గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 12 October 2013

చిదంబర రహస్యం

చిదంబర రహస్యం

‘చిత్’ అంటే చైతన్యం. ‘అంబరం’ అంటే నిర్మల ఆకాశం (ఈథర్). చిదంబరం కోవెలలో తెరవెనుక దాగియున్న ఆ ఓంకారుని నిర్మల చైతన్యమే చిదంబర రహస్యం.

ఈ రహస్యాన్ని సాధారణ మానవమాత్రులు ఛేదించలేరని అంటారు. తత్వాన్వేషణతో ఆత్మ-విచక్షణా ఙ్ఞానాన్ని పొందగలుగుతేనే అది సాధ్యం.

ఎవరైతే మనలో దాగివున్న ఆ పరమాత్ముడి దరిచేరగలుగుతారో వారికే తెరవెనుక నున్న ఆ ఆదికేశవుడి ఉనికీ, పరమార్ధం గోచరిస్తాయని ప్రతీతి....

---
శివదేవుడి ఉనికి రూపాలు 5 రకాలుగా వుంటాయని అంటారు, అవి జల, వాయు అగ్ని, భూమి, ఆకాశంచిదంబరంలో ఆకాశ, రూపంగా కొలుస్తారు,..చిదంబర రహస్యం, ఓ అద్బుతం, ఆశ్చర్యం, ఎవరి భావన ప్రకారం, ఆ రూపంలో నిరాకారుడైన ఆ దేవదేవుని రూపం కన్పిస్తుంది. అనిర్వచనీయమైన ఆనందానుభూతికల్గిస్తుంది,..
ఆలయమంతా నాట్యకళాసంబంధమైన శిల్పాలతో అందంగా వుంటుంది,.. ప్రతీ ఒక్కరూ ఒకసారైనా దర్శించాల్సిన క్షేత్రం ,భూలోక కైలాసం,చిదంబరం...

*****
గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ స్థలాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు 'విల్వ' (బిల్వ) పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్నీ ముక్తినీ సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది. పూజారి తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ.

అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML