక గ్లాసు చెరకు రసంకి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజూ తీసుకోవాలి.

2. కిడ్నీ(మూత్రపిండం)లో రాళ్ళు:-
చెరకు రసంతో ఇది చాలా ప్రభావవంతమైన ఆరోగ్య ప్రయోజనం. డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడుతాయి. కాబట్టి ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు విచ్చినం చేయడానికి సహాయం చేస్తుంది. ఎక్కువ ద్రవాలను మరియు చెరకు రసాన్ని తాగడం వల్ల మూత్రపిండంలో రాళ్ళు విచ్చిన్నం చేయడానికి, కరిగిపోవడానికి చెరకు రసం ఉపయోగపడుతుంది.

3.మధుమేహానికి:-
మధుమేహం ఉన్నవారికి చెరకు రసం బాగా సహాయపడుతుంది . ఇది ముడి షుగర్ కన్నా లేదా ఆర్టిఫిషియల్ షుగర్ కన్నా ఈ చెరకు రసం చాలా మంచిది. మీరు బరువు తగ్గించే పనిలో ఉన్నా లేదా డయాబెటిక్ చెరకు రసం జ్యూస్ తాగడం చాలా ఆరోగ్యకరం. ఈ జ్యూస్ వల్ల శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ ను క్రమబద్దీకరిస్తుంది.

4.న్యూట్రిషియన్ బెనిఫిట్స్:-
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్‌) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ. రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు అపారం.

5.జలుబు, జ్వరం మరియు గొంతు నొప్పి:-
మీరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం హానికరం అని భావిస్తే అది తప్పే. ఇటువంటప్పుడు ఒక గ్లాస్ చెరకు రసం జ్యూస్ తాగడం వల్ల ఈ జబ్బులను నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

6.క్యాన్సర్ నివారిణి:-
ఇందులో ఆల్కలీన్ కలిగి ఉండటం వల్ల, చెరకు రసం ముఖ్యంగా ప్రొస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల లేదా రొమ్మక్యాన్సర్, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.

7.రీహైడ్రేషన్:-
సాధారణంగా మనలో చాలా మంది ఎక్కువగా నీరు త్రాగరు. దాంతో డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. కాబట్టి శరీరంలో నీటిని నిల్వ చేయడానికి చెరకు రసం బాగా సహాయపడుతుంది. ఇంకా వేసవి కాలంలో చెరకు రసం త్రాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.

Read More

అష్ట దిక్పాలకులు ఎవరు ?....వారి పేర్లు ఏమిటి ?

అష్ట దిక్పాలకులు ఎవరు ?....వారి పేర్లు ఏమిటి ?

అష్ట దిక్కులు- దిక్పాలకులు:-

మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా
తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ .

అలాగే నాలుగు మూలలు. ఆ నై వా ఈ అనేది కొండ గుర్తు. ఆనై అంటే తమిళం లో ఏనుగు, వాయి అంటే నోరు. ఆనైవాయి అంటే ఏనుగు నోరు అన్నమాట. అలా మనం మూలలు వరసలో గుర్తుపెట్టుకో వచ్చు. తూర్పు నుండి లెక్కిస్తే
1.ఆగ్నేయం ,
2.నైరుతి,
3.వాయువ్యం,
4.ఈశాన్యం

ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు. వాళ్ల వివరాలు ...

1.ఇంద్రుడు - తూర్పు దిక్కు

ఇతని భార్య పేరు శచీదేవి, ఇతని పట్టణం అమరావతి, అతని వాహనం ఐరావతం, వీరి ఆయుధం వజ్రాయుధము.

2.అగ్ని - ఆగ్నేయ మూల

ఇతని భార్య పేరు స్వాహాదేవి, ఇతని పట్టణం తేజోవతి, అతని వాహనం తగరు, వీరి ఆయుధం శక్తిఆయుధము.

3.యముడు - దక్షిణ దిక్కు

ఇతని భార్య పేరు శ్యామలాదేవి, ఇతని పట్టణం సంయమిని, అతని వాహనం మహిషము, వీరి ఆయుధం దండకము.

4.నైఋతి - నైఋతి మూల

ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, ఇతని పట్టణం కృష్ణాంగన, అతని వాహనం గుఱ్ఱము, వీరి ఆయుధం కుంతము.

5.వరుణుడు - పడమర దిక్కు

ఇతని భార్య పేరు కాళికా దేవి, ఇతని పట్టణం శ్రద్ధావతి, అతని వాహనం మొసలి, వీరి ఆయుధం పాశము.

6.వాయువు - వాయువ్య మూల

ఇతని భార్య పేరు అంజనాదేవి, ఇతని పట్టణం నంధవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజము.

కుబేరుడు - ఉత్తర దిక్కు

7.ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, ఇతని పట్టణం అలక, అతని వాహనం నరుడు, వీరి ఆయుధం ఖడ్గము.

8.ఈశాన్యుడు - ఈశాన్య మూల

ఇతని భార్య పేరు పార్వతీ దేవి, ఇతని పట్టణం యశోవతి, అతని వాహనం వృషభము, వీరి ఆయుధం త్రిశూలము.

Read More

కొబ్బరి నీళ్ళతో ఆరోగ్యం:-

కొబ్బరి నీళ్ళతో ఆరోగ్యం:-

ఆరోగ్యానికి కొబ్బరి నీళ్ళు శ్రేష్టం అనే సంగతి జగమెరిగిన సత్యం. వేసవిలో తాగే పానీయాలలో ముఖ్యమైనవి, ఆరోగ్యాన్నిచ్చేవి కొబ్బరి నీళ్ళు. అందరికి అందుబాటులో ఉండే మధురమైన లేత కొబ్బరిబొండం నీటిలో అనేక ఔషధ విలువలు ఉన్నాయి. కొబ్బరి నీటిని ఏ కాలంలో అయినా అందరూ తాగవచ్చు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా వేసవిలో మాత్రం రోజుకు ఒక కొబ్బరి బొండం తాగితే వేసవి రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుంది.

1.రక్త శుద్ధిలో కొబ్బరి నీళ్ళ పాత్ర ఆమోఘం ఒక్క మాటలో చెప్పాలంటే కొబ్బరి నీరు గ్లాసు పాలకంటే కూడా పుష్టికరం.

2.పైగా ఇందులో తల్లిపాలలో ఉండే లారిక్‌యాసిడ్‌ లాంటి సుగునాలన్నీ కూడా కలగలిసి ఉన్నాయి.

3.చక్కెర పదార్థాలు, ఖనిజలవణాలు విటమిన్లతో సమృద్ధమైన కొబ్బరి నీరు ఎంత అలసటనైనా సరే ఇట్టే పోగొట్టేస్తుంది.

4.కమిలిపోయి పొడిబారిపోయినట్లుండే చర్మానికి కొబ్బరి నీళ్లు మంచి మందు. కొబ్బరి నీళ్ళలో దూదిని ముంచి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

5.వేసవి కాలంలో ప్రతిరోజ అల్పాహారానికి ముందు లేత కొబ్బరినీళ్ళు తాతిగే అంతర్గ గాయాలు త్వరగా మానిపోతాయి

6.లేత కొబ్వరినీళ్ళను ఆరునెలలపాటు రాస్తుంటేస్మాల్‌పాక్స్‌ మచ్చలు పోయే అవకాశం ఉంది.

7.వేడిని తగ్గిస్తాయి. విరేచనాలను అరికడతాయి. గుండె జబ్బులను తగ్గిస్తాయి. అన్నిటినీ మించి, శక్తిని, బలాన్ని అందిస్తాయి. కొబ్బరికాయలో ఉండే అమూల్యమైన గుణాలు ఎన్నో ఉన్నాయి.

Read More

పునాదిలేని తంజావూరు శివాలయం:-

పునాదిలేని తంజావూరు శివాలయం:-

కింది నుంచి చూస్తే ఆ ఆలయం ఒక పెద్ద కొండలా కనిపిస్తుంది. దాని గోపురం ఎత్తు 216 అడుగులు. ఇంత ఎత్తైన దేవాలయం కోసం ఎంత లోతు పునాది తీశారో అనుకుంటాం. ఇది సహజం. కాని ఆ దేవాలయానికి అసలు పూనాదే లేదు. నమ్ముతారా ? ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా.. ఇది నిజం. 

ఇంత ప్రత్యేకత ఉన్న ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉంది. మేరు పర్వతంలాంటి ఎత్తైన ఈ కట్టడం కళలు, ఆధ్యాత్మికతకే కాదు, వెయ్యేళ్ళ కిందటి నిర్మాణ నైపుణ్యతకు అద్దం పడుతోంది. ఇంత వరకూ ఈ నిర్మాణం చెక్కు చెదరలేదు. ఇలా ఒకటి కాదు. రెండు కాదు. వెయ్యేళ్లుగా అలాగే ఉంది. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. 

క్రీస్తు శకం 1003-09లో ఆ ప్రాంత రాజు అయిన రాజరాజ చోళుడు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ పవిత్ర దేవాలయంలోనికి ప్రవేశించగానే 13 అడుగుల ఎత్తు ఉన్న శివలింగం కనిపిస్తుంది. ఐదు పడగల నాగేంద్రుని నీడన శివలింగ రూపంలో పరమేశ్వరుడు దర్శనమిస్తారు. ఈ మొత్తం నిర్మాణంలోకి ఇది ఒక అద్భుత దృశ్యం.

దీని చుట్టూ ఆరడుగులు ఖాళీ ఉండేటట్లు రెండు వెడల్పాటి గోడలను నిర్మించారు. వెలుపలి గోడపై ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కళా సంపదను సమకూర్చారు. చతురస్రాకారంగా ఉన్న ఈ నిర్మాణం ఒకటికిపైగా చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఈ నిర్మాణాన్ని మొత్తం రాతితోనే కట్టారు. ఈ రెండు ప్రహారీల మధ్య ఉన్న విరామమే ఈ భారీ నిర్మాణ అందానికి కేంద్రబిందువు.

Read More

వినాయకుడు ఏక దంతుడు ఎలా అయ్యాడు ..?!


వినాయకుడు ఏక దంతుడు ఎలా అయ్యాడు ..?!

శ్లో|| శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే... 

ఆది దేవుడిని పూజించుకుంటూ విఘ్న వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం..

కార్తవీర్యుని వధించిన అనంతరం పరుశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదని నివారించాడు. "పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవ్వడివి" అంటూ పరుశురాముడు ధిక్కరించాడు.

మాటా మాటా పెరిగి అదికాస్తా యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరుశురామున్ని పైకిఎత్తి పడవేశాడు. పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి. ఆగ్రహించిన పరుశురాముడు తన చేతిలోని గ్రండ గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరము నుంచి బయటికి వచ్చారు.
నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని "ఏకదంతుడి"గా పేరు పొందాడు

Read More

మామిడి పండుతో ఆరోగ్య ప్రయోజనాలు:-

మామిడి పండుతో ఆరోగ్య ప్రయోజనాలు:-

1.ఊరించే రంగుతో, కమ్మనైన రుచితో.. నోరంతా తీపి చేసే మామిడి పండు ఆరోగ్య ప్రదాయినే కాదు, సౌందర్య సంరక్షిణి కూడా. మొటిమలు, మచ్చలతో బాధపడేవారు ఐదు టీస్పూన్ల మామిడి పండు రసాన్ని తీసుకుని దాంట్లో ముప్పావు టీస్పూన
్ పసుపు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా ఆరిన తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. చర్మానికి మృదుత్వాన్నిస్తుంది. అయితే ఈ మామిడిపండు ప్యాక్‌ను కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా వాడటం మాత్రం మర్చిపోవద్దు.

2.మూత్రపిండాలలో రాళ్ళున్నవారు ఒక గ్లాసు మామిడి పళ్ళ రసంలో అరగ్లాసు క్యారెట్ రసాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా రెండు నెలలు తీసుకుంటే మూత్రపిండంలోని రాళ్ళు కరిగిపోయి, 
ఇకపై రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇలా ప్రతిరోజూ సేవిస్తుంటే పూర్తి ఆరోగ్యంగా వుండటమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుందని వైద్యులు తెలిపారు.

3.మామిడి పండులో విటమిన్ ఏ అధికంగా ఉంది. ఇది రేచీకటి రాకుండా కాపాడుతుంది. కాగా ఇంకా కొన్ని దృష్టి లోపాలనుకూడా నివారిస్తుంది. అంతేగాకుండా కనుపాపలను తడిగావుంచి, కంటినుండి నీరు కారటం, కంటి మంట, దురదలు రాకుండా కాపాడుతుందని వైద్యులు పేర్కొన్నారు.

4.తాజా మామిడి ఆకులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ప్రతిరోజూ తాగటంవల్ల డయాబెటీస్ (చక్కెర వ్యాధి)ని అరికట్టవచ్చు. స్త్రీలకు సంబంధించిన
అనేక సమస్యలకు కూడా ఈ మామిడి ఆకులను నానబెట్టిన నీటితో చక్కటి పరిష్కారం లభిస్తుంది.

5.పూర్తిగా పండని మామిడి పండును తినటంవల్ల కూడా ప్రయోజనం ఉంది. ఇలాంటి పండును తినటంవల్ల శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి వల్ల ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తి పెరుగుతుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలను రాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే స్కర్వీ వ్యాధిని నిరోధించటంలో కూడా పూర్తిగా పండని మామిడి పండు శక్తివంతంగా పనిచేస్తుంది.

Read More

గోవిందా గోవింద. -శ్రీ గంగ చౌదరి

పసిడికొండ తిరుమలకొండ ఆ కొండపైన తిరుమలరాయుడు 
ధరణి ధరుడు శ్రీవేంకటేశుడు లక్ష్మివలభుడు శ్రీశ్రీనివాసుడు 
ఇహలోకంలో సౌక్యము పరలోకమున ఆనందమును ఇచ్చువాడు 
ధ్రువ నక్షత్రం నుంచి భు మండలంలో ఏ జివి నైన రక్షించువాడు 
ఏడుకొండలైనా..ఏడేడు లోకలైన ఏలే ఏక 
స్వరూపుడు 
అది మధ్యంతరహితుడు ఆనంద నిలయ వాసుడు 
పరమ రమ్యమైన రూపుడు గోవిందుడు 
సకల సుగుణాల సౌమ్యుడు తిరుమల వాసుడు 
ఎన్ని వేల జన్మల పుణ్యఫలం శ్రీ నిలయుని దర్శనం 
అందరు కలసి ఒకసారి అనండి ఏడు కొండల వడ వెంకటరమణ గోవిందా గోవింద.
-శ్రీ గంగ చౌదరి

Read More

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచస్తోత్రం ॐ :-

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచస్తోత్రం ॐ :-
_____________________________
నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు

య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
_________________________________

Read More

ఋణవిమోచన లక్ష్మి నృసింహ స్తోత్రం ॐ

ఋణవిమోచన లక్ష్మి నృసింహ స్తోత్రం ॐ
------------------------------------------
దేవతాకార్యసిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

లక్ష్మ్యాలింగితవామాంగం భక్తానాం వరదాయకం

శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

స్మరణాత్సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వరవిదారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

వేదవేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

య ఇదం పఠతే నిత్యం ఋణమోచనసంజ్ఞితం
అనృణీ జాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్

Read More

శ్రీ నరసింహావిర్భావం <<<

శ్రీ నరసింహావిర్భావం <<<
________________________
"ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్", అని హిరణ్య కశిపుడు ప్రశ్నించాడు.
"బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు, స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు.

"సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు గదతో స్తంభంపై భయంకరంగా మోదాడు .

బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. "

ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహ స్వామి" స్తంభమునుండి ఆవిర్భవించాడు.


అప్పుడు శ్రీ నృసింహ స్వామి భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.

Read More

దారిద్ర్యదహన స్తోత్రం

దారిద్ర్యదహన స్తోత్రం :-
_________________

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూరకాన్తి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

గౌరిప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాన్తకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ భువన త్రయమండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపయాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయRead More

108 నామాలలొ సంపూర్ణ రామాయణముRead More

శ్రీ మహావిష్ణువు ఎత్తిన పది అవతారాలలో శ్రీరామావతారం ఏడవది.శ్రీ మహావిష్ణువు ఎత్తిన పది అవతారాలలో శ్రీరామావతారం ఏడవది.

శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునకు కౌసల్య గర్భమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పుట్టాడు.

అందుచేత ప్రతీ సంవత్సరం చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామజయంతి వేడుకగా జరుపుకుంటాం. ఆంధ్రదేశంలో శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం జరపడం అనాదిగా ఆచారంగా వస్తోంది.

రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని సంహరించడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరిగారు.

ఒక రోజు పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేసాడు.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మానవులకు 'రామనామ స్మరణ' జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. 'రామ' యనగా రమించుట అని అర్ధం.

శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రామ నవమి నాడు రామునికి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.

భద్రాచలంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్ట్రప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.

రామ సంబంధమైన పండుగలు ఏడాదిలో శ్రీరామనవమి కాక మరి రెండు ఉన్నాయి.

1. రామలక్ష్మణ ద్వాదశి: ఇది జ్యేష్ఠ శుద్ద ద్వాదశి నాడు జరుపుకుంటాం.
2. జానకీ జయంతి: ఇది ఫాల్గుణ శుద్ద అష్టమి నాడు జరుపుకుంటాం. 
జనకమహారాజు యజ్ఞశాలకై భూమిని దున్నుతూ ఉండగా నాగటి చాలులో తగిలిన బంగారు పెట్టెలో ఈ నాడు సీత దొరికింది. అందుచేత ఈనాడు సీతాజయంతిగా జరుపుకుంటాము.

Read More

శ్రీరామ నామ మహిమ

శ్రీరామ నామ మహిమ

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
అజానుబాహుం మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

లక్ష్మీ సహితుడైన రాఘవుని, దశరథుని కుమారుని, అప్రమేయుని (కొలతలకు అందనివానిని) సీతాపతిని, రఘువంశంలో రత్నదీపంలా ప్రకాశించే వానిని, ఆజానుబాహుని, పద్మదళాలవలె విశలమైన కన్నులు గలవానిని, రాక్షసులను నశింపజేసినవానిని, శ్రీరామచంద్రునికి నమస్కరించుకుంటున్నాను.

శ్రీరామచంద్రముర్తి చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నాలుగవ పాదాన కర్కాటకలగ్నంలో మధ్యాహ్నం పూట శ్రీమహావిష్ణువు అవతారంగా జన్మించాడు. అసలు శ్రీమహావిష్ణువు దశావతారాలను పరిశీలించినపుడు, ఆయన ధరించిన పది అవతారాల్లో, మూడు అవతారాలు చైత్రమాసంలోనే ప్రాదుర్భవించినట్లు తెలుస్తోంది. మత్స్య, వరాహ, శ్రీరామ అవతార జయంతులు చైత్రమాసంలోనే వస్తుంటాయి. అలాగే దశావతారాలలో శ్రీరామావతారం ఏడవది అయినప్పటికీ, ప్రతి సంవత్సరం పది జయంతులు ముగిసిన పిదప, మరలా సంవత్సర ప్రారంభంలో మొదటగా వచ్చే జయంతి పండుగ శ్రీరామనవమే!

దశావతార జయంతులు:

1. మత్స్య - చైత్రబహుళ పంచమి, 2. కూర్మ - వైశాఖ శుద్ధ పూర్ణిమ, 3. వరాహ - చైత్ర బహుళ త్రయోదశి, 4. నారసింహ - వైశాఖ శుద్ధ ద్వాదశి, 5. వామన - భాద్రపద శుద్ధ చతుర్దశి, 6. పరశురామ - వైశాఖ శుద్ధ ద్వాదశి, 7. శ్రీరామ - చైత్రశుద్ధ నవమి, 8. శ్రీకృష్ణ - శ్రావణ బహుళ అష్టమి, 9. బుద్ధ - వైశాఖ శుద్ధ పౌర్ణమి, 10. కల్కి - భాద్రపద శుద్ధ విదియ

శ్రీరాముడు పుట్టినరోజునే శ్రీరామ కల్యాణోత్సవాన్ని జరుపుకుంటుంటాం. ఈ విషయమై కొంతమంది, పుట్టినరోజునే కల్యాణోత్సవం ఏమిటన్న వితండవాదం చేస్తుంటారు. అవతార పురుషుడు శ్రీరాముడు ఈ లోకాన అవతరించడమే మంగళప్రదం. అందుకే ఆనందదాయకమైన ఆరోజున లోక కల్యాణాన్ని ఉద్దేశించి సీతారాముల కల్యాణోత్సవం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ కల్యాణరాముని చరితను ఊరూరా, వాడవాడలా పారాయణం చేస్తూ ధన్యులవుతుంటారు. ఆనందోత్సాహంలో తేలిపోతుంటాము.

అసలు శ్రీరామనామ జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం. శ్రీరామనామం త్రిమూర్తులకు ప్రతీక. అందుకే పార్వతీ వల్లభుడు కూడ,

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

అంటూ శ్రీరామనామం విష్ణుసహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు. విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామం సర్వదేవతల కంటే అధికమైంది. అటువంటివి వేయినామాలు ఒక్క రామనామానికి సమం. రామనామం బ్రహ్మహత్యాది అనేక పాతకముల నుండి రక్షిస్తుంది.

'రామ నామాత్పరో మంత్రః నభూతో న భవిష్యతి' అని అన్నారు. అంటే, రామనామాని కంటే గొప్పమంత్రం ఇదివరలో లేదు. భవిష్యత్తులో కూడా ఉండబోదని చెప్పబడింది. మంత్రాలలోకెల్లా గొప్పదైన గాయత్రీ మంత్రానికి, రామమంత్రానికి మధ్య భేదమేమీ లేదు. 'రామ' నామాన్ని చెబితే గాయత్రీమంత్రాన్ని చెప్పినట్లే.

ఆ, ఉ, మ ల సంగమమే ఓంకారమని మనకు తెల్సిందే. అ= విష్ణువు, ఉ= మహాలక్ష్మీ, మ= జీవుడు. రామనామం ప్రణవం నుంచే ఉద్భవించిందని రామాయణం పేర్కొంది. శ్రీరామనామ మహిమను తెలియజేసే ఎన్నో ఉదాంతాలు మనకు కనబడుతున్నాయి. అందులో ఓ ఉదాంతం:

రావణ వధానంతరం సీతాసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు, నీండుసభలో కొలువైయుండగా నారదమహర్షి ప్రవేశించాడు. నారదమునితో పాటు విశ్వామిత్రుడు, వశిష్ఠాదిమహర్షులు విచ్చేశారు. అక్కడ ఒక దార్మిక విషయమంపై చర్చ కొనసాగుతున్న విషయాన్ని గమనించిన నారదుడు, సభాసదులందరినీ ఉద్ధేశించి, "సభకు వందనం, ఇక్కడ సమావేశమైన వారందరినీ ఒక విషయమై ప్రార్థిస్తున్నాను. భగవంతుని నామం గొప్పదా? భగవంతుడు గొప్పవాడా? ఈ విషయమై అభిప్రాయాన్ని చెప్పండి" అని పలికాడు. నారదుని అభ్యర్థన విన్నవెంటనే సభలో చర్చలు ఊపందుకున్నాయు. ఎంతగా వాదోపవాదాలు జరిగినప్పటికి రాజసభలోని ఋషిగణం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. కలకలం చెలరేగింది. చివరకు నారదుడే తన తుది నిర్ణయాన్ని వ్యక్తీకరిస్తూ, ఖశ్చితంగా భగవంతుని కంటే భగవంతుని నామమే శ్రేష్ఠమైనదని చెప్పాడు. సభ ముగియడానికి ముందుగానే ఈ విషయం ఋజువవుతుందని పలికాడు.

అనంతరం నారదుడు, ఆంజనేయునితో, "హనుమా! నువ్వు మాములుగానే ఋషులకూ, శ్రీరామునికీ నమస్కరించు. విశ్వామిత్రునికి తప్ప" అని చెప్పాడు. అందుకు హనుమంతుడు అంగీకరించాడు. ప్రణామ సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్కరించాడు గాని, విశ్వామిత్రునికి మాత్రం నమస్కరించలేదు. దాంతో విశ్వామిత్రుడు కోపగించుకున్నాడు. అప్పుడు నారదుడు విశ్వామిత్రుని సమీపించి, "మునీశ్వరా! హనుమంతుని పొగరును గమనించారా? నిండుసభలో మీకు తప్ప అందరికీ నమస్కరించాడు. మీరు అతన్ని తప్పక శిక్షించాలి. అతనికి ఎంత గర్వాతిశయమో చూశారా? " అని చెప్పడంతో విశ్వామిత్రుడు మరింత కోపావేశానికి గురయ్యాడు. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తిని సమీపించి, "రాజా! నీ సేవకుడైన హనుమంతుడు అందరికి నమస్కరించి, నన్ను అవమానించాడు. కనుక రేపు సూర్యుడు అస్తమించేలోగా, నీ చేతులతో అతనికి మరణదండన విధించాలి" అన్నాడు. విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు. కనుక, రాముడు అతని అదేశాన్ని పాలించవలసిందే. ఆ క్షణంలో శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయాడు. కారణం స్వయంగా తన చేతులతో అనన్య స్వామిభక్తుడైన తన మారుతికి మరణదండన విధించాలి. ఈ విషయం క్షణకాలంలో నగరం అంతా వ్యాపించిపోయింది.

హనుమంతునికి కూడా మహాదుఃఖం కలిగింది. అతడు నారదమునిని సమీపించి "దేవర్షీ! నన్ను రక్షించండి. శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తాడు. నేను మీరు చెప్పినట్లే చేసినందులకు ఫలం అనుభవించినాను. ఇప్పుడు నేనేమి చేయాఅలి?" అనగా దేవర్షి, "ఓ హనుమంతా! నిరాశపడకు. నేను చెప్పినట్లు చేయి. బ్రహ్మ ముహూర్తంలో లేచి సరయూనదిలో స్నానమాచరించి చేతులు జోడించి, "ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ" అన్న మంత్రాన్ని జపించు. అంతే. విశ్వాస పూర్వకంగా చెబుతున్నాను. నీకే భయం రాదు" అన్నాడు.

మరునాడు తెల్లవారింది. సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు సరయూనదికి చేరాడు. స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం, చేతులుజోడించి భగవంతుని నామాన్ని జరిపించసాగాడు. ప్రాతఃకాలం కావడంతో హనుమంతుని కఠినపరీక్షను తిలకించాలని ప్రజలంతా గుంపులు గుంపులుగా వచ్చేశారు. శ్రీరామచంద్రుడు హనుమంతునికి దూరంలో నిలబడి తన పరమ సేవకుణ్ణి కరుణార్ధ్ర దృష్ఠితో చూడసాగాడు. కాలం ఆసన్నం కావడంతో అనిచ్చా పూర్వకంగానే హనుమంతునిపై బాణాలను వర్షింపజేయసాగాడు. కాని, ఒక్క బాణం కూడా హనుమంతుని బాధించలేకపోయింది. ఆ రోజల్లా బాణాలు వర్షింపబడుతున్నాయి. కాని, అవి హనుమంతునిపై పడడం లేదు. కుంభకర్ణాది రాక్షసుల్ని వధించటంలో ప్రయోగించిన భయంకర అస్త్రాలను కూడా ప్రయోగించాడు. అంతంలో శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ఎత్తాడు. హనుమంతుడు ఆత్మసమర్పణ చేసి పూర్ణభావంతో మంత్రాన్ని తీవ్రముగా జపిస్తున్నాడు. అతడు రామునివైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. స్థిరభావంతో నిలబడిపోయాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ హనుమంతునికి జయజయకారాలు పలుకసాగారు. అట్టిస్థితిలో నారదమహర్షి విశ్వామిత్రుని సమీపించి - "ఓ మహర్షీ! ఇక మీరు విరోధాన్ని ఉపసంహరించుకొనెదరు గాక! శ్రీరామచంద్రుడు అలసివున్నాడు. విభిన్న ప్రకారాలైన బాణాలు కూడ హనుమంతుని ఏమీ చేయలేకపోయాయి. హనుమంతుడు మీకు నమస్కరించక పోతే పోయినదేమున్నది? ఈ సంఘర్షణ నుండి శ్రీరాముని రక్షించండి. ఈ ప్రయాస నుండి అతణ్ణి నివృత్తుణ్ణి చేయండి. మీరంతా శ్రీరామ నామ మహత్త్యాన్ని చూచినారు కదా!" ఆ మాటలకు విశ్వామిత్రమహర్షి ప్రభావితుడైపోయాడు. "రామా! బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించవద్దు" అని ఆదేశించాడు. దానితో హనుమంతుడు వచ్చి, తన ప్రభువు యొక్క చరణ కమలాలపై వ్రాలిపోయాడు. విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడై హనుమంతుని అనన్య భక్తిని గురించి విశేషంగా ప్రశంసించాడు.

హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారదమహర్షి ప్రప్రథమంగా అతనికి రామమంత్రాన్ని ఉపదేశించాడు.

'శ్రీరామ' - ఈ సంబోధన శ్రీరామునికై పిలుపు. "జయరామ" ఇది అతని స్తుతి. 'జయజయరామ'- ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ. మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే వుండాలి. ఓ రామా! నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ శరణుజొచ్చినానన్న భక్తులకు శ్రీఘ్రమే శ్రీరామభగవద్దర్శనం జరుగుతుంది.

సమర్థ రామదాసస్వామి ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి, శ్రీరాముని ప్రత్యక్షదర్శనాన్ని పొందాడు. రామనామ శక్తి ప్రభావం అమితమైనది. అందుకే రామనామాన్ని నిత్యం భక్తులు జపించి తరిస్తుంటారు. స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాగో, ఈ భూలోకంలో మానవులకు రామనామం అటువంటిది. రామనామాన్ని నిత్యం జపించేవాడు, తులసీమాలను ధరించినవాడు, రామా అని స్వామి వారిని నోరార పిలిచినవాడు ధన్యుడు. ఈ రామనామము తారకమంత్రమని చెప్పబడుతోంది. వేరొక మంత్రాన్నితారకమంత్రమని అనరు. అంత్యకాలంలో మరణం సమీపించినపుడు, స్వయంగా శివుడే వచ్చి మరణాన్ని చేరుకునే వ్యక్తి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి.

ఎలాగైతే అత్యంత సూక్ష్మమైన మర్రివిత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉద్భవిస్తుందో, అలాగే రాం అనే బీజం నుండి ఈ చరాచర జగత్తంతా ఏర్పడింది. కాబట్టి ఈ కనబడే ప్రపంచమంతా రామమయమే. మట్టి నుండి ఏర్పడిన కుండ, పిడత, బుంగ, తొట్టి, ప్రమిద ఎలాగ మృత్తికాస్వరూపమో, అలాగే ఈ జగమంతా రామ స్వరూపమే. శ్రీరామ నామాన్ని నిత్యం జపించే భక్తులకు ఎటువంటి ఆపదలు దరిచేరవు. నిత్యం రామ నామామృతంతో వారి జీవితాలు పునీతమయి, సర్వ సుఖాలు లభిస్తాయి

Read More

శ్రీ వైకుంఠ రామాలయం ( భద్రాచలం ) :


శ్రీ వైకుంఠ రామాలయం ( భద్రాచలం ) :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, ఖమ్మం జిల్లా లో, గోదావరి నది దక్షిణ తీరమున భద్రాచలం పట్టణం ఉంది. జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్నది ఈ పట్టణం. భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం 2002 లో 'శ్రీరామ దివ్యక్షేత్రం' పట్టణం గా మార్చింది.

క్షేత్ర ప్రాశస్త్యం :
మేరువుకు భద్రుడనే కొడుకున్నాడు. ఈయన ఒక పర్వతరాజు. ఇతడు గౌతమీ తీరంలోగల దండకారణ్యంలో ఘోరమైన తపస్సు చేసి శ్రీరామచంద్రుని సాక్షాత్కారాన్ని పొందాడు. శ్రీ రాములవారు వరం కోరుకొమ్మని అడిగితే కైలాసగిరి మీద శివుడలంకరించునట్లు తన శిఖరముమీద శ్రీ సీతారామలక్ష్మణ సమేతులైన తన శిఖరము నలంకరించి జీవులకు మోక్షసామ్రాజ్య మందించవలసినదని కోరుకొన్నాడు భద్రుడు. అతని కోరిక ప్రకారం అక్కడకు సీతాలక్ష్మణ సహితులైన రామప్రభువు వేంచేసి కొలువుదీరి యున్నాడు. ఇది పురాణ కధ.

రామాలయ ప్రాశస్తి :
గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహసీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.

ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్ధించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని చరిత్ర. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనేపేరు వచ్చింది.

దేవాలయం భద్రగిరి అనే కొండపై ఉంటుంది. సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. సీతమ్మ రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది.

భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచినాడు.

శ్రీ రామ నవమి కళ్యాణోత్సవము :
ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్ట్రప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపించడం సాంప్రదాయం. జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కళ్యాణోత్సవమును తిలకించటానికి లక్షల మంది యాత్రికులు వస్తారు. ఉత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మెదలయిన ప్రముఖులు, ప్రభుత్వ అధినేతలు, అధికారులు గూడ పాల్గొంటారు. ఇక్కడ జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఆలిండియా రేడియో, టి.వి.ల్లో ప్రసారం చేయబడతాయి.

ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.

స్వామి వారి నిత్యోత్సవాలు :
ప్రభాతసేవ, దంత ధావనోత్సవం, బాల భోగాది ఆరాధనలు, పవళింపు సేవ వరకు చూడవచ్చును. పునర్వసు నక్షత్రము గల రోజులు, ఏకాదశి, పూర్ణిమ తిధుల యందు, సంక్రమణముల యందు స్వామి వారికి అభిషేక, సహస్ర నామార్చన, గ్రామోత్సవాదులు చేయబడును.

Read More

రామో విగ్రహవాన్ ధర్మః

రామో విగ్రహవాన్ ధర్మః 

శ్రీరాముడు వనవాసం చేసే రోజులలో మహర్షులందరూ రాముని చేరి శరణుకోరగా, "సర్వరాక్షస సంహారం చేసి, ఈ దండకారణ్యాన్ని మునిజన వాస యోగ్యం చేస్తాను'' అని వారికి మాట ఇచ్చాడు. అప్పుడు సీత, "ఆర్యపుత్రా! కారణం లేని వైరం, వైరం లేని హింస పాపహేతువులు కాదా ! ఈ రాక్షసులతో మనకు వైరం లేదు కదా! మరి వారిని సంహరించడం ఎంతవరకు ధర్మం'' అని హితవు చెబుతుంది. "సీతా! క్షత్రియ వంశసంజాతుడు అరణ్యంలోవున్నా, రాజ్యంలోనున్నా సజ్జన సంరక్షణ కోసం దుష్టశిక్షణ చేసి తీరాలి. ఇది క్షత్రియ ధర్మం. ధర్మసంరక్షణ కోసం అవసరమైతే నిన్నేకాదు, నా ప్రాణాలు సైతం పరిత్యజించడానికి వెనుకాడను'' అంటాడు శ్రీరాముడు. ఇదీ, రాముని ధర్మరక్షణ దీక్ష. సీతను అపహరించాలనే సంకస్పంతో రావణుడు మారీచుని దగ్గరకు వచ్చి, శ్రీరాముని నిందిస్తూ మాట్లాడుతుంటే భరించలేని మారీచుడు "రావణా! శ్రీరాముని స్వరూప స్వభావాలు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. రాముడెవరనుకున్నావు."రామో విగ్రహవాన్ ధర్మః'' సాధుస్సత్యపరాక్రమః'' అని నిర్భయంగా ప్రశంసించాడు. శతృవు చేత కూడా కీర్తించబడే ధర్మచరిత్ర గలవాడు శ్రీరాముడు.

రామధనుర్విముక్త శరాఘాతానికి మహాబలి వాలి నేలకూలాడు. కొనూపిరితోనున్న వాలి, శ్రీరాముని నానా దుర్భాషలాడి "రామా! సీతాన్వేషణకోసం నువ్వు సుగ్రీవునితో చేతులు కలిపే బదులు, నా సహాయం అర్థించి వుంటే, నేనే రావణసంహారం చేసి, సీతను నీకు సమర్పించేవాడిని'' అని అంటాడు. అప్పుడు శ్రీరాముడు "వానరేశ్వరా! సీతాన్వేషణ అనే నా స్వార్థప్రయోజనం కోసం నిన్ను శిక్షించలేదు. కడుపున పుట్టిన కుమార్తెతో బాటు, సోదరుని భార్యం కోడలు, శిష్యుని భార్య కూడా కుమార్తెలతో సమానం. ఇది సనాతన ధర్మం. నువ్వు ఈ ధర్మాన్ని విస్మరించి నీ సోదరుడైన సుగ్రీవుని భార్యను అపహరించావు. అందుకే మరణమే శిక్ష. ఆ శిక్షే నీకు విధించాను'' అంటాడు. ధర్మపాలన విషయంలో శ్రీరాముడు అంత నిరంకుశంగాను ఉంటాడు.

శ్రీరాముని దేశభక్తి :

శ్రీరాముడు రావణసంహారం కోసం సర్వవానర సైన్యంతో కలిసి లంకానగరం చేరాడు. త్రికూట గిరిపైనున్న సుందర లంకానగరాన్ని రామలక్ష్మణులు వానరులు చూసారు. బంగారు శోభతో అత్యంత వైభవోపేతంగానున్న లంకా నగరాన్ని చూసి లక్ష్మణుడు ఆశ్చర్యంగా "అన్నా! ఈ లంకానగరం ఎంత అందంగా ఉందొ చూడు'' అన్నాడు. అందుకు శ్రీరాముడు చిన్నగా నవ్వి :

అపి స్వర్ణమయీం లంకామ్ లక్ష్మణ కాననరోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ

లక్ష్మణా! సువర్ణ నిర్మితమైన ఈ లంకానగరం ఎంత అందంగా ఉన్నా, మన అయోధ్యానగర సౌందర్యానికి సరిపోతుందా! జన్మనిచ్చిన తల్లి పుట్టి పెరిగిన వూరు స్వర్గం కన్నా ఎక్కువ సుందరమైనవి'' అంటాడు.
అదీ శ్రీరాముని మాతృదేశాభిమానం.

శ్రీరాముని శరణాగతి - క్షమాగుణం :

యుద్ధరంగంలో రామరావణులు తొలిసారి తలపడ్డారు "రావణా! ఇప్పటికైనా మించిపోయినది లేదు. సీతను నాకు అప్పగించి శరణుకోరు క్షమిస్తాను'' అంటదు. ఎంతటి శతృవునైనా క్షమించగల స్థిరచిత్తుడు శ్రీరాముడు. శ్రీరాముని హితవులు వినలేదు రావణుడు. యుద్ధానికి దిగాడు. వీరోచితంగా పోరాడి మరణించాడు. మరణించిన తన అన్న మహాపాపాత్ముడని, అతనికి అగ్నిసంస్కారం చెయ్యడం కూడా నరకహేతువనీ నిష్ఠూరంగా పలుకుతాడు విభీషణుడు. అప్పుడు శ్రీరాముడు "
మరణాన్తాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనం 
క్రియాతామస్య సంస్కారో మయాప్యేష యథాతవ

విభీషణా! ఎంతటి వైరమైనా మరణంతో నశించిపోవాలి ఇప్పుడు రావణునిపై నాకు కోపంలేదు. ఈతడు నీకెంతో నాకూ అంతే. ఈ మహావీరునికి అగ్నిసంస్కారం చెయ్యి'' అంటాడు. అదే రాముని క్షమాగుణం.

రామం దశరధాత్మజం :

రావణ సంహారం చేసిన రాముని ముందు సకల దేవగణాలు ప్రత్యక్షమై "రామా! రావణసంహారం చేసి, సకల లోకాలకు శాంతి చేకూర్చావు. నీవు శ్రీమహావిష్ణువువు. రావణసంహారం కోసం నరునిగా అవతరించావు'' అని వేనోళ్ళ శ్రీరాముని కీర్తిస్తారు. వారి మాటలు శ్రీరాముడు నమ్మాడు. దేవతలందరూ శ్రీరామునికి నమ్మకం కలిగించడం కోసం స్వర్గంలోనున్న దశరథుని రప్పిస్తారు. దశరథుడు రాముని చూసి "రామా! దేవతలు పలికిన మాటలు సత్యాలు. రావణసంహారం కోసం నీవు నరునిగా, నాకుమారునిగా జన్మించడం నా అదృష్టం. నీవు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువువి, సందేహం లేదు'' అన్నాడు. అప్పుడు శ్రీరాముడు భక్తిగా చేతులు జోడించి :

"ఆత్మానం మానుషం మన్వే రామం దశరధాత్మజం''

"నేను మానవుడను, దశరథుని కుమారుడను. అంతే మరేమియును కాదు'' అని వినయంగా పలికాడే కానీ ... దైవత్వాన్ని ప్రకటించలేదు. అందుకే రామావతారం పూర్నావతారం. ఇన్ని ధర్మాలు తాను ఆచరించి, సర్వలోకాలకూ ఆదర్శమూర్తిగా నిలిచాడు కనుకనే శ్రీరాముడు మానవులందరికీ ఆరాధ్యదైవం అయ్యాడు


వేదాలలో నిక్షిప్తమైన "ధర్మం'' సాకారంగా భౌతిక నేత్రాలకు దర్శనీయం కాదు. అందుకే, ఆచరణయోగ్యమైన "ధర్మానికి' ఆకారం దాల్చాలని ఆశపుట్టింది కాబోలు. శ్రీరామునిగా అవనీతలంపై అవతరించింది.
ధర్మసంరక్షణార్థం భగవంతుడు దాల్చిన అవతారాలలో "రామావతారం'' పూర్ణావతారము. జన్మబంధాలులేని పరమాత్మ జగత్కళ్యాణ కాంక్షతో జగతిపై నరునిగా జన్మించి, ధర్మాన్ని ఆచరించి, శ్రీరామునిగా సర్వలోకాలకూ ధర్మపథావలంబకుడై ఇదీ "రామాయణం'' అని చాటి చెప్పాడు.

రామస్య ఆయనం'' - రామాయణం :

"ఆయనం'' అంటే గమనం, కదలిక. రామాయణం అంటే "రామగమనం'. అదే "ధర్మం యొక్క కదలిక''. ఈ సృష్టి చక్రమంతా అంటే ధర్మ బలంతోనే నడుస్తోంది. ప్రపంచంలోని సకల సుగుణాలు, సుఖాలు, శుభకర్మలూ ధర్మాన్ని అనుసరించే వుంటాయి. ధర్మలోపం జరిగితే మరుక్షణంలో అన్నీ అదృశ్యమైపోతాయి. అందుకే "ధర్మో రక్షతి రక్షితః'' అన్నారు.
శ్రీరాముడు వేసే ప్రతి అడుగులోనూ ధర్మస్వరూపం ప్రతిబింబిస్తూనే ఉంటుంది. తాటకా సంహార సమయంలో "స్త్రీని చంపడం ఎంతవరకూ ధర్మం'' అనే సంశయంలో శ్రీరాముడు పడ్డప్పుడు :

నృశంస మనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ 
పాతకం వా సదోషం వా కర్తవ్యం రాక్షతా సతా ||

"ధర్మరక్షణ దీక్షతో ప్రజారక్షణ చూడవలసిన క్షత్రియుడు, ధర్మసంరక్షణ కోసం పాపమని కానీ, క్రూరమని కానీ, అధర్మమని కానీ ఆలోచించకుండా ధర్మాన్ని కాపాడాలి. ఇది పాపరహితమైన సనాతన ధర్మం'' అని బోధిస్తాడు విశ్వామిత్రుడు. అంతే, సంశయాన్ని వదిలి తాటకను సంహరించాడు ... శ్రీ రాముడు.

శివధర్భంగం జరిగింది. సీతారాముల కళ్యాణము జరిగింది. తన వీరత్వంతోనే శివధర్భంగం జరిగిందనీ ... సీతను పెళ్ళి చేసుకున్నానని శ్రీరాముడు ఎప్పుడూ అనుకోలేదు.

ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి 
గుణాద్రూప గుణాచ్చాపి ప్రీతిర్భుయో భ్యవర్థత ||

తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన సంబంధం కాబట్టే, రామునకు సీతపై ప్రేమ కలిగింది. సీత, తన సౌదర్యముచేతనూ, సద్గుణముల చేతనూ రామునకు తనపై గల ప్రేమను ఇంకా వృద్ధి చేసెను'' అంటాడు ఆదికవి వాల్మీకి. "తనయుని వివాహా విషయంలో తండ్రిదే సర్వాధికారం'' అన్న వైదిక వివాహ ధర్మానికి కట్టుబడ్డవాడు శ్రీరాముడు.
శ్రీరామ పట్టాభిషేక ముహూర్త నిర్ణయం జరిగింది. కానీ, "అదే మొహూర్తానికి పదునాలుగేళ్లు వనవాసం చెయ్యాలి'' అని శ్రీరాముని ఆదేశించింది పినతల్లి కైక, చిరునవ్వుతో అంగీకరించాడు శ్రీరాముడు. "మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా?'' అని సందేహాన్ని వ్యక్తం చేసింది కైక. 
"రామో ద్విరాభి భూషతే'' అమ్మా! ఈ రామునకు రెండు నాలుకలు (మాటలు) లేవు. పితృవాక్య పాలనమే నా ధర్మం'' అన్నాడు శ్రీరాముడు. అలాగే అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అదీ రాముని ఆయనం, ధర్మం. శ్రీరాముని మనస్సు, మాట,చేత ఒక్కటే.అందులో మార్పు వుండదు. అప్పుడే "ధర్మాచరణ'' సాధ్యం. అదే చేసి చూపించాడు శ్రీరాముడు.

Read More

శ్రీరామనవమి :

శ్రీరామనవమి :

శ్రీరామనవమి నాడు "శ్రీసీతారాముల కళ్యాణం'' చేయడం అనాదినుంచి వస్తున్నా ఆచారం. నిజానికి చైత్రశుద్ధనవమినాడు శ్రీసీతారామ కళ్యాణం జరగలేదు. 
వైవస్వత మన్వంతరంలోని పంచమ త్రేతాయుగమునందలి నాల్గవ పాదంలో 30,000 సంవత్సరాలు అయిన విశంచి నామసంవత్సర చైత్రశుద్ధనవమి, బుధవారం నాడు, పునర్వసూ నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో రవి, గురు, శుక్ర, శని, కుజ గ్రహాలు ఉచ్ఛరాశులలో సంచరిస్తున్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు.
సౌమ్యనామ సంవత్సర ఫాల్గుణ పౌర్ణమి తిథినాడు ఉత్తరానక్షత్రంలో శ్రీసీతారాముల కళ్యాణం జరిగింది.
లోక కళ్యాణం కోసమే శ్రీరామజననం జరిగింది. సీతాకల్యాణంతో రామ అవతార లక్ష్యానికి, రావణసంహారానికి నాంది జరిగింది. అందుకే శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధనవమినాడు సీతారాముల కళ్యాణం జరిపించి ఆనందించడం ఆచారమైంది. అంతేకాదు ....
నూతన సంవత్సరం మనకు ఉగాదితో మొదలవుతుంది. చిత్రశుద్ధ పాడ్యమి నుంచే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులలో "శ్రీరామాయణాన్ని'' పారాయణ చేస్తారు. రామాయణం కేవలం కథ కాదు. లోక కళ్యాణం కోసం నరునిగా అవతరించిన దేవదేవుని దివ్యగాథ ఆ పుణ్య చరిత్రను బీజాక్షరబద్ధం చేసి తొలికృతిగా తీర్చిదిద్దాడు ఆదికవి వాల్మీకి.
శ్రీమద్రామాయణం రసానందాన్ని కలిగింగే మహాకావ్యం మాత్రమే కాదు ... కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు.
- బాలకాండలోని పుత్రకామేష్టి యాగ ఘట్టాన్ని మండలం [40] రోజులు పారాయణ చేస్తే సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది.
- సీతారామ కళ్యాణ ఘట్టాన్ని నలభైరోజులు పారాయణ చేస్తే వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వామితో వివాహం జరుగుతుంది.
- ఇక సర్వకార్యార్థసిద్ధి ప్రదమైన సుందరకాండ పారాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే.

"శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం'' అని కేవలం నోటిమాటగా చెప్పుకోవడం కాదు. ఇందుకు నిదర్శనం రామాయణంలోనే ఉంది.
ఇంద్రజిత్తుతో లక్ష్మణుడు భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేస్తున్నాడు. లక్ష్మణుడు తన అస్త్రబలంతో ఇంద్రజిత్తు మాయలను ఛిన్నాభిన్నం చేస్తున్నాడేగానీ అతన్ని సంహరించలేక పోతున్నాడు. చివరకు విసుగు చెందిన లక్ష్మణుడు షరాసంధానం చేసి :

ధర్మోత్మా సత్యసన్దశ్చ రామోదాశరథిర్విది 
పౌరుషే చాప్రతిద్వాన్ద్వః శరైనం జహిరావణిమ్

"దశరధాత్మజుడైన రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, అజేయుడు అయితే ... ఈ శరాఘాతంతో ఇంద్రజిత్తు మరణించుగాక'' అని శరప్రయోగం చేసాడు. ఇంద్రజిత్తు మరణించాడు.
"రామో విగ్రహవాన్ ధర్మః సాధుస్సత్యపరాక్రమః'' అనడానికి ఇంతకన్నా మరో నిదర్శనం అక్కర్లేదు.
ధర్మస్వరూపమైన శ్రీరాముని గురించి ఎంత వ్రాసినా,ఎంత స్మరించినా తనివి తీరదు. రామనామమే ఆపాత మధురం. అది ఒక మహామంత్రం.

శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామనమవరాననే

పరమశివుడంతటివాడు పరవశిస్తూ పార్వతికి బోధించిన రామతారక మంత్రమిది. అట్టి పరబ్రహ్మస్వరూపుడు ఆచరించిన అన్ని ధర్మాలు ఆచరించడం సామాన్యులమైన మనకు సాధ్యం కాని పని. కనీసం ఒక ధర్మానికైనా కట్టుబడదాం, ఆచరిద్దాం.శ్రీరాముని జన్మదినాన్ని భక్తిగా జరుపుకుందాం, తృప్తిగా శ్రీసీతారాముల కళ్యాణం చూసి తరిద్దాం.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః
 

Read More

శ్రీ రామ నామ వివరిణిజాంబవత్సుగ్రీవ హనుమద్భరత లక్ష్మణ శతృఘ్న పరివార సమేత శ్రీ సీతారామ బ్రహ్మణే నమః. 

పట్టాభిషేక మూర్తి అయిన శ్రీ రామ బ్రహ్మం "ఓం"కారంతో సమానమని శ్రీ రామ తాపినీ ఉపనిషత్ ప్రతిపాదించింది. అది ఎలాగో చూద్దాం. 

ఓం కారంలో మొత్తం ఎనిమిది (8) భాగాలు ఉంటాయి. అవి-అ+ఉ+మ+0(బిందు)+నాద+కలా+కలాతీతా+తత్పరః = శ్రీ రామః 

అ కారాదభవద్బ్రహ్మా జాంబవానితి సంఙ్ఞకః (అ కారము బ్ర్ అహ్మ వాచకము. బ్రహ్మ అంశతో పుట్టినవాడు "జాంబవంతుడు")
ఉ కారాక్షర సంభూతః ఉపేంద్రో హరి నాయకః (ఉ కారమునకు ప్రతీకగా అవతరించినవాడు "సుగ్రీవుడు") 
మ కారాక్షర సంభూతః శివస్తువయనుమాన్ స్మృతః (మ కారము రుద్రవాచకము. అది సాక్షాత్తు రుద్ర రూపుడైన "హనుమంతుడు") 
బిందురీశ్వర సంఙ్ఞస్తు శతృఘ్నః చక్రరాట్ స్వయం (బిందు రూపముగా అవతరించినవాడు సుదర్శన రూపుడైన శత్రుఘ్నుడు)
నాదో మహా ప్రభుర్ఙ్ఞేయో భరతః శంఖనాయకః (నాద రూపమైన శంఖముయొక్క అంశగా అవతరించినవాడు "భరతుడు")
కళాయాః పురుషస్సాక్షాత్ లక్ష్మణో ధరణీధరః (కళ యొక్క పురుషుడు భూ భారవహుడైన ఆదిశేష రూపమైన "లక్ష్మణుడు") 
కళాతీతా భగవతీ స్వయం సీతేతి సంఙ్ఞితా (కళాతీతయే సాక్షాత్ భగవతి "సీతాదేవి") 
తత్పరః పరమాత్మా చ శ్రీ రామః పురుషోత్తమః (వీటన్నింటికీ పరమైన పరమాత్మయే పురుషోత్తముడైన "శ్రీ రాముడు")
 

Read More

రామం భజేశ్యామలం

వామాంక స్థిత జానకీ,
పరిలసత్‌ కోదండదండం కరే
చక్రం చోర్ద్వ కరేణ బాహుయుగళే
శంఖం శరం దక్షీణే
బిభ్రాణం జలజాత పత్ర నయనం
భద్రాద్రి మూర్థ్ని స్థితం
కేయూరాది విభూషితం
రఘుపతిం రామం భజే శ్యామలం
వైదేహీ సహితం సురద్రుమతలే
హైమే మహా మంటపే
మధ్యే పుష్పక మాసనే
మణిమయే వీరాసనే సంస్థితమ్‌
అగ్రే వాచయతి ప్రభంజన సుతే
తత్త్వం మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః
పరివృతం రామం భజేశ్యామలం
 

Read More

!!శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం- Meaning

!!శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం- Meaning
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1
తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు 2
తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము.
మాతః సమస్త జగతాం మధుకైటభారే:
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ 3
తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక.
తవ సుప్రభాత మరవిందలోచనే
భవతు ప్రసన్న ముఖచంద్రమండలే
విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే
వృషశైలనాథయితే దయానిధే. 4
తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖమును గల ఓ లక్ష్మీదేవీ! నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీవేంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగు గాక.
అత్ర్యాధిసప్తఋషయస్య ముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రసన్నాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్‌ 5
తా. అత్రి మున్నగు సప్తమహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి, ఆకాశగంగ యందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను చూజించుటకు వచ్చియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా:
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి
భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్‌
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 6
తా. శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
ఈషత్ర్పఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాళికానాం
ఆవాతి మందమనిల స్సహ దివ్యగంధైః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 7
తా. కొంచెం వికసించిన తామరపూల యొక్క, కొబ్బరి, పోక మున్నగు చెట్ల అందమైన మోవుల యొక్క సువాసనలతో మలయమారుతము మెల్లగా వీచుచున్నది. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః
పాత్రావశిష్ట కదలీఫల పాయసాని
భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 8
తా. ఓ శేషశైలపతీ! చక్కని పంజరములలో వున్న పెంపుడు చిలుకలు తా మిదివరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటిపండ్లను, పాయసమును తిని వాలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక!
తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా
గాయన్త్యనంత చరితం తవ నారదో7పి
భాషాసమగ్ర మసకృత్కర చారురమ్యం
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 9
తా. ఓ అనంతా! నారదుడు కూడ మధురముగా ధ్వనిచేయు తన వీణ తీగలను మీటుచు, పెక్కు సారులు రమ్యముగా హస్తాభినయముచేయుచు, చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక.
భృంగావళీచ మకరంద రసానువిద్ధ
ఝంకారగీత నినదైః సహ సేవనాయ
నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 10
తా. మకరందమును త్రాగి విజృంభించిన తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలములనుండి బయలువెడలి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగు గా.
యోషాగణేన వరదధ్ని విమధ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 11
తా. ఓ శేషాద్రినాధుడవగు ఓ వేంకటేశ్వరా! గొల్ల పల్లెలలోని గొల్లపడుచులు పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని, ప్రతిధ్వనుల బట్టి పెరుగుకుండలు, దిక్కులు కలహించుచున్నవా? అన్నట్లు కానవచ్చుచున్నవి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.
పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః
భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 12
తా. సూర్యుని మిత్రములగు కమలములయందున్న తుమ్మెదలు, తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలు వెడలి భేరీని వాయించునట్లు ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచల ప్రభూ! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో
శ్రీ దేవతాగృహభుజాతంర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 13
తా. శ్రీమంతుడవైన ఓ దేవా! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకములన్నింటికిని బంధువుడవు. ఓ శ్రీనివాసా! లోకములన్నింటను నీ వొక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవనిర్మలాంగాః
శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాః
ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 14
తా. బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానముచేసి పరిశుద్ధులై తమ మేలునకై ద్వారముకడ బెత్తములవారు తలలపయి కొట్టుచున్నను లెక్కింపక కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం త్వదయవసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 15
తా. ఓ వేంకటేశ్వరా! నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.
సేవాపరాః శివసురేశ కృశానుధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః
బద్ధాంజలి ప్రవిలసన్నిజశీర్ష దేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 16
తా. ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి వరుణుడు, వాయువు, కుబేరుడు అను అష్టదిక్పతులును శిరస్సులపయి చేతులు మోడ్చి నీ సేవకయి కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 17
తా. దేవా! గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీ¬ు సుప్రభాతమగు గాక.
సూర్యేందు భౌమబుధవాక్పతి కావ్యసౌరి
స్వర్భాను కేతుదివి షత్సరిషత్ప్రధానాః
త్వద్దాస దాస చరమావధిదాస దాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 18
తా. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నవగ్రహములును నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా
కల్పాగమా7కలనయా కులతాం లభంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 19
తా. ఓ స్వామీ! నీ పాదధూళిచే శిరస్సు పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. ఈ కల్పము అంతమైపోవునేమో అనియే కలత పడుచుందురు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః
మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయన్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 20
తా. స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్ధే
దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీ మన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 21
తా. ఓ దేవాదిదేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయ మున్నగు గుణములకు పాలసముద్రము వంటివాడవు. లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు నీవొక్కడవే. అనంతుడు, గరుడుడు నీ పాదములను సేవించుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 22
తా. ఓ వేంకటేశ్వరా! నీవు పద్మము నాభియందు కలవాడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. హస్తమున చక్రము కలవాడవు. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణుజొచ్చినవారి పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.
కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే
కాంతాకుచాంబురుహ కుట్మలలోలదృష్టే
కల్యాణనిర్మల గుణాకర దివ్యకీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 23
తా. మన్మధుని గర్వము నణచు దివ్యసుందర శరీరము కల ఓ దేవా! నీ దృష్టి తామర మొగ్గలవంటి యువతి కుచములపయి పరిభ్రమించు చుండును. నీవు కీర్తి కలవాడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాత మగుగాక.
మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్‌
స్వామిన్‌ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 24
తా. ఓ వేంకటేశ్వరా! నీవు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కిరూపములను ధరించితివి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.
ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరసిహేమఘటేషు పూర్ణం
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్ఠాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్‌ 25
తా. ఓ దేవా! వైదికులగు భక్తులు, ఏలకులతోను, పచ్చకర్పూరముతోను పరిమళించు పవిత్రగంగా జలమును బంగారు కలశముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై యెదురు చూచుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
భాస్వానుదేతి వికటాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః
శ్రీ వైష్ణవాః సతత మర్దిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకటసుప్రభాతమ్‌ 26
తా. ఓ దేవా! సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః
ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 27
తా. ఓ దేవా! బ్రహ్మ మున్నగు దేవతలు, మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు, యోగులును నీ పూజకు తగిన మంగళకర వస్తువులను హస్తములందు ధరించి, నీ సన్నిధికి వచ్చియున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
లక్ష్మీనివాస నిరవద్యగుణైక సింధో
సంసారసాగర సముత్తరణైక సేతో
వేదాంతవేద్య నిజవైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 28
తా. ఓ దేవా! నీవు లక్ష్మీదేవికి నివాసమైనవాడవు. సద్గుణ సముద్రుడవు. సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి. వేదాంతములచే తెలిసికొనదగిన వైభవమును కలవాడవు. భక్తులకు స్వాధీనుడవు. ఓ వేకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతమ్‌ (ఇత్థం వృషాచలపతే తవ సుప్రభాతమ్‌- కొన్ని పుస్తకాలలొ ఇల కూడ ఉన్ది)
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః
తేషాం ప్రభాతసమయే స్మృతిరంగ భాజాం
ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే
తా. వృషాచలపతియగు శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్షసాధనమగు ప్రజ్ఞ కలిగించు చుండును.!!

Read More

Powered By Blogger | Template Created By Lord HTML