గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 October 2013

సోమవారం స్త్రీలు 'లక్ష పసుపు' నోము చేస్తే..!?

సోమవారం స్త్రీలు 'లక్ష పసుపు' నోము చేస్తే..!?

మహిళలు సోమవారం "లక్ష పసుపు నోము" చేస్తే, అష్టైశ్వర్యాలు, దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. అలాగే పెళ్లికాని కన్యలకు సుగుణవంతుడైన భర్త లభిస్తాడని పురోహితులు చెబుతున్నారు. లక్ష పసుపు నోమును చేసే మహిళలు పరమ వైభవము, ఐదోతనంతో జీవిస్తారు. ఇంకా పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో యెనలేని కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి.

మంచి పసుపుకొమ్ములు (విరగనివి), 1116 వేయినూట పదహారు కొమ్ములు తెచ్చి, పసుపు కుంకుమ రెండు కేజీలు తెచ్చి, 9 రోజులు దుర్గానామ సహస్త్రం పారాయణం చేస్తూ.. తొమ్మిది రోజులు పూర్తయ్యాక వచ్చే సోమవారం నాడు శివాలయంలో పసుపు కుంకుమలు స్వామివారికి సమర్పించి అభిషేకం చేయించాలి.

అభిషేకం పూర్తయ్యాక ఒక ముత్తయిదువుకు తలంటిపోసి, భోజనం పెట్టి జాకెట్టు వస్త్రము, పసుపు, కుంకుమ, దక్షిణ తాంబూలాలతో ఆమెకు వాయనమివ్వాలి. ఇంకా పెద్దల దగ్గర పార్వతీ వివాహం కథచెప్పి అక్షతలు వేసుకుంటే సర్వమంగళం చేకూరుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మహిళలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం, వ్రతమాచరించే గృహమునందు సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు సూచిస్తున్నారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML