గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 11 January 2014

కాలం కాపాడుతుంది

కాలం కాపాడుతుంది

కాలం, దేశం, క్రియ, కర్త, ఉపకరణ, ద్రవ్యం, ఫలం - ఇవన్నీ నారాయణుడే!’ అని భాగవత వాక్యం. అన్నీ నారాయణుడే అయినప్పుడు, ఒకదానికొకటి ప్రతికూలం కావు. పరస్పరం సహకరిస్తూ, సమకూరి పరిపూర్ణమవుతాయి. అందుకే పై ఏడింటినీ భగవత్స్వరూపంగా పవిత్రంగా భావించడమే సాఫల్యం. ఈ సాఫల్యమే గొప్ప శుభాకాంక్ష.
’అన్నీ భగవంతుడే’ అనే భావనను బలపరచుకోవాలి. అప్పుడు తప్పుచేసే లక్షణం తరిగిపోతుంది. ఆ సద్భావన మనలో శక్తిని పెంచుతుంది. ప్రయత్నాలకు సార్థకతను ప్రసాదిస్తుంది.
అందుకే కాలాన్ని ఈశ్వర రూపంగా భావిస్తూ ఈకాలం మనకు అనుకూలం కావాలని ఆకాంక్షిస్తూ నూతన వత్సరాన్ని ఆహ్వానించడం మంగళకరం. పైన చెప్పిన ఏడింటిలో మొదటిది కాలం. దాన్ని ఆధారం చేసుకుని మిగిలిన ఆరూ ఫలవంతమవుతాయి. భగవంతుడు కాలస్వరూపుడై, మిగిలిన తన ఆరు రూపాలను అనుగ్రహిస్తాడు.
ఈ ఏడు రూపాల ఈశ్వరుడి కృప కావాలంటే -ధార్మికమైన అంతఃకరణ అవసరమని వేదవాజ్ఞ్మయం బోధిస్తోంది. ’ఎవరికి విమలమైన మనసు ఉంటుందో వారిని దేవతలు రక్షిస్తారు. నర్య, తుర్వీత, యదు, తుర్వశ - అనేవారిని ఇంద్రుడు రక్షించిన ఘట్టమే దీనికి ప్రమాం’ అని ఒక ధార్మిక శ్లోకం. దీనికి ఆధారం ఒక వేద కథ. ఒకప్పుడు నర్య, తుర్వీత, యదు, తుర్వశ - అనే నలుగురు రాజులు వేర్వేరు దేశాలను పాలిస్తున్నారు. వారందరూ ధార్మికులు. వారి పాలనలో రాజ్యమంతా సుభిక్షం, శాంతియుతం. వీరి నైతికత రాజ్యాలకు కవచమై, అన్ని విధాలా అభివృద్ధి సాధించాయి. వారు మిత్రులుగా పరస్పర సహకారంతో ఉన్నారు.
అన్ని రకాలా అభివృద్ధి చెందిన ఈ రాజ్యాలను ఆక్రమించాలనే తలంపుతో శంబరుడనే ఒక దుష్ట రాజు కొందరు దుష్టులను కూడగట్టుకొని యుద్ధానికి వచ్చాడు.
నలుగురు రాజులు అతణ్ణి శాంతి ఒప్పందానికి పిలిచి, ’జననష్ట ధన నష్టాలను వారించడానికై వెనుతిరిగి వెళ్ళవలసింది’గా కోరారు. ఆ రాజుల బలాన్ని చూసి శంబరుడు కాస్త జంకి, అయినా శాంతికాముకులై వారు శౌర్యాన్ని ప్రదర్శించకపోవడంతో కాస్త ధైర్యం చెందాడు.
తాను వెనుతిరుగుతాననీ, కానీ ఆ రాజులు తమ సైన్యాలను కూడా ’విఘటితం’ చేయాలనీ నిర్దేశించాడు. యుద్ధం కోరని ఆ ధార్మిక రాజులు సరేనని, తమ సైన్యాలను బాగా తగ్గించివేశారు.
మరి యుద్ధానికి రానని చెప్పి వెనుతిరిగిన శంబరుడు, కొద్దినాళ్ళలో తన సైన్య బలాన్ని పెంచుకొని, ఒప్పందానికి విరుద్ధంగా హఠాత్తుగా ఆదేశాలపై దాడి చేశాడు. నైతికంగా ఒప్పందానికి బద్ధులైన నర్యుడు, తుర్వీతుడు, యదువు, తుర్వశుడు ఈ ఆకస్మిక దాడికి అచ్చెరువొందారు. తమ సైన్యబలం తగ్గి ఉంది. ఉన్న బలంతోనే ఎదుర్కొన్నారు. వారి ధర్మబద్ధతకీ, ఇన్నాళ్ళ నైతిక ధార్మక జీవనానికీ సంతోషించిన దేవరాజు ఇంద్రుడు తన దేవతా సైన్యాన్ని సహాయకంగా పంపాడు. దేవ సైన్యబలంతో శంబరునీ, అతడి సైన్యాన్నీ ఈ నలుగురు రాజులూ ఓడించారు.
సహకరించిన ఇంద్రుడికి కృతజ్ఞతతో నమస్కరించారు ఆరాజులు. వారి ధర్మనిరతికి సంతోషించిన మహేంద్రుడు అభీష్ట వరాన్ని క్చెప్పమన్నాడు. ’దేవరాజా! నీ కారుణ్యానికి కృతజ్ఞులం. క్లిష్ట సమయంలో నీవు మమ్మల్ని ఆదుకున్నందుక కారణమేమిటి?’ అని ప్రశ్నించిన రాజులతో -
’మీనీతి నిబద్ధతలను గమనించి, నేను రక్షించాను’ అని చెప్పాడు ఇంద్రుడు. ’ఏ నీతినీ, ధర్మాన్నీ చూసి మమ్మల్ని రక్షించావో - ఆ ధార్మిక నైతిక బుద్ధి మాకు ఎల్లవేళలా ఉండేలా అనుగ్రహించు’ అని వరాన్ని కోరుకున్నారు ఆ రాజులు. -కథలో ప్రాచీన భారత ఋషి ఎన్నో అద్భుత సందేశాలనిచ్చాడు. నీతి ధర్మాలను వదలని నిర్మల చిత్తమే నిజమైన బలం. ఇది ఉంటే ఈశ్వరుడి బలం ఉన్నట్లే. ముల్లోకాల సంపదలను ఇవ్వగలిగిన ఇంద్రుడి ముందు, కేవలం ధర్మబుద్ధినే నిలపమని నర్యుడు మొదలైనవారు అడిగారు. అంటే - సంపదకంటే నీతి గొప్పది. ఆ బలం ముందు ధనబలం, జలబలాలు పనిచేయవని తాత్పర్యం.
ధర్మబలం ఉన్నచోట - అధికార కాంక్షులైన శత్రువులు ఎన్ని క్షుద్రవ్యూహాలు పన్నినా విఫలమవుతాయి - అని చాటుతోందీ కథ.
అవినీతి లేని నిర్మల బుద్ధికి - కాలంతో సహా దేశ, క్రియ, కర్త ఉపకరణ, ద్రవ్య ఫలాల రూపంలో ఉన్న భగవంతుడు అనుకూలిస్తాడు. సత్ఫలితాలనిస్తాడు. నూత్న సంవత్సర రూపంలో ఉన్న కాల విష్ణువు ఈ దేశానికి ధర్మబద్ధమైన నైతిక పాలనా తేజాన్ని ప్రసాదించాలని శుభాకాంక్షలు పలుకుతూ స్వాగతిద్దాం!

(ఈనాడు, అంతర్యామి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు)
Read More

108 ప్రత్యేకత ''ఏకం సత్ విప్రా బహుధా వదంతి''

108 ప్రత్యేకత

''ఏకం సత్ విప్రా బహుధా వదంతి''

''సత్యం ఒక్కటే'' దానిని జ్ఞానులు బహువిధాలుగా చెపుతారు. ఆవిష్కరణ సృష్టి భగవంతునిలోనే ఉంది.
స్వర్గం, పాలపుంత, గ్రహాలూ, నక్షత్రాలు, మానవులు, ఇతర జీవకాలమూ ఆభగవంతునిచే సృష్టించబడింది. ఈ విశ్వంలో ఒక లయ, ఒక కూర్పు, ఒక సమన్వయం ఉంది. ఈ విషయం ప్రాచీన భారతీయులకు బాగా తెలుసు.
సంభ్రమమైన 108 సంఖ్య ప్రాచీన భారతీయులకు చాల పవిత్రమైనది. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో 108 సంఖ్యకు వారు చాలా ప్రాముఖ్యతనిచ్చారు.
దేవునికి/దేవతలకి మంత్ర పుష్పాలతో పూజిస్తూ 108 పవిత్ర తులసి/రుద్రాక్షలు గల పవిత్ర జపమాలలను గణిస్తూ జపం చేసేవారు.
108 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో గల హిందువులే కాదు, భౌద్ధులు, జైనులు, సిక్కులు, (ప్రస్తుతం క్రిష్టియన్స్ కూడా ప్లాస్టిక్, రేడియం జపమాలలు మొదలెట్టారు) వంటి వారు కూడా గుర్తించారు. తనలోని దైవత్వం గ్రహించడానికి ఆత్మ 108 మెట్లు దాటాలని పూర్వీకుల నమ్మకం.

వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి సంభందించిన గణనలో
భూమికి, చంద్రునికి, మధ్య దూరం, చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉందని,
భూమికి సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉందని,
సూర్యుని యొక్క వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లని నిర్ధారించారు.
ఈ వేద గణనలో ఆధునిక సాంకేతిక విశ్వ గణనలో లభించిన భూమికీ - చంద్రునికీ, భూమికీ - సూర్యునికీ ఉన్న దూరంతో దాదాపు సరిపోయింది.

ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలు గుర్తించింది. 108 మర్మ స్థానాల గొలుసులో 107 గ్రంధులు శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది.
అలాగే పవిత్రమైన శ్రీ చక్రంలో 57స్త్రీ, 54పురుష అంతర్భాగాలు ఉంటాయి. ఇవి మొత్తం 108.
మనవ ప్రవృత్తికి సంభందించి బ్రహ్మాండాన్ని 27 చంద్ర సూచికలైన నక్షత్రాలతో, ఒక్కో నక్షత్రం తిరిగి 4పాదాలతో ఉంటుందని గుర్తించింది. ఇవి మొత్తం 108 పాదాలయింది. అవే 108 ప్రాదమిక మనవ ప్రవృత్తులు. శిశు జనన సమయంలో చంద్రుడు ఏ పాదంలో ఉంటాడో, దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో, వృత్తిలో, ఆనందంలో, కుటుంబంలో, చివరకు మోక్షమార్గంలో కూడా ప్రతిఫలిస్తుంది. బారతీయ జ్యోతిష్యంలో 12రాశులు, 9గ్రహాలు ఉంటాయి. 12ని 9తో హెచ్చవేస్తే 108.
మానవుడు సగటున ప్రతిరోజూ 21,600సార్లు శ్వాస తీస్తాడు. అందు 10,800 సూర్యాంశ, 10,800చంద్రాంశ, 108ని 100తో గుణిస్తే 10,800 వస్తుంది. దీనిని 2తో గుణిస్తే 21,600 వస్తుందని తంత్ర శాస్త్రం చేపుతుంది.
సంఖ్య శాస్త్రం ప్రకారం 108లో 18కి యజ అనే పేరు. దేనిని తిరగవేస్తే ''జయ'' అని వస్తుంది. ఈపేరుతోనే మహాభారతం లిఖించబడింది. కాలక్రమంలో ''జయ'' అనే ఇతిహసాన్ని పెంచడం వలన ''మహాభారతం'' అనే పేరుతొ ప్రసిద్ది చెందింది.

మన పురాణములు 18, ఉపనిషత్తులు 108, భగవద్గీతలో 18 అధ్యాయాలు 18, ఇంకా ఎన్నో గ్రంధాలలో 108 శ్లోకాలు ఉంటాయి. విష్ణు సహస్రనామాలు 108, నిత్యమూ మనం పూజించే విధానంలో అష్టోత్తర శతనామాలు ఉంటాయి. భారతీయ కాలగణన ప్రకారం 4యుగాలలో 43,20,000 సంవత్సరాలు ఇది 108సంఖ్యతో భాగించబడింది.

ఇంతటి వైశిష్ట్యం గల 108సంఖ్య ఎంతో దివ్యమైనది. ఇది సృష్టికర్తకు, సృష్టి అనుసంధానం కలిగించేది. అందుకే ఋషులు, పురాణములు, వేదములు, భారతీయ సంస్కృతి 108సంఖ్యకు పవిత్రత ఇస్తున్నది.
Read More

రాగి పాత్రలలోని ఆరోగ్యం :

రాగి పాత్రలలోని ఆరోగ్యం :

మనం నీరు త్రాగేముందు ఈ మధ్యకాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని లీటర్ 4రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరు. రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే!

భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.

ఈమధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు.

ఈమధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం. ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.

కనుక రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Read More

గురువుని మించిన దైవం లేదు.

గురువుని మించిన దైవం లేదు.
శివ - పార్వతులు, బ్రహ్మ- వాణి లు, విష్ణువు - లక్ష్మి లు, అరుంధతి - వశిష్టులు, దేహం ధరించి ప్రజలని అనుగ్రహించడం కోసం గురువుల రూపంలో మానవ శరీరాకృతి దాల్చి వస్తారు. అందుకే అన్నారు ''గురునింద మహాపాతకం'' అని. గురువుని దిక్కరించరాదు. ఏకవచనంతో సంభోదించరాదు. వాదమున జయించ రాదు. ఇలా చేసినవారు బ్రహ్మరాక్షస జన్మలని పొంది నరకం పాలౌతారు. అతని మాటను జవదాటరాదు. గురువుకి ఆధీనుడై నిత్యమూ చరించవలెను.
ఇటువంటి సంసారం తారకుడైన గురువు సామాన్యముగా లభించడని గుర్తించవలెను.గురువు ప్రసన్నుడైతే అతని రక్షణలో మోక్షలక్ష్మిని అనుగ్రహిస్తాడు.
'గు' కారమునకు అంటే అంధకారమని అర్ధము. 'రు' కారమునకు నిరోధకుడని అర్ధము. అంధకారమును నిరోధించువాడని అర్ధము. కావున గురువు అనబడుచున్నారు. ఇది కేవలం ఆధ్యాత్మిక గురువు కు మాత్రమే. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్నవారు ఉపాద్యాయుడు మాత్రమే. గురువుని కఠిన వాక్కు ఆశీర్వదముగా భావించాలి. గురువునకు అభివాదము ఒనర్చి అతని దగ్గర నుండి లౌకికముగాని, వైదికముగాని, అధ్యత్మికముగాని యైన జ్ఞానమును పొందవలెను. గురుభక్తి సదాచారము. గురుద్రోహము పాతకము, ఆయన అడుగుజాడలు తరింపజేయునవి. ముక్తినిచ్చునవి. ఇది దేహమున్నంతవరకూ క్రమము. గురువు ఎదుట అసత్యమాడిన అది గోబ్రాహ్మణ వధకన్నా అధికమైనది. గురువు చెప్పిన వాక్కు శాసనముగా భావించువాడే శిష్యుడు అనబడును. గురువు చెప్పిన నిషిద్దమైన గురువాజ్ఞను చేయవలసిందే. గురువుతో ఏకత్వమును భావింపరాదు. (ఏకాంతంగా ఉండాలని కోరుకోకూడదు.), ప్రాణమున్నంత వరకు వర్ణాశ్రమ ధర్మాలు పాటించవలసిందే. ఉత్తమజాతిలో జన్మించినా, అత్యధిక విద్యావంతుడు అయినా, ధనవంతుడైనా(కోట్లకి పడగలెత్తినా) గురువునకు సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. రాజును, దేవతను, గురువును ఒట్టి చేతులతో దర్శించరాదు. ఆగనమనాది, వేద శాస్త్రాలను, ఇతరుల సిద్దాంతాలను దూషించరాదు. గురువాజ్ఞను ఉల్లంగించరాధు.
Read More

న్యూఢిల్లీ : అంతరిక్షంలో దేవుడి చేయి ప్రత్యక్షమైందా?

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజుమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు.

న్యూఢిల్లీ : అంతరిక్షంలో దేవుడి చేయి ప్రత్యక్షమైందా? వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ అపురూప దృశ్యం ఆవిశృతమైందా? కొందరు అవును అంటుండగా, మరికొందరు కాదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా నాసా విడుదల చేసిన దృశ్యాలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. చేతిని పోలిన ఆకారం నింగిపై దర్శనమివ్వడం ... ఆ సుస్పష్ట ఆకారం వెలుగులు విరజిమ్మడం .. కొత్త ఊహలకు తావిస్తోంది. నాసాకు చెందిన న్యూక్లియర్‌ స్పెక్ట్రోస్కోపిక్‌ టెలిస్కోప్ ఆరే - న్యూస్టార్‌ తీసిన ఎక్స్‌రే ఇమేజెస్‌లో చేయి ఆకారంలో ఉన్న మబ్బులాంటి దృశ్యాలు కనిపించాయి.

నక్షత్రంలోంచి పుట్టుకొచ్చినట్టున్న ఈ చేయి ఆకారానికి 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌'గా పిలుస్తున్నారు. ఏడాది క్రితం దేవుడి కన్ను అంటూ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఓ ఫొటోను విడుదల చేసింది. ఇప్పుడు నాసా తీసిన ఈ ఫొటోలు ఖగోళ అద్భుతాలను కళ్ల ముందు ఉంచుతున్నాయి. ఇంతవరకూ ఎప్పుడూ అర్థావృత్తాకారంలో లేదా వృత్తాకారంలోనే ఇటువంటి అరుదైన దృశ్యాలు కనిపించేవి. తొలిసారిగా చేయి ఆకారంలో కనిపించడంతో .. కచ్చితంగా ఆ దేవదేవుడి అభయహస్తమేనని భక్తులు నమ్ముతున్నారు. ఇటు నాసా కూడా ఈ ఆకారం ఎందుకు, ఎలా వచ్చిందని పరిశోధనలు చేస్తోంది.
Read More

ముక్కోటి నాడు ఉత్తర ద్వారా దర్సనం ఎందుకు

Read More

ఒకనాటి వైకుంట ఏకాదశినాడు నారదుడు నారాయణుని ఇలా ప్రశ్నించాడు -శ్రీ గంగ చౌదరి

ఒకనాటి వైకుంట ఏకాదశినాడు
నారదుడు నారాయణుని ఇలా ప్రశ్నించాడు
ప్రభు నేను పుట్టిన క్షణం నుంచి మీ నమ స్మరణే చెస్తునాను
సంసారం భంధాలలో చిక్కుకొండ సన్యాసం స్వికరించాను
మీ భక్త బృందం లో నేనే కదా ఉత్తమ్మ భక్తుడను అన్నాడు నారదుడు,

నారాయణుడు చిద్విలాసం చేసి
నారద నీ ప్రశ్న కు సమాధానం చెప్తాను కాని
ముందు ఈ కథ విను
తరువాత నీకే అర్థం అవుతుంది

ఒక పల్లెటూరిలో విష్ణుదాసుడు అనే వ్యక్తి ఉన్నాడు
అతనికి భార్య ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న తముడు చెల్లి ఉన్నారు
అతని సంపాదన పైన వారి కుటుంబం ఆధారపడి ఉంది,
ఎన్నో కష్టాలు అనుభవిస్తూ రెండు పూటలా అన్నం
వాళ్ళ మనుషులకు పెట్టడానికి 18గంటలు పనిచేస్తుంటాడు
చెల్లి కి పెళ్లి చేస్తాడు,
తముడు కి వ్యాపారం పెట్టించాడు
తల్లి తండ్రులకు మంచి వైద్యం అందించాడు
భార్య బిడ్డలకు ఏ కొరత రానీకుండా చుసుకునాడు
అతనే నాకు ఇష్టమైన భక్తుడు అనడు విష్ణు దేవులు,

నారదుడు ఇలా ఆశ్చర్యం తో ఇలా అడిగాడు
ప్రభు విష్ణుదాసుడు ఎలా మీ భక్తుడు అయ్యాడు
మీ కోసం ఉపవాసాలు చేయలేదు
గుడి గోపురాలు తిరగలేదు
అర్చన అభిషేకాలు చేయలేదు
మరి ఎలా మీ ఇష్ట భక్తుడు అయ్యాడు అని ప్రశ్నించాడు నారదుడు

నారద నా భక్తుడు కావాలి అంటే
నా కోసం గుడి కట్టకర్లేదు
ఉపవాసాలు అర్చన అభిషేకాలు యజ్ఞాలు చేయకర్లేదు,
ఒకటి చేస్తే చాలు
అది ఏమిటి అంటే
నా కుటుంభం అంటే విశ్వం
నేను ఇచ్చిన భంధాలు
అంటే అమ్మ నాన్న భార్య భర్త
కొడుకు కూతురు సోదరి సోదరులు ఇలా
నేను వేసిన జీవాత్మ సంకెళ్ళను సునితంగా విపుకోవాలి,

అది ఎలా అంటే
ప్రతి ఒకరి లో నన్ను చూడటం
ప్రతి ఒక్క భందానికి న్యాయం చేయటం
నేను ఇచ్చిన భంధాలలో నన్నే చూసుకొని
వారికీ నిర్వర్తించే భాధ్యతని నా సేవ కైకర్యం అనుకోని
నాకు అర్పిస్తే చాలు నేను ఆనందిస్తాను
నిరంతం నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటె చాలు వారి వెంటే నేను ఉంటాను

ఇలానే విష్ణు దాసుడు నాకు ఇష్ట భక్తుడు అయ్యాడు
నా పైన నిందలు వేయలేదు భందాలను ఇచ్చినందుకు
నా పైన చిరాకు చూపలేదు పిలిచినా నేను పలుకనందుకు
భక్తి తో భంధలా కర్మలను అనుభవిస్తూ నన్ను ధ్యానించాడు
నన్ను శరణు వెడుతూనే వారి కుటుంబ వ్యక్తులకు న్యాయం చేసాడు
విష్ణు దాసుడు చేసి చూపిన భక్తి అంటే నాకు ఇష్టం నారదః
అన్నారు విష్ణు దేవులవారు.

స్నేహితులారా మనకు స్వర్గం నరకం ఎక్కడో లేదు
ఎదుటి వారికీ మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది
ప్రేమిస్తే ప్రేమనే తిరిగి వస్తుంది
ద్వేషం చూపిస్తే ద్వేషం తిరిగి వస్తుంది
దీనికి మనం భగవంతుడ్ని తిట్టడం లేదా
మన భక్తి తో దేవుడ్ని బయపెట్టడం చేయకూడదు
మన భందాలను గౌరవిదాం ప్రేమిదాం సేవిదాం
భగవంతునికి ఇష్టులం అవుదాం
-శ్రీ గంగ చౌదరి


Read More

అయ్యా నాకు నా జన్మ నక్షత్రము తెలియదు ?? నీను ఎప్పుడు పుట్టేనో తెలియదు, నా జాతకము నీను ఎలా తెలుసుకోకలను ? ఎంతో మందిని అడిగేను తెలియదు అన్నారు. దయ చేసి తెలుపకలరు .

అయ్యా నాకు నా జన్మ  నక్షత్రము తెలియదు ?? నీను ఎప్పుడు పుట్టేనో తెలియదు, నా జాతకము నీను ఎలా తెలుసుకోకలను ? ఎంతో మందిని అడిగేను తెలియదు అన్నారు. దయ చేసి తెలుపకలరు .
ఎవరి జన్మ నక్షత్రం అయినా మనము తెలుసుకో గలిగే పరిజ్ఞానము మనకు మన జ్యోతిష్య శాస్త్రం, అందించినది. కాని ఇక్కడ మీ జీవితములో జరిగిన సంఘటనల పై ఆధారపడి ఉంటుంది, ఈ ప్రశ్నే కు జవాబు.
మీ జీవితములో జరిగిన అతి దురదృష్టకరమైన, దరిద్రమయిన, జీవితములో అంతకన్నా ఎక్కువ బాధ పాడనీ  సంఘటనలు ఏ రోజు జరిగిన  ఓ, అటువంటి సంఘటనల వివరాలు 3- రోజులవి, వివరాలు  ( ఉదా :: తండ్రి మరణం, తినటానికి కూడా అన్నం లేకపోవటం.... అతి నిక్రుస్టమయిన పరిస్థితి.... )  , మరియు
మీ జీవితములో జరిగిన అతి ఆనంద కరమయిన సంఘటనలు 3- రోజులవి,  వివరాలు ( ఉదా :: ప్రమాదాల నుండి బయట పడటం,  ......)

మీరు తెలిపిన ఈ 6- రోజుల వివరాలు, మీ జీవితములో మరిచి పోలేనివి అయి ఉండాలి.
ఈ వివరాలు తెలియచేయ కలిగిన మీ జన్మ నక్షత్రములు, రాసులు , వివరాలు తెలియ చేయుట చాల సులభము.

ధర్మ శాస్త్రానికి సాద్యం కానిది ఏది లేదు .
Read More

Thursday, 9 January 2014

భగవంతుని ప్రార్ధనలో ప్రధానమయినది ఏది ??

భగవంతుని  ప్రార్ధనలో ప్రధానమయినది ఏది ??
భగవంతుని ప్రార్ధనలో ప్రధానమయినది నమ్మకము, మరియు శ్రవణము,  శ్రవణము అంటే వినటం అని అర్ధం, శ్రవణము సరిగా ఉంటె తరువాత భక్తీ విదానాలన్ని సులభముగా సిద్దించును. విద్య లో శ్రెద్ద ఉంటే ప్రధమ శ్రేణిలో, సంగీతములో శ్రెద్ద ఉంటే, సంగీత విద్వాంసునిగా, తపస్సులో శ్రెద్ద ఉంటే తపోనిదిగా , దైవం పట్ల శ్రెద్ద ఉంటే మహా జ్ఞానిగా మనిషి మారును .
అందుకే శ్రేద్దగా శ్రేవనము చేయాలని శాస్త్రము చెపుతున్నది,  ఆ విధముగా శ్రేవనము చేసి, ప్రార్ధన చేసి భగవంతుని కృపకు పాత్రులు కండి .
శ్రెద్ద, విస్వాసములే భక్తికి పునాదులని పురాణాలు చేపుతున్నవి .
ఇవి సాధించిన వారిలో పరీక్షిత్ మహారాజు , కులశేఖరాళ్వారు, తులసి దాసు వంటి వారు ఎందరో ఉన్నారు
Read More

భక్తీ విధానమును బట్టి ఎన్ని విధాలుగా విభాగించ వచ్చు ?? అలా విభజించే విధానములు ఉన్నాయా ?? తెలుపకలరు ??

భక్తీ విధానమును బట్టి ఎన్ని విధాలుగా విభాగించ వచ్చు ?? అలా విభజించే విధానములు ఉన్నాయా ?? తెలుపకలరు ??
భక్తీ  అంటే ఆరాధన, ప్రార్ధన, నామ స్మరణ,  ధ్యానము, అన్నిటికంటే ముందు భగవంతుని పై నమ్మకము. అయిన మీరు అడిగేరు కాబట్టి , నాకున్న పరిజ్ఞానము మేరకు, భక్తిని ఈ క్రింది విధాలుగా విభజించ వచ్చు
భాగవతము ప్రకారం ::  శ్రవణ, కీర్తన, అర్చన, భక్తులచే నిగ్రహం,  బాహ్యేన్ద్రియ  సద్వినియోగము, స్మరణ, భక్తీ చే మనస్సంయమనం,  పాదసేవ, వందన భక్తులచే  అహంకార నాశనము, దాస్య భక్తీ చే సేవా భావము, సఖ్య భక్తీ చే  ఏకాత్మత, ఆత్మా నివేదన భక్తిచే బుద్ది భక్తునికి లభిస్తాయి.

Read More

నారద సూత్రాలు ఏమి చెపుతున్నాయి ???

నారద సూత్రాలు ఏమి చెపుతున్నాయి ???
కృతయుగములో తపస్సు చేతను, త్రేతాయుగములో యజ్ఞము చేతను,  ద్వాపర యుగములో పరిచర్య చేతను, కలియుగములో  ప్రార్ధన, ధ్యానము చేతను మాత్రమె దైవ ప్రాప్తి కలుగును అని నారద సూత్రాలు చెపుతున్నాయి
Read More

సుభ మణ్యేశ్వరుడు, మన పార్వతి పరమేశ్వరుల పుత్రుడయిన కుమారా స్వామి

సుభ మణ్యేశ్వరుడు ::
పార్వతి పరమేశ్వరుల పుత్రుడయిన కుమారా స్వామి, తారకాసురుడు అనే లోక  రాక్షసుడిని సంహరించటం కోసం జన్మించిన వాడు. తనను భక్తితో కొలిచే వారికి నాయకత్వ సిద్ది , విజయ ప్రాప్తి , వ్యాధి నివారణ , సంతాన సాఫల్యం, భుప్రాప్తి శీఘ్రం గా కలుగును .  " మార్గ శిర సుద్ధ షష్టి తిధి నాడు సుబ్రమణ్యేశ్వరుని, జపం చేసినా, లేక  పూజించిన వారికి సకల శుభాలు కలుగును. కృత్తికా నక్షత్రము నందు జన్మించుట వలన కార్తికేయుడని, రెల్లుపొదలో పుట్టినందువల్ల  శరణ భవుడని, ఆరు ముఖాలు ఉండుట వలన, షణ్ముఖుడు , ఇంకా  స్కన్దుడని, సేనాని అని , సుబ్రమణ్యేశ్వరు డని నామములతో పిలుస్తారు భక్తులు .
ఈయనకు శ్రీవల్లి , దేవసేన  అను రెండు పేరులు కల భార్య కలదు .  సుబ్రమణ్యేశ్వరు ని వాహనము నెమలి , 6- ముఖాలతో , 8 -భుజాలతో,  అపార ఆయుధాలతో  దర్సనం  ఇచ్చే కార్తికేయుడు,  మార్గశిర శుద్ద షష్టి నాడు, మాత్రము సర్ప రూపమున దర్శనము ఇస్తాడు.   మార్గశిర శుద్ద షష్టి నాడు  ఈయనను  సర్ప రూపమున ప్రార్ధించి, పుట్టలో పాలు పోసిన కోరిన కోరికలు నేర వేరునని అంటారు .
తమిళ నాడులో  = పళని లోని  సుబ్రమణ్యేశ్వర ఆలయము
ఆంధ్ర ప్రదేశ్ లోని = మోపిదేవి ఆలయము
తిరుపతి, స్కంద గిరి, వంటి ఆలయాలలో   సుబ్రమణ్యేశ్వరు ని ఆరాధనలు జరుగును

Read More

సంతాన మును ప్రసాదించు దేవుడు నవులూరు నాగేంద్రుడు

సంతాన మును ప్రసాదించు  దేవుడు నవులూరు  నాగేంద్రుడు
గుంటూరు జిల్లా మంగళ గిరి మండలం  నవులూరు  గ్రామం లోని,  శ్రీ పుట్ట నాగేంద్ర స్వామీ  ఆలయం, మత సామరస్యానికి అద్దం పడుతోంది . మంగళ గిరి  రైల్వే స్టేషన్ సమీపం లోని, మామిడి తోటలో ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి ఆలయం,  నవులూరు పుట్ట తోటగా పేరు పొందింది. ఈ ఆలయ ప్రాంగణములో పుట్టా ఉంటె,  గర్భగుడి బయట జెండా చెట్టు ఉంది . హిందువులు నాగేంద్ర స్వామి పేరును, ముస్లిం లు నాగుల్ మీరా  పేరు తో  పుజిస్తారు. ఈ నాగేన్ద్రుడికి సంతాన ప్రదాతగా విశేష ప్రాచుర్యం ఉన్నది . ప్రతి ఆదివారము పాల పొంగళ్ళు, ప్రదక్షిణలు , పుట్టు వెంట్రుకలు , పోగులు కుట్టటం, అన్న ప్రాసన వంటి మొక్కులు జరుగుతూ ఉండును.  నాగుల చవితి , సుబ్రహ్మణ్య షష్టి  వంటి మంచి రోజులలో విశేష పూజలు జరుగును . 
Read More

వరంగల్ జిల్లా లో పరకాల లో అతి పురాతన మయిన ఆలయం

వరంగల్ జిల్లా లో పరకాల లో అతి పురాతన మయిన ఆలయం గా ప్రసిద్ది కి ఎక్కినా శ్రీ భవానీ కుంకుమేస్వర స్వామికి  ప్రతి ఏటా శివరాత్రి పూజలు, సుబ్రమణ్య  షష్టి  ఉత్సవాలు అంగ రంగ వైభవంగా జరుగును. అందులో  భాగం గా సోమ వారం స్వామి వారి కళ్యాణ  మహోచ్చవం, మంగళ వారం మహా లింగ అర్చన , వృషభ వాహన సేవ , బుధ వారము నాక బలి,  చతుర్వేద పారాయణము, ఆశ్వ వాహన సేవ,  గురువారము సహస్రలింగ అర్చన, గజవాహన సేవ , శుక్రవారము  అన్నపుజ, ద్వాజావరోహణ కార్యక్రమాలు జరుగును
Read More

Monday, 6 January 2014

ఒక్కసారి గతంలోకి వెళితే కొన్ని విషయాలు, కొన్ని చేదు నిజాలు

ఒక్కసారి గతంలోకి వెళితే కొన్ని విషయాలు, కొన్ని చేదు నిజాలు మనకు జ్ఞాపకం వస్తాయి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోప్ జాన్ పాల్-2 భారత్ కు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలో పోప్ జాన్ పాల్ చేసిన వ్యాఖ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. "ఆసియా ఖండం, అందులో భారతదేశం కోతకు సిద్ధంగా ఉంది" - అంటే భారతదేశాన్ని క్రైస్తవదేశంగా చేయటానికి అనువుగా ఉంది అని ప్రకటించారు. దేశంలో క్రైస్తవ ప్రాబల్యం పెరిగితే దానిని నిరోధించేది, ఎదుర్కొనేది హిందూ సమాజంలోని సాధుసంతులు, సంఘము, విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలు.కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  స్వామీజీల మీద, సంఘం మీద దాడులు, ఆరోపణ పర్వాలు సాగుతున్నాయా? ఇవి ఏవి హిందూ సమాజానికి పట్టవు. ఇక్కడ మీడియా రంగం కూడా వ్యవహరించిన తీరు ఎంతో గర్హించదగినది. ప్రపంచంలో అనేక దేశాలలో అమెరికా అండదండలతో క్రైస్తవం ఎన్నో అరాచకాలు సృష్టించింది. ఎక్కడోదాక అవసరం లేదు - కేరళ, తమిళనాడులలో క్రైస్తవుల అకృత్యాలే అనేకం. వాటిని విచారణ జరిపించి దోషులను శిక్షించారా? కేరళలో నన్స్ పై అత్యాచారాలు, హత్యలు మొదలైనవి పుస్తకాలే వచ్చాయి. అధికారుల అండదండల కారణంగా వేటిపైన సరియైన చర్య తీసుకోలేదు. పెరిగిపోతున్న క్రైస్తవుల అరాచకాల గురించి అనేక మంది పెద్ద మనుషులను వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమ బాధను, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు. కాని క్రైస్తవానికి వ్యతిరేకంగా గళం మాత్రం విప్పరు. ఇది కాంగ్రెసుకు కలిసి వస్తున్నది. ఇప్పుడున్న కేంద్రప్రభుత్వం చేజారుతున్న తన ఆశలను పెంచుకొనేందుకు ఏమైనా చేసేందుకు సిద్ధం కావచ్చు. మైనార్టీల సంరక్షణ పేరుతో హిందూ సంస్థలను స్వామీజీలను వేధించే ప్రయత్నం చేయవచ్చు. ఇది హిందూ సమాజానికి ఒక హెచ్చరిక.
వైరము లేని హింసను చేయటానికి సిద్ధపడని హిందూసమాజం తన పైన శతృత్వం వహించి పని చేస్తున్న శక్తులను గుర్తించే పరిస్థితులు లేవు. శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ కేవలం ఆధ్యాత్యిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలో కూడా గడిచిన రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి జనకల్యాణ పరిషత్ స్థాపించారు. దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు వారి మార్గదర్శనంలో నడుస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలని క్రైస్తవులు అనుకొని ఉండి ఉండవచ్చు. వాళ్లకు ప్రభుత్వాలు సహకరిస్తూ ఉండి ఉండవచ్చు. ఇది ఈ రోజు హిందూ సమాజానికి ఎదురవుతున్న సవాళ్లు. ఈ సవాలును స్వీకరించి ఆ ఎత్తుగడలను వమ్ము చేయగలుగుతామా?

యుపిఎ ప్రభుత్వం 2009లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత నుండి హిందూ సమాజంలోని పెద్దలు, స్వామీజీల సంస్థలను నైతికంగా (తాత్కాలికంగానైనా) దిగజార్చాలనే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇది గమనించదగ్గ పరిణామం.

దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దూషణల పర్వం ఎప్పుడో ప్రారంభమయింది. ఇక కావలసింది ప్రజలను గందరగోళంలో పడేయటం. దానిద్వారా తిరిగి అధికారం కాపాడుకోగలుగుతామా అన్నది ఇప్పటి కాంగ్రెస్ వ్యూహం. దీనిని జాగ్రత్తగా గమనించి మరిన్ని దాడులు జరగకుండా హిందూసమాజం అప్రమత్తం కావాలి. మీడియా ఎత్తుగడలను కూడా గమనించాలి. అప్పడు మనం మన సమాజాన్ని కాపాడుకోగలుగుతాం.

9 సంవత్సరాల కంచి కథకు ఇప్పుడు ముగింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని కథలు నిర్మాణం కాకుండా చూసుకోవటం ఇప్పుడు హిందూ సమాజం ముందున్న కర్తవ్యం.


Read More

Powered By Blogger | Template Created By Lord HTML