గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 7 March 2014

మహా భారతం లో ఏ పర్వం లో ఏమి ఉన్నది ?? తెలియ చేయకలరు ??

మహా భారతం లో ఏ పర్వం లో ఏమి ఉన్నది ?? తెలియ చేయకలరు ??

1.  ఆదిపర్వము :  రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని , చంద్ర వంశే మహా రాజు,  యయాతిల చరిత్ర, వీటితో పాటు శకుంతల, దుష్యుంతులకు సంబంధించి అనేక పురాతన కధలను  ఇది వివరిస్తుంది.  ఈ పర్వం లో అధిక భాగం  కురు- వంశే మూల పురుషులయిన  శంతనుడు, భీష్ముడు, విచిత్ర వీర్యుడు,  దృతరాష్ట్రుడు,  తదితరుల గురించి , జరిగిన విషయముల గురించి వివరించ బడి ఉన్నది.  పాండురాజు కధ, పాండవ కురవుల జననం, విద్యాబ్యాసం, వారి మద్య బాల్యం  నాటి మనస్పర్ధలు, పాంచాల రాకుమారి   ద్రౌపతి  పాండవుల వివాహం, అర్జునుడి తీర్ధ యాత్ర.  శ్రీకృష్ణుని చెల్లెలు అయిన సుభద్రతో పరిణయము, వంటి విషయములు ఆది పర్వము వివరించును .  

2. సభాపర్వం :  పాండవ ప్రధముదయిన  యుధిస్టుడు ( ధర్మ రాజు ) రాజ సూయ యాగం చేయటం,  కౌరవ ప్రధముదయిన దుర్యోధనుడు  శకుని సాయంతో జూదం గెలవటం, పర్యావ సానం గా  తలెత్తిన పరిణామములు  ప్రధాన  విషయములు
3. అరణ్య పర్వము : దీనినే వన పర్వం అని కుడా అంటారు . కామ్యక  వనం లో పాండవుల వన వాస వర్ణన  ఇందులో ఉంటుంది .  దీనితో పటు నలదమయంతుల  కధ, సావిత్రి సత్యవంతుల  గాధ,  ఋష్య సృన్గుడు , అగస్త్యుడు, మార్కండేయుడు తదితరులతోపాటు భగీరధుడు, సిబి వంటి చక్రవర్తుల వృత్తాంతములు కుడా ఉంటాయి . 
4. విరాట పర్వం :  విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాత వాసం చేయటం, దుస్టుడయిన  కీచకుని  గురించి,  పాండవులను అజ్ఞాత వాసం నుండి బయటకు రప్పించి  దానిని భగ్నం చేయటానికి, విరాట రాజుకి  చెందినా గోవులను పట్ట్టుకున్న  కౌరవులతొ యుద్దము, దక్షిణ గో గ్రహణము, ఉత్త్తర - అభిమన్యుల పరిణయము .

5. ఉద్యోగ పర్వం : ఒకవైపు శాంతి యత్నాలు , మరో వైపు  యుద్ద సన్నాహాలు  సమాంతరముగా సాగి పోవటము ఈ పర్వము ప్రత్యేకత.  కర్ణుడు తన కొడుకే నని తెలిసిన కుంతీదేవి పరితాపం,  శాంతి యత్నాలు చేసి, యుద్ధం ఆపుటకు తనవంతు కృషి చేసిన శ్రీ కృష్ణుడు, యుద్ధం అనివార్యం అయినపుడు  పాండవుల ను యుద్ద సన్నద్దులను గావించిన  శ్రీ కృష్ణుడి  రాజనీతి .  ఇందులో ఉన్నవి .
6. కర్ణ పర్వం : కౌరవ సోదరులలో  రెండవ వాడయిన  దుశ్శాసనుడు  భీముని  చేతిలో నేలకులటమ్, మహా  వీరుడయిన  కర్ణుడు, అర్జునిని చేతిలో వీరమరణం పొందటం, ఇందులోని జరిగిన విషయములు .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML