గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 24 February 2014

మా వూళ్ళో ఒకాయన గుడి కట్టించాడు . మరొకాయన రధం చేయించాడు . మరొకాయన డబ్బు ఖర్చు చేసి వుత్సవాలు చేయిస్తున్నాడు . వారు డబ్బు కలవారు కనక చేయిస్తున్నారు . నేను పూట గడవని వాడిని . నేనేమి ఇవ్వగలను ?


మా వూళ్ళో ఒకాయన గుడి కట్టించాడు . మరొకాయన రధం చేయించాడు . మరొకాయన డబ్బు ఖర్చు చేసి వుత్సవాలు చేయిస్తున్నాడు . వారు డబ్బు కలవారు కనక చేయిస్తున్నారు . నేను పూట గడవని వాడిని . నేనేమి ఇవ్వగలను ?

పరిష్కారం :- పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి !
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనం: !!

ప్రతివారూ గుళ్ళూ , గోపురాలు కట్టించ నవసరం లేదు . ఎంతో డబ్బు పోసి ఆడంబరం గా వుత్సవాలు చేయించ నక్కర లేదు . భక్తి తో చిన్న ఆకు కాని, పువ్వు కాని,పండు గాని ఏదీ లేక పొతే చివరకు కాసిని నీళ్ళు కాని భగవంతునికి నివేదిస్తే దేవుడు పరిగ్రహిస్తాడు . భక్తి తో ఏది సమర్పించినా దేవుడు తప్పక స్వీకరిస్తాడు . భక్తి లేకపోతె ఏమి సమర్పించినా భగవంతుడు ముట్టడు .. అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది .

Read More

న్యూటన్ మొదలుకుని అందరు, విదేశి శాస్త్ర వేక్తలు, మన వేదాలను కాపీ కొట్టి రాసిన సూత్రాలే రా పిచ్చి వెదవల్లారా !!!

అందుకనే ప్రపంచం లో  ఎక్కడా లేని  " ప్రపంచ  పుస్తక భాండా గారములు "  బ్రిటిష్ వారి దగ్గరే  ఎక్కువ ఉన్నవి . 

--
kishore always with u....!

Read More

లక్ష్మణ దేవర నవ్వు

లక్ష్మణ దేవర నవ్వు

రావణుడు మరణించిన తరవాత కపి సైన్యంతో విభీషణ,అంగద,సుగ్రీవులతో, సీతా లక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటూ ఉన్న సందర్భం. పట్టాభిషేకం అట్టహాసంగా జరుతోంది.రాముని పక్కనే సింహాసంకి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఆ పరిస్థితులలో లక్ష్మణుడు ఒక సారి చిరునవ్వు దీర్ఘంగా నవ్వేడు. లక్ష్మణ దేవర నవ్వినది అందరూ చూశారు.ఆ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొకరు ఒకలా అనుకున్నారా నవ్వు చూసి.

ఆనాడు రాముని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని,భరతునిచే తిట్లు తిని, నేడు ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వేడా? అనుకుందిట కైక.

సుగ్రీవుడు, అన్నను చంపించి రాజ్యాన్ని సంపాదించాడా అని నన్ను చూసినవ్వేడేమో అనుకున్నాడట.

తండ్రి ని చంపించిన పిన తండ్రి పంచ చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు.

ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళీగా నన్ను చూసినవ్వేడా అనుకున్నాడట విభీషణుడు.

రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట.

బంగారు లేడిని తెమ్మన్ని కోరినందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందిట సీత.

బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్ళి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు అనుకున్నాడట.

అందరి మనసుల్లోనూ ఉన్న అనుమానాలను గ్రహించిన రాముడు, తమ్ముడి నవ్వు విశేషార్ధాలకు దారి తీస్తుందని లక్ష్మణుని" ఏందుకు నవ్వేవు సోదరా?" అని అడిగాడు. దానికి లక్ష్మణదేవర "అన్నా!' సీతా రాముల సేవలో ఏమరు పాటు లేకుండేందుకుగాను నిద్రాదేవిని ఒక వరం అడిగాను. నన్ను వనవాస సమయం లో పదునాల్గు సంవత్సరాలూ ఆవహించవద్దని.' దానికి నిద్రాదేవి అనుగ్రహిస్తూ 'పదునాలుగేళ్ళయిన తరవాత నిన్ను ఆవహిస్తానని' వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో నన్ను ఆవహిస్తానని వచ్చింది. నిలబడే ఒక చిన్నకునుకు తీశానన్నయ్యా! నిద్రా దేవి మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వేను, మరేమీ కాదు" అన్నాడు. దానితో అందరూ తమతమ మనసులలో అనుకున్నది నిజం కాదని అనవసరంగా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నామనుకుని నవ్వుకున్నారట.


--
kishore always with u....!

Read More

అసురులు తాగేది శురాపానం, దేవతలు తాగేది సోమపానం(యజ్ఞంలో ఇచ్చేది సోమపానం).


అసురులు తాగేది శురాపానం, దేవతలు తాగేది సోమపానం(యజ్ఞంలో ఇచ్చేది సోమపానం).. సురాపానం తగినవారికి పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అని శాస్త్రం!అది ఎలాగో ఈ క్రింద చెప్పబోయే ఇతిహాసం చుస్తే తెలుస్తుంది!
సృష్టి ప్రారంభం అయిన తరువాత ఒకసారి దేవతలకి, అసురులకి యుద్ధం జరిగింది! ఆ యుద్ధంలో దేవతలు అసురులని చంపుతున్నారు! కానీ అసురులు మళ్లి దాడులు చేస్తున్నారు ఇలా కొన్నాళ్ళు జరిగింది! అయితే దేవతలకి అనుమానం కలిగింది! ఇదేంట్రా బాబు మనం సంహరిస్తుంటే మల్లి బ్రతికి వస్తున్నారు! అసలేం జరుగుతుంది అని ఆరా తీస్తే రాక్షస గురువు శుక్రాచార్యుడు సంజీవిని మంత్రంతో బ్రతికిస్తున్నాడని తెలిసింది! అప్పుడు దేవతలు వెళ్లి బ్రహ్మకి మొరపెట్టుకుంటే బాగా అలోచించి దీనికి ఒకటే విరుగుడు ఉంది! మీలో ఎవరైనా శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి సంజీవని మంత్రం నేర్చుకోండి.. అనగానే దేవతలు భయపడి అయ్యబాబోయి శుక్రాచార్యుడ రాక్షస గురువు అయన! మనమంటే నేర్పడు! కాబట్టి ఇంకో మార్గం అలోచించి చెప్పండి అన్నారు! అయితే మీరు వెళ్లి బృహస్పతిని కలిసి విషయం నేను చెప్పానని చెప్పండి అనగానే దేవతలంత వెళ్లి బృహస్పతిని కలిసి విషయం చెప్పారు! బృహస్పతి అలోచించి తన కొడుకుని పంపిస్తానన్నాడు! దేవతలు సంతోషించి వెళ్ళిపోయారు! ఆ తరువాత బృహస్పతి తనకోడుకుని శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్లి విద్య అభ్యసించి రమ్మన్నాడు! కొడుకు తన తండ్రికి వినయంతో నమస్కరించి వీడ్కొని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు! గుమ్మం దగ్గర శుక్రాచార్యుడు కుమార్తె దమయంతి కుర్చుని ఉంది! ఇతనిని చూడగానే కళ్ళు రెపరెపలాడిస్తూ ఆ అందం చూసి మురిసిపోయి సిగ్గుపడి కుడికాలి బొటనవ్రేలు నేలపై రాస్తూఉంది! అది గమనించి నేను గురువుగారిని చూడటానికి వచ్చాను! ఎక్కడున్నారో తెలుపండి! దమయంతి సిగ్గుపడి లోపలున్నాడని చెప్పి సిగ్గుపడుతూ చెంగు చెంగు మంటూ ఎగురుకుంటూ వెళ్లి తండ్రి చాటున దాగి ఇతనినే చూస్తూ ఉంది! ఇదేమి పట్టించుకోకుండా వెళ్ళగానే గురువుగారిని చూసి వినయంగా నమస్కరించి నేను బృహస్పతి తనయుడిని, మీ వద్ద విద్య అభ్యసించాలనే అభిలాషతో మీ దగ్గరికి వచ్చాను! ఆ మాట విన్న శుక్రాచార్యుడు ఓహో నువ్వు బృహస్పతి కొడుకువా! మీ తండ్రి గారు ఉత్తములు! గొప్పవాడు! ఆపైన దేవతలకి గురువు అలాంటి బృహస్పతి కొడుకు నాదగ్గర విద్య కోసం వచ్చినందుకు సంతోషం నాయానా! తప్పకుండా నేర్పిస్తాను! ,,,,,,,,,,,,,ఇంకా ఉంది!

ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటే? శత్రువుని అయిన తన దగ్గరికి ఆదరించాలి! విద్య అనేది తన పర భేదం లేకుండా నేర్పించాలి! శత్రువు ఎంతటి వాడైన తన గుణ గణములు పొగడవలసిందే! అలాగే నిజం దాచకుండా ఎక్కడ నుంచి ఎందుకు వచ్చామో అన్ని చెప్పడం వల్ల మనమీద అభిమానం ఇంకా పెరుగుతుంది! అలాగే అవసరం అనుకుంటే ఎవరినైనా (మనకంటే ఎక్కువా కావచ్చు, తక్కువా కావచ్చు) ఆశ్రయించాల్సిందే! ,,,,,,,,,,,,,ఇంకా ఉంది!......


అలా ఒక 1000 సంవత్సరాలు పాటు గురు సుశ్రుష చేసుకుంటూ విద్యలు అభ్యసిస్తూ ఉన్నాడు! మరి రాక్షసులు ఊరుకుంటారా? (మనలోనే కొందరు బాగుపడుతున్నారంటే కొందరు చూసి ఓర్వలేక ఎలాగైనా పడుచేయాలని చుస్తున్నారుకదా! వారుకూడా ఈ రాక్షస జాతిలోని వారే).. అప్పట్లో ఒక నియమం ఉండేది! విద్య నేర్చుకోవాలంటే గురువు చెప్పిన పని ఏదైనా సరే చేయాలి ఆరోజుకి విద్య చెప్తారు! ఎందుకంటే గురువు దగ్గరే ఉంటారు శిష్యులు! అన్ని పనులు పూర్తీ చేశాక విద్యాబ్యాసం మొదలు పెడతారు! ఉదయం అవులని మేపడానికి అడవికి వెళ్ళాడు! అక్కడ రాక్షసులు వీడిని పట్టుకొని చంపి శవాన్ని చెట్టుకి కట్టేశారు! సాయంత్రం అయ్యింది! దమయంతి గుమ్మం దగ్గర కుర్చుని వస్తాడు నారాజు అని ఎదురు చూస్తుంది! ఆవులు వచ్చాయి కానీ ఇతను రాలేదు! చాలాసేపు ఎదురుచూసింది చీకటి పడుతుంది కానీ రావడంలేదు! అప్పటికే ఈ రాక్షసులమీద దమయంతికి ఏదైనా చేస్తారేమో అని అనుమానం ఉంది! ఏడ్చుకుంటూ వెళ్లి నన్నారు ఆయన రాలేదు అని ఏడుస్తుంది! వస్తాడులేమ్మ అని ఒదారుస్తుంటే! ఆవులు అన్ని వచ్చేశాయి కానీ అయన రాలేదు! వీళ్ళు ఆయన్ని ఏదైనా చేశారేమో నాన్న అని మళ్ళి మళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తుంటే చూడలేక శుక్రాచార్యుడు కళ్ళు మూసుకొని మొత్తం వెతికాడు! అడవిలో ఒకచోట రాక్షసులు వీడిని చంపడం, చంపి చెట్టుకి కట్టేయడం అంతా తన మనోనేత్రం తో చూసి ఎంతపని చేశారు అని సంజీవనిని పిలిచి బ్రతికించి తీసుకుని రామన్నాడు! సంజీవని స్త్రీ రూపు దాల్చి చంపి చెట్టుకి కట్టేసిన చోటికి వెళ్లి బ్రతికించి తీసుకొచ్చింది! దమయంతి తండ్రిని కౌగలించుకుని కృతజ్ఞతలు చెప్పి ఇతనిని చూసి సిగ్గుపడుతూ లోపలి వెళ్ళింది! శుక్రాచార్యుడు జాగ్రత్త నాయన వీళ్ళు అసలే మంచోళ్ళు కాదు ఎంత చెప్పినా రాక్షస బుద్ది ఎక్కడికి పోతుంది! బయటకి వెళ్ళినపుడు జాగ్రత్తగా ఉండు అని అయన పనిలో అయన మునిగిపోయాడు! ఇలా ఇంకొన్నాళ్ళు గడచిన తరువాత రాక్షసులు అరేయ్ వీడు అసాధ్యుడిలా ఉన్నాడు! గురువుగారిని వదిలిపెట్టడంలేదు! ఎలాగైనా సంజీవని మంత్రం నేర్చుకోకుండా వెళ్ళేల లేడు! అని బాగా అలోచించి ఒకనాడు ఇతను అవులని తీసుకొని అడవిలోకి వెళ్ళినప్పుడు రాక్షసులు అంతా ఒరేయ్ వీడిని చంపి వదిలేస్తే మళ్లి బ్రతికిస్తున్నాడు కాబట్టి ఈసారి కాల్చి బూడిద చేద్దాం అని చంపి భూడిద చేశారు! మళ్లి రాక్షసులకి ఒక సందేహం వచ్చింది ఒరేయ్ ఇలాకాదు కానీ ఈ బూడిద తీసుకొని గురువు గారు తాగే సురలో కలిపేద్దాం అని ఆ బూడిద తీసుకెళ్ళి సురాపానం ఉన్న పీపాలో సురలో కలిపేశారు! సాయంత్రం అయ్యింది ఆరోజు శుక్రాచార్యుడు రోజు తాగే సురకంటే ఎక్కువ తాగి ఊగిపోతున్నాడు! రోజు ఒక పీపా తాగితే ఆరోజు 6పీపాలు తాగాడు! దాంతో మైకం ఎక్కువ కమ్మింది! మళ్లి అదే సంఘటన! దమయంతి తండ్రి దగ్గరికి వచ్చింది నన్నారు అయన రాలేదు! అని వలవలా ఏడ్చింది! శుక్రాచార్యుడు ఊగిపోతూ వస్తాడులేమ్మా అని తూలిపోతూ మాట్లాడుతున్నాడు! దమయంతి కూడా ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలెట్టింది! శుక్రాచార్యుడు తూలిపోతూనే అంతా వెతకడం ప్రారంబించాడు! అడవిలో ఎక్కడ కనపడలేదు! ఎక్కడా కనపడలేదని అన్ని లోకాలు గాలించాడు అయిన కనపడలేదు! శుక్రాచార్యుడుకి క్రమంగా మైకం తగ్గడం మొదలయ్యింది! ఏంటి వీడు ఎక్కడ వెతికినా కనపడలేదు అని సందేహం వచ్చి తన ఉదరంలో చూశాడు! ఇంకేముంది బూడిద రూపంలో కడుపులోకి వెళ్ళిపోయాడు! మైకం దెబ్బకి దిగింది! ఒక్క క్షణం పాటు ఆశ్చర్యపోయాడు! జరిగిందంతా మనోనేత్రంతో చూసాడు! ఎంతపని చేసారు అనుకున్నాడు!దమయంతికి విషయం చెప్పాడు! భోరు భోరున ఏడ్చి ఎలాగైనా బ్రతికించమని ప్రదేయపడింది! కుదరదు అన్న వినలేదు! పట్టుపట్టింది! సరే అని తన ఉదరంలో ఉన్న శిష్యుడిని బ్రతికించాడు కానీ బయటకి తీసుకురావాలంటే కుదరదు ఎలా? బాగా అలోచించి శిష్యుడితో నాయనా నీకు ఇలా జరిగి ఉండకపోతే నీకు జీవితంలో ఎప్పటికి మృత సంజీవనిని నేర్పించేవాడిని కాదు! కాని తప్పడంలేదు! నువ్వు రాకపోతే మా అమ్మాయి ఊరుకోదు! ఈ విద్య తెలియకుండా నువ్వు బయటికి వచ్చావా నేను చచ్చి పోతాను! కాబట్టి నువ్వు బయటికి వచ్చిన వెంటనే నన్ను బ్రతికించు అని మృత సంజీవని విద్య విద్య నేర్పించాడు! అది నేర్చుకుని శుక్రాచార్యుడు ఉదరం చీల్చి బయటకి వచ్చి గురువు గారిని బ్రతికించాడు!
శుక్రాచార్యుడు శిష్యుడిని మెచ్చుకుని దీనికంతటికి కారణం అయిన ఈ మద్యాన్ని(సుర) ఎవరు సేవిస్తారో (త్రాగుతారో) వాళ్ళకి ఘోరమైన నరకం ప్రాప్తిన్చుగాక! సకల పాతకాలు (బ్రహ్మ హత్య పతకం, బ్రూణ హత్య ఇలాంటి పాతకాలు) ఇలా సకల పాతకాలు చుట్టుకొను గాక అని ఘోరమైన శాపం పెట్టాడు! ఆనతి నుండి సుర తగినవారికి మనో నిగ్రహం కోల్పోయి ఏమి మాట్లాడతారో, ఏమి చేస్తారో కూడా తెలియని స్థితికి వెళ్ళిపోతున్నారు! కొందరు తాగిన వంక పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు! ఇవన్ని ఆ శాప ప్రభావమే!
ఇక వచ్చిన పని అయిపొయింది కాబట్టి వెళ్లి వస్తాను గురువుగారు అని నమస్కారం పెట్టి బయలుదేరాడు! దమయంతి చూసి నన్నారు నేను ఇతనిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను! అంటే శిష్యుడు ఆ మాట విని గురు పుత్రి సోదరితో సమానం, పోనీ అలాకాదు అనుకున్న నేను మీ తండ్రి గర్బమ్ నుంచి మళ్లి జన్మ ఎత్తి వచ్చాను అల చూసుకున్నా నువ్వు నాకు సోదరివి అవుతావ్ కనుక వివాహం మీద ఆశ వదులుకో అని వెళ్తుంటే దమయంతికి విపరీతమైన కోపం వచ్చి నా మాట తిరస్కరిస్తావా? నువ్వు నేర్చుకున్న విద్య నీకు ఉపయోగ పడకుండుగాక! అని శాపం పెట్టింది! దానికి ప్రతి శాపంగా నాకు తప్ప అన్యులకి ఎవరికైన ఉపయోగపడు గాక అని ప్రతిశాపం పెట్టి వెళ్ళిపోయాడు!
అలా సుర తగిన వారికీ సకల పాతకాలు చుట్టుకోవాలనే శాపం,
దమయంతి శాపం,ఇతని ప్రతిశాపం మూలంగా దేవతలందరికీ సంజీవని విద్య వచ్చింది!--
kishore always with u....!

Read More

రుక్మిణీ కల్యాణం - శ్రీ విష్ణు పురాణము

రుక్మిణీ కల్యాణం - శ్రీ విష్ణు పురాణము

కుండినపురం రాజధానిగా విదర్భనేలే భీష్మకునికి రుక్మిణి కూతురు. ఆమె అన్న రుక్మి. ఇతడికి కృష్ణుడంటే ఉన్న ద్వేషం చేత - తన సోదరి కృష్ణునే భర్తగా వరించెనని తెలిసికూడా వారి కల్యాణం జరిపించడాయెను. శిసుపాలునికిఇద్దామని అతడి ఆలోచన.

వివాహం రేపు జరగనున్నదనగా, కృష్ణుడామెను రథంపై ఎక్కించుకుని తీసుకువెళ్లి రాక్షసవివాహరీతిని ఆమెను పెండ్లాడాడు. ఆమెకు ప్రధ్యుమ్నుడు జన్మించాడు.

శంబరాసుర వథ:

ప్రద్యుమ్నుడు పుట్టిన అరవనాడు, అతడు తనకు ప్రాణాంతకుడని ఎరిగిన శంబరాసురుడు, ఆ శిశువును అపహరించి సముద్రంలో పారవేశాడు. జాలరులచేత రక్షించబడిన ఆ శిశువే పెరిగి పెద్దవాడై శంబరాసురుని 'నామమాత్రపు భార్య' అభోగ్య అయిన మయావతిచే పోషింపబడి, శంబరుని హతమార్చి, ఆమెతోకూడ నిజపురానికి చేరుకుని నారదమహర్షి వల్ల అతడు కృష్ణుని పుత్రుడని ధృవీకరింపబడి, తిరిగి అంతకాలానికి తల్ల్లితండ్రులను కలుసుకోగలిగాడు ఆ ప్రద్యుమ్నుడు.

రుక్మిణీకృష్ణులు, ద్వారక వాసులు చిరకాలమునకు ప్రద్యుమ్నుని చూసినందుకు ఆశ్చర్యానందాలు పొందారు. ఆ మాయవతి రతీదేవి అవతారం. ప్రద్యుమ్నుని భార్య అయింది.

రుక్మివథ:

రుక్మిణీదేవి కన్న సంతానం చారుదేష్ణుడు, చారుదేహుడు, సుదేష్ణుడు, సుషేణుడు, చారుగుప్తుడు, చారువిందుడు, చారువు, భద్రబాహువు అనే పుత్రులతో పాటు చారుమతి అనేపుత్రిక. రుక్మిణిగాక కృష్ణునికి ఇంకా ఏడుగురు పత్నులు. వారు సత్య, కాశింది, మిత్రవింద, రోహిణి, నాగ్నజితి, జాంబవతి, సుశీల, వీరుగాక 16000 మంది భామలు. ప్రద్యుమ్నుడు రుక్మికూతురు ఒకర్నొకరు పరస్పరం వరించారు. వీరికి జన్మించినవాడే అనిరుద్ధుడు. పెళ్లికి తరలివచ్చిన బంధుజనుల్లో కొందరు బలరాముడికి పాచికలాట తెలీదు, జూదంలో అతడ్ని మనం తేలిగ్గా గెల్వవచ్చునన్నారు.

బలమదం కొద్దీ రుక్మి సరేనన్నాడు. బలరామునితో ద్యూతక్రిడ మొదలెట్టారు. అప్పుడు బలరాముడు వెయ్యినిష్కాలు ఓడిపోయాడు. రెండో పందెంలో కూడ అంతే మొత్తం కోల్పోయాడు. మూడోపందెంలో పదివేలు ఓడిపోయాడు. ఈసారి కోటి నిష్కాల పందెం. బలరాముడు మౌనం వహించాడు. అందులో రుక్మి ఓడిపోయి కూడా, నేనే గెల్చానంటూ అబద్ధమాడగా, 'మౌనం అంగీకారసూచకం!' అని ఆకాశవాణి కూడ పలికి, బలరాముడే విజేత అని చెప్పింది. రుక్మిని పాచికలతో కొట్టాడు బలరాముడు. అటుపై అదంతా చూస్తూ అక్కడే ఉన్న కళింగరాజు పరిహాసం చేసినందుగ్గాను అతడి దవడ పళ్లూడగొట్టాడు.

ఈ సందడిట్లా నడుస్తూన్నంతలో పెండ్లికొడుకును తీసుకుని నెమ్మదిగా అక్కడ్నుంచి వచ్చాడు శ్రీకృష్ణుడు. రుక్మి హతుడయ్యాడు గనుక ఇక కలహాలుండవని ఆయనకు తెలుసు!

నరకాసుర వథ:

తరువాత కొంతకాలానికి ఇంద్రుడు, ద్వారకకు రాగా శ్రీకృష్ణుడు అతనికి అతిథి సత్కారాలు చేసి విషయమేమిటని అడిగాడు. దేవేంద్రుడు సందర్భవశంగా ఇలా అన్నాడు.

"శ్రీకృష్ణా! ఏం చెప్పమంటావు. భూమిపుత్రుడైన నరకాసురుడు నీకు తెలుసుకదా! వాడి దుశ్చర్యలు మితిమీరిపోతున్నాయి. అ విషయం నీకు విన్న వించడానికే నేను ఇక్కడకొచ్చాను. ప్రాగ్జ్యోతిషపురాథిపతి పెడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. దేవతలు, సిద్ధులు, మునులు....ఒక్కరేమిటీ - వాడి బారిన పడనివారు లేరనుకో! ఎందరు ధరణి పతుల కన్యలనో వాడు తన ఇంట బంధించాడు. వరుణుని చత్రం ఊడలాక్కున్నాడు. మందరర పర్వతశృంగం మీద మణులన్నీ కాజేశాడు. ఇవి వాడి దుశ్చర్యల్లో అత్యల్పభాగం మాతమే! కనుక తక్షణమే నువ్వేదైనా ప్రతిక్రియ ఆలోచించాలి" అని నివేదించాడు.

"అలాగే! సరే! నువ్వు ధైర్యంగా ఉండు! వాడి గర్వం అణచవలసిందే!' అని శ్రీకృష్ణుడు ఇంద్రునికి అభయమిచ్చి పంపేశాడు.

అనంతరం హృదయంలో గరుడుని తల్చుకుని, అతడు రాగా ఆ పక్షిరాజు మూపునధిరోహించి సత్యభామా సమేతుడై ప్రాగ్జ్యోతిష్యపురానికి వెళ్లాడు శ్రీకృష్ణుడు. నరకునిసేనలతో శ్రీకృష్ణునికి మొదట పెనుయుద్ధమయింది. అహర్నిశలు సాగిన ఆ యుద్ధంలో, సత్యాపతి ఇంచుక అలసి విశ్రమించగా, సత్యభామ ఆ దానవ వీరులతో పోరాడింది. వారిపైకి అస్త్రశస్త్రాలు వర్షంలా కురిపించింది. శ్రీకృష్ణుడు కొంతసేపు సేదతీరి, సత్యభామను ప్రశంసించి, తిరిగి తన కర్తవ్యాన్ని తానే నెరవేర్చాడు.

(శస్త్రాస్త్రవర్షం ముం చం తం తం భౌమం నరకం బలీ|
క్షి ప్త్యా చక్రం ద్విధా చక్రే చక్రీ దై తేయ చక్రహా||)

తన చక్రాయుధంతో నరకాసురుని రెండుగా ఖండించాడు. మురాసురుని, హయగ్రీవుని, పంచజనుడను వానిని కూల్చాడు. మురాసురుని 7వేల మంది పుత్రుల్ని సంహరించాడు. ఎవరెవరిదగ్గర నుంచి నరకుడు ఏమేమి అపహరించాడో, అవన్నీ వారికి అందేలా చేశాడు.

పృథివీ కృతకృష్ణస్తుతి:

"నాథా! వరాహమూర్తివై నీవు ఒకప్పుడు నన్నుద్ధరించగా, పుట్టినవాడు ఈ నరకుడు. ఈ పుత్రుని ఇచ్చినదీ నీవే! తిరిగి సంహరించినదీ నీవే! వీడు అపహరించిన (అథితి యొక్క) కర్ణకుండలాలు ఇవిగో! వీడి సంతతిని ఇంకా ముక్కపచ్చలారని వారిని కాపాడు!

జగత్కర్తవు, సంహార కారణుడవు నీవే! నా బరువును దింపటానికే అంశావతారం ఎత్తావు. నిన్నేమని స్తుతించను? వ్యాపించువాడవు వ్యాపించబడు విశ్వమూ నీవే! సర్వ భూతాంతరాత్మవగు నిన్నేమని స్తుతించను? వాక్కులకు అందనివాడివి. సర్వభూతాత్మా! దయచూడు! ధర్మసంస్థాపన కొరకు నీ కొడుకుని నువ్వే సంహరించావు గనుక, వీని తప్పిదాలను మన్నించు!" అని స్తుతించింది భూదేవి.

ఇతి శ్రీవిష్ణుమహాపురాణే పంచమాంశే ఏకోనత్రింశో ధ్యాయః

భూత భావనుడైన భగవానుడు పృధ్వీ స్తోత్రానికి ప్రసన్నుడై ఆమెకు అభయప్రదానం చేసి, నరకుని అంతఃపురంలో ఉన్న 16000 మంది (పైన 100 కూడా...శ్లోకప్రకారం 'శతాధికాని దృశే సహస్రాణి' కనుక) సౌందర్యవతులైన కన్యలను, విలువైన రత్నాలను, 16000 ఉత్తమమైన నాలుగు దంతాలుగల ఏనుగులను, 21 లక్షల ఉత్తమైన కాంభోజదేశపు గుర్రాలను నరకుని భటులచేతనే అప్పటికప్పుడు ద్వారకాపురికి రవాణా చేయించాడు.

వరుణుని గొడుగును, మణి పర్వతం యొక్క మణులను, ఇంద్రుని తల్లి అదితి యొక్క మణిమయ కుండలాలను (నరకుడు అపహరించిన ఈ దేవతల సొత్తును) స్వయంగా తానే అప్పగించదలచి సత్యభామతో సహా అదే గరుడునిపై అధిరోహించి స్వర్గానికి వెళ్లాడు.

శ్రీకృష్ణుడు విజయుడై తిరిగొచ్చాడన్న వార్త ఇంద్రునికి అందింది. స్వర్గానికి వచ్చాడనీ తెలిసి, ఎదురేగి స్వాగతం పలికి ఆదరించాడు. శ్రీకృష్ణుడు దేవమాత అదితిని దర్శించి ఆమె కుండలాలు అప్పగించాడు. ఆమె ఆనందంతో అ జగన్నాధుని సోత్రం చేసింది.


--
kishore always with u....!

Read More

ఒకనాడు పార్వతీదేవి శివుడితో ??
ఒకనాడు పార్వతీదేవి శివుడితో! స్వామి ఇంద్రుడికి గృహం ఉంది, దేవతలకి గృహాలు ఉన్నాయి. కాని మనకి మాత్రం లేదు. కట్టించండి అని అడిగింది. అప్పుడు శివుడు! ఒద్దు పార్వతి. మనకి ఇల్లు అచ్సిరాదు. ఆలోచన మానుకో అన్నాడు. కాని పార్వతి కాదు కుదరదు అనేసరికి. సరే అని అమరాశిల్పిని పిలిపించి అత్యద్భుతమైన ఇల్లు ఒకటి కట్టమని ఆజ్ఞాపించాడు. అమరశిల్పి తక్షకకోటిని పిలిపించి బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. గృహప్రవేశానికి అందరికి ఆహ్వానం పంపించారు. ఎవరికి ఏ వరం కావాలో కోరుకొండి అడిగిన తక్షణమే ఇచ్చేస్తా అన్నాడు. ఆ ఆహ్వానం రావణాసురుడికి కూడా వెళ్ళింది. గృహప్రవేశానికి అందరు వచ్చి వరాలు అడిగి తీసుకుంటున్నారు. రావణుడు వంతు వచ్చింది. రావణుడు! శివ ఏవరం కావాలన్నా లేదనకుండా ఇస్తాను అని మాట ఇచ్చావ్ కనుక అడిగింది కాదనకూడదు అన్నాడు. సరే ఏమి కావాలో అడగమంటే ఈ ఇల్లు నచ్చింది. ఇచ్చేసేయి అనేసరికి శివుడు పార్వతి ఆశ్చర్యపోయి ఏమిచేయలేక ఇస్తున్నా తీసుకో అని ఇచ్చేశాడు. అక్కడికి ఒక ఇల్లు ఇచ్చేశారు. ఇంకోన్నిరోజుల తరువాత మళ్లి అడిగింది. మళ్లి దేవశిల్పిని పిలిపించి మల్లి కట్టించాడు. ఈ సారి రావణుడిని పిలవలేదు. ఐతే గృహప్రవేశానికి ''శని'' వచ్చాడు. 
ఆయన్ని చూడగానే అగ్నిహోత్రుడు గజగజ వొణికిపోయాడు. నన్ను ఏమి చేస్తాడో శని అనుకుని భయంతో ప్రజ్వలించి ఆ ఇంటిని కల్చేశాడు. అలా రెండో ఇల్లుకూడా పోయింది. పార్వతీ మనకి ఇల్లు అచ్చుబాటు లేదు, ఒద్దు అని చెప్పాను కదా! ఇంకా ఇంటిమీద ఆశలు వదిలిపెట్టు అనగానే చేశేది లేక సరే అని ఊరుకుంది. ఆ విధంగా శివుడికి ఇల్లు లేకుండా పోయింది.

--
kishore always with u....!

Read More

వేటకుక్కల మధ్యలో లేగదూడలా వున్న సనాతనధర్మాన్ని కాపాడటానికి, ఆది శంకరాచార్య వితండ వాదనలకు భయపడివుండివుంటే, ఈ రోజు మనం మన అస్తిత్వాన్నే కోల్పోయివుండేవాళ్ళం

వేటకుక్కల మధ్యలో లేగదూడలా వున్న సనాతనధర్మాన్ని కాపాడటానికి, ఆది శంకరాచార్య వితండ వాదనలకు భయపడివుండివుంటే, ఈ రోజు మనం మన అస్తిత్వాన్నే కోల్పోయివుండేవాళ్ళం. స్వామి వివేకానంద పిరికివాడిలా ఆలోచించివుంటే మిగిలిన మతాలు సనాతన ధర్మాన్ని ఏనాడో నాశనం చేసివుండేవాళ్ళు.సనాతన ధర్మం(మీరు హిందూ మతం అంటున్నారే అది)చెప్పేది సత్యం. సర్వశక్తి స్వరూపమయిన ఈశ్వర శక్తి సమస్థకోటి జీవరాశిని ఒకరికొకరు సహకరించుకుంటూ బ్రతకమని ప్రపంచంలో అవసరాలకనుగుణంగా వివిధ రకాలయిన జన్మలనిచ్చాడు. ఈ ఈశ్వరశక్తికి ఒక్కొక్కరూ ఒక్కొక్క రూపాన్ని ఆపాదించి ఆరాధిస్తున్నారు. నేడు హిందూమతంఅని పిలుబడే సనాతన ధర్మం లో చెట్లలో పుట్టలలో, బండరాళ్ళలో దొంగలలో శత్రువులో ఇలా సమస్థకోటి జీవరాశులలోనూ ఈశ్వరశక్తిని గుర్తించి వాటిని ఆరాధించింది. రుద్రంలో చెప్పిన విధంగా అయితే మన కళ్ళకి కనిపించే ప్రతీ వస్తువులోనూ భగవంతుడున్నాడని సనాతన ధర్మం చెపుతోంది. అంతేగాని ఏదో ఒక ముఠా నాయకుని పార్థివ శరీరానికి సమాధి కట్టి సమాధిని ఆరాధన చేయమని చెప్పలేదు. ఇప్పుడిప్పుడే మన 18 పురాణాలు, ఉపనిషత్తులు వగైరాలు స్థానిక భాషలలోనికి అనువదించబడుతున్నాయి. ఇది శుభపరిణామం. మనం ముందు వాటిని చదివి అర్ధంచేసుకుని అమలు పరిస్తే చాలు. మనం అత్యంత క్రూర జంతువుని కూడా మన ధర్మం ప్రకారం చంపమని ఎక్కడా చెప్పలేదు. ప్రాణాపాయ స్థితిలో గత్యంతరంలేకుంటేనే వాటికి మనం చంపుతాము. ఈ విషయాలు తెలియక విదేశీయులు తమకున్న మిడి మిడి ఙ్ఞానంతో హింసకు పాల్పడి వాటి ఉపయోగాలు తెలియక మన పర్యావరణాన్ని నాశనం చేశారు.పైగా అదే అభివృధ్ది అని 1950 లో ఒక ప్రామాణికం తయారు చేశారు. పర్యావరణాన్ని ఎవరు ఎంత నాశనం చేశారో చేయగలిగారో వారే అభివృధ్ది చెందినవారుగానూ మిగిలిన వారు అంటే భారతీయులు, ఆఫ్రికన్లు (అంటే ప్రకృతిని ప్రేమించేవారు) అనాగరికులుగానూ చిత్రీకరించారు. దానినే మన పాలకులు అనుసరించారు.అందుకే మన సంప్రదాయాలు నాశనమయ్యాయి. జార్జ్ బుష్ అమెరికా రాష్ట్రపతిగా వున్నప్పుడు ఆవుపేడ గురించి ఆవు గురించి తన దేశ ప్రజలకి హితబోధ చేశాడు. ఇంకా మన పాలకుల చెవికెక్కినట్లులేదు

--
kishore always with u....!

Read More

నీతి సూక్తి


1. దరిద్రం మిత్రులని పరీక్షిస్తుంది. 
2. అవకాశం అరుదుగా లభిస్తుంది. వివేకి ఎన్నడు దానిని వదులుకోడు.
3. అవకాశాలు నీకోసం ఆగవు. నీవే వాటిని చేజిక్కించుకోవాలి.
4. అప్పు - సంతోషంతో మొదలై, వివాదం - విషాదంతో ముగుస్తుంది.
5. ఆందోళన మనిషికి, మనసుకి అనారోగ్యాన్ని, భాదని ఇస్తుంది. 
6. ఉత్తములని గౌరవించడం, సేవకులని దయతలచడం, శత్రువులని సమయానికి అనుగుణంగా శిక్షించడం, క్షమించడం అభివృద్దికి ఆధారాలు. 
7. ఉన్న అవకాశాలని వాడుకోలేనివారు, ఎన్ని అవకాశాలు వచ్చినా వాయిదాలు వేస్తూనే ఉంటారు.
8. ప్రవర్తన అద్దం లాంటిది. అది మీ గుణాల్ని ఎదుటివారికి చూపిస్తుంది.
9. బంగారం నాణ్యత కొలిమిలో కాల్చితే బయటపడుతుంది. మనిషిలోని గుణాలు కష్టంలో ఉన్నపుడు బయటపడతాయి.
10. మధుర వాక్కు కోపాన్ని చల్లబరుస్తుంది. కటిన వాక్కు రెచ్చగొడుతుంది.
--
kishore always with u....!

Read More

ఉదయాన్నే లేవగానే ఎవరి ముఖం చూడాలి?

ఉదయాన్నే లేవగానే ఎవరి ముఖం చూడాలి?

మనం సాదారణంగా ఏదైనా పని చేసినప్పుడు లేదంటే ఆ రోజు ఏమి కలిసిరానప్పుడు ''పొద్దున్నే లేచి ఎవరిముఖం చూశానో కాని'' అని ఎత్తుకుంటారు. 
ఉదయం లేవగానే దేవుడి ముఖం కనిపించేలా కాళ్ళ దగ్గర మీకు నచ్చిన దేవుడి చిత్రపటం చుడండి. కాళ్ళ దగ్గర పెట్టుకుంటే అపచారం కదా అని కొందరికి సందేహం. కాళ్ళదగ్గర అంటే కళ్ళకి తగిలేలా పెట్టుకోవడం లేదు కదా ఎదురుగ వున్నగోడకి తగిలిస్తున్నాం. అంతే కాకుండా దేవుడు సర్వాంతర్యామి. అయన సర్వం నిండి ఉన్నాడు. అలాంటప్పుడు నీ కాళ్ళ దగ్గరే ఉన్నాడు అని ఎందుకు అనుకుంటున్నారు. కానీ మనసులో గిలి ఉన్నవారికి ఇంకో చిన్న సందేశం. 
ఉదయం లేచిన వెంటనే మీ అరచేతులు చూసుకోండి. దీనికి కూడా ఒక కారణం ఉంది. 
అరచేతి ముని వెళ్ళు లక్ష్మి దేవి స్థానం. అరచేయి సరస్వతి స్థానం, అరచేయి కింద మణికట్టు శక్తి స్థానం. దీనికి ప్రమాణం ఏంటి అని సందేహమా?
లక్ష్మీదేవి చంచలం అనే విషయం అందరికి తెలుసు కదా! ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికి తెలియదు. అందుకని ఎప్పుడు దూకేద్దామా అని మునివేళ్ళ మీద కుర్చుని వుంటుంది. మనం ఎవరినైనా డబ్బు గురించి అడిగేటప్పుడు బొటనవేలు చూపుడువేలు టిక్కు టిక్కు మని కొడుతూ అడుగుతాం కదా. అలాగే సరస్వతి దేవి అరచేతిలో ఉంటుంది. మనం పుస్తకం పట్టుకుని చదవాలనుకుంటే అరచేతిలోనే పట్టుకుంటాం. ఏమి చేస్తున్నావు అని ఎవరైనా అడిగితె అరచేతులు రెండు దగ్గర పెట్టు ముడిచి చదువుతున్నాను అని చూపిస్తాం. అలానే మనం ఎవరిననైన కొట్టాలి అనుకున్నా, లేక కోపం వచ్చిన పిడికిలి బిగిస్తాం. ఆ పిడికిలి బలం (శక్తి) అంతా మణికట్టు మీదే ఆధారం. కనుక అరచేతిని చూసుకుంటే ముగ్గురు అమ్మల్ని దర్శించినట్టు ఉంటుంది. ఎవరిని తిట్టుకోకుండా ఉంటాము. కాబట్టి మీకు వీలైన పద్దతిని వాడుకోండి.


--
kishore always with u....!

Read More

నాగులచవితి విశిష్ఠత

నాగులచవితి విశిష్ఠత

నాగుల చవితి - కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు. ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.
నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం:
నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .
పడగ తొక్కిన పగవాడనుకోకు ,
నడుము తొక్కిన నావాడనుకొనుము .
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .
అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .అలాగే,
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....
అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని,అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉంటుందా?


--
kishore always with u....!

Read More

ఇది చేతులారా చేసుకునే దుష్క్రుత్యం. కేవలం మనతప్పే. ఎవరో వచ్చి చెడగొట్టారు అనేది తప్పు


మన హిందువుల్లో ఈ మధ్య ఒక జాడ్యం పట్టుకుంది. ఇతరులు చెప్పేమాటలు, చెప్పుడు మాటలు విని, లేక అనుభవంలోకి కొన్ని సంఘటనల మూలంగా ఇతరులని, ఇతర మతాల వారిని దూషిస్తున్నారు. ఇంతకుముందు నేను దూషించాను. కాకపోతే ఇది సరైన పద్దతి కాదు.
ఎందుకంటే మన హిందూ సంస్కృతిలో అసలు ఏముంది? వ్యాసుడు ఏమి చెప్పాడు? వేదాలు, ఇతిహాసాలు, పురాణాలూ, ఉపనిషత్తులు మనకి ఏమి చెప్తున్నాయి? అనే విషయాన్ని వదిలేస్తున్నారు.. కనీసం వీటి వైపు చూడటంలేదు. ఇది ఎలా ఉందంటే చేతిలో ఆయుధం లేకుండా శత్రువు మీదకి యుద్దానికి వెళ్లినట్టు ఉంది. ఇక్కడ మనదేశంలో అనేక మతాలు హిందు సంస్కృతిని భూస్థాపితం చేయడానికి ప్రయత్నించి సఫలం అవుతూ ఉండటానికి కారణం మనం మన సంస్కృతిని, మన వేదాలని, ఇతిహాసాలని, పురాణాలని చదవకుండా వదిలేయడమే! అందులో ఏమి చెప్పారో తెలుసుకోకపోవడమే.
ఎవరైనావిదేశీయుడు వచ్చి నీ హిందు జాతి గురించి అడిగితె ఏమి చెప్తావ్? కనీసం భారతం, భాగవతం, రామాయణం ఎవరు వ్రాసారు అంటే చెప్పడానికి చాలామంది దగ్గర సమాధానం లేదు. ఒకవేళ వారి పేర్లు తెలిసినా వారు ఎవరో, వారి చరిత్ర ఏమిటో చెప్పలేరు.. ఇది అక్షరాల 100% నిజం.
మన సంప్రదాయాలని ఎందుకు వదిలేస్తున్నారు? విదేశీయుల మోజులో ఎందుకు పడుతున్నారు? విదేశీ కట్టుబాట్లు, విదేశీ దేవుళ్ళు, విదేశీ భాషల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.. ఈ రోజు రామాయణం, మహాభారతం ఇంగ్లీష్ లో వ్రాస్తే చదువుకునే దౌర్భగ్య పరిస్థితి పిల్లలకి తీసుకొచ్చారు.. చివరికి వేమన శతకం చదవాలన్న ఇంగ్లీష్ లో చెపితే చదువుతారు..
మనదేశ చరిత్ర 1947 కి ముందు ఒకలా ఉంది. స్వాతంత్రం వచ్చిన వెంటనే కొన్ని లక్షలమంది హిందువులు ఊచకోతకి గురయ్యారు. ఈ 60 ఏళ్ళలో వచ్చిన మర్పుకంటే గడిచిన 10 ఏళ్ళలో విపరీతంగా నాగరికత పెరిగి వినాశనం ఎక్కువయింది. సూర్య నమస్కారం చేయకూడదని కొందరు, మహాభారతం ఆపేయాలని కొందరు, ఇలా మనదేశంలోనే మనకి రక్షణ కరువయ్యే స్థితిలోకి వచ్చాము. ప్రత్యేకించి ఇప్పుడు లాక్కెళ్ళి నాశనం చేసే జాతి హిందువులలోనే తయారయ్యింది. ఇది చేతులారా చేసుకునే దుష్క్రుత్యం. కేవలం మనతప్పే. ఎవరో వచ్చి చెడగొట్టారు అనేది తప్పు. అలా వెళ్ళేలా చేసింది, చేస్తుంది మనమే. మన శాస్త్రాలు వదిలేయడమే మూలకారణం..

--
kishore always with u....!

Read More

స్త్రీల అలంకరణ వెనుక ఆంతర్యం ఏమిటి

స్త్రీల అలంకరణ వెనుక ఆంతర్యం   ఏమిటి 

--
kishore always with u....!
Read More

పుణ్యవంతులు అవటానికి 5 మార్గములు

పుణ్యవంతులు అవటానికి 5 మార్గములు 


Read More

కాశి, వారణాసి, వెళ్ళినపుడు ఏమి ఏమి చూడాలి

కాశి, వారణాసి,  వెళ్ళినపుడు ఏమి ఏమి చూడాలి 

--
kishore always with u....!

Read More

స్త్రీలు,శూద్రుల వేదాధ్యయన అధికారం, వేదమే కల్పించినది, ఇతర మతాల వారు చేయు, విమర్శలను నమ్మక, నిజాము తెలుసుకొనుము

స్త్రీలు,శూద్రుల వేదాధ్యయన అధికారం
మన హిందూమతం పేరు చెప్పగానే మొదట అందరికీ గుర్తుకువచ్చేది కులాల సంగతి. హిందూమతమునకు ప్రామాణ్యము వేదాలు అని అందరికీ తెలుసు.స్త్రీలు,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని అలాఅని వేదాలలో ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు.కానీ వేదాలలో అలా లేదని చెప్పడానికి ఈ ప్రయత్నం.

భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు
"చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః"అన్నాడు.
దీని అర్థం"మొదట వారి గుణాలబట్టి,తర్వాత వారు చేసే పనులబట్టి నాలుగు వర్ణాలు(కులాలు) నాచే(భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి."అని అర్థం.

వేదాలలో నాలుగు వర్ణాల (కులాల)గురించి చెప్పారు కానీ వాటిమధ్య ఎక్కువ,తక్కువల గురించి చెప్పలేదు.మధ్యయుగంలో సాంప్రదాయవాదులు స్త్రీ,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని వారి వారి గ్రంథాలలో చొప్పించారు కానీ ఏ వేదంలోనూ అలా చెప్పబడలేదు.సరిగదా ఆ అధికారం ఉన్నదని చెప్పాయి.
1.యజుర్వేదం(26.2) శ్లోకం
"యధేమంవాచం కళ్యాణీవధజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యం శూద్రాయ చర్యాయచస్వయచరణాయ"
అంటే "నేనెలా ఈ కళ్యాణవాక్కులను బ్రహ్మ మొదలు శూద్రులవరకు సర్వ మానవులకూ చెప్పానో నీవూ అలానే చెప్పాలి."అని అర్థము.
2.అధర్వణ వేదం (8వ మండలం,2వ అనువాకం) బ్రాహ్మణులకు,శూద్రులలో కూడా చివరివారికి
"సత్యమహం గభీరకావ్యేన సత్యంజాతే నస్మిజాతవేద,నం దాసోనం ఆర్యోమహిత్వ వ్రతం మిమయయదహధరిష్యే"
అంటే "ఓ మానవుడా!గంభీర సత్యస్వరూపుడనైన నేను పుట్టుక నిచ్చినవాడను.నేను దాస(శూద్ర),ఆర్య పక్షపాతము గలవాడను కాదు.నావలె ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరినీ రక్షిస్తాను"అని అర్థము.
3.ఇంకనూ ఋగ్వేద 10వ మండలం,3 వ అనువాకంలోని 30-34 వరకుగల సూక్తాలను ప్రచారం చేసిన కపశైలీషుడు శూద్రుడని ఐతరేయబ్రాహ్మణమును,స్వయంగా ఋగ్వేదములోనూ మరియు శాయనాచార్య భాష్యములోనూ చూడవచ్చు.
4.అలానే ఋగ్వేద ఒకటవ మండలం,17వ అనువాకంలోని 116-126 వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశపు రాజు బానిసకొడుకని ఋగ్వేదంలోనూ, శాయనభాష్యములోనూ,మహాభారతంలోనూ చూడవచ్చు.
5.అంతేకాక జనశృతి అనే ఋషి శూద్రుడు.సత్యకామజాబాలి వేశ్య కొడుకు.వీరిద్దరూ ఉపనిషత్తుల ప్రకారం(వేదాల చివరివి)ఉత్తమ వేదాంతబోధ పొందినవారు.
6.ఋగ్వేద ఒకటవమండలం 223వ అనువాకం 129వ సూక్తాన్ని లోపాముద్ర,8వ మండలం 1వ అనువాకం 91 వ సూక్తాన్ని అపలా అనే స్త్రీలు ప్రచారం చేసారని ఋగ్వేద అనుక్రమణిక,శాయనభాష్యములోనూ చెప్పబడింది.
"న స్త్రీ శూద్ర వేదం అధీయతాం"(స్త్రీలు,శూద్రులు వేదమును అభ్యసింపరాదు)అన్నది మధ్యయుగపు గ్రంథాలలో చేర్చారు కానీ ఈ వాక్యము ఏ వేదములోనూ లేదు.ఇది వైదిక వాక్యము కాదు.
7.ఇక జనక మహారాజు కొలువులోని గార్గి అనే మహాయోగిని గురించి అందరికీ తెలుసు.యాజ్ఞవల్కుడు అను ఋషిని ధైర్యంగా ప్రశ్నలు అడగి సమాధానాలు రాబట్టింది.ఆ తర్వాతనే యాజ్ఞ్యవల్కుడు వేదవేత్తగా అంగీకరింపబడ్డాడు.ఈ యాజ్ఞవల్క్యుని భార్య అయిన మైత్రేయి ఇతనిచే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఆ కాలంలో చాలా పేరుప్రఖ్యాతులు పొందింది.(బృహదారణ్యకోపనిషత్తు నుండి).
8.వజ్రసూచీ ఉపనిషత్తు ప్రకారం ఎవరికి వేదాలను అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన కోరిక ఉంటుందో,సామర్థ్యము ఉంటుందో వారు స్త్రీపురుషశూద్ర భేధము లేక అందరూ అర్హులే.

నిజమైన ఆత్మానుభవం పొందిన వారి ఉపదేశాలకు,శాస్త్ర వాక్యాలకు వైరుధ్యమేర్పడినప్పుడు ఆత్మవేత్తల(ఆత్మానుభవం పొందినవారు)మాటే వినమని ధర్మశాస్త్రాలు చెపుతాయి.

దుష్టము,సంకుచితము ఐన నేటి కులవ్యవస్థ శాస్త్రీయము కాదని,ఇవి వేదాల తర్వాతి కాలంలోని గ్రంథాలలో చేర్చబడ్డాయని చెప్పవచ్చు.


--
kishore always with u....!

Read More

భీష్మ ఏకాదశి ! గురించి తెలుసుకుందామా ?

 భీష్మ ఏకాదశి !
ఈ పర్వదినం గురించి తెలుసుకుందామా ?

మాఘ శుక్ల ఏకాదశినే '' భీష్మ ఏకాదశి '' అంటాము. భీష్ముడు ఆజన్మ బ్రహ్మ చారి, అష్ట వసువులలో ఒకడు, మహాభారతానికి ఆది పురుషుడు, ధర్మ శాస్త్రాలు తెలిసిన మహాజ్ఞ్యాని, త్యాగశీలి, బుద్ధిశాలి, ధీరోదాత్తుడు, గొప్ప యోధుడు, అతి పుణ్యాత్ముడు. కొంత మంది భీష్ముడు ఈ రోజునే మరణం పొందాడు అనుకుంటారు, కానీ నిజానికి భీష్ముడు నిర్యాణం చెందింది అష్టమి రోజున, ఆ రోజునే ' భీష్మాష్టమి ' అంటామని ఇది వరకే చెప్పుకున్నాం.
మరి ఈ రోజును ' భీష్మ ఏకాదశి ' అని ఎందుకంటారు ? అన్న సందేహం కూడా చాలా మందికి వస్తుంది. 

భీష్ముడు ఇచ్చా మరణ వరం కలవాడు. అంటే అనుకున్నపుడే మరణించ గలడు. తన తండ్రికి సత్యవతి అనే కన్యకు వివాహం జరిపి ఆమె పుత్రుడే రాజ్యానికి రాజు కావాలన్న తండ్రి అభీష్టము గ్రహించి ' నిశ్చయాత్మక బుద్ధితో నేను చేసే సత్య ప్రతిజ్ఞ్యను ఆలకించండి, ఇంతకు పూర్వం కానీ ఇక ముందు కానీ ఇలాంటి ప్రతిజ్ఞ్యను ఎవరు చేయలేదు చేయరు. ఇప్పటి వరకు రాజ్యంపైన నాకుండే అధికారమును మాత్రమె కాదు రాజస్త్రీ భోగాలను, సంతాన వాంచను కూడా వదిలేస్తున్నాను, ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తున్నాను '' అని కఠోర ప్రతిజ్ఞ్య చేశాడు. దాన్నే ' భీష్మ ప్రతిజ్ఞ్య ' అంటారు. 
తండ్రి శంతనుడు మెచ్చి ' ఇచ్చా మరణ వరం ప్రసాదిస్తాడు.

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు నేలకొరిగి 
ఉత్తరాయణ పుణ్య కాలం కోసం ఎదురు చూస్తూ 50 రోజులు శరీరం లో దిగిన బాణాలతో అంప శయ్య మీద వేచి వున్నాడు. చివరికి ఈ రోజు పవిత్ర మైన విష్ణు సహస్ర నామములను ధర్మరాజుకు ఉపదేశించాడు .
శ్రుత్వా ధర్మా నషేశేన పావనాని చ సర్వశః యుధిష్టిర స్సాన్తనవం పునరేవాభ్య భాషత --భీష్ముడు చెప్పిన నానా ధర్మాలను విన్న ధర్మరాజు చివరగా. కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.
కిమేకం దైవతం లోకే? కిం వాప్యేకం పారాయణం? స్తువంత: కం కమర్చంత: ప్రాప్నుయుర్మానవా శుభం? కో ధర్మ సర్వ ధర్మానాం భవత: పరమో మతః. కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్.?
లోకంలో ఎవరు దైవము? ఎవరిని పూజించి, స్తుతించి అర్చించాలి. దేనివల్ల మానవులకు శుభం కలుగుతుంది. అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమేది. దేనిని జపించుట వలన మనిషి సంసార బంధముల నుండి విముక్తి పొందుతాడు? అని.
దానికి భీష్మ పితామహుడు , జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అని చెబుతూ,
అనాది నిధనం విష్ణుం సర్వ లోక మహేశ్వరం
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఖాతిగో భవేత్.
ఆది అంతము లేని, సర్వ వ్యాపి అయిన, దేవ దేవుడైన , భగవంతుడైన విష్ణు స్తుతి వల్ల సర్వ దుఃఖములు తోలగుతవి- అని ఇంకా చెబుతూ

ఎషమే సర్వ ధర్మానాం ధర్మోధిక తమో మతః- ఇదియే అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమని నా మాట అంటాడు.
నన్ను అనుగ్రహించిన సద్గురువులలో ఒకరైన, మహా తపస్వి, పరమ పూజ్య నందానంద స్వామి ఒక రోజు దీనిని నాకు వివరిస్తూ, సత్యా, పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః- ఏది పరమమైన తెజమో, ఏది పరమ మైన తపమో అట్టి దివ్యము తేజోమయము అయిన మంగళ స్వరూపాన్ని ధ్యానించు అన్నారు.భగవంతుడైన శ్రీ కృష్ణుడు చిరు నవ్వు తో విని ఆమోదించాడు. ఇట్టి మహత్తర ఘట్టం ఎక్కడా లేదు. భగవంతుని దివ్య నామములను స్వయానా భగవంతుడే విని దీవించిన అపూర్వ ఘట్టం. అలా ఆనందించిన పరమాత్ముడు తనకిష్టమైన ఈ ఏకాదశికి ' భీష్మ ఏకాదశి ' అని నామకరణం చేస్తున్నాను, తద్వారా నీ ఖ్యాతి జగద్విదితం అవుతుంది, ఎవరైతే నీచే శ్రుతమైన ఈ 'విష్ణు సహస్ర నామం' ప్రతినిత్యం పారాయణం చేస్తారో వారికి ఉత్తమ గతులు లభిస్తాయి అని ఆశీర్వదించాడు. 
కనుక ప్రతి రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. అలా చేయని పక్షంలో కనీసం ఈ రోజైనా విష్ణు సహస్రనామం పాtరాయణం చేద్దాం, ఆ భీష్ముని ఋణం తీర్చుకుందాం, 
ముఖ్యం గా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్త పూర్వకంగా స్మరించి తదుపరి , ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం. పరమాత్ముని అనుగ్రహం పొందుదాం.


--
kishore always with u....!

Read More

ధ్వజస్థంభం

ధ్వజస్థంభం 

ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. 

ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓ కధ ఉంది.భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగాపేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ,అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు,"రాజా! మీ దర్శనార్ధమై మేమువస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో " మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని '' శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఇతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు". అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి" అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది...

--
kishore always with u....!

Read More

నీ అసలయిన మిత్రుడు ఎవరు ??


నీ అసలయిన మిత్రుడు ఎవరు ??
--
kishore always with u....!
Read More

భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్న ఇలాంటి వాటిని వ్యతిరేకించండి.

మీకు తెలుసా ? వాలెంటైన్ అనే
అతను గ్రీసు దేశంలోని ఒక క్రైస్తవ మత
ప్రవక్త. దేశ ద్రోహ నేరము క్రింద
ఆయనను ఉరి తీసారు, ఆ తేదీ ఫిబ్రవరి 14 .
గ్రీసు దేశం పై శత్రు దేశాల
వారు దాడులు చేస్తున్న సమయములో
వాలెంటైన్ యువతీ యువకులకు ప్రేమ
పాఠాలు చెబుతూ రహస్యంగా తన చర్చిలో
పెళ్ళిళ్ళు చేస్తుండేవాడట ఆ సందర్భములో ఆ
దేశపు రాజు క్లాడియస్ దేశ పరిస్థితిని
వాలెంటైన్ కు వివరించి యుద్ద తరుణంలో
ప్రేమ, పెళ్ళిళ్ళు మొదలైనవాటికంటే
సైన్యములో చేరి దేశాన్ని
కాపాడుకోవడం ముఖ్యం, సహకరించండి అంటే
వినకుండా ప్రేమే సర్వస్వం అని రాజుతో
మొండిగా వాదించి ఉరిశిక్షకు పాత్రుడయ్యాడు.
సుమారుగా క్రీ శ. 270 సంవత్సరములో ఈ
ఘటన జరిగింది, ఆ తరువాత క్రీ.శ. 498 లో
వచ్చిన పోప్ గెలీలియాస్ అనే ఆయన ఫిబ్రవరి
14 తేదీని ప్రేమికుల 'దినము' గా
ప్రకటించాడు.
ఒక క్రైస్తవ మత ప్రవక్త, ఒక దేశ ద్రోహి
యొక్క 'తద్దినాన్ని' మనము వేడుకగా
జరుపుకుంటున్నాము, కోట్ల
రూపాయలను తగలేస్తున్నాము, ఈ పండుగ
పేరుతో ఎంతోమంది యువతీ యువకులు తమ
అమూల్యమైన
జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఆలోచించండి, భారతీయ సంస్కృతిని
నాశనం చేస్తున్న ఇలాంటి వాటిని
వ్యతిరేకించండి.
Read More

ఇది ధర్మమేనా ?? అవును ఇది ధర్మమే

ఇది ధర్మమేనా  ?? అవును ఇది ధర్మమే
Read More

నార్త్ ఇంగ్లాండ్ లో లక్ష్మి నారాయణ ఆలయము

నార్త్ ఇంగ్లాండ్ లో లక్ష్మి నారాయణ ఆలయము
Read More

పాపపు గొర్రెల్లరా ?? హిందూ ధర్మమును దూషించటం అంటే ?? ఆకాశం మీద ఉమ్ము వేసి నట్టే

పాపపు గొర్రెల్లరా ??  హిందూ ధర్మమును దూషించటం అంటే ?? ఆకాశం మీద ఉమ్ము వేసి నట్టే
Read More

మీకు తెలుసా ? భారతీయుల విజ్ఞాన శాస్త్రము. మీలో ఎంతమందికి తెలుసు


మీకు తెలుసా ?
తంజావూరు బృహదీశ్వరాలయము 216
అడుగుల ఎత్తు .. ఈ ఆలయం పై
వర్షం పడినప్పుడు శిఖరం నుంచి
క్రిందవరకు నీటిని ఒకచోటకు వచ్చేలా చేసి
అక్కడనుంచి ఒక గొట్టం ద్వారా కోనేరు /
భూమిలోపలకి పంపేల ఏర్పాటు చేసారు . 1000
సంవత్సరాల క్రితమే మనవాళ్ళు ఎంత గోప్పగా
ఆలోచించారో చూడండి ..
Read More

క్రైస్తవులకు వారితో ఏమి పని

క్రైస్తవులకు వారితో ఏమి పని
Read More

హిందూ హిందుత్వం

హిందూ హిందుత్వం

192 కిలోమీటర్ల పొడవు...
192 కిలోమీటర్ల వెడల్పు..
36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..
బారులు తీరిన వీధులు..
వీధుల వెంట బారులు తీరిన చెట్లు..
రాయల్ ప్యాలెస్‌లు..
రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు..
కమర్షియల్ మాల్స్..
కమ్యూనిటీ హాల్స్..
క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే
అపూర్వ మహానగరం..
రత్నస్తంభాలు..
వజ్ర తోరణాలు..
సాటిలేని ఆర్కిటెక్చర్..
సముద్రం మధ్యలో మహా నిర్మాణం..
జగన్నాథుడి జగదేక సృష్టి..
క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటి
లెజెండ్ సిటీ...
ద్వారక..
ఇప్పుడు సాగర గర్భంలో..
మన నాగరికత..
మన సంస్కృతి..
మన ప్రతిభకు పట్టం కట్టిన
నాటి కాస్మోపాలిటన్ సిటీ..
ద్వారక
----------------------------
అవును, రామాయణం నిజం.. మహా భారతం నిజం..
ద్వాపర యుగం నిజం.. వేల ఏళ్ల నాటి మన
సంస్కృతి నిజం.. అద్భుతమైన మన నాగరికత
నిజం.. అపూర్వమైన మన సైన్స్ నిజం.. సాటి లేని
మన ఇన్వెన్షన్స్ నిజం.. ఇందుకు ఈ సముద్ర
గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని
ఉదాహరణ.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ద్వారక..
గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా..
1980వ దశకంలో గుజరాత్ సముద్ర తీరంలో
జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో
అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన
గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో
సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది..
మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ
నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే
ఇవాళ మనం చెప్పుకుంటున్న
ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ
నిర్మించిన ద్వారక..
ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల
కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే.. శిథిలాల
రూపంలోనే అయినా, ఒక మహా నగరమే
బయటపడింది.. సముద్రం అట్టడుగున
ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్లే..
కిలోమీటర్ల కొద్దీ, అంతమెక్కడో తెలియనంత
విస్తీర్ణంలో అపురూపమైన
నిర్మాణం వెలుగు చూసింది..
మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్
ఏస్.ఆర్. రావు నేతృత్వంలో సాగిన ఈ
పరిశోధనలు ఈ మహానగరాన్ని
దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల
క్రితం నాటిదిగా నిర్ధారించారు.. మహాభారత కాలంలో
కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది..
శ్రీకృష్ణుడు జన్మించిన
సమయం క్రీస్తుపూర్వం3222 జూలై 27
శుక్రవారం అర్ధరాత్రి... మధురలో కంసుడి జైలులో
జగద్గురువు జన్మించాడు.. కంసుడిని చంపిన
తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ
రాజు జరాసంధుడు, కాలయవనుడితో కలిసి 17
సార్లు యుద్ధం చేశాడు..
చివరకు ప్రజలకు రక్షణ
కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి
గోమతి తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు..
శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపంలో
ప్రళయం వచ్చి ద్వారక సాగర గర్భంలో
కలిసిపోయింది. కాలగర్భంలో ఆనవాలే లేకుండా
పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా
అదృశ్యమైంది..
-------------------
ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత భారత్
నాగరికత కూడా మాయమైపోయింది.. మనం అన్నీ
మర్చిపోయాం.. మన కల్చర్ గురించి
మనకు అందించేవాళ్లే లేకుండా పోయారు.
ఇప్పుడు అయిదు వేల ఏళ్ల తరువాత
ఒక్కటొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని
చూస్తుంటే మనకే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికీ
కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
సాగర గర్భంలో బయటపడిన ద్వారక
నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ
మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి
రెట్లు అడ్వాన్స్డ్ మెట్రోపాలిటన్ సిటీ అని
చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పర్ఫెక్ట్ ప్లాన్‌తో
ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు..
విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి
నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి
ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 వేల
చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర
నిర్మాణం జరిగింది.
ఈ నిర్మాణం కూడా అలాంటిలాంటి సెユ్టల్ కాదు.
ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా
తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి..
శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16వేల మంది
గోపికలకూ ఒక్కో రాజభవనం ఉండేదిట.. ఈ
భవనాలన్నీ కూడా క్రిస్టల్స్, ఎమరాల్డ్, డైమండ్స్
వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క
మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డ్‌గా
ద్వారకను చెప్పుకోవాలి..
పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట
బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో
ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ
వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస
గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ
పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి
సౌకర్యాలు ఉండాలో.. అలాంటి సౌకర్యాలన్నింటితో
నిర్మించిన ఏకైక నగరం ద్వారక..
నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే
అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్
మహానగరంలో ఎక్కడ కమర్షియల్ జోన్లు ఉండాలో,
ఎక్కడ రెసిడెన్షియల్ జోన్లు ఉండాలో
ఇప్పుడు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు..
ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో
తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ,
ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.. కమర్షియల్
జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా పబ్లిక్
యుటిలిటీస్, భారీ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి..
బ్యూటీకే.. బ్యూటీ... అందమైన గార్డెన్లు,
పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్
సిటీ ఆఫ్ ఇండియాగా అలరారిందనటంలో
సందేహం లేదు.
----------------------------
రామాయణ కాలంలో రావణుడి ఎయిర్పోర్ట్లన
ు కనుగొన్నాం.. అతని ఆర్కిటెక్చర్ నైపుణ్యాన్ని
తెలుసుకున్నాం.. భారత కాలంలో ద్వారక
శ్రీకృష్ణుడి దార్శనికతకు దర్పణం పట్టింది..
భారత దేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత
ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి
చెప్పింది.. కాల గర్భంలో కలిపేందుకు చూసినా
కలిసేది కాదని నిరూపించింది..
న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డిసి, లండన్,
మాస్కో, బీజింగ్, టోక్యో, ముంబయి.. ఇవన్నీ
ఏమిటని అనుకుంటున్నారా? ఇవాళ
ప్రపంచం గొప్పగా చెప్పుకునే, చాటుకునే
మహానగరాలు.. మెట్రో పాలిటన్ సిటీలు.. కాస్మో
పాలిటన్ సిటీలు.. ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప
ఇవాళ్టి రూపానికి రాలేని నగరాలు..
ఈ మెట్రో, కాస్మో పాలిటన్‌లకు వేల
రెట్లు అడ్వాన్స్డ్ అభివృద్ధితో అపురూప నగర
నిర్మాణం ఆనాడే జరిగింది. అదే ద్వారక.. ఇక్కడ
కేవలం కమర్షియల్ జోన్లు ఏర్పాటు చేయటమే
కాదు. సాగర తీరంలో గొప్ప హార్బర్‌ను కూడా యాదవ
రాజులు సక్సెస్‌గా నిర్వహించారు. గ్రీకు, ఇతర
దేశాలతో నౌకల ద్వారా అంతర్జాతీయ వర్తకం కూడా
చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.
ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్
రావు పరిశోధనల్లో ద్వారక ఆరు ప్రధాన రంగాల్లో
ద్వారక అభివృద్ధిని సాధించిందని ధృవీకరించారు.
ద్వారకను ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి గా
పిలిచేవారని కూడా తేల్చారు..
క్రీస్తుపూర్వం 3138లో మహాభారత
యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తరువాత
36 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు ద్వారకలోనే
ఉన్నాడు.. ఆ తరువాత యాదవ రాజుల మధ్య
పరస్పరం గొడవలతో ఒకరికొకరు చంపుకున్నారు..
ఆ తరువాత కొంతకాలానికే శ్రీకృష్ణుడు దేహ
పరిత్యాగం చేసి భూమిని విడిచివెళ్లిపోయాడు..ఈ
భూమిపై కృష్ణుడు నివసించింది 120
సంవత్సరాలు. కృష్ణ
నిర్యాణానంతరం ద్వారకను సముద్రం ముంచివేసింది.
సాగరం ఉవ్వెత్తున ఎగిసి వస్తుంటే
తాను ప్రత్యక్షంగా
చూసినట్లు అర్జునుడు మహాభారతంలో
చెప్తాడు..
సాగర గర్భంలో మునిగిపోయింది మునిగిపోగా..
తీరం వెంట కూడా ద్వారకకు సంబంధించిన,
కృష్ణుడి రాజ్యానికి సంబంధించిన
ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుతం కనిపించే
ద్వారకాధీశ్ ఆలయం కూడా కృష్ణుడి
మనవడు వజ్రనాభుడే నిర్మించినట్లు చరిత్ర
చెప్తోంది...అసాధారణ భారతీయ ప్రతిభకు,
నాగరికతకు, సంస్కృతికి ఎవరెస్ట్ శిఖరమంత
కీర్తి -కృష్ణ ద్వారక.
Read More

రామాయణ కాలము నాటి భారత దేశము

రామాయణ కాలము నాటి భారత దేశము
Read More

శిధిల అవస్తలో వరుణ ఆలయం, 1000 సంవచ్చారాల నాటి చరిత్ర . అతి పురాతన దేవా లయము

శిధిల అవస్తలో వరుణ ఆలయం, 1000 సంవచ్చారాల నాటి చరిత్ర . అతి పురాతన దేవా లయము.
Read More

వేసవిలో ఆరోగ్యానికి పుచ్చకాయ ఎంతో మేలు?**

వేసవిలో ఆరోగ్యానికి పుచ్చకాయ ఎంతో మేలు?**
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
చండ్ర నిప్పుల్లో పుచ్చకాయ తింటే ఆ హాయే వేరు. తాపాన్నీ తీర్చడంతో పాటు చెమట రూపంలో బయటకెళ్ళే లవణాలను పుచ్చ కాయ సమకూర్చుతుంది. ఇనుము ఎక్కువగా ఉన్నందున రక్త హీనత తగ్గిస్తుంది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
100 గ్రా.ల పుచ్చకయలో లభించే పోషకాలు ఇవి..*
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
శక్తి: ౩౦ కిలో క్యాలరీలు
పిండిపదార్ధాలు: 7.5 గ్రా.
పీచు: 0.4 గ్రా.
ప్రోటీన్: 0.6 గ్రా.
నీరు:91.5
విటమిన్ ఏ: 3 మీ.గ్రా
విటమిన్ సి: 8.1 మీ.గ్రా
కాల్షియమ్: 7 మీ.గ్రా
ఐరన్: 0.24 మీ.గ్రా
మెగ్నిసియం:10 మీ.గ్రా
పాస్పరస్: 11 మీ.గ్రా
పొటాసియం: 122 మీ.గ్రా
జింక్: 0.1 మీ.గ్రా
Read More

వైదిక కర్మలలో తోలి మంత్రముగా పిలువబడే మంత్రము ఏమిటి ??

వైదిక కర్మలలో తోలి మంత్రముగా పిలువబడే మంత్రము ఏమిటి ??

వైదిక కర్మలలో తోలి మంత్రముగా పిలువబడే డి సహజముగా
" ఓం గణానాం త్వా గణపతిగ్మ్ హవామహే
కవిం క్వీనాముపవశ్రవస్తమమ్
జ్యేష్ట రాజం బ్రహ్మణామ్ బ్రహ్మణస్పత
ఆ నః శ్రుణ్వనూతిభి
స్సీద సాదనం - ఓం మహా గణపతయే నమః
Read More

సీతమ్మ వారి పూర్వీకులు ఎవరు ?? తెలుపకలరు ??

సీతమ్మ  వారి  పూర్వీకులు  ఎవరు ??  తెలుపకలరు ??

నిమి సీతాదేవి వంశ మునకు మూల పురుషుడు. ఈయన కొడుకు  "మిధి",
మిధి కుమారుడు  జనకుడు.
ఈ  వంశము నందే కీర్తి రాతుడు, మహారోముడు ప్రభవించారు .
మహా రామునికి స్వర్ణ రోముడు.
స్వర్ణ రోము నికి  హ్రస్వ రోముడు
హ్రస్వ రోముని సన్తామే జనకుడు. 
జనకుని అసలు పేరు " సీరధ్వ జుడు" ,
జనకుని తమ్ముడు  " కుశె ధ్వజుడు "
హ్రశ్వరోముడు  జనకునికి పట్టాభిషేకము చేసి అడవులకు వెళ్ళిపొయినాడు.
జనకునికి  సీతమ్మ వారితో పాటు  "ఊర్మిళ "  కూడా ఉన్నది .
జనకుని తమ్ముడు "కుశె ధ్వజుడు" కి మాండవి, శ్రుత కీర్తి  అను కుమార్తెలు ఉన్నారు .

Read More

Powered By Blogger | Template Created By Lord HTML