గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 24 February 2014

వేటకుక్కల మధ్యలో లేగదూడలా వున్న సనాతనధర్మాన్ని కాపాడటానికి, ఆది శంకరాచార్య వితండ వాదనలకు భయపడివుండివుంటే, ఈ రోజు మనం మన అస్తిత్వాన్నే కోల్పోయివుండేవాళ్ళం

వేటకుక్కల మధ్యలో లేగదూడలా వున్న సనాతనధర్మాన్ని కాపాడటానికి, ఆది శంకరాచార్య వితండ వాదనలకు భయపడివుండివుంటే, ఈ రోజు మనం మన అస్తిత్వాన్నే కోల్పోయివుండేవాళ్ళం. స్వామి వివేకానంద పిరికివాడిలా ఆలోచించివుంటే మిగిలిన మతాలు సనాతన ధర్మాన్ని ఏనాడో నాశనం చేసివుండేవాళ్ళు.సనాతన ధర్మం(మీరు హిందూ మతం అంటున్నారే అది)చెప్పేది సత్యం. సర్వశక్తి స్వరూపమయిన ఈశ్వర శక్తి సమస్థకోటి జీవరాశిని ఒకరికొకరు సహకరించుకుంటూ బ్రతకమని ప్రపంచంలో అవసరాలకనుగుణంగా వివిధ రకాలయిన జన్మలనిచ్చాడు. ఈ ఈశ్వరశక్తికి ఒక్కొక్కరూ ఒక్కొక్క రూపాన్ని ఆపాదించి ఆరాధిస్తున్నారు. నేడు హిందూమతంఅని పిలుబడే సనాతన ధర్మం లో చెట్లలో పుట్టలలో, బండరాళ్ళలో దొంగలలో శత్రువులో ఇలా సమస్థకోటి జీవరాశులలోనూ ఈశ్వరశక్తిని గుర్తించి వాటిని ఆరాధించింది. రుద్రంలో చెప్పిన విధంగా అయితే మన కళ్ళకి కనిపించే ప్రతీ వస్తువులోనూ భగవంతుడున్నాడని సనాతన ధర్మం చెపుతోంది. అంతేగాని ఏదో ఒక ముఠా నాయకుని పార్థివ శరీరానికి సమాధి కట్టి సమాధిని ఆరాధన చేయమని చెప్పలేదు. ఇప్పుడిప్పుడే మన 18 పురాణాలు, ఉపనిషత్తులు వగైరాలు స్థానిక భాషలలోనికి అనువదించబడుతున్నాయి. ఇది శుభపరిణామం. మనం ముందు వాటిని చదివి అర్ధంచేసుకుని అమలు పరిస్తే చాలు. మనం అత్యంత క్రూర జంతువుని కూడా మన ధర్మం ప్రకారం చంపమని ఎక్కడా చెప్పలేదు. ప్రాణాపాయ స్థితిలో గత్యంతరంలేకుంటేనే వాటికి మనం చంపుతాము. ఈ విషయాలు తెలియక విదేశీయులు తమకున్న మిడి మిడి ఙ్ఞానంతో హింసకు పాల్పడి వాటి ఉపయోగాలు తెలియక మన పర్యావరణాన్ని నాశనం చేశారు.పైగా అదే అభివృధ్ది అని 1950 లో ఒక ప్రామాణికం తయారు చేశారు. పర్యావరణాన్ని ఎవరు ఎంత నాశనం చేశారో చేయగలిగారో వారే అభివృధ్ది చెందినవారుగానూ మిగిలిన వారు అంటే భారతీయులు, ఆఫ్రికన్లు (అంటే ప్రకృతిని ప్రేమించేవారు) అనాగరికులుగానూ చిత్రీకరించారు. దానినే మన పాలకులు అనుసరించారు.అందుకే మన సంప్రదాయాలు నాశనమయ్యాయి. జార్జ్ బుష్ అమెరికా రాష్ట్రపతిగా వున్నప్పుడు ఆవుపేడ గురించి ఆవు గురించి తన దేశ ప్రజలకి హితబోధ చేశాడు. ఇంకా మన పాలకుల చెవికెక్కినట్లులేదు

--
kishore always with u....!


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML