గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 29 October 2013

సోహం అంటే ఏమిటి ?

సోహం అంటే ఏమిటి ?

భావశూన్య సద్భావ సుస్థితి: |
భావనా బలాద్భక్తిరుత్తమా ||

శూన్య భావనా చింతన కన్నా, సద్భావన (పరమాత్మయే నేను అనే అభేద చింతన) శ్రేష్టము. ఇట్టి భావనతో కూడుకున్న అభేదభక్తి ఉత్తమము.

సోహం భావన

స: అంటే అతడు పరమాత్మ. అహం అంటే నేను. ఆ పరమాత్మతో నేను ఏకమై యున్నాను. ఈ ఐక్యాన్ని సద్విచారణ ద్వారా జ్ఞానంతో తెలుసుకోవాలి. ఇది జ్ఞానంతో పొందదగినదే కానీ, ధ్యానంతో కాదు. సమాజంలో చాలామంది మేము సోహం మెడిటేషన్‌ నేర్చుకున్నాం. రోజూ అరగంట ప్రాక్టీసు చేస్తున్నామని చెబుతుంటారు. సోహం అనేది జ్ఞానపర వాక్యంగా సాధకుడు గ్రహించాలి.
సోహం అని ధ్యానం చేయకూడదాయ? తప్పక చెయ్యవచ్చు. సోహం అంటూ ధ్యానం చేస్తే ఏం కలుగుతుందియ? నేను ఈ సృష్టికర్తయైన పరమాత్మ (హిరణ్యగర్భుని)తో ఏకమై యున్నానని భావిస్తూ సోహం.. సోహం.. సోహం.. అని జపంచేస్తూ ధ్యానం చేయడంవల్ల విశేష పుణ్యం కలిగి, సుఖభోగాలు లభించి హిరణ్యగర్భలోకం సిద్దిస్తుందని ఉపాసనాకాండ వివరిస్తూంది.

తం యథాయథా ఉపాస్తే తదేవ భవతి!
ఈ ఉపాసనలో నేను అనే జీవభావం పూర్తిగా తొలగదు. పరమాత్మ తత్త్వ జ్ఞానం కలగదు. కేవలం నేను పరమాత్ముడనై యున్నానని భావిస్తాడంతే! కావున వీడు జీవుడిగానే వుంటూ మరో లోకాన్ని పొంది, ఉపాసనా బలం వున్నంతకాలం అనుభవిస్తాడు. ఉపాసనా ఫలితం తీరిన తర్వాత మళ్లీ మామూలుగా ‘‘క్షీణ పుణ్య మర్త్యలోకం విశంతి’’ పుణ్యఫలం తీరిపోతే తిరిగి ఈ భూలోకంలో ఈ దేహాన్ని పొంది ‘‘పునరపి జననం పునరపి మరణం’’ జనన మరణాలలో చిక్కుకుని తిరుగుతుంటాడు.

అందుకే ఈ సోహం అనే పదాన్ని వివేకయుక్తుడై శాస్త్రప్రమాణంతో విచారణ చేస్తే, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విచారణలో ఉదయించిన జ్ఞానమే అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. అజ్ఞానం నశిస్తే సంసారక్షయం. సంసారక్షయమే మోక్షం.
మాభవగ్రాహ్య భావాత్మ గ్రాహకాత్మాచమాభవ భావనామఖిలం త్యక్త్వా యచ్ఛిష్టం తన్మయోభవ కర్మలు, ఉపాసనలు, వాటివల్ల కలిగే ఫలాలు, వాటిని పొందాలనే భావాలన్నింటిని అధిగమించి, ఏదైతే నిత్యశుద్ద చైతన్యమై అన్నింటికి విలక్షణమై వెలుగొందుతుందో అట్టి తత్త్వరూపమై నీవు వెలుగొందమని భావం. కనుక కర్మ, ఉపాసన కూడా మోక్షాన్ని, శాశ్వతానందాన్ని ఇవ్వలేవు.
Read More

Monday, 28 October 2013

దీపావళి రోజున మహాలక్ష్మీ పూజ ఎందుకు చేయాలో తెలుసా?దీపావళి రోజున  మహాలక్ష్మీ పూజ చేయాలంటారు. అప్పుడు సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు అంటారు. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

పూర్వం దూర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి అతనికి ఓ మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తనవద్ద నున్న ఐరావతము అనే ఏనుగు మెడలోవేయగా అది 
ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది.

దీన్ని చూసిన దూర్వాసుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా రాజ్యాధిపత్యం కోల్పోయి సర్వసంపదలు పోగోట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఓ జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా భావించి పూజించమని సూచిస్తాడు.

దానికి తృప్తి చెందిన లక్ష్మీ అనుగ్రహంతో తిరిగి త్రిలోకా ధిపత్యాన్ని సర్వసంపదలను పొంది దూర్వాసుని పాదాలపై పడతాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి రాజ్య
ము, సంపదలను పొందిన దేవేంద్రుడు శ్రీమహాలక్ష్మి దేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నిస్తాడు. తల్లీ నీవు శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అని ప్రశ్నిస్తాడు.

అందుకు ఆ మహాలక్ష్మీ సమాధానమిస్తూ.. త్రిలోకాధిపతీ... నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారివారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మిగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా ప్రసన్నురాలనౌవుతానని చెప్పింది.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం వలన సర్వశుభాలు ప్రసాదిస్తుంది.

అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సమస్త సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

  భవదీయుడు,

YADHUCHANDRA TANNEERU
         యదుచంద్ర తన్నీరు
Read More

Saturday, 26 October 2013

తెలుగు సంవత్సరాలు


 1. ప్రభవ
 2. విభవ
 3. శుక్ల
 4. ప్రమోదూత
 5. ప్రజోత్పతి
 6. అంగీరస
 7. శ్రీముఖ
 8. భావ
 9. యువ
 10. ధాత
 11. ఈశ్వర
 12. బహుధాన్య
 13. ప్రమాది
 14. విక్రమ
 15. వృష
 16. చిత్రభాను
 17. స్వభావ
 18. తారణ
 19. పార్ధివ
 20. వ్యయ
 21. సర్వజిత్తు
 22. సర్వధారి
 23. విరోధి
 24. వికృతి
 25. ఖర
 26. నందన
 27. విజయ
 28. జయ
 29. మన్మథ
 30. దుర్ముఖి
 31. హేవిళంబి
 32. విళంబి
 33. వికారి
 34. శార్వరి
 35. ప్లవ
 36. శుభకృతు
 37. శోభకృతు
 38. క్రోధి
 39. విశ్వావసు
 40. పరాభవ
 41. ప్లవంగ
 42. కీలక
 43. సౌమ్య
 44. సాధారణ
 45. విరోధికృతు
 46. పరీధావి
 47. ప్రమాదీచ
 48. ఆనంద
 49. రాక్షస
 50. నల
 51. పింగళ
 52. కాలయుక్త
 53. సిద్ధార్ధి
 54. రౌద్రి
 55. దుర్మతి
 56. దుందుభి
 57. రుధిరోద్గారి
 58. రక్తాక్షి
 59. క్రోధన
 60. అక్షయ     భవదీయుడు,

  YADHUCHANDRA TANNEERU
           యదుచంద్ర తన్నీరు
Read More

ఋతువులు - కాలాలు

సంవత్సరానికి ఆరు ఋతువులు

వసంత ఋతువు చైత్ర,, వైశాఖ మాసాలు
గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు
వర్ష ఋతువు శ్రావణ, భాద్రపద మాసాలు
శరత్ ఋతువు ఆశ్వయుజ, కార్తీక మాసాలు
హేమంత ఋతువు మార్గశిర, పుష్య మాసాలు
శిశిర ఋతువు మాఘం, ఫాల్గుణం మాసాలు

కాలములు

రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...

 1. వేసవి కాలం


 2. వర్షా కాలం


 3. శీతా కాలంవేసవి కాలం - చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.

వర్షా కాలం - శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.

శీతా కాలం - మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.

భవదీయుడు,

YADHUCHANDRA TANNEERU
         యదుచంద్ర తన్నీరు
Read More

Friday, 25 October 2013

ఇది నిజమేనా ?? జగన్ క్రైస్తవ- ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం లో నిమగ్నం అయి ఉన్నాడా ?? అందుకే కేంద్ర కాంగ్రెస్(క్రైస్తవ) ప్రభుత్వం జగన్ ను కలుపుకుని ఎన్నికలలోకి పోతోందా ??

ఇది  నిజమేనా ?? జగన్ క్రైస్తవ- ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం లో నిమగ్నం అయి ఉన్నాడా ?? అందుకే కేంద్ర కాంగ్రెస్(క్రైస్తవ) ప్రభుత్వం జగన్ ను కలుపుకుని ఎన్నికలలోకి పోతోందా ?? 
Read More

Thursday, 24 October 2013

భక్తి గీతాలు - పలుకే బంగారమాయెనా


పలుకే బంగారమాయెనా కోదండపాణి ||పలుకే|| 

పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి 

కలలో నీనామస్మరణ మరువ చక్కని తండ్రి ||పలుకే|| 

ఇరువుగ నిసుకలోన బొరలినయుడుత భక్తికి 

కరుణించి ప్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి ||పలుకే|| 

రాతినాతిగ జేసి భూతలమున ప్రఖ్యాతి 

జెందితివని ప్రీతితో నెరనమ్మితి తండ్రీ ||పలుకే|| 

ఎంతవేడినను నీకు సుంతైన దయరాదు 

పంతము చేయ నేనెంతవాడను తండ్రి ||పలుకే|| 

శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగాదా 

కరుణించు భద్రాచల వరరామదాసపోష ||పలుకే||
భవదీయుడు,

YADHUCHANDRA TANNEERU
         యదుచంద్ర తన్నీరు

Read More

భక్తి గీతాలు-నాగేంద్ర హారాయ త్రిలోచనాయ


నాగేంద్ర హారాయ త్రిలోచనాయ| 

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ| 

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ| 

తస్మై మకారాయ నమశ్శివాయ|


మందాకీని సలిల చందన చర్చితాయ| 

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ| 

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ| 

తస్మై మకారాయ మకారాయ నమశ్శివాయ|


శివాయ గౌరీవదనారవిందాయ| 

సూర్యాయ దక్షాధ్వర నాశకాయ| 

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ| 

తస్మై శికారాయ నమశ్శివాయ|


వశిష్ఠ కుంభోద్బవ గౌతమార్య| 

మునీంద్ర దేవార్చిత శేఖరాయ| 

చంద్రార్క వైశ్వానరలోచనాయ| 

తస్మై వకారాయ నమశ్శివాయ|


యక్ష స్వరూపాయ జటాధరాయ| 

పినాక హస్తాయ సనాతనాయ| 

సుదివ్య దేవాయ దిగంబరాయ| 

తస్మై యకారాయ నమశ్శివాయ| 

పంచాక్షర మిదం పుణ్యం - య:పఠే చ్ఛివ సన్నిధౌ 

శివలోక మవాప్నోతి - శివేన సహ మోదతే.


భవదీయుడు,

YADHUCHANDRA TANNEERU
         యదుచంద్ర తన్నీరు


Read More

భక్తి గీతాలు-నమో ఆంజనేయా నమో పవనపుత్ర

నమో ఆంజనేయా నమో పవనపుత్ర నమోనమో పవనపుత్ర ||న|| 

మహదివ్య తేజ నీ మహిమలెన్నతరమా "న" 

సీతాన్వేషణకై శ్రీరాముడు నిను ఒంపా 

దక్షిణదిశకేగి సీతమ్మను గాంచితివి ''సీ'' ||న|| 

ఘోరసంగ్రామములో లక్ష్మణుడు మూర్చిల్ల 

సంజీవుని తెచ్చి సౌమిత్రిని గాంచితివి "సౌ" ||న|| 

భూతప్రేతములకు నీ నామమే మంత్రముగా 

నిను ధ్యానించినదో భవబందము లోలగునుగా 

భవ బంధము లోలుగునుగా ||న||

భవదీయుడు,

YADHUCHANDRA TANNEERU
         యదుచంద్ర తన్నీరు


Read More

ఎన్ని నదులు వచ్చిన చివరాకు కలిసేది సముద్రము లోనే , ఎన్ని మతాలు వచ్చిన, చివరకు కలిసేది హిందుత్వం లోనే

హైందవీకరించబడుతున్న క్రైస్తవం.. హిందూ దేవాలయాన్ని పోలినట్లు చర్చలు నిర్మిస్తున్నారు భారతీయ క్రైస్తవులు. ఈ మధ్య జీసస్‌కు సుప్రభాతం, అష్టోత్తరం, హిందూ పద్ధతిలో పూజ పద్దతులను అనిసరిస్తున్నారు భారతీయ క్రైస్తవులు. సూర్యనమస్కారాలను జీసస్ నమస్కారాల పేరుతో కేరళలో ప్రచారం చేస్తున్నారు. ఈశావాస్యోపనిషద్‌ను ఏసు ఉపనిషద్‌గా ప్రచారం చేస్తున్నారు. మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన సంస్కృతిని భారతీయ క్రైస్తవులు హిందూ పూజావిదాలాను అనుసరిస్తూ ఐరోపా క్రైస్తవాన్ని క్రమేపి హైందవీకరిస్తున్నారు. ఇది ఒక రకంగా క్రైస్తవవం తన విదేశీ తనాన్ని కోల్పోయి స్వదేశీ అంటే భారతీయను సంతరించుకుంటుంది. ఇది భారతీయ సంస్కృతి గొప్పతంగా చెప్పాల్సి ఉంటుంది..Read More

Tuesday, 22 October 2013

భక్తి గీతాలు-కొండలలో నెలకొన్న


కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు 

కొండలంత వరములు గుప్పెడు వాడు 

కుమ్మరదాసుడైన కురువరతి నంబి 

ఇమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు 

దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న 

చోటికి వచ్చి నమ్మినవాడు ||కొండ|| 

అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి 

ముచ్చిలివెట్టికి నన్ను యోచిననాడు 

మచ్చికదొలక దిరుమలనంబి తోడుత 

నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చిన వాడు ||కొండ|| 

కంచిలోననుండ దురుకచ్చినంబి మీద గరుణించి 

తన యెడకు రప్పించిన వాడు 

యెంచి నెరుడైన వేంకటేశుడు మనలకు 

మంచివాడై కరుణ బాలించినవాడు
భవదీయుడు,

YADHUCHANDRA TANNEERU
         యదుచంద్ర తన్నీరు

Read More

భక్తి గీతాలు- ఏడుకొండల స్వామిఏడుకొండలస్వామి - ఎక్కడున్నావయ్యా 

ఎన్ని మెట్లెక్కినా - కానరావేమయ్యా 

ఆకాశమందూ ఈ కొండ - శిఖరమ్ము పై 

మనుజులకు దూరంగా - మసలుతున్నావా ||ఏడు|| 

ఎచ్చోటగాంచినా - నీవుందూవందురూ 

ఏమిటో నీమాయా - తెలియకున్నామయ్య 

ఈయడవి దారిలో - చేయూత నీయవా 

నీపాదసన్నిధికి - మముజేరనీయవా ||ఏడు||
భవదీయుడు,

YADHUCHANDRA TANNEERU
         యదుచంద్ర తన్నీరు


Read More

భక్తి గీతాలు -అదివో అల్లదివో

అదిగో అల్లదిగో శ్రీహరివాసము 

పదివేల శేషుల పడగలమయము 

అదె వేంకటాచల మఖిలోన్నతము 

అదిగో బ్రహ్మాదుల కపురూపము 

అదిగో నిత్యనివాస మఖిలమునులకు 

అదె చూడు అదె మ్రొక్కు ఆనందమయము ||అదిగో|| 

చెంగట నల్లదిగో శేషాచలము 

నింగినున్న దేవతల నిజనివాసము 

ముంగిట నల్లదిగో మూలనున్న ధనము 

బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ||అదిగో|| 

కైవల్య ప్రదము శ్రీ వేంకట నగమదిగో 

శ్రీ వేంకటాపతికి సిరులైనదీ 

భావింప సకలసంపదరూప మదిగో 

పావనముల కెల్ల పావన మయము ||అదిగో||

భవదీయుడు,

YADHUCHANDRA TANNEERU
         యదుచంద్ర తన్నీరు


Read More

Wednesday, 16 October 2013

శ్రీ వెంకటేశ సుప్రభాతమ్


1. శ్లో|| కౌసల్యసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే! 

ఉత్తిష్ఠ నరసార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం. 

2. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద, ఉత్తిష్ఠ గరుడధ్వజ, 

ఉత్తిష్ఠ కమలాకాన్త! త్రైలోక్యం మంగళం కురు. 

3. మాతః సమస్త జగతాం మధుకైటభారేః - వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే, 

శ్రీ స్వామిని శ్రితజన ప్రియదానశీలే - శ్రీ వేంకటేశదయితే తవ సుప్రభాతం|| 

4. తవ సుప్రభాత మరవిందలోచనే - భవతు ప్రసన్న ముఖచంద్రమండలే, 

విధిశంకరేంద్ర వనితాభిరర్చితే - వృషశైలనాధదయితే దయానిధే|| 

5. అత్ర్యాదిసప్త ఋషయస్స ముపాస్య సంధ్యా - మాకాశసింధుకమలాని మనోహరాణి, 

ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 

6. పంచావనాబ్జభవ షణ్ముఖవాసవాద్యాః - త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి, 

భాషాపతిః పఠతి వాసరశుద్ధి మారాత్ - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 

7. ఈషత్ప్ర పుల్లసరసీరుహ నారికేశ - వూగద్రుమాది సుమనోహర పాళికానామ్, 

ఆవాతి మందస్సనిలః సహ దివ్యగంధైః - శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్|| 

8. ఉన్మీల్య నేత్రయుగ ముత్తమపంజరస్థాః - పాత్రావశిష్ట కదళీఫల పాయసాని, 

భుక్త్వాసలీల మథ కేళిశుకా పఠ తి - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 

9. తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా - గాయ త్యనంతచరితం తవ నారదోపి, 

భాషాసమగ్ర మసకృత్కరచార రమ్యం - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 

10. భృంగావళీ చ మకరంద రసానువిద్ధ - ఝుంకారగీత నినధైః సహ సేవనాయ, 

నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 

11. యోషాగణేన వరదధ్ని విమధ్యమానే - ఘోషాలయేషు దధిమంధన తీవ్రఘోషాః, 

రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 

12. పద్మేశమిత్రశతపత్రగతాళివర్గాః - హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా, 

భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 

13. శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో - శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో, 

శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

14. శ్రీస్వామిపుష్కరిణికా ప్లవనిర్మలాంగాః - శ్రేయోర్ధినో హరవిరించి సనందనాద్మ్యాః, 

ద్వారే వసంతి వరనేత్రహతో త్తమాంగాః - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

15. శ్రీ శేషశైలగరుడాచల వేంకటాద్రి - నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముఖ్యామ్, 

అఖ్యాం త్వదీయవసతే రనిశం వదంతి - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

16. సేవాపరాః శివసురేశ కృతానుధర్మ - రక్షోంబునాధ పవమాన ధనాధినాథాః, 

బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

17. ధాటిషు తే విహగరాజ మృగాధిరాజ - నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః, 

స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

18. సూర్యేందుభౌమబుధవాక్పతికావ్యసౌరి - స్వర్భాను కేతుదివిషత్పరిషత్ప్రథానాః, 

త్వద్దాసదాస చరమావధి దాసదాసాః - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

19. త్వత్పాదధూళి భరితస్ఫురితో త్తమాంగాః - స్వర్గపవర్గనిరపేక్ష నిజాంతరంగాః, 

కల్పాగమా కలనయా కులతాం లభంతే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

20. త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః - స్వర్గావపర్గపదవీం పరమాం శ్రయంతః, 

మర్త్యామనుష్యభువనే మతిమాశ్రయంతే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

21. శ్రీభూమినాయక దయాదిగుణామృతాబ్దే - దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే, 

శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

22. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన! చక్రపాణే, 

శ్రీవత్సచిహ్న శరణాగతపారిజాత - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

23. కందర్పదర్ప హరసుందరదివ్యమూర్తే - కాంతా కుచాంబురుహకుట్మల లోలదృష్టే, 

కల్యాణ నిర్మలగుణాకర! దివ్యకీర్తే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

24. మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్ - స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర, 

శేషాంశ రామ యదునందన కల్కిరూప - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

25. ఏలాలవంగ ఘనసారసుగంధితీర్ధం - దివ్యం వియత్సరితి హేమఘటేఘ పూర్ణమ్, 

ధృత్వాద్యవైదికశిభామణయః ప్రహృష్టాః - తిష్ఠంతి వేంకటపతే! తవ సుప్రభాతమ్|| 

26.భాస్వానుదేతి వికచాని సరోరుహాణి - సంపూరయంతి నినదైః కకుభో విహంగాః, 

శ్రీవైష్ణవా స్సతతమర్ధితమంగళాస్తే -ధామాశ్రయంతి తవ వేంకటసుప్రభాతమ్|| 

27. బ్రహ్మాదయ స్సురవరా స్సమహర్షయస్తే - సంత స్సనందనముఖా స్త్వధ యోగివర్యాః, 

ధామాంతికే తవ హిమంగళవస్తు హస్తాః శ్రీ వేంకటాచలపతే తవసుప్రభాతమ్|| 

28. లక్ష్మీనివాస నిరవద్యగుణైకసింధో - సంసారసాగర సముత్తరణైకసేతో, 

వేదాంత వేద్య నిజవైభవ భక్తభోగ్య - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 

29. ఇత్ధం వృషాచలపతే రిహ సుప్రభాతం - యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః, 

తేషాం ప్రభాతసమయే స్మృతిరంగ భాజాం - ప్రజ్ఞాం పరార్థసులభాంపరమాం ప్రసూతే||


భవదీయుడు,

YADHUCHANDRA TANNEERU
         యదుచంద్ర తన్నీరు


Read More

గాయత్రీ మంత్రం

"గాయతాం త్రాయతే ఇతి గాయత్రీ" అనగా జపించేవారిని తరింప జేస్తుంది కనుక ఈ మంత్రాన్ని గాయత్రీ అని అంటారు. 

చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు. 

నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.


గాయత్రీ మంత్రము అంటే...

"ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్" 

ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే...


ఓం 

భూర్భువస్సువః 

తత్సవితుర్వరేణ్యం 

భర్గోదేవస్య ధీమహి 

ధియో యోనః ప్రచోదయాత్


ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి. 

ఈ మంత్రములో "ఓం" అనేది "ప్రణవము", "భూర్భువస్సువః" లోని భూ, భువః, సువః అనేవి "వ్యాహృతులు". వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. "తత్" నుంచి మిగిలిన భాగాన్ని "సావిత్రి" అని అంటారు.

భవదీయుడు,

YADHUCHANDRA TANNEERU
         యదుచంద్ర తన్నీరు
Read More

Sunday, 13 October 2013

గాయత్రీ మంత్ర వైశిష్ట్యం

గాయత్రీ మంత్ర వైశిష్ట్యం

వేద మాత గాయత్రి

ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే

తాత్పర్యము:

ముత్యపు వర్ణము, పగడపు వర్ణము, బంగారపు వర్ణము, నీలవర్ణము, తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినదియు, ప్రతిముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు, చంద్రకళతో కూడిన కిరీటము కలదియు, పరమార్థ వివరాణత్మక బీజాక్షరములు కలిగినదియు, వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైన గాయత్రీదేవిని సేవించెదను -
 https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-frc3/q71/1393318_459313004182721_1582446558_n.jpg
 

Read More

సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది.

సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది. సరః అంటే సారము, స్వ అంటే తన యొక్క అని అర్దం. తన యొక్క సారాన్ని/తత్వాన్ని సంపూర్ణంగా తెలిపేది సరస్వతి.

మనం ఆత్మ స్వరూపులం అయినా, మనల్ని మనం శరీరంగా భావించుకుంటాం. మనసుకు కలిగిన బాధలను మనవిగా భావించి బాధపడతాం. పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించేది దేహము, దేహంలో ఉన్న మనస్సే కానీ, మనం కాదు. కానీ శరీరానికి కలిగిన కష్టనష్టాలకు, దుఃఖాలకు కృంగిపోతాం. అహంకారమమకారాలకు బానిసలమై, పరిమితి కలిగిన ఈ దేహాన్నే మనంగా ఊహించుకుంటూ జీవిస్తున్నాం.

కానీ నిజానికి మన తత్వం ఏమిటి? మనమేమిటి?....................... అని ఆలోచిస్తే ఎప్పుడు మనలో 'నేను' అనే తలంపు ఒకటి మెదులుతుంటుంది. ఈ దేహం పుట్టినప్పటి నుంచి మరణించేవరకు ఆ తలంపు మనల్ని వీడదు. ఆ 'నేను' అనే తలంపు ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకునేందుకు ధ్యానంలో విచారాణ ప్రారంభిస్తే, అది ఆఖరున ఆత్మలో లయమవుతుందంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆత్మ మన సహజ స్థితి, నిత్యానంద స్థితి, ఆత్మయే మనం. ఈ శరీరంలో ఆత్మ ఉండడం కాదు, ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఆ ఆత్మయే మనం. ఆత్మకు పరిమితి లేదు, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఈ లోకంలో ఆత్మ తప్ప మరొకటిలేదు.

ఈ ఆత్మ తత్వమే సనాతన భారతీయ సంస్కృతిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపింది. ప్రపంచంలో ఇతర మతాలు అశాశ్వతమైన ఈ శరీరం గురించి చెప్తే, మన ధర్మం సనాతనమైన ఆత్మ తత్వం గురించి ప్రపంచానికి చెప్పింది. మానవజన్మకు సార్ధకత/ నిర్యాణం/ మోక్షం లభించాలంటే ఆత్మ తత్వం అర్దమవ్వాలి. అటువంటి ఆత్మ తత్వం(మన తత్వం) గురించి మనకు సంపూర్ణంగా తెలియజేస్తుంది కనుక అమ్మను సరస్వతీ దేవిగా ఆరాధిస్తాం.
Read More

శరన్నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది

శరన్నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.

అష్టమికి ఉన్న ప్రత్యేకత ఎమిటి అంటే ఎప్పుడైనా సరే అమ్మవారిని ఆరాధించాలి కొన్ని ప్రత్యేకమైన తిధులు ఉన్నాయి...అవి అష్టమి,నవమి,చతుర్దశి, అమావాశ్య,పౌర్ణమి, ఈ తిధులను పంచమహాపర్వములు అని అంటారు, వీటిలో ఇప్పుడు అష్టమి అంటే మహాపర్వము అని అర్ధము.ఈ తిధులలో అరాధిస్తే అమ్మ ప్రీతి చెందుతుంది. కాని శరన్నవరాత్రులలో సప్తమి తో కూడిన అష్టమి పనికిరాదు. సూర్యోదయానికి అష్టమి తిధి ఉండాలి.

అశ్వినస్య చితాష్టమ్యాం అర్ధరాత్రేతు పార్వతి
భద్రకాళి సముత్పన్నా పూర్వాషాడః సమాయుతే
తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయగ్న వినాసిని
ప్రాతుర్భూతా మహాఘోర యోగిని కోటివిస్సః

ఆశ్వియుజ శుద్ధ అష్టమి అర్ధరాత్రి వేళ అమ్మవారు భద్ర కాళి రూపేణ ఆవిర్భవించింది.

భద్రకాళి అంటే దక్షయగ్న వినాసనం కోసం, శివుని జటాజూటం నుండి వీరభద్రుని తో పాటు ఉద్భవించినటువంటి అమ్మ ! నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనిసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.

అష్టమి , నవమి తిధుల యందు అమ్మని దుర్గ గా , కాళి స్వరూపేణ పూజలు అందుకుంటుంది

సర్వవర్ణాల వారు ,సర్వ మతాల వారు , సకల జనుల వారు, సకల జనులు నిరభ్యంతరముగా ఉపాసించదగిన దేవత ఈ అమ్మ....దుర్గమ్మ! ఈ తల్లి సర్వజీవ అంతర్యామి. సంకటనాశిని. జగన్మాత, స్త్రీ, పురుష వయో భేదం లేకుండా సర్వులు ఉపాసించవలసిన పరాదేవత ఈ దుర్గమ్మ..

కామ బీజ స్వరూపిణి మహాకాళిగా, మాయా బీజ స్వరూపిణి మహాలక్ష్మిగా, వాగ్బీజ స్వరూపిణి మహాసరస్వతిగా దుర్గాదేవిని ధ్యానిస్తూ షట్కోణ సంయుక్తా అష్టదళ పద్మ - చతుద్వింశతి పత్రక - భూగృహ సమాయుక్త......ఇలాగ దుర్గమ్మను ధ్యానిస్తూ ఆరాధన చెయాలి.

సాలగ్రామములో కాని, మంగళకలశములో కాని, శ్రీ చక్రయంత్రములో కాని, దేవి ప్రతిమలో గాని, బాణ చిహ్నములో కాని, సూర్యుడిలో కాని....ఇలాగ ఎవరి ఆచారవిధానములబట్టి.....అమ్మ ని ఉపాసన చేయాలి.

జయాది శక్తియుతమైన పీఠములో దుర్గాదేవిని నిలిపి తూర్పు కోణములో సరస్వతి సమేత బ్రహ్మను, నైఋతి కోణములో లక్ష్మి సమేత మహా విష్ణువుని, వాయువ్య కోణములో పార్వతి సమేత పరమేశ్వరుడిని, దేవికి ఉత్తరముగా సింహాసనము, దక్షిణముగా మహిషాసురుడిని నిలిపి అర్చన చెయ్యాలి.

అనంతరం అష్టదళాలలో వరుసగా బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారహి, నారసిమ్హ, ఐంద్రి, చాముండికా రూపాలని ఆహ్వానించి అర్చన చెయ్యాలి.

దుర్గా స్తోత్రములు, అష్టొత్తరముతో పూజించాలి.

ఇలాగ మన శక్తి మేరకు అమ్మని పూజించి, ఆవిడ అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నించాలి....

అమ్మని ఆరాధించడం వల్ల సర్వరోగాలు, సర్వ భయాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు లభిస్తాయి. ధైర్యం వృద్ధి చెందుతుంది. దుఃఖం నశించి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తాయి..
Read More

అమ్మలందరికీ అమ్మ

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చినయమ్మ తన్ను లో
నమ్మినవేల్పుటమ్మలమనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వకవిత్వపటుత్వ సంపదల్

తాత్పర్యము: అమ్మలందరికీ అమ్మ, లక్ష్మి, సరస్వతి, పార్వతులకు మూలమైన అమ్మ, అందరమ్మలకన్నా అధికురాలైన అమ్మ, రాక్షసుల తల్లుల కడుపులకు చిచ్చుపెట్టి (రాక్షస సంహారం ద్వారా), తనను మనసులో నమ్ముకున్న దేవతల తల్లుల మనములలో నిలిచియుండే అమ్మ, దయాసాగరి అయిన మా దుర్గాదేవి నాకు మహత్తు కలిగిన కవిత్వ, పటుత్వ సంపదలనిచ్చు గాక!

ప్రథమ స్కంధములోని ప్రార్థన పద్యాలలో అత్యంత ప్రజాదరణ పొందినది ఈ అమ్మలగన్నయమ్మ. ఆ ఆదిపరాశక్తిని నుతిస్తూ పోతనగారు ఆమె అపార కరుణారస వృష్టి ద్వారా తనకు ఎంతో మహత్తు కలిగిన దృఢమైన కవితా సంపద కలగాలని వేడుకున్నారు. పోతన భాగవతంలో పదశోభ మువ్వల గజ్జెలా గంగా ప్రవాహంలా అత్యంత రమణీయంగా ఉంటుంది. పద్యము మొత్తం అమ్మ శబ్దంతో నింపిన పోతనగారు జగజ్జనని మహాత్మ్యాన్ని ఉత్పలమాలలో మనకు అందించారు
Read More

మహిషాసుర మర్దిని


మహిషాసుర మర్దిని

పూర్వము దేవాసురులకు శతవర్షములు ఘోరమగు పోరు జరిగెను. దేవతలకు ఇంద్రుడు, రక్షసులకు మహిషాసురుడు నాయకత్వము వహించిరి. మహా పరాక్రమ సంపన్నులగు రాక్షసుల ముందు దేవసైన్యము పటాపంచలై పోయెను. దేవతలను జయించిన అనంతరము మహిషాసురుడు ఇంద్రపదవిని అధిష్ఠించెను. పరాభూతులైన దేవతలు త్రిమూర్తులకడ కరిగి తమకు సంభవించిన దుస్థితిని సవిస్తరముగా ఎరిగించిరి. దురాత్ముడగు మహిషాసురుని పాలనలో దేవతలెట్లు మర్త్యులవలె సంచరించవలసి వచ్చినదో తెలిపి శరణుకోరిరి. దేవతల దీనాలాపములు విని విష్ణుమూర్తి, శివుడు కోపఘూర్ణితనేత్రులైరి. వారి ముఖములు భయంకరములయ్యెను. వారి వదనముల నుండియు, ఇంద్రాది దేవతల శరీరములనుండియు మహాతేజస్సు వెలువడెను.

ఇట్లు వెలువడిన తేజోరాశి అంతయూ కలిసి ఒక స్త్రీ రూపమును ధరించెను. శివుని తేజస్సు ఆమె ముఖముగా రూపొందెను. విష్ణుమూర్తి తేజస్సు బాహువులుగాను, బ్రహ్మ తేజస్సు ఆమె పాదములుగునై శుభమూర్తియగు దేవిగా రూపొందెను. శివుడు ఆమెకు శూలము నిచ్చెను. విష్ణువు చక్రమును ప్రసాదించెను. ఇంద్రుడు వజ్రాయుధమును సమకూర్చెను. వరుణుడు పాశము నిచ్చెను. బ్రహ్మదేవుడు ఒక అక్షమాలను, కమండలువును ఇచ్చెను. హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చెను. ఇట్లు సర్వదేవతలచే ఆయుధ భూషణాదులు సమర్పింపబడి ఆ దేవి మహాట్టహాసము చేసెను.

దేవతలు పరమానందంతో ఆ సింహవాహన మెక్కి అసురవధకై బయలుదేరగానే జయ జయ నాదములు చేసిరి. త్రిలోకములను గడగడలాడించిన అసుర సైన్యమునకు దేవికి యుద్ధము ఆరంభమయ్యెను. మహిషాసురుని పక్షమున అతని సేనానియగు చిక్షురుడును, చతురంగబల సమేతముగా సమరస్థలికి కదలివచ్చెను. ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడు మున్నగు సురారులు యుద్ధములో పోరాడారు. దేవిని చంపుటకై వారు ఆమెను ఖడ్గములతో కొట్టిరి. చండికాదేవి వారి శస్త్రాస్త్రములను అవలీలగా ఖండించి వేసెను. దేవి వాహనమైన సింహము జూలు విదిల్చుచూ దావాగ్నివలె అసుర సైన్యమును నాశనమొనర్చెను. దేవి త్రిశూలముతోనూ, గదతోను రాక్షసులను వధించెను. సమరాంగణమంతయు ఖండములైన మొండెములతో, చేదింపబడిన శిరస్సులతో, తెగిపోయిన బాహువులతో భీభత్సముగా ఉండెను. మహిషుని సేనానియగు చిక్షురుడు అంబికపై ఆగ్రహముతో యుద్ధమునకు వచ్చెను. మేరు పర్వతము పై వర్షము కురిసినట్లు దేవి వానిపై బాణ వర్షము కురిపించి వాని సారధిని చంపి, చిక్షురుని శరీరమును బాణములతో గ్రుచ్చి వైచెను. సర్వ రాక్షస సైన్యము హతమయ్యెను.

అనంతరం మహిషాసురుడు తనగిట్టలతో భూతలమును దద్ధరిల్లునట్లు చేసి, కొమ్ములతో పర్వతములను ఎగురవైచుచు, భయంకరమైన రంకెలు వేయుచు దేవిని ఎదుర్కొనెను. తన పైకి వచ్చిన మహిషుని దేవి తన పాశముతో బంధించెను. వాడు అంత తన మహిషరూపము విడి సింహరూపము ధరించెను. అంబిక దాని శిరస్సును ఖండించి వైచెను. వెంటనే అతడు ఖడ్గహస్తుడైన మానవ రూపము ధరించెను. తత్ క్షణమే ఆ పురుషుని చేదించెను. అతడు వెంటనే పెద్ద ఏనుగు రూపమును ధరించెను. చండిక ఆ గజము యొక్క తొండమును ఖండించి వేసెను. ఆ మహాసురుడు తన మహిషరూపమును మరల దాల్చి ముల్లోకములను తల్లడిల్ల చేసెను. అప్పుడు జగన్మాతయగు చండిక క్రోధముతో "ఓరీ మూఢుడా! మరియొక క్షణములో నీకు అంతము తప్పదు." అని గర్జించుచు ఆ మహాసురునిపై విజృంభించి పాదముతో అతని కంఠమును త్రొక్కిపట్టి శూలముతో వానిని పొడిచెను. అతడు దేవి పాదము క్రింద చిక్కుకుని తన మహిష ముఖములో నుండి యధార్థ స్వరూపముతో సగము వెలువడెను.ఇట్లు సగము వెలువడి తన నిజ రూపముతో పోరాడుచున్న ఆ మహిషాసురుని శిరశ్చేద మొనర్చి కూల్చి వేసెను. దేవగణ మంతయు పరమ హర్షముతో దేవిని స్తుతించిరి.

సర్వదేవతా సమారాధితయగు దేవి అమంగళములను నశింపజేసి భక్తులకు మోక్షమును ప్రసాదించు జగన్మాత. ఆమె చరితము అద్భుతము.
 
https://fbcdn-sphotos-a-a.akamaihd.net/hphotos-ak-frc3/q71/1380658_459230350864137_1708100241_n.jpg
Read More

దేవీ భాగవత శ్రవణ/పఠన ఫల౦:

దేవీ భాగవత శ్రవణ/పఠన ఫల౦:

పూర్వం ఋతవాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు. అతనికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతీ నక్షత్ర గండాంతకాలంలో జన్మించడం వల్ల కొడుకు పుట్టినప్పటి నుంచి వారు వ్యాధి పీడితులయ్యారు.
కుపుత్రేణాన్వయో నష్టో జన్మ నష్టం కుభార్యయా!
కుభోజనేన దివసః కుమిత్రేణ సుఖం కుతః!!
కుపుత్రుడి వల్ల వంశం, కుభార్య వల్ల జీవిత౦, కుభోజనం వల్ల దివసం, కుమిత్రుడివల్ల సుఖం - నశిస్తాయని అన్నారు పెద్దలు.

వారు పుత్రుని గురించి ఇలా దుఃఖిస్తున్న సమయంలోఅక్కడికి గర్గ మహర్షి వచ్చారు. ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు? శాంతి ఏమిటి? అని అడిగాడు ఋతవాక్కు. అప్పుడు గర్గుడు ఇలా అన్నాడు - రేవతీ నక్షత్ర గండాంతకాలంలో జన్మించడం వల్ల దుశ్శీలుడు అయ్యాడు. అదే మీ ఆదివ్యాధులకు కారణం ఈ దుఖం ఉపశామించాలంటే దుర్గాదేవిని ఉపాసించండి అని చెప్పి సెలవు తీసుకున్నాడు. దుర్గను ఉపాసించడం వల్ల కుపుత్రుడు సుపుత్రుడుగా మారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. రేవతీ నక్షత్రం మీద కోపంతో నేలకు రాలిపోమ్మని ఋతవాక్కు శపించాడు. వెంటనే రేవతీ నక్షత్రం కుముదాద్రి మీద పడింది. అప్పటి నుంచీ ఆ పర్వతం రైవతాద్రి అయ్యింది. ఆనక్షత్ర తేజస్సునుంచి కన్యకామణి ఆవిర్భవించింది. దీనిని ప్రముచుడు అనే మహర్షి చూసి రేవతి అని నామకరణం చేసి పెంచుకున్నాడు. ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తరువాత వరాన్వేషణ ప్రారంభించాడు. అగ్నిదేవుణ్ణి స్తుతించాడు. దానికి ఆయన ఇలా అన్నాడు - దుర్దముడనే రాజు మీ అమ్మాయికి తగిన వరుడు. దైవవశాత్తు అదే సమయానికి దుర్దముడు వేటకోసం అడవికి వచ్చి ఆశ్రమానికి వచ్చాడు. రాజలక్షణాలతో వినయ విధేయతలతో విరాజిల్లుతున్న దుర్దముణ్ణి చూసి ఆప్యాయంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేస్తూ నీ భార్య క్షేమం గురించి అడగను ఎందుకంటే ఆఅమ్మాయి ఇక్కడే ఉంది కనుక అని అన్నాడు.

అప్పడు దుర్దముడు అంతా కుశలమే. నా భార్య ఇక్కడే ఉంది అంటున్నారు ఎవరావిడ? అని అడిగాడు. రేవతి గురించి చెప్పాడు ప్రముచుడు.. తన వివాహ విషయం తెలుసుకున్న రేవతి తనకు రేవతీ నక్షత్రంలోనే వివాహం జరిపించమని కోరింది. ఆమె కోరికపై ప్రముచుడు తన తపశ్శక్తితో నక్షత్రవీధిలో మరో రేవతిని సృష్టించి అదే ముహూర్తంలో వారిరువురికీ వివాహం జరిపించాడు. ఏమి కావాలో కోరుకొమ్మని అల్లుణ్ణి అడిగాడు. అప్పుడు దుర్దముడు నేను స్వయంభూ మనువంశంలో జన్మించాను. కనుక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేట్లు వరం ఇయ్యి అని అభ్యర్ధించాడు. అయితే దుర్దమా! దేవీభాగవతం విను. నీకు అలాంటి పుత్రుడు జన్మిస్తాడు అన్నాడు ప్రముచుడు. రేవతిని తీసుకొని రాజధానికి చేరుకొని ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు.

కొంతకాలానికి ఒకనాడు లోమశమహర్షి రాజధానికి వచ్చాడు. రాజు ఎదురువెళ్ళి అతిథిమర్యాదలు జరిపి దేవీభాగవతం వినాలనే కోరికను మహర్షికి తెలియజేశాడు. లోమశుడు సంతసించి అభీష్ట సిద్ధి కలుగుతుంది అని ఆశీర్వది౦చి ఒక శుభముహూర్తాన పురాణ శ్రవణం చేయించాడు. రేవతీ సహితుడై దుర్దముడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. రేవతి గర్భం ధరించి లోక కళ్యాణ కారకుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. రైవతుడు అని నామకరణం చేసి ఉపనయనాది సంస్కారములు జరిపించి గురుకులంలో వేద శాస్త్రాలు అధ్యయనం చేయించాడు. ధనుర్విద్యా పారంగతుడు అయ్యాడు రైవతుడు. బ్రహ్మదేవుడు రైవతుని యోగ్యతలు గుర్తించి మన్వంతరాధిపతిని చేశాడు.ఈ పురాణాన్ని వినడ౦ వల్ల కలిగే పుణ్యఫల౦ అన౦తమన్నాడు సూతుడు. దేవీ అ౦శలేని పదార్థ౦ లేదు. ప్రాణి లేదు..అటువంటి చండికను నవరాత్ర దీక్షతో ఆర్చిస్తే మహాపాతకాలను౦చి కూడా విముక్తి లభిస్తు౦ది. సుఖ స౦తోషాలు వర్ధిల్లుతాయి
Read More

శ్రీ లలితా పంచరత్నమ్

శ్రీ లలితా పంచరత్నమ్

ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం
బిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్|
ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం
మన్దస్మితం మృగమదొజ్జ్వలఫాలదేశమ్||౧||

దొండ పండు వంటి క్రింది పేదవి, పేద్ద ముత్యముతొ శొభించు చున్న ముక్కు, చేవులవరకు వ్యాపించిన కన్నులు, మణి కుండలములు, చిరున్నవ్వు,
కస్తూరి తిలకముతొ ప్రకాశించు నుదురు కలిగిన లలితా దేవి ముఖారవిందమును ప్రాతః కాలమునందు స్మరించుచున్నాను.

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాఙ్గుళీయలసదఙ్గుళిపల్లవాఢ్యామ్|
మాణిక్యహేమవలయాఙ్గదశొభమానాం
పుణ్డ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్||౨||

ఏర్రని రత్నములు కూర్చిన ఉంగరములు ధరించిన వ్రేళ్లు అను చిగురుటాకులు కలదీ, మాణిక్యములు పొదిగిన కంకణములతొ శొభించుచున్నదీ,
చేరకువిల్లు-పుష్పబాణము-అంకుశము ధరించినదీ అగు లలితాదేవి భుజములను కల్పలతను ప్రాతః కాలమునందు సేవించుచున్నాను.

ప్రాతర్నమామి లలితాచరణారవిన్దం
భక్తేష్టదాననిరతం భవసిన్ధుపొతమ్|
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాఙ్కుశధ్వజసుదర్శనలాఞ్ఛనాఢ్యమ్||౩||

భక్తులకొరికలను ఏల్లప్పుడు తీర్చునదీ, సంసార సముద్రమును దాటించుతేప్పయైనదీ, బ్రహ్మ మొదలగు దేవనాయకులచే పూజింపబడునదీ,
పద్మము-అంకుశము-పతాకము-చక్రము అను చిహ్నములతొ ప్రకాశించుచున్నదీ అగు లలితాదేవి పాదపద్మమును ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.

ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యన్తవేద్యవిభవాం కరుణానవద్యామ్|
విశ్వస్య సృష్టివిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్||౪||

వేదాంతములచే తేలియబడు వైభవము కలదీ, కరుణచే నిర్మలమైనదీ, ప్రపంచము యొక్క సృష్టి-స్థితి-లయలకు కారణమైనదీ,విద్యలకు అధికారణీయైనదీ,
వేద వచనములకు మనస్సులకు అందనిదీ, పరమేశ్వరియగు లలితాభవానీ దేవిని ప్రాతః కాలము నందు స్తుతించుచున్నాను.

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి|
శ్రీశామ్భవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి||౫||

ఒ లలితాదేవి| కామేశ్వరి-కమల-మహేశ్వరి-శ్రేఏశాంభవి-జగజ్జనని-వాగ్దేవత-త్రిపురేశ్వరి అను నీ నామములను ప్రాతఃకాలము నందు జపించుచున్నాను.

యః శ్లొకపఞ్చకమిదం లలితామ్బికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే|
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనన్తకీర్తిమ్||౬||

సౌభాగ్యము నిచ్చునదీ,సులభమైనదీ అగు లలితా పంచరత్నమును ప్రాతఃకాలము నందు ఏవడు పఠించునొ వానికి లలితాదేవి శీఘ్రముగా
ప్రసన్ను రాలై విద్యను,సంపదను,సుఖమును,అంతులేని కేఏర్తిని ప్రసాదించును.

శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమఃhttps://fbcdn-sphotos-f-a.akamaihd.net/hphotos-ak-frc3/q71/s720x720/1374101_459325960854576_1157990541_n.jpg
Read More

రావణాసురుని శ్రీరాముడు పదితలలను నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు


దసరా అంటే దన్+హరా అని; అంటే సీతాపహరణ గావించిన రావణాసురుని శ్రీరాముడు పదితలలను నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని "దసరా వైభవం" గా దశమినాడు జరుపుతూ ఉంటారు.

ఇక దేవినవరాత్రి పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. "అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే "ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు 'దేవీనవరాత్రుల'ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.

ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త 'దశమి' తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు "దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞలు.

ఈ దేవి నవరాత్ర్యుత్సవాలు జరపడంల్లోకూడా మంచి అంతరార్థం ఉన్నదట! శరదృతువుకు ముందు వర్షరుతువు ఉంటుంది. బహుళంగా కురిసిన వానలవల్ల, చీమలు, దోమలు, కీటకాలు పెరుగుతాయి. ఈ ఋతువులో ప్రజలు రోగబాధలతో మరింతగా బాధపడుతూ ఉంటారు. వీటికి "యమదంష్ట్రము"లని పేరు. దేవి మహిషాదిజంతువులను జయించడంల్లో అంతరార్థమిదే అని దేవీభాగవతం చెప్తోంది. కావున ఆరోగ్య ప్రాప్తికి ఈ రెండు రుతువులలోను నవరాత్ర్యుత్సవం జరుపవలెనని పేర్కొంది.
 
 http://www.salagram.net/ram-vijay10.jpg
 
Read More

శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అల౦కారాలలో చివరి రూప౦ శ్రీ రాజరాజేశ్వరీ దేవి.

రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా
రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితా

శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అల౦కారాలలో చివరి రూప౦ శ్రీ రాజరాజేశ్వరీ దేవి.
సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి. లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలి౦చేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలి౦చే దేవతను రాజ రాజేశ్వరిగా పిలుస్తారు.
రాజు అనగా ప్రకాశి౦చుచూ ఆన౦ది౦ప చేయువాడు. లోకాలన్నిటికీ వెలుగునిచ్చే సూర్యునికి కూడా వెలుగునిచ్చే స్వయ౦ ప్రకాశ స్వరూపిణి. ఆన౦దానికి మూలమైన సర్వలోక పాలకురాలు ఈమె.

మనోరూపేక్షు కోద౦డా ప౦చతన్మాత్ర సాయకా

ఆమె చేతిలోని చెరకుగడ మనస్సును సూచిస్తు౦ది. పాశ౦, అ౦కుశ౦, రాగద్వేషాలను సూచిస్తు౦ది. మనలోని రాగద్వేషాలను తొలగి౦చే తల్లిగా మన౦ చెప్పుకు౦టూ ఉ౦టాము.

ఈ అవతార౦లో అమ్మ ఒక చేతిలో చెరకుగడ, మరియొక చేతితో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శన౦ ఇస్తు౦ది. చెరకు రసం అత్మజ్ఞానమును సూచిస్తుంది. దుష్టులను, దురహ౦కారులను, శిక్షి౦చుటకు అ౦కుశ౦, పాశ౦ ధరి౦చి ఉ౦టు౦ది. ఆమె ప్రశా౦తమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. అనేక

కల్పములలో ఎ౦తోమ౦ది రాక్షసులను స౦హరి౦చిన౦దువలన ఈమెను అపరాజితా దేవిగా ఆరాధిస్తారు. రాజరాజేశ్వరీ దేవి జ్ఞాన స్వరూపిణి. రాజ రాజేశ్వరీ దేవి అల౦కార ప్రియురాలు కావడ౦ వల్ల వజ్రాభరణాలను, పెద్ద కర్ణాభరణములను, భుజములకు రత్నములచే చేయబడిన ఆభరణములతో అల౦కరి౦పబడి ఉ౦టు౦ది.

ఈమె శ్రీ చక్రమునకు అధిష్టాన దేవత. మణిద్వీప శ్రీ నగర స్థిత చి౦తామణి గృహ నివాసిని. అక్కడ తన పరివారముతో కూడి మహాకామేశ్వరుని అ౦కము నిలయముగా చేసుకొని ఉ౦టు౦ది.

ఈమెకు నైవేద్య౦గా సాత్వికమైనవి ఏమైనా పెట్టవచ్చు. ఎన్ని రకాలు పెడతామో అన్ని రకాలు ధాతుపుష్టి లభిస్తు౦ది. ప్రత్యేక౦గా చెప్పుకోవాలి అ౦టే పూర్ణ౦బూరెలు పెట్టవలెను. పూర్ణ౦బూరెలు పూర్ణత్వాన్ని ఇస్తాయి.
ఆ ఋతువులో సమకూరే సర్వకుసుమాలు పూజకు అర్హమే. అంతే కాక సుగ౦ధ పత్రాలను కూడా పూజకు వాడవచ్చు
Read More

దుర్గాష్టమి విశిష్టత.....

దుర్గాష్టమి విశిష్టత.....

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.

పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు.

మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.

తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు.

వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతున్నారు.
Read More

శ్రీ పరాశర మహర్షి పెట్టిన నియమము :


శ్రీ పరాశర మహర్షి పెట్టిన నియమము :

ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకము "

ఆంజనేయం మహావీరం ! బ్రహ్మ విష్ణు శివాత్మకం !
అరుణార్కం ప్రభుం శమథం ! రామదూతం నమామ్యహం 1".

మనము ఎన్ని ప్రదక్షిణలు చేయదలుచుకున్నను, ప్రతి ప్రదక్షిణము తరువాత ఒక చోట ఆగి పై శ్లొకం చెప్పుకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను. వేరే ఏ శ్లొకములు చెప్పు కొరాదట.

ఏ గుడిలొనైనను ప్రదక్షిణలు చేసేటప్పుడు, ఒక తొమ్మిది నెలల గర్భిణి స్త్రీ ఎంత నిధానముగ నడుస్తుందో అంత నిధానముగ చేయాలి కాని, అంతకు మించిన వేగముతొ చేయరాదు. ఎన్ని ప్రదక్షిణలు చేసామో లెక్కపెట్టుకోడానికి, వక్కలు, పసుపు కొమ్ములు లేక బియ్యము కాని వినియోగించుకోవాలి తప్ప వేళ్ళతో లెక్కపెట్టొకొవడము, పేపర్ మీద గళ్ళు వేసుకుని పెన్సిల్తో గుర్తు పెట్టుకోడము లాంటివి కూడదు.

మూల విరాట్టుకు అభిముఖముగ నిలబడి నమస్కరించకూడదు. ప్రక్కకు నిలబడి నమస్కారము చేసుకోవాలి. ఒకవేళ ప్రక్కకు నిలబడినప్పుడు మనము దక్షిణ దిక్కుకు అభిముఖముగ నిలబడ వలసి వస్తే కొద్దిగా పక్కకు తిరిగి నమస్కారము చేసుకోవాలి కాని దక్షిణ దిక్కుకు అభిముఖముగా నమస్కారము చెయరాదు - శ్రీ చాగంటి గారి " హనుమ వైభవము " ప్రవచనము
Read More

భక్తి సమాచారం : తలస్నానం ఏరోజు చేయాలి?

భక్తి సమాచారం
తలస్నానం ఏరోజు చేయాలి?

ఈకాలంలో ఎప్పుడంటే అప్పుడు తలస్నానం చేస్తున్నాం. చాలామంది ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారు. అయితే మన పూర్వీకులు ప్రతి పనికీ కొన్ని నియమాలు, నిర్దేశాలు చేసినట్లే అభ్యంగన స్నానానికి కూడా ఒక సూత్రీకరణ చేశారు. హిందువులు ఎప్పుడు తలస్నానం చేయాలో, చేస్తే మంచిదో ధార్మిక గ్రంధాలలో నిర్దేశించడం వల్ల అది ఒక ఆచారంగా కొనసాగుతోంది.
హిందూ ధర్మశాస్త్రాలను అనుసరించి, స్త్రీలు శుక్రవారంనాడు తలస్నానం చేయడం శ్రేష్టం. పురుషులు శనివారంనాడు తలంటి పోసుకోవడం ఉత్తమం. ఈ మాట అనేక ధర్మగ్రంధాల్లో, అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. ఇటువంటి ఋషిప్రోక్తం అయిన అంశాలను హిందువులు తరతరాలుగా సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఆడవాళ్ళు శుక్రవారంనాడు అభ్యంగనస్నానం ఆచరించడం అలవాటుగా మారింది.
స్త్రీలు శుక్రవారంనాడు, పురుషులు శనివారంనాడు అభ్యంగనస్నానం ఆచరించడం వెనుక ఏమైనా శాస్త్రీయత ఉన్నదా, ప్రత్యేక లాభాలు ఏమైనా ఒనగూరుతాయా అనే సంగతి ఇప్పుడు చూద్దాం.
అభ్యంగనస్నానం చేసేముందు శరీరమంతా నువ్వులనూనె రాసుకుని మర్దన చేసుకోవడం ఆచారంగా వస్తోంది. అలా నూనె రాసుకుని కొంతసేపు ఎండలో కూర్చుని, ఆ తర్వాతే తలంటు చేసే అలవాటు ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ఇలా చేయడంవల్ల సూర్యకాంతిలో ఉండే నీలవర్ణం (Blue Colour) శుక్రగ్రహానికి అనుకూలమైన రంగు కనుక, అది గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే పురుషులు శనివారంనాడు చేయడంవలన ఊదారంగుతో కూడిన నీలం రంగు (Indigo Colour) సత్ఫలితాలను ఇస్తుంది.
స్త్రీపురుషుల శరీర నిర్మాణక్రమంలో సహజంగానే కొన్ని తేడాలు ఉన్నాయి. వాటిప్రకారం స్త్రీలకు మామూలు నీలిరంగు, పురుషులకు ఊదారంగుతో కూడిన నీలం మేలు చేస్తాయి. కలర్ థెరపీ ప్రకారం చూస్తే ఇందులో సత్యం కనిపిస్తుంది.
అభ్యంగనస్నానం మాదిరిగానే గృహప్రవేశం, పెళ్ళి, వ్యాపారం, ఉపనయనం మొదలైనవాటిక్కూడా ఒక్కోదానికీ ఒక్కో వారాన్ని నిర్దేశించారు. ఆ రోజుల్లోనే ఎందుకు చేయాలి.. ఇతర రోజుల్లో చేస్తే ఏమౌతుంది అని వితండవాదానికి పొతే అందుకు తగ్గట్లే దుష్పరిణామాలు ఎదురౌతాయి.
Read More

దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ(అశ్వనీ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తే అది ఆశ్వీయుజ మాసమౌతుంది.) శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు

విజయదశమి (దసరా)
దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ(అశ్వనీ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తే అది ఆశ్వీయుజ మాసమౌతుంది.) శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు. ఈ నవరాత్రుల లో దుర్గమ్మ ని తొమ్మిది విధాలుగా అంటే బాలాత్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీలతా త్రిపురసుందరి, దుర్గ, మహిషాసురమర్థిని, రాజరాజేశ్వరిగా భావించి విభిన్నమైన అలంకారాలతో అర్చిస్తారు. పదవ రోజు విజయదశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు.

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.

విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి.అర్జునుడు కూడా విజయదశమి రోజునే ఉత్తర గోగ్రహణంలో విజయాన్ని పొందాడనీ తెలస్తున్నది.

'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.
తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||


పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

మహిషాసురమర్ధిని

బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.

శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది.


https://fbcdn-sphotos-e-a.akamaihd.net/hphotos-ak-prn2/q71/1381227_593569414035579_2065650232_n.jpg
Read More

శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అల౦కారాలలో చివరి రూప౦ శ్రీ రాజరాజేశ్వరీ దేవి.

రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా
రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితా

శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అల౦కారాలలో చివరి రూప౦ శ్రీ రాజరాజేశ్వరీ దేవి.
సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి. లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలి౦చేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలి౦చే దేవతను రాజ రాజేశ్వరిగా పిలుస్తారు.
రాజు అనగా ప్రకాశి౦చుచూ ఆన౦ది౦ప చేయువాడు. లోకాలన్నిటికీ వెలుగునిచ్చే సూర్యునికి కూడా వెలుగునిచ్చే స్వయ౦ ప్రకాశ స్వరూపిణి. ఆన౦దానికి మూలమైన సర్వలోక పాలకురాలు ఈమె.

మనోరూపేక్షు కోద౦డా ప౦చతన్మాత్ర సాయకా

ఆమె చేతిలోని చెరకుగడ మనస్సును సూచిస్తు౦ది. పాశ౦, అ౦కుశ౦, రాగద్వేషాలను సూచిస్తు౦ది. మనలోని రాగద్వేషాలను తొలగి౦చే తల్లిగా మన౦ చెప్పుకు౦టూ ఉ౦టాము.

ఈ అవతార౦లో అమ్మ ఒక చేతిలో చెరకుగడ, మరియొక చేతితో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శన౦ ఇస్తు౦ది. చెరకు రసం అత్మజ్ఞానమును సూచిస్తుంది. దుష్టులను, దురహ౦కారులను, శిక్షి౦చుటకు అ౦కుశ౦, పాశ౦ ధరి౦చి ఉ౦టు౦ది. ఆమె ప్రశా౦తమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. అనేక

కల్పములలో ఎ౦తోమ౦ది రాక్షసులను స౦హరి౦చిన౦దువలన ఈమెను అపరాజితా దేవిగా ఆరాధిస్తారు. రాజరాజేశ్వరీ దేవి జ్ఞాన స్వరూపిణి. రాజ రాజేశ్వరీ దేవి అల౦కార ప్రియురాలు కావడ౦ వల్ల వజ్రాభరణాలను, పెద్ద కర్ణాభరణములను, భుజములకు రత్నములచే చేయబడిన ఆభరణములతో అల౦కరి౦పబడి ఉ౦టు౦ది.

ఈమె శ్రీ చక్రమునకు అధిష్టాన దేవత. మణిద్వీప శ్రీ నగర స్థిత చి౦తామణి గృహ నివాసిని. అక్కడ తన పరివారముతో కూడి మహాకామేశ్వరుని అ౦కము నిలయముగా చేసుకొని ఉ౦టు౦ది.

ఈమెకు నైవేద్య౦గా సాత్వికమైనవి ఏమైనా పెట్టవచ్చు. ఎన్ని రకాలు పెడతామో అన్ని రకాలు ధాతుపుష్టి లభిస్తు౦ది. ప్రత్యేక౦గా చెప్పుకోవాలి అ౦టే పూర్ణ౦బూరెలు పెట్టవలెను. పూర్ణ౦బూరెలు పూర్ణత్వాన్ని ఇస్తాయి.
ఆ ఋతువులో సమకూరే సర్వకుసుమాలు పూజకు అర్హమే. అంతే కాక సుగ౦ధ పత్రాలను కూడా పూజకు వాడవచ్చు.https://fbcdn-sphotos-a-a.akamaihd.net/hphotos-ak-prn2/1376407_459683624152143_1616463316_n.jpg

Read More

దుర్గ అన్న నామమే పరమపవిత్రం.


దుర్గ అన్న నామమే పరమపవిత్రం.

దుర్గమాసురుడనే రక్షసుడిని సంహరించింది కనుక అమ్మను దుర్గా అని పిలుస్తాం.దుర్గ అంటే కష్టాలను తొలగించేదని, తెలుసుకునేందుకు కష్టమైనదని అర్దం.

దుర్గ అనే నామంలో 'ద'కారం దైత్యనాశనానికి, 'ర'కారం రోగనాశనానికి,
'గ' కారం జ్ఞానానికి సంకేతాలు. దైత్యులంటే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే. దైత్యులు నిత్యం మనసులో ఉద్భవిస్తునే ఉంటారు.


అహకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడి చేయడం, అబద్దాలు చెప్పడం, ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం, వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, యజ్ఞయాగదులను, అగ్నిహోత్రాలను విమర్శించడం, స్త్రీలను గౌరవించపఓవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం, జూదం, మధ్యపాన, ధూమపానం, వ్యబిచారం మొదలైనవి రాక్షస లక్షణాలు. హిరాణ్యాక్ష హిరణ్యకశ్యపుల దగ్గరి నుంచి మహిషాసురుడు, నరకాసుడు....... ఒక్కడేమిటి ప్రతి రాక్షసుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి. ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనశనం చేస్తాయి. ఇటువంటి రాక్షసలక్షణాలను తన ఉపసాకుల నుంచి తొలగిస్తుంది 'దుర్గా' నామంలో ఉండే 'ద'కారం.

పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితః అన్నారు. పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో రోగంగా పీడిస్తుంది. రోగం అంటే మానసిక, శారీరిక రోగాలు మాత్రమే కాదు, దురాశ, శోకం, కపటత్వం, కుళ్ళు, ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం, అవినీతి మొదలైనవి మనిషిని నిలువెల్లా దహించే భయానకరోగాలు. ఇవి వ్యక్తినే కాదు, మొత్తం సమాజానికి చేటు చేస్తాయి. దుర్గా నామంలో ఉండే 'ర'కారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది.

ఇక 'గ'కారం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధిచిన జ్ఞానమని ఎప్పుడు అనుకోకూడదు. సమస్తబ్రహ్మాండాలను తన సంకల్పమాత్రం చేత సృష్టించి, పోషించి, లయం చేయగలిగిన పరమేశ్వరిని మనకు, ఏది తెలుసుకుంటే ఇక అన్ని తెలుస్తాయో, దేన్నీ తెలుసుకోవడం వలన ఇక ఏదీ తెలుస్కునే పని ఉండడో, ఏది సనాతనమో, సత్యమో, నిత్యమో........... అటువంటి పరలోకపు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరంలేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది. మనం ఈ శరీరంకాదు, శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమని అనుభూతిని కలిగిస్తుంది.

ఈ విధంగా దుర్గా అన్న నామమే పరమశక్తివంతమైనది. ఇక అమ్మ వైభవం గురించి ఏమని చెప్పుకునేది? అమ్మ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఓం దుర్గాయై నమః
 
https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-prn2/q71/988307_459690324151473_229397794_n.jpg
Read More

శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు.

శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి

తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్‌||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

1 శైలపుత్రి : దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.

2. బ్రహ్మచారిణి : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

3. చంద్రఘంట : అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.

4. కూష్మాండ: నాలుగవ స్వరూప నామం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

5. స్కందమాత : అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.

6. కాత్యాయని : దుర్గామాత ఆరో రూపం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

7. కాళరాత్రి : దుర్గామాత ఏడో రూపం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

8. మహాగౌరి : ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

9. సిద్ధిధాత్రి : దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.
Read More

శ్రీ పరాశర మహర్షి పెట్టిన నియమము :


శ్రీ పరాశర మహర్షి పెట్టిన నియమము :

ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకము "

ఆంజనేయం మహావీరం ! బ్రహ్మ విష్ణు శివాత్మకం !
అరుణార్కం ప్రభుం శమథం ! రామదూతం నమామ్యహం 1".

మనము ఎన్ని ప్రదక్షిణలు చేయదలుచుకున్నను, ప్రతి ప్రదక్షిణము తరువాత ఒక చోట ఆగి పై శ్లొకం చెప్పుకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను. వేరే ఏ శ్లొకములు చెప్పు కొరాదట.

ఏ గుడిలొనైనను ప్రదక్షిణలు చేసేటప్పుడు, ఒక తొమ్మిది నెలల గర్భిణి స్త్రీ ఎంత నిధానముగ నడుస్తుందో అంత నిధానముగ చేయాలి కాని, అంతకు మించిన వేగముతొ చేయరాదు. ఎన్ని ప్రదక్షిణలు చేసామో లెక్కపెట్టుకోడానికి, వక్కలు, పసుపు కొమ్ములు లేక బియ్యము కాని వినియోగించుకోవాలి తప్ప వేళ్ళతో లెక్కపెట్టొకొవడము, పేపర్ మీద గళ్ళు వేసుకుని పెన్సిల్తో గుర్తు పెట్టుకోడము లాంటివి కూడదు.

మూల విరాట్టుకు అభిముఖముగ నిలబడి నమస్కరించకూడదు. ప్రక్కకు నిలబడి నమస్కారము చేసుకోవాలి. ఒకవేళ ప్రక్కకు నిలబడినప్పుడు మనము దక్షిణ దిక్కుకు అభిముఖముగ నిలబడ వలసి వస్తే కొద్దిగా పక్కకు తిరిగి నమస్కారము చేసుకోవాలి కాని దక్షిణ దిక్కుకు అభిముఖముగా నమస్కారము చెయరాదు - శ్రీ చాగంటి గారి " హనుమ వైభవము " ప్రవచనము
Read More

దుర్గాష్టకం

దుర్గాష్టకం

ఉద్వపయతునశ్శక్తి మాదిశక్తే ద్దరస్మితమ్ తత్వం యస్యమాహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయః

జ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్య్యమనవస్దీతిః

దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా

శివాభవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా

దృశ్యతేవిషయాకారా గ్రహణే స్మరణే చధీః
ప్రజ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్‌ ప్రదృశ్యతే

పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్‌ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః

వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణియతేపరా

భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః

ఫలశ్రుతి

యశ్చాష్టక మిదం పుణ్యం పాత్రరుత్థాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్.


https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-ash3/q71/1383350_459828264137679_1261577670_n.jpg
Read More

శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం


శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం

(Sri Rajarajeswari Ashtakam)అంబా శాంభవి చంద్రమౌళీ రబలా వర్ణా ఉమా పార్వతీ

కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీభైరవీ

సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరిఅంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సందాయనీ

వాణీ వల్లవపాణీ వేణు మురళీగాన ప్రియాలోలినీ

కళ్యాణీ ఉడు రాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణి

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరిఅంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి

జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ విరాజితా

వీణా వేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరిఅంబా రౌద్రాణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ

బ్రహ్మణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా

చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణి వల్లవీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరిఅంబా శూలధను: కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ

వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రామాసేవితా

మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరిఅంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా

గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా

ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరిఅంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా

యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ

యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళా మాలినీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరిఅంబా పాలిత భక్తి రాజి రనిశం అంబాష్టకం యః పఠే

అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా

అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి


https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-ash3/575685_459838060803366_1837588223_n.png
Read More

రాముడు పుట్టకముందు సంగతి

రాముడు పుట్టకముందు సంగతి. వరతంతు మహర్షి దగ్గర 14 ఏళ్ళు విద్యాభ్యాసం చేసిన కౌత్సుడు, తన గురువుగారికి అనేక విధాలుగా సేవలు చేస్తాదు. విద్యాభ్యాసం ముగిశాకా గురుదక్షిణ ఇస్తానని కౌత్సుడు అదిగినా, ఆయన గురుశుశ్రుషకు మెచ్చిన వరతంతు మహర్షి, కౌత్సుడు వద్ద నుంచి గురుదక్షిణ పుచ్చుకోవడానికి ఇష్టపడడు. కాదు, తీసుకోవలసిందేనని పట్టుబడతాడు కౌత్సుడు, బలవనతపడతడు. దాంతో గురువు, తన వద్ద 14 ఏళ్ళు వుద్యాభ్యాసం చేసినందుకు ప్రతిగా 14 కోట్ల బంగారు నాణేలు దక్షిణ అడుగుతాడు.

వాటి కోసం కౌత్సుడు రఘుమహారాజును ఆశ్రయిస్తాడు. కౌత్సుడు రఘుమహారజును ఆశ్రయించే సమయానికి, రఘుమహారాజు విశ్వజిత్ యాగం చేసి, మొత్తం రాజ్యాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తాడు. ఆయన ఇంద్రునిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఇంద్రుడు భయపడి సంపదను కురిపించమని కుబేరుడిని ఆజ్ఞాపించడంతో జమ్మి చెట్లున్న చోట కనకవర్షం కురిపిస్తాడు కుబేరుడు.

14 కోట్లకు మించి కురిపించినా, ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఆశించడు కౌత్సుడు. తాను బ్రహ్మచారినని, తనకు డబ్బు అవసరంలేదని చెప్పి, ఆ 14 కోట్ల బంగారు నాణేలను వర్తంతు మహర్షికి సమర్పిస్తాడు. మిగిలిన ధనం రఘుమహారాజు ముట్టుకొడు. అది తనది కాదని, కౌత్సుడి కోసం కుబేరుడు కురిపించాడని, అందువల్ల తాను స్వీకరించనని చెప్తాడు. ఇది భారతీయుల త్యాగబుద్ధికి, ధర్మనిరతికి సంకేతం. దాంతో మిగిలిన ధనాన్ని ప్రజలకు పంచేస్తారు.

~ పాండవులు 13 సంవత్సరాల వనవాసం తరువాత అజ్ఞాతవాసానికి వెళ్ళె ముందు జమ్మి చెట్టు మీద వారి ఆయుధాలను దాచి, అజ్ఞాతవాసం పూర్తయ్యాక వచ్చి ఈ చెట్టును పూజించి, దాని మీద ఉన్న ఆయుధాలను తీసుకున్నారు. వారు ఆ జమ్మి చెట్టును పూజించింది విజయదశమి రోజున. ఆ చెట్టు మీద పెట్టిన ఆయుధాలు ఆ దారిని వెళ్ళెవారికి పాముల్లా కనిపించేవి.

~ జమ్మిచెట్టును పూజించడం వెనుక రెండు యుగాలకు సంబంధించిన చారిత్రిక ఘట్టాలు మనకు కనిపిస్తాయి.

ఈరోజు శమివృక్షం వద్ద చదవలసిన శ్లోకం :

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ|
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనః||

జమ్మి చెట్టును ఈరోజున ఆరాధించడం చేత పాపం నశిస్తుందని,శత్రువులు నాశనమవుతారని అంటొంది శాస్త్రం.


https://fbcdn-sphotos-d-a.akamaihd.net/hphotos-ak-prn1/994344_459913957462443_1799590697_n.jpg
Read More

ఘటికా స్థానము


ఘటికాస్థానాలు అన్న పేరు ఒక కాలములో విద్యానిలయాలకు ఉండేవని కొందరికి తెలిసి యుండ వచ్చు. ఈ పదమును విపులీకరించి విషయ వివరణ చేసినవారు జగద్గురువు చంద్ర శేఖర యతీంద్రులు. ఈ విషయాన్ని గురించి నేను వ్రాయడం లోని ముఖ్య వుద్దేశ్యము పాశ్చాత్యుల ఎలుబడికి పూర్వము శిక్షణ వ్యవస్థ ఎట్లుండినది అన్న విషయం తెలియబరచుటకే.
అసలు ఘటిక అంటే చిన్న కుండ అని అర్థము.
పెద్దది చిన్నది
లత లతిక
దీపము దీపిక
ఘటము ఘటిక

మరి ఈ పదమునకు విద్యా స్థానముతో లంకె ఎట్లు కుదిరినది. ఘటిక లేక ఘడియ అంటే ఒక అర్థము 24 నిమిసముల కాలము కూడా ఔతుంది. మరి దేనిని అన్యైన్చుకోవలేనన్నది సమస్య. చంద్ర శేఖర సంయమీంద్రులు
ఈ విధంగా తెలియజేసినారు.
వ్యాసులవారు బ్రహ్మ సూత్రములను వ్రాసినారు.దానికి శంకరులవారు భాష్యము వ్రాసినారు. ఆ భాష్యానికి వార్తీకము(భాష్యమునకు భాష్యము )'భామతి' యన్న పేరుతొ వాచస్పతి మిశ్ర యన్న వారు వ్రాసినారు. దానిని మారులా 'కల్పతరు' అన్న పేరు తో అమలానండులవారు వ్యాఖానించితే దానిని ఇంకా చక్కగా విమర్శించిలక్ష్మీ నరసిమ్హులనువారు 'అభోగము' అన్న వ్యాఖ్యాన గ్రంథాన్ని వ్రాసినారు. గురువులు చంద్రశేఖర సమ్యమీంద్రులు 'అభోగము' చదివి ఆపై 'కల్పతరు' చదివినారు. అందులో వారికి 'ఘటికాస్తాన' ప్రయోగము కనపడింది.
ఆ గ్రంథములోని 'ఏతు శిఖా యజ్ఞోపవీత త్యాగరూప పారమహంస్య వృత్తీం న మన్యంతే తేన పశ్యన్తి ప్రత్యక్ష ఘటికా స్తానేషు పఠ్యమాన అధర్వణీమ్ శృతీమ్ -స శిఖః వపనం కృత్వా బహిః సూత్రం త్యజెద్భువః' అని వున్న ఆ వాక్యములో ఘటిక శబ్దము వినవచ్చింది. ఆ వాక్యము అర్థమేమిటంటే పరమహంస వృత్తిని అవలంబించేవారు శిరోముండనము , యజ్ఞోపవీత త్యాగము,చేయనక్కరలేదను మాటను తెలిపే అధర్వణ శృతిని ఘటికా స్థానములలో చెప్పు చుండుట వినలేదా అని అన్నారు.మనకు ఘటిక తో సంబంధము కావున ముందునకు నడచెదము. క్రీస్తు శకము 13 శతాబ్దములో(రామానుజుల వారికి 100-150 ఏండ్ల పిదప)వున్నా యదావ మహాదేవులకు అమలానండులవారు సమకాలీకులు. అంటే 13 వ శతాబ్దము లోనే ఘటికా స్తానములుండేవని
మనకు పై విషయము వల్ల తేటతెల్లమగుచున్నది.
క్రీ.శ.4వ శతాబ్దము లోనే కర్నాటక దేశపు రాజు మయూరవర్మ పల్లవేంద్ర పురమైన కంచిలోని ఘటికా స్థానములలో వీరశర్మ యను గురువుల వద్ద విద్యనభ్యశించినారని షిమోగా జిల్లా తలగుండ యనుచోట ప్రణవెస్వరస్వామి ఆలయములో కకుత్స వర్మ యను రాజు కాలమునకు చెందినా శిలా శాసనములో వున్నది. అంటే గురువు గారు తీగ కదిలించి ఎంత దూరము వెళ్ళినారో గమనించండి. మహనీయులు తలపెట్టిన కార్యమును అర్ధాన్తరముగా విడువరు. అందుకే భర్తృహరి సుభాషితముల తెలుగు సేత లో'ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ... ప్రారబ్ధార్థము నుజ్జగించరు' అని చెబుతూ, ఎందుకంటే 'ప్రాజ్ఞ్యా నిధుల్ గావునన్' అని చెప్పినారు.
కావున విశేషమైన విద్య సంపాదించాలంటే 1000,1500 మైళ్ళ దూరము గూడా భారమయ్యేది కాదు. ఈ విధమైన ఘటికలను రాజులు జయించినట్లు,కట్టించినట్లు కూడా ఇంకా ఎన్నో శాసనములు కలవు. ఏతా వాతా చెప్పదలచుకోన్నదేమిటంటే ఆ కాలము లోనే విద్యకంత గుర్తింపు వుండినది.
ఇపుడు క్రీస్తు శకము నుండి క్రీస్తు పూర్వమునకు పోయిన,శంకరులవారి కన్నా చాలా పెద్దవారు, శంకరుల చే శృంగేరి మఠ ప్రధమ పీఠాధిపతిగా శంకరుల వారిచేతనే నియమింపబడ్డ మండన మిశ్రులవారి (సన్యాస నామము సురేశ్వరాచార్యులు) ప్రధమ గురువులు కుమారిలభట్టు మాన్యవరులు 'తంత్రీ వార్తీకం' అన్న పుస్తకం వ్రాస్తే దాని వ్యాఖ్యాత యైన భట్ట సోమేస్వరులవారు ఘటికా స్థానాన్ని ఈ విధంగా నిర్వచించినారు .
"వేద కౌశల గిజ్ఞాసార్థం తత్తత్ వేద విభాగ చిహ్న లేఖ్యాని ఘటికాయాం కుంభకాయాం నిక్షిప్య తత్తత్ వేద విభాగ పరీక్ష కాలే తాన్యాకృష్య ఆకృష్య లేఖా చిహ్నితం వెదపాఠమ్ ఇత్యధ్యేతారః అనుయుజ్యంతే ఇతి ఘటికా మార్గవర్తినో అనుయోగః."

అంటే ఘటికలో జరిగే విద్యా వ్యాసంగాన్ని 'ఘటికా మార్గ వృత్తి'అని తెల్పినారు. అచ్చట జరిగే పరీక్షను మీమాంసను 'అనుయోగం' అన్నారు.

ఘటికలను (చిన్న కుండలను) ఉపయోగించి పరీక్షలను ఘటికలలో (విద్యా స్థానాలలో) జరిపేవారని సొమెశ్వరులు వివరించినారు. విద్యార్థుల వేద విద్యా కౌశలాన్ని పరీక్షించుటకు ఆయా వేద విభాగములను తెలిపే చీటీలు చుట్టగానో లేక మడిచియో వుంచి, పరీక్షార్థుల చేత అందులోనుండి ఒకటి తీయించి అందలి విషయమును మౌఖికముగా తెలుపగోరేవారు. ఘటికా స్తానములకా పేరు ఈ విధముగా కల్గినది.
ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఘటికలను విద్యా స్తానములలోనే కాక వేద మంత్రములచే చైతన్యమైన గోపురములపై కళశములుగా నూ ఘటాభిషేకాల లోనూ పూర్ణకుభము తో దేవాలయ స్వాగాతములకును వాడేవారని మనకు తెలుస్తున్నది. ఘటికలకు ఇంట ప్రాధాన్యత వుంది మరి.

ఈ ఘటికలు గోదావరి ప్రాంతములోని తుని తాలూకా చిక్కుళ్ళ అగ్రహారములో వున్నట్లు అక్కడ లభించిన ఒక తామర శాసనములో వున్నదని చంద్రశేఖర సరస్వతులవారు నుడివినారు. కర్ణాటకలోని తుమకూరు తోటప్ప ఆలయములోని 12 వ శతాబ్దపు శాసనములో కూడా ఘటికా స్తానమక్కడ వున్నట్లు వ్రాయబడినది. చెన్నరాయ పట్టాన,హాలెకెరె, మొదలగు చోట్ల గూడా ఇటువంటి శాసనములు గలవు.
వీనియందు విద్యార్థులు 300 మొదలు 3000 వరకు ఉండేవారని తెలియ వచ్చుచున్నది. ఇచట అన్ని వర్ణములవారు విద్య నభ్యసించుచుండే వారు. కానీ ఘటికలో చేరుతయందు వయోవ్యత్యాసముండేది. మొదటి మూడు వర్ణములకు ఉపనయనముండేది. అది కూడా ఒక్కొక్క వర్ణమునకు ఒక్కొక్క వయసులో. నాల్గవ వర్ణము వారికి వృత్తి కళలు,పురాణములు, నీతి బోధ,ధర్మశాస్త్రములు బోధించేవారు. నీతికి నిజాయతీకి పెద్ద పీట వేసే వారు. ఒక కక్ష్య లోని చురుకైన విద్యార్థులు గురువుల చేత ఎన్నుకొనబడి మిగత విద్యార్థులకు విద్య బోధింప జేసేవారు.
టి. బి. మేకాలేగారు ఫిబ్రవరి 2, 1935 న బ్రిటీషు పార్లమెంటులో మన దేశ విద్యా విధానాన్ని గూర్చి చెప్పిన మాట ఈ క్రింద యదా తధంగా పొందు పరచుట జరిగినది.
"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation."
మనలో మన భాష(సంస్కృతం) మీద న్యూనతా భావమును ఏర్పరచి ఆంగ్లమును 'Indian Education Act' ద్వారా'రాజా రామ్మోహన్ రాయ్' వంటి దళారుల సహాయముతో, మన నెత్తిపై రుద్ది నేడు మనకీ దుర్దశ కలిగించినారు.

ఇప్పటికింతే .

తత్సత్
Read More

Powered By Blogger | Template Created By Lord HTML