గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 October 2013

అయ్యప్ప దీక్షా సమయంలో భూ శయనం ఎందుకు చెయ్యాలి?ఒక్క అయ్యప్ప దీక్షలోనే కాదు, మన సాంప్రదాయంలో అనాదినుంచీ ఏ దీక్షలో వున్నవారయినా భూ శయనం చెయ్యటం, అంటే నేలమీద చాప మాత్రం వేసుకుని నిదురించటం ఆనవాయితీగా వుంది. పూర్వం గురుకులాలలో విద్యాభ్యాసం చేసేవాళ్ళు నేలమీదే నిద్రించేవారు. అలా ఎందుకంటే నేల కఠినంగా వుండటంతో అలిసిన శరీరానికి ఎంతమటుకు నిద్ర అవసరమో అంత మటుకే నిద్ర పోగలరు. తర్వాత అటూ ఇటూ కదిలేటప్పుడు నేల గట్టిగా వుండి ఎక్కువ సేపు పడుకోలేక లేచి తమ పనులు చూసుకుంటారు. పూర్వం బ్రహ్మచారులకు, గురుకులవాసులకు అనేక కార్యక్రమాలు వుండేవి. ఉపాసన, గురు శుశ్రూష, ఇలా అన్ని పనులూ పూర్తి చేసుకుని ఉదయం చదువుకు కూర్చోవాలి. అందుకే వాళ్ళు అవసరమైనంతమటుకే నిద్రపోవాలి.

ఆ నియమాన్ని ఏ దీక్షలోవున్న వాళ్ళయినా పాటిస్తారు. వారి మనసు సుఖాలవైపు ఆకర్షింపబడకూడదు. దీక్ష ఫలితాన్ని పూర్తిగా పొందాలంటే వారికి బధ్ధకం వుండకూడదు. అందుకే నియమాలు.

ఈ భూ శయనం వల్ల ఇంకొక గొప్ప ఉపయోగం ఏమిటంటే నడుం నొప్పి రాదు. నొప్పులు సవరింపబడతాయని వైద్య శాస్త్రం చెబుతోంది. అలాగే కామ క్రోధాలు అణిగి పోతాయని ధర్మ శాస్త్రం చెబుతోంది. అందుకే దీక్షా సమయంలో భూ శయనం.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML