గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 30 December 2014

రెండు వేల సంవత్వరాల వయస్సు కలిగిన ఆలయం::గుంటూరు జిల్లాలో అతి పురాతన ఆలయం :: Read Completely::

రెండు వేల సంవత్వరాల వయస్సు కలిగిన ఆలయం::గుంటూరు జిల్లాలో అతి పురాతన ఆలయం :: Read Completely::
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం గుంటూరు జిల్లా సమీపంలోని చేబ్రోలు గ్రామంలో ఉన్న ఆలయ ప్రాంగణంలోని ఒక ఆలయం.. ఈ ఆలయ ప్రాంగణంలో రెండు వేల సంవత్సరాల క్రితం(అనగా పధ్నాలుగవ శతాబ్ధంలో ) నిర్మించిన ఆలయాలు కూడాఉన్నాయి.. ఇంతటి చారిత్రక ప్రాశస్థ్యం కలిగిన ఈ గుడులకు కొన్ని వందల ఎకరాల దేవుడి మాన్యం కూడా ఉందట... కానీ కాల క్రమేణా చేతులు మారి చివరికి నిత్య నైవేద్యం కూడా మొక్కుబడిగా పెట్టే స్థితి వస్తుందని ఆ బ్రహ్మ లింగేశ్వరుడు కూడా ఊహించి ఉండడు... మన భారతదేశంలో బ్రహ్మ కు ఆలయాలు చాలా చాలా తక్కువ.. అటువంటి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లో ఉందని చాలా మందికి తెలియదు కూడా.. సువిశాల ఆవరణలో ఉన్న ఈ దేవాలయ ప్రాంగణం చాలా బావుంటుంది.. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.. ఏ ఆదరణకు నోచుకోకుండానే దీని వైభవం ఈ విధంగా ఉంటే కొంచెం శ్రద్ధ చూపితే ఎంత బావుంటుందో.. ఈ ఆలయ విశేషాలు..
1. గుంటూరు జిల్లాలో రెండు వేల సంవత్వరాల వయస్సు కలిగిన ఆలయం...
2. పల్లవ, చాళుక్య, చోళ చరిత్రకు సంబంధించిన అవశేషం...
3. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఏకైక బ్రహ్మ దేవాలయం...
4. ఒకే ఊరిలో నూటొక్క దేవాలయాలు...
భృగు మహర్షి శాప కారణంగా బ్రహ్మ దేవునికి ఎక్కడా ఆలయాలు ఉండవు.. కానీ కాశీ లో ఒక ఆలయం ఇక్కడ గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో ఒక ఆలయం ఉంటాయి... ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం చుట్టూ కోనేరుతో మధ్యలో ఆలయం తో చూడముచ్చటగా ప్రశాంతంగా ఉంటుంది... శివలింగంలో నాలుగు దిశలా నాలుగుముఖాలతో బ్రహ్మ ఇక్కడ కొలువైయ్యాడు...
ఈ ఆలయం వేయి సంవత్సరాలచరిత్ర కలిగినదని... ఆ సమయంలో ఈ ప్రదేశాన్ని చాళుక్య చోళులు పరిపాలించేవారు... తూర్పు చాళుక్యులకు చెందిన సత్యశ్రాయుడు తన సేనాధిపతి బయనంబిని దండయాత్రకై పంపించాడు.. ఆయన చాళుక్యచోళులకు సంబంధించిన ధరణికోట(అమరావతి)ని యనమదల కోటలను ఓడించి తన సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా చేబ్రోలును ఎంపిక చేసుకుని ఇక్కడ పలు ఆలయాలు నిర్మించాడు...
చాలావరకు ఆల యాలు చరిత్ర గతిలో కలసినా ఆంధ్రుల శిల్పకళా ప్రాభ వాన్ని చాటి చెప్పే దేవాలయాలింకా కొన్నిక్కడ మిగిలి ఉన్నాయి. సరస్సు మధ్యలో బ్రహ్మదేవుడి కొక ఆలయం -ఆ చతుర్ముఖుని నాలుగు ముఖాల మధ్యలో శివ లింగం అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మేశ్వర లింగంగా ఇది ప్రసిద్ది చెందింది. ఇదేకాక సహస్ర లింగేశ్వర స్వామి, వీరభద్రస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. నాగేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం, నంది విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడి అమ్మవారు రాజ్యలక్ష్మి. ఈ ఆలయం క్రీ.శ. మొదటి శతాబ్దం నుంచీ ఉన్నదనటానికి చారిత్రక ఆధారాలు ఇక్కడ దొరికిన నాణాలు. తొట్ట తొలుత ఈ క్షేత్రం పేరు తాంబ్రావ, తాంబ్రాప. క్రమంగా అది చేబ్రోలు అయింది. లోహ యుగపు మొదలులో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరికేదట...ఇక్కడ రాగి, తామ్రం తో కూడిన తయారీ పనివారు ఉండే వారట... అలా తామ్రమును సంస్కృతంలో ‘చెం’ అని అంటారని...(చిన్న చిన్న రాగి, ఇత్తడి లోటాలను/డొక్కులను చెంబులు అంటారు) ఈ చెంబులు తయారీ అయే పేరు కాస్తా చేబ్రోలు అయిందని వినికిడి...
మొదట ఇక్కడ కుమార స్వామికి గుడి, పూజ ఉండేవిట. అప్పట్లోనే చౌడేశ్వర, గణపేశ్వర ఆల యాలు నిర్మించారు. తర్వాత భీమేశ్వర ఆలయం.
ఈ భీమేశ్వరాలయం క్రీ.శ. రెండవ శతాబ్ది కి చెందినదని... ఈ గుడికి జీర్ణోద్ధారణ ప్రక్రియ నిమిత్తం బాగుచేస్తుండగా రెండువేల ఏళ్ళ సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి... ప్రస్తుతం పురావస్తు శాస్త్రజ్ఞులు చాలా జాగ్రత్తగా పనులు చేస్తున్నారు.. ఇక్కడే పన్నెండు అడుగుల నటరాజ విగ్రహం ఉండేదట కానీ ప్రస్తుతం ఆ ఆలయమూ లేదు దాని ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ. కానీ ఆలయముందు భాగంలో ఉండవలసిన ఒక పెద్ద నంది విగ్రహం మాత్రం ఉంది... ఇటువంటి పురాతన సంస్కృతికి సంబంధించిన అవశేషాలను ఆనవాళ్ళను కాపాడుకోవడంలో మన ఆంధ్రులం కొంచెం వెనుకపడ్డామనే చెప్పుకోవచ్చు.. ఈ విషయంలో తమిళులను ఆదర్శంగా తీసుకుంటే చాలా వృద్ధి సాధించవచ్చు..
కొన్ని వేల ఏళ్ళ చరిత్ర కలిగిని ఈ చేబ్రోలు (నూటొక్క గుడులు)దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం పూనుకుంటే గుంటూరు జిల్లా టూరిజం బాగా వృద్ధి చెందుతుందనుటలో ఎటువంటి సందేహం లేదు...
అంతటి ఘన చరిత్ర కలిగిన దేవాలయాన్ని మీ కళ్ళతో స్వయంగా చూడవలెనని ఉందా.. క్రింద లింకు నుండి యూ ట్యూబ్ ద్వారా చూడండి...
http://youtu.be/oStHT5mh7m0
Read More

ప్రపంచంలోనే అతి పురాతన దేవాలయం:: Göbekli Tepe :

ప్రపంచంలోనే అతి పురాతన దేవాలయం:: Göbekli Tepe :: టర్కీ లో కనుగొన్నారు...ఈగుడి క్రీ.పూ. 9000 సంవత్సరాల క్రితందని కార్బన్ డేటింగ్ పరీక్షలలో తేలింది.... ఈ గుడి ఎంత పురాతన మైనదంటే ఆ సమయంలో చివరికి వ్యవసాయం కూడా మొదలు పెట్టలేదు.. ఇంకా లోహయుగం కూడా ప్రారంభమవలేదు... పశువులను పెంచేది కూడా ప్రారంభమవలేదు..
ఈ ఆలయం చాల ప్రాకారలతో నిండి... అనేక శిల్పసంపదను కలిగి ఉంది... ఈ ఆలయంలొ దొరికిన ఒక జుట్టు ముడి వేసుకుని తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న ఒక ఋషి విగ్రహాలు కనపడ్డాయట... అయితే ఇటువంటి కట్టడాలు... ఇటువంటి సాధువులు.. సంస్కృతి ఇంకా భారతదేశంలో సజీవంగా ఉందని ఈ త్రవ్వకాలను జరిపిన శాస్త్రవేత్తలు మన ఆర్కియాలజీ వారిని సంప్రదించారట... ఈ ప్రాంతం ఇంకా త్రవ్వకాలలో ఉంది.. చాలా విషయాలు బయటపడవలసి ఉంది... ఎటువంటి పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఆ శిల్పాలు ఎలా చెక్క గలిగారో అనేది పెద్ద సందేహంగా ఉంది ఆ శాస్త్రజ్ఞులకు... ఇక్కడ చూపించబడిన ఒక శిల్పంలో ఉభయచరజీవి అయిన బల్లి లాంటి ఒక ప్రాణి శిల్పం ఉంది... ఇలాంటి శిల్పాలు మహా బలిపురంలో, కాంచీపురం ఏకాంబరేశ్వరస్వామి గుడిలోని బంగారు బల్లి దగ్గర మనం చూడవచ్చు.. ఏది ఏమైనా చాలా బాగా అభివృద్ధి చెందిన దేశాలలో మన సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతుండడం ప్రపంచం మన హిందూ సంస్కృతివైపు చూస్తుండడం... గొప్ప విషయం..
Read More

రామేశ్వరం::

రామేశ్వరం::
సీతమ్మ వారికై రాముడు వారధిని నిర్మించిన ప్రదేశం. అక్కడ అతి తక్కువ దూరంలో శ్రీలంకను చేరే మార్గముంది. కేవలం ముప్పై కి.మీ. (పద్దెనిమిది నాటికల్ మైల్స్) దూరంలో శ్రీలంక తీరం మల్లైతీవు చేరుకోవచ్చు..
అయితే వారధినిర్మించే సమయం అగ్ని పర్వత శిలలను వానరసైన్యం సముద్రంలో జారవిడిచే టపుడు సముద్రుడు వాటిని నిలవనీయలేదట. ఎన్ని సార్లు వేసినా అలలు వాటిని చెల్లాచెదరు చేస్తున్నాయట.. అప్పుడు శ్రీరాములవారు సముద్రుడి గర్వమణచడానికి ధనస్సు(విల్లు) కొన(కోటి) ను ఎక్కు పెట్టేందుకు సిద్ధమవుతాడట. అప్పుడు భయపడిన సముద్రుడు వారధి కట్టేందుకు అనుకూలించి తన నిజ స్వరూపాన్ని మార్చు కుంటాడట. ఇప్పటికీ రామేశ్వరం దగ్గరి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది... అస్సలు అలలు(పెద్దపెద్దవి) రావు..
రాముడు ధనస్సు కొనను సవరించిన ప్రదేశం ధనుష్కోటి... అక్కడ ప్రదేశం చాలా బావుంటుంది.. ఒక పది సంవత్సరాల క్రితం సంభవించిన తుఫాన్ లో ఇక్కడి జనజీవనం అస్తవ్యస్థమైంది... రవాణా వ్యవస్థ చెడి పోయింది.. కానీ ఇప్పుడిప్పుడే తిరిగి రూపుదిద్దు కుంటోంది...
జీవిత కాలంలో ఒక్క సారైనా చూడవలసిన క్షేత్రం రామేశ్వరం...
Read More

మన భారతీయ శిల్ప కళాకారుల నైపుణ్యం.. సంగీత శిల్పములు:: (మ్యూజికల్ పిల్లర్స్ )

మన భారతీయ శిల్ప కళాకారుల నైపుణ్యం.. సంగీత శిల్పములు::
(మ్యూజికల్ పిల్లర్స్ )
టెక్నాలజీ లో మనం ఎంత ముందున్నామనేది మన దేవాలయాలను చూస్తే అర్థమవుతుంది...
సంగీత స్థంభాలంటే వాటిని తాటనం చేస్తే(అంటే తడితే) సరిగమలు పలుకుతాయి..
ఇలాంటి రాతి సంగీత మన దేవాలయాలలో ఒక 1000 ఏళ్ళ క్రితమే ఉన్నాయి..
అసలు మామూలు సంగీత వాయిద్యాలతో సంగీత సాధన చేయటమే కష్ట మయితే... భారత దేశంలో రాతిని తాకినా సంగితం వస్తుందంటే అది అద్భుతమే కదా... వారి భవన నిర్మాణ సాంకేతికత ఎంతగా అభివృద్ధి అయిందో...అది ఏ స్థాయిదో అర్థం చేసుకోండి.. ఇవి మన భారతీయ కళలు, సాంకేతిక గొప్పదనాన్ని వివరిస్తూ అబ్బురపరుస్తున్నాయి..
మన ఆలయాలలో కంపించే సంగీత రాతి స్తంభాలు - భూగర్భ శాస్త్రం మరియు సంగీత శాస్త్రంలో మధ్య యుగాలనాటి భారతీయుల అసాధారణ విజ్ఞానికి స్పష్టమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 500 ఏళ్ళనాటి నల్ల రాతి స్తంభాలపై ఒక కర్రతో కొట్టినప్పుడు యాత్రికులకు దిగ్భ్రమ కలిగిస్తూ వాటినుండి వివిధ రకాల సంగీత స్వరాలు ఉద్భవిస్తాయి. ఈ దేవాలయాన్ని దర్శించే సందర్శకులు తమ పిడికిళ్ళతో స్తంభాలను కొట్టి, అవి ఉత్పత్తి చేసే సంగీత ధ్వనులను ఆలకిస్తుంటారు. ఈ సంగీత రాతి స్తంభాల నిర్మాతలకు శరీరం కంపించే సూత్రాలు స్పష్టంగా తెలుసు. సంగీత శబ్దం రాతి యొక్క వర్గం మరియు సాంద్రతపై ఆధారపడుతుందని కూడా వారికి తెలుసు. ఒక ధ్వనింపజేసే వర్గానికి చెందిన రాతినే వారు జాగ్రత్తగా ఎంచుకుంటారు. దీన్ని నైపుణ్యంతో నిలువు పట్టెలుగా, ఒక్కొక్కసారి ఒక స్తంభంపై 22 పెట్టెల వరకు చెక్కుతారు. ఈ పట్టేలన్నీ ఒకే రాతి ముక్కలో భాగాలై ఉంటాయి. ఈ పట్టెలన్నీ యావత్ నిర్మాణానికి స్థిరత్వం సమకూర్చే ఒక కేంద్రీయ పట్టె చుట్టూ క్రమబద్ధంగా తీర్చిదిద్దటం జరుగుతుంది. ఒక స్తంభం యొక్క వివిధ పట్టెలకు విభిన్న ఆకారాలు ఇవ్వబడతాయి. ఒకే స్తంభం, ఒకే రాతిలో అన్ని పట్టెలు భాగంగా ఉన్నప్పటికీ సరికూర్చిన స్తంభంలోని ప్రతి పట్టెను తట్టగానే విభిన్న శబ్దాలు వెలువరిస్తాయి. ప్రతి పట్టెకు పలువిధాలైన పొడవు మరియు మందం, విభిన్న ఆకారం-వర్తులాకారం, చదరం, అష్టా భుజి లేదా వంపు ఇస్తారు. ప్రాచీన కలంలో సంగీతకారులు పట్టెలను దేవాలయంలో సంగీత ధ్వనులను ఉత్పత్తి చేసేందుకు చేతి పిడులుగ కర్రలతో కొట్టేవారు. దాదాపు 1560 ఏ.డి.లో నిర్మించబడిన ఈ వెయ్యి స్తంభాల మందిరపు వసారాలో రెండు సంగీత స్తంభాలను, దేవాలయం ఉత్తర ద్వారం వద్ద ఐదు స్తంభాలను చూడవచ్చు. తట్టగానే ప్రతి స్తంభం ఒక స్వరాన్నీ లేదా ఒక శ్రుతినీ ఉత్పత్తి చేస్తుంది. సంగీత విభావరిలో రాజు దేవాలయం మధ్యలో కూర్చుంటే ఈ స్థంభాల దగ్గర విద్వాంసులు తమ ప్రతిభతో వాయిస్తూంటే నర్తకీ మణులు నాట్యం చేసే వారట.. ఒకేసారి చాలా మంది విద్వాంసులు ఈ సంగీత స్థంభాలపై ఒకేసారి తాటనం చేసి వివిధ ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించే వారట..
ఇటువంటి సంగీత రాతి స్థంభాలు మనకు క్రింది ఆలయాలలో కనపడతాయి:::
1. విజయ విఠ్ఠల దేవాలయం, హంపి
2. నెల్లయప్పార్ దేవాలయం, తిరునల్వేలి..
3.తనుమాలయన్ దేవాలయం, సుచీంద్రం, నాగర్ కోయిల్, తమిళనాడు
4. ఆయిరంకాల్ మండపం(వేయిస్థంభాల గుడి), మధుర మీనాక్షి దేవాలయం, మధురై
5. వ్రేలాడే రాతి స్థంభాలు:: మల్లికార్జునేశ్వరార్ దేవాలయం, ధర్మపురి, తమిళనాడు
ఫేస్ బుక్ లో అన్ని దేవాలయాల గురించి ఒకే చిత్రంలో వివరించలేం
Read More

మనం కుంకుమ ఎందుకు ధరించాలి?? కుంకుమ ధరించడం వలన కలిగే ఉపయోగాలు:::(Import to know:: Because we have to know the benefits of our traditions n culture)

మనం కుంకుమ ఎందుకు ధరించాలి?? కుంకుమ ధరించడం వలన కలిగే ఉపయోగాలు:::(Import to know:: Because we have to know the benefits of our traditions n culture)
శరీరంలోని ప్రతి అవయవానికి అధిపతి ఒక్కో దేవత. అలాగే లలాటానికి అధిదేవత బ్రహ్మదేవుడు. లలాటం బ్రహ్మ స్థానం. బ్రహ్మదేవుడి రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన లలాటంలో ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలి. ఇంకా లలాటాన్ని సూర్యకిరణాలు తాకరాదు. అందుకొరకు కూడా కుంకుమను నుదుట ధరించాలి. -
ఇక కుంకుమను ఏ వేలితో పెట్టుకోవాలి అనే సంశయం చాలామందిలో ఉంటుంది. అయితే కుంకుమను ఒక్కొక్క వేలితో పెట్టుకుంటే ఒక్కో ఫలితం కలుగుతుంది. కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. నడివేలుతో ధరిస్తే ఆయువు సమృద్ధి చెందుతుంది. బొటన వెలితో ధరిస్తే శక్తి కలుగుతుంది. చూపుడు వేలితో ధరిస్తే భక్తీ, ముక్తీ కలుగుతాయి.
ప్లాస్టిక్ బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం కన్నా మేలు రకం కుంకుమ ధరిస్తే క్రిమి సంహారకము. కుంకుమను రోజూ ధరించండి. నుదుటన కుంకుమ అద్దితే జ్ఞానచక్రాన్ని పూజించినట్లు అవుతుంది. అందం, అలంకరణలో భాగం మాత్రమే కాదు ఇవన్నీ కుంకుమధారణ వెనుక ఉన్న అంశాలు.
నాడులు కలిసే కీలక ప్రదేశంలో...
మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే నాడులు సక్రమంగా పనిచేయాలి. శరీరంలో రెండు ముఖ్యమైన నాడులు వుంటాయి. వాటిలో ఒకటి ‘ఇడ’ రెండోది ‘పింగళ’. ఈ రెండు నాడులూ నుదుటి వద్ద కలుస్తాయి. అంటే శరీరంలోని నాడులన్నింటికీ అనుసంధానం నుదుటన వుందన్నమాట. ఈ ప్రదేశాన్ని ‘సుషుమ్న’ నాడిగా పిలుస్తారు. ఇక్కడ కుంకుమగానీ, గంధం గానీ, విభూదిగానీ ధరించడం వల్ల నాడుల పనితీరు సక్రమంగా వుంటుందన్న అభిప్రాయాలు వున్నాయి. అలాగే కుంకుమ ధరించడం వల్ల దృష్టిదోషం తగలదట. కుంకుమ ధరించిన వ్యక్తులకు ఎదుటి వ్యక్తులు మానసికంగా లొంగిపోతారట. అలాగే కుంకుమకున్న ఎర్రటి రంగు మనలో మనోశక్తి, త్యాగనిరతి, నిర్భయత్వం, పరోపకార గుణాన్ని పెంపొందిస్తాయన్న అభిప్రాయాలు వున్నాయి.
Read More

భగవంతునికి తలనీలాలను సమర్పించే కార్యక్రమంలో అంతరార్థం::భగవంతునికి తలనీలాలను సమర్పించే కార్యక్రమంలో అంతరార్థం::
(This is Important to know .... because we have to value our heritage and culture)
ధర్మశాస్త్రాల ప్రకారం... మనం చేసే సర్వ కర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దాని వల్ల అవి పాపాలకు నిలయంగా మారతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలంటే, వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుని సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులమవుతాం. ఈ ఉద్దేశంతోనే తలనీలాలు సమర్పించే ఆచారం మొదలయ్యింది. కాబట్టి తలనీలాలు సమర్పించడమంటే... ఇంతవరకూ ఎన్నో పాపాలు చేశాం, వాటిని విడిచి ఇకపై పవిత్రంగా జీవిస్తాం అని దేవునికి మాటివ్వడమన్నమాట!
ఇక్కడి ప్రధాన ఉద్దేశ్యం పాప పుణ్యాల గురించి కాదు... చాలా వరకు చేసిన తప్పుల కన్నా మనలో మిగిలిపోయిన అపరాథ భావమే మనను ఎక్కువగా డామినేట్ చేస్తుంది.. ఇక్కడ అలాంటి అపరాథ భావనను తొలగించుకుని తిరిగి మంచి దారిలో వెళ్తామని మనసులో ధృఢంగా నిర్ణయించుకోవడమన్న మాట!!
Read More

ఆలయాలు ఎందుకు?? మనం ఆలయానికి ఎందుకు వెళ్ళాలి??

ఆలయాలు ఎందుకు?? మనం ఆలయానికి ఎందుకు వెళ్ళాలి??
పంచేద్రియాలు(కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం) మనకు జ్ఞానాన్నిచ్చే ఇంద్రియాలు... వీటి ద్వారానే మనం జ్ఞానాన్ని గ్రహించ గలుగుతాము..
పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) మనకు తెలుసు.. వీటికి ఎంత శక్తి ఉందో కూడా మనకు తెలుసు..
అటువంటిదే విశ్వ శక్తి కూడా... ఈ విశ్వ శక్తి అనేది విశ్వంనుండి గ్రహించే శక్తి.. ఇది పంచేద్రియాలకు అతీతమైనది
అయితే ఈ శక్తిని గ్రహించే వేర్వేరు పద్ధతులను యోగశాస్త్ర గురువు పతంజలి మహర్శి మనకు అందించారు.. వీటిని పంచేద్రియాలద్వారా మాత్రమే గుర్తించలేము.. మనకు అలా మనకు లభించే ఈ శక్తిని యోగశక్తి అనీ, ప్రాణశక్తి అనీ, విశ్వశక్తి అనీ పిలుస్తారు... అయితే యుగాలు ఒక దానినుండి మరొకటి ప్రారంభమైన కాలక్రమేణా ఇటువంటి యోగ శాస్త్ర రహస్యాలు ... రహస్యాలుగానే మిగిలి పోయి.. ప్రజలలో సాంసారిక వ్యామోహాలలోనే మునిగి... ఆధ్యాత్మిక సారాన్ని గ్రహించలేక పోతున్నారని.. అలనాటి యోగులు ముందుగానే గ్రహించి తమ యోగ శక్తిని కొన్ని విగ్రహాలలో నిక్షిప్తం చేసి వాటిని దర్శించుకుంటే ఆ యోగ/ప్రాణ/విశ్వ శక్తి అనుభూతిని పొందేవిధంగా మన ఆలయాలను విగ్రహారాధన పద్ధతులను సృష్టించారు..
మన ఆలయాలు విశ్వశక్తి నిలయాలు.. వీటి నిర్మాణం కూడా ఒక సైన్స్ అని చెప్పవచ్చు. మనకు తెలుసు.. పిరమిడ్ క్రింద ఉంచబడిన ఆహారం ఎక్కువసేపు చెడిపోకుండా ఉంటుంది.. పిరమిడ్ క్రింద ధ్యానం కొన్ని వేల రెట్ల ఫలితాన్నిస్తుందని... మన ఆలయ గోపుర నిర్మాణము.. గర్భగుడి ఉన్న ప్రదేశం.. మూలమూర్తి ని ప్రతిష్టించిన ప్రదేశం గమనిస్తే అవి అన్నీ ఒక పద్ధతి ప్రకారం కొలతల ప్రకారం కట్టబడిన వని అర్థంచేసుకోవడానికి ఎంతో సేపు పట్టదు... అయితే విశ్వనుండి వచ్చే ఆ కాస్మిక్ ఎనర్జీ(విశ్వశక్తి) మన ఆలయ గోపురం గుండా.. శ్రీ చక్రం ద్వారా మూలవిరాట్టు ద్వారా ఆలయ శక్తి ఎప్పటికీ నిలచి ఉండే విధంగా డిజైన్ చేయబడింది.. (ఇది ఎలా అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహంనుండి మన ఇంట్లో ఉన్న టివి చానెల్ ఆపరేట్ అవుతున్న మాదిరిగా అన్నమాట...) ఇలా ప్రసారం కాబడే శక్తే ఈ ప్రాణ శక్తి...
మనం ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు ఈ శక్తిని గ్రహించ గలిగితే ఆధ్యాత్మికం గా పురోగమిస్తాము.... మనకున్న చిన్న చిన్న కోరికలనుండి ముక్తి అయి గమ్యస్థానానికి చేర్చే స్థాయి కి చేరుకుంటాము..
దేవాలయాలలోని మనం గ్రహించిన శక్తిని గుర్తు చేసుకునేందుకు ఆ మూలవిరాటు చిత్రాలు మన పూజా గదిలో ఉంచుకుని పూజచేస్తాము.. ఇక్కడ మనం కేవలం ఆ విగ్రహ రూపును కాక ఆ శక్తిని గుర్తు చేసుకోవాలి.. దీనినే నిరంతర ధ్యానం అంటారు.. ఎవరైతే అనునిత్యం ఈ శక్తిని దర్శించగలరో. వారు ధన్యమైనట్లే... ఈ శక్తిని ఎవరు ప్రసారం చేయగలరో వారు నిజమైన గురువులు..
గర్భగుడిలో మనం ఆ శక్తి(ట్రాన్స్ మిషన్) ని గుర్తించగలిగిన నాడు.. ఈ వ్యాసంలోని అంతరార్థం మీకు అర్థమవుతుంది.. ఒక్కసారి ఆ రుచి చూసిన తర్వాత ఇహలోక వ్యామోహాలు ఏవీ వాటి ముందు పనిచేయవు..
అందరికీ ఆ భగవంతుని వీక్షణా కటాక్ష ప్రాప్తిరస్తుః !!!
Read More

భగవంతునికి హారతి ఇచ్చేందుకై వినియోగించే కర్పూరాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు ??

భగవంతునికి హారతి ఇచ్చేందుకై వినియోగించే కర్పూరాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు ??(Important to know because this is our tradition)
కర్పూరం(Camphor) :: ఈ పదార్థమునకు ఇంకా ఎన్నో మంచి సుగుణాలు ఉన్నాయి... సృష్టిలో చాలా పదార్థాలు వేడిచేస్తే ద్రవరూపంలో మారతాయి.. తర్వాతే వాయు రూపానికి రూపాంతరం చెందుతాయి.. కేవలం కర్పూరం మాత్రమే ఘన రూపంనుండి డైరెక్ట్ గా వాయు రూపానికి మారే గుణాన్ని కలిగి ఉంది..
కర్పూరాన్ని వెలిగించిన లేదా మామూలు స్థితులలో సమీపంలో ఉన్న సూక్ష్మ జీవులను చంపే సుగుణాన్ని కలిగి ఉంటుంది... దీని నుండి వచ్చే ఆవిరి వాసన శ్వాసకోశ ఇబ్బందులను దూరంచేస్తుంది.. ఎన్నో రకాల ఔషధాలలో కర్పూరాన్ని తగు మోతాదులలో ఉపయోగిస్తారు.. యునాని, ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి ఇలా అన్ని రకాల వైద్య విధానాలలోనూ ఈ కర్పూరాన్ని వినియోగిస్తారు...
అందుకే ఇన్ని రకాల ప్రయోజనాలున్న ఈ పదార్థాన్ని పూజా కార్యక్రమాలలో విరివిగా ఉపయోగిస్తారు... ఈ హారతిని కళ్ళకు అద్దుకున్నా.. లేదా ఆ వాసనలు చూసినా ఎన్నో రకాల ఇబ్బందులకు దూరమైయ్యేలా చేస్తాయి...... ప్రధానంగా ఆలయాలలో ఈ ధూప దీపాలు మనిషిలోకి ఆధ్యాత్మిక దివ్యశక్తి ప్రసారానికి తోడ్పడుతాయి..ఎక్కువ కాలం ఆ ప్రదేశంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే లా దోహదం చేస్తాయి.. అందుకే దేవాలయాలలో దీపం , హారతి దేవునికి చూపేటపుడు తప్పని సరిగా దేవుని చూసే విధంగా మన ఆచారాలను రూపొందించారు..
సంప్రదాయంగా హిందువులు పూజాది కార్యక్రమాలకు విధిగా వినియోగిస్తారు . వెలుగుతున్న కర్పూరం హారతికి భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది . . . పవిత్రం గా భావిస్తారు . కర్పూరం ఉండలు మండి పూర్తిగా కరిగిపోతాయి . కర్పూరం (C10H16O) ప్రగాఢమైన , తీక్షణమైన సువాసన వెదజల్లుతుంది .
కర్పూరం పుట్టుక : ఇది ఒక వృక్షం నుండి వస్తుంది , భారీ వృక్షము ఇది . స్పటిక సద్రుశమయిన తెల్లటి కర్పూరం .. చెట్టు కాండము , వేళ్ళు , చెక్కలు , ఆకులు , కొమ్మలు , విత్తనాలు నుండి లబిస్తుంది . దీని శాస్త్రీయ నామము " సిన్నమోమం కాంఫోరా ". కృత్రిమం గా టర్పెంటైన్ ఆయిలు(Turpentine oil) నుండి కుడా కర్పూరం తాయారు చేస్తారు .
కర్పూరం యొక్క ఉపయోగాలు:
వంటకి ఉపయోగించే్ది -- ఆహారపదార్ధాలు , తీపివస్తువులు ఘుమఘుమ లాడేందుకు కర్పూరం వినియోగిస్తారు .
వంటలకు ఉపయోగించనిది -- పూజలు , వివాహాది శుభకార్యాలలో హారతి ఇవ్వడానికి కర్పూరం వాడుతారు.
వివిధ రకాల వ్యాధులు నయం చేయడానికి భారతదేశం లో కర్పూరం వాడుతున్నారు ... జ్వరము , కోరింతదగ్గు , ఆస్తమా , మానసికవ్యాధులు , కేన్సర్ , ముత్రకోశసమస్యలు నయం చేయడానికి . స్త్రీ పురుష *జననేంద్రియాలను ఉత్తేజానికి ఉపయోగపడుతుంది .
పరుగులు మందులు , చెడువాసనల నిర్మూలానికీ , ఇన్ఫెక్షన్ తగ్గడానికి వాడుతారు ,
బట్టలను కొరికి తినే చెదపురుగులు , ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి , దోమల నిర్ములానికి ,కర్పూం చెక్కలోని రసాయనాలు విరివిగా వాడుతారు
పెయింటింగ్ , బాణాసంచా , సహజమైన పరిమళాలు , సబ్బులు తయారీ లో కర్పూరం వాడుతారు ,
విక్స్ వేపోరబ్(vicks veporub) , మెంథాల్ ఆధారంగా పనిచేసే ఆయింట్మెంట్ లన్న్తి చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు .
రక్తనాళాలలోని ప్రవాహాన్ని వ్రుద్ధిపరిచి ,హృదయ సంభందించిన మందుల్లోనూ , దగ్గు శ్వాస కోశ సంభందిత , కీళ్ళ నొప్పులు సంభందిత మందులలో దీనిని వివిరిగా వాడుతారు .
కర్పూరం పరిసర వాతావరణం శుబ్రం గా సువాసనలతో ఉంచుతుంది . కర్పూరం బిళ్ళలను , ఉండలను వాడుతారు .
తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి తాగించండి. దీంతో తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
కప్పునీటిలో కర్పూరం బిళ్లను వేసి మంచాల కింద ఉంచితే దోమలు దరిచేరవు. అరబకెట్‌నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఫ్లోర్‌ను ... తుడిస్తే ఫ్లోర్‌మీద ఈగలు వాలవు.
కాలిన గాయాలను మాన్పుతుంది: కర్పూరాన్ని నీటిలో అరగదీసి కాలిన గాయల మీద రాయాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల కాలిన గాయాలు సులభంగా తగ్గిపోతాయి. కాలిన వెంటనే రాయాలి లేదంటే చర్మం మంట మరియు చికాకు కు దారితీస్తుంది.
మొటిమలు: మొటిమలను మరియు మచ్చలను నివారించడానికి మనం ఒక అద్భతమైన ఔషదం చర్మ సమస్యలు మరియు మొటిమలు, మచ్చలకు పూర్తిగా నివారించుకోవడానికి కర్పూరాన్ని ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగించవచ్చు.
పగిలిన పాదాలను ఉపశమనం కలిగిస్తుంది. కొద్దిగా కర్పూరాన్ని నీటిలో వేసి ఆనీటిలో కొద్దిసేపు పాదాలను నానబెట్టుకోవాలి. 5-10నిముషాల తర్వాత కాళ్ళను బయటకు తీసి స్ర్కబ్బర్ తో రుద్ది శుభ్రం చేసుకోవాలి.
రకాలు
సాధారణంగా హారతికి ఉపయోగించే కర్పూరమే స్ఫురణకు వస్తుంది. తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరం అనే రెండు రకాలు ప్రసిద్ధం. కాని, కర్పూరంలో పదిహేను రకాలు (జాతులు) ఉన్నాయి. అవి: 1. ఘన సారం, 2. భీమసేనం, 3. ఈశావాసం, 4. ఉదయ భాస్కరం, 5. కమ్మ కర్పూరం, 6. ఘటికం, 7. తురు దాహం, 8. తుషారం, 9. హిమ రసం, 10. హారతి, 11. శుద్ధం, 12. హిక్కరి, 13. పోతాశ్రయం, 14. పోతాశం, 15. సితా భ్రం. ఇవన్నీ కపురం, కప్పురం మొదలైన పర్యాయ పదాలుగా కూడా వాడుకలో ఉన్నాయి.
Read More

అరుంధతి-వశిష్ట జంట నక్షత్రాలు:Greatness of our Astologists: మన భారతదేశ జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం: Important to know our culture::

అరుంధతి-వశిష్ట జంట నక్షత్రాలు:Greatness of our Astologists:
మన భారతదేశ జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం: Important to know our culture::
వివాహ మహోత్సవ సంధర్భంలోనే భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారా అన్నట్లుంది ఈ ప్రక్రియ:: ఒక సారి చూడండి..
5,000 - 7,000 ఏళ్ళ క్రితమే జంట నక్షత్రాల గురించి మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులకు తెలుసు. అందుకే మన ఆధునిక శాస్త్రజ్ఞులు కనుగొన్న15వ అత్యంతకాంతివంతమైన నక్షత్రాన్ని మన వారు ఎప్పుడోగుర్తించగలిగారు.. మనము దీనినే జ్యేష్టా నక్షత్రం అంటున్నాము... ఇప్పుడు సైన్సు ఇది భూమి కంటే 40,000 రెట్లు పెద్దద(జ్యేష్టమ)ని గుర్తించగలిగింది.. ఈ జంట నక్షత్రాలను అరుంధతి-వశిష్ట నక్షత్రాలు అని పిలుచుకుంటున్నాం.. ఈ జంట నక్షత్రాలను మరింత ముందుకు తీసుకువెళ్ళి మన వివాహంలో ఒక తంతుకు కూడా ముడి పెట్టారు.. మామూలుగా అయితే ఒక గ్రహం వేరొక గ్రహం చుట్టూ మాత్రమే తిరుగుతాయి.. కానీ ఈ జంట నక్షత్రాలు మాత్రం ఒకదానిచుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి.. ఇంకా చెప్పాలంటే దస్తీ బిస్తీ అని తిరుగుతూ ఆడుతూ ఉంటాం చూడండి అలాగన్న మాట.. దీనినే ఒకరకంగా హోమగుండం చుట్టూ ఒకరి వేలు పట్టుకుని మరొకరు తిరిగినట్లుగా చూపుట, వివాహానంతరం ఈ జంట నక్షత్రాలను చూపుటలో భార్యా భర్తల మధ్య సoబంధం ఇలాచూపారేమోనని ఒక అభిప్రాయం.
అయితే 5,000 ఏళ్ళ క్రితమే ఎటువంటి టెలిస్కోప్ లు లేకుండా ఈ నక్షత్రాల భ్రమణ పద్దతులను అధ్యయనం చేయగలిగారంటే నిజంగా అద్బుతమే...


Read More

ఎవడు చేసిన ఖర్మ వాడు అనుభవించాల్సిందే అనటానికి నిదర్సనం

Read More

శరీరంలో పల్స్ రేటును నిలకడగా ఉంచే ఆహారాలు..!శరీరంలో పల్స్ రేటును నిలకడగా ఉంచే ఆహారాలు..!

మన నాడీ వ్యవస్థలో ముఖ్యంగా రెండు బాగాలుంటాయి. సహనుభూతి నాడీ వ్యవస్థ, పరసహానుభూతి నాడీ వ్యవస్థ. వీటిల్లో మొదటిది మన శారీరక ప్రతిచర్యలను పెంచడానికి ఉపయోగపడుతుంది. స్ట్రెస్ ఏర్పడినపుడు, ఆదాడిని ఎదుర్కొనే నేపధ్యంలో పోరాడ్డం, లేదా పారిపోవడం ఏదో ఒకటి చేయడానికి మన శరీరానికి సిద్దపరిచే క్రమంలోsns వ్యవస్థ మన శారీరక పనితీరును వేగవంతం చేస్తుంది. రక్త ప్రసరణ అధికం చేయడం, కండరాలకు అధిక బలాన్ని అందివ్వడంవంటి చర్యల ద్వారా, శరీరం తనంతట తాను బహిర్గత ప్రమాదకర పరిస్థితుల నుండి కాపాడుకునేలా చేస్తుంది.


నాడీ(పల్స్) వ్యవస్థ మన జీవక్రియలను కాపాడుతుంది. గుండె సవ్యంగా కొట్టుకోవడం, ఆహారం జీర్ణం కావడం వంటి మౌళిక చర్యలను pns అదుపులో వుంచుతుంది. ఇది మన ఇతర శారీరక చాలక క్రియలను తగ్గించి, శక్తిని నిల్వవుంచి, జీవక్రియలకు వెచ్చిస్తుంది. అందువల్లే ఈ వ్యవస్థ చక్కగా పనిచేసినపుడు మనం చక్కగా రిలాక్స్ అవుతాం. లేదా మనం చక్కగా రిలాక్స్ కావడం ద్వారా ఈ నాడీ వ్యవస్థను చక్కగా పనిచేసే విధంగా చేయవచ్చు.

ప్రస్తుతం ఒక నిశ్ఛల జీవన విధానం, పెరుగుతున్న స్ట్రెస్ లెవల్స్(ఒత్తిడి స్థాయిలు)ఆందోళన, వ్యాయామం చేయకపోవడం మరియు అనియత ఆహారపు అలవాట్లు వంటివి ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని ఎక్కువగా చూపెడుతున్నాయి.ఈ కారణాల మనిషి సోమరిగా మారడానికి మరియు గుండె ప్రేరేపిస్తాయి. హైపర్ యాక్టివ్ కవల్ల గుండె పనితీరును మరింత పెరుగుతుంది. దాంతో గుండె కొట్టుకోవడం లేదా పల్స్ రేట్ పెరుగుదలకు దోహదం చేస్తుంది.

అయితే కొన్ని సందర్బాల్లో.. అనారోగ్యకారణంగా.. పల్స్ రేటు తగ్గిపోతే శరీరం మొత్త అస్థవ్యస్థంగా మారిపోతుంది. దాంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో పల్స్ రేట్ తగ్గడానికి విటమిన్ లోపం మరియు వైద్య అంశాలు కారణం కావచ్చు. అయితే గుండె వేగంగా కొట్టుకోవడం లేదా అసాధారణంగానే వేగంగా కొట్టుకోవడం, ప్రమాదకరమైనది. దాంతో గుండె సంబందిత వ్యాదులు గుండె పోటు మరియు స్ట్రోక్ వంటి హానికరమైన ఆనారోగ్యసమస్యలను పెంచడమే కాకుండా మరణానికి కూడా దారి తియ్యవచ్చు. కాబట్టి ఒక స్థిర మైన పల్స్ రేట్ మెయింటైన్ చేసి మనం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఉన్నాయి. ఇవి మనలోని పల్స్ రేట్ ను స్థిరంగా ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

క్యాల్షియం రిచ్ ఫుడ్స్: ప్రతి రోజూ 1000mg ల క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. దాంతో హార్ట్ బీట్ నార్మల్ గా కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. పెరుగు, పాలు, చీజ్ మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్, మొలసెస్, టోఫు, బ్రొకోలి, క్యాబేజ్ వంటి వాటిలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఈ మీడైట్ లో ఇవి తప్పనిసరిగా చేర్చడం వల్ల పల్స్ రేట్ క్రమంగా ఉంటుంది.


Read More

'హనుమాన్ చాలీసా ' లో "అష్టసిద్ధి నవనిధికే దాతా" అనే నామం ఉన్నది. అష్టసిద్ధులు,నవనిధులు అంటే ఏమిటి? అష్టసిద్ధులు...

'హనుమాన్ చాలీసా ' లో "అష్టసిద్ధి నవనిధికే దాతా" అనే నామం ఉన్నది. అష్టసిద్ధులు,నవనిధులు అంటే ఏమిటి?
అష్టసిద్ధులు...
1.అణిమా,2.మహిమ,3.లఘిమ,4.ప్రాప్తి,5.ప్రాకామ్యము,6.ఈశత్వం,7.వశిత్వం,8.సర్వ కామసిద్ధి (కామావసాయిత్వము)
1) అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట
2) మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట
3) గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట
4) లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట
5) ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట
6) ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట
7) ఈశత్వం : ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట
8) వశిత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట
నవనిధులు...
1. పద్మం,2. మహాపద్మం,3. శంఖం,4. మకరం,5. కచ్చపం,6. ముకుందం,7. నీలం,8. కుందం,9. వరం
(ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయవలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ,జల, లోహ భోగాది సంపదలు లభిస్తాయి)
ఆంజనేయ స్వామి లంఖిణి జయించు సమయాన తాను స్వయంగా అణువులా మారి లంఖిణి నోటిలో వెళ్ళి తిరిగి బయటకు వచ్చి.. కొండంత శరీరాన్ని పెంచి లంఖిణిని అంతం చేయడం మనకు తెలిసిన విషయమే...
ఆంజనేయ స్వామికి ఇన్ని శక్తులున్నా తన శక్తిని తాను గ్రహించలేని శాప కారణంగా అవసరమైన చోటనే తన శక్తిని ఉపయోగిస్తారు... అలా సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుండి హిమాలయాల వరకు లంఘించారు..
‘శక్తులను కలిగి ఉండడం గొప్ప కాదు.. కానీ వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప... వాటి విలువ తెలుసుకుని వాటిని గౌరవించడం ఇంకా గొప్ప’
అందుకే హనుమంతుడు గొప్పనమ్మకస్థుడు, భక్తుడు, దైవం అయ్యారు...

Read More

కాలం ఎంత విలువైనది ????

Read More

వేల సంవత్సరాల కిందటనే టెలిస్కోపు ను వాడిన భారతీయులు. (image courtesy : Aaryavart

Read More

పుష్పేషు జాజి, పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కంచి అని పురాణ ప్రసిద్ధి.

పుష్పేషు జాజి, పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కంచి అని పురాణ ప్రసిద్ధి. పంచభూత లింగాలలో స్థిరమైనది, జీవనాధారమైనది అయిన పృథ్వీలింగం కొలువైన పుణ్యక్షేత్రం కాంచీపురం. ఇక్కడి అమ్మవారు కామాక్షీ దేవిగా, స్వామివారు ఏకామ్రేశ్వరునిగా భక్తులను కరుణిస్తున్నారు. స్వామి వారు పృథ్వీలింగం కావడంతో జలాభిషేకం చేయరు. తైలలేపనం మాత్రమే జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో 1008 లింగాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆది పరాశక్తి పార్వతీదేవి కామాక్షిగా కొలువయ్యారు. శంకర భగవత్పాదుల వారి పూజలందుకున్న తల్లి. అమ్మవారి ఉగ్రతను తగ్గించడానికి ఆదిశంకరులవారు శ్రీచక్రాన్ని స్థాపించారు. రక్తబలులకు మారుగా సాత్విక బలిని ప్రవేశపెట్టారు. చతుర్భుజియైన అమ్మవారి విగ్రహం పద్మాసనంతో యోగముద్రలో ఉంటుంది. నాలుగు చేతులలోనూ చెరుకుగడ, తామరపుష్పం, చిలుక, పాశాంకుశాలను ధరించి ఉంటారు. వేల ఏళ్ళనాటి మామిడి చెట్టుకు నాలుగు కొమ్మలలో నాలుగు రుచుల పళ్ళు కాస్తాయని భక్తుల విశ్వాసం.
ఇదే క్షేత్రంలో వైష్ణవ మతానుయాయులైన పల్లవరాజులు శ్రీమహావిష్ణువుకోసం మరో నగరాన్ని స్థాపించారు. ఏకామ్రేశ్వర నిలయం శివకంచిగా, వరదరాజ పెరుమాళ్ కొలువైన ప్రాంతం విష్ణుకంచిగా ప్రసిద్ధికెక్కాయి. బల్లి దోషాన్ని పోగొట్టుకోవడానికి స్వర్ణ, రజిత బల్లులు గల ఆలయం విష్ణు కంచిలో ఉంది. హరిహర తత్త్వాన్ని చాటి చెప్పే ఈ రెండు క్షేత్రాలు వాస్తవానికి ఒకటే. అందుకే భక్తులు విధిగా శివకంచి, విష్ణుకంచిలలో భగవద్దర్శనం చేసుకొని పునీతులు అవుతారు.
Read More

దేహమే దేవాలయం అని చెప్తారని తెలుసుకదా? అందులో అష్ట మూర్తులు ఏ విధంగా ఉన్నారో తెలుసుకుని 'న్యాసం' చెయ్యాలి. the following article is about bhairava and tatvam of bhairava along with his 8 moorthis..श्रीमात्रे नम:
the following article is about bhairava and tatvam of bhairava along with his 8 moorthis..

this is written in comments by Krishna konakanchi garu (one of my Friend) on one of our mutual friend's wall.. Interested people plz read this.. dont comment like this... "guruvu gari peru pettukoni vere vaaru vraasinadi pettarenti ? ani adagaddu... gnanam evaru cheppina AUTHENTIC aithe chadavachu..vinachu.. chudachu...--ADMIN

దేహమే దేవాలయం అని చెప్తారని తెలుసుకదా? అందులో అష్ట మూర్తులు ఏ విధంగా ఉన్నారో తెలుసుకుని 'న్యాసం' చెయ్యాలి. అష్ట సంఖ్య ఎందుకు చెప్పారో దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలి. సంఖ్యకి, నామానికి, రూపానికి, తత్వానికి, శక్తికి మనలోనే లింకులుంటాయి, అది తెలుసుకుంటే మనకి ఆ దేవత 'సాక్షాత్కారం' అవుతుంది. అంటే అర్థం అవుతుంది, మనం అది అయిపోతాము.
ఇంతకీ శివుడి అష్ట మూర్తుల పేర్లు : రుద్ర, శర్వ, పశుపతి, ఉగ్ర, అశని, భవ, మహాదేవ, ఈశాన.

శివుడంటే సృష్టి ఏర్పడక ముందు కూడా ఉన్న దైవం. ముందు చోటు, కాలము ఏర్పడి ఆ తరువాత సకల దేవతలూ పుట్టుకొచ్చారు. అసలు కాలము ఏర్పడటానికి 'భైరవ' అనే దైవముగా శివుడే దిగివచ్చాడు. (అందువలన మనలో ప్రాణానికి ఆయనే అధిపతి. ప్రాణం ఉన్నంతసేపే మనవరకు మనకి కాలం తెలుస్తుంది కదా, అందుకని.) చోటు 'రుద్రుడు' వలన తయారయ్యింది. ఏ శివాలయానికి వెళ్ళినా భైరవుడే క్షేత్రపాలకుడు. ఆ ఆలయంలో శివలింగానికి ఒక పేరుంటుంది. ఆ పేరుని బట్టి అక్కడి భైరవుడికి కూడా ఒక పేరుంటుంది. ఆ పేర్ల బాహ్యార్థం బాహ్య రూప విశేషాలు అనేవి క్లూ లాంటివి. వాటిని పట్టుకుని గుహ్యంగా (సీక్రెట్) ఉన్న పరమార్థం మనం పట్టుకుంటే ఆ ఆలయంలో / క్షేత్రంలో న్యాసము, ఉపాసన ఎలా చెయ్యాలో అందుతుంది. భైరవుడికి కూడా అష్ట నామాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిలో భైరవ అనే పేరు అలాగే ఉండి ఒక బిరుదు లాంటిది ముందు తగిలిస్తారు. భైరవ అనే పదానికి కుక్క అనేది రూపార్థం. దానికి విశేషార్థం వేరే ఉంటుంది. భైరవుడి అష్ట మూర్తులు: రుఋ భైరవ, అసితాంగ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ. - అంటే ఏమిటి అని మనం ప్రశ్న వేసుకుని లోపల మధించుకోవాలి.

దేహమే దేవాలయం అనుకున్నప్పుడు అదే క్షేత్రం కూడాను. అంటే కేవలం ఈ భౌతిక పదార్ధం ఒక్కటే కాకుండా లోపలి అన్నిపొరలను కలిపి దేహం అని సంబోధిస్తారు. బయటి భౌతిక కక్ష్యను 'శరీరం' (శీర్యతే ఇతి శరీరః - శీర్యతే అంటే నశించి పోయేది) అంటారు. ఇన్నిపొరలూ కలిపి దేహంగా ఏర్పడటమే సృష్టి అనుకుంటే, ఇందులో ప్రాణం వీటన్నిటినీ ఒక దారం ముడి వేసినట్లు పట్టి ఉంచుతుంది. దానికి అధిపతి భైరవుడు. ఆయన మూలాధారం కంటే క్రిందన ఉండి కాపలా కాస్తాడు / రక్షిస్తాడు, దేన్నించి? ప్రాణం ముడి ఊడిపోయి క్రిందకి జీవుడు వెళ్ళిపోకుండా. ఇలాంటి symbolisms అన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుని వాటి correlations పట్టుకోవాలి. లేకపోతె తెలిసేసినట్లు ఉంటుంది కానీ ఏమీ తెలీదు.

'ఉన్మత్త' అంటే నువ్వు అనుకున్నట్లు మందు కొట్టేసి ఎదో గొప్ప మైకంలో రమిస్తూ ఉండేవాడని కాదు అర్థం. పై పైన అలాగే కనిపిస్తుంది. వేదంలో చెప్పే చాలా విషయాలు encoded భాషలో ఉంటాయి. ఎవరికైతే తెలియకూడదో వాళ్ళనుంచి జ్ఞ్యానం దాచటానికి అలా పెట్టారు. అంతకు ముందు మన్వంతరాల్లో జ్ఞ్యానం అందరికీ అందుబాటులో open source గా పెడితే దాన్ని కొల్లగొట్టి పాడుచేసిన రాక్షసులు చాలా మంది ఉన్నారుట, అందుకని ఇప్పుడు దాన్ని దాచేశారు. కానీ ఇలా గుప్తంగా ఉందిట అని మనకి కనీసం తెలిస్తే అది అర్థం చేసుకునే ప్రయత్నం ఒకటి చేస్తాం కదా, అందుకని చెప్పాను. ఇవన్నీ తెలియకపోతే వైదిక విషయాలు చాలా వరకూ పై పై అర్థాన్ని బట్టి చూస్తే భయంకరమైన బూతు లాగానే ఉంటాయి.మరొక విషయం. "ఆయన నగ్నంగా తన పెద్ద లింగాన్ని చూపిస్తూ ఉంటాడు, అది చూస్తే మనకి కూడా మూడోస్తుంది" - ఇది చాలా తప్పుడు అవగాహన, క్రింది స్థాయి అవగాహన. పామరులకు అలాగే అర్థం అవుతుంది. (యద్భావం తద్భవతి కూడా) అలాంటి పామరుడవడో ఇంగ్లీషు లో చెప్తే మనం అదే అనుకోకూడదు. ఆ పై విషయం (లోపలి అర్థం ) మనం అందుకోవాలి. ఎక్కడైతే దైవిక విషయం కొంచం అసహ్యకరమైన సంకుచితమైన రూప లక్షణాలతో చూపిస్తారో అక్కడ ఋషులు వేరే ఎదో రహస్యం దాచేసారని అర్థం. అలా కాకుండా అలా పైకి చూపిస్తున్న అర్థాన్నే తీసుకుని తృప్తి పడిపోతే తరవాత విషయం అసలు ఆలోచించము. మనసు యొక్క తెలివి కాకుండా ఆ పైనున్న బుద్ధి వాడితే తెలిసిపోతుంది, అబ్బే ఇది కాదు అసలు విషయం అని. ప్రాణానికి దేహంతో ముడి మనకి మూలాధార చక్రంలో ఉంటుంది అనేది తెలియటం కోసం మర్మాంగాన్ని చూపిస్తూ ఉంటాడు. యోగి అయినవాడు అప్పుడు ఆ మూలాధారంలో కూడా ఉన్న పరమాత్మ శక్తిని ధ్యానం చేసి తెలుసుకుంటాడు. కానీ దానికి ఈ భైరవుడి అనుగ్రహం లేకపోతె ప్రాణమే కామశక్తిగా పనిచేసి జీవుడు అధోలోకాల్లోకి పోతాడు. గురువు అనుమతి లేకుండా కామాన్ని జయించకుండా మూలాధార చక్ర ధ్యానం చెయ్యకూడదు. ధ్యానం హృదయం లేదా ఆ పై చక్రాలలోనే చెయ్యాలి ఎప్పుడూ.

ఇంకొక విషయం - పురుషుడి మర్మ అవయవాన్నే లింగంగా / దేవుడిగా భారతీయులు పూజిస్తారుట అనే దారుణమైన తప్పుడు అవగాహన మరొకటి ఉంది. లింగం అంటే అది కాదు. లింగం అంటే సృష్టి ఏర్పడే మొట్ట మొదట అసలు ఏ రూపము, ఏ దిక్కులు తనకు లేని తత్వాన్ని గుండ్రంగా గుర్తించి దాన్ని లింగం అన్నారు. అది ఎటునుంచి చూసినా ఒకలాగే ఉంటుంది. దానికి కన్ను ముక్కు చెవులు మొదలైనవి లేవు. అంతా ఒకటి స్థాయిలోని తత్త్వం అది. అన్నిటికీ మూలం అది. మనలో కూడా భౌతిక కక్ష్య దాటి లోపలి స్థాయి పొరల్లో మనకొక లింగ దేహం ఉంటుంది. చక్కగా యోగ సాధన చేసుకున్న జీవుడు మరణ సమయంలో ఆ లింగశరీరం తోటే బయటకు వెళ్ళిపోతాడు. సాధన చేసుకొని వాడికి యాతనా శరీరం ఏర్పడుతుంది, దానికి కళ్ళు ముక్కు వగైరా మనకున్నట్లే ఉంటాయి దాంతోటి బయటకు లాగబడి కర్మ ఫలితాలు అనుభవిస్తాడు. అదిగో అలాంటి లింగం లాగా ఉన్న ప్రతీ దాన్ని లింగంతో పోల్చవచ్చు. లింగం లాగా పురుషాంగం ఉందేమోగానీ లింగం పురుషాంగం లాగా లేదు. తండ్రి పోలికలో కొడుకుంటాడు గానీ, కొడుకుని పోలి తండ్రి తయారు చెయ్యబడలేదు అన్నట్లు. ఇలాంటి తప్పుడు అవగాహనే స్త్రీ జననావయవాన్ని గురించి కూడా ఉంది. అవన్నీ సంకుచిత భావాలు. పైగా వాటికి కథలు కూడా కల్పించేసి పురాణంలో చేర్చేసారు. ఒకవేళ పురాణాల్లో కూడా అసహ్యకరమైన విషయాలు వచ్చినప్పుడు, మళ్ళీ అక్కడేదో రహస్యం ఉందని గమనించాలి.

సుబ్రహ్మణ్య స్తోత్రం లో కొన్ని నామాలు ఉంటాయి "మత్తః ప్రమత్తః ఉన్మత్తః " అని. ఉన్మత్త అనే పదానికి లౌకిక అర్థం పిచ్చి అయినప్పటికీ మహాత్ములకు లేదా దేవతలకు అన్వయించినప్పుడు ఇలాంటి పదాలకు విశేష అర్థాన్ని చెప్పుకోవాలి. ఉత్ అనే శబ్దం పై దిక్కుని సూచిస్తుంది. మత్త అనే శబ్దం మనసు ఎదో ఒక విషయం పైన ఆధారపడి ఉండి తన ఉనికి తాను కోల్పోవటాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్మత్త అనే పదం ఊర్థ్వ దిక్కుగా మాత్రమే చూస్తూ అందులోనే మనసు లయం చేసుకొమ్మని మనకు సూచిస్తున్న భైరవమూర్తిగా మనం దర్శించాలి.

మూలాధారం అనేది పూర్తిగా అదో లోకాల్లోకి జారిపోవటానికి ఒక ద్వారం లాంటిది. యోగి స్వాధిష్టాన చక్రం కంటే కిందకి దిగడు, అది కూడా తప్పనిసరి అయితే అంతవరకూ వస్తాడు, లేకపోతె హృదయంలోనే కూర్చుంటాడు. మనం వెళ్లవలసినది పైకి సహస్రారం వైపు. క్రిందికి జారిపోతే ఎలా? మూలాధారంలో నాల్గు దళాల చక్రంలో కపిలుడు, దత్తాత్రేయుడు, గణపతి, ఆంజనేయుడు అనే రూపాలలో గురు తత్త్వం జీవుని వెనుకకు ఊర్ధ్వానికి మరల్చే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కామము వంటి అంతః శత్రువుల వలన పైనుండి ఇంకా కిందకి జారిపోతున్న జీవప్రజ్ఞ్య ఇంకా కిందకు వెళితే ఏమాత్రం పుణ్యం మిగిలి ఉన్నా భైరవస్వామి అక్కడ దర్శనం ఇస్తాడు. ఇంక చాల్లే పద పైకి అంటాడు. నన్ను దాటితే చాలా భయంకరంగా ఉంటుంది సుమా అని హెచ్చరిస్తాడు. భయపడి వెనుతిరిగి పైకి పోతుంది మనుష్య జీవ ప్రజ్ఞ్య. (అందుకే ఆ భయంకర రూపం) ఆవిధంగా పశు ప్రవృత్తిలో పడే జీవులకు తానే ఆ ద్వారం దగ్గర నుంచుని వెనక్కి పంపి క్రింద ఉన్న భయంకర నరక కూపాల నుండి కాపాడుతున్నాడు అన్నమాట. ఆయన అనుగ్రహం ఉన్నవాడికి ఉత్తమగతులు తథ్యం. కిందనుంచి అవసరమైతే తన్ని మరీ పైకి పంపుతాడు. భైరవము అంటే వెలుగుల నుండి పుట్టిన పెద్ద శబ్దము / ప్రకంపనము అనే అర్థం నాకు గోచరిస్తోంది. మిగతావి పైన రాశాను. ఒక్కడే దైవం వేర్వేరు స్థాయిలలో వేర్వేరు రూప నామాలతో వేర్వేరు పనులు చేస్తూ దర్శనం ఇస్తున్నాడు. సహస్రారం పైన శివుడే వివిధ ప్రాణ ప్రకంపనములుగా రుద్రుడు మూలాధారం కింద భైరవుడు. ఆయన లీలను దర్శిస్తూ వివిధ స్తోత్రాలలో ఆయనను కీర్తిస్తూ ఆనందానుభూతి పొందుతూ ఉంటే భక్తి పెరుగుతుంది, ఆయన అనుగ్రహం లభిస్తుంది, సన్మార్గపథగాములము అవుతాము, జ్ఞ్యానం వృద్ధి అవుతుంది అక్కడినుంచి అన్నీ సిద్ధిస్తాయి మోక్షం దాకా.

Read More

శివుడికి ప్రీతికరమైన పుష్పాలు:శివుడికి ప్రీతికరమైన పుష్పాలు:

పరమశివుడికి యే పుష్పాలతో అర్చన ఇష్టమంటే

కరవీరార్క మందార శమీ వకుళ కింశుకమ్!
మధూక బృహతీ బిల్వ మపామార్గం చ పాటలమ్!!


అశోకాగస్త్య దత్తూర కర్ణికార కదంబకమ్!
బాణపున్నాగ తిలకం కోవిదారం చ చంపకమ్!!

మల్లికా మాధవీ జాతిః ద్రోణం చ శతపత్రకమ్!
కమలం కైరవం చైవ తథానీలోత్పలాని చ!!

తమాలం తులసీపత్ర మిత్యేతాని శివార్చనే!
పుష్పపత్రాణి శస్తాని సర్వపాప హరాణి చ!! (శివతత్త్వ సార సంగ్రహం)

శివార్చనకు

*కరవీరం (గన్నేరు),
*అర్కం (జిల్లేడు),
*మందారం,
*శమీ (జమ్మి),
*బొగడ,
*మోదుగ,
*ఇప్ప,
*వెంపలి,
*బిల్వం(మారేడు),
*అపామార్గం (ఉత్తరేణి),
*కలిగొట్టు,
*అశోకం,
*అవిసె,
*ఉమ్మెత్త,
*కొండగోగు,
*కడిమి,
*నల్ల గోరింట,
*సురపొన్న,
*ఎర్రగోరింట,
*ఎర్ర దేవకాంచనం,
*సంపెంగ,
*మల్లి,
*పండు గురివింద,
*జాజి,
*తుమ్మి,
*నూరు రేకుల పద్మం,
*వెయ్యి రేకుల పద్మం,
*తెల్లకలువ,
*నల్లకలువ,
*తాపింఛం,
*తులసి -

వీటికి సంబంధించిన పుష్పపత్రాలు సర్వదా శ్రేష్ఠాలు. వీటితో పరమ శివుణ్ణి పూజిస్తే, సమస్త పాపాలూ నశిస్తాయి.
Read More

శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు

శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. 'నన్ను పెళ్ళి చేసుకుంటావా?'అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ'నేనెవరో తెలుసా?' అంది. "నువ్వెవరివైనా సరే, నన్ను వివాహమాడు. నా రాజ్యం,నా డబ్బు,నా ప్రాణం,సర్వస్వం నీ కిచ్చేస్తాను " అని మ్రతిమాలాడు.
అప్పుడు ఆ అమ్మాయి,"మహారాజా! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను.కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి " అంది.
ఆవేశంలో "అలాగే!" అని మాట యిచ్చాడు శంతనుడు.
వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు - గంగాదేవి.
పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా, పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో " నువ్వెవరు? ఎక్కడనుండి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? " అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు.
ఏడుగురు కొడుకులు పుట్టారు.ఏడుగురూ ఏటిపాలయ్యారు.
చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక " నువ్వు తల్లివి కావు...ఎందుకింత పాపం చేస్తున్నావు? " అని అడిగాడు.
వెంటనే ఆమె "మహారాజా! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.
" పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. 'ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు' అని చెప్పాడు భర్త.
ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను 'సరే' అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.
" వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో,'మీరంతా మానవులై పుట్టండి' అని శపించాడు.
అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు.
కానీ వశిష్ట మహర్షి , 'నా శాపానికి తిరుగులేదు పొండి!' అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.' నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు!' అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.
" ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, 'గంగాభవానీ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు, అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి, మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ!' అని మొరపెట్టుకున్నారు.అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను, అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.
ఆ పిల్లవాడే దేవవ్రతుడు.
వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు.
శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు.
విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు.
ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ, పాండవ, వంశాలకు పితామహుడు.


Read More

పాశురము 9

పాశురము 9
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్
ఆండాళ్ తల్లి ఈరోజు నాలుగో గోపబాలికను లేపుతుంది. "తూ" పరిశుద్దమైన "మణి" మణులతో చేసిన "మాడత్తు" మేడ, "చ్చుత్తుం విళక్కెరియ" చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్ర్తాలు కావాలి. శాస్ర్తాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆరెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం, ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అణుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. ఈ గోపబాలిక వెలుతురుకోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటిచుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటిచుట్టూ దీపాలు వెలిగించింది. "దూపం కమళ" దూపం పరిమళిస్తుంది. "త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్" నిద్రపుచ్చే అందమైన ఒక పడక పై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా. "మామాన్ మగళే!" ఓ మామగారి కూతురా! "మణి క్కదవం తాళ్ తిఱవాయ్" మణులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. సంస్కృతంలో వివిద అంకెలకు గుర్తుగా, తొమ్మిది మణులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆధిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకూ భగవంతునికి ఉండే తొమ్మిదిరకాల సంబంధాలు తెలుసుకోవాలి.
1. మనందరికి తండ్రి ఆయనే
2. మనందరిని రక్షించేవాడు ఆయనే
3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేషి అంటారు
4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు
5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు
6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే
7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు
8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు
9. భోక్తా ఆయనే. స్వీకరించగల వాడు ఆయనే
లోకంలో మనం ఎదో ఒక సంబంధం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంబంధాలు కల్గి, శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! "పితా రక్షకః శేషి భర్తా జ్ఞేయ స్వామి ఆధారః ఆత్మా భోక్తా" అష్టాక్షరీ మహా మంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆగోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ దూప పరిమలాల వంటిది.
అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా, వాళ్ల స్థానాన్ని తలచుకున్నా మనం తరించిపోతాం. మనకు ఈ శరీరంపై దృష్టి ఉండి, ఇకపై దేనియందు మనస్సు అనిపించదు. దీన్ని పోషించుకోవాలి, దీని కోసం దేన్నైనా వదిలేయ్యాలి అని ఇలా దేహ బ్రాంతి పెరిగిపోతుంది. ఈ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్షనమైన దేహం అనే తలుపు తెరుచుకొంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరువాల్సిందే.
"మామీర్!" ఓమెనత్తా, "అవళై ఎళుప్పీరో" మీ కూతురుని లేపమ్మా. ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే, ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు. "ఉన్ మగళ్ తాన్ ఊమైయో" నీపిల్ల ఏమైనా మూగదా లేక "అన్ఱి చ్చెవిడో" చెవిటిదా లేక "అనందలో" అలసిపోయిందా "ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో" ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా. శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం, ఆయన దగ్గర ఉంటే ఇక ఏమంత్రం పనిచెయ్యదు. అక్కడి నుండి బయటకు రావడం కష్టం. భగవత్ జ్ఞానం కల్గిన వ్యక్తి అలానే ఉంటాడు, ఇతరమైన మాటలు మాట్లాడడు. బయటి విషయాల్లో మూగివాళ్ళ వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవిటివారివలె ఉంటారు. లౌకికమైన పనుల యందు అలిసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞాని.
ఆయితే లోపల గోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి, ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా, లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది. మీరూ ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం. ఏమేమి అని అడిగింది.
"మామాయన్" చాలా ఆశ్చర్యమయిన పనులు చేసేవాడు, ఒకనాడు అడివి దహించి పోతుంటే ఒక్కసారి ఇలా మింగేసాడు, మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు. ఎలాగో ఒకలాగ ఆయనపై మనస్సు పడేట్టు ఆయన మన బాగుకోసం చేసాడిన్ని పనులు. ఇవన్నీ దయ చేత కారుణ్యం చేత చేసాడు.
ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు అయనకు ఒకావిడ ఉంది, మన పాపాలను కనపడకుండా చేసే ఒకావిడ ఉంది, "మాదవన్" మా-లక్ష్మీదేవి దవ-నాథుడు,లక్ష్మీదేవి సంబంధం కల్గిన వాడు ఆయన, మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడంలేదు, ఆయన "వైకుందన్" వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ- త్రిపాద్ విభూది అనిపేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించే వారు. అలాంటి వైకుంఠానికి నాథుడు. మన బాగుకోసం మనకోసం వచ్చాడు. ఇలా "ఎన్ఱెన్ఱు" ఎన్నెన్నో "నామం పలవుం నవిన్ఱ్" నామాలను పలుకుతున్నాం.
ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి.'
Read More

పాశురము 10పాశురము 10

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్
ఆండాళ్ తల్లియొక్క సంకల్పం, అందరూ కలవాలి, వైయత్తు వళ్ వీర్గాళ్ ఈ భూమిమీద ఉన్నవాళ్ళంతా ఒకటి. ఇది మన ఆండాళ్ తల్లి హృదయ వైశాల్యం. ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దూ అనేది అమ్మ ఔదార్యం. ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది. అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది. శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికకరాలకోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోపబాలికను గోష్టిలో చేరుస్తుంది. పైపైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెపుతున్నా మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం అమ్మ యొక్క లక్ష్యం.
మానవ జీవితం అనగా సుఖ దుఃఖాలు నదీ తరంగాలుగా ఒక దానివెంట ఒకటి వస్తూనేవుంటాయి. సుఖమైనా దుఖఃమైనా ఎప్పటికి నిలిచి ఉండవు. అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్దం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు. మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది, అయితే దుఖం వల్లనన్నా లేక సుఖం వల్లనన్నా చెడుతుంది. సుఖం వచ్చినప్పుడు మిడిసి పడకూడదు. సుఖః దుఃఖాలు ప్రమాదకరం కాదు, వాటియందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం. అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏంచెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.
దుఖేఃషు అణుద్విజ్ఞమనాః సుఖేషు విగతస్పృహః |
వీత రాగ భయ క్రోదః స్తితదీః మునిరుచ్యతే ||
మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం. నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి - వాడినే ముని అంటారు. అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై సృహ ఉండకుండా చేసుకోకు! దుఃఖం వచ్చినప్పుడు మనస్సు ఉద్విజ్ఞం చెందకుండా ఉండాలి. మనకు వీటియందు పట్టు ఉండకుండా చూసుకోవాలి. మనలోని రాగం భయంగామారి క్రోదంగా మారుతుంది. ఈరోజు మన ఆండాళ్ తల్లి లేపే గోపబాలిక ఇలాంటి జ్ఞానం కల్గి ఉన్నది.
"నోత్తు" మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు. కానీ నీనోము అయిపోయింది. ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది. "చ్చువర్ క్కం పుగుగిన్ఱ" నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్టు ఉన్నావు, అంటే కృష్ణుడు నీవద్దే ఉన్నాడు. కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే. సఖలలోకాలనన్నినింటిని తనలోచూపించాడు కదా! ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం. ఆయనలో సఖలం ఉన్నట్లేకదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. "తేషాం రాజన్ సర్వ యజ్ఞాః సమాప్తాః" ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు. "అమ్మనాయ్" ఓ యజమానురాలా! యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపజేసి కదా నీవు సుఖం అనుభవించాలి. "మాత్తముం తారారో" ఒక మాట మాతో మాట్లాడరాదా "వాశల్ తిఱవాదార్" తలుపులు తర్వాత తీద్దువుగాని, లోపలనుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నిన్ను శ్రీకృష్ణ సేవనుండి మేం వేరు చేయటంలేదు. నీ మాట చాలు మాకు. అది మాకు ప్రాణం కాపాడుతుంది. జ్ఞానం పొందాలనుకొనే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష.
వీళ్ళు కృష్ణుడులోపల ఉన్నాడని అనుమానిస్తున్నారు, ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారు అని లోపల గోపబాలిక ఏం పలకలేదు. లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్ళను పట్టించుకోలేదు. "నాత్తత్తుళాయ్ ముడి" లోపలుండే వాడు మన స్వామియే, ఎందుకంటే తులసిని ధరించిన వాడు మన స్వామియే కదా. ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తాడు. మేము ఆ వాసన గుర్తించాం.
లోపల గోపబాలిక నాపై లేని అభాండాలు వేయకండి, చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడెక్కడినుండి వస్తాడు అని అంది. "నారాయణన్" అంతటా వ్యాపించినవాడేకదా ఆయన, సఖల చేతన అచేతన వస్తువులకన్నింటికీ లోపన పైన వ్యాపించి ఉండేవాడు. అలాంటి వానికి తలుపులు అడ్డా! "నమ్మాల్ పోత్త ప్పఱై తరుం" దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులరందరికి అందేవాడు ఆయన. "పుణ్ణియనాల్" పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు. ఆయన అందరికి అందాల్సినవాడు నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవడం సబబా!
"పండొరునాళ్" ఇదివరకు ఒకనాడు "కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం" మృత్యువు నోట్లో దూరాడు కుంభకరణుడు. రాముడు అందరినీ రక్షించగల ఉదారుడు, ఆయన కుంభకరణుడిని చంపలా, కుంభకరణుడే మృత్యువు నోట్లో దూరాడు. దీప కాంతికోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు దీపందా! బుద్దిమంతుడూ ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడతాడు, బుద్ది హీనుడు దానిలోనే పడి ప్రాణం తీసివేసుకుంటాడు. "తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో" ఇంతగా మేం చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా? పైపైకి సరదాగా చెప్పినా లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది అండాళ్ తల్లి.
ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తుంది. ఎవరు అంటే, కుభంను కరణముగా కల్గిన వ్యక్తి, అగస్త్యుడు ఓడి పోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా అంటుంది. అగస్త్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టిన వాడు. శివుని వివాహానికి హిమాలయాపర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. వింధ్య పర్వతం మేలుపర్వతానికి పోటితో పెరుగుతుంటే దేవతలంతా గాబరాపడి ఈయనని అడిగితే, వింధ్య పర్వతం ఈయన శిష్యుడు. ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తధాస్తు అని పెరుగుదలని వంచాడు అది ఆయన గొప్ప తనం. మామూలుగా ఒక్కొక్క పర్వతానికి అదిష్టాన శక్తివిశేషం ఉంటుంది. మనం దాన్నే పర్వతం అంటాం. ఈ భూమినీ మనం అలాగే భావిస్తాం, ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నారు, అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి ఆంటాం. అగం-పర్వతం స్త- పెరుగుదలని నిలిపిన వాడు అందుకే ఆయన పేరు అగస్త్య అయ్యింది. మనలో పెంచుకున్న పాపపు కొండలని స్తంభింపజేయువాడు ఆయన. ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు. ద్రావిడ భాషకంతటికి ఆయన వ్యాకరణ సూత్రాలను రచించిన మహనీయుడు. వాతాపిని సంహరించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా అన్నట్లుగా ఆండాళ్ తల్లి చెబుతుంది.
లోపల గోపబాలిక కృష్ణా అంటూ లేచింది, "ఆత్త అనందల్ ఉడైయాయ్!" పెద్ద బద్దకం కల దానా, "అరుంగలమే" అతిలోక సుందరి, ఒక మంచి ఆభరణం లాంటి దానివి. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసినవారుకాదు. "తేత్తమాయ్ వందు తిఱవ్" తొందరగా సర్దుకొని రావమ్మా.
Read More

పాశురము 11పాశురము 11

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
గోపికలు "యుగాయితం నిమేషేన చక్షుసా ప్రాప్యుడాయితం శూణ్యాయతా జగత్ సర్వం గోవింద విరహేణమే" అని భావిస్తారు. ఒక కంటి రెప్పపాటు గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తుల స్థితి అలా ఉంటుంది. భక్తులెప్పుడు తమనొక నాయికగా భగవంతున్ని ఒక నాయకుడిగా భావిస్తారు. భగవంతుని పై వారికుండే భక్తి, జ్ఞానం వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే, భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు. వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటియందు శ్రద్దలేకుండా వాటి వెనకాతల కారణభూతుడైన భగవంతున్ని భావిస్తూ, అన్ని పనులూ భగవత్ సంబంధంగానే చేస్తారు . ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు.
ఇవాలటి గోపబాలికది దివ్యమైన సౌందర్యం కలది. పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యం అయితే, పురుషోత్తముణ్ణి ఆకర్షించేది భక్తి సౌందర్యం. ఈవాల్టి గోప బాలిక అలాంటి సౌందర్యం కలది. గొప్ప వంశానికి చెందినది. చాలా పాడి సంపద కల వంశంలో పుట్టినది ఈ గోపబాలిక. భగవత్ సేవా సంపద గొప్పగా కల్గినది కాబట్టి, ఈవిడని తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాళ్ తల్లి ఈవాలటి గోపబాలికను లేపుతుంది.
"కత్తుకఱవై" దూడలకు పాలిచ్చే, దూడలవలె ఉండే, తక్కువ వయసుగా కనపడే "క్కణఙ్గళ్" గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల "పలకఱందు" పాలు పితకటంలో నేర్పరులు, "శెత్తార్ తిఱల్ అరియ" శత్రువుల బలం నశించేట్టుగా "చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం" వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ మదమును అణచగలిగేవారు, "కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం" ఏపాపమూ అంటని వారు, ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది. శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన "పొఱ్కొడియే" బంగారు తీగ, తీగ ఎదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని ప్రాకుతుంది, ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ.
శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యం అంటారు. అదే సామూహికంగా పాదాది కేశాన్తంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు. మరి ఆమె లావణ్యాన్ని ఆండాళ్ తల్లి ఇలా వర్ణిస్తోంది. "పుత్తరవల్ గుల్" తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగ లేపి ఉన్న ఒక పాములాంటి అందం కల్గి ఉండి, "పునమయిలే" ఏభయంలేని తన వనంలో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా. "పోదరాయ్" రావమ్మా!! నీవెంట మేము నడుస్తాం."శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు" ఈ చుట్టూ ఉండే చెలికత్తెలు అందరూ వచ్చి, "నిన్-ముత్తం పుగుందు" నీ ముంగిట ప్రవేశించి, "ముగిల్ వణ్ణన్ పేర్-పాడ" నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాం. నిన్ను నెమలితో పోల్చాం, నెమలి మేఘాన్ని చూసి ఎలా పరుగెత్తుతూ వస్తుందో, నీలి మేఘశ్యామున్ని మేం కీర్తిస్తుంటే నీవూ వస్తావని అనుకున్నాం. కానీ, "శిత్తాదే" ఉలుకు లేదు "పేశాదే" పలుకు లేదు "శెల్వప్పెణ్డాట్టి" ఓ సంపన్నురాలా! ఎమమ్మా ఐశ్వర్య మదమా "నీ ఎత్తుక్కుఱగుం పొరుళ్" లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతుంది ఆండాళ్ తల్లి.
Read More

నిష్కామ కర్మనిష్కామ కర్మ

ఒకసారి వేదవ్యాసుడు ధర్మరాజుకు జాబాలి కథ చెప్పాడు.

"పూర్వం జాబాలి అనే ముని వుండేవాడు. అతడు నిష్ఠగా తపస్సు చేసుకుంటున్నాడు. అతని నెత్తిమీద పిచ్చుకలు గూడు కట్టుకుని, గుడ్లు పెట్టుకొని పిల్లలతో హాయిగా కాపురమున్నాయి. జాబాలి దయార్ద్ర హృదయుడు కావటం వలన వాటిని తరిమెయ్యకుండా తన నెత్తిమీద అలాగే ఉంచుకున్నాడు.

'ఆహా! నాకున్న ధర్మనిష్ఠ ఇంకెవరికైనా వుందా!' అనుకుంటూ తననితానే మెచ్చుకునేవాడు. ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ 'నీకంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు. అయితే అతను నీ మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు' అంది.

"జాబాలికి అసూయ కలిగింది. ఆ తులాధారుడెవరో చూడాలనుకుని విసవిస బయలుదేరాడు. వర్తకం చేసుకుంటున్న అతన్ని చూశాడు.

'అయ్యా వచ్చావా! రా! పిచ్చుకలు నెత్తిమీద గూడు కట్టుకుని పిల్లలతో సుఖంగా తిరుగుతున్నా చిత్తవికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగరా! ఎంత గొప్పవాడివి నువ్వు!!" అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధారుడు.

జాబాలి ఆశ్చర్యపోయాడు.

'ఈ సంగతి నీకెలా తెలిసింది?' అని అడిగాడు.

'మహర్షీ! నాకు దేనిమీదా, ఎవరిమీదా మమకారం లేదు. ధర్మమార్గంలో సంచరించడ మొక్కటే నాకు తెలుసు. ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందుచేత నా మనస్సు దేనికీ ఆకర్షింపబడక తామరాకు మీద నీటి బొట్టులా వుంటుంది. అందువల్లే నీ గొప్పతనం తెలుసుకోగలిగాను' అన్నాడు తులాధారుడు.

'అయితే నేను ధర్మమార్గాన నడవడం లేదంటావా? నా తపస్సూ, యజ్ఞాలు ధర్మాలూ కావంటావా?' అన్నాడు జాబాలి కొంచెం కోపంగా.

'అహంకారంతో చేసే తపస్సునీ, ఫలం కోరి చేసే యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం. దానివల్ల దేవతలూ, మనమూ కూడా తృప్తి పొందుతాము' అన్నాడు తులాధారుడు.

'మరైతే నువ్వీ వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు? ధనాశ కాదా ఇది?' అని అడిగాడు జాబాలి.

'అయ్యా! కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు. అయినా మనిద్దరికీ వాదం ఎందుకు! నేను చెప్పినదంతా సత్యమో కాదో అడుగుదాం - ఇన్నాళ్ళూ నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచ్చుకలను పిలు' అన్నాడు తులాధారుడు.

పిలిచాడు జాబాలి.

"అవి ముని కేశపాశంలో నుంచి రివ్వున ఎగిరి ఆకాశమార్గాన నిలబడి 'మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞవల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది. అందుచేత స్పర్ధ మాని శ్రద్ధగా అవలంబించాలి. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞాలూ వ్యర్థం. శ్రద్ధతో యాగం చేసినవాడు శుచి కాకపోయిన ఫరవాలేదు. శ్రద్ధ లేకూండా యాగం చేసినవాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం. శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది. అందువల్ల మేలు కలుగుతుంది. సర్వ సుఖాలూ చేకూరుతాయి ' అని వివరించి మాయమయ్యాయి.

'అయ్యా! మునుల నుంచి తత్త్వజ్ఞానం తెలుసుకోకపోవడం వల్ల నాకీ అసూయ కలిగింది. ఎవరికి వారు తమ తమ విధానాలైన కర్మలు చెయ్యటం మంచిదని నీ నుంచి గ్రహించాను. కాని వాటివల్ల ప్రయోజనం ఆశించకూడదు. అదీ నీ నుంచే తెలుసుకున్నాను. వెళ్ళొస్తాను' అని చెప్పి తులాధారుడి దగ్గర సెలవు తీసుకున్నాడు.

"ధర్మరాజా! ఆచార ధర్మాలు అలాంటివి. సూర్యుడి రూపం నీళ్లలో ప్రతిబింబించినట్లు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధిలో ప్రతిబింబిస్తుంది. ఈ శరీరం యావత్తు మహాపట్టణం. దానికి బుద్ధి రాణి. సర్వ విషయాలూ చర్చించే మనస్సు మంత్రి. విషయాలు అయుదూ పురోహితులు. చెవి, ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు. ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం, తమోగుణం అనే మోసగాళ్ళున్నారు. మనస్సు చెప్పిన మాట బుద్ధి వినకపోయిందంటే ఆ మోసగాళ్ల బారినపడి చెడిపోతుంది. మనస్సు, బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాగుతుంది. శాశ్వత సౌఖ్యం లభిస్తుంది" అని చెప్పాడు వేదవ్యాసుడు.

"మహర్షీ! కార్యసమీక్ష త్వరగా చెయ్యడం మంచిదా? నిదానంగా చెయ్యడం మంచిదా?" అని అడిగాడు ధర్మరాజు.

"కార్యవిచారం చెయ్యడంలో తొందర ఎప్పుడూ పనికిరాదు" అని చెబుతూ ఒక కథ చెప్పాడు వ్యాసుడు.

"మేధాతిథి అనే మునికి చిరకారి అనే కొడుకుండేవాడు. అతడు ప్రతి పనీ బాగా ఆలోచించి చేసేవాడు. యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. ఒకనాడు మేధాతిథికి భార్య మీద కోపం వచ్చింది. ఆమెను చంపెయ్యమని చిరకారిని ఆదేశించి వెళ్ళిపోయాడాయన.

'నవమాసాలు మోసే కన్నతల్లి కంటే ఈ భూమి మీద ఎక్కువ ఏదీ లేదు. తల్లి దైవమంటారు. ఆమెను చంపటం కంటే పాపం వుందా! కాని తండ్రి ఆజ్ఞ మీరకూడదంటారు. ఏంచెయ్యను? ఇద్దరిమీదా గౌరవం వున్నవాడనే నేను!' అనుకుంటూ చిరకారి చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది. ఏదో కోపంలో అన్న మాటలు పట్టుకుని కొడుకు తల్లిని ఎక్కడ చంపేశాడోనని విచారపడుతూ, తన కొడుకు అలా చెయ్యడని ధైర్యం తెచ్చుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు మేధాతిథి. తండ్రిని చూస్తూనే చిరికారి చేతిలో వున్న కత్తి కిందపడేసి అతని కాళ్ళమీద పడ్డాడు. భార్య వచ్చి నమస్కరించింది. కన్నీటితో ముని భార్యాతనయుల్ని గుండెకు హత్తుకున్నాడు. కొడుకును మెచ్చుకుని దీవించాడు.

"ధర్మరాజా!కార్యవిచారం చాలా ధైర్యంగా, జాగ్రత్తగా చెయ్యాలి. తొందరపడి ఏ పని చేసినా చివరకు పశ్చాతాప పడవలసి వస్తుంది" అని ముగించాడు వ్యాసమహర్షి.
Read More

శివాయ గురవే నమః! శ్రీమాత్రే నమః!!శివాయ గురవే నమః! శ్రీమాత్రే నమః!!
మనకి అద్వైతం ప్రకారం ఉన్నది ఒక్క పధార్ధమే. అదే అవ్యక్తమైన పరబ్రహ్మము లేదా పరమాత్మ. ఈ పరమాత్మకి ఒక శక్తి ఉంది. ఆ శక్తితోనే సృష్టి, స్థితి, లయ తిరోధానం అనుగ్రహమనే పంచ కృత్యాలు జరుగుతున్నాయి.
శక్తిని మనం అమ్మ అనుకుంటే, పరమాత్మని అయ్య అనుకోవచ్చు, ఇద్దరినీ కలిపి ఆరాధిస్తే, అమ్మ+అయ్యా = హమ్మయ్య , అనుకుంటూ జీవితం సాగించవచ్చి. అమ్మ, అయ్యని పార్వతీ పరమేశ్వరులు అన్నా, లక్ష్మీ నారాయణులు అన్నా ఏమి దోషం లేదు. మనం ఎలా అంటే అలా భావించవచ్చు, కాని శాస్త్ర బద్ధంగా ఉండాలి.
దేవీ భాగవతంలో వ్యాసుడు ఈ శక్తికి ఎన్నిరూపాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఈ శక్తిని ఉపాసించవచ్చోచెప్పారు.
అమ్మవారు మనకి ముఖ్యంగా రెండు స్వరూపాలుగా చెప్పబడింది.
1. వ్యక్త / ప్రకట రూపాలు 2. అవ్యక్త / గుప్త రూపాలు
ముందు అవ్యక్త రూపాలు తెలుసుకొని అప్పుడు వ్యక్త రూపాలకు వెళ్దాము ..
అవ్యక్త రూపాలు:
1) మంత్ర రూపం 2) కుండలిని రూపం 3) నిరాకారమైన నిర్గుణమైన పరతత్త్వం ..
వ్యక్త స్వరూపాలు :
విగ్రహ రూపం మొదలగు వ్యక్త రూపాలు అన్నీ కూడా ప్రకృతి స్వరూపంలోకి వచ్చేస్తాయి ..
ఈ ప్రకృతి స్వరూపంలో మళ్ళీ ... 6 రూపాలుగా వ్యక్తం అవుతుంది ...
(1) పూర్ణ స్వరూపాలు (2) ప్రధానాంశ స్వరూపాలు (3) కళా స్వరూపాలు (4) అంశ స్వరూపాలు (5) కళాంశ స్వరూపాలు (6) అంశాంశ స్వరూపాలు
(1). పూర్ణ స్వరూపాలు :
అమ్మవారు 5 పూర్ణ స్వరూపాలుగా వ్యక్తమవుతుంది... ... అవి:
1. గణేశ జననీ దుర్గాదేవీ 2. లక్ష్మీ దేవీ 3. సరస్వతీ దేవీ 4. గాయత్రీ దేవీ 5. రాధా దేవీ
(2) ప్రధానంశ రూపాలు :
అమ్మవారు ఈ స్థాయిలో 7 స్వరూపలతో వ్యక్తమవుతుంది.
1. గంగా దేవీ 2. తులసి దేవీ 3. మానసా దేవీ (కస్యప ప్రజాపతి కూతురు - నాగమాత) 4. దేవసేనా దేవీ ( షష్ఠి దేవీ - సుబ్రహ్మణ్యుడి శక్తి) 5. మంగళ చండీ 6. కాళీ (చాముండ అని మరియొక నామము - దుర్గాదేవీ యొక్క అర్ధాంశ రూపం) 7. వసుంధరా (భూదేవీ)
(3) కళా రూపాలు:
ఈ స్థాయి అమ్మవారు స్వరూపాల్లో వ్యక్తం అవ్తుంది.
1. స్వాహా దేవీ, స్వధా దేవీ (అగ్నిదేవుడి యొక్క శక్తులు) 2. దక్షిణ దేవీ (యఙ్ఞ దేవుని శక్తి ) 3. స్వస్తీ దేవీ ( వాయు దేవుని శక్తి) 4. పుష్టీ దేవీ (గణపతి శక్తి) 5. తుష్టీ దేవీ (అనంత దేవుని శక్తి) 6. సంపత్తి దేవీ ( ఈసానుడి శక్తి) 7. ధృతి దేవీ (కపిలుని శక్తి) 8. సతీ దేవీ (సత్యుని శక్తి) 9. దయా దేవీ ( మొహ పత్ని) 10. ప్రతిష్ఠా దేవీ ( పుణ్యుని పత్ని ) 11. సంసిద్ధ, కీర్తి, ధన్యా (సుకర్మ పత్నులు) 12. మిథ్యా (అధర్ముని పత్ని) 13. క్షుత్, పిపాస ( లొభుని పత్నులు) 14. తంద్రా, ప్రీతి ( నిద్రుని కుమర్తెలు, సుఖం యొక్క పత్నులు) 15. ప్రభా, దాహిక (జ్వాల యొక్క శక్తులు) 16. మృత్యువు , జర (ప్రజ్వల యొక్క భార్యలు) 17. సంధ్య, రాత్రి, దిన (కాలుని భార్యలు) 18. బుద్ధి, మేధ, ధృతి (జ్ఞానుని భార్యలు) 19. శాంతి, లజ్జ ( సుశీలుని భార్యలు) 20. శ్రద్ధా, భక్తి ( వైరాగ్యుడి పత్నులు)
(4) అంశ రూపాలు 1. అదితి 2. దితి 3. సురభి (గోమాత) 4. రోహిణీ దేవీ 5. సంజ్ఞా దేవీ 6. శత రూప 7. శచీ దేవీ 8. తారా దేవీ 9. అరుంధతీ 10. అనసూయ 11. అహల్యా 12. దేవహూతి 13. ప్రసూతి 14. మేనా దేవీ 15. లోపాముద్రా 16. కుంతీ దేవీ 17. వరుణాని 18. వింధ్యావలి (బలి చక్రవర్తి భర్య) 19. దమయంతీ 20. యశోదా దేవీ 21. దెవకీ దేవీ 22. గాంధారీ 23. ద్రౌపదీ 24. సత్యవతీ 25. మండోదరి 26. కౌసల్యా 27. సుభద్రా 28. రేవతీ 29. సత్యభామ 30. కాళింది 31. లక్ష్మణ (రామ సోదరుడు)
(5) కళాంశ రూపాలు :
1. గ్రామ దేవతలు 2. కుల దేవతలు
(6) అంశాంశ రూపలు:
మానవ స్త్రీలు అందరు …
సౌందర్య లహరి లో చిదానంద లహరీం గురించి చెబుతు ఏఏం అనేది అమ్మవారి శక్తి బీజం..ఓం కారం ప్రకట ప్రణవం. ఈం కారం గుప్త ప్రణవం... అందుకే ఎక్కడ ఈం శబ్దం ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది.. అలానే స్త్రీ అనే శబ్దంలో కూడా ఈం బీజం స్ఫురిస్తుంది.. అసలు స్త్రీ ..అనే పదానికి అర్ధం స - త-ర-ఈ అంటే సత్వ..తమో .. రజో గుణాలకు అతీతమైన శక్తి.
అందుకే మన చుట్టూ ఉన్న స్త్రీలు అమ్మవారి స్వరూపాలే
మంచి పద్ధతిగల స్త్రీలు లక్ష్మీ దేవి... కామాక్షి .. లలిత లాగా..
మళ్ళీ... ఈ కాలం లో సంస్కారాలు వదిలేస్తూ.పద్ధతులను మరచి .. ఇష్టమొచ్చినట్లు ఉండే స్త్రీలు కూడా అమ్మవారి రూపాలే .. కాని పైన చెప్పిన విధంగా .. మిథ్యా దేవి..జరా దేవి..అలాంటి వాళ్ళు ... అని మన జోలికి రాకుండా వాళ్ళకి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది.. .
Read More

పాశురము 12

పాశురము 12
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్
భగవద్గీత రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మద్యవర్తిగా ఉండే దివ్యజ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో, అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితికి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్షణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడిలోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు.
"ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట: స్తిత ప్రజ్ఞ: తదోచ్యతే |
ప్రజా:తి యదా కామాన్ సర్వాన్ మనో గతాన్ || "
వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని నాకు ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు. మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు.
"దుఃఖేషు అనుద్విజ్ఞమనాః సుఖేఃషు విగతస్పృహ:
వీత రాగ భయ క్రోద: స్తితదీ: ముణిరుచ్యతే"
ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కాని మనస్సు వాటియందు ఉంచకుండా సాధన చేస్తాడు. ఇది రెండో స్థితి. కొంత కాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలటి గోప బాలిక అలాంటి స్థితి కల్గిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్.
"ఇళంకత్తెరుమై" లేత దూడలు కల్గిన గేదెల "కనైత్త్" అరుపు వినిపిస్తోంది. ఎందుకంటే వాటిని పట్టించుకోనే నాథుడే లేడు. వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమగ్నమై ఉన్నారు. "కన్ఱుక్కిరంగి" దూడ విషయంలో జాలి తలచి తనంతట తానే "నినైత్తు" దూడ వచ్చిందని భావించి, "ములై వరియే" పొదుగుల గుండ "నిన్ఱు పాల్ శోర" ఏక ధారలుగా పాలు ఇస్తున్నాయి. "ననైత్త్-ఇల్లమ్" ఇల్లంతా తడిసి పోయి , "శేఱాక్కుమ్" అంతా బురద అయ్యింది.
ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్టానం చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే.
"నచ్చెల్వన్ తంగాయ్" ఏం సంపదలు కల్గిన వాడి చెల్లెలా!. ఆండాళ్ లోపలున్న గోప బాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది, జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవత్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి, లోపల మనలోని హృదయం ద్రవించేట్టుచేసి మనం కూడా భగవంతుణ్ణి అనుభవించేట్టు చేస్తుంది. "పనిత్తలై వీర" మంచుతో పైన తడుస్తున్నాం, ఏం స్థితి వచ్చిందమ్మా మాకు!! మూడు ప్రవాహాలుగా మేం కొట్టుకుపోతున్నాం. క్రిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, మరి మధ్యలో మాహృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణగుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం. ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది, మరి "నిన్ వాశల్ కడై పత్తి" అమ్మా నీ గుమ్మపు పైకప్పుని పట్టుకొని వ్రేలాడుతున్నాం .
అయితే లోపలున్న గోపబాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది, అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు "శినత్తినాల్" కోపంతో "తెన్ ఇలంగై క్కోమానై" అందమైన లంకానగరానికి రాజైన రావణాసురుణ్ణి "చ్చెత్తమ్" సంహరించి, "మనత్తుక్కినియానై" అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం "ప్పాడవుమ్" పాడుతున్నా "నీ వాయ్ తిఱవాయ్" నీవు నోరు తెరవవా! "ఇనిత్తాన్ ఎరుందిరాయ్" ఇకనైనా నోరు తెరిచి లేవమ్మా. "ఈదెన్న పేర్ ఉఱక్కమ్" ఇది ఎలాంటి నిద్రమ్మా, "అనైత్తిల్లత్తారుం అఱింద్" లోకమంతా తెలిసి పోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి.
Read More

శీల సంపద:

శీల సంపద:
ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయయాగం చేశాడు. అతని సభావైభవం చూసి అసూయపడి తండ్రి దగ్గరకు వెళ్ళి తన దుగ్ధ వెళ్ళబోసుకున్నాడు దుర్యోధనుడు.
"నాయనా! నీకుమాత్రం తక్కువ ఐశ్వర్యమా? అయితే ధర్మరాజు నీకంటే ఎక్కువగా ప్రకాశించడానికి కారణం అతడు శీలవంతుడు కావడమే. శీలవంతులను లక్ష్మి వరిస్తుంది. కనుక నువ్వు కూడా శీలవంతుడవై సకల సంపదలూ పొందు" అంటూ ధృతరాష్ట్రుడు కొడిక్కి ఓ ఇతిహాసం చెప్పాడు.
"ప్రహ్లాదుడు రాక్షస కులశ్రేష్ఠుడు. సకల విద్యాపారంగతుడు. జనరంజకంగా పరిపాలన చేయగల సమర్ధుడు. ఇంద్ర రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ముల్లోకాలనూ ధర్మయుక్తంగా పరిపాలించసాగాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు తనకు ముల్లోకాధిపత్యం మళ్ళీ వచ్చే విధానం చెప్పవలసిందని బృహస్పతిని ప్రార్థించాడు.
బృహస్పతి భార్గవుణ్ణి అడగమన్నాడు.
ఇంద్రుడు వెళ్ళి భార్గవుణ్ణి ఆశ్రయించాడు.
'అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతన్నే అడిగి తెలుసుకొని ఉపాయంగా ఆ శక్తిని అడిగి పుచ్చుకో' అని సలహా ఇచ్చాడు భార్గవుడు.
"ఇంద్రుడు విప్రుడి వేషం ధరించి ప్రహ్లాదుడికి శిష్యుడై భక్తితో సేవలు చెయ్యడం ప్రారంభించాడు. చాలాకాలం గడిచింది. ప్రహ్లాదుడు ప్రసన్నుడయ్యాడు.
'నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?' అని అడిగాడు.
'అయ్యా! మీకు త్రిలోకాధిపత్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వుంది ' అన్నాడు శచీపతి వినయంగా.
'ఏముంది! నేనెప్పుడూ రాజుననే గర్వంతో ప్రవర్తించను. ఎవరినీ నొప్పించను. ఈర్ష్యా, అసూయ, ద్వేషం, పగ మొదలైన దుర్గుణాలేవీ మనస్సులోకి రానివ్వను. ఎవరన్నా ఏదైనా అడిగితే లేదనకుండా సంతోషపెడతాను. పురాకృత పుణ్యం వల్ల బ్రహ్మర్షులు మెచ్చుకునే శీలం వున్నది. కనుక ఇంత మహోన్నత పదవి లభించింది నాకు' అన్నాడు ప్రహ్లాదుడు.
'అయ్యా! నిజంగా నువ్వు మహాత్ముడవు. దానశీలివి. నాయందు దయదలచి నీ శీలం నాకివ్వు' అని ఇంద్రుడు దీనంగా యాచించాడు.
'అయ్యో పాపం! ఎంత దీనంగా అర్థిస్తున్నాడు' అనుకుని 'సరే' అన్నాడు ప్రహ్లాదుడు.
ఇంద్రుడు పన్నిన పన్నాగంలో ప్రహ్లాదుడు చిక్కుకున్నాడు.
ఆ తరువాత ప్రహ్లాదుడి శరీరంలోంచి మహా తేజస్సుతో ఒక పురుషుడు బయటకు వచ్చాడు.
'నువ్వెవరు?' ప్రశ్నించాడు ప్రహ్లాదుడు.
'నేను నీ శీలాన్ని. నువ్వు నన్ను ఆ విప్రుడికి దానం చేశావుగా! అతని దగ్గరకు వెళ్ళిపోతున్నాను' అని వెనుదిరగకుండా వెళ్ళిపోయాడా దివ్యరూపుడు. ఆ వెనుకే ఒక్కొక్క వెలుగూ ప్రహ్లాదుడి శరీరం నుంచి మెల్లిగా బయటకు జారుకుంది.
"నువ్వెవరు మహానుభావా?"
'నేను సత్యాన్ని. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. నేను వేడుతున్నాను'
'నువ్వెవరు?'
'నేను ఋజువర్తనను. సత్యాన్ని ఆశ్రయించి బతుకుతాను. పోతున్నాను'.
'మహాశయా! నువ్వెవరు?'
'నేను బలాన్ని. సత్ప్రవర్తనకు తోడుగా ఉంటాను. శలవు.'
ప్రహ్లాదుడి విషాదానికి అవధులు లేవు.
అతను విచారిస్తుంటే అతిలోక సౌందర్యవతియైన ఒక స్త్రీ అతని శరీరంలోంచి బయటకు వచ్చింది.
'అమ్మా! నువ్వెవరు?'
'నేను లక్ష్మిని. బలం ఎక్కడుంటే అక్కడ వుంటాను. వేడుతున్నాను.'
'అయ్యో తల్లీ! నువ్వూ నన్ను విడిచిపోతున్నావా? ఇంతకూ అంత వినయంగా ఇన్నాళ్ళూ నన్ను సేవించిన ఆ విప్రుడెవరు?' అని సిరిని అడిగాడు ప్రహ్లాదుడు.
'అతను ఇంద్రుడు. నీ వైభవాన్ని ఎగరేసుకుపోవడం కోసం వచ్చాడు. నువ్వు అతని మాయలో పడి నీ శీలాన్ని అతనికి ధారపోశావు. శీలం వల్ల ధర్మం, ధర్మం వల్ల సత్యం, సత్యాన్ని అంటి మంచి నడవడి, దానివల్ల బలం, బలాన్ని ఆశ్రయించి నేను వుంటాం. కనుకనే అన్నిటికి 'శీలం' మూలమని చెప్తారు. నువ్వు అది పోగొట్టుకున్నావు. కనుక ఇంక నీ దగ్గర వుండటం అసంభవం' అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీదేవి.
"కనుక - దుర్యోధనా! శీలవంతుడవై వర్థిల్లు నాయనా" అని కొడుక్కి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.
సకల జీవుల పట్ల దయతో వుండటం, ఎవరికీ ద్రోహం తలపెట్టకుండా పరులకు ఓపినంతవరకూ మేలు చేయడం, ఎదుటివాడు తప్పుచేస్తే వాడు సిగ్గుపడేలా కాక తన దోషాన్ని చక్కదిద్దుకునేలా బోధించటం, అందరూ మెచ్చుకునేటట్టు మంచిగా ప్రవర్తించడం, పేరాశను విడిచిపెట్టడం శీలవంతుల లక్షణాలు.
Read More

భోజనము ఏవైపు తిరిగి చేయాలి?భోజనము ఏవైపు తిరిగి చేయాలి?
ప్రతిరోజూ రెండుసార్లు భోజనము చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుంది. భోజనము చేసేటప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి. తూర్పు దిక్కుకి తిరిగి చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. అలాగే దక్షిణదిశగా తిరిగి భోజనము చేస్తే కీర్తి, ప్రతిష్ఠలు లభిస్తాయి. ఉత్తరం వైపు తిరిగి భోజనము చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపున భోజనం చేయకూడదని పురాణాలలో ఉంది. కనుక తూర్పువైపు తిరిగి భోజనం చేయటం అనేది చాలా ఉత్తమమైన పధ్ధతి.
ఆకులమీద, ఇనుపపీటల మీద కూర్చొని భోజనం చేయకూడదు. డబ్బును ఆశించేవాడు మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. సన్యాసులు మాత్రం మోదుగ, తామర ఆకులో మాత్రమె భోజనం చేయాలి. భోజనానికి ముందూ తర్వాత ఆచమనం చేయాలి. భోజనం చేసేముందు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరించి భుజించాలి.

Read More

పాశురం 13

పాశురం 13

పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లావరక్కనై
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్కళమ్ బుక్కార్
వెళ్ళి యెళున్దు వియాళ ముఱజ్ఞ్గిత్తు
ప్పుళ్ళుమ్ శిలుంబినకాణ్ , పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కి డత్తియోపావాయ్ ! నీ నన్నాళాల్
కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్
ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కల్గిస్తుంది ఆండాళ్. అందరిని చిలిపి తనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్నా పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు, దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని మరి కొందరు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోయారు.
వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, వారి మధ్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళితే అక్కడ ఆమె శ్రీకృష్ణున్ని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు, భార్య సీత వాళ్లు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు... అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి "సౌమిత్రే ధనుః" అని అరిచాడు. ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణున్ని ధనస్సు తెమ్మని పిలిచాడు, ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాలకోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు, ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు.
కృష్ణుడి జట్టు వారు "పుళ్ళిన్ వాయ్ కీండానై" ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువారు "ప్పొల్లా అరక్కనై" రావణాసురుడిని గిల్లి పారవేసాడు రాముడు అని అన్నారు. "కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్" ఇలా స్వామి కళ్యాణగుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు.
"పిళ్ళైగళ్ ఎల్లారుమ్" గోపబాలికలందరూ "పావైక్కళం పుక్కార్" వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది. లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది, వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్పుతున్నారు. "వెళ్ళి యెరుందు" శుక్రోదయం అయ్యింది, "వియారమ్" బృహస్పతి "ఉఱంగిత్తు" అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేక పోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోధంగా ఉన్నాయి, ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి, అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరియైన సమయం.
"పుళ్ళుం శిలమ్బిన కాణ్" పక్షులు మాటలాడుకుంటున్నాయి "పోదరి క్కణ్ణినాయ్" తుమ్మెద వాలిన పుష్పంవంటి కళ్ళు కలదానా. తనను గుర్తించిన వాన్ని భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎంటీ కృష్ణుడే తన దగ్గరకు రానీ అంటూ పెద్దగా పట్టించు కోవడం లేదు. "కుళ్ళ కుళిర" చల చల్లటి ఆనీటిలో "క్కుడైందు" నిండా మునిగి "నీరాడాదే" అవగాహన స్నానం మనం చేయ్యాలి కదా , లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు, ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. "పళ్ళి క్కిడత్తియో" ఇంకా పడుకుని ఉన్నావా "పావాయ్!" ముగ్దత కల్గిన దానా, " నీ నన్నాళాల్" సమయం అయిపోతుంది, "కళ్ళం తవిరుందు కలంద్" మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు.


Read More

కాకి - హంస

కాకి - హంస
పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడుండేవాడు. చాలా మంచివాడు. గొప్ప భాగ్యవంతుడు. ఓ రోజు ఒక కాకి అతని పంచన చేరింది. అతని కొడుకులు దానికి ఎంగిలి మెతుకులు పెట్టి పెంచారు. అది బాగా బలిసి ఏ పక్షులూ తనకు సరిరావని విర్రవీగుతూండేది.
ఒకనాడు సముద్రతీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి "అన్ని పక్షులు కంటే బలమైనదానివి నువ్వు! ఆ హంసల కంటె ఎత్తు ఎగరాలి. సరేనా" అన్నారు వర్తకుని పిల్లలు.
ఎంగిళ్ళు తిని బలిసిన ఆ వాయసం తారతమ్యజ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి.
"మానస సరోవరంలో ఉంటాం. మహా బలవంతులం. హంసలతో సరియైన కాకులు లోకంలో ఉన్నట్లు ఎప్పుడైనా,ఎక్కడైనా విన్నావా?" అన్నాయి.
"నూటొక్క గతులలో పరుగెత్తడం చేతనౌను నాకు! ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనాలు వెళ్తాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం - కావాలంటే పందెం కాద్దాం" అంది కాకి.
"ఆ గతులూ గమనాలూ మాకు తెలీదు! మామూలుగా సముద్రం మీద నిటారుగా ఎగురుదాం. మేమంతా రావటం వృథా. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది" అన్నాయి మరాళాలు.
అనటమే తడవు ఒక హంస గుంపులోంచి బయటకు వచ్చింది. కాకి కూడా దాని వెనకాలే వెళ్ళింది. రెండూ సముద్రం మీదుగా ఎగరడం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతూంటే కాకి దానికి తన విన్యాసాలను చూపిస్తోంది. హంసను దాటిపోయి, మళ్ళీ వెనక్కి వచ్చి ఎగతాళిగా పిలవడం, ముక్కుమీద ముక్కు మోపడం, జుట్టు రేపుకుని తిరగడం, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులన్నీ చేసింది. హంస చిరునవ్వు నవ్వి ఊరుకుంది. కాసేపటికి కాకి అలసిపోయింది. అప్పుడు పొడుగ్గా ఎగసి పడమరకు పరుగెత్తింది రాయంచ. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమొహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. 'అయ్యో! నా అవయవాలన్నీ వికలమైపోయాయి. కాసేపు ఎక్కడైనా ఆగుదామంటే పర్వతాలూ, చెట్లూ, లతలూ ఏవి లేవిక్కడ. ఈ సముద్రంలో పడితే మరణమే గతి' అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది కాకి.
అది చూసి హంస "నీకు చాలా గమనాలు వచ్చన్నావే. గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తానన్నావు. ఒక్కటీ చూపవేం వాయసరాజమా?" అంది.
కాకి సిగ్గుపడింది.
అప్పటికే అది సముద్రంలోకి దిగబడి పోవడానికి సిద్ధంగా వుంది. "ఎంగిళ్లు తిని గర్వంతో కన్నూ మిన్నూ గానక నా కెదురెవరూ లేరనీ, ఎంతటి బలవంతుల్నయినా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్ధ్యమేమిటో నాకిపుడు తెలిసివచ్చింది. నా యందు దయచూపి నన్ను రక్షించు" అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్ళలో మునిగిపోతూ "కావుమని" దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడి హంస తన కాళ్లతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది.
"ఇంకెప్పుడూ గొప్పలు పోకు" అని మందలించి దానిని తీరానికి విసిరి, ఎగిరిపోయింది రాజహంస.
కాకి లెంపలేసుకుంది.
"అలాగే - వైశ్యపుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ నువ్వు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. దీనివల్ల చేటు కలుగుతుంది సుమా!! హెచ్చులకు పోకు" అని యుద్ధభూమిలో డాంబికాలు పలుకుతున్న కర్ణుడికి హితవు చెప్పాడు శల్యుడు.Read More

కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి

కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.
శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థితి శక్తి (Potential Energy), రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy). శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి (purification of body), నాడీ శుద్ధి (purification of nadis/nervous system), మనో శుద్ధి (purification of mind), బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి. నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.Read More

వివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనమువివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనము

వివాహములోని అనేకమైన తంతులలో , అనగా , అంకురార్పణము అయిన తర్వాత , పెళ్ళికుమారుని , పెళ్ళికూతురును చేయుట ,గౌరీ పూజ , వరపూజ , అటుతర్వాత మధుపర్కము , జీలకర్రా బెల్లము , తలంబ్రాలు మొదలు ఆచరించు అనేక కార్యముల తో పాటు విశిష్టమైనది అరుంధతీ నక్షత్ర దర్శనము. వివాహ సమయములో వరుడు తన క్షేమాభివృద్ధుల కోసము అనేక మంది దేవతలను ప్రార్థించును . దానికొరకు పెళ్ళికుమారుని చేత పురోహితుడు అనేక మంత్రములను చెప్పించును .

మొదట పెళ్ళికుమారుడు వధువుతో , " ఓ కన్యా , నా గృహమునకు వచ్చి నాతో కాపురము చేయుచూ సంతాన సమృద్ధిగలదానివి కమ్ము , నా గృహమునకు వచ్చి , గృహస్థుని ధర్మములగు అతిథి అభ్యాగతులను పూజించుట , ఆదరించుట చేయుటలో నాకు సహకరించుము , పుత్రులు , మనవలు కలిగినాక వారికి కూడా ఇవియన్నియూ బోధించుము " అని చెప్పును ( ఇహ ప్రియం ప్రజయా తే సమృధ్యతా ......వివిధ మావదాసి || అనే మంత్రము )


ఆ తరువాత , || సుమంగలీరియమ్ వధూరిమాగ్ం .........విపరేతన || అనే మంత్రము చెప్పును . దాని అర్థము , వివాహమునకు వచ్చిన వారితో , " బహుకాలము వరకూ సువాసినీత్వము కలిగియుండెడి ఈ వధువు చూచి , ఆమెకు ఆయుర్భాగ్యములనొసగి , ఆశీర్వదించి తరువాత మీ ఇండ్లకు స్వేఛ్చగా వెళ్ళుడు " అని ప్రార్థిస్తాడు .

తరువాత ధృవ నక్షత్రమును గూర్చి , ’ తనకు జీవితమున శత్రు బాధలు లేకుండా కాపాడుమని ’ ప్రార్థించును .

అటుతరువాత , భార్యతో సహా ఆకాశములోని సప్తర్షి మండలములో నున్న అరుంధతీ నక్షత్రమును దర్శించి , ఈ విధముగా ప్రార్థించును " కశ్యపుడు మొదలగు ఏడుగురు ఋషులు తమ తమ భార్యలు ఏడుగురిలోను , వశిష్ఠుని భార్య యైన అరుంధతీ దేవి అగ్రగణ్యురాలనీ , అతి పవిత్రమైన పతివ్రత యని , మనస్సునందైననూ , ఒక్క క్షణమైననూ పతిని మరువక సదా తలచుచుండుననీ , అతి నిశ్చలమైనదనీ తలచి ఒప్పుకొనిరి . అందువలన , అరుంధతిగాక మిగిలిన ఆరుగురు స్త్రీలు అరుంధతిని తమలో అగ్రగణ్యురాలు అను భావమును వహించిరి . అట్టి పరమ సాధ్వియైన అరుంధతీ దర్శనముచేత పవిత్ర భావములు పెంపొందిన , నా భార్యను మీ ఏడుగురితో పాటు ఎనిమిదవ దానినిగా ను , పవిత్రమైనదానిగాను తలచి ఆశీర్వదించండి . " . అనగా తాను ఎనిమిదవ ఋషిని యని భావించునట్లు అర్థము . ( || సప్త ఋషయః ప్రథమం కృత్తికానామరుంధతీం ......అస్మాకమేధత్వష్టమీ || అనే మంత్రము )

తర్వాత అగ్నిహోత్రుని , గంధర్వులను , సూర్యుడిని , ఇతర దేవతలనూ ప్రార్థించును .

ఒక సంసారము బాగుగా నడవవలెనంటే దానిలో ఆ ఇంటి గృహిణి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది . అందుకే ఇంటిని చూచి ఇల్లాలిని చూడు అన్నారు . ఒక ఇల్లు నిలవాలన్నా , కూలిపోవాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి వల్లనే అవుతుంది . కాబట్టి తన ఇల్లాలికి అరుంధతిని చూపించి సద్బుద్ధి కలిగించునట్లు చేయమని ప్రార్థించుట.

సముద్రము పక్కన కూర్చొనగానే , మనము వద్దనుకొన్ననూ చల్లగాలి వచ్చి ఎటుల తాకునో , అట్లు , అరుంధతిని చూడగనే ఆమె ప్రభావము వలన మనసు పవిత్రమగును అని ప్రతీతి .


Read More

సువర్ణష్ఠీవి:

సువర్ణష్ఠీవి:

ఒకనాడు సృంజయ మహారాజు కొలువు కిటకిటలాడుతోంది. ఎత్తయిన సింహాసనం మీద నారదమహర్షి కూర్చుని ఉన్నాడు. మహారాజుతో పాటు రాజపురోహితులందరూ ఆ మహర్షిని భక్తిశ్రద్ధలతో పూజించారు.

"మునీంద్రా! మహారాజు మీకు కావలసినవాడు. పైగా ధర్మపరుడు. నిరంతరం అన్నదానాలు చేస్తూ వుంటాడు. మీలాంటి పెద్దల అనుగ్రహం ఉండి కూడా ఆయన కోరిక తీరకపోవడం భావ్యమా?" అని ఒక బ్రాహ్మణుడు నారదుణ్ణి వినయంగా ప్రశ్నించాడు.

"ఆలాగా! ఆ సంగతి నాకు తెలీదు. మహారాజా! ఏమిటి మీ దిగులు! ఇన్నాళ్ళూ నాకు ఎందుకు చెప్పలేదు?" అని నారదుడు అడిగాడు.

"మహర్షీ! మరేం లేదు. గుణవంతుడూ, రూపవంతుడూ అయిన కొడుకు కావాలి నాకు" అన్నాడు సృంజయ మహారాజు.

"అంతే కదా!"

"అంతేకాదు స్వామీ! వాడి మలమూత్రాలు, చెమట, కన్నీళ్ళు, లాలాజలం అంతా బంగారం కావాలి. అలాంటి కొడుకు కావాలి. ఈ వరం నాకు ప్రసాదించండి"

నారదుడు అనుగ్రహించాడు.

సృంజయ మహారాజు పొంగిపోయాడు. సార్వభౌముడై భూమినంతటినీ ఏలుతున్నా సంతానం లేని దిగులు ఇన్నాళ్ళూ అయనను వేధించింది. ఇప్పుడది లేదు. మహాముని వరం వల్ల ఆ కోరిక కూడా తీరబోతోంది. రాజు పరమానందభరితుడయ్యాడు.

మహర్షి మాట ప్రకారం కొన్నాళ్ళకు కొడుకు పుట్టాడు. వాడికి 'సువర్ణష్ఠీవి' అని సృంజయుడు పేరు పెట్టాడు. అతి గారాబంగా వాడ్ని పెంచుకున్నాడు. వాడి వల్ల లభించే బంగారంతో కోట మొదలు పీట వరకూ అన్ని వస్తువులూ బంగారుమయం చేసి వైభవంగా ప్రకాశించాడు.

అలా కొంతకాలం గడిచింది.

ఒకరోజు కొందరు దొంగలు అంతఃపురంలో ప్రవేశించి సువర్ణష్ఠీవిని అపహరించుకుపోయారు. దూరంగా ఒక అడవికి తీసుకువెళ్ళి, అతని కడుపులో బంగారం ఉంటుందనుకొని వాడి పొట్ట చీల్చి చూశారు. మాంసం, ఎముకలు, నెత్తురు తప్పితే ఇంకేం కనిపించలేదు.

అందులో బంగారం లేకపోయేసరికి ఆ శవానక్కడే పారేసి వెళ్ళారు దొంగలు.

తెల్లవారాక సృంజయుడు కొడుకు కోసం అంతఃపురమంతా వెతికించాడు. కనిపించకపోయేసరికి కంగారుపడి నేల నాలుగు చెరగులకూ సేవకుల్ని పంపాడు. చివరకు అడవిలో కొడుకు శవంచూసి బావురుమని ఏడ్చాడు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగాక కూడా వాణ్ణే తలుచుకుని కుమిలి కుమిలి రోదించసాగాడు.

సరిగ్గా అదే సమయంలో మళ్ళీ నారదులవారు వచ్చారు. "మహారాజా! నువ్వు ఏడిస్తే మాత్రం చనిపోయిన నీ కొడుకు ప్రాణంతో తిరిగి వస్తాడా? కాలాన్ని తప్పించుకోవాలనుకోవడం అవివేకం. గుణవంతుడు, రూపసి అయిన కొడుకును కోరుకున్నావు. బాగానే వుంది. అంతటితో ఆగక వాడేది ముట్టుకుంటే అది బంగారపు ముద్ద కావాలంటివి! మనిషికి ఆశ ఉండవచ్చు కాని పేరాశ వుండకూడదు. ఉంటే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది" అని ఓదారుస్తూనే దేవర్షి మెత్తగా మందలించాడు.

వైభవంగా రాజ్యాన్ని పాలించి, దానధర్మాలు చేసి, పుణ్యాత్ములుగా పేరుపొంది, దేవతల ఆశీస్సులందుకుని కూడా చిరంజీవులు కాలేకపోయిన మరుత్త మహారాజు, అంగరాజు, శిబిచక్రవర్తుల చరిత్రలు వివరించాడు. అ తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు గురించి, భగీరథుడి గురించి, శశిబిందుడి గురించి రకరకాల కథలు చెప్పాడు నారదుడు.

"మునీంద్రా! నువ్వు చెప్పిన కథలన్నీ విన్నాక నా పుత్రశోకం తగ్గింది. నీ దయవల్ల నా మనస్సు నిర్మలమయింది" అని సృంజయుడు నారదుడికి నమస్కరించాడు.

నారదుడు సంతోషించి, "నీకేం వరం కవాలో అడుగు ఇస్తాను" అన్నాడు.

"దేవా! నువ్వు ప్రసన్నుడవయ్యావు! ఇంతకంటే కావల్సిందేముంది నాకు?" అన్నాడు వినయంగా మహారాజు.

"సృంజయా! దొంగల మూర్ఖత్వానికి బలైపోయిన నీ కొడుకును మళ్ళీ నీకు తెచ్చి ఇస్తాను. శోకం మానెయ్యి" అన్నాడు నారదుడు.

ఆ దీవెనతో సువర్ణష్ఠీవి సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కళ్ళెదుట కనిపించాడు. కొడుకుని చూసి బ్రహ్మానందపడిపోయాడు సృంజయుడు.

తర్వాత సువర్ణష్ఠీవి వివాహం చేసుకొని, సంతానవంతుడై భోగభాగ్యాలు అనుభవిస్తూ, యాగాలు చేస్తూ, దానాలు చేస్తూ చాలాకాలం సుఖంగా వున్నాడు.Read More

పాశురము 14

పాశురము 14
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్
మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.
"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్" ఎర్ర కలవలు వికసిస్తున్నాయి "ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్" నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు. లేదమ్మా అయితే, "ఉంగళ్ పురైక్కడై" నీ ఇంటి పెరటి "త్తోట్టత్తు వావియుళ్" తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావలిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ "నీ" అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు, ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు. పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక.
"శెంగల్పొడి క్కూరై" కాషాయాంభరధారులు "వెణ్బల్ తవత్తవర్" తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు "తంగళ్ తిరుక్కోయిల్ " ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి "శంగిడువాన్" తాళాలు తెరువడానికి "పోగిన్ఱార్" వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది.
అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ "ఎంగళై" మమ్మల్నందరిని "మున్నం ఎరుప్పువాన్" ముందే లేపుతాను అని "వాయ్ పేశుమ్" వాగ్దానం చేసావు. "నంగాయ్!" పెద్ద పరిపూర్ణురాలివే! "ఎరుందిరాయ్" లేవమ్మా "నాణాదాయ్!" నీకు సిగ్గు అనిపించటంలేదా "నావుడైయాయ్" పెద్ద మాటకారిదానివి.
జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో "శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ" ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.
Read More

తిరుప్పాణాళ్వార్:

తిరుప్పాణాళ్వార్:

పరంధాముని దివ్య అనుగ్రహాన్ని పొందడానికి జాతి, కుల, మత భేదాలు ఏవీ అడ్డురావు. అంత్సకులంలో అవతరించి తరించిన మహానుభావులు తిరుప్పాణాళ్వారు కవి యుగం 162 దుర్మతి నామ సంవత్సర కార్తీక శుద్ధ పూర్ణిమ రోహిణీ నక్షత్రమున శ్రీరంగమునకు దగ్గరగా వున్న ఉరైయూరు (చూళాపురం)లో వరి పొలంలో వరి వెన్ను నుండి శ్రీవత్సాంశమున అయోనిజుడుగా జన్మించినట్లు, ఏబది సంవత్సరములు జీవించినట్లు తెలుయుచున్నది.

ఒకనాడు వరి పొలాల ప్రక్కనుండి వెళ్లుచుండగా ఒక మహాభక్తుడైన మాతదాసు అనే మాలదాసరి ఒక వరి వెన్నులో బాల సూర్యునివలే ప్రకాశిస్తున్న శిశువును జూచాడు. ఆశిశువును జూచి బిడ్డలు లేని తమకు ఈ శిశువు భగవత్ప్రసాదమని, భక్తితో, ఆప్యాయంగా, ఆదరంతో ఆశిశువును ఎత్తుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఈ శిశువు తనజాతి స్త్రీల స్తన్యములను గ్రోలలేదు. గోక్షీరమివ్వగా శిశువు ఆప్యాయంగా త్రాగాడు. శిశువును ఆవుపాలతోనే పెంచారు.

మాలదాసరి యింట పెరుగుచున్న ఈ శిశువుకు బాల్యమునుండి విశేషమైన భక్తి అలవడింది. విష్ణుమూర్తి యందు అనురక్తి, ఇతరవిషయములందు విరక్తి పెంపొందించుకొనుచుండగా, విష్ణుమూర్తి ఆజ్ఞపై విష్వక్సేనునిచే బాలకునికి పంచసంస్కారములు జరిగినవి. దానితో బాలకుడు సర్వార్థములు ఎరిగిన వాడయ్యెను. నారదుని వలె నిరంతరము వీణాపాణియై భగవన్నామ సంకీర్తనలు ప్రారంభించాడు. చేతియందు నిరంతరం వీణ ధరించి యుండుటచే వీరికి తిరుప్పాణన్‌ అను నామము సార్థకము అయింది.

శ్రీరంగము చేరి ప్రతి దినమూ కావేరీ నదిలో స్నానమాచరించి దాసరి యింట పెరిగినందున శ్రీరంగనాథుని దేవాలయము విమానమునకు ఎదురుగా నిలబడి సంకీర్తన చేయ మొదలుపెట్టాడు. భగవద్గుణానుభవము చేయుచు భగవంతుని లీలలు గూర్చి పాడెడివాడు. ఇసుక తిన్నెలందు ఆక్షేత్రాన్ని చిత్రించి వీణాగానం చేస్తూ శ్రీరంగనాథుని తన అమరగానంతో ముంచెత్తేవాడు.

ఆ గానము సొబగులను సంతరించుకుంది. అది అపాకృత దివ్య గానమయింది. పశు పక్ష్యాదులు కూడ చెవినొక్కి వినేవి. అంతరిక్షము నుండి గంధర్వులు, యక్షులు గూడ విన మొదలు పెట్టారు.

బ్రాహ్మణులు స్నానమునకు కావేరీనదికి వెళ్తూ త్రోవలో నున్న ఈతనిని దూరమునకు తొలగమని అనేవారు. గానములో పరవశుడై భగవధ్యానములో యెడ లెరుగని స్థితి ఏర్పడింది. జనులు రాళ్లను రువ్వినా చలించనంత ధ్యాన పరవశత ఏర్పడింది.

ఒక రోజున శ్రీరంగనాథుని తిరుమంజనానికి తీర్థం కావేరీ నదినుండి తేనవసరమైంది. ఆలయ ప్రధానర్చకులు సారంగయోగి కావేరీ నదికి వెళ్ల ప్రయత్నించారు. బాహ్యస్మృతిని మరిచిన తిరుప్పారాళ్వారు వీరిని వీరి బృందమును గమనించలేదు. కన్నులు తెరవలేదు. ధ్యానంలో పరవశతతో ఉండిపోయి వారి గమనమునకు అడ్డంకి అయ్యాడు. పట్టరాని కోపంతో సారంగయోగి అనుచరులు రాళ్లను రువ్వి తిరుప్పాణాళ్వారును గాయపరిచారు. నెత్తురు ధారగా పడ మొదలుపెట్టింది. అప్పుడు తిరుప్పాణికి స్పృహ కలిగి తాను వారికి అడ్డముగా నుండి భగవతాపచారము చేసితినని బాధతో ప్రక్కకు తొలిగాడు. అంతేకాని సారంగయోగి అతని అనుచరులపై ఎట్టికోపమును తిరుప్పాణిలో కలుగలేదు.

సారంగయోగి ఆలయమునకు ప్రవేశించగా శ్రీరంగనాథుని నుండి రక్తం ధారగా వచ్చుచుండుట చూసి చలించిపోయారు. రాత్రి కలలో శ్రీరంగనాథుడు సారంగయోగికి కనపడి - అతని గానమునకు వశుడనై అంతటా వ్యాపించివున్నాను. మీ అనుచరులు ఆకృత్య ఫలితమే మీరు చూచింది అని చెప్పారు. ఆరాళ్లచే నేను కొట్టబడ్డాను అన్నారు.

శ్రీ రంగనాథుని దేవేరి రంగనాయకి ఈ గానమునకు ముగ్ధురాలై తన నాధుని చేరి " తిరుప్పాణి భక్తాగ్రగణ్యుడుగా నున్నాడు. చిరకాలము నుండి తన గానముచే మనలను రంజింపచేయుచున్నాడు. ఈతనిని మన సన్నిధికి రప్పించుకుని ఆయన గానమును వినవలె నని తహతహలాడుచున్నాను" అని మనవి చేసింది.

శ్రీరంగనాథుడ్నూ మురిసిపోయి సారంగయోగికి స్వప్నమున కనిపించి నా భక్తుడైన తిరుప్పాణిని తక్కువ కులమువాడని సందేహించక అతనిని నేను నా దగ్గరకి రమ్మంటిని అని చెప్పుము. అతడు సందేహించిన యెడల అతనిని బలవంతముగా భుజముపై నెక్కించుకొనియైనా కొనిరమ్ము అని ఆదేశించాడు.

సారంగయోగి మరునాడు తిరుప్పాణిని చేరి, సాష్టాంగ పడి, మిమ్ములను " శ్రీరంగనాథుడు తన సన్నిధికి రమ్మని కోరుచున్నాడు" అని చెప్పాడు. దానికి తిరుప్పాణి నేను పంచముల యింట పెరిగితిని. ఈ పావన క్షేత్రమున నేనెట్లు కాలిడుదును? అని తన సందేహము ఎరిగించాడు. సారంగయోనగి ఇది రంగనాథుని ఆజ్ఞ. మీరు రావలసినదే అని చెప్పాడు. తిరుప్పాణి బదులు పలుకలేదు. సారంగయోగి ఇది కాదని తిరుప్పాణిని తన భుజములపై నెక్కించుకొని శ్రీరంగనాథుని ఆలయమునకు బయలుదేరాడు. ముందర దివ్యప్రబంధములను శ్రీ వైష్ణువులు అనుసంధించుచుండగా వేద పఠన మింకొక ప్రక్క జరుగుచుండగా, వైభవంగా తిరుప్పాణిని సారంగయోగి శ్రీరంగనాథుని సన్నిధికి తీసుకునివెళ్లాడు. శేషతల్పశాయి అయిన శ్రీరంగనాథుని తిరుప్పాణి దగ్గర నుంచి చూచి చలించిపోయాడు. ముఖమండలము నుండి తిరువడి వరకు దేవదేవుని సకలవయవముల సౌందర్యమును తిలకించి, అనుభవించి, అత్యుత్సాహంతో పది పాశురములతో ప్రబంధముగ శ్రీరంగనాథుని కీర్తించాడు. అదే అమలనాదపిరాన్‌. సారంగయోగి తన భుజములపై తీసుకుని వెళ్లినందున యోగివాహనుడు అని పిలువ బడ్డాడు. తన యందు అపారభక్తిని చూపిన భక్త్వమృతమును వెదజల్లిన తిరుప్పాణిని అపార అనుగ్రహముతో శ్రీరంగనాథుడు తనలో లీనము చేసికొనినాడు.

నీలమేఘ నిభ మంగళగాత్రుడు గోపకులము నందు అవతరించిన, వెన్నను ఆరగించిన అధర పల్లవము గలవాడు, నా హృదయ సీమనుగూడ అపహరించిన చతురుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఈ లోకానికే ఆభరణమైన శ్రీరంగమున శేషశయనుడై వుండు అతృప్తామృతమైన శ్రీరంగనాథుని సేవించిన నా కన్నులు ఇతరులను చూడవు. ఇది ముమ్మాటికి నిశ్చయము.

ఇక నా నేత్రములకు అమృతమువలె అతి భాగ్యమైన ఈ దర్శనమహాభాగ్యం తప్ప మరేమీ వద్దు అని చెప్పుకుని ఉత్తరక్షణములో శ్రీరంగనాథునిలో లీనమైపోయారు.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML