గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 October 2013

విజయ దశమి విశిష్టత : దేవి నవరాత్రుల్లో ఆఖరి రోజు దశమి అదే విజయదశమి.

విజయ దశమి విశిష్టత : దేవి నవరాత్రుల్లో ఆఖరి రోజు దశమి అదే విజయదశమి.

ఆశ్వనశ్యసితే పక్షే దశమ్యాంతరకోదాయే
సకాలో విజయోనామ సర్వకామార్ధ సాధకః

అంటే, ఆశ్వయుజమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిధి రోజు నక్షత్ర దర్శన కాలం (సాయంత్రం) ఏదైతే ఉందో, ఆ కాలానికి విజయము అని పేరు. మన కోర్కెలని తీర్చి అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదించే ఆ కాలం పేరు మీదుగానే దశమి తిధి కి "విజయ దశమి" అనే పేరు వచ్చిందని పండితులు అంటారు.
ఈ దశమి తిధికి విజయదశమి అనే పేరు రావటానికి మరొకకార్ణం కూడా ఉందని విజ్ఞలు చెప్తారు.

ఆదిశక్తి స్వరూపిణి అయిన దుర్గా దేవి చండీరూపములో నవమి తిధి రోజు మహిషాసురుణ్ణి వధించింది, కాబట్టి దాన్ని మహర్నవమిగాను,తచ్చిహ్నంగా విజయోత్సవం జరుపుకుంది. మరూనాటి దశమి రోజు కాబట్టి ఆ దశమి , విజయదశమి అని ప్రసిద్ధ పొందటం జరిగింది.

దశమ్యాంతునరైస్సమ్యక్పుజానీయపరాజితా
క్షేమార్ధం విజయార్ధంచకాలే విజయనామకే

ఈ విజయదశమి రోజు విజయకాలం లో అంటే సాయంకాలంలో , తమకి, తమ కుటుంబానికి క్షేమం కలగాలని , తమ పనుల్లో విజయం లభించాలని కోరుకునే వారంతా, 'అపరాజిత' దేవిని పూజించాలని పూరాణంలో చెప్పబడింది.

దాని ప్రకారం ఉత్తరభారత దేశంలో విజయ దశమి నాడు అమ్మవార్నీ అపరాజిత దేవిగా కోలుస్తారు.

" అపరాజిత" అంటే పరాజయం లేనిది, నిత్యవిజయరూపిణీ అని అర్ధం.

ఈ విధముగా దశమికి విజయదశమి అనే పేరు వచ్చిందని పండితులంటారు.

ఇంకా చెప్పాలంటే , కల్పతరమ్ లో విష్ణుమూర్తి, త్రేతాయుగం లో శ్రీ రామ చంద్రుడు, ద్వాపరయుగం లో అర్జునుడు ఈ విజయదశమి నాడే విజయాల్ని సాధించారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML