గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 29 November 2013

ఈ మాసాన్నికార్తీకమాసంఅంటారు. వనసమారాధన అంటే ??

పున్నమి చంద్రుడు కృత్తికానక్షత్రంలో సంచరిస్తాడు కనుక  ఈ మాసాన్నికార్తీకమాసం  అంటారు. కార్తీకమాసంలో శ్రీ  మహావిష్ణువు  నీటికుంటలలో, చెరువులలో, సముద్రాలలో, పిల్లకాలువలలో  నివసిస్తాడని అంటారు.అందుకే మనం  పుణ్యనదులలో ఈ మాసంస్నానం  చేయటంమంచిది ( నదులలో స్నానంచేయునపుడు  జాగర్త  తప్పనిసరి ). ఎవరికైనా  కుదరనిసందర్భంలో" గంగేచ, యమునేచ, కృష్ణే, గోదావరి, నర్మదా,సింధు, కావేరి, జలే  సంనిధంకురు " అనుమంత్రం  చదువుకుని, ఉదయమునే  తల  స్నానము  చేయటంమంచిది.   
కార్తీకమాసంలో  పుణ్యతిధులు :
కార్తీకశుద్ద పాడ్యమి, విదియ, తదియ , కార్తీకశుద్దచవితి,పంచమిమంచివి , పౌర్నమి, ఏకాదశి,దశమి. 
కార్తీకమాసములోచేయకూడనిపనులు :
ఉల్లి, వెల్లుల్లి, మద్యం,మాంసం, వంటివి  భుజించరాదు. దైవదూషణ, అవహేళణ  చేయరాదు.దీపారాదనకు  తప్ప, నువ్వులనూనెను, వేరొక  కార్యక్రమాలలకు  వాడకూడదు .మినుములు  తినకూడదు.నలుగు పెట్టుకుని  స్నానంచేయవలెను.కార్తీకవ్రతం  చేయువారు, వారిచేతితో ఇంట్లోవడ్డన చేయటంమంచిది .
కార్తీకమాసంలో చేయవలసిన పనులు :
ఉపవాసం, జాగరణ, తలస్నానం( ఆరోగ్యంసహకరించినవారుమాత్రమే )
దానం( మాములుగా చేసినప్పటి కంటే ఇప్పుడు చేయు దానంచాలామంచిది ), శ్రీమహావిష్ణువును(వేంకటేశ్వరుని)- లక్ష్మిదేవిని,తులసిమాలతోకాని, తులసిఆకులతో  కాని ప్రార్దించండి. కుదిరితేకమలం ,జాజి, అవిసేపువ్వు, గారిక , దర్భాలతోప్రార్దించండి.
మహాశివునిపూజించు  వారు ప్రతిరోజు 11 దొసెడలతొ(రెండుచేతులు కలిపినా దొసెడలతొ  ) గుడిలో, గుడిచుట్టుపక్కల  ఉండేచిన్న, పెద్దశివలింగాములపై  పోయండి, ఇలాపోయునపుడు  " ఓంనమఃశివాయః  " అని మనసు  లో  ప్రార్దించండి. పరమేస్వరునికి  బిల్వపత్రాలు  సమర్పించండి.
ప్రతిరోజు జపంచేసే  అలవాటు  కలిగినవారు, మరొకగంట  తీరికచేసుకుని ఈ మాసం  మొత్తం, ఎక్కువజపం  చేయండి .
ఈ  మాసంలోపైన  చెప్పిన  పుణ్యతిదులలో ( ఉదా : ఏకాదశి, దశమి, పౌర్నమి , సోమవారం, .. మొ॥  ) భక్తితో  , నియమనిష్టలతో , ఏదయినాగుడికి  వెళ్లి  దీపమును  వెలిగించండి
కార్తీకపౌర్నమినాడు  ఉపవాసం  ఉంది, శివునికి  రుద్రాభిషేకం  చేయించండి,  మరియుశివాలయంలోకాని , ఇంటిలోకాని  దేవుడినిప్రార్ధించి, 365- వత్తులతోదీపం  వెలిగించి  దేవునికి  సమర్పించండి .
కార్తీకమాసం  ఒక్కనెలా, స్తొమత  కలిగినవారు  ఆవునేయ్యతో, దేవునిబిడ్డలు( పేదవారు ) నువ్వులనూనెతొదీపంవెలిగించవచ్చు .

ఈ క్రిందచెప్పినవి  పాటించుటవలన, మీపాపములుపోవును, మీతరువాతితరములు  సుఖశాంతులతో  వర్దిల్లకలరు.
కార్తీకమాసంశివునికి, శ్రీమహావిష్ణువుకు  ఇరువురికి  ఇష్టమయినమాసము .

వనసమారాధన :

ఉసిరిచెట్టు  నీడలో  సాలగ్రామ  రూపములొ  శ్రీహరినికాని , మహాశివునికాని  ఆరాధించి   , శక్తి  కొలదిఅన్నసమారాధన  చేసినవారిని  అకాలమరణము , సంభవించదు  అని  మనకుకార్తీకపురాణమ్ చెపుతున్నది. వనసమారాదనలో  విష్ణువును  ప్రాదించిన  వారికి  విష్ణుసాయుజ్యం, శివుని ఆరాదించిన వారికిశివుని సాయుజ్యం  పొందేదారని  పూర్వీకుల  సందేశము.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML