గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 10 March 2014

ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే

ఈ ప్రపంచంలో అత్యంత పురాతనకాలం నుంచి జీవిస్తున్న ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే. ప్రపంచచరిత్రలో ఎన్నో మతాలు పుట్టాయి, ఎన్నో నాశనమయ్యాయి. ఎన్నో కొత్తవి పుడుతున్నాయి, కానీ ఎన్ని మతాలు వచ్చినా, కాలపరీక్షకు తట్టుకుని నిలబడ్డ ఏకైక నాగరికత హిందూ నాగరికత మాత్రమే. దాదాపు 1,200 సంవత్సరాల భయానకమైన పరదేశీయుల పరిపాలన, మత మార్పిడుల తరువాత కూడా, హిందూ ధర్మం ఇంకా అదే వైభవంతో వెలిగిపోతోంది.
ఈ ప్రపచంలో కొన్ని వందలమతాలు ఉన్నా, ఒక్కటే ధర్మం ఉంది. అదే హిందూ ధర్మం/సనాతన ధర్మం. అన్ని మతాలను సత్యం అని నమ్మేది, అన్నిటిని అంగీకరించేది, అన్ని మతాలని గౌరవించేది హిందూ ధర్మం మాత్రమే. అన్ని మాతాలు భగవంతుడిని చేరే వివిధ మార్గాలనీ, అన్ని మతాల వెనుక ఉన్న పరమాత్ముడు ఒక్కడేనని లోకానికి చాటి చెప్పిన ఘనత సనాతన ధర్మానిదే.
మామూలుగా మతాలన్నీ ఒక్కటే అనేమాట వింటూ ఉంటాం. అది పెద్ద పొరపాటు. భారతదేశంలో పుట్టిన మతాలకు, భారతదేశానికి వెలుపల పుట్టిన మతాలకు చాలా తేడా ఉన్నది. అందులోనూ హిందూత్వానికి, ఇతర మతాలకు పెద్ద తేడా ఉంది. అసలు నిజానికి హిందూత్వం మతం కాదు, హిందూత్వం ధర్మం. హిందూ ధర్మం ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకు తల్లి.
హిందూ ధర్మానికి పునాది ఏది? ఈ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతం ఏమిటి? మనం ధర్మం ఏమని సందేశం ఇస్తుంది? అసలు హిందువని ఎవరిని అంటారు? హిందువులు రోజు ఆచరించవలసిన విధులు ఏమిటి? హిందువుల చరిత్రం ఏమిటి? వంటి అనేక అంశాలను ఆ పరమాత్మ ఆశీస్సులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML