కాకర్ల త్యాగయ్య 1767వ సంవత్సరం మే నెల నాలుగవ తారీఖున తంజావూరు జిల్లాలోని కావేరీ నదీ తీరంలోని తిరువారూర్ అనే గ్రామంలో జన్మించాడు.
బాల్యం నుంచి త్యాగయ్యకు శ్రీరాముడిపై భక్తి మెండుగా ఉండేది. తన తండ్రి
పూజ చేస్తుంటే పక్కనే కూర్చొని, భక్తి తన్మయత్వంలో తండ్రితోపాటు
దివ్యసంకీర్తన చేస్తుండేవాడు. ఒకనాడు భక్తి పారవశ్యంలో 'నమో నమో రాఘవాయ'
అనే సంకీర్తన పాడాడు. అది విని తండ్రి ఆశ్చర్యపోయాడు. తాను కూడా అంతకు
ముందెన్నడూ వినని చక్కని సాహిత్యం గల ఆ కీర్తన ఎక్కడ నేర్చుకున్నాడు అని
అనుమానం వచ్చి కొడుకును అడిగాడు. దానికి సమాధానంగా త్యాగయ్య' నాకేల తెలుసు!
ఆ పాట నా నోటికి వచ్చింది... ఎలా వచ్చిందో నాకే తెలియదు. ఆ సమయానికి అలా
పాడాలని అనిపించింది' అన్నాడు. తండ్రి రామబ్రహ్మం ఆనాడే తన కొడుకు గొప్ప
వాగ్గేయ కారుడవుతాడని భార్యతో చెప్పాడు. తన సంగీతాన్ని తండ్రి
మెచ్చుకోవడంతో త్యాగయ్యకు ఎంతో ఆనందం కలిగించింది. ఆ రోజుల్లో పేపర్లు,
పెన్సిళ్ళూ లేకపోవటం వలన త్యాగయ్య తనకు తట్టిన పాటలను బొగ్గుతో గోడమీద
రాస్తుండేవాడు... ఆ సాహిత్యాన్ని చదివిన తండ్రి ఆశ్చర్య ఆనందాలకు
అవధులుండేవి కావు.
అతనికి సంగీతంపై గల అపారమైన ఆసక్తిని గ్రహించి,
వెంటనే తండ్రి త్యాగయ్యను వెంకటరమణయ్య గారి వద్దకు తీసుకువెళ్ళి పరిచయం
చేసి, శిష్యుడిగా స్వీకరించమని కోరాడు. అప్పటికే త్యాగయ్య గురించి అతని
సాహిత్యం గురించి ఆనోటా ఈ నోటా విన్న ఆ గురువు గారు తక్షణం అంగీకరించి, ఒక
సంవత్సరం పాటు శిక్షణ నిచ్చి తను చెప్పగలిగినదంతా చెప్పాడు. సంగీతంలోని
లాఘవాలతో పాటు జయదేవుడి అష్టపదుల్ని, పురందరదాసు కీర్తనలను లయబద్ధంగా
నేర్చుకొని తాను స్వయంగా రామాయణ వృత్తాంతాలపై కీర్తనలు రచించి రాగం కూర్చి
గానం చేస్తూ ప్రజలందరినీ ముగ్ధులును చేయసాగాడు. ఒకసారి వెంకటరమణయ్య
గారింట్లో జరిగిన విద్వత్సభలో ఆయనని పాడమని ఆదేశించగా, అప్పటికప్పుడూ
అశువుగా బిళహరి రాగంలో 'దొరుకునా ఇటువంటి సేవ' అనే పాట పాడాడు. ఆ
కీర్తనలోని రాగానికి, సాహిత్యానికి, పాడిన పద్దతికి, సభ్యులు ముగ్ధులై,
విద్య నేర్పిన గురువును ఎంతో ప్రశంసించారు. గురువు ఆనందంతో శిష్యుణ్ణి
ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. అనంతరం గురువు త్యాగయ్యను
అనేకమంది పెద్దలకు, రాజ్యాధీశులకు పరిచయం చేసి, వారికి ఎంతో ఆనందం
కలిగించాడు. త్యాగయ్య కీర్తి దశ దిశలా వ్యాపించటం ప్రారంభమయింది.
త్యాగయ్య చిన్న అన్న రామనాధుడు యౌవనంలో అకాల మరణం పాలయ్యాడు. రెండు
సంవత్సరాల అనంతరం తండ్రి కూడా మరణించాడు. పెద్దన్న జపేశుడి ఇంట్లో ఉంటూ
సంగీతోపాసన చేస్తూ, రామనామ జపంలో కాలం గడుపుతుండేవాడు. జపేశుడు చిన్నతనం
నుంచీ ఒక క్రమశిక్షణ లేకపోవటం వలన తమ్ముడి సంగీతాన్ని ఎప్పుడూ
అభినందించలేదు. పైగా చిరాకు పడేవాడు. తమ్ముడితో 'ఇంట్లో మూలకూర్చొని పాడటం
వలన కానీ, రోడ్లమీద తిరుగుతూ పాడటం వలన కానీ, మనకు ఎటువంటి లాభమూలేదు. ఏ
మహారాజునో ఆశ్రయించి ఆయనను పొగుడుతూ పాడితే మనకు ధన, కనక వస్తు వాహనాలు
లభిస్తాయి. సుఖంగా జీవించవచ్చు' అని చెప్పేవాడు, అయితే త్యాగయ్య దానికి
అంగీకరించలేదు. త్యాగయ్య గురించి విని తంజావూరు మహారాజు, తన ఆ స్థానంలో తన
గురించి పాడమని కబురు పంపి, కానుకలు కూడా పంపాడు. త్యాగయ్య వాటిని వినయంగా
తిరస్కరించి 'నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా... నిజము తెలుపుము
మనసా' అని పాడి, తాను శ్రీరాముడి గురించి తప్ప మరెవరి గురించి పాడలేనని
ఖచ్చితంగా చెప్పాడు. అది విని ఉగ్రుడైన జపేశుడు తమ్ముడిని ఇంటి నుంచి
గెంటివేశాడు. అనంతరం త్యాగయ్య శిష్యులను కూడదీసుకొని అనేక పుణ్యక్షేత్రాలు
తిరుగుతూ, అనేక సభలలో పాల్గొని, తన సంగీతంలో వారిని పారవశ్యంలో ముంచి, సర్వ
విద్యా పారంగతుడై సంగీతంలో విశ్వవిఖ్యాతి పొందాడు. త్యాగయ్య 'శతసహస్ర
కీర్తనలను రాశారని అంటారు కానీ, మన చరిత్రకారుల ప్రకారం ఆరు వందల కీర్తనలు
మాత్రమే మనకు లభ్యమయ్యాయి. అవికాక నౌకాచరితం, ప్రహ్లాదభక్తి విజయం అనే
రూపకాలు కూడా ఆయన రచించారు. వెనుకటికి ఒకసారి మహత్మాగాంధి దక్షిణ
భారతీయులలోని ఐక్యమత్యం గురించి ప్రస్తావిస్తూ' ఒక తెలుగు వ్యక్తి తమిళ
గ్రామంలో జన్మించి, కర్ణాటక సంగీతం అభ్యసించి, కీర్తనలు రాస్తే వాటిని
మళయాళ ప్రజలు కూడా ఆనందంగా పాడుకుంటున్నారు' అన్నారు.
బాల్యం నుంచి త్యాగయ్యకు శ్రీరాముడిపై భక్తి మెండుగా ఉండేది. తన తండ్రి పూజ చేస్తుంటే పక్కనే కూర్చొని, భక్తి తన్మయత్వంలో తండ్రితోపాటు దివ్యసంకీర్తన చేస్తుండేవాడు. ఒకనాడు భక్తి పారవశ్యంలో 'నమో నమో రాఘవాయ' అనే సంకీర్తన పాడాడు. అది విని తండ్రి ఆశ్చర్యపోయాడు. తాను కూడా అంతకు ముందెన్నడూ వినని చక్కని సాహిత్యం గల ఆ కీర్తన ఎక్కడ నేర్చుకున్నాడు అని అనుమానం వచ్చి కొడుకును అడిగాడు. దానికి సమాధానంగా త్యాగయ్య' నాకేల తెలుసు! ఆ పాట నా నోటికి వచ్చింది... ఎలా వచ్చిందో నాకే తెలియదు. ఆ సమయానికి అలా పాడాలని అనిపించింది' అన్నాడు. తండ్రి రామబ్రహ్మం ఆనాడే తన కొడుకు గొప్ప వాగ్గేయ కారుడవుతాడని భార్యతో చెప్పాడు. తన సంగీతాన్ని తండ్రి మెచ్చుకోవడంతో త్యాగయ్యకు ఎంతో ఆనందం కలిగించింది. ఆ రోజుల్లో పేపర్లు, పెన్సిళ్ళూ లేకపోవటం వలన త్యాగయ్య తనకు తట్టిన పాటలను బొగ్గుతో గోడమీద రాస్తుండేవాడు... ఆ సాహిత్యాన్ని చదివిన తండ్రి ఆశ్చర్య ఆనందాలకు అవధులుండేవి కావు.
అతనికి సంగీతంపై గల అపారమైన ఆసక్తిని గ్రహించి, వెంటనే తండ్రి త్యాగయ్యను వెంకటరమణయ్య గారి వద్దకు తీసుకువెళ్ళి పరిచయం చేసి, శిష్యుడిగా స్వీకరించమని కోరాడు. అప్పటికే త్యాగయ్య గురించి అతని సాహిత్యం గురించి ఆనోటా ఈ నోటా విన్న ఆ గురువు గారు తక్షణం అంగీకరించి, ఒక సంవత్సరం పాటు శిక్షణ నిచ్చి తను చెప్పగలిగినదంతా చెప్పాడు. సంగీతంలోని లాఘవాలతో పాటు జయదేవుడి అష్టపదుల్ని, పురందరదాసు కీర్తనలను లయబద్ధంగా నేర్చుకొని తాను స్వయంగా రామాయణ వృత్తాంతాలపై కీర్తనలు రచించి రాగం కూర్చి గానం చేస్తూ ప్రజలందరినీ ముగ్ధులును చేయసాగాడు. ఒకసారి వెంకటరమణయ్య గారింట్లో జరిగిన విద్వత్సభలో ఆయనని పాడమని ఆదేశించగా, అప్పటికప్పుడూ అశువుగా బిళహరి రాగంలో 'దొరుకునా ఇటువంటి సేవ' అనే పాట పాడాడు. ఆ కీర్తనలోని రాగానికి, సాహిత్యానికి, పాడిన పద్దతికి, సభ్యులు ముగ్ధులై, విద్య నేర్పిన గురువును ఎంతో ప్రశంసించారు. గురువు ఆనందంతో శిష్యుణ్ణి ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. అనంతరం గురువు త్యాగయ్యను అనేకమంది పెద్దలకు, రాజ్యాధీశులకు పరిచయం చేసి, వారికి ఎంతో ఆనందం కలిగించాడు. త్యాగయ్య కీర్తి దశ దిశలా వ్యాపించటం ప్రారంభమయింది.
త్యాగయ్య చిన్న అన్న రామనాధుడు యౌవనంలో అకాల మరణం పాలయ్యాడు. రెండు సంవత్సరాల అనంతరం తండ్రి కూడా మరణించాడు. పెద్దన్న జపేశుడి ఇంట్లో ఉంటూ సంగీతోపాసన చేస్తూ, రామనామ జపంలో కాలం గడుపుతుండేవాడు. జపేశుడు చిన్నతనం నుంచీ ఒక క్రమశిక్షణ లేకపోవటం వలన తమ్ముడి సంగీతాన్ని ఎప్పుడూ అభినందించలేదు. పైగా చిరాకు పడేవాడు. తమ్ముడితో 'ఇంట్లో మూలకూర్చొని పాడటం వలన కానీ, రోడ్లమీద తిరుగుతూ పాడటం వలన కానీ, మనకు ఎటువంటి లాభమూలేదు. ఏ మహారాజునో ఆశ్రయించి ఆయనను పొగుడుతూ పాడితే మనకు ధన, కనక వస్తు వాహనాలు లభిస్తాయి. సుఖంగా జీవించవచ్చు' అని చెప్పేవాడు, అయితే త్యాగయ్య దానికి అంగీకరించలేదు. త్యాగయ్య గురించి విని తంజావూరు మహారాజు, తన ఆ స్థానంలో తన గురించి పాడమని కబురు పంపి, కానుకలు కూడా పంపాడు. త్యాగయ్య వాటిని వినయంగా తిరస్కరించి 'నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా... నిజము తెలుపుము మనసా' అని పాడి, తాను శ్రీరాముడి గురించి తప్ప మరెవరి గురించి పాడలేనని ఖచ్చితంగా చెప్పాడు. అది విని ఉగ్రుడైన జపేశుడు తమ్ముడిని ఇంటి నుంచి గెంటివేశాడు. అనంతరం త్యాగయ్య శిష్యులను కూడదీసుకొని అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, అనేక సభలలో పాల్గొని, తన సంగీతంలో వారిని పారవశ్యంలో ముంచి, సర్వ విద్యా పారంగతుడై సంగీతంలో విశ్వవిఖ్యాతి పొందాడు. త్యాగయ్య 'శతసహస్ర కీర్తనలను రాశారని అంటారు కానీ, మన చరిత్రకారుల ప్రకారం ఆరు వందల కీర్తనలు మాత్రమే మనకు లభ్యమయ్యాయి. అవికాక నౌకాచరితం, ప్రహ్లాదభక్తి విజయం అనే రూపకాలు కూడా ఆయన రచించారు. వెనుకటికి ఒకసారి మహత్మాగాంధి దక్షిణ భారతీయులలోని ఐక్యమత్యం గురించి ప్రస్తావిస్తూ' ఒక తెలుగు వ్యక్తి తమిళ గ్రామంలో జన్మించి, కర్ణాటక సంగీతం అభ్యసించి, కీర్తనలు రాస్తే వాటిని మళయాళ ప్రజలు కూడా ఆనందంగా పాడుకుంటున్నారు' అన్నారు.

No comments:
Post a Comment