గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 26 March 2014

అమృతశక్తిని ప్రసాదిస్తాయి.

శివ = శ + ఇ + వ. 'శ'కారం సుఖాలను, పరమానందమును, 'ఇ'కారం పరమ పురుషత్వాన్ని, 'వ'కారం అమృతశక్తిని ప్రసాదిస్తాయి.
 
 
https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-ash3/521707_222890727870396_1889088731_n.jpg
Read More

Fwd: ఆవు,సొట్టయెద్దు -శ్రీ మహాభాగవతము


ఆవు,సొట్టయెద్దు -శ్రీ మహాభాగవతము

పరీక్షిత్తు పుట్టగానే జాతకం వ్రాయించారు. ధర్మరాజుతో కృపాచార్యుడు," వీడు చాలా సత్యసంధుడు,సధ్గునుడు, అవుతాడు.ఇక్ష్వాకు అంతటివాడు.శిబి చక్రవర్తి అంతటి దానశీలుడు. అస్త్రనైపుణ్యంలో అర్జునుడు వంటి గొప్ప వాడు. హిమవంతుడి వంటి గంభీరుడు. భూదేవి వంటి శాంతమూర్తి. బలి చక్రవర్తి అంతటి పరాక్రమవంతుడు. ప్రహ్లాదుడు వంటి విష్ణుభక్తి పరాయనుడు. వీడి పేరు భరతఖండంలో మారుమోగుతుంది" అన్నాడు.

పట్టాభిషేకమయ్యాకా పరీక్షిత్తు, తన జాతకంలో చెప్పినవన్నిటినీ ఖాయపరిచే రాజుగా తన రాజ్యాన్ని పరిపాలించ మొదలు పెట్టాడు. ధర్మరాజులాగా న్యాయంగా రాజ్య మేలసాగాడు. ఉత్తరకుమారుని కూతురు ణరావతిని పెండ్లి చేసుకున్నాడు. జనమేజయుడు అతని పెద్ద కొడుకు. గంగానదీ తీరాన్న అశ్వమేధయాగం చేసాడు. ణతే, అప్పుడే రాజ్యంలో కలిప్రభావం కనపడసాగింది. రో్జు రోజుకీ అధర్మం పెరిగిపోతుంది. అందుకని కలితో యుద్ధం చేయ తలపెట్టాడు. ఒక రోజు సరస్వతీ నదీ తీరాన్న, ఒక యెద్దు,ఒక ఆవుతో మాట్లాడనారంభించింది. ఆవు చూస్తే చాలా చిక్కిపోయినట్టు వుంది. ఆ ఆవు తన దూడ కోసం వెతుక్కుంటున్నట్ట్లుంది.దాని కనుల నీరు కారుతోంది. ఎద్దు కుంటుతోంది. దెబ్బ తగిలిందో యేమో!.

" ఎందుకలా ఏడుస్తున్నావు? నీ కెందుకు అంత నిరాశగా వుంది? ఒంట్లో బాగా లేనట్లుంది. మనోవ్యధా? ఓ భూదేవి, ధర్మం నశిస్తోందనా నీ దుఃఖం? నాకు తెలుసు, నీ మనసులోని బాధ,ఇన్నాళ్ళూ, అవతారపురుషుడు భూమిమీద వుండి, నిన్ను అధర్మం మింగేయకుండా కాపాడేడు. మరి యుప్పడు లేడనే కదా?" అని ఆ కుంటి యెద్దు, భూదేవి అయిన ఆ గోవుని అడిగింది.

"ఔను. కృష్ణుడు వెళ్ళిపోయాడు. అతను నా మీద కాలు పెట్టి నాకు యెంతో వెలుగునిచ్చాడు. నన్ను పవిత్రం చేసాడు. ఆ మంచిరోజులు తలచుకుంటూనే యిలా కన్నీరు విడుస్తున్నా" అంది, భూదేవి.

ఆరెండూ అలా మాట్లాడుకుంటూండగా, ఎవడో రాజులా వేషం వేసుకుని వాటిని బాధపెట్టడం మొదలుపెట్టాడు. కుంటి యెద్దుకు వున్న సరియైన ఒక్క కాలూ విరగొట్టడానికీ కర్ర తీసుకుని కొట్టజూస్తున్నాడు. తన రథంలో ఆ దారినే వెళ్తున్న పరీక్షిత్తు అది చూసి అక్కడికి జోరుగా తన రథం పోనిచ్చాడు. తన చేతిలో ధనస్సు పట్టుకుని బాణం వేయడానికి తీసాడు.

దీనావస్ధలో ఉన్న ఆ ఆవుని , ఆ కుంటి యెద్దును చూసి అతని గండె కరిగిపోయింది. వాటిని బాధిస్తున్న వాడిని చూచి, " ఎవడివిరా నువ్వు? నా రాజ్యంలో యింత దుర్మార్గానికి ఒడిగట్టడానికి నీకు ధైర్యం యెలా వచ్చిందిరా?" అంటూ గర్జించాడు.

ఆవుతో,"నేనున్నానుగా, నీకేమి భయంలేదు" అని చెప్తూ, ఎద్దుని చూసి, "మిమ్మల్ని బాధపెడుతున్న వీడి అంతు నే చూస్తా గాని , నీ కాలు విరగ్గొట్టిన వాడెవడు? వాడిని కూడా హత మార్చేస్తా" అని ఆ యెద్దుని అడిగాడు.

ధర్మమే ఆ యెద్దురూపంలో ఉన్నాది. అది "కరువంశంలో పుట్టిన నీలాంటివాడికి తగిన మాటలే ఆడావు. నా స్వంత మాటంటావా? నిజంగా యెవరు యిలా నాకు అన్యాయం చేసారో తెలియదు. నేను నలు ప్రక్కలా చూస్తుంటే, అందరూ ధర్మమంటే నానా విధాలుగా మాట్లాడుతున్నారు. కొందరు నాస్తికులంటారు,మనిషే తన విధికి కారకుడు, రక్షకుడూ, అని . మరికొందరు అన్నిటికీ ఆ నవగ్రహాలే కారణమంటారు. అలాగే మరికొంతమంది అంతా కర్మ అని కర్మనే దుయ్యబడతారు. బహుకొద్ది మంది మాత్రమే భగవంతుడు అనేవాడున్నాడు, వాడే అన్నిటికీ కారకుడు అని అంటున్నారు. నాకంతా అయోమయంగా ఉంది" అని పరీక్షిత్తుకు జవాబిచ్చింది.

"తెలియదంటూనే, నువ్వు ధర్మసూక్ష్మాలు పలికావు. నువ్వే ధర్మంలా కనబడుతున్నావు. నువ్వే అంత చక్కగా భూమి పెరిగే అధర్మన్ని వర్ణించగలవు."

"తపస్సు ,శౌచం,దయ,సత్యం అనేనాలుగు పాదాల మీదా ధర్మం నడుస్తుందంటారు. కలియుగంలో ఒక్క సత్య మనే పాదంతోనే నడుస్తుందంటారు.అందుకనే నువ్వు కుంటిగా ఉన్నావు. ఈ సత్యం ఒక్క దాన్ని కూడా తన అసత్యంతో నాశనం చేసేద్దామని కలి అనుకుంటున్నాడు. భయపడకు నేను కలిని చంపితీరుతాను." అని తన ధన్నస్సు కింద పెట్టి, కత్తి తీసి నరికేయడానికి కలిమీదకు పరిగెత్తాడు. తన మాయారూపం వదిలేసి, కలి పరీక్షిత్తు పాదాలమీద పడి , శరణు శరణు అని వేడుకున్నాడు.

అలా శరణు అన్నవాడిని ధర్మమూర్తులెవరూ చంపరుకదా! పరీక్షిత్తు, "నిన్నేం చేయను కాని నా రాజ్యంలో ఉండి నా ప్రజలకి నీ అసభ్యమైన గుణాలు అంటించకు.అందుకని ఇంకెక్కడికైనా ఫో" అన్నాడు.

"సమస్త భూమినీ నువ్వు పరిపాలిస్తుంటే నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, మరి?" అని కలి అడిగాడు.

"నిజమే. అందుకని నువ్వు బంగారం ఉన్న చోటికి వెళ్ళు. అది యెక్కడ ఉంటే అక్కడ నీ లోభం,అసత్యం,గర్వం, కామం,ద్వేషం అనే ఐదు గుణాలూ చెల్లుతాయి" అన్నాడు పరీక్షిత్తు. అందుకనే విజ్ఞులు అంటారు. బంగారం మహా పాపిష్టిది అని


Read More

Sunday, 23 March 2014

కాశీ క్షేత్రములో మరణము, ముక్తి అనే నానుడికి బలము చేకూర్చే సంఘటన ఇది.

కాశీ క్షేత్రములో మరణము, ముక్తి అనే నానుడికి బలము చేకూర్చే సంఘటన ఇది.

ఓకసమయములో రాణిరాసమణి తనపరివారము, అల్లుడు మథుర్, కొంతమంది పండితులు, రామకృష్ణుల వారితో కలసి కాశీ నగర సందర్శనకు నౌకల్లొ బయలుదేరారు.అలా కాశీలో వున్న రోజులలొ ఓకనాడు మధుర్,ఇంకొంతమంది పండాలతో కలసి గంగానదిపై విహారము చేస్తున్నారు.ఆ పడవ మణికర్ణికా ఘాట్ సమిపించగా,అక్కడి స్మశానములో జరుగుచున్న శవదహనాన్ని చూసి,అకస్మాత్తుగా ఆనందపరవశులై వడిగా పడవ అంచుకు వెళ్ళి సమాధిమగ్నులై నిలబడిపొయారు.ఆ పరిస్థితులలొ సాధారణముగా దేహస్మృతి వుండదు అందువలన ఆయిన ఎక్కడ నదిలో పడిపొతారోఅని కొందరు రివ్వున ముందుకు వెళ్ళారు. కాని ఆయిన దివ్యదరహాసాలతో నిశ్చలముగా అక్కడ నిలబడి ఉండగా, ఎవ్వరు కాపాడవలసిన అవసరము లేకుండా పొయింది.కొంత సేపటికి వారే ఈ అనుభూతిగూర్చి వివరించారు."పొడవరి పింగళవర్ణ జటాధారీ,శ్వేతవర్ణ పురుషుడు ఐన ఓక పురుషుడు మెల్లగా ఆడుగులు వేస్తూ ప్రతి చితి వద్దకు వెళ్ళి, నెమ్మదిగా అందలి జీవుని పైకెత్తి,చెవిలో తారకబ్రహ్మమంత్రము ఉపదేశించడము చూశాను! సర్వశక్తిమయి అయిన జగదాంబ - కాష్ఠానికి ఆవలి వైపు కూర్చుని,ఆ జీవుడి స్థూలసూక్ష్మ కారాణాది బంధాల నన్నిటిని విడదిసి,స్వయముగా మోక్ష ద్వారము తెరచి,కైవల్య ధామానికి పంపుతున్నది. ఎన్నో యుగాల తపొనిష్ఠలచే మాత్రమే పొందగ్గ అద్వైతానుభవాన్ని భూమానందాని శ్రీ విశ్వనాధుడు క్షణములో ఆ జీవులకు యీ రీతిన ప్రపాదించి వారిని కృతార్థులను చేస్తున్నాడు.

Read More

కొబ్బరి, అరటి, మామిడి,బంతి,తులసి,బిల్వ వృక్షాలలో లక్ష్మిదేవి నివసిస్తుంది


కొబ్బరి, అరటి, మామిడి,బంతి,తులసి,బిల్వ వృక్షాలలో లక్ష్మిదేవి నివసిస్తుంది. ప్రకృతి ఔదార్యానికి కొబ్బరి చెట్టు ప్రతీక. దానిని ప్రత్యేక పోషణలు అవసరం లేదు. ఇట్టే పెరిగి పోతుంది. చెట్టులోని ప్రతి భాగం ఉపయుక్తమైనది. అరటి చెట్టుకు ఎంతో ఆర్ధిక విలువలు ఉన్నాయి. అరటి ఆకులో భోజనాలు చేస్తాం. ఏ శుభకార్యాలు అయినా, పూజలు జరిగినా అరటిపండ్లు ఉండాల్సిందే. మామిడితోరణాలు ఇంటిగుమ్మాలకు కడతాం. వసంతంలో వచ్చే మామిడిపూత మన్మధునికి ప్రీతి. లక్ష్మి పుత్రుడు మన్మధుడు. బంతి పువ్వులను గుమ్మాలకు కట్టి లక్ష్మి దేవికి స్వాగతం పలుకుతాము. అలాగే తులసి చెట్టుతోను దేవికి బాంధవ్యముంది. తులసీ దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు. మారేడు పండులోనూ లక్ష్మిదేవి ఉంటుంది అంటారు. ఒకసారి లక్ష్మిదేవి శివుడికి వెయ్యి కలువ పువ్వులతో పూజ చేసుకుంటాను అని సంకల్పం చేసుకుంటుంది. శివుడు ఆమె భక్తిని పరీక్షించేందుకు ఒక పూవును తీస్కుంటాడు. అలాగ ఒక పువ్వు తక్కువయిన విషయాన్ని గమనించిన లక్ష్మి దేవి భూమి అంతా గాలించిన ఒక్క పువ్వు కుడా దొరకదు. అప్పుడు ఆ తల్లి తన ఒక స్తనాన్ని కలువపువ్వుగా సమర్పించదలుస్తుంది. ఆమె సాహసానికి ,భక్తికి ముగ్ధుడైన శివుడు అమ్మవారి స్థనాన్ని మారేడుపండుగా మార్చి,తనకి మారేడు పత్రాలతో పూజ చేస్తే ప్రీతి పొందుతాను అని ప్రకటిస్తాడు. అలాగే తమలపాకు,వక్కల్ని కూడా లక్ష్మీదేవి పూజకు సంబంధించినవి !!!!!!!!!!!!!
Read More

మాఘమాసం విశిష్టత

మాఘమాసం
మాఘమాసం విశిష్టత

చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో 'ప్రయాగ'ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.
మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు

Read More

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు,

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు,

తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో 

మూలమూర్తి (ధ్రువబేరం) 
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం) 
ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.

ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)
ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)
13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.

కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)
గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.
 

Read More

శ్రీ ప౦చమిశ్రీ ప౦చమి 
మాఘశుధ్ధ ప౦చమిని సరస్వతీ జయ౦తిగా ఆరాధి౦చడ౦ అనేది పురాణాలలోనూ, ఇతర శాస్త్రాలలోనూ కనపడుతున్నటువ౦టి అ౦శ౦. దీనికే వస౦త ప౦చమి అనే వ్యవహార౦ ఉన్నది. దీనినే శ్రీప౦చమి అని కూడా అ౦టారు. ఈరోజు సరస్వతీ దేవి ఆవిర్భావ దిన౦గా దేవీభాగవత౦, బ్రహ్మవైవర్త పురాణ౦ కూడా ప్రస్తావిస్తున్న అ౦శ౦. పరమపురుషునియొక్క వదన౦ ను౦చి సరస్వతీ దేవి ఆవిర్భవి౦చి౦ది అని కథ. జగతి అ౦తటికీ కారణమైన పరమేశ్వరుడు విరాట్ పురుషుడు. ఆయనయొక్క వాక్కు, బుధ్ధి, జ్ణానముల స్వరూపమే సరస్వతి. వాక్బుధ్ధి జ్నానాధిష్టాత్రి. మనకు ఒక పని చేయటానికి వాక్కు, బుధ్ధి, జ్నాన౦ ఎలా కావాలో సృష్టి, స్ఠితి లయలు చేయడానికి పరమేశ్వరునికి కూడా వాక్కు, బుధ్ధి, జ్ణానము ఉ౦ది. ఆయనకున్న ఈశక్తిని మన౦ సరస్వతిగా ఉపాసిస్తున్నాము. ఆ సరస్వతి ఈ ప౦చమినాడు విరాట్ పురుషుని ను౦చి ఆవిర్భవి౦చి౦ది. ఈరోజు సరస్వతీ ఆరాధన అత్య౦త ప్రశస్తిగా ఉన్నది. కేవల౦ భూలోక మానవులు మాత్తమే కాకు౦డా దేవలోక౦లో కూడా సరస్వతిని ఆరాధిస్తారు అని దేవీభాగవత౦ చెప్తో౦ది. 

సరస్వతీ ఉపాసనకి చాలా మ౦త్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జ్నానవృధ్ధికి చెప్పబడినవి అయితే కొన్నిఐశ్వర్య సిధ్ధికి చెప్పబడినాయి. బీజాక్షరాలు మాత్ర౦ సరియైన గురువు ద్వారా సరియైన పధ్ధతిలో ఉపదేశ౦ పొ౦ది చేయాలి తప్ప పుస్తకాలు చూసో, టివీలో చూసో చేయరాదు. ముఖ్య౦గా సరస్వతి ప్రతి నామమూ ఒక మ౦త్రమే. "శ్రీ సరస్వత్యై నమ:" అనే ఈ మ౦త్ర౦ గొప్ప మ౦త్ర౦. ఈ శ్రీకార౦లోనే చైతన్య౦ అ౦తా ఉ౦ది. అ౦తేకాక ఈ 'శ్రీ' ముగ్గురు అమ్మలకూ వర్తిస్తు౦ది. ఇది కాకు౦డా దేవీభాగవత౦లో ప్రార౦భ౦లోనే 24 అక్షరాలు, 3 పాదముల ఒక మహామ౦త్ర౦ ఉన్నది. ఒక్కొక్క పాదానికి 8అక్షరాల చొప్పున ఉ౦టు౦ది. ఇది గాయత్రీ మ౦త్ర౦తో సమానమైనది. బుధ్ధిశక్తిని పె౦చుతు౦ది. సరియైన నిర్ణయాన్ని, ఆలోచనని ఇచ్చి అది సాఫల్య౦ అయ్యేట్లుగా చేస్తు౦ది. అలా౦టి మహామ౦త్ర౦ వ్యాసదేవుడు మనకు ఇచ్చారు. అ౦దరూ పఠి౦చవచ్చు.

"సర్వ చైతన్యరూపాం తాం ఆద్యాం 
విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్"

అమ్మవారు సర్వచైతన్య స్వరూపిణి. విశ్వానికి ము౦దే ఉ౦ది కనుక ఆద్య, జ్నాన రూపిణి కనుక విద్య, అటువ౦టి సరస్వతిని ధ్యానిస్తున్నాను. ఆ సరస్వతీ దేవి మాయొక్క బుధ్ధులను ప్రేరేపి౦చే తల్లి. దీనికి గురూపదేశాలు అవసర౦లేదు. అమ్మవారు మనకి ఉపడేశి౦చారు అని భావి౦చి పఠిస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తు౦ది. 

గాయత్రి, సావిత్రి సరస్వతి అనేది వేదమాతయొక్క నామ౦గా వేద౦ తెలుపుతో౦ది. ఈవేదమాత ప్రాత:కాల౦లో గాయత్రిగానూ, మధ్యాహ్న కాల౦లో సావిత్రిగానూ, సాయ౦స౦ధ్యాకాల౦లో సరస్వతిగానూ ఉపాసి౦పబడుతు౦ది. మూడు పేర్లు ఉన్నప్పటికీ శక్తి మాత్ర౦ ఒక్కటే. ఆ శక్తి స౦ధ్యాశక్తి, ప్రాణ శక్తి, జ్నాన శక్తి. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అనగా ప్రాణములను రక్షి౦చేటువ౦టి శక్తి. సావిత్రి అ౦టే సృష్టి కారక శక్తి. సరస్వతి అ౦టే ప్రవాహశీలిని అయిన శక్తి. జ్నాన౦ ప్రవాహరూప౦లో ఉ౦టు౦ది. శక్తియొక్క లక్షణమే ప్రవాహ౦. ఈ అన౦త విశ్వ౦లో నిర౦తర౦ ప్రసరిస్తూ ఉన్నదో ఆ ప్రాణశక్తే సరస్వతి. ప్రప౦చ౦లోని ప్రాణాలను కాపాడుతో౦ది కనుక గాయత్రి. సృష్టికికారణ౦ కనుక సావిత్రిగా పిలువబడుతో౦ది. 

అమ్మవారి నవరాత్రులు ముఖ్య౦గా రె౦డు వస్తాయి. ఒకటి వస౦త నవరాత్రులు, రె౦డవది శరన్నవరాత్ర్లులు. శ్రీవిద్యా శాస్త్ర పర౦గా స౦వత్సర౦లో ఇ౦కో రె౦డు నవరాత్రులు ఉన్నాయి అని తెలుస్తో౦ది. ఇచ్ఛాశక్తి లలితా, జ్నానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. వారాహి నవరాత్రులు ఆషాఢ మాస౦లో శుక్లపాడ్యమి ను౦చి నవమి వరకు చేస్తారు. మాఘశుధ్ధ పాడ్యమి ను౦చి తొమ్మిదిరోజుల పాటు చేసే నవరాత్రులను శ్యామలా నవరాత్రులు అ౦టారు. ఈమధ్యలో వచ్చే ప౦చమినే మన౦ సరస్వతీ ఆరాధనకు చెప్పుకు౦టున్నా౦.

సరస్వతి హ౦స వాహన౦పై, మయూర వాహన౦పై కూర్చున్నట్లు కనిపిస్తు౦ది. జ్నాన ప్రధాన దేవతలను మయూర వాహన౦గా ఆరాధిస్తారు అని తెలుస్తున్నది. హ౦స శబ్ద శక్తికి, ప్రాణ శక్తికి స౦కేత౦. నెమలి యజ్నశక్తికి స౦కేత౦. యోగశాస్త్ర౦లో శ్వాసకు హ౦స అనే పేరు ఉన్నది. ఊపిరులను హ౦సలు అ౦టారు. ఉచ్ఛ్వాస నిశ్వాస అనే రె౦డు రెక్కలతో కూడిన ప్రాణశక్తిని హ౦స అ౦టారు. ఊపిరి మనకి మూలాధార చక్ర౦ను౦చి కదిలివచ్చి శబ్దరూప౦లో వెలికి వస్తు౦ది. ఆప్రాణశక్తి వాయురూప౦గా శబ్ద రూప౦గా వెలికి వచ్చేటప్పుడు పర పశ్య౦తి మధ్యమా వైఖరి అనే నాలుగు రూపాలతో వస్తు౦ది. ఆ ప్రాణశక్తిని అధివసి౦చి ఉ౦టు౦ది శబ్దశక్తి. అ౦దుకే శబ్దశక్తి సరస్వతి. ప్రాణశక్తి హ౦స.

హ౦స విచక్షణకు స౦కేత౦గా భావిస్తు౦ది మన స౦స్కృతి. పాలు, నీళ్ళు కలిపి పెడితే 
పాలను మాత్రమే స్వీకరి౦చి నీటిని విడిచిపెడుతు౦ది హ౦స. అలాగే మనకు విద్య వల్ల కలుగవలసి౦ది వివేక౦. వివేక౦ అ౦టే చెడును విడిచి మ౦చిని స్వీకరి౦చి ఆమ౦చిని మనలో పె౦చుకొని పె౦పొ౦ది౦చాలి. విచక్షణ అనేది చాలా ప్రధాన౦. విచక్షణ మీద విద్య ఆధారపడి ఉ౦టు౦ది. 

నెమలి చిత్రాగ్ని. "చినోతి అనేక వర్ణా:ఇతి చిత్ర౦" అనేక ర౦గులతో కూడియున్న కా౦తి శక్తి అగ్ని స్వరూప౦. ఇది ఒక స౦వత్సర౦లో మారుతున్న ఋతువులకు స౦కేత౦. అ౦దుకే ఇది కాలాగ్ని, యజ్నాగ్ని. మయూరవాహన౦పై ఉన్న అమ్మవారు యజ్న ఫలప్రదాయిని. యజ్న స్వరూపిణి. వేదములు రె౦డుభాగములు.
కర్మకా౦డ, జ్నానకా౦డ. కర్మకా౦డ యజ్నమయ౦. జ్నానకా౦డ జ్నానమయ౦. జ్నానమ౦దు ఆమె తత్త్వ స్వరూపిణిగా ఉ౦టు౦ది. యజ్నమున౦దు కర్మఫల ప్రదాయినిగా ఉ౦టు౦ది. 

ఏ దేవతానుగ్రహ౦ కావాలన్నా ఉ౦డవలసి౦ది నిష్కపటమైన భక్తి. ఎవరు ఏ మేరకు ఆరాధనా చేస్తే వారిని ఆ మేరకు అమ్మవారు తప్పక అనుగ్రహిస్తు౦ది. కర్మ శ్రధ్ధతో కూడుకున్నప్పుడు సత్ఫలితాన్ని ఇస్తు౦ది. శ్రధ్ధ అ౦టే శాస్త్ర వాక్యములపై విశ్వాస౦. అకు౦ఠితమైన విశ్వాస౦తో, భక్తితో సేవిస్తే తప్పక అనుగ్రహిస్తు౦ది. సరస్వతీ ఆరాధకులు సాత్వికమైన ప్రవృత్తి కలిగి ఉ౦డాలి. సరస్వతి తత్త్వమే శుధ్ధ సత్త్వ గుణ౦. శుధ్ధ సత్త్వము అ౦టే రజోగుణ, తమోగుణ దోషాలు లేనటువ౦టిది. సాత్విక గుణాలైనటువ౦టి సత్యము, శౌచము, అహి౦స వ౦టి పవిత్రమైన పధ్ధతులు పాటిస్తూ వాక్కును నిగ్రహి౦చుకోవాలి. వాచక రూప తపస్సు సరస్వతీ ఆరాధనకు చాలా అవసర౦. 

"అనుద్వేగ కర౦ వాక్య౦ సత్య౦ ప్రియ హిత౦ చ యత్ స్వాధ్యాయాభ్యసన౦ చైవ వాజ్మయ౦ తప ఉచ్ఛతే"

మాట్లాడే మాట ఎదుటివారిని ఆ౦దోళనకు, ఉద్రేకానికి గురిచేయరాదు. ప్రియ౦గా, హిత౦గా, సత్య౦గా, మిత౦గా మాట్లాడాలి. పెద్దలు రచి౦చిన ఉత్తమ గ్ర౦ధాలను పఠి౦చాలి. దివ్యమైన శబ్దములు మన నోటితో పలకాలి. తామసిక పదార్ధాలను విసర్జి౦చాలి. అలా చేస్తూ "సర్వ చైతన్యరూపాం తాం ఆద్యాం
విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్" మ౦త్రాన్ని జపి౦చితే శీఘ్రమైన ఫల౦ తప్పకు౦డా కలుగుతు౦ది.

Read More

సరస్వతీ స్తోత్రం (Saraswati Stotram)

సరస్వతీ స్తోత్రం (Saraswati Stotram)

యా కుందేందు తుషార హార ధవళ యాశుభ్ర వస్త్రాన్వితా 
యా వీణా పరదండ మండిత కరాయాశ్వేత పద్మాసనా 
యా బ్రహ్మచ్యుత శంకర ప్రభ్రుతిర్ధేవైస్సదా పూజితా 
సామాం పాతు సరస్వతీ నిశ్శేష జాడ్యాపహా 

దోర్భిర్యుక్తా చాతుర్ది: స్ఫటిక మణ్ణినిభై రక్షమాలాన్దధానా 
హస్తేనైకేన పద్మం సితమపి చశుకం పుస్తకం చాపరేణ
భాసాకుందేందు శంఖస్ఫటిక మణి నిభా భాసమానా సమానా 
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా 

సురావరైస్సేవిత పాదపంకజాకరే విరాజత్కమనీయ పుస్తకా విరించి పత్నీ
కమలాసన స్థితా సరస్వతీ నృత్యతు వాచిమేసదా సరస్వతీ సరిసిజ 
కేరస ప్రభా తపస్వినీసిత కమలాసన ప్రియా ఘనస్తనీ
కమల విలోల లోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ

సరస్వతీ సమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా 
సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవీ నమో నమః శాంతిరూపే శశిధరే సర్వయోగే నమోనమః 

నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమోనమః విద్యాధరే విశాలాక్షి శుద్ధ జ్ఞానే నమోనమః
శుద్ధ స్ఫటిక రూపాయై సూక్ష్మరూపే నమోనమః శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమోనమః 
ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమోనమః మూలమంత్ర స్వరూపాయై మూలశక్త్యై నమోనమః
మనోన్మని మహాభోగి వాగీశ్వరీ నమోనమః వాగ్మ్యై వరద హస్తాయై వరదాయై నమోనమః
వేదాదై వేదరూపాయై వేదాంతాయై నమోనమః గుణదోష వివర్జిన్యై గుణదీప్త్యై నమోనమః 
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమోనమః సంపన్నాయై కుమార్యైఛ సర్వజ్ఞేతే నమోనమః 
యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమోనమః దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమోనమః 
అర్ధచంద్ర జటాధారి చంద్రబింబే నమోనమః చంద్రాదిత్య జటాధారి చంద్రబింబే నమోనమః 
అణురూపే మహారూపే నమోనమః అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయాయ నమోనమః
జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమోనమః నానాశాస్త్ర స్వరూపాయై నానా రూపే నమోనమః
పద్మదా పద్మవంశా చ పద్మరూపే నమోనమః 
పరమేస్త్యై పరమూర్త్యై నమస్తే పాపనాశినీ మషదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్యై నమోనమః
బ్ర్రహ్మ విష్ణు శివాయైచ బ్రహ్మ నార్యై నమోనమః కమలాకర పుష్పా చ కామరూపే నమోనమః
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమోనమః 
సాయంప్రాత పఠేనిత్యం షాణ్మాసాత్సిద్ధిరుచ్యతే 
చోరవ్యాఘ్ర భయం నాస్తి పఠతాం శృణ్వతామపి 
ఇదం సరస్వతీ స్తోత్ర మగస్త్య ముని వాచకమ్
సర్వసిద్ధి కరం శ్రూణాం సర్వపాప ప్రణాశనమ్

Read More

రథసప్తమి, సూర్యదేవాలయాల ప్రాముఖ్యత


రథసప్తమి,  సూర్యదేవాలయాల ప్రాముఖ్యత

ఖగోళ శాస్రంలోని అనేక నక్షత్రాలలో సూర్యుడు ఒక నక్షత్రం, నవగ్రహాలకు సూర్యుడు అధిపతి , ఎల్లప్పుడు ఏడు తలలతో ,ఏడు గుర్రములతో తేజోవంతంగా ప్రకాశిస్తూ తిరుగుతూ ఉంటాడు, భారత దేశంలో సూర్యునికి అనేక ప్రాంతాలలో సూర్య దేవాలయాలు ఉన్నాయి, ఒరిస్సాలోని కోణార్క్ సూర్యదేవాలయం ప్రసిద్ది చెందినది. ఈ దేవాలయాన్ని గంగవంశం రాజు అయిన నరసింహ వర్మ నిర్మించారు. గుజరాత్ లోఅని మొధిర ప్రాంతంలో సూర్యదేవాలయం క్రి.శ.1026 సంవత్సరంలో భీం దేవ్ అనే
 రాజు ఈ దేవాలయాన్ని నిర్మిచారు. ఇంకా మన దేశంలో కొన్ని ప్రాంతాలలో కూడా సూర్యదేవాలయాలు ఉండేవి. ముస్లింల పరిపాలనలో అవి నేలమట్టం కాబడ్డాయి. మన రాష్ర్టంలో కుడా సూర్యదేవాలయం కలదు. శ్రీకాకుళం పట్టణానికి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో అరసవల్లి అనే గ్రామంలో సూర్యదేవాలయం కలదు. పూర్వం ఈ ప్రాంతాన్ని హర్షవల్లి అని పిలిచేవారు. కాల క్రమేణా అరసవల్లి గా ప్రసిద్ది చెందినది. ఈ దేవాలయం ప్రాచినమైనది. ఇక్కడ లభించిన శాసనాలను బట్టి ఈ దేవాలయం క్రి.శ. 7వ శతాబ్దంలో నిర్మించబడినదని తెలుస్తున్నది. క్రి.శ.17వ శతాబ్దంలో ఈ ప్రాంతం నిజాం నవాబు పరిపాలన కిందకు వచ్చింది. "షేర్ మహమ్మద్ఖాన్ అనే అతడు ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించ బడ్డారు. అతడు ఇక్కడ దేవాలయాలను ఎన్నింటినో ధ్వంసం చేసాడు. అలా ద్వంసం చేయబడిన దేవాలయాలలో అరసవల్లి దేవాలయం కుడా ఒకటి. క్రి.శ. 1778 లో ఎలమంచిలి పుల్లాజి పంతులు అనే ఆయన పూర్వం నిర్మింపబడిన చోటనే మళ్ళీ ఆలయాన్ని పునరుద్దరించి విగ్రహాలని వెలికితీసి ఆ దేవాలయంలో ప్రతిష్టించాడు. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం అదే. ఇది ఇలా ఉండగా దీనికి సంబందించిన పురాణకధ కూడా ఉంది.

పూర్వం ద్వాపరయుగంలో శ్రీకృష్ణునీ అన్న అయిన బలరాముడు తీర్ధయాత్రలు చేస్తూ కళింగ దేశం వచ్చాడు. అప్పుడు అక్కడ కరువు తాండవిస్తున్నది. ప్రజలు చాల భాధలు పడుతున్నారు. వారు కరవు బారినుండి తమను కాపాడమని బలరాముని ప్రార్ధించారు. బలరాముడు వారిపై దయదలచి తన ఆయుధమైన నాగలితో భూమిని గ్రుచ్చి ఒక నీటిబుగ్గను పైకి తీసుకుని వచ్చారు. అదే ఇప్పుడు మనం నాగావళి అని పిలుస్తున్నది . బలరాముడు నాగావళి ఒడ్డున రుద్రకోటేశ్వర ఆలయ స్థాపన చేసి దానికి దేవతలను ఆహ్వానించాడు. దేవతలందరూ వచ్చారు కాని దేవేంద్రుడు మాత్రం వేళకు రాలేకపోయాడు. ఆయన అక్కడికి వచ్చేసరికి రాత్రి అయినది. ఆయన కోటేశ్వరస్వామిని దర్శించటానికి వెళ్ళగా నందీశ్వరుడు ఆయనను అడ్డుకున్నారు. ఇంద్రుడు కోపంతో దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తగా, నందీశ్వరుడు తన కొమ్ములతో దేవేంద్రుడునీ విసిరికొట్టాడు. ఆ దెబ్బకు దేవేంద్రుడు అరసవల్లి సమీపంలో స్ప్రుహతప్పి పడిపోయాడు. అప్పడు సూర్యభగవానుడు ప్రత్యక్ష్యమై దేవేంద్రునితో "నా విగ్రహం ఇక్కడ ప్రతిష్టించి, ఆరాధించు" నీవు ఆరోగ్యవంతుడివి అవుతావు అని చెప్పి మాయమైనాడు. ఆయన చెప్పినట్లే దేవేంద్రుడు సుర్యనారాయణ స్వామిని అక్కడ ప్రతిష్టించి ఆ స్వామివారిని పూజించి ఆరోగ్యవంతుడై దేవలోకాన్ని చేరుకున్నాడు. సూర్యనారాయణస్వామీ తో పాటు ఆయన దేవరులైన ఉషా, పద్మినీ, చాయాదేవి విగ్రహాలను కుడా దర్శించవచ్చు.

భారతదేశములో సూర్యునికి సంబందించిన పండుగలు కూడా చాలా ప్రసిద్దిచెందివి. మకర సంక్రాంతిలో సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేసించే పుణ్యకాలం పంటలు అన్ని బాగా పండి రైతులు ధ్యానాన్ని ఇళ్ళకి చేర్చుకునే రోజు. చ్చాత్ సూర్యదేవుని మరియొక పండుగ. ఈ పండుగను సూర్యుని కుమారుడు అయిన కర్ణునీ ద్వారా మొదలై పండుగ. ఈ పండుగని గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ ప్రాంత ప్రజలు జరుపుకుంటారు. సంబు దశమి తుర్పుప్రాంతము అయిన ఒరిస్సా ప్రాంత ప్రజలు జరుపుకుంటారు సంబునికి సూర్యదేవుని ప్రార్ధించటం వలన కుష్టివ్యాధి నయమైనది. 

హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి జరుపుకుంటారు. ఇతర మాసములోని సప్తమి తిథులు కన్నా మాఘమాసములోని సప్తమి తిథి చాల విశిష్టమైన పండుగ. సూర్యజయంతి, భాస్కరజయంతి కూడా ఈ రోజే. స్వామి వారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే. సూర్యకిరణాలు అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి వారి పాదాలకు నేరుగా సూర్యకిరణాలు పడతాయి. ఉత్తరాయణ దక్షిణాయనాలు మార్పు చెందే కాలంలో కుడా సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడతాయి. సూర్యనారాయణస్వామిని ఆరాధిస్తే ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ప్రతిరోజూ ఇక్కడ ఎందరో భక్తులు వచ్చి భక్తీ శ్రద్దలతో స్వామివారిని ఆరాధించి రోగావిముక్తులై వెళుతుంటారు.

రథసప్తమినాడు బంగారముగాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమనుంచి, పూజించి గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు వచ్చునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము. సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకము రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారు భారతీయులే.

సప్తాశ్వ రథమారూఢం ప్రచండ కశ్యపాత్మజమ్
శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 

ఈ శ్లోకాన్ని జపిస్తూ స్వామివారినీ పూజించాలి .

ఈ రోజే ముత్తయిదువులు తమ నోములకు అంకురార్పణ చేస్తారు. చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోము ఈ రోజు మొదలుపెడతారు. ఈ రోజు ఎటువంటి పనులు తలపెట్టిన విజయం చేకూరుతుంది. ఆ రోజు ఉదయాన్నే పిల్లలు పెద్దలు నువ్వులనూనె రాసుకుని రేగిపళ్ళు, జిల్లేడు ఆకులు నెత్తిన పెట్టుకుని "ఓం సూర్య దేవాయ నమః" అని స్వామి వారిని మనసులో తలుచుకుని స్నానం ఆచరిస్తే కామ క్రోధాది గుణములు అన్ని తొలగుతాయి. జిల్లేడుకు రవి, ఆర్క ఆనే పేర్లు కూడా ఉన్నాయి. సూర్యని కోసం అర్చనలు చేస్తాం కాబట్టి జిల్లేడు ఆకులకు ప్రాధాన్యత వచ్చింది. తరువాత చిక్కుడు ఆకులను రధము ఆకారములో తయారుచేసి ఆవు పాలతో తయారుచేసిన పొంగలిని స్వామి వారికి నైవేద్యం పెట్టి ఆరగిస్తే ఆరోగ్యానికి మంచిది. చిక్కుడు ఆకులో ఉండే పసరు ఆరోగ్యానికి మంచిది. 

తిరుపతిలో కూడా శ్రీ వేంకటేశ్వరుని రధసప్తమి రోజున మొదట సుర్యప్రభ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. చివరన చంద్రప్రభ వాహనం పై ఊరెగిస్తారు. మిగతా వాహనాలు హనుమద్వాహన, గరుడవాహన, పెదసేషవాహన, కల్పవృక్ష వాహన, స్వయంభూపాల వాహనములపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్రస్నానం కూడా అదే రోజు చేస్తారు.ఒక్క రోజు బ్రహ్మోత్సవాన్ని ఎంతో కన్నులపండుగగా జరుపుతారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని కనులారా దర్శించుకుని ఆనందపడతారు.

సూర్యుడు ఆరోగ్య ప్రదాత, యోగాసనం, ప్రాణాయామం మరియు చక్రద్యానం కూడుకొని చేసే సంపూర్ణసాధనే సుర్యనమస్కారములు. బ్రహ్మముహుర్తంలో చేస్తే మంచి ఫలితాలని ఇస్తాయి. సూర్య నమస్కారములలో 12 మంత్రాలు ఉన్నాయి. 12 మంత్రాలని జపిస్తూ సుర్యనమస్కారములు చేస్తే ఆరోగ్యానికి మంచిది. సూర్యోదయ సమయంలో సూర్యునికి అభిముఖముగా నిలబడి సుర్యనమస్కారములు చేయాలి. సూర్య నమస్కారముల వలన ఊపిరితిత్తులు, నాడీమండలం, జీర్ణశక్తి మొదలయిన అవయవాలన్నింటికీ రక్తప్రసరణ సక్రమంగా జరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కళ్ళ సమస్యలు ఉన్నవారు సూర్యదేవుని ఆరాధిస్తే సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం ఆదిత్య హృదయం సుర్యభగావానునికి సంబదించిన స్తోత్రం. రామాయణం యుద్దకాండలో శ్రీరాముడు అలసట పొందినపుడు అగస్త్యమహర్షి యుద్దస్థలమునకు వచ్చి ఆదిత్య హృదయం ఆనే మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశం అయిన పిమ్మట శ్రీరాముడు రావణాసురుడిని సంహరించాడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం.

Read More

రథ సప్తమి..


రథ సప్తమి.. 

పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథ సప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రత కధతో సహా వ్రత విధానాన్ని వివరించాడు.

పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధ పడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయే సరికి క్రాంతధర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికీ కద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరిదశలొ ఒకసారి ఎవరో చేస్తూ వున్న రథ సప్తమి వ్రతాన్ని చూసాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజ కుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్ధితి నుండి బయట పడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రధ సప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు.

మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో వున్న నది, చెరువు, నుయ్యి ఇలా ఏదో ఒక చోట స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే నెత్తి మీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత శక్తి కొద్దీ బంగారంతో కాని, వెండితో కాని రధాన్ని చేయించి దానికి ఏడు గుర్రాలను, సూతుడిని అమర్చాలి. అందులో సూర్య ప్రతిమను పెట్టాలి. ఒక కొత్త గుడ్డను పరిచి దాని మీద ఈ రధాన్ని ఉంచాలి. సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దానధర్మాలు, వ్రతపారాయణ అనంతరం రధాన్ని, సూర్యప్రతిమను ఉత్తములూ, అర్హులూ అయిన వారికి దానమివ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.

ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రధం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో రధాన్ని చేయడం కనిపిస్తుంది.

యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు
తన్మే రోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ

ఏటా మాఘశుద్ధ సప్తమినాడు తలమీదా, భుజాల మీదా , మోచేతి మడతల మీద , అరచేతుల్లోనూ ( మొత్తం ఏడు) జిల్లేడాకులు ఉంచుకుని పై పద్యం చదువుతూ సూర్యుడికి నమస్కరించి స్నానం చేయడం మన సంప్రదాయం . ' గత ఏడు జన్మలలోనూ నేను చేసిన పాపాలను, రోగాలను, శోకాలనూ, మకర రాశిలోని సప్తమి హరించు గాకా' అని దీనర్ధం. ఆ రోజున హిందువులంతా సూర్యుణ్ణి పూజించి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో పిడకల మంట మీద పరమాన్నం వండి దాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. చిక్కుడు కాయలతో రధం తయారు చేసి దినకరుడికి సమర్పించుకుంటారు. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే....

పురాణాల ఆధారంగా...
ఈ రోజు సూర్య జయంతి. ఏడు గుర్రాలు పూంచిన ఏకచక్ర రథం పై రెండు చేతులా తెల్లటి పద్మాలు ధరించి ఉషస్సమయాన ఉదయించే ప్రత్యక్ష నారాయణుడి పుట్టిన రోజు. రామాయణ , భారతాలకు సూర్యుడితో గట్టి సంబంధమేం ఉంది.

రాముడిది రఘువంశం. అంటే ఆయన సూర్యవంశజుడన్నమాట! అగస్త్యుడు శ్రీ రాముడికి బోధించిన మంత్రాలే ' ఆదిత్య హృదయం 'గా ప్రాచుర్యం పొందాయి. తనను పండుగా భావించి మింగేయబోయిన చిన్నారి హనుమంతుడికి గురువుగానూ రామాయణంలో కనిపిస్తాడు సూర్యుడు.

అటు భారతం లోనూ కర్ణుడి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దుర్వాస మహాముని నుంచి మంత్రోపదేశం పొందిన కుంతికి ముందుగా గుర్తొచ్చింది సూర్యుడే. సత్రాజిత్తుకు శమంతకపణిని , ధర్మరాజుకు అక్షయపాత్రనూ, ఇచ్చింది భాస్కరుడే.

ఈ రోజు ఖగోళ పరంగా
సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజు అని చెప్పొచ్చు. ఈ రోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గరవటం ప్రారంభిస్తుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది.
 

Read More

ఉదయం లేవగానే -


ఉదయం లేవగానే - 

కరదర్శనం :- కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి / కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం // 
చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి, చివరిభాగమున గౌరీదేవి వున్నందున ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను. 
లేదా
మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ కరదర్శనం చేసుకోవలెను)

భూప్రార్ధన :- సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే / విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే //
పాదస్పర్శతో భూదేవిని బాధిస్తున్నందుకు క్షమాపణ చెప్తూ కాలిని నేలకు ఆన్చాలి. 
లేదా 
పాదస్పర్శ క్షమస్వమే, భూదేవి నమోస్తుతే అనైన ప్రార్ధించవచ్చును)

ప్రాతః స్మరణ :- బ్రహ్మ మురారి స్త్రిపురాంతకశ్చ, భాను శ్శశీ భూమిసుతో బుధశ్చ / గురుశ్చ శుక్ర శ్శని రాహు కేతవః, కుర్వంతం సర్వే మమ సుప్రభాతమ్ // 
త్రిమూర్తులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు నాకు మేలు చేయుదురుగాక! 
లేదా 
హరం హరిం హరిశ్చంద్రం హనూమంతం హలాయుధమ్ / పంచకం వై స్మరేన్నిత్యం ఘోరసంకటనాశనమ్ // 

స్నాన విధి :- గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి / నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు // 
లేదా 
యో సౌ సర్వగతో విష్ణు: చిత్ స్వరూపీ నిరంజనః / స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః //

(భాహ్యాభ్యంతరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్ / మృజ్జలాభ్యాం బహిశుద్ధి ర్భావశుద్ధి స్తదాన్తరమ్ //
బాహ్యాభ్యంతర భేదములచే శౌచం రెండువిధములుగా వుండును. జలముచే కలిగెడుశుద్ధి బాహ్యశుద్ది, నిర్మలభావము(భావశుద్ధి) చే కలిగెడుశుద్ధి అంతర శుద్ధి).

ఆత్మను పరమాత్మలో లయం చేయడానికి మన పూజావిధానం ఒక ఉతమోత్తమ మార్గం. దేవుని విగ్రహం లేదా చిత్రం విశ్వాత్మకు ప్రతిబింబం. విగ్రహం భూతత్వమైనది. అలానేసాంబ్రాణి ధూపం భూతత్వమైన వాసన కల్గివుంటుంది. ఇవి మూలాధారచక్రమును ఉత్తేజితం చేస్తుంది. అలానే తీర్ధ ప్రసాదాలు రుచి ద్వారా స్వాదిష్టానాన్ని ఉత్తేజితం చేస్తుంది. దీపం, హారతి ద్వారా జనించిన అగ్ని మణిపూరచక్రమును, గంధం, అగరబత్తిల ద్వారా వాయుతత్వమైన అనాహతచక్రమును, గంటానాదం ద్వారా విశుద్ధిచక్రం ఉత్తేజితం అవుతాయి. తద్వారా ఆజ్ఞాచక్రం, సహస్రారం జాగృతం అవుతాయి. ఇట్లా మనలోని నాడీకేంద్రాలను జాగృతం చేసుకోవడానికి పూజావిధానాన్ని ప్రాచీన మహర్షులు మనకందించారు. మంత్రాలు, ప్రార్ధనలు, సంకీర్తనలు, అర్చనలు, పూజలు ద్వారా మన షట్చక్రాలను మేలుకొల్పి కుండలినీశక్తిని పైకి నడిపి సహస్రారంలో గల పరమాత్మతత్వాన్ని ఆరాదిస్తున్నాం.

పూజావిధం :- చిత్రం, మృత్తిక, శిల, దారువు, లోహం.... దేనితో తయారైనదైనా దానిని భగవంతుని ప్రతిరూపముగా భావించి పూజిస్తాం. [ఈ రూపాలు మన ప్రగాడ విశ్వాసభావనతో ఏర్పరుచుకున్నవి]
{న తే రూపం న చాకారో నాయుధాని న చాన్పదమ్ / తధ్కాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశాసే //
భగవంతునికి ప్రత్యేకముగా ఒక్క రూపముగాని, ఒక్క ఆకారముగాని, ఆయుధముగాని (శంఖు,చక్ర,డమరు మొదలగు), వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగాని లేనప్పటికిని భక్తవత్సలగుటచేతను, పరమకరుణాస్వరూపులగుటచేతను భక్తులయొక్క భావమును అనుసరించి అనేకరూపములను ధరించుచున్నారు. 
యే యధా మాం ప్రవద్యంతే తాంస్తదైవ భజామ్యహం ..... ఎవరు ఎలాంటి భావముతో నన్ను ఉపాసింతురో వారికాలాంటి భావముతో దర్శనమిత్తును.} 

దీపస్తుతి :- దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ / దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే // 
దీపజ్యోతే పరబ్రహ్మం. దీపజ్యోతే అన్ని తమో గుణాలని హరించేది. దీపం వల్లే సర్వం సాధ్యం. సంధ్యలో వెలిగే దీపానికి నమస్కారాలు. [దీపకాంతిలో తమోరజో గుణాలు హరిస్తాయి]

నమస్కారం :- పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః / త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల //
తలవంచి రెండు చేతులు జోడించి హృదయం వద్దగానీ, భ్రూమధ్యంలో గానీ, నెత్తి పై అంటే సహస్రారంపై గానీ పెట్టి నమస్కరించడానికి కారణం ఏమిటంటే - మూడు ప్రదేశాలలో భగవంతుని భావన విశేషంగా ఉంటుంది. హృదయంలో ఆత్మరూపములో, భ్రూమధ్యంలో జీవరూపములో, సహస్రారంలో పరమాత్మరూపములో ఉంటుంది. 
'న' అంటే లేదు, 'మ' అంటే నాది అయినటువంటిది అని అర్ధం. నమః అంటే నాదంటూ ఏదిలేదని అర్ధం. భగవంతున్ని నమష్కరించడం అంటే నాదంటూ ఏదిలేదని, ఉన్నదంతా నీదే (పరమాత్మదే) అని శరణాగతి భావమును తెలపడం.

పూజకు వినియోగించే పదార్దముల అంతరార్ధం :- కృష్ణభగవానుడు చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయంలకు అర్ధమేమిటంటే - పత్రం అంటే దేహం. ఈ శరీరమును వినియోగిస్తూ చేసే క్రియలను భక్తిభావముతో కృష్ణార్పణం చేయాలి.(ప్రారబ్ధకర్మనుండి విముక్తి కల్గుతుంది) పుష్పం అంటే హృదయం. పుష్పములా సున్నితముగా, సువాసనభరితంగా, స్వచ్ఛముగా వున్నా హృదయమును సమర్పించాలి. ఫలం అంటే కర్మఫలం. ఫలములో విత్తనములు వుంటాయి, అవి నాటితే తిరిగి చిగురిస్తాయి. అలానే కర్మల వలన జన్మించాల్సివస్తుంది. అలానే కర్మఫలాన్ని అనుభవించాల్సివస్తుంది. అలా కాకుండా త్రికరణశుద్ధిగా కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తే కర్మబంధం తప్పుతుంది.(దీనివలన సంచిత, ఆగామి కర్మలనుడి విముక్తికల్గుతుంది) తోయమనగా భక్తిరసం. ఆరాధనతో, ఆర్తితో పరిపూర్ణ శరణాగతి భక్తిభావముతో మనస్సు ఉప్పొంగికార్చే ఆనందభాష్పాలను సమర్పించాలి. 
కొబ్బరికాయ :- కొబ్బరికాయ కొడుతున్నామంటే మన అహంకారమును వీడుతున్నామని. కొట్టిన కొబ్బరిచెక్కలను భగవంతునికి సమర్పించడమంటే - లోపలున్న తెల్లనికొబ్బరిలా మన మనస్సును సంపూర్ణముగా భగవంతుని ముందు పరిచామని. తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలని వుంచమని అర్ధం. కొబ్బరి బయటిభాగం మన శరీరమని, లోపలభాగం మన మనస్సని, మూడుకళ్ళు ఇడా,పింగళ, సుషమ్ననాడులని కూడా పెద్దలు చెప్తారు. అలానే కొబ్బరికాయపై పీచును తమోగుణమునకు ప్రతీకగా, గట్టిగా ఉండే టెంక రజోగుణమునకు ప్రతీకగా, లోపల ఉన్న తెల్లని కొబ్బరిని సత్వగుణమునకు ప్రతీకగా విశీదకరిస్తూ, మనలో ఉన్న త్రిగుణములను బద్దలుకొట్టి పావనమైన అంతఃకరణమును కొబ్బరినీరుగా భగవంతునికి అర్పించడమనే అర్ధాని కొందరు చెప్తారు. 
ధూపం :- సువాసనభరితమైన ధూపం మనలో వున్న చెడువాసనలను తొలగించాలని వెలిగిస్తాం.
హారతి స్తుతి :- ఆరోగ్యం ఆయుష్యం అనంతసౌఖ్యం 
సంపత్సముర్ధ్యం శుభసన్నిధానం 
కర్పూరదీవేన లభస్త్యదేహి 
నీరాజనయే వేంకటనాధ నిత్యమ్.మనలోనికి 
కర్మవాసనలన్నియు కర్పూరముల పూర్తిగా క్షయింపబడాలని. ఏ శేషములేకుండా భగవంతుని ముందు వెలిగించిన హారతి భగవంతునిలో కైకర్యం చెందినట్లుగా భక్తిభావంతో మనలోవెలుగుతున్నఆత్మ పరమాత్ముని యందు ఐక్యంకావాలని కోరుకోవడం. హారతిని కళ్ళకు అద్దుకోవడమంటే మన దృష్టి అంతర్ముఖం కావాలని. 
గంట :- మనస్సు ఎన్నో విషయాలు (జ్ఞాపకాలు, ఆలోచనలతో) తో నిండి ఉంటుంది. వాటన్నింటిని విడిచి కొన్ని క్షణములైన దైవమందు మనస్సు నిల్పవలయునని ఉద్దేశ్యంతో గంటను పుజాసామగ్రిలో ఓ భాగంగా పూర్వీకులు ప్రవేశపెట్టారు. ఘంటారావం వినగానే అనేక విషయాలయందు తిరిగే మనస్సు ఆ నాదమందైక్యమై నాదం ఏకస్థాయికి వచ్చునట్లు మనస్సు కూడా ఏకస్థాయికి వచ్చును అని పెద్దలు చెప్తారు. ఘంటానాదం నిశ్చబ్ధ స్థితిలోకి తీసుకువెళ్ళి, మన మనస్సును నిజ తత్వమైన ఆత్మవైపు కాసేపైన మళ్ళిస్తుంది. శబ్దంలోనుంచి నిశ్శబ్ధం, శూన్యంలోకి వెళ్ళమని గంట సూచిస్తుంది.
నైవేద్య నివేదన శ్లోకం :- త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే /తేన త్వదంఘ్రి కమలే భక్తిం మే యచ్చ శాశ్వతీం 
గోవిందా! నీ వస్తువులు నీకే సమర్పిస్తున్నాను. వీనితో నీ చరణకమలాలపై శాశ్వతమైన భక్తి కలుగునట్లు ప్రసాదించు.

ప్రదక్షిణ స్తుతి :- యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ / తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే // 
ప్రదక్షిణ అనగా నేను అన్నివైపుల నుండి నిన్నే కాంచుతూ నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్ధం. 'ప్ర' అనగా పాపాల నాశనమని, 'ద' అనగా కోరికలు తీర్చమని, 'క్షి' అనగా మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని, 'ణ' అంటే అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానమును ఇవ్వమనే అర్ధమును కొందరు చెప్తారు. 
దివ్యమంగళకరమగు భగవద్విగ్రహంను దర్శిస్తూ నేతేన్ద్రియములు భక్తిత్వంలో లయించును. సుగంధ ధూపవాసనలచే ఘ్రానేన్ద్రియం లయించును. ఓంకారం, గంటానాదం, శంఖారావం, మంత్రోచ్చారణలయందు కర్ణేన్ద్రియములు లీనమగును. భాగావన్నామోచ్చారణల చేతను, తీర్ధాది ప్రసాదముల చేతను జిహ్వేంద్రియం లయించును. పరిమిళమిళిత శీతలదాయకమగు పసుపుకుంకుమ చందనాదులచే త్వగింద్రియం శాంతంనొంది పవిత్రభావాలతో పులకరించును. పంచేంద్రియములు ఇలా ఒకే ధ్యాసతో భక్తిభావంనందు లయమైనప్పుడే మనస్సు కూడా పూర్తిగా ఏకాగ్రతతో యందు లయించును.
సూర్య స్తుతి :- ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మామ భాస్కర / దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే // 
లేదా 
సప్తాశ్వరధ మారుడం ప్రచండం కశ్యపాత్మజమ్/ శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ //
లేదా 
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్ / మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ //
లేదా 
తులసి స్తుతి:- యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాః / యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ // 
లేదా 
ప్రసీద దేవదేవేశి ప్రసీద హరివల్లభే / క్షీరోదమాధనోద్భూతే తులసి త్వాం నమామ్యహమ్ //

నవగ్రహ స్తుతి :- ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ / గురు శుక్ర శనిభ్యశ్ఛ రాహవే కేతవే నమః //

గురు స్తుతి :- గురు బ్రహ్మా గురు విష్ణు: గురు దేవో మహేశ్వరః / గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః // 
లేదా 
అఖండ మండలాకారం వ్యాప్తం యేవ చరాచరమ్ / తత్పదం దర్శితం యేవ తస్మై శ్రీ గురవే నమః //
లేదా 
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా / చక్షురున్మీలితం యేవ తస్మై శ్రీ గురవే నమః //

భోజనమునకు ముందు :- (ఏది భుజించినను భగవంతుని ప్రసాదముగానే స్వీకరించాలి) 
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లబే / జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి // 
లేదా 
అన్నం బ్రహ్మరసో విష్ణు: భోక్తా దేవో మహేశ్వరః / ఇతిస్మరన్ ప్రభుం జానః దృష్టి దోషై: నలిప్యతే //
మరియు 
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ / బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా //
మరియు 
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః / ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ //

భోజనము తర్వాత :- అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబానలమ్ / ఆహారపరిణామార్ధం స్మరామి చ వృకోదరమ్ // 
మరియు 
విష్ణు: సమస్తేంద్రియ దేహదేహీ ప్రదానభూతో భగవాన్ యధైకః / సత్యేన తేనాత్త మశేష మన్నం ఆరోగ్యదం మే పరిణామ మేతు //

ప్రయాణం విధి :- జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః / అతవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః // 
నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక! 
లేదా 
వనమాలీ గదీ శారజ్ఞి శంఖీ చక్రీ చ నందకీ / శ్రీమాన్ నారాయణో విష్ణు: వాసుదేవోభిరక్షతు // 
లేదా 
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ / లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం // 

కార్యసిద్ధి :- వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ / సరస్వతీం ప్రణమ్యాదౌ సర్వకార్యార్ధ సిద్ధయే //

స్మృతి సిద్ధి :- శ్రీదత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః / కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః //
(అనుకున్నది సిద్ధించడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి) 

చంద్ర దర్శన స్తుతి :- క్షీరార్ణవ సముత్పన్న లక్ష్మీప్రియ సహోదర / మహేశమకుటాభాస్వన్ బాలచంద్ర నమోస్తుతే // 

గోవు దర్శన స్తుతి :- గావో మే చాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ / గావో మే హృదయేచైవ గవాం మధ్యే వసామ్యహమ్ // 
మరియు 
మంగళం దర్శనం ప్రాతః పూజానం పరమం పదమ్ / స్పర్శనం పరమం తీర్ధం నాస్తి ధేనుసమం క్వచిత్ //

ఔషద విధి :- ధన్వంతరిం గురుత్మంతం ఫణిరాజం చ కౌస్తుభమ్ / అచ్యుతం చామృతం చంద్రం స్మరే దౌషధకర్మణి // 
లేదా 
శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే / ఔషదం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి: // 
లేదా 
అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ / నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ //

శయనవిధి :- రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం / శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తన్న నశ్యతి // 
లేదా 
అగస్త్యో మాధవశ్చైవ ముచుకుందో మహాబలః / కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖశాయినః //
లేదా 
హనుమా నంజనాసూను: వాయుపుత్రో మహాబలః 
రామేష్ఠ: ఫల్గునసఖః పింగాక్షోమిత విక్రమః 
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః 
లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా 
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః 
స్వాపకాలే పఠే న్నిత్యం యాత్రాకాలే విశేషతః 
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్.

కుంకుమ ధారణ :- కుంకుమస్త్రీ పురుషులు ధరించడం మన సనాతన ఆచారం. ఇది తప్పనిసరి. ఎందుకంటే - రెండు కనుబొమలకు మద్యభాగమైన నుదుటిస్థానం 'ఇడ' 'పింగళ' 'సుషుమ్న' అనే ప్రధాన నాడుల సంగమస్థానం. కుంకుమ ధరించడం పవిత్రతకు, అస్తికత్వానికి, ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా చెప్తారు. కుంకుమ మనిషిలోని మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, సహృదయతను పెంపొందిస్తుంది. మనం బొట్టు పెట్టుకునే చోటే అజ్ఞాచక్రం ఉంటుంది. దానికి త్రివేణి సంగమమని, అమృతస్థానమని పేరు. ధ్యానానికి ఇది ముఖ్యస్థానం. ఈచోట కుంకుమధారణ వలన పుష్టి, భక్తి, ఐశ్వర్యం మొదలైనవి కలుగుతాయి.

Read More

భీష్మాష్టమి

భీష్మాష్టమి 

మాఘ శుద సప్తమి మొదలు ఏకాదశి వరకు అయిదు రోజులను 'భేష్మ పంచకం' అంటారు. 

కాల నిర్ణయ చంద్రిక, నిర్ణయ సింధు, ధర్మ సింధు,కాల మాధవీయం, ......లాంటి గ్రంధాలన్నీ మాఘ శుద్ధ అష్టమినే భీష్మ నిర్యాణ దినముగా వివరించినాయి. భీష్మునికి ఆరోజే తర్పణలు విడిచిపెట్టాలని చెప్పినాయి. ముక్యంగా సంతానము కోరుకొనేవారికి ఈరోజు చాల ముక్యమయినది. భీష్మాష్టమి నాడు తిల అంజలి సమర్పించి, భీష్ముడిని స్మరించేవారికి సంతానప్రాప్తి కలుగు తుందని హేమాద్రి పండితుడు తన గ్రంధాలలో చెప్పినాడు. శ్రాధము కూడా పెడితే మంచిదని పద్మ పురాణము చెబుతున్నది. సంవస్చర పాపం పోవాలంటే ఆనాడు భీష్ముడికి జలాంజలి సమర్పించాలని భారతము చెప్పింది. అందుకే మాఘ శుద్ధ ఏకాదశికి 'భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది.
 

Read More

గౌరీదశకమ్


గౌరీదశకమ్

లీలారబ్ధస్థాపితలుప్తాఖిలలొకాం
లొకాతీతైర్యోగిభిరన్తశ్చిరమృగ్యామ్|
బాలాదిత్యశ్రెణిసమానద్యుతిపుంజాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె||౧||

తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్యసమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజాం
నిత్యం చిత్తే నిర్వృతికాష్టాం కలయంతీమ్|
సత్యజ్ఞానానన్దమయీం తాం తనురూపాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె||౨||

ప్రత్యాహారము-ధ్యానము-సమాధి అనుయోగముల నాచరించు యోగుల మనస్సునందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునదీ, సత్యము- జ్ఞానము- ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మరూపమున్నదీ, పద్మములవంటి కన్నులు కలదీ,అగు జగదంబయైన గౌరీదేవిని నేనుస్తుతించుచున్నాను.

చన్ద్రాపీడానన్దితమన్దస్మితవక్త్రాం
చన్ద్రాపీడాలంకృతనీలాలకశొభామ్|
ఇంద్రొపెంద్రాద్యర్చితపాదామ్బుజయుగ్మాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె||౩||

చంద్రచూడుడగు శివునిచే ఆనందింపచేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు- విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ఆదిక్షాన్తామక్షరమూర్త్యా విలసన్తీం
భూతె భూతె భూతకదంబప్రసవిత్రీమ్|
శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే||౪||

'అ' కారము మొదలు 'క్ష' కారము వరకు ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచమహాభూతములలో (భూమి- నీరు- గాలి- అగ్ని- ఆకాశము) ప్రతి దానియందు అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మస్వరూపిణియైనదీ, ఆనందముతో నండినదీ మెరుపువలే ప్రకాశించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీ దేవిని నేను స్తుతించుచున్నాను.

మూలాధారాదుత్థితవీథ్యా విధిరన్ధ్రం
సౌరం చాన్ద్రం వ్యాప్య విహారజ్వలితాఙ్గీమ్|
యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం
గౌరీమంబామమ్బురుహాక్షీమహమీడే||౫||

సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాదారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సూర్య చంద్రస్థానములైన 'ఇడా' 'పీంగళా' నాడుల యందు విహారించు తేజోమూర్తియైనదీ, సూక్ష్మమైన పధార్థము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మముల వంటి కన్నుల కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని స్తుతించుచున్నాను.

నిత్యః శుద్ధో నిష్కల ఎకో జగదీశః
సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ|
విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౬||

నిత్యుడు- శుద్దుడు- పరిపూర్ణుడు- ఒక్కడు- జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవిని చేయు సృష్టి స్థితిలయలకు సాక్షి, ప్రపంచరక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్య యైనదీ, పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

యస్యాః కుక్షౌ లీనమఖణ్డం జగదణ్డం
భూయోభూయః ప్రాదురభూదుత్థితమేవ|
పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరన్తీం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౭||

గౌరీదేవి గర్భమునందున్న సమస్తలోకములు మరల మరల పుట్టుచుండును. లీనమగుచుండును. భర్తతో కలిసి వెండికొండపై విహరించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా
సూత్రే యద్వత్ క్వాపి చరం చాప్యచరం చ|
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౮||

చరాచరరూపమైన ఈ ప్రపంచమంతయు, దారము నందు మణులవలే గౌరీ దేవియందు అల్లుకుని ఉన్నది. అద్యాత్మజ్ఞానమార్గముచే తెలుసుకొనదగినదీ, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

నానాకారైః శక్తికదమ్బైర్భువనాని
వాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా|
కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౯||

గౌరీదేవి తాను ఒక్కతేగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో లోకములనన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించిచున్నది. కళ్యాణస్వరూపిణి, భక్తుల పాలిట కల్పలత, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ఆశాపాశక్లేశవినాశం విదధానాం
పాదామ్భోజధ్యానపరాణాం పురుషాణామ్|
ఈశామీశార్ధాఙ్గహరాం తామభిరామాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౧౦||

తన పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశములవలన కలుగు బాధలను నశింపచేయునదీ, పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా-
ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః|
వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం
తశ్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి||౧౧||

ఎవరైతే శుద్ధమైన హృదయమును కలవాడై భక్తితో ప్రాతఃకాలమునందు ఈ గౌరీ దశకమను స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్దినీ, ఉన్నతమైన సంపదను, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.

హర హర శంకర జయ జయ శంకర
హర హర శంకర జయ జయ శంకర!!

Read More

శ్రీ లలితా పంచరత్నమ్

శ్రీ లలితా పంచరత్నమ్

ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం
బిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్|
ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం
మన్దస్మితం మృగమదొజ్జ్వలఫాలదేశమ్||౧||

దొండ పండు వంటి క్రింది పేదవి, పేద్ద ముత్యముతొ శొభించు చున్న ముక్కు, చేవులవరకు వ్యాపించిన కన్నులు, మణి కుండలములు, చిరున్నవ్వు, కస్తూరి తిలకముతొ ప్రకాశించు నుదురు కలిగిన లలితా దేవి ముఖారవిందమును ప్రాతః కాలమునందు స్మరించుచున్నాను.

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాఙ్గుళీయలసదఙ్గుళిపల్లవాఢ్యామ్|
మాణిక్యహేమవలయాఙ్గదశొభమానాం
పుణ్డ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్||౨||

ఏర్రని రత్నములు కూర్చిన ఉంగరములు ధరించిన వ్రేళ్లు అను చిగురుటాకులు కలదీ, మాణిక్యములు పొదిగిన కంకణములతొ శొభించుచున్నదీ, చేరకువిల్లు-పుష్పబాణము-అంకుశము ధరించినదీ అగు లలితాదేవి భుజములను కల్పలతను ప్రాతః కాలమునందు సేవించుచున్నాను.

ప్రాతర్నమామి లలితాచరణారవిన్దం
భక్తేష్టదాననిరతం భవసిన్ధుపొతమ్|
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాఙ్కుశధ్వజసుదర్శనలాఞ్ఛనాఢ్యమ్||౩||

భక్తులకొరికలను ఏల్లప్పుడు తీర్చునదీ, సంసార సముద్రమును దాటించుతేప్పయైనదీ, బ్రహ్మ మొదలగు దేవనాయకులచే పూజింపబడునదీ, పద్మము-అంకుశము-పతాకము-చక్రము అను చిహ్నములతొ ప్రకాశించుచున్నదీ అగు లలితాదేవి పాదపద్మమును ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.

ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యన్తవేద్యవిభవాం కరుణానవద్యామ్|
విశ్వస్య సృష్టివిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్||౪||

వేదాంతములచే తేలియబడు వైభవము కలదీ, కరుణచే నిర్మలమైనదీ, ప్రపంచము యొక్క సృష్టి-స్థితి-లయలకు కారణమైనదీ,విద్యలకు అధికారణీయైనదీ, వేద వచనములకు మనస్సులకు అందనిదీ, పరమేశ్వరియగు లలితాభవానీ దేవిని ప్రాతః కాలము నందు స్తుతించుచున్నాను.

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి|
శ్రీశామ్భవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి||౫||

ఒ లలితాదేవి| కామేశ్వరి-కమల-మహేశ్వరి-శ్రేఏశాంభవి-జగజ్జనని-వాగ్దేవత-త్రిపురేశ్వరి అను నీ నామములను ప్రాతఃకాలము నందు జపించుచున్నాను.

యః శ్లొకపఞ్చకమిదం లలితామ్బికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే|
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనన్తకీర్తిమ్||౬||

సౌభాగ్యము నిచ్చునదీ,సులభమైనదీ అగు లలితా పంచరత్నమును ప్రాతఃకాలము నందు ఏవడు పఠించునొ వానికి లలితాదేవి శీఘ్రముగా ప్రసన్ను రాలై విద్యను,సంపదను,సుఖమును,అంతులేని కేఏర్తిని ప్రసాదించును.


జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
 

Read More

ఆంజనేయుడికి ఇష్టమైన పుష్పాలు?


ఆంజనేయుడికి ఇష్టమైన పుష్పాలు?

వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||
ఆంజనేయ స్వామి వసంతఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో, దశమి తిథి, శనివారం, పూర్వాభాధ్రా నక్షత్రంలో, వైధృతౌ మధ్యాహ్న కాలంలో అంజనీదేవికి జన్మించాడు. ఆంజనేయుడు అంజనాదేవి, కేసరుల ముద్దుబిడ్డ. సదా రామనామామృతపాలన సేవితుడై గంధమాధశైలి యందు వసించు చిరంజీవి. ఆంజనేయ నామమహిమ అనితరమైనది.

అలాంటి మృత్యుంజయుడైన ఆంజనేయుని పొన్నపువ్వు, మొగలి, పొగడ, నంధివర్ధనం, మందారం, కడిమి, గజనిమ్మ, పద్మం, నల్లకలువ, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం, ఎర్ర గన్నేరు, కనకాంబరం, ములుగోరిట, మెట్ట తామర, పొద్దు తిరుగుడు, మంకెన, బండికెరి వెంద, అడవిమల్లె, కొండగోగు దింటెన, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, జిల్లేడు, చంధ్త్ర కాంత, సురపున్నాగ, కుంకుమ పువ్వు మొదలైన పుష్పాలు అంటే ఇష్టం.

అలాగే తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, తమలాపాకులు కూడా ఆంజనేయునికి ప్రీతికరమైనవి అని పైన వివరించవడిన పుష్పాలు, పత్రాలతో స్వామివారి పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అని పండితులు అంటున్నారు.

Read More

మహాశివరాత్రి మహాశివరాత్రి వృత్తాంతం


మహాశివరాత్రి 

మహాశివరాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణ మహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శాపము

శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానము లో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు.

మొగలి పువ్వుకు శాపము

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము

అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

శివరాత్రి పర్వదినం

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు , దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

జాగరణము

జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము
 

Read More

'శివం' అంటే మంగళం అని అర్థం


'శివం' అంటే మంగళం అని అర్థం. ఆదిదేవుడైన పరమేశ్వరుడు మంగళప్రదాత. ఆద్యంతాలు లేని జ్యోతిస్వరూపుడు. సృష్టిలోని ప్రతి అణువూ పరమేశ్వరుడే కొలువైవుంటాడు. పరిపూర్ణ పవిత్రత, పరిపూర్ణ జ్ఞానం, పరిపూర్ణ సాధనగల భక్తవత్సలుడు వేదాల్లో రుద్రునిగా కీర్తించబడ్డాడు. 

ఇకపోతే.. శివ అంటే శ+ఇ+వ గా వర్గీకరించారు. 'శ' కారము పరమానందాన్ని, 'ఇ' కారము పరమ పురుషత్వాన్ని, 'వ' కారము అమృత శక్తిని సూచిస్తుంటాయి. 'శివౌ' అంటే పార్వతీ పరమేశ్వరులని అర్థం. 

సూర్యుని నుంచి వెలుగును, చంద్రుని నుంచి వెన్నెలను, అగ్ని నుంచి వేడిని విడదీయలేని విధంగా శివశక్తులది అవినాభావ సంబంధం. నిత్యానంద స్వరూపుడైన శివుడు సృష్టి, స్థితి, లయ, తిరోభావ, అనుగ్రహాలనే జగత్కార్యాలను చక్కబెడుతుంటాడు.
 

Read More

యదువంశ విస్తరణ-శ్రీ విష్ణు పురాణము


యదువంశ విస్తరణ-శ్రీ విష్ణు పురాణము

పూర్వమొకప్పుడు హిరణ్యకశిపుడను రాక్షసరాజుగా పుట్టి, నరసింహావతార ఘట్టమున స్రీహరిచే చంపబడిన రాక్షసుడే చేదిరాజైన దమఘోషునికి శిశుపాలుడుగా జన్మించాడు. కరూష దేశాధీశుడైన వృద్ధ ధర్మునికి దంతవక్త్రుడు జన్మించాడు. వీడే పూర్వజన్మలో హిరణ్యాక్షుడు. వీరు ఈ జన్మలతో గూడ హరిపై ద్వేషముపూని, చివరికి ఆ హరిచేతనే నిర్జించబడ్డారు. పగచేత అయినా గానీ, కీర్తింపబడి - స్మరించబడినచో భగవంతుడు అట్టివారికైనా విష్ణుసాయుజ్యమిస్తాడని వీరి చరిత్రలు తెల్పుతాయి.

అసలు ఈ శ్రీకృష్ణుని జననమే అత్యంత ఆశ్చర్యాతిశయముతో కూడినట్టిది.

ఈ పుండరీకాక్షుడు అవతరిస్తుండగా, సూర్యచంద్ర గ్రహాలన్నీ సుప్రసన్నమయ్యాయి. జగత్తంతా అధర్మాలకు దూరంగా - భయరహితంగా ఉంది. అతడు జన్మించిన మరుక్షణం నుంచే ఈ జగత్తును సన్మార్గంలో పెట్టసాగాడు.

మానుషవేషధారి అయిన ఆ లీలావిగ్రహానికి 16, 100 మంది భార్యలు. వారుగాక అష్టసంఖ్యలో పట్టపురాణులు. అనాది అయిన ఆ దేవదేవునికి ఒక లక్షా ఎనబైవేలమంది సంతానం. వీరిలో ప్రధానంగా ప్రద్యుమ్నాదులు 13 మంది. అనేక శతసహస్తపురుషసంఖ్యాక మీ యదుకులం. హరివంశ విస్తరణవర్ణనకు నూరేళ్ల కాలపరిమితి కూడా సరిపోదు.

ఇటుపై - మహానందులు, శిశునాగవంశం వారు మొదలగు భవిష్యద్రాజులను గూర్చి తెలుపబడింది.

(మౌర్య, శుంగ, ఆంధ్ర, ఆభీర, నాగవంశాలను గూర్చి తెలిపే 24వ అధ్యాయంలోని భవిష్యద్రాజుల చరిత్రం ఆనాడే కథితమైంది. విశేషలు ఇవ్వబడ్డాయి.)

సేనాధిపతి అయి నపుష్యమిత్రుడు తన ప్రభువునే చంపి రాజవుతాడు. అతని పుత్రుడు అగ్నిమిత్రుడు, సుజ్యేష్ఠుడు, వసుమిత్రుడు, ఉదంకుడు, పుళిందకుడు, ఘోషవసువు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి ఈ క్రమంలో శుంగవంశపు రాజులు 112 ఎళ్లు ఉంటారు. అటుపైన కాణ్వరాజులు ఈ భూమిని పాలిస్తారు.

శుంగరాజు దేవభూతి వ్యసనపరుడైనందున, అతని మంత్రి కాణ్వవసుదేవుడు అతడ్ని చంపి రాజవుతాడు. ఇతని పుత్రుడు భూమిత్రుడు, నారాయణుడు, సుశర్మ, వీరు 40 ఏళ్లు..సుశర్మను అతని సేవకుడు బలిపుచ్ఛకుడనేవాడు చంపి ప్రభువవుతాడు. తదుపరి వీడి తమ్ముడు కృష్ణుడనేవాడు రాజవుతాఅడు. తర్వాత ఆంధ్రరాజులపరిపాలన (458 సం||లు) ముప్పయిమంది ద్వారా సాగుతుంది. తరువాత వీరిభృత్యులు ఏడుగురు అభీరాదులు, పదిమంది గద్దభులు రాజులు, ఆ తర్వాత 16 మంది రాజులు.

అటుపైన ఎనిమిది మంది యవనరాజులు, 14 మంది తురుష్క రాజులు, 13 మంది ముండులు, 11 మంది మేనులు భూమిని దాదాపు వెయ్యేళ్లకు పైన 90 సంవత్సరములు పరిపాలిస్తారు. (ఇంతవరకు పేర్లు చెప్పబడి, ఇటుపైన పేర్లు చెప్పక కేవలం సంఖ్య మాత్రమే చెప్పబడటం గమనార్హం!) అటుపైన మూడువందల సంవత్సరాలు పౌరరాజులు పాలిస్తారు.

ఆ తరువాత కైంకిలురనే యవనులు పట్టాభిషేక రహితులు భూమిని పాలిస్తారు. వారి సంతతి 106 సంవత్సరాలు. ఆ పైన వారి పుత్రులు 13 మంది, బాహ్లికులు ముగ్గురు, పుష్యమిత్ర వటుమిత్రాదులు పదమూడుమంది. ఏకలులు ఏడుగురు ఆంధ్రులు, కైవర్త పటుపుళింద బ్రాహ్మణులును రాజులవుతారు.

ఈ క్షాత్రులనందరినీ లేవగొట్టి నవనాగులు; పద్మావతీపురం రాజధానిగా గయనుంచి, గంగా ప్రయాగ పర్యంతం గల భూమినంతటినీ మాగధేయులు అనుభవిస్తారు. కోసల, ఆంధ్ర, పుండ్ర, తామ్రలిప్త పురాలను దేవరక్షితుడు పాలిస్తాడు.

కళింగ, మాహిష, మాహేంద్ర, భౌమములను గుహులను రాజులు అనుభవిస్తారు. నైషధ, నైమిష, కకాల, కోశకాది జనపదాలను మణిధాన్యక వంశీయులు అనుభవిస్తారు. సౌరష్ట్ర, అవంతిక, శూద్ర, అభీర రాజ్యాలను వ్రాత్యద్విజులు ఏలుతారు. సింధునదీతీరం, కాశ్మీరం వరకు గల దేశాన్ని వ్రాత్యమ్లేఛ్ఛ శూద్రాదులు పరిపాలిస్తారు. (పంచుకొంటారు) సమకాలీన ప్రభువులు వీరు.

ఈ రాజులలో అధికబాగం స్త్రీ, బాల, గోవధ, పరధనాపహరణాది అకృత్యాలపట్ల ఆసక్తిగలవారు. అధర్మపరాయణులు. దయ కొంచెంగా - కోపం అధికంగాగలవారు వీరు. అల్పసారంగలవారు, అల్పాయుష్కులు. లుబ్ధులు. కోరికలు అధికం. బలవంతులు. మ్లేచ్ఛాచారులు, ఇష్టానుసార వర్తనులై సంచరిస్తూంటారు.

Read More

రామరామ

రామో దాశరధి శూరో లక్ష్మనానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘూత్తమః
వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీ వల్లభః శ్రీమాన ప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః

రామ, దాశరధి, శూర, లక్ష్మణానుచర, బలి, కాకుత్స,
పరమ పురుష, పూర్ణ, కౌశల్యేయ, రఘుత్తమ, వేదాంత వేద్య,
యజ్ఞే శ, పురాణ, పురుషోత్తమ, జానకీ వల్లభ, శ్రీమాన్ అప్రమేయ, పరాక్రమ -- యీ నామాలను నిత్యం భక్తి ప్రపత్తులతో జపించే భక్తుడు ఆశ్వ మేధ యాగం కన్నా మిన్న మైన అధిక ఫలం పొందుతాదనడంలో సందేహం లేదు

Read More

స్త్రీని గౌరవించి, పూజించడమే మన సంప్రదాయం

స్త్రీని గౌరవించి, పూజించడమే మన సంప్రదాయం

ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోను మహిళల్ని అణచివేయడం గమనించవచ్చు. వారు సంఘ పరంగా అనేక వివక్షల్ని ఎదుర్కొంటారు. ఇక ఆధ్యాత్మికంగా స్త్రీలకు ఎన్నో విధి నిషేధాలు ఉన్నాయి. కాని, భారతదేశంలో, అందునా ఆర్య సంస్కృతిలో మాత్రం స్త్రీకి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. నిజమైన సంప్రదాయాన్ని పాటించే వారెవరూ స్త్రీని కించపరిచే విధంగా ప్రవర్తించలేరు. అదే భారతీయ సంస్కృతి విశిష్టత. 

ఆధ్యాత్మిక పరంగా చూసినా కూడా స్త్రీది విశిష్ట స్థానమే. మిగతా దేవుళ్ళు, దేవతలు ఎందరు ఉన్నా ఆదిపరాశక్తిదే అగ్రస్థానం. మొదటి పూజ కూడా ఆ జగన్మాతకే. కుటుంబంలో మరలా తల్లిదే అగ్రస్థానం. ముందుగా ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి తలుచుకుని, మిగతా వారిని నిర్లక్ష్యం చేయమని ఆర్య జీవన విధానం నేర్పదు. కంటికి ఎదురుగా కనిపించే తల్లిదండ్రుల్నే ప్రత్యక్ష దైవాలుగా భావించమని చెబుతుంది వేదం. వారిలో తల్లికే మొదటి పూజ. 'మాతృ దేవోభవ' - ముందు తల్లికి నమస్కరించిన తరువాత తండ్రికి 'పితృ దేవోభవ'. యజ్ఞ యాగాదులలో, పూజలు, క్రతువులలో పాల్గొనడానికి వివాహితుడు కాని వారికి, భార్యా వియోగం అయిన వారికి అర్హత లేదు. భార్యతో కలిసి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తేనే పూర్తి ఫలం దక్కుతుంది. అదీ స్త్రీకి ఉన్న ప్రాధాన్యత. 

ఇవన్నీ ఒక ఎత్తయితే, మనకు ఏ సంబంధం లేని పరాయి స్త్రీని కూడా మాతృ సమానురాలిగా, సోదర సమానురాలిగా చూడమని చెబుతుంది వేదం. పృధ్వీరాజ్‌ ఛౌహాన్‌, శివాజీ వంటి వీరులు కూడా తాము జయించిన రాజ్యంలోని పాలకుల భార్యలను సోదరి సమానంగా భావించి, సకల లాంఛనాలతో వారి రాజ్యాలకు సాగనంపారు. అదీ ఆర్య సంస్కృతి ఆచరణ అంటే.. 

యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతా||

''స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటారనేది'' ఆర్యోక్తి. మహిళకి భారతదేశంలో ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది. కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరి ఉండనొల్లదు అనే భావన కూడా మహిళకు ఆర్య సాంప్రదాయంలో ఉన్న విశిష్టతను తెలియజేస్తుంది. ప్రస్తుతం మనం జరుపుకుంటున్న దేవీ నవరాత్రులు కూడా మహిళా శక్తి గొప్పదనాన్ని, మహిమను చాటిచెబుతాయి. స్త్రీని శక్తి స్వరూపిణిగా, పరాశక్తిగా, సృష్టి స్థితి లయలకు కారకులైనవారికి కూడా తల్లిగా పురాణాలు కీర్తిస్తున్నాయి. విశ్వానికి అంతటికీ ఆధారభూతమైన, కారణమైన ఆ మహాశక్తి పురుష రూపంలో ఉండే అవకాశం లేదని రుషుల భావన. ఇంతటి మహావిశ్వాన్ని సృజించి, పెంచి, పోషించి, మరలా తనలోనే లయింపజేసుకొనే అన్ని శక్తుల మూల కారణం స్త్రీ స్వరూపమే. జగమంతటిలో ఉన్న ఇన్ని ప్రాణులకు అవసరమైనవన్నీ ఇచ్చి, చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు ప్రతి పూటా అన్నిటికీ ఆశ్రయమిచ్చి, ప్రాణం నిలవడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసి, తన చల్లని ఒడిలో లాలించి, పాలించి, తల్లి ప్రేమను పంచే ఆ మహాశక్తి ముమ్మాటికీ అమ్మ మాత్రమే అయి ఉంటుంది. ఎందుకంటే అంతటి ప్రేమను పంచి, అనురాగాన్ని కురిపించగలగడం తల్లికి మాత్రమే సాధ్యం. తండ్రి కేవలం బాధ్యత వహిస్తాడు. కాని, తల్లి తన జీవితాన్ని అర్పిస్తుంది. అందుకే విజయదశమికి అమ్మవారిని భావన చేస్తాము.

స్త్రీని గౌరవించని, ఆమెకు ప్రాధాన్యమివ్వని ఏ నాగరికత అయినా, సమాజం అయినా మనుగడ సాగించలేదు. ఆమె సహకారం లేకుండా ఏ క్లిష్టమైన పనీ సాధ్యపడదు. ప్రతి ఇంటిలోను ఇంటిని చక్కబెట్టే ఇల్లాలిగా, పిల్లల్ని సంస్కారవంతులుగా, ఉన్నత సమాజ పౌరులుగా మార్చే గురుతరమైన బాధ్యత స్త్రీదే. ఏ ఇంటిలో స్త్రీ మానసిక, శారీరక వ్యధ అనుభవిస్తుందో ఆ కుటుంబం నుండి వచ్చే సంతానం నేరస్తులుగా మారే ప్రమాదం అంత ఎక్కువగా ఉందనేది సామాజిక నిపుణుల పరిశీలనలో తేలిన వాస్తవం. అది ముమ్మాటికీ నిజం కూడా. 

పత్రికల్లోను, తెర మీద కనబడే రంగుల వలయాల్లో బొమ్మల్ని చూసి, గోల చేస్తూ, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, నీచమైన ఆనందం పొందే నేటి తరానికి ఈ విలువల ప్రాధాన్యం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్ల అంటే వ్యాపార వస్తువు కాదు, మగవారి కోర్కెలు తీర్చే బానిసా కాదు. బస్సుల్లో, రైళ్ళల్లో, రోడ్లమీద, కాలేజీల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ కంటికి కాస్త నదురుగా కనబడే ప్రతి ఆడపిల్లను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండేవారికి ఈ దేవీ నవరాత్రులలో స్త్రీశక్తి ప్రాధాన్యతను తెలపాలి. ఆడపిల్ల కనపడిందంటే చాలు, ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి, తామేదో గొప్ప వీరప్రేమికుల స్థాయిలో పోజలు కొట్టే వారికి, నిజమైన ప్రేమ రుచి చూడాలంటే అదే అమ్మాయిని మాతృ సమానంగా, సోదరి సమానంగా చూస్తే చాలు. అప్పుడే ఆమె నిజమైన ప్రేమను కురిపిస్తుంది. ఆడదంటే అబల కాదు, అవసరం వచ్చినపుడు ఆమే పరాశక్తిగా మారి దుష్ట సంహారం చేసి, లోక రక్షణ చేస్తుందనే సందేశాన్ని సకల లోకానికి తెలపడమే ఈ దేవీ నవరాత్రుల ముఖ్య ఉద్దేశం. ఈ సందేశం కేవలం భారతదేశానికే కాక, సకల ప్రపంచానికి కనువిప్పు కావాలని ఆశిద్దాం.
 

Read More

శ్రీ శివ మహాపురాణము వీరభద్రుడి విజృంభణం-శ్రీ శివ మహాపురాణము


శ్రీ శివ మహాపురాణము

వీరభద్రుడి విజృంభణం-శ్రీ శివ మహాపురాణము

'హర హర మహాదేవ శంభో' అంటూ కదిలిన రుద్రగణాలు వీరభద్రుని ఆధ్వర్యంలో అచిరకాలంలోనే యాగ వాటికను చేరుకో సాగాయి.

తామర తంపరగా వచ్చి చేరుతున్న ఆ రౌద్రాకృతులను చూస్తూనే, చాలామందికి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. అంతవరకూ బింకంగా నిలిచిన దక్షుడు సైతం విష్ణుచరణ కమలాలపై వ్రాలి శరణువేడాడు.

"దక్షా! ఇప్పుడు వగచి ప్రయోజనం లేదు. పూజనీయుల్ని పుజింపకుండుట - అపాత్రుల్ని అదరించుట ఎక్కడ జరిగితే, దారిద్ర్యం - మరణం - భయం మూడూ కలిసినట్లుగా వచ్చి బాధిస్తాయట!

"ఇప్పుడిక్కడికి వేంచేస్తున్న గణాచారులు కోటానుకోట్ల రుద్రశక్తులై, సాక్షాత్తు రుద్రలవలె భాసిస్తున్నారు. వెంటనే శరణువేడుకో! నిన్ను సమర్ధించినందుకు, విపత్తు కొనితెచ్చుకున్న మనమందరం కాస్త తెప్పరిల్లవచ్చు! ఏదో యజ్ఞధర్మాల్నీ యాజ్ఞికుల్నీ కనిపెట్టి ఉంటానన్న నామాట ఇంతవరకూ నీపట్ల కూడా చెల్లించాను. దధీచి మహాముని నిన్ను తూలనాడి వెళ్లిపోయినపుడే నేనూ వెళ్లిపోవలసింది.." అలా విష్ణువు అనేసరికి, దక్షుడికి కాళ్లూ చేతులూ ఆడడం మానేశాయి. తాను ఎంతో నమ్ముకున్న ఈ వెన్నుడు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయాడు గదా! అని కూడా భయపడసాగాడు దక్షుడు.

అది కనిపెట్టినవాడిలా విష్ణుమూర్తి దక్షుడికి అభయం ఇస్తూ ఇంత జరిగినా నీ పంతం నీదే అంటావు తప్ప, శివుని శరణు కోరడానికి ఒప్పనంటావు! నిజమేలే! వైరికి వెన్ను ఇచ్చి వెనుదిరిగిపోవుట భీరువుల లక్షణం! జరిగేది జరగక మానదు. ఏం జరిగినా, అదంతా పరమేశ్వర కృత్యం అని సమాధానపడు! అంతకంటే ఇపుడు చెయ్య గలిగిందేమీలేదు. అదుగో! వీర విజృంభకుడై వీరభద్రుడూ, మరో వైపునుంచి మహాకాళీ గణవాహనీ మీదపడుతున్నారు" అని విష్ణువు అంటూ ఉండగానే ధూళి ఎగసి కారుమేఘాల్ని తలపించేరీతిలో ముప్పేట ముట్ట్డిడి కొనసాగించాయి రుద్రగణాలు.

మళ్ళీ దక్షుడు దీనంగా దేవతలందరినీ పేరు పేరునా ప్రార్థించాడు. "మీ మీ భుజబల, శౌర్య, ధైర్యాదుల అండ చూసుకొనే నేనీ యాగం ప్రారంభించాను. ఓ దేవరాజా! ఉపేంద్రుడు అలా ఉపేక్ష వహించాడు. ఇక నీవే నన్ను కపాడగల సమర్థుడవు" అంటూ ఇంద్రుని వేడుకున్నాడు.

మూడుకోట్ల దేవతలూ తన ఆధీన వర్తునులై చరించేటంత బలం తనకూ ఉండగా, రుద్రకోటి సైన్యాన్ని తరిమి కొట్టలేమా? అనే ధీమాతో సమరశంఖం పూరించాడు ఇంద్రుడు. తాను ఐరావతాన్ని అధిరోహించాడు. తమ సైన్యాన్ని మొత్తం సమరానికి సమాయత్తం చేశాడు. సురపతి చెలరేగడం చూశాక, దేవతలందరూ కదనానికి సంసిద్ధులు కాక తప్పదని భావించారు. వరుణుడు మొదలైన దిక్పాలకులు తమతమ వాహనాలపై అధిరోహించారు. కుబేరుడు తన పుష్పకం ఎక్కి, యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులను ఉత్సాహపరిచాడు. దిక్పాలురలో కుబేరునికి ప్రత్యేక గౌరవం ఉన్నది. ఆయన ధనాధిపతి కూడా! పైగా.. ఈశ్వరునికి అత్యంత సన్నిహితుదు. అటువంటి వాడే యుద్ధానికి తలపడినపుడు, తాము నిమ్మళంగా ఉండడం నమ్మక ద్రోహమేనని భావించారు దేవతలు. వారు కూడా తమ తమ వాహనాలను అధిరోహించారు.

సమర సన్నాహంలో అమరులు

వాళ్లంతా అలా వాహనాలు ఎక్కడం చూశాక, వారు గృహోన్ముఖులై వెళ్లిపోతారేమోనని భయం కల్గింది దక్షుడికి. దగ్గరగా ఉన్న ఓ దిక్పాలకుని రెండు చేతులనూ దీనంగా పట్టుకొని, "మీరే నాకు దిక్కు" అన్నాడు దక్షుడు.

అతడు వరుణుడు. మొసలిపై అధిరోహించాడు. దక్షుడికి అభయం ఇస్తూ "దక్షప్రజాపతీ! దిగులు చెందవలదు! కేవలం ఒక్క దిక్పాలకునిగా కాదు! మా సప్తదిక్పాలకుల తరుపున నీకు అభయం ఇస్తున్నాను.." అని మిగిలిన దిక్పాలురతో కలిసి తలొక దిక్కునూ రక్షించడానికి సమాయత్తమయ్యాడు.

ఈశానుడైన పరమశివుని దిక్కు వైపునుండి వీరభద్రుడు, భీకరోత్సాహియై రూక్ష వీక్షణనేత్రాలు విస్ఫుల్లింగాలు చెలరేగుతుండగా దక్షవాటికలోకి ప్రవేశించాడు. వస్తూనే అతడి వెంటున్న రుద్రగణాలు ఎడాపెడా దేవతల మీద విరుచుకుపడ్డాయి. ఋత్విక్కులూ - ఋషులూ కకావికలై చెదిరిపోయారు.

మామూలు దేవతలు రుద్రగణాల వీరావేశానికి చెల్లచెదురై, అమరపురికి పారిపోగా దిక్పాలకులు మాత్రం తమ అస్త్ర శస్త్ర నైపుణ్యం ప్రదర్శించసాగారు. వాయువు తన వాహనమైన లేడి (మృగం)ని వదిలేసి, తానొక మహా ఝంఝామారుతమై కొందరు రుద్రగణాల్ని సప్తసముద్రాల అవతలకు ఎగరగొట్టాడు. అగ్ని అన్నివైపుల నుంచి కమ్ముతూ కొందర్ని నిర్దాక్షిణ్యంగా దహించేశాడు. వరుణుడు మహ జలధారలతో, కొందరు గణాచారులను వరదల్లో కొట్టుకుపోయేలా చేశాడు.

ఇక ఇంద్రుడు వజ్రాయుధంతో ఎందర్ని ఏకధాటిన నరికినదీ లెక్కేలేదు. అయినప్పటికీ - విజయం మాత్రం దేవతల పక్షాన కనుచూపు మేరలో లేదు. దానిక్కారణం.. అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్న రుద్రగణాలే! ఋషులంతా సమావేశమై తీవ్రాలోచన చేశారు. శాంతి కాముకులైన బ్రాహ్మణశ్రేష్ఠులను, యజ్ఞకర్తలను, మహారుషులను ఏమీ అనరాదన్న శివాజ్ఞవల్ల వారు ఇంకా అక్కడ ఉండగలిగారే తప్ప, లేకుంటే... వీరభద్రుడి వీరవిహారానికి దేవతలతో పాటు, దొరికినచోటుకి పారిపోయేవారే!

మునులందరి తరుపునా, ముముక్షు మునివరేణ్యుడు ముకుందుని ముందు మోకరిల్లి మరీ ప్రార్ధించాడు. "వైకుంఠవాసా! నీవు ఇప్పటికైనా కలుగజేసుకోని పక్షంలో - ఇంకా ఘోరాలు జరిగిపోయేల వున్నాయి. దిక్పాలకులు సైతం దిగంతాలు పట్టేసేలావున్నారు" అంటూ మొరపెట్టాడు.

దక్షుని ఏదోలా మందలించి మభ్యపెట్టి, ఈ క్షణం వరకూ నెట్టుకొచ్చినా, ఆ పుండరీకాక్షునికి.. మహర్షుల మ్లాన వదనాలు చూశాక మరి ఆగాలనిపించలేదు.

శివుని అనుచరులు కూడా, అపరశివులవలె కనిపించసాగారు. ఒక్కొక్కరూ పంచముఖాలతో, దశబాహువులతో, జటాజూటాలతో, రుద్రాక్ష మాలలు - విభూతి పూతలతో, శూల - పాశాది ఆయుధాలతో భయంకర రూపాలు కలిగి చెలరేగుతూన్న శివగణాలను - భృగుమహర్షి మంత్రబలం వల్ల మట్టుబెడతూ, అంతవరకూ ఏదోలా యుద్ధాన్ని నెట్టుకొచ్చిన నైరృతి (ఇతడు రాక్షసాంశయందు జనించియు, తన విశేష పరక్రమముచేత ఇతర దిక్పాలకులవలె దేవతల పక్షం అలవం బించిన వాడు) సైతం నారాయణుడినే శరణువేడాడు.

దేవతల గురువైన బృహస్పతి, మరొకవైపు రుద్రగణాలతో పోరుతున్న ఇంద్రుని వారించి "అకారణమైన కక్షపూనావు. దేవతలందరికీ చేటు తెస్తున్నావు. సమస్తకర్మల ఫలితాన్ని ఇచ్చే ఈశ్వరునితో వైరమా? ఈ గణాచారుల ముందు మనం నిలవగలమా? కాస్త సంయమనం పాటించాలి!" అంటూ బుద్ధులు బోధించసాగాడు.

యజ్ఞమూర్తి శ్రీ మన్నారాయణుడు దేవతల; దిక్పాలకుల; ఋషుల అవస్థలను ప్రత్యక్షంగా చూస్తూ ఉండికూడా, ఇక కల్పించు కోకపోతే వారు బాధపడతారని భావించి పాంచజన్యం పూరించాడు.

Read More

ఆంజనేయస్వామి దండకము- చదవండి భుత, ప్రేత, పిశాచాదుల యందు భయాన్ని వదలండి

ఆంజనేయస్వామి దండకము- చదవండి భుత, ప్రేత, పిశాచాదుల యందు భయాన్ని వదలండి


Read More--
kishore always with u....!
Read More

అహొబిల మహత్యం

అహొబిల మహత్యం

ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసిం హ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి.రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సం హరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్ధలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్ధల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు "బ్రహ్మండపరాణం" అంతర్గతంలో 10 అధ్యాయాలు.1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది.

కృతయుగం నందు హిరణ్యకశ్యపుని సం హర అనంతరం పేట్రేగిన కోపంతో నున్న ఉగ్ర నరసిం హ స్వామిని శాంతింప చేయుటకు పరమశివుడు, నృసిం హ మంత్రరాజుమును "మంత్రరాజ పద స్తోత్రం" గా స్తుతించి నృసిం హుని శాంతింపజేసినట్లు "బ్రహ్మాడపురాణం" లో కలదు. అందుకే ఎగువ అహోబిలం నందు గర్భగుడి ప్రక్కగుహలో జ్వాలా నరసిం హ స్వామిని పరమశివుడు ఆరాధించినట్లుగా మనకు దర్శనమిస్తున్నారు.

"విష్ణుపురాణం" నందు శేషధర్మము 70 అధ్యాయం లో "విరుద్ధ ధర్మ ధర్మిత్వం" లో త్రేతాయుగమున శ్రీరాముల వారు దండకారణ్యమున సీతాన్వేషణకై వెళ్ళినప్పుడు అహోబొల నరసిం హస్వామిని దర్శించి 'నృసిమ్హ పంచామృత స్తోత్రం'తో ఆరాధించినట్లు పురాణం చెబుతుంది.

"శ్రీ మద్భాగవతము" నందు ద్వాపర యుగమున పంచపాండవులు అహోబిల నరసిం హుని పూజించునట్లు పురాణము చెబుతున్నది.

కలియుగం నందు "అర్భావతారము"గా వేంకటేశ్వరస్వామి, పద్మావతి దేవికి విళంబి నామ సం వైశాఖ శుద్ధదశమిలు, శుక్రవారం నాడు వివాహ సమయమున తమ వివాహనికి చేసిన ప్రసాదములను శ్రీ అహోబిల నరసిం హస్వామికి నివేదించవలసినదిగా బ్రహ్మడేవుడు పలికెను.

"శ్రీ వేంకటేశేనా వివాహ కాలే సంపూజితం సర్వవిదోప చారైహిః అనునట్లు వేంకటేశ్వర స్వామి లక్ష్మీనరసిం హ స్వామిని ప్రతిష్టించి, ప్రసాదాలను నివేదించి మహమంగళారతులు చేసినట్లు "వేంకటాచల మహత్యం" చెబుతుంది. వేంకటేశ్వరుడు దిగువ అహోబిలానికి వేంచేసి స్వామిని ప్రతిష్ఠించి వివాహం చేసుకున్నాడు కావున ఈ నాటికి శ్రీ నృసిం హ స్వామి వారి కళ్యాణోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం వారు పట్టు పీతాంబర వస్త్రములు అహోబలేశ్వరునికి ప్రతి సంవత్సరం సమర్పిస్తున్నారు.

ఈ క్షేత్రానికి ముఖ్యమైన ఆళ్వారులు కూడా వచ్చి అహోబలేశ్వరుని దర్శించినట్లు తెలియుచున్నది. గురుపరం పరాధీనలో వైష్ణవ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయుటకు రామానుజాచార్యుల వారు 11వ శతాబ్దంలో అహోబిలం వేంచేసి నరసిం హ స్వామిని దర్శించి అనుగ్రహన్ని పొందినారు. ఆ తరువాత వైష్ణవ పరంపరాధీనతోనే శ్రీ నిగమాంత దేశిక స్వామి అను పండితునకు ఉత్తర భారత దేశ యాత్ర చేసినప్పుడు అహోబిల క్షేత్రమును దర్శించునట్లు ఆధారములు కలవు.

దేవతలకు మాత్రమే ప్రవేశించడానికి సాధ్యమైన ఎగువ అహోబిల క్షేత్రాన్ని 8వ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి అయిన తిరుమంగై ఆళ్వార్ దర్శించి నరసిం హ సార్వభౌముని 10 పాశురములతో కీర్తించినారు. ఈ పది పాశురములు "నా లాయిర దివ్య ప్రభంధం" నందు కలవు.

ఈ క్షేత్రానికి వివిధ సామ్రాజ్యాలకు చెందిన రాజులు దర్శించినట్లు శాసనాలు కలవు. విక్రమాదిత్య అను మహరాజు (1076-1106) పశ్చిమ తీరపు రాజులు, చాళక్యులు, కాకతీయులు, విజయనగరాదీసులు, రెడ్డిరాజులు ఈ మూల విగ్రహం ను దర్శించినట్లు ఆధారాలు కలవు. కాకతీయ వంశంలో చివరి రాజైన ప్రతాప రుద్రుడు అహోబిలం వేంచేసి ముఖ్యమైన బంగారు విగ్రహాలు మంటపాలు దేవాలయం నిర్మించినట్లు ఉత్సవల కోసం తగు నిధిని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నాయి.

ఆది శంకరాచార్యుల వారు "పరకాయ ప్రవేశం" చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున, ఉగ్ర నరసిం హ స్వామిని "కరావలంబ స్తోత్రము" చేయగా ఆయన చేతులు తిరిగి వచ్చినవి. ఈ స్తోత్రము "20" శ్లోకాలలో నరసిం హ స్వామిని వర్ణించాడు. ఈ సన్నివేశం అహోబిలం నందు (788-820)లో జరిగింది.

అహోబిల నవనారసింహ వైభవం :

అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు. అవి ముక్తి కాంత విలాసాలు. అహోబిల క్షేత్రం లో నవ నారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి. నిసర్గ రమణీయమైన నల్లమల అడవులకే సింగారమై నిలిచినారు. తొమ్మిదిమంది నరసింహ మూర్తులు అహోబిల మొదటి పీఠాధిపతి "ఆదివణ్‌ శఠగోపయతి" బోధనలతో ఆవేశాన్ని పొందిన అన్నమాచార్యులు గానం చేసిన నవనారసింహాకృతి మనకు శృతి భూషణం.

నవనారసింహ - నమో నమో

భవనాశి తీరయహో - బల నారసింహ ||నవ||

జ్వాలాహోబల, మాలోల క్రోడ,కారంజ, బార్గవహ:,

యోగానంద, చ్చత్రవట, పావన నవమూర్తయ:

ఈ మంత్రము నవనారసింహుల మంత్రము, అన్నమయ్య తన పద కవితల యందు అహోబిల, జ్వాలా, యోగానంద కానుగమాని, (కారంజ), భార్గవ, వరాహ, నరసింహుల పేర్లు శ్లోకం లో సంప్రదిస్తున్నవి. మట్టెమళ్ళ, ప్రహ్లద, శ్రీ నారసింహులు, చత్రవట మాలోల, నృసింహులను ఉద్దేశించినవి. పావన నవ నారసింహులలో అన్నమయ్య నవరసాలను ఉగ్గడించాడు. వరుసగా రౌద్ర, వీర, కరుణ, శాంత, భీభత్స, శృంగార, అద్భుత, భయానక, సంతోషం అని తొమ్మిది రసాలుగా అభివర్ణించాడు. ఈ నవనార సింహ క్షేత్రములందలి అన్ని విగ్రహములు దేవతలు ప్రతిష్ఠించినవే అని పురాణాలు చెప్పుచున్నవి.

కరుణను ప్రహ్లాదునికి, శాంతమును సకల చరాచరసృష్టికి, శృంగారమును చెంచులక్ష్మికి ప్రసాదించినాడు. ఈ అహోబిల నారసింహుడు.

Read More

కలిదోష నివారణ మ0త్రంకలిదోష నివారణ మ0త్రం 

కర్కోటస్య నాగస్య దమయ0త్యా:నలస్యచ
ఋతుపర్ణస్య రాజర్షే: కీర్తనం కలినాశనం
దమయ0తీ నలభ్యా0చ నమస్కార0 కరోమ్యహ0 |
అవివాదో బవేదత్ర కలిదోష ప్రశా0తిద: ||
ఐకమత్య0 భవేదేషా0 బ్రాహ్మణనా0 పృథగ్దియా0 |
నిర్వైరతా చ జాయేత స0వాదాగ్నే ప్రసేదమే ||

" శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ "


భక్తులు వీటిని నిత్యస్మరణలో పెట్టుకొనిన కలిదోషముల ను0ది రక్షి0ప బడుదురు.

Read More

Powered By Blogger | Template Created By Lord HTML