గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 5 October 2013

బాలాత్రిపురసుందరి

శర్రన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా దర్శనము ఇస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.
త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.
షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత
కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.

అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి.....అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు...ఆది దంపతులు...వారి తత్వము కుడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే " మనలోని ముడు అవస్తలు....జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!
ఈ ముడు అవస్థలు ...లేద పురములకు బాల అధిష్ఠాన దేవత!

ఈ ముడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తు ...."బాలగా.."....అమ్మవారు వినొదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కెవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.
అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది....ఆవిడ ఆత్మ స్వరూపురాలు....ఆవిడను పూజిస్తే....ఙ్నానము కలిగి .. ...తానె శివ స్వరూపము తో...చైతన్యము ప్రసాదించి...మోక్షమునకు...అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది...ఈ కరుణా మయి..

సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరిదేవి భక్తుల పూజలు అందుకుంటోంది.

ఈ రోజు రెండు నుండి పది సంవత్సరములు లోపు కలిగిన బాలికలను అమ్మవారి స్వరూపముగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి.

అమ్మవారికి పాయసం నివెదన చెయ్యాలి.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML